Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/కవాతు

వికీసోర్స్ నుండి

కవాతు

భటులు కవాతును విశేషముగా చేయనక్కరలేదు. కాని బాలభటసైన్యమును గాని దళమునుగాని యొక వైపు నుండి మరియొక వైపునకు నతిత్వరితముగా క్రమము దప్పకుండ తీసుకొనిపోవుట కది కొంతవఱకు సత్యంతావశ్యకమై యున్నది. ఇంతకన్న కవాతు యొక్క యుపయోగమేమియు లేదనియు అది వట్టి నిరర్ధకమైనదనియు పలువురు తలంచెను. కాని ఈతలంపు లెన్నటికిని సరిగావు.

కవాతువలన మతఁ జేకూరు లాభములందు మొదటిది యేకాగ్రచిత్తము. శరీరమును యంత్రమువలె నడిపించునట్టి కవాతువలన నేకాగ్రత యెట్లు లభింపగలదని చాలమందికి దోఁచవచ్చును. కాని యనుభవముమీఁదగాని యీ సంగతి తెలియదు. కవాతును సరిగా జేయవలయునన్న మన మనస్సు వంతను సంపూర్ణమగ జేయంచున్న పనియందు లగ్నము చేసి, యితర చింతనలను భారఁదోల వలయును. ఈ కార్యము సులభముగఁ జేయనగునది గాదు. కాని యెట్లు మనస్సును వశముజేసికొన గలుగునెడల నెంతటిశక్తి మనకు కలుగగలదో చింతింపుడు!

కవాతువలన మనకుఁ జేరూరు రెండవలాభము శరీరమును స్వాధీనమునందుంచుట. మన చేతులు, కాళ్ళు, తల, భుజములు-ఇవియననేల శరీరమంతయు మనస్వాధీనము నందుండును. ఒక పనిని జేయవలనని తలించిన వెంటనే యెంతమాత్రమును ప్రభుత్నము లేకుండనే, ఆ పనిని శరీరము చేరుచుండును. ఒక గుర్రమునెక్కి తిన్ననైన బాటమీద సరాసరిగా వెళ్ళుచుంటివనుకొనుము. అప్పుడు ప్రక్క నున్న యేవీథివైపునకైన తిరుగదలయునని హఠాత్తుగా తలంగువనుకొనుము. తలంపుకలిగిన వెంటనే వైపుతిరుగుటయు, వీథిలోనికి వెళ్ళుటయు జరగియేయుండును. అంతియకాని “నాగుర్రముయొక్క కళ్ళెమును ముందుగా కుడివైపునకు ద్రిప్పవలసియున్నది. నాశరీరము యొక్క బరువును కుడివైపునకు త్రిప్పవలనియున్నది" అనియాలోచింపవుగదా. కవాతునందుగూడ ప్రతివాడును చేయగలిగినది యిదియేను. ఒక పనిని చేయవలెనని నీకు తలంపుకలిగిన తక్షణమే యది జరిగి తీరవలెను. ఈశరీర యంత్రము మనకు సంపూర్ణముగ స్వాధీనము నందుండినగాని యీ కార్యము జరుగదు. శరీరావయవములకు సంబంధించిన యెంతచిన్న కదలికయైన నెట్టి కొఱంతయులేకుండ, కవాతు వలననే సంభవము కాగలదు.

దీనికి బిమ్మట కవాతువలన లభ్యమగునది నీయాకారము చురుకుదనమును గలిగియుండుటయు, నీయందు నీకుండవలసిన గౌరవమాచకమగు వైఖరితో నిటాలును నిలఁబడియుండుటయును.

కవాతు వలన సహకారముగూడ నలవడును. అందరును నొక్కసారి యొక్కరూపమున నొక కార్యముఁ జే య నలవాటు లభించును. ఉత్తరువురు దక్షణమే అందఱును యేకకాలమునఁ జేయగలుగుదురు. ఉత్తరువు వెలువడునప్పటికి సిద్ధపడియు౦డుట గూడ లభ్యమగును. ఇదిగాక వారు చురుకుగలవార గుటకును, శీఘ్రగమనమలబడుటకును యిదిమిక్కిలి యుపయోగకరముగ నుండును; దేహమును కాపాడునట్టి కండరముల కది పుష్టిని గలుగఁజేయును; వంగునట్టి స్థితియందుంచక దేహమును నిలువున నిలఁబడునట్లుంచుటవలన, హృదయకోశమును, ఊపిరితిత్తులును యెక్కువగా వాడుటకుఁ దగిన సావకాశముండును; అందువలన శరీరమందలి యవయవములు సరియైన స్థితియందుండి, యాహారము చక్కగా జీర్ణమగును. ఎవ్వరైనఁగాని శరీరమును వేలవేసికొనునట్లుంచినయెడల న౦దు౦ యవయవములెల్ల మందగించియవి తనుపనులను యుక్తముగా నెరవేర్పఁజాలకుండును; అట్టివారు బలహీనులై తరుచుగా జబ్బుపడుచుందురు. సాధారణముగా బిల్లలందఱును శరీరమును వ్రేలవేకొనియుండుటకే నలవాటు పడుటను చూచుచుందుము; అందువలన వారిచేత తగినంతి శరీరపరిశ్రమను చేయించి యా దురలవాటును పోగొట్టవలెను.

నిలిచియుండునప్పుడు వంగియుండంక, నిటాలున నిలు మండుము. కూర్చున్నప్పుడు నడుమును వంచకము; నడుమును వంకరలేకుండా నిటాలున నిలఁ బెట్టుము. నీవు నడుచుచున్నను, నిలఁబడియున్నను, కూర్చునియున్నను శరీరమును వ్రేలాడునట్లుంచక, చురుకు గానుంచినయెడల నీమనస్సుగూడ చురుకుగానుండును. వ్రాసికొనుటకు బల్లమీఁదకు వంగినను, లేక నేదైవ వస్తువును తీసికొనుటకు క్రిందకు వంగినను వీపును యెంతమాత్రమును వంచకుము.

పైన వివరించిన యుపయోగము లన్నియు కలగవలెనన్న కవాతు లోపరహితముగ నుండవలెను, ప్రారంభమునందే లోపరహితముగ సేకార్యమైనను యుండుటయసంభవము, కవాతునందు ప్రతి స్వల్ప విషయమును గూర్చియు నెక్కువగా శ్రద్ధను తీసికొనుట యత్యంతావశ్యకము; అట్టి స్వల్ప విషయములే యమూల్యములగు ఫలితములను గలుగఁజేయును. కవాతుచేయు కాలమందంతటను విశేషశ్రద్ధను గలిగియుండుము; ఉత్తరవులను శ్రద్ధగా వినుము; పిమ్మట వానిని శ్రద్దగా చేయుము. ప్రతిపనిని ఖరాగా చేయుట యనగా లోపరాహిత్యముగాఁ జేయుటయే, నీలక్షమును చెదరనీయకుము. ఏదైన వచ్చుచున్న దనికాని, నీవు చేయుపనులను యెవరయిన చూచుచున్నారనిగాని తలంచి, చుట్టుప్రక్కలకు నీదృష్టిని మరల్చకుము. నీపటాలమును యెవరైనఁ జూచుటకు వచ్చిరనుకొనుము; ఆట్లువచ్చినవారెవరో జూచుటకై యేవైపునకు గాని తిరుగుటకన్న తప్పుపని మఱియొకటి యుండబోదు. కవాతు చేయునప్పుడు నీదృష్టినంతను యుత్తరువులనిచ్చునట్టి యధికారియందు లగ్నముఁజేయుము; అప్పుడు నీచుట్టు ప్రక్కలనున్న వాని నన్నింటిని మరచిపొమ్ము. కవాతు నందు నడచునప్పుడెల్లను రెండు సంగతులను తప్పక జ్ఞప్తికి చుందుంచుకొనుము; మొదటిది, నీ రెండు చేతులను (చేతిలో కర్రయున్న యెడల నొక్క చేతిని మాత్రమేను)ముందునకు వెనుకకు సూగించుము; తెలను వ్రేలాడ వేయక చక్కగా నిలబెట్టి ముందువైపునకుఁయించుచుండుము; నేలకేసి యెప్పుడును చూడకుము.

“హుషార్ " చెప్పినప్పుడు సైన్యము నిలువబడు పద్ధతినిబట్టి, వారిదిట్టదనము వెల్లడియగును; అప్పుడందఱును యెంతమాత్రము కదలిక లేక నిజీ౯వప్రతిమలవలె నిలబడి యుండవలెను; చేతివేలునైన కదల్పగూడదు;కంటి రెప్పనైన కదల్పగూడదు. దీనిని చెప్పుటకున్న చేయుట కష్టము. క్రమముదప్పక నడచుటకున్న యిట్లు నిలబడియుండుటకు నెక్కువ ఆత్మనిగ్రహము కావలసి యున్నది. కదలకుండ నిలచున్నప్పుడు, కదలుటకు కావలసిన యవసరము లన్నియు నొక్కసారిగా నీమనస్సునకుఁ దట్టును. నీనుడమకేదియో చక్కిలిగింత పెట్టినట్లుండును; లేక నీ ముక్కుమీద నీగవాలును; కదలకుండ సిలబడి యుండవలెనని నీవు తీసికొన్న దీక్షకు భంగము చేయవలెనని ప్రకృతి యనేక విధములఁ బ్రయత్నించును. అప్పుడు నీ వేమి జేయవలెను. “నాకు ముక్కులేనేలేదు, చెక్కిలిగింత అసలేలేదు” అని తెలంపవలెను. కావున ముఖ్యముగా నిట్టి చిన్న సంగతులే గణనకు వచ్చునవియని జ్ఞాపకముంచుకొనుము,

నడక కవాతు

సైనిక్ = పటాలము
దల్ సే=జట్ల వారీగా
కతార్ బనావ్ = వరుసగా నిలువబడుడు
సీధేఖడేహో = కులాసాగా నిలువుడు
తయ్యార్ = చేతులు వెనుకతట్టున నుంచి నిలువుడు. కాళ్ళు 10 అంగుళముల యెడముగా సుంచవలెను.
హుషార్ = కదలకుండా నిలువుడు. చేతులు కాళ్ళు కలుపుడు (శరీరమునకు ప్రక్కలను చేతులు అంటి యుంచవలెను)
దాహినీ ఆదా ఘూమ్ = కుడిమూలకు తిరుగుడు
ఔయా ఆదా ఘుూమ్ = ఎడమవైపునకు తిరుగుడు.
దాహినీ ఘూమ్ = కుడివైపునకు తిరుగుడు
బాయా ఘూమ్ = ఎడమవైపునకు తిరుగుడు
పీచోఘూమ్ = వెనుక వైపునకు తిరుగుడు
కదం మిలావ్ = కాళ్ళు కొట్టుము. (ఎడము, కుడి)
ఛెల్ = నడుపుము
ధీరే ఛెల్ = నెమ్మదిగా నడువుము
జల్ దీ ఛాల్ = త్వరగా నడువుము
ధవుడ్ = పరుగెత్తుము
టహీరో= తక్షణమే ఆగుము
దాహినాచక్కర్ = పంక్తిలో కుడివైపున ఉన్నవాడు తనకు కుడివైపునకు తిరుగగా, మిగిలినవారు కూడ తమకు కుడివైపుగా వచ్చుచు మొదటివాని ప్రక్కన నిలువబడుదురు. (ఒకరి ప్రక్కను ఒకరు :నిలబడియున్నపుడే ఈ ఉత్తరవు ఇవ్వబడును)
భాయాచక్కెర్ = పంక్తిలో ఎడమవైపున ఉన్నవాడు తనకు ఎడమవైపునకు తిరుగగా మిగిలివారు గూడ తమకు ఎడమవైపుగా వచ్చుచు మొదటివాని ప్రక్కన నిలువబడుదురు. (ఒకరి ప్రక్కను మఱియొకరు నిలువబడి యున్నప్పుడే ఈ ఉత్తరవు ఇవ్వబడును)
సామ్నే అవ్ లేక అగే ఆవ్ = ముందుకు ర౦డు. ఒకరి వెనుక మరియొకరు నిలబడియున్నప్పుడు, మొదటి వాడు నిలబడియుండును. మిగిలినవారు మొదటి వాని ఎడమ వైపునకువచ్చి నిలువబడవలెను (ఒకరి వెనుక మరియొకరు నిలబడి యున్నప్పుడే ఈ ఉత్తరువు ఇయ్యబడును)
సంఖ్యాగినో = సంఖ్య లెక్కపెట్టుడు (కుడి చేతి మీదుగా)
దోకతార్ జనాన్ = రెండు భారులుగా నిలువ బడుడు
చార్కతార్ బనావ్ = నాలుగు బారులుగా నిలువుడు
కతార్ మే ఆవ్ = వరుసలోనికి చేరుడు
ఆగే ఆవ్ = ముందుకు ర౦డు
జైసే థే = ఇదివరకున్న మోస్తరుగా ఉండుము (ఒక ఉత్తరు విచ్చి తిరిగి ఆవుత్తరువు నివ్వనప్పటి మోస్తరుగా నిలబెట్టుటకు ఈ ఉత్తరవు నిచ్చెదరు)
పీఛే ఆవ్ = నా వెనుక రండు
సీధే బైరో = సరిగా కూర్చుండుము
వందే = నమస్కారము,

శరీరపరిశ్రమ కవాతు

వ్యాయామ్కీ సంఖ్యాగినో = శరీర వ్యాయామమునకు గాను సంఖ్యలను చెప్పుడు. అనగా నాలుగు: నాలుగుగా లెక్క పెట్టుడు (1 సంఖ్య వచ్చినవారు కదలగూడదు. 2 సంఖ్య వచ్చినవారు రెండు అడుగులు, 3 సంఖ్య వచ్చినివారు నాలుగు అడుగులు 4 సంఖ్య వచ్చినవారు ఆరు అడుగులు వెనుకకు పోవలయును)
ఫీ ఛేజావ్ = ఈ అడుగులు ప్రకారము వెనుకకుపొమ్ము
బొయాఆ దాఘూమ్ = ఎడమ మూలకు తిరుగు
పహిలీక వాయత్ = మొదటి సాధన
దూసేక వాయత్ = రెండవ సాధన
తీస్రీక జాయత్ = మూడవ సాధన
చౌధీక వాయత్ = నాల్గవసాధన
పాంచ్ మీక వాయత్ = ఐదవసాధన
దాహి నా ఆదాఘూమ్ = కుడిమూలకు తిరుగు
ఆగేఆవ్ = ముందుకువచ్చి పంక్తిలో కలసికొనుడు

డోలీక వాతు

తయ్యార్ = మీస్థలములో నిలువబడుడు
రోగీపకడో = రోగిని పట్టుకొనుడు
రోగీఉఠావ్ = రోగిని పైకెత్తుడు
గోగీనీచేరఖో = రోగిని క్రిందికి గింపుడు
డోలీపకడో = డోలీని పట్టుకోనుడు
డోలీఉఠావ్ = డోలీని పైకెత్తుడు
ధీరేఛెల్ = నెమ్మదిగా నడువు
టహీరో= నెమ్మదిగా అగుము
డోలీనీ ఛేరఖో = డోలీని క్రిందికి దింపుడు

నిప్పులార్పు కవాతు

సైనిక్ కతార్ బనావ్ = వరుసగా నిలబడుడు
హుషార్ = సిద్ధముగా ను౦డుడు
సంఖ్యాగినో = సంఖ్యను చెప్పుడు
దోక తార్ బనావ్ = రెండు వరుసలుగా నిలువబడుడు
బాల్ చీ ఉఠావ్ = బాల్చీలను పట్టుకొనుడు
దౌడ్ = పరుగెత్తు
మిల్ జావ్ = దగ్గరగా రండు