గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4/సంచిక 6/శ్రీశబ్దానుశాస నాంధ్రభాషామందిరము,ఓరంగల్లు
శ్రీ శబ్దానుశాస నాంధ్రభాషామందిరము,
ఓరంగల్లు (నైజాం.)
ఈ నందిగామ యొక్క ద్వితీయ వార్షికోత్సవము ది 31-10--10:20 న సాయంకాలము నాలుగు గంటలకు నిచ్చటి మిడిల్ స్కూలు హాలులో యుత ఆలీ జనాబుమౌల్వీ అబ్దుల్ అలీ ఖాన్ సాహెబు బి.ఏ. (డివిజనల్ యినస్పెక్టరు ఆఫ్ స్కూల్సు) గారి యాధిపత్యమును జయప్రదముగా జరిగెను, అంభమును దీశ్వర ప్రార్థనము సలుపఁబడెను. పిమ్మట సంయుక్త కార్య దర్శిగాఁవలకు స్వాగతోపన్యము జరుపబడెను. పిమ్మట కార్యక్రమమంతయు తెలుగు, ఉర్దు, ఆంగ్లేయ భాషంలో జరిగెను. సభను పట్టణమందలి, రాజ కీయ వర్గములకు జెఁదిన అధికారులు, వర్తకులు, ఇతర పౌరులు సుమారు 5 వందల మంది విచ్చేసిరి. ఇచ్చట పాలనాధికాలను శ్రీయుత రాయ్ జగన్మోహనలాల్ బి.ఏ.గారు, జిల్లా మున్సఫ్ గారు, డిస్ట్రిక్ట్ ఇ౯స్పేక్టరు ఆఫ్ స్కూల్సుగారును విచ్చేసి, ఈ యుద్యమము ఎడల అనుకూల సంపూర్ణ సహానుభూతి వ్యక్తీకరించిరి. చివరకు సభ జయప్రదంగా ముగిసెను. అగ్రాసనాధిపతి సభ్యులకు బహుమతులందజేసి తాంబూలాదులలొసంగిరి.
రిపోర్టు ముఖ్యవిషయములు
1. గ్రంథములు సంఖ్య - 1131
- వివిధపత్రికల సంఖ్య - 8
- పోషకులు - 4 గురు
- 1 వ తిరిగతి సభ్యులు -17
- 2 వ తరగతి సభ్యులు -19
- 3 వ తరగతి – 82
- 4 వ తరగతి - 25
2. నెల చందాల మొత్తము - 399-2-0
- ధర్మము - 100-0-0
- గతించిన సం.నిలువ - 342-4-0
- ________________
- ఆదాయము - 841-6-0
- వ్యయము - 332-13-9
- ________________
- నిలువ - 458-8-3
గ్రంధ గ్రాహకులు - 3028
ఇట్లు
హరి బాపయ్యశర్మ
కార్యదర్శి.
స్వాగతోపన్యాసము.
బ్రహ్మశ్రీ హరిబాపయ్యశర్మ గారివలన చదవబడెను.
పూర్వమొక కాలమున ప్రతాపరుద్ర మహారాజు యొక్క యశఃప్రకాశముచే బ్రకాసించినట్టియు, విద్యా వాధాధి కవిపుంగవుల కావాసమైనట్టియు, చారిత్ర విషయ బాహుళ్యముచే విలసిల్లికెట్టియు, నీవరంగల్లు పట్టణము త్రిలింగ దేశమునకు రాజధానియై నానావిధ సంపదలకును, వివిధ విద్యావ్యాసంగములకును ఆలవా లమై శోభిల్లె. అట్టిశోభాయమానమునకు గారణ భూత ములగు ప్రాచీన చిహ్నములం బ్రదర్శించుచున్న నిప్ప ట్టణంబుం కొన్ని సంవత్సరముల క్రిందట విద్యాప్రి ములకు కొందరు యువకులాంధ్ర సారస్వతాభి వృద్ధికై యప్పుడప్పుడు సభలచేయుచు చిట్టచివరికీ గ్రంథాలయోద్యము రూపమున తమ యుత్సాహమును ఫలవంతముగ జేసిరి.
ప్రస్తుతము భరత ఖండమున నెల్ల వ్యాపించుచున్న నవీనాదరములలో నీగ్రంథాలయో ద్యమము గూడ నొకటియై తనను వాంఛించు వా రల క్షీప్సితార్ధముల నొసఁగుచున్నది. తదుద్యమము ఘనత వహించిన మననిజాం రాష్ట్రము నందే ప్రభ మమున శ్రీకృష్ణదేవరా యాంధ్ర భాషా నిలయరూ పకమున దక్షిణ హైదరాబాదు నగరమువ నభి వ్యక్తమయ్యె. ఆదినములలో నహంకార విరహతు లును, సత్వగుణ సంపన్నులును, విద్యార్థి జన రక్షకు లును, పరోపకారులునగు కీర్తిశేషులైన రావి చెట్టు రంగారావు మన్సబు దారు గారి సంతత పరిశ్ర మువలన నా భాషా నిలయము స్థాపిఁపబడెను. ఇది 1901 సంవత్సర ప్రాంతమున జరిగిన విషయము. అ సంహారము రెండవ భాషా నిలయమని చెప్పనగు శ్రీ రాజ రాజ నరేంద్రాంధ్ర భాషానిలయము మనఈ ప ట్టణము యొక్క యొక భాగమగు హనుమద్గిరియందు కే.తిరుమలరావు బి.ఏ. బి.ఎఎల్.టి. (ఇప్పుడు ఇనస్పెక్టరు ఆఫ్ స్కూల్సు, ఔరంగాబాదు) మఱియు టి నారాయణాచార్యుల వారి సాంఘిక ప్రయత్నము వలన స్థాపింప బడెను. అటు పిమ్మట సంవత్సరములు గడచిన కొలది ఖమ్మం మెట్టు, ఎఱ్ఱుపాలెము, నేల కొండపల్లి, రేమణిచెర్ల, నల్లగొండ, సూర్యాపేట, షికింద్రాబాదు, భద్రాచలము, మున్నగు ప్రదేశము లలో గూడ మాతృ భాషా ప్రచారక సంఘములు నిలయములు, సాపింపబడినవి. ఇందుకు జంటగా మన బ్రిటీషు ఆంధ్ర సోదరులు కొలది సంవత్సరముల నుండి మాత్రమే ఈ యుద్యమమును వ్యాప్తిలోనికి దీ సికొని వచ్చి మన దేశమున గతించిన 19 సంవత్సరము నుండి జరుగబడు చున్న ప్రయత్నమున కంటె వేయి మడుఁగు అధికముగా సలిపి విచిత్రమైన అభివృద్ధికి దెచ్చిరి. వివిధ విజ్ఞాన సముపార్జమునకు ముఖ్యాధా రమని చెప్పు నొప్పు నీగ్రంథాల యోద్యము మీ యోరంగలు పట్టణమున రెండు సంవత్సరముల క్రింద నిచ్చట సుప్రసిద్ధ న్యాయవాదులును. విద్యా ప్రియులు నగు మ.రా.శ్రీ తూము రంగయ్య గారు, అకార పు భద్రయ్య గారును, కొండూరి బసవరాజు గారును, మాలల్వి ఆలూహుర్ర హమాజ్ సాహేబు గారును, మున్నగు పెద్ద మనుష్యులు, కీర్తి శేషులయిన శంకరా రాధ్యుల వారి యాజమాన్యమున నాంధ్ర భాషా శాసనులగు నన్నయ భట్టారక కవీంద్రుని జ్ఞాప కార్ధముగ, శ్రీశబ్దానుశాసనాంధ్ర భాషా మం దిర మొకటి స్థాపించిరి. దీని యొక్క ద్వితీయ వార్షికోత్సవమీ విద్యాశాలా భవనమందు విద్యా విజయ సంపన్నులగు ఆలీ జవాబుమా, అబ్దుల్ ఆజీజు ఖాన్ సాహేబు బి.ఎ. (సదరు మొహత మిమ్ తాలీమాత్) గారి యగ్రాసనాధిపత్యమున జరుగు భాగ్యమును, సభాసదులను తామెల్లరుకు నిర్మల సహానుభూతితో శ్రమయని విచారింపక నింత దూరము విచ్చేసి మాకందర కబ్బ జేసిన భాగ్యమును జూడ నిది యంతయు భావి పురోభివృద్ధికి శుభసూ కమని చెప్పవలెను. ఇట్టి శ్రమల కోర్పి మా చిన్ని విన్నపములు నాలకించిన మీశుద్ధ స్వభావము నెంత యు గీర్తించుచు, మీకు మామనః పూర్వక స్వాగతవం దనముల నర్పించుచున్నారము. ఈ మండలము యొక్క ప్రాచీన యశోవైభవమును దలంచు కొనిన యెడల ప్రస్తుతము మన ముద్యమించుచున్న, ఉద్య మము యొక్క పరిమార్ధము మన కంద ఱకును ద్యోతకము కాక మానదు. రాష్ట్రమా! ప్రాచీన ధార్మిక భావప్రకాశముచే విలసిలునట్టిది. లమా! తాపసోత్తమ శరణ్యంబై గోదావరి పవిత్ర సలిల పర్యటకంబునం బునీతింబయి శ్రీ సీతారాముఁని వన సంచారమున౯" బవిత్రంబై యెప్పిన దండకారణ్యాంతర్భా గములు.— పట్టణమా! బోలినగురు మూర్త్యాది విశద్ధ భక్తులగు భగవర్ణణాను సంధానులు నగు మహాకవుల జన్మంబుల కాకరంబు. ఇట్టి పవిత్ర గుణవిశేషంబులచే నొప్పియుండు నిప్పటణంబున మనమందర మొక్కచో గుమిగూడి తిరిగి యొకసారి ప్రాచీన కవితామాధురీ గరి మంబు నాధునిక భావప్రకాశంబునం గాంచుచున్నాము. గతించిన రెండు సంవత్సరముల నుండి నానావిధ గ్రంధ ములను దెప్పించి ఉడుత భక్తి చందమున భాషాసేవకు గడఁగుచున్నారు. భాషాభివృదియన్నను, దేశాభివృదియన్నను జ్ఞానాభివృద్ధియన్నరు నొకటే. ఏయభివృద్ధి కైనను, రాజాదరణముగాని, ప్రజాభిమానము గానీ, దీటుగా నుండినచో ఒకాశించును. అంధ్రుల మగు దఃకెండగకు, నక ప్రత్యేక భాష యున్న పుడు, కాలము యున్నపుడు, మార్కొలది సంభవించు నవీనభావములు, ఇట్టి ప్రత్యేక భాషాభివృద్ధికి మూలము నడవవలసి వచ్చున గదా. ఇం ఓ వలన మనము మన వాఙ్మయాభివృద్ధికి బ్రయత్నించు ట పమ ధర్మము. అప్పుడే మన జాతియొక్క నిజ స్వరూపము సునాయాసముగ వ్యక్తము కాగలదు. మన వాఙ్మయాభివృద్ధియంచే మన జాతియొక్క సత్ప్రవర్తనాది గుణంబు లభివ్యక్తమగు చుండును. జాతియొక్క స్వరూపము గోచరంబగు. ఉద్యమము యొక్క ఉద్దేశమెంత మంచిదైనను, సన్మార్గులును, ప్రజాహితైక జీవన తత్పరులునూ, నిష్కపటులును, నగు వారిచే నిర్వహింపబడని యెడల నాయుద్యమము కూలి పోవును, ఉద్యమ నిర్వహణము, స్వార్థ త్యాగము ప్రేమ పరికరంబులు. అట్టి స్వార్ధ త్యాగుల పట్టుదల వలన యుద్యమ మెంతయు బ్రకాశనమై, జాకీయ సౌధం బును నిర్మించును. కాబట్టి మన వాఙ్మయాభి వృద్ధి యందే మన సత్ప్రవర్తనాదులు వ్యక్తమగు చుండును.
ఇది యటులనుండ ప్రస్తుతము మనమందరము గ్రంథాలయములన్నియు భాషాభివృద్ధియనియు, నొక్కపెట్టున నూతనముగ సారస్వత విప్లవములకు సంసిద్ధంగుచున్నా మని యెన్నటికి దలంపజానరు. ప్రాచీన కాలమందు వాఙ్మయశాఖ లన్నియు, ఏతటాక పరిసరమునతో, ఏ వృక్షచ్ఛాయ యందో, ఏ వీధియరుగుల మీదనో, అనూహ్యముగా మన పూర్వుల వలన సాధింపబడెను. మఱియు విద్యలన్నియు జిహ్వాగ్రమననే నాట్యమాడు చుండెను. కాని, రానురానట్టి సంతతి క్షీణించుచు విద్యలు గ్రంధస్థమై పోయెను. కారణ విశేషములచే నట్టి గ్రంధములన్నియు, మనకు మన దేశమున లభింపక వానిని, ఆమెరికా, జర్మనీ, దేశములలోని గ్రంథాలయములయందు పరిశోధించి రప్పించుకొనవలసి వచ్చె. ఇంతకన్న జాలికనుగు విషయము మఱియొకటి లేది. మన వేదాంతము. మన ఎక్కము, మనశిల్పము, మన చరిత్ర. సముద్రము మీది నుండి మనకు దిగమతి కావలసిన యోగము పట్టినది. ఇట్టి యసందర్భములను గమనించియే భరతఖండమున నలుదెసల నిజమైన విద్వాంసులు స్వభా షాభివృద్ధిపై గ్రంథాలయముల స్థాపించుచు నీయుద్య మమును దేశమంతటా, సమాన వ్యాప్తిని గాంచుటకు, అఖిల భాగత గ్రంథాలయ సభలు కూడ హిందూదేశమం దలి ముఖ్యపట్టణములయందు, జరుగునటల నేర్పాటుగావించిరి. ఈ నూతన ప్రకాశమందు, రంగూన్, కాశి, బొంబాయి, శిలోను మున్నగు ప్రాంతములయందు గల ఆంధ్ర సోదరులు గూడ తమ సాంప్రదాయములను గాపాడుకోను నిమిత్తము, స్వభాషా ప్రచారక సంఘ ములను స్థాపించుకున్నారు. మన ఆంగ్లేయ విద్యాధికు లు సహితము, ఆంగ్లేయ భాషయందలి యుత్తమ, చారి త్రిక, ఆర్ధిక, శాస్త్రీయ, నవలాగ్రంధములను మాతృ భాష యందు గూడ, నమవదించి యెంతయో భాషాసేవ చేయుచున్నారు. ఈ దేశభాషల యధిపతికి క్రియా పూర్వకముగ: తమ ప్రజలను మంచి స్థితిలోనికి దీసికొని వచ్చటకు ప్రయత్నించు దయాసింధువగు ఘనత వహిం చిన మన నిజాం రాష్ట్రాధీశుడుగు, తరువాత బరోడా మహారాజుగారును, నెంతయో వంద్యులు. మన నిజాం దేశమందు సర్వకలాశాల విద్యలయందు బాలురు శీఘ్ర ముగ నుత్తీర్ణులగుటకును, జ్ఞానము సత్వరముగ లభించుట కును, దేశభాషా విశ్వవిద్యాలయమును మిచ్చటి ప్రజలకు, బ్రసాదింపబడిన సంగతి యెల్లరకును దెల్లంబె. సంపూ ర్ణ విశ్వవిద్యాలయమునకు దేశభాషలలో గ్రంధములు సిద్ధ ముచేయుటకు వేల రూప్యయులను వెచ్చించి భాషాంతరీకరణ సంఘమును స్థాపించిరి. దేశాభివృద్ధికి రాజాదరణము క్రియాపూర్వకముగ మన దేశమున 'మన రాజుగారి యునుగ్రహమువలన లభించట యెంతయు, భావిఅభి వృద్దికి మూలకారణమై యొప్పియున్నది. కాబట్టి దేశములో ప్రజల వలన గూడ విరివిగా గ్రంథాలయములు స్థాపింపబడవలెను. అన్యోన్న జాతీయ పరిజ్ఞానమును వడయుట కనుకూలముగ నుండు గ్రంధములను గూడ సేకరింపవలయును. గ్రంథాలయముల యందలి అన్ని లక్షణములను గుఱించియు చారిత్రిక కవితా విషయముల గుఱించియు విమర్శనా పూర్వకమైన చర్చలు సలుపబడవలెను. విమర్శన లేక ఏ వ్యాసంగము రుచికరముగా ఉండదు. మన దేశమున గొన్ని సంవత్సరముల నుండి సాహిత్య క్షేత్రమున విమర్శనా బీజములు, విత్తందుటలేదు: ఈ విషయమున మిక్కిలి శ్రద్ధగా పాటుబడినది కీర్తిశే షులైన, పూండ్ల రామకృష్ణయ్య గారును, కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రులవారు నైయుండిరి. ఆట్టి వ్యక్తులు తిరిగి దేశమునుర్భవించకయో, లేక, ఉండి ఉపేక్షించు టయో, ఏకారణమువలననో విమర్శనము లాంధ్రమున నాగిపోయినవి.ఇప్పుడు నిర్భయముగా బ్రచురింపబడు నాట కములు, నవలలు, మఱియు ఆనేక చిల్లర గ్రంధములు రచ్చ కువచ్చి ఆంధ్ర సాహిత్యము యొక్క విశుద్ద స్వరూపమును మఱుగుపఱచు చున్నవి. దీనికి దోడు మన యాంధ్రము నందలి కొందరు పత్రికాధిపతులు కూడా గ్రంథకర్తలు గ్రంథములు బంపుకొందురు. వానిని యుదాసీనముగ జూచుచున్నారు. కాని లాభకరమైన విమర్శనము సేయ కున్నారు. ఆంధ్రభాషాభివృద్ధికై నూతన మార్గములను జూపిన కీర్తిశేషులైన రావు బహద్దర్ శ్రీవీరేశలింగంగారి శతాధిక గ్రంథములు, వేంకట్రాయశాస్త్రుల వారి ఆంధ్రీకృత సంస్కృత కావ్య నాటకములు, విజ్ఞాన చంద్రికా ది వివిధమండల యాధి భౌతిక శాస్త్రీయ, భాషాంతరీక రణులు, మున్నగునవి యన్నియు, నాంధ్ర భాషావనికి, యమూల్యాభవణములని వేరు చెప్పనక్కర లేదు. భాషాభివృధికి వివిధ మార్గములని చెప్పనొప్పు గ్రంథాలయకులు, వార్తాపత్రికలు, మున్నగునవి, దేశ మునందలి విద్యాధికులగు విద్వాంసులు యాదరణమునకు నిరీక్షించుచున్నవి. పెక్కు ఉద్యమములు ధనాదా రములులేక, యనామక మగుచున్నవి. ప్రతి గ్రంథాలయమునకు గొంత శాశ్వత మూలధన ముండినయెడల, చిరకాలము సాగును. కాబట్టి ఉదార పురుషులగు భాగ్యవంతులకు ముఖ్యముగా తమ ద్రవ్యమును నిట్టి కా ర్యములందు వియోగించుట ద్వారా పవిత్రతను సమ కూర్చిన యెడల దేశముయొక్క భాగ్యోదయ మిప్పుడేయగును. మన సంసారజీవితమునకు, త్యాగ మెంతయు ముఖ్యాలంకారము. తటాకోదర జలంబులకు బర్దీవా హం వలె సమార్జిత విత్తంబునకు, త్యాగమే రక్షణ నుని పెద్దలు సెప్పుగురు. ప్రస్తుత కాలమంది కార్మి రోద్యమములు దేశమునందలి యుదాక ప్రురుషులవలన నెరవేరవలెను. మన రాష్ట్రమునందు స్థాపింపబడిన నిలయములలో నేవో రెండు మూడు తప్ప తక్కిన వన్ని యు దినగండము వలె నున్నవి. ప్రజాభిమానముగాని రాజాదరణముగాని యున్న యవి బాగుపడగలవని మాయాశయము.
చూడుడు! చెన్నరాజ్యమును సంబంధించి తెలుగు వ్యవహరింపంబడు 11 జిల్లాలయందు గల మన యాంధ్ర సోదరులెళ్లి తీవ్రోత్సాహముతో గ్రంథాలయోద్యము మును జయప్రదముగా సాగించినదియు, విజయవాడ పట్ట ణమున శుకపక్ష కౌమదింబోలి వర్ధిల్లు శ్రీరామమో హన పుస్తక భాండాగారమును మ.రా.శ్రీ. అయ్యంకి వెంకటరమణయ్య గారి స్వార్థ పరిత్యాగ శూరత్వమును దిలకించితిమేని మన మేమిసేయువలయునో బోధ కాగలదు.
- సోదరులారా!
ఈ ద్వితీయ వార్షికోత్సవ సందర్భమున తమకెండఱ కు శ్రమయిచ్చి, తమ యమూల్యమైన కాలమున కొత్తి డి గలుగ జేసినందులకు సోదరవాత్సల్యముతో మమ్ములను క్షమింపగలరని విశ్వసించుచున్నారము. మనదేశమునం దిట్ఠి గ్రంథాలయోద్యమములు. విద్వాంసులయు, ధనాధి కులయు, అనుగ్రహాతిశయముచే, దినదినాభివృద్ధిగ హేతుభూతులగు ప్రజ లకును, అందు ముఖ్యముగా భావి ఙాత్యాభివృద్ధికి తుభూతులగు బాల, బాలికలకు నత్యంత ఫలదాయకముగా పరిణమించుటకును, పరమేశ్వరుని బ్రార్ధించుచు నింంతటితో విరమించుచున్నాము.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse