గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/బాలభటుని యాటలు
బాలభటుని యాటలు
లవారందఱు గమ్యస్థానమునకు రెండువందల గజముల దూరమున నిలువఁబడి తమ యెదరుపార్టీలోని వేగుల వాఁడు గమ్యస్థానము చేరకుండ పట్టుకోనుటకు ప్రయత్నించవలెను. యేపార్టీలోని వేగులవాఁడు తన యెదురిపార్టీ వారిచేత పట్టుబడకుండ గమ్యస్థానము చేరునో ఆపార్టీవారు గెలిచినట్టు యె౦చవలెను. వేగుల వానిని పటుకొనుట అనగా చేతితో పట్టుకోవలెను. కొట్టుకొనగూడదు. ఈ ఆటవలన బుద్ధి వికసించును. పరుగెత్తుటవలన దేహమునకు ఊపిరితిత్తులకు బలముగలుగును.
౪ అంచెటపా
ఈ యాటలో భటులను రెండు పార్టీలుగా విభజించవలెను. రెండుపార్టీలకు యిద్దరునాయులనుగాని పెద్ద యజ్జీలనుగాని నియమించవలెను. భౌలభటోపాథ్యాయుఁడు యిద్దరు నాయకులకు చెరియొక యుత్తరమును వ్రాసియిచ్చి ఆటయాడుస్తలమునకు రెండులేకమూడు మైళ్ళ దూరములోనున్న యొక మనిషి కిచ్చి జవాబు తీసుకొని రమ్మననుని చెప్పవలెను. ఏపార్టివారుముందు జవాబు తీసుకొని రాగలుగుగులో యా పార్టీవారు గెలిచినటుల యెంచవలెను. ఆటయాడువిధము:- నాయకుఁడు తనకుపాథ్యాయుఁడుత్తరమిచ్చిన తక్షణము తన మనుష్యులను తాను బయలుదేరు స్థలమునకున్ను చేరవలసిన గమ్యస్థానమునకున్ను మధ్యయున్న ముఖ్యమైన స్థలములలోనుంచి యంచెలమీఁద యత్తరమును గమ్యస్థానము చేర్చి తిరిగి జవాబు తీసికొని రావలెను. ఏ పార్టీవారు చురుకుగా భలభటుని పరుగు పరుగిడగలరో ఆపార్టీ వారు గెలుపొందెదరు.
౫ ద్రోహియొక్క యుత్తరము
ఈ యాట ముఖ్యముగా పెద్దయుడనిలోగాని చిట్టడివిలోగాని లేక మామూలు ప్రదేశములోగాని యాడవచ్చును. ఆటయాడువారినందఱిని రెండు పార్టీలుగా విభజించి, వేరువేరు నామధేయములను పెట్టవలెను. బాలభటోపాథ్యాయుఁడు రెండుపార్టీలలోనున్న కుర్రవాళ్ళలో తన యిష్టమువచ్చిన వానిని ద్రోహిగానియమించీ, వానిచేతికొక యుత్తరమునిచ్చును. ఉత్తరమిచ్చిన సంగతి యుపాథ్యాయునికి ద్రోహిగా నియమింపఁబడిన కుర్రవానికిని తప్ప తదితరులకుఁ దెలియుగూడదు. ద్రోహిగా నియమింపబడిన కుర్రవాఁడు యేపార్టీలో జేరినదియు ఉపాధ్యాయునకు తప్ప తదితరులకు తెలియదుగనుక రెండుపార్టీలలో నున్నవారందరూ జాగ్రత్త గాచూచుచు ద్రోహియెవరైనది కనుఁగొనుటకు ప్రయత్నించవలెను. ఉపాథ్యాయుఁడు రెండుపార్టీలనూ వేర్వేరుమార్గములకు పంపించి పదిహేను నిముషములకాలము యివ్వవలెను. ఈలోపుగా రెండుపార్టీలవారును తమపార్టీవారిని జాగ్రత్తగా కనిపెట్టుచూ సాధ్యమైనంత దూరమువెళ్ళి పోవలెను. ఈలావెళ్ళు సమయములోనే, ద్రోహిగా నియమింపఁబడిన కుర్రవాడు కొంచెము తప్పించుకొని వెళ్ళి తన చేతికిచ్చిన యుత్తరము నెవ్వరికిఁ తెలియనివ్వకుండ నొకచోటదాఁచి, దాఁచినటులు బాలభటోపాధ్యాయున కొక గుర్తుద్వారా తెలియఁజేయవలెను. అలా తెలియజేసినతరువాత ఉపాధ్యాయుఁడొక ఈలను వేయవలెను. అప్పటినుంచి యాట ప్రారంభమగును. రెండుపార్టీలలో నున్నవారందఱికి తోకలుండవలెను. అనగా నొకచిన్న గుడ్డను వేలాడులాగున వెనుకవైపు దొఁపుకొనవలెను. త్రాడు మొదలగునవి పట్టికట్ట కూడదు. ఉత్తరముదాచిన ద్రోహి ఉత్తరముదాచిన స్థలము తనపార్టీవారికి గాని యెదఁరపార్టీ వారికిగాని చూచాయగా తెలిసేలాగున కొన్ని గురుతులను వేయవలెను. ఆట ప్రాగంభించిన తరువాత ద్రోహియెవరైన దిన్ని ఉత్తరము యెచ్చట దాచినదిన్నీ కనుగొనుటకు రెండుపార్టీలవారు ప్రయత్నించవలెను. రెండుపార్టీల వారొకచోట దారసిల్లినప్పుడుగాని విడివిడిగా తారసిల్లినప్పుడుగాని యొకరితోకల నొకరు లాగివేయుటకు ప్రయత్నించవలెను. యేభటుఁడైనను తనతోకను గోలుపోయినయెడల మాభటుఁడైపోయినటుల యెంచవలెను. ఆభటుఁడు ఆటలో పాలుగొనకూడదు. నియమితకాలములో నుత్తరము కనుగొనిన పార్టీ వానికి నాలుగు మార్కులున్నూ, యేపార్టీవారు యెన్నితోకల నవతల పార్టీవారివద్దనుంచి లాగుకొన్న - తోక కొక్కొక మార్కు చొప్పుననూ యివ్వవలెను. యేపార్టీవారు యెక్కువ మార్కులను సంపాదించితే వారు గెలుపొందినటుల యెంచవలేను.
౬ మొక్కను గుర్తించుట.
బాలభటుల సందఱి నొకచోటఁచేర్చి ఒకేరకము ఆకునుగాని మొక్కనుగాని దీసికొని రమ్మనమని చెప్పవలెను. ఇది సాధ్యమైనంతవరకు అందఱికి తెలిసినదై యుండవలెను. దానిని తీసికొని రమ్మనమని చెప్పిన తక్షణము బాలభటులందఱు నడచిగాని, మఱివేఱువిధముగా గాని వారియిష్టమువచ్చిన వైపునకు వెళ్ళి తీసుకొనిరావలెను. ఇందులో ముఖ్యముగా గమనించవలసినది చురుకుదనము, ముందు యేభటుఁడైతే ఆకును దీసికొని వచ్చునో యాభటుఁడు గెలుపొందినటుల యెంచవలెను.
౭ కర్రబంతి లేక కుండబంతి
ఈ యాట రెండుపార్టీలవారు యాడవచ్చును. ఈయా టకు కావలసిన వస్తువులు, ఒకకర్ర, ఒక తాడు బంతిగాని తోలుబంతి గానిచాలును. ఈయాటకు భటులు రెండుపార్టీలుగా చీలవలెను. రెండు రాళ్ళను సమానప్రదేశమందొక గజముదూరముగాఁబెట్టి యారాళ్ళవైన యొక వెదురు కర్రనుంచవలెను. ఈలా యేర్పరచిన తావునుంచి పదిహేను గజముల దూరములో రెండు పాటీ౯లవారును యెదురుబడిగా నిలువవలెను. ప్రతిపాటీ౯లవారును యెదురుబడిగా నిలువవలెను. ప్రతిపాటి౯లోనూ బంతి విసురుట కొకరిని, బంతిని పట్టుకొనుట కొకరిని నియమించ వలెను. బంతిని విసురువారు తాము నిలుచున్న స్థలమునుండియే విసరి వేయవలెను. ఆలా విసరునపుడు బంతి రాళ్ళమీదనుంచిన వెదురుకర్రకు తగిలి కర్ర క్రిందబడులాగున గురిఁజూచి విసరవలెను. పైఁజెప్పిన విధముగా కర్రను క్రింద పడగొట్టగలిగినయెడల తన యెదరి జట్టులో బంతిని విసుకుటకు నియమింపబడిన వాఁడు అయిపోవును. వానిస్థలము రెండవవాఁడు ఆక్రమించును. ఒక జట్టువాఁడు బంతిని విసరినప్పుడు రెండవ పాటీ౯యందు బంతిని పట్టుకొనుట కేర్పరుపఁబడిన భటుఁడు బంతి యొకసారి క్రిందబడి యెగిరినప్పుడు పట్టుకొనినచో - అతఁడు కర్రకు దగ్గిరకువచ్చి బంతితో కర్రను క్రిందపడఁగొట్టిన యెడల యెదర పాటీ౯లో బంతినిపట్టు కొనుటకు నియమింహాఁఒడినవాఁడు అయిపోవును. అలా కొట్టినప్పుడు రెండవపాటీ౯లోని వారా బంతిని ఒకమారు క్రిందకిబడి లేచినప్పుడు పట్టుకోగలిగిన యెడల యిదివఱకు అయిన వాఁడు బ్రదుకును. బంతి పైకి యెగిరినప్పుడు పాటీ౯లోనున్న వారందఱు పట్టుకొనవచ్చును. కాని వారు కర్రవద్దకు రాకూడదు. ఏ స్తలమునుండి బంతిని పట్టుకుందురో యాస్తలము నుండియే కర్రను పడగొట్టుటకు ప్రయత్నించవలెను. ఈలా ఆడగా ముందు యేపాటీ౯ వారందఱూ అయిపోవుదురో వారు ఓడిపోయినటుల ఎంచవలెను. ఈ యాటవల్ల గురి బాగుగా కుదురును.
౮ బంతిని ఊగుట
ఈ ఆటకుఁ బిల్లలను రెండుపాటీణలగా భాగించవలెను. ఆరడుగుల పొడవుగల బల్లమీద నొక "సెల్యు లాయిడు" బంతి గాని లేక ఊలు బంతిగాని మరియేయితరమైన తేలికఒంతిగాని బల్లమధ్య ఉంచవలెను. రెండు పాటీ౯లను బల్లకు చెరియొకవైపున నిలువఁబెట్టవలెను. మధ్యనున్న బంతిని నోటితో ఊది తమ యెదరవైపు నుంచి క్రిందపడగొట్టుటకు ప్రయత్నించవలెను. యేపాటీEవారు ఆలా చేయగలిగితే ఆపాటి౯వారు గెలిచినట్టు యెంచవలెను. బంతి పాటీ౯లు నిలుచుండినవైపు నుండిగాక వేరుప్రక్కనుంచి క్రిందపడినయెడల నాబంతిని తిరిగి బల్లమధ్యనుంచి యధాప్రకారము ఆట ప్రారంభించవలెను.
౯ జ్ఞాపకశక్తి
ఒక బల్ల మీద యిరువదియొక్క వస్తువులనుంచి పైన గుడ్డనుకప్పి వేయవలెను. తరువాత బాలభటులను బిలచి పైకప్పినగుడ్డను దీసివేసి యొకనిమిషము కాలము నా బల్లమీఁదనున్న వస్తువులను చూడనిచ్చి, తిరిగి బల్లమీద నుండు వస్తువులు కనుబడకుండ గుడ్డనుకప్పి వేయవలెను. కప్పి వేసిన రెండు నిమిషముల కాల మాగనిచ్చి ప్రతిభటుని బల్లమీద చూచినవస్తువులన్ని౯టిని వ్రాయునటుల చేయవలెను. ఏ భటుఁడు నియమిత కాలములో యెక్కువ వస్తువుల పేర్లను వ్రాయునో ఆభటుఁడు గెలిచినటుల యెంచవలెను. ప్రతి భటుఁడు పదునారు వస్తువుల పేర్లకు తక్కువలేకుండ వ్రాయవలెను. ఈ ఆటవలన జ్ఞాపకశక్తి వృద్ధియగును.
౧౦ బంతిని యందఁ జేయుట
ఈ ఆటకు కావలసిన వస్తువులు రెండురబ్బరుబంతులు గాని లేక రెండు ఉన్నిబంతులు గాని చాలును. ఆట నాఁడువారిని రెండుపాటీ౯లగా భాగించి ప్రతిపాటీ౯కి యొక నాయకుని యేర్పరచవలెను. ఒక పాటీ౯వారిని లైనుగా నొకరి వెనుక నొకరిని నిలువబెట్టవలెను. రెండవ పాటీ౯ వారిని వైవిధముగానే మొదటిపాటి౯వారి ప్రక్కన నిలువబెట్టవలెను. నాయకులు ముందు నిలుచుండవలెను. ప్రతినాయకునికి నొక బంతి యివ్వవలెను. ఉపాధ్యాయుఁడు “వెళ్ళు" అను ఉత్తరవును యిచ్చినతోడనే నాయకులు తమవద్దనున్న బంతులను కాళ్ళ స౦దునుంచి వెనుకనున్న తమ పాటీ౯వానికి నందఁజేయ వలెను. అదేవిధముగ బంతి పాటీ౯లోని చివరకుర్రవాని వద్దవఱకు వెళ్ళవలెను. చివరకుర్రవాడు తాను బంతిని యందుకున్న తరువాత పరుగున వెళ్ళి యాబంతిని తన నాయకునికి నందఁజేయవలెను. ఏపాటి౯వారు ముందు బంతిని నాయకునికి నందఁజేసెదరో ఆపాటి౯వారు గెలిచినట్టు లెంచవలెను.
౧౧ ఘ్రాణశక్తి
కాగితపు సంచులను కొన్నింటినిచేసి వాటిలో వివిధ నువాసనవస్తువులు పెట్టి, ఆసుంచుల నన్నింటిని ఒక వరుసలో పెట్టవలెను. జట్టులోనున్న ప్రతికుర్రవానిని పిలచి సంచులను వరుసగా వాసనచూడమని చెప్పవలెను. ప్రతిసంచిని వాసనచూచుటకు అయిదు శెకనులు కాలము మాత్రమివ్వవలెను, అన్ని సంచులను వాసనచూచిన T తరువాత నొక నిమిష కాలము నిచ్చి సంచీలలో ఉంచిన వాసనవస్తువుల పేర్లు వరుసతప్పకుండ చెప్పమన వలెను. ఏకుర్రవాఁడు వరుస తప్పకుండ పేర్లన్నియుఁ జెప్పునో ఆకుర్రవాఁడు గెలిచినట్టు ఎంచవలెను.
౧౨ తోడేళ్ల వేట
చిన్న గుట్టప్రక్కను గాని లేక అడవిలో గాని షుమారు 3 లేక ౪ మైళ్ల జాగాను ఆటనాఁడుభూమిగా యేర్పరచుకొనవలెను. ఆట ప్రారంభించక పూర్వము భూమియొక్క హద్దులు ఆటనాఁడు కుర్రవాండ్లకందతికి తెలిసి యుండవలెను. నలుగురు పిల్లవాండ్రకు తోడేళ్ళు అని పేరు పెట్టి వారిని ముందుబయలుదేరి వెళ్ళి వారి యిష్టమువచ్చిన జాగాను ఆనగా హద్దులమధ్య దాచుకొనమని చెప్పవలెను. ఈనాలుగురు కలసి వెళ్ళేవచ్చును, లేదా విడివిడిగా వెళ్ళవచ్చును. విడివిడిగా వెళ్ళుట మంచిది. వారొకచోటదాగి కుర్చొన కూడదు. ఒక చోటనుంచి యొకచోటికి తిరుగుచుండవలెను. ఈనలుగురు బయలుదేరిన యొకఘంటకు మిగతా పిల్లలను పంపించవలెను. వీరిసంఖ్య ౧౬ గురికి మించియుండకూడదు. (అనగా తొడేళ్ళ సంఖ్యకంటే వేట గాండ్ర సంఖ్య నాలుగు రెట్ల కంటె నెక్కువ యుండగూడదు. ఎన్ని తోడేళ్ళను యేర్పరచుకొన్న, దానికి నాలుగురెట్లు వేట గాండ్రుండ వలయును.) వీరిని వేట గాండ్రనిపిలువవలెను. వీరు కూడా కలసి వెళ్ళవచ్చును. లేదా విడివిడిగా వెళ్ళవచ్చును. ఇద్దఱిద్దరు వెళ్ళుట మంచిది. ఆటవిధమేమన వేటగాంగాండ్రు తోడేళ్ళను వెతికి పట్టుకొనవలెను. తోడేళ్ళకును, వేటగాండ్రకును తేడా కనుపించుటకు గాను తోడేళ్ళకు యెర్రగుడ్డయున్నూ, వేటగాండ్రకు పచ్చగుడ్డయున్నూ భుజములకు తగిలించుకొనవలెను. వేటగాండ్రు తోడేళ్ళను పట్టుకొనుట అనగా ముట్టుకొనిన చాలును.
౼ కావలి శంకరరావు
ఆంధ్రరాష్ట్రీయ సహాయ కమిషనరు