Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4/సంచిక 6/ఐదవ కృష్ణామండల గ్రంథాలయ సభ

వికీసోర్స్ నుండి

ఐదవ కృష్ణా మండల గ్రంథాలయ సభ.

పెదకళ్లేపల్లె (28-5-20)
ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీయుత కావూరి కోదండ రామయ్య గారి స్వాగతోపన్యాసము:౼

కృష్ణామండలస్థలమగు నీ పదెకళ్లేపల్లె గ్రామము కదళపుర మగు నామాంతరము గలిగి కృష్ణానది తీర మ౦దున్న ఉభయ రామేశ్వర ఉభయముక్తేశ్వర ఉభయ నాగేశ్వరాది పుణ్యక్షేత్రములలో నాగేశ్వర క్షేత్రమై ఉత్తరాభి ముఖముగ ప్రవహించిన కృష్ణ వలన దక్షిణ కాశీయని ప్రసిద్ధ గాంచి ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి వేనవేలుగ తీర్థయాత్రికుల వలన సేవింప బడునదై యుఁడుటను ౼ యిట్టి గ్రామమున ఈ సభాసమావేశము కాగలుగుట గొప్ప విశేషమనియే చెప్పనగును. ఐనను మారుమూలనున్న యీ గ్రామమునకు శ్రమయు తలచక తామందరును విచ్చేసినందుఁకు సన్మాన సంఘ పక్షమున నేను తమకందరికి మనస్సు పూర్వకముగ స్వాగతము నొసగుచున్నాను.

అజ్ఞానాఁధ కారమున మునిగి యున్న జనసామాన్యమును మనదేశమందుండిన మతాంతరులు కొందఱు స్వమతభూషణము పరిమత దూషణము చేసి మతదూరులుగా చేయుచున్నారు. మన దేశమున మన మతమున కీది యొక గొప్ప యరిష్ఠము. అందువలన సంఘమునకు గొప్ప బలహీనత. ఇట్టి లోపములను తొలగెంచుటలో గ్రంథాలయోధ్యమమొకగొప్ప సాధనమని నానమ్మకము గనుక దీనిని క్రమముగా నుపయోగించు మార్గమును అనుభవశాలుకైన మీరుకొని పెట్టుదురు గాక యని యెంచెద. గ్రంథాలయములను నవి రాజపోవణమును ధనవంతుల ఆదరణమును, ముఖ్యముగా గలిగి సర్వజనులకు అన్నివిధముల అందుబాటులో నుండవలెను. ఈ యుధ్యమము యొక్క ముఖ్యోద్దేశము జనసామాన్యమునకు జ్ఞానమోపదేశము చేయుటయే, ఇదిమన హిందూదేశమునకు క్రొత్తగాదు. లోకములో ప్రతిమానవుడు జ్ఞానవంతుడై యు౦డుట ముఖ్యముగదా అనెడు తలంపుతో శక్త్యనుసారము 'మా శ్రీరామ ధర్మ గ్రంధాలయమున' కను బంధముగ నొక రాత్రి పాఠశాల స్తాపింపబడినది. పగిటియందు పని పాటల వలన జీవించు వారికి రాత్రి ఉచితముగ విద్యనేర్పుట యుత్తామనియు అందువలన ప్రజాసామాన్యము కొంతవరకైనా విద్యావంతులై జ్ఞానాభివృద్ధి కలిగియుందరనియు తలచితిమి. ఎంత ఖర్చు భరించి ఎన్ని సౌకర్యములు గలుగ జేసినను నిర్భ౦ధము లేనెందువలన పిల్లలను వెదకి వారిని బ్రతిమాలి బడికి తెచ్చి చదువు చెప్పవలసి వచ్చుచున్నది. అందువలన పాఠశాలలకగు ఖర్చులు భరించుట విద్య నేర్పుట అనురెండు పనులకంటె పిల్లలను బ్రతిమాలి బడికి తీసుకొని వచ్చుట మిక్కలి కష్టమని పించుచున్నది. కీర్తిశేషుడగు ఘోఖ్లే మహాశయుడు ప్రయత్నించిన నిర్బంధ విద్యావిధానము అమలులోనికి వచ్చువరకు మన గతి యింతేయని రచింపవచ్చును. సర్పురుషులు నాటిన సద్బీజములు అంకురించి వృక్షసులై ఫలింపక మానవు గావున మనసు నిరుత్సాహ మండవలసిన పని లేదు.

ప్రాథమిక విద్య నేర్చుకొని జాలమును సంపాదించుకొనుటకు బోధకులును గ్రంధములును ఆసక్తి గల శిష్యులకు ఉండవలెను. బోధక గురువు లుండెనను బహు గ్రంధపఠనమున గాని జ్ఞాన విశేషము గలుగదు. గ్రంధములు ద్రవ్య సాధ్యములు గావున మన గ్రంథాలయములకు ధనవంతుల సహాయము మెండుగకావలెను. అప్పడుగాని మన గ్రంథాలయములు సఫలీకృతములు కానేరవు. ఇవన్నియు ప్రతి సాలున ఇట్టి సభలలో చర్చించుట కన్న కార్యశూరత వహించి కొన్నిటినైన కొంతవరకు సాఫల్యము చేయగలిన యెడల ధన్యులమని తలంవచ్చను. ఇవన్నియు మనవలన కొనసాగునా యని సంశయింపనక్కరలేదు. మనము చేయగలిగి నంతవరకు మన సంతతి వారు పూర్తి చేయుదురు. కావున మనము నిరుత్సాహముతో నూరకుండ నక్కరలేదు. ఆది పురుష లక్షణమును కాదు. మాతృబాష మూలమున విద్య నభ్యసించినచో బుద్ది స్వాత౦త్య్రము గలిగి నూతన విషయముల కనిపెట్ట నవకాశము గలుగునియు కఠినముగా అన్యభాషాభ్యాసము న౦దు గ్రహణ శక్తి గల లేత కాలము వృథాగా గడచుట చేత నైసర్గిక తేజస్సు గోల్పోవుచుండుట తటస్థమనియు పెద్దలభిప్రాయము. కనుక మధ్యమ విద్యయు ఉత్తమ విద్యయు గూడ దేశభాషయందు నేర్పుట మిక్కలి అనుకూలము.

విద్యాభాసము ఉద్యోగము కొరకే యను భావము మారాలి. ఇప్పటి విద్యలనగా జాతీయవిద్య, పారిశ్రామిక విద్యలు నైయున్నవి. ఇందువలన చదువు మాత్రమే గాక స్వతంత్ర జీవనము కలుగ జేయు నేదేని వృత్తియను, అబ్బును గనుక జీవనోపాధికి వెదకులాడు కోన నక్కర యు౦డదు.

ప్రస్తుతము కేంద్ర గ్రంధాలయముల యు౦దైన బాల శాఖలు క్రీడా శాఖలు ప్రదర్శన శాఖలు మొదలగునవి కూడ వ్యాపింప జేయవీలగును. ద్రవ్యము ననుసరించియు, వీలును బట్టియు సాధ్యమయినన్ని శాఖలను ప్రతి సామాన్య గ్రంధాలయమును ఏర్పరుచుట యుక్తము. ఆంధ్రగ్రంధముల వివరణ పట్టిక ప్రచురించ బడుటయును, గ్రంధాలయము నందే గ్రంధము యున్నది, తెలియుట అగత్యములు.

గ్రామముద్రలుంచుట, గ్రామమందలి చిత్తరువులు శాసనాదులు చేర్చుట, ప్రాచీనగ్రంధములు సేకరించుట గ్రంధాలయముల విదూత్యధర్మము. ఇంకను పురాణశ్రవణులు, హరికథలు మొదలగు వాటిమూలమున గ్రామప్రజ నొకచోట సమావేశపరచి వారికి తగు నుద్బోధనమొనర్చుట, జనసామాన్య మందలి విద్యావ్యాప్తికి, జ్ఞానాభివృద్దకి పాటుబడుట, సంఘలాభములను గుర్తెరుగచేసి, స్వయంకృషి ప్రయత్నించి సాగించుఁటుఁవేయుట మొదలగు ననేక విషయములు గ్రంధాలయ ధర్మములైయున్నవి. నేపుదుదహరి౦పననవి యింకను చాలవిషయములుండవచ్చును. ఈ విషయసులలో మన గ్రంథాలయము లెంతవరకు పని చేయుచున్నదియు చర్చించి లోపములు సంస్కరించు కొనుటకు ఇట్టి సమావేశములు మిగల ననుకూలములు, కావున మనకందరికి మార్గదర్శకులును గ్రంథాలయోద్యమ వ్యాప్తికి నిరంతరము కృషి చేయువారునునగు మన సూరి వెంకట నరసింహ శాస్త్రిగారును యింకను విశేషానుభవజ్ఞలగు యితర సభ్యులను గ్రంథాలయ ప్రతినిధులు విపులముగ నన్నివిషయములకు సమగ్రహముగా చర్చి౦చి నిర్ధారణచేయుదురుగాక యని ప్రార్దించు చున్నారు.

కృష్ణామండలమునఁడలి మొత్తపు గ్రంధాలయముల సంఖ్య 156లో మా దివి తాలూకాలోనున్న గ్రంథాలయములు:- సుమారు 1000 గ్రంధములగల భట్ల పెనమ్మరు గ్రామమందలి గ్రంధాలయమొకటి. సుమారు 500 గ్రంధములు గల శ్రీ రామధర్మ గ్రంథాలయసు,300 గ్రంధములు గల శ్రీ వల్లీశ్వర గ్రంథాలయము అను మోపిదేవి గ్రంధాలయము. 500 గ్రంధములు గల ఘంటసాలయందలి గ్రంథాలయమొకటి, మాత్రము కొంచెము ముంచి స్థితిలో నున్నవి ఒక్కొక్కటి 100 గ్రంధములకు పైగా నున్నవి నాగయతిప్ప యఁదోకటి, పెదకళ్లేపల్లి యందోకటి స్థాపింపబడినవి. వీనికి ఉత్సాహవంతులు కార్యశూరులు నగుకార్యదర్శులు లభించిరి కానీ వారికీ తగు తోడ్పాటు లేమియె ద్రవ్యలోపము చేతనో మరి ఏ కారణముననో గానీ వృద్ధిలో లేవు. ఆ రెండు గ్రామములలోను ధనవంతులు ఉదారవంతులు లేకపోలేదు. కాని యీ యుద్యమమునఁదు వారుపేక్షా భావము బూనియుండరు. వారి యుపేక్షను పెద్దల సలహావల్లనైన మల్చుకొల్చుకొందురేమో?

ఈ తాలూకాయందు యూనియనులుగానున్న అవనిగడ్డ, చల్లపల్లి కాజ మొదలగు పెద్ద గ్రామములందు సహితము గ్రంథాలయములు లేనేలేవు. 100 కి మించిన గ్రామములు గల మా తాలూకాలలో ఒక చేతి వేర్ల మీద లెక్కింపదగిన 5 గ్రామములలో గ్రంథాలయములుండి అందుకున్న నామామా త్రావశిష్ఠ కార్యక్రమాలున్నప్పటికీ గ్రంథాలయోద్యమము వ్యాప్తి కనపడక మానదు. పల్లెటూర్లు యందు గ్రంధాలయములు స్థాపించుట కన్న నిర్వహించుట కష్టము. చందాల నేర్పరిచిన పాఠకులు రారు.పాఠకులు రానిది పని సున్న. చదువరులలో ఇండ్లకు గ్రంధములు గైకొను వారివద్దనైనా చందాను వసూలు చేయుట లేని యెడల నూతన గ్రంధ సంపాదనమటుండ చదువరుల చేతులలో నలిగిన పుస్తకముల ఆట్టలు బాగు చెేయించుట కగు ఖర్చులైన పూడవలెను గదా? ఇందరు చదువరులగు సాంఘికులందరు చందాల నిచ్చుట కలవాటు పడవలెను. ఆట్టి చందాలను చేయు ఇతర ఖర్చులతో పోల్చి చూడ ఎంతకును నిలవవు.

నూతన గ్రంథ సంపాదనము, ప్రత్యేక భవన నిర్మాణము,మొదలగు వాటికి ధనవంతుల సహాయము గాని, రాజపోషణము గాని స్థిరవసతులు గాని ఏర్పరచిననే తప్ప నిర్విఘ్నముగా కొనసాగనేరవు. ఈ సంగతులన్నియు అందరికి తెలిసినవైయున్నను అల్పజ్ఞుడనగు నేను ఇంతకన్నా చెప్పుటకు తోచక ఇవే తమకు శ్రుతపరచుకొనుచున్నాను.

గ్రంధాలయోగ్యమము నందు చాలా వెనుక పడి యున్న మాతాలూకా వాసునియందమిత వాత్సల్యముంచి తామందరు తగు ప్రబోధము గావించెదరనియు వివిధ స్థలములనుండి దూరమని తలంచక యిందు కొరకై ఇటకేతెంచిన ప్రతి విఫల యెడల సన్మాన సంఘము వారి వలన కలిగిన లోపములను మన్నింపుడనియు సంఘము పక్షమున మిమ్మ వేడి కొనుచు, సభ జయ ప్రదము జరుగునటుల భగవంతుడను గ్రహించు గాక యని ప్రార్ధింపుచు నింతట విరమించుచున్నాను.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse