గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/నాల్గవ కృష్ణామండలగ్రంథాలయ సభ
నాల్గవ కృష్ణామండలగ్రంథాలయసభ
సభాధ్యక్షుగు బారిష్టర్ కందుల వీరరాఘవస్వామినాయుడుగారి ఉపన్యాసములోని కొన్ని భాగములు:- పూర్వకాలమునందున్నతస్థితిని వహించిన ప్రపంచమునందలి ప్రతిదేశమునందును గ్రంథరాశిమిక్కుటముగ జేర్పఁబడి విద్వాంసుల కెల్ల నుపయోగకరములుగ అస్సీరియాదేశ మున్నతస్థితియందున్న కాలములో నా దేశప్రభువులాకాలమునందలి యుద్గ్రంధములలో బలకలపై వ్రాయించి యొక గొప్పభాడాగారమును గూర్చియున్న విషయమును, అందలి గ్రంధము లిప్పటికివి నిలిచినుండి వేనోళుల ఘోషించుచుచున్నవి. ఆలెగ్జాండ్రియా మహాపట్టణమున లక్షలకొలది యుద్ధంథములతో నిండియుండిన గ్రంథాలయ మొకటి నిలసిల్లి యుండి విద్వత్కోటి కాహ్లాదజనకముగ జాలకాల ముండి, యొక వహమ్మదీయ ప్రభుని దురాగ్రహమున కాహుతియయ్యెను.
మనభగత వర్ష మునందు సయితము యూరోపుదేశము, గ్రీసుదేశము మున్నగు దేశములన్నియును గాఢాంధ కారమున మునిగియున్నప్పుడు జ్ఞానజ్యోతి భరతవర్షమున దేవీప్యమానముగఁ బ్రకాశింప సాగెను. ఆకాలపు మహారాజులు, చక్రవర్తులు, విద్వాంసుల ఉపయోగమునకై అసమానగ్రంధరానినిగూర్చి, విద్వత్ప్రపంచమున కమితోపకారముఁ గావించియున్నారు! వేదము వేదాంగములును, పురాణములుసు, శిల్ప వాస్తు, జ్యోతిశ్శాస్త్రములును వైద్యగ్రంథములును వెలువడినవి. ఆర్యుల మాతృభాషయగు సంస్కృత భాష యొక్క ఘనత యింతని వర్ణింప నేరికిని శక్యము గాదు!
"హిందూ సారస్వతములో, తగుభాగమునుపఠించుటకు నొకమానవుని జీవితము చాలదని సర్ విల్లియము జోన్సుదొరవారు నుడివియున్నారు. “ప్రస్తుతమున నిలి చియున్న సంస్కృత లిఖిత గ్రంథములయొక్క సంఖ్య పదివేలు. ఈసంఖ్య గ్రీసు ఇటలీదేశములరెండింటి యొక్క యుద్గ్రంధముల సంఖ్యకన్న వధికముగానుండు ననిమ్యాక్సుముల్లకు పండితుఁడు నుడివియున్నాఁడు ఇట్లే రివరెండువార్డు దొరవారును మ్యానింగను యువతీ రత్నమును నుడివియున్నారు. ఇట్టి యమూల్యములైన గ్రంథములను సేకరించుట మితిమీరిన ధనమును గూర్చుటయేగదా!
గ్రంథాలయముల యొక్క యావశ్యకత
మన దేశమునందు ఈస్టిండియా సంఘము వారి ప్రభుత్వపాలనలో చివఱకు ౼ ఏదియో యొక విధమున రాజ్యాంగమువారి ప్రయత్నమువలనను విదేశీయమతచార్యులయు దారత్వమునను రాను రాను స్వదేశీయుల శ్రద్ధవలనను పాఠశాల లేర్పడి హిందూబాలకులు విద్యనభ్యసించుచున్నారు. కాని కృతార్థులైనతోడనే యొజ్జల పాఠములను యొజ్జలకే యొప్పఁజెప్పి యేలేఖకవృత్తి యందో ప్రవేసించి కాలముబుచ్చుచున్నారు. సద్గ్రంధపథవమునం దొకానొకప్పు డభిమానముపుట్టినను, గ్రంథములు కొనుటకు తగినయుపాధి లేకపోవుటచే అట్టికోరిక సఫలము కాకపోవుచున్నది. ఒక్క లేఖకవృత్తియందున్న వారికిమాత్రమేకాదు. ఎంత సంపన్నగృహస్థునకును తాను చదువదలచిన ప్రతిగ్రంథములు కొనుటకు సాధ్యపడదు. సాధ్యపడినను దానివలన ప్రయోజనము నుండదు. నవలలు, చరిత్రలు - సాధారణ నాటకములు మున్నగునవి యొక్కతడవకున్న నెక్కువగా చదువవలసిన యవసరముండదుకదా? కావున బీదలకు సామాన్యజనులకు ధనికులకు చదువ ననువగుమాగ౯ము పుస్తక భాండాగారములను స్థాపించుటయేయై యున్నది.
గ్రంథాలయము లెవరు నెలకొల్పవలెను?
పాఠశాల నెట్టివారు నెలకొల్పుచున్నారో గ్రంథాలయములును నట్టివారే నెలకొలుపవలయు నని నా యభిప్రాయము. బాలికాబాలకులకు విద్యాభివృద్ధికై పాఠశాలల నేర్పఱచుట రాజ్యాంగమువారి కెట్టి బాధ్యతయో స్త్రీ పురుషుల జ్ఞాననేత్రమును వికసింప జేయుటకు గ్రంథాలయముల నెలకొల్పుటయు నట్టి బాధ్యతయేఅయియున్నది, ఇట్లనుటచే తదితరులమీదనట్టి భారము లేదని నా యభిప్రాయ మెంతమాత్రము గాదు. గ్రంథాలయనిర్మాణభారము ముఖ్యముగా పట్టణములయందు పురపారిశుద్ధ్యసంఘమువారియందును గ్రామములయందు స్థానికపరిపాలనాశాఖ వారియందును నున్నయది. విజయవాడ పురపారిశుద్ధ్యసంఘమువారు తను పట్టణమునందలి రామమోహన గ్రంథాలయమునకు గొంత విరాళము నిచ్చియున్నారు. మా రాజమహేంద్ర పురపారిశుద్ధ్య సంఘమువారు ఆ పట్టణమునందలి సర్వజన పుస్తక భాండాగారమునకు గొంత సాంవత్సరిక విరాళమును నిచ్చుట మాత్రమే గాక గోదావరీతీరమునందలి కొంతస్థలమును సయితము గ్రంథాలయనిర్మాణమునకై సులభమగు విలువకు నొసంగి యున్నారు. ఇందులకు రాజ్యాంగమువారును సమ్మతించినారు.
కావున గ్రంథాలయాధికారులిక ముందు పైసంఘములవారిని ధైర్యముగ సాంవత్సరిక విరాళములను గ్రంథా లయనిర్మాణమున కగు వ్యయములో కొంతభాగమును గోరవచ్చును. ప్రజాప్రతినిధు లిందుకు సుముఖులుగా కు౦డరు.
గ్రంథాలయములయందెట్టి గ్రంథము లుండవలెను?
“జనసామాన్యములకు ప్రతి విషయమును గూర్చియు అనుభవజ్ఞుల యభిప్రాయములను సులభముగ దెలిసికొను గ్రంథములు ముఖ్యముగా ప్రతిగ్రంథాలయమునందును నుండవచ్చును. ప్రపంచమునం దిపుడున్నట్టియు మున్ను చన్నట్టియు జ్ఞాననిధుల విజ్ఞానము సామాన్యజనులకు లభింపఁజేయుటయే గ్రంథాలయాధికారుల ముదటి యుద్ధేశముగ నుండవలయును. నీతిదాయకములును, మనపురోవృద్ధికి మూలకారణములును నగుగ్రంథరాజములు సేకరించుట ముఖ్యావశ్యకము! సంస్కృత భాషావ్యాప్తి ప్రస్తుతము మితముగనున్నను ఆభాషయందలి కావ్యాదులును లక్షణగ్రంథములును నీతి శాస్త్రములును ధర్మశాస్త్రములును, గణిత, అర్ధ, శిల్ప,వాస్తుజ్యోతిశ్శాస్త్రములును గూర్పవలయును. ముఖ్యముగా చరిత్రలును, జనుల హక్కులను దెలిపెడి గ్రంథములను మిక్కుటముగఁ జేర్పవలయును. ప్రతి గ్రంథాలయమునందును బాలురకు విచిత్రములగు కధలను దెలుపు గ్రంధములును, స్త్రీలు గృణానిర్వహణనిపుణలగునట్లు బోధించు పుస్తకములుగు పండితులకు, పామ స్వతమును బోధించు గ్రంథరాజములును వృద్ధులకు ఆధ్యాత్మికమును దెలుపు నుద్గ్రంథములును నుండవలయును.
చేతిపనులమితముగానున్న ప్రదేశములందలి గ్రంథాలయములయం దట్టి చేతిపనులనుగూర్చి తెలియఁజేయు గ్రంధములను, వతే౯క మమితముగానున్న ప్రదేశముల యందు వత౯కపునేర్పులను, ధగలను, సరకులు లభించు ప్రదేశములను, దెలుపు గ్రంథములును ముఖ్యముగాఁ జేర్పవలయును. మనము నాగరికతగల ప్రదేశములతో సంబంధము కలుగజేసికొనవలయునన్నను, నూతన శాస్త్రములను, ప్రస్తుతయుద్ద పద్ధతులను, శస్త్రాస్త్ర విషయములను దెలిసికొనవలయు నన్నను మనమింగ్లీషు గ్రంథముల సమితముగ సేకరింపవలయును. ఇంగ్లీషు గ్రంథములఁ గూడఁ జేర్చినగాని మన గ్రంథాలయములవలన గలుగ వలసినంత ప్రయోజనము కలుగనేరదు.
గ్రంథాలయములు ప్రజల నాకర్షిషించునట్లు చేయుట?
న్వారకాగ్రేసరులగు అమెరికాదేశస్థులవలె మన గ్రంథాలయములను జనులనాకిషీ౯౦చునవిగా జేయవలయును. ఇయ్యది గ్ర౦థాలయములు నిర్మించు ప్రదేశములు మిగులననుకూలముగ నుండునటుల చూచుటచేతను విశాలముగను రమణీయముగను నుండు గృహములను నిర్మించుట చేతను అందు నట్టి గృహములను నుచితరీతి నలంకరించుటచేతను అందు సర్వజనులకు సామాన్యముగ కావలసిన వస్తువులను సేకరించి యుంచుటచేతను జనులు నాకర్షింపవచ్చును. ఇందు దినవార్తాపత్రికలను, మాసపత్రికలను, చిత్రపటములతో నుండు పత్రికలను జేర్పవలయును. ఈ గ్రంథాలయములనుజేర్చి సారస్వతమును గూర్చిగాని సంస్కరణమును ప్రోత్సాహమును జేయునట్టిగాని రాజ్యాంగములను చర్చించునట్టిగాని సమాజములు స్థాపింపబడవలయును. పర్వదినములయందు తగు పౌరాణికులవలన పురాణములు జదివించి గ్రామస్థులకు వినిపించుటగాని ప్రజోపయోగములగు విషయములనుగూర్చి యుపన్యానించుట గాని యొనర్చుచుండవలయును. సత్కవుల గ్రంధములలోని చక్కనిపద్యములను వినిపించుటవల్లను కొన్ని గ్రంథములలోని సంగతులు నుపన్యాసమూలమున బ్రజలకు దెలిం జేయుటవల్లను గ్రంధములను జదువవలయుననెడి యాసక్తి జనింపఁజేయవలయును. ఇతర ప్రదర్శనములతోఁబాటు గ్రంథప్రదర్శనమును నొకశాఖగా నేర్పఱచుట ప్రయోజనకారిగా నుండకమానదు.
తీర్మానములు
- ౧ కైకలూరు తాలూకా కోరుకొల్లు గ్రామమున నున్న 'శ్రీరామ గ్రంథాలయమునకు గృహనిర్మాణముఁ గావించుకొనుటకు సుమారు రు.800 లు విలువగల యిరువది సెంట్ల స్థలమును దాన మొసగిన శ్రీవన్నం శెట్టి సీతారామయ్యగారి కుమారుఁకు వెంకయ్యగారి యౌదార్యమున కీసభవారలెంతయు నభినందించుచు బ్రతిగ్రామములోను తగు విధముల గ్రంథాలయములకు సహాయ మొనర్ప మహాజనుల నీసభవారు ప్రార్థించుచున్నారు.
- ౨ కృష్ణాజిల్లాయంకున్న అన్ని పట్టణములయందును, ముఖ్య గ్రామములయందును గ్రంథాలయములను బఠానదిరములను స్థాపించవలెనని మండలప్రజల నీ సభ వారు ప్రార్థించుచున్నారు.
- 3(క)కృష్ణామండలమందున్న గ్రంథాలయములకును బఠవమందిరములకును డిస్ట్రిక్టు తాలూకాబోర్డుల యొక్కయు మునిసిపాలిటీలయొక్కయు ద్రవ్యముల నుండి విరాళమునొసంగుటకును.
- (చ)ఈ జిల్లాలయందున్న గ్రంథాలయములన్నిటికిఁ బ్రభుత్వము వారిచేఁ ప్రచురింపఁబడుచున్న వ్యవసాయ కారోగ్య పారిశ్రామిక వాణిజ్య ప్రచురముల నన్నిఁటిని యుచితముగా నొసంగుటకును ప్రభుత్వమువారినీ సభవారు ప్రార్థించు చున్నారు.
- ౪ కృష్ణాజిల్లా గ్రంథాలయ సంఘము పక్షమున (౧) నిడమర్తి లక్ష్మీనారాయణగారు,(౨) సంగల్వల సత్యనారాయణ గారు, (3) దుగ్గిరాల వెంకట సుబ్బయ్యగారు పైసాలునఁ కార్యదర్శులుగా నుండుటకు ఈ సభ వారు కోరుచున్నారు.
- ౫ గ్రంథాలయము లన్నియు దేశభాషావాఙ్మయ చరిత్రాభివృద్ధికై తమకు సమీపగ్రామముల యందున్న ప్రాచీన తాళపత్ర గ్రంధములు రాగి శాసనములు మొదలగునవి సంపాదించి పిఠాపురమునందు స్థాపించిన యాంధ్ర పరిశోధక మహామండలికి బంపుడని యీ సభ వారు కోరుచున్నారు. బహుజనాభిప్రాయముమీఁద నీ తీర్మానమంగీకృత మయ్యెను.
అనంతర మీ క్రింది గ్రంథాలయములను గూర్చిన చరిత్రములను ఆయా గ్రంథాలయముల ప్రతినిధులు చదివిరి:౼
- ౧ శ్రీ భారతీ గ్రంథాలయము, మాధవర౦
- ౨ శ్రీ పఠనాలయము, తాళ్ళపూడి
- 3 శ్రీ లక్ష్మీనృసింహ పుస్తకభాండాగారము, కుమారదేవము
- ౪ శ్రీ మల్లేశ్వర పుస్తకభాండాగారఁ, జగన్నాధపురం
- ౫ నన్నయ భట్టారక గ్రంథాలయము
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse