గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4/సంచిక 6/గ్రంథాలయములు బర్మాదేశము.
గ్రంథాలయములు, బర్మాదేశము.
జన సామాన్యముందు విద్యాభివృద్ధి చేయుటకు గ్రం థాలయములు ముఖ్య సాధనములు. ప్రస్తుతము మనమా తృదేశ మీయుద్యమమున భరతఖండమండలి యన్ని దేశ ములో రెండవస్థావసుగు వహించియున్నది. ఆయు ద్యమ మీబర్మా దేశమునం దున్నట్లు కాన్పించుట లేదు. అందుచే లేదనరాదు. అయితే యీ దేశముయొక్క రాజధాని పట్టణమగు రంగునుపురమునందు మాత్రము గ్రంథాలయములు గలవు. అందు బర్నార్టు ధర్మ గ్రంథాలయము ముఖ్యమైనది. ఇది రంగూను కళా శాల చెంతనున్నది. బర్మాదేశము వైశాల్యమున పెద్ద దయినను జనసంఖ్యయందు మిగుల లోపించి యున్నది. మరియు నిది భరతఖండమున రమారమి నాల్గవ భాగమం త వైశాల్యము గలిగియున్నది. బర్మాదేశమున రంగూను మాత్రము యితర దేశములకన్న పరిశ్రామిక విషయముల యందు యభివృద్ధి యగుచుండు నప్పుడు రంగూరులో కమీషనరు యుద్యోగ పదవినియుండిన కీర్తి శేషులుగు యీ. బర్నార్డు యను దొర గారిచేత నెలకొల్పబడి క్రమే ణ దొరతనమువారి పాలాయెను. అంతట కొన్ని సం వత్సరములకు దొరతనమువారు కళాశాల వద్ద నొకవిశాల భవనము నిర్మించి దానియందు యనేక వివిధ గ్రంధ రాజములను పోగుచేసి యీ దేశముననుండు విద్యార్ధుల కొఱకునూ, యువకుల నిమిత్తము, కాపాడుచున్నారు. ఈగ్రంథ భాండాగారమునఁడు పలువిధములగు దేశచారి త్రి గ్రంథములు, వైద్య, శిల్ప, పరిశ్రామిక గ్రంథ రాజ ములును గోవు మరియు యనేక యముద్రిత గ్రంథములకు వ్రాతప్రతులను బర్మా రాజ్యాంగము వారు వ్రాయించి యీ గ్రంథాలయములో నుంచి యున్నారు. బర్మా భాషకు సంబంధించిన తాళపత్ర గ్రంధ రాజములు లెక్కకు మిక్కుటముగా యున్నవి. ముఖ్య వార్తాపత్రి కలు విద్యాలయమునకు సంబంధించిన మాసపత్రికలు ప్రభుత్వమువారిచే ప్రచురించబడు గెజట్లు మున్నగు పత్రి కలు గ్రంథాలయమునకు అనుబంధముగా నున్న పఠనమం దిరమున కాననగును. ఈ భాండాగారము జనసామాన్యము నకు ఉపయోగకరమగు విధముగ నున్నది. పదునారు వత్సరములకు మించిన ప్రతిజాతిలోనివారును యీ గ్రంథ నిలయమునకు విచ్చేసి, వారికి వలసిన గ్రంధములను చదువ వచ్చును. మరియు గ్రంధములను ఎరువుగా యిండ్లకు తీసుకొని పోయిగూడ చదువవచ్చును. అట్టివారు వారు యీపురమున నొక భాగమందు నివసించు వారలుగా నుండవలెను. ఈ గ్రంథాలయపు కార్యనిర్వహణమును జరుపుటకు నారి తేరిన వారు బర్మా ఎడ్యుకేషనల్ సిండి కేటుగారు ముఖ్యవిచారణకర్తలుగాయున్నారు. ఈ నిల యము ఉదయము ఏడుగ౦టలు మొదలు సాయంకాల ము ఆరుగంటలవారకు అనుదినము తెరచియుండును. మాసములో కడపటి సోమవారు మాత్రము సెలవుదిన ము, దేశమున యనేక స్థలముల నుండి బర్మాజాతి నారు గ్రంధపరిశోథనార్ధమై యెల్లపుడు ఇక్కడికి వచ్చు చుందురు. మరియు నీగ్రంథాలయము తరుఫున అప్పుడప్పుడు సభలు జరుగుచుదురు. ఇందు పలువురు పలు విషయముల ప్రసంగములు జడపుచుందురు.
నా నా దేశీయుల మత సాంప్రదాయముల కొఱకు సాపింపబడిన గ్రంథ భాండాగారములు కొన్ని కలవు. మన మాతృ దేశీయుల కొఱకు నెలకొల్పబడిన సంఘములు రెండు మూడు గలవు. అందు ము ఖ్యమైనవి ఆంధ్ర మహాజన సభ యనియు ఆంధ్రమహాజన సంఘమని రెండు సభలు గలవు. వీటితరపున గ్రంథా లయములు గలవు. వాటిలో లోక సమాచారములను యరయట కొఱుకై దేశీయపత్రికలను, తెప్పించి పఠనా లయమునుంచి యున్నారు. ఈ సంఘముల నొక్కోక్క టిలోను సుమారు ౫౦౦ ల గ్రంధములకు తక్కువ లేక యాంధ్రములోను, యాంగ్లములందును యున్నవి. గ్రంథరాజము లెల్లను బీరువలలో సుందరముగా నమర్చ బడి యున్నవి. కావలసినమంది సభ్యులు కూడ నుండున టుల కనబడుచున్నారు, ఈ గ్రంథాలయములు యాం ధ్రులెల్లకు యుచితమైనను నెక్కువమంది పాఠకులు కనబడుట లేదు. మరియు నీ సంఘములవారిచే సాపింప బడు పాఠశాలలు తృప్తికరముగా పనిచేయుచున్నవి.
ఇక బర్మావారి గ్రంథాలయములను గూర్చి విచారిం తము. ఈదేశములో వీరి గ్రంథాలయములు వీరి పొగో డాయను దేవాలయములలోను ధనికుల కుటీరములలోను చూడవచ్చును, మనదేశీయులవలెనే యీ దేశమువారు వారి మాతిృభాషాభివృద్ధికొఱకు యిప్పుడిప్పుడు విద్యా వంతులెల్లకును భాండాగారముల నెలకొల్పి వాటికై తగినంత శ్రద్ధతో పాటు పడుచున్నారు. ఇప్పుడిప్పుడు వారి బౌద్ధ దేవాలయములలోన పఠనాలయమో, గ్రంథా లయమో చూడవచ్చును. మరియు - యిప్పుడిప్పుడు నూతనముగా వెలువడు గ్రంథములను, పత్రికలను తె ప్పించుచున్నారు. ఇదిగాక యీ దేశపు మహనీయుల యొక్కయు, యీ దేశములలోనుండు గొప్ప పుణ్యస్తల ముల యొక్కయు చిత్రపటములను సేకరించి గ్రంథాల యసు నలంకరించి యున్నారు. యిప్పు డిప్పుడు సుప్ర సిద్ధులకు రప్పించి యుపయోగకరములగు ఉపన్యాస ములిప్పించుచున్నారు. బర్మాదేశీయులలో స్త్రీలు ఎక్కువ విద్యావంతులుగాయున్నారు.మరియు వీరు దయార్ద్రస్వభావులుగను, ధనవంతురాండ్రుగనుండు నటుల కనబడుచున్నారు. వీరిలో యనేకులు చిత్రకళల యందుకు చేతిపనులలోను నారి తేరిన వారుగను యు న్నారు. యిక పురుషులెల్లరుకు వీరివలననే దేశాభివృ ద్ధికొఱకు, భాషాభివృద్ధికొఱకు పాటుపడిన కొలదికా లములో నే యౌన్నత్య దశకు రాగలరని నొక్కి చెప్ప వచ్చును.
మామిడి సుబ్బరామయ్య,
కార్యదర్శి,
ఆంధ్రగౌతము గ్రంథాలయము, రంగూను.
—|◇|—
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse