Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/ప్రథమ గంజాంమండల ఆంధ్రగ్రంథా లయ మహాసభ, టెక్కలి

​

ప్రధమ గంజాంమండల ఆంధ్ర గ్రంథాలయ మహాసభ - టెక్కలి

ఈసభ ౧౯౧౮ సంవత్సరము జూ౯ నెల ౫వ తేదీన కాళిదాస గ్రంథాలయపక్షమున టెక్కలిలో అత్యంత జయప్రదముగ జరిగినది. డెబ్బదిమంది ప్రతినిధులు ఛత్రపురం, బరంపురం, గొలాబంచ, ఇచ్చాపురం, సోంపేట, బారువా, మందసా, పలాస, పాతిటెక్కలి, నసాన్నపేట, పర్లాకిమిడి, హీరమండలం, లక్ష్మీనరసుపేట, ప్రియాఆగ్రహారం, శాసనాం మున్నగు గ్రామములనుండి విచ్చేసిరి. ఆనాడు ఉదయం 7½ గంటలకు బోడ్డు పాఠశాలభవనమున సభ ప్రారంభ మాయెను. ప్రధమమున కాకరపతి౯ జగన్నాధశాస్త్రిగారు దైవప్రార్ధనను సల్పిరి. పిమ్మట టంకాల సాంబమూతి౯గారును కొందరు యువకులును భారతమాతను గూర్చియు ఆంధ్ర ​మాతను గూర్చియు జాతీయగీతములు బాడిరి. ఆహ్వాన సంఘాధ్యక్షులగు ఊటుకూరి వేంకటగోపాలరావుగారు ప్రతినిధుల నాహ్వానము జేయుచు ఈ క్రింది యుపన్యాసము జదివిరి.

స్వాగతోపన్యాసము.

శ్రీ శ్రీ శ్రీ బృందావనచంద్ర హరిశ్చందన జగద్దేవ నరేంద్రపాలితంబయి, రత్నాకరంబున కవతిదూరంబయి గ్రీస్మాదిత్యపటు ప్రతాపరహితంబయి, విద్వజ్జన సమసిత్ర౦బయి, శ్రీమన్నృసింహదేవభక్తజనసంసేవ్యంబయి తృణాకాష్ఠజలసమృద్ధంబయి చెన్నొందు నీపురవరంబునకు టెక్కలియను నామధేయం బెట్లువచ్చెనో యెరు౦గదగును. దీనికిఁ బురాణ ప్రసిద్ధమగు గాధ యేదియు లేదు. కొని పుక్కిటికతమాత్ర మొకటి కలదు. అది బహుళః నిజమయి యుండవచ్చును. పూర్వ మీ ప్రాంతమునందలి జనులసాధ్య రోగములచే భాధపడుచు నుపశాంతిని గను సాధనంబు గానక తల్లడిల్లుచున్న తఱి నీ స్థలముందు టెక్కలియను పేరుగల చెట్టొకటి యొక సిద్ధునకు గానవచ్చెననియు, నద్దానిని సమూలంబుగ నుపయోగించి వివిధరోగబాధల నాతండు నివారణచేసెపనియు నాటంగోలె నీ ప్రదేశమునకు టెక్కలి యను పేరువచ్చేననియు నానాటి కిది ప్రసిద్ధిగాంచి జగద్దేవలకు రాజధానియయ్యెవని యుఁ జెప్పుదురు.

ఈ టెక్కలిసంస్థానము పూర్వమొకటిగా నుండి కొంతకాలముక్రిందట రెండుభాగము లయ్యెను. టెక్కలి మొదలుగాగల మూడు ఖండములకొకరును, నందిగా మాదిగ మూడు ఖండములకు వేరొకరును రాజు లయిరి. మొదటి భాగమును ప్రస్తుతము పరిపాలించుచున్నవారు శ్రీ శ్రీ హరిశ్చందన జగద్దేవ రాజా బహద్దూరువారు. రెండవ భాగమునకు ప్రభువులు శ్రీ శ్రీ శ్రీ గజపతి బహద్దరుగారు.

లోకములో ప్రతిమానవుండును విద్య నేర్చుకొని, జ్ఞానమును సంపాదించుట యావశ్యకమను న౦శము నే నిక్కడ నొక్కివక్కాణింప నక్కర లేదు. “విద్యా విహీనః పశుః" అను లోకోక్తి తాము విన్నదియే. మన దేశమందు నిర్బంధవిద్యాశాసనము లేకుంటచే ననేకులు విద్యాగంధశూన్యులయి యున్నారు. కీర్తిశేషుగు గోక్లే మహనీయు డీవిషయమయి మిక్కిలి పాటుపడెను గాని వారి ప్రయత్నము వారి జీవితకాలములో సఫలము కాలేదు. సత్పురుషులు వేసిన సబ్బీజము లెన్నటికయిన న౦కురించి వృక్షములు కాకపోవు. కావున మనకు నిరుత్సాహమున కవకాశము లేదు.

ప్రాధమిక విద్యనేర్చుకొని జ్ఞానము సంపాదించు కొనుటకు బోధకులును గ్రంథంబులును ఆసక్తిగల శిష్యులును ఉండవలెను. బోధక గురువు లుండినను బహుగ్రంధపఠనమువలన గాక ప్రపంచవిజ్ఞానము చక్కగ నలవడదు. ఈ గ్రంథములు ద్రవ్యసాధ్యంబులు. ధనహీసులకు దుస్సాధ్యంబులు. కావున వెచ్చటేని గైక్వారు మహారాజువారివంటి మండలాధీశులు గాని పరోపకార ధురంధరులగు కొందరు మహనీయులొక సంఘముగాఁ జేరిగాని గ్రంథాలయములను స్థాపించి అందు పుస్తకములను నెలకొలిపిన ద్రవ్యవిహీనులగు విద్యార్థులకు సుసాధ్యంబులయి జ్ఞానప్రదాయకంబులగును. ఈ గ్రంథాలయప్రతిష్ఠాపనకు మార్గదర్శి శ్రీ శ్రీ శ్రీ గైక్వారు మహారాజాగారు. ౧౯౧౦ సంవత్సరములో వారి రాజధానియందు కేంద్రగ్రంథాలయమును ప్రప్రధమమున స్థాపించిరి. నాటినుండి ఈ గ్రంథాల యోద్యమము బ్రబలి హిందూదేశమంతట వ్యాపించి ప్రతి జిల్లాలోను, ప్రతి తాలూకాలోను, ప్రతి ముఖ్యపట్టణములోను తుదకు గ్రామములోను గ్రంథాలయములు పొడసూపినవి. ఇవి దేశపురోభివృద్ధికి భావి సూచకములు.

ఈ విషయమై నాకుఁదోచిన ముఖ్యాంశములు కొన్ని మనవి చేయవలసియున్నది. కొన్నిస్థలములయందు గ్రంధాలయములు నామమాత్రావశేషములై యున్నవి. పుస్తకములు మెండుగ నుండును. చందాలు బాగుగా నిచ్చుచుందుకు. విరాళంబులు ధారాళంబుగ నొసంగు చుందురు. ఇన్నియు నున్నవి; గాని గ్రంథపఠనము మాత్రము సున్న. వారమున కొక సారియైన పదుగురు గ్రంధాలయ దర్శనమయిన జేయరు. దీనికి ముఖ్యకారణము గ్రంథాలయాధిపతి తాను స్వతః విద్యావంతుడును, జ్ఞానబోధకుడును కాకుంటయే. అతనియందు జనాకర్షణ సామర్థ్య ముండవలెను. తరుచుగ ఉపన్యాసములిచ్చు ​ఆసక్తిగలవాడయి యుండవలెను. పాఠకుల సందేహమును నివృత్తి చేయువాడు కావలెను. బహు గ్రంధపాఠిఅని ప్రసిద్ధిగాంచిన వాడు కావలెను. విద్యయొక్కపొలిమేరయే తెలియని వారినికూడ గ్రంథాలయాధిపతులు తమవద్దకురప్పించి హరికథాకాలక్షేపములవలనను పురాణ శ్రవణమువలనను మాజిక్కు లాంతరు మున్నగు వివిధచిత్రయంత్రప్రదర్శనములవలనను ప్రాపంచిక జ్ఞానాభివృద్ధిగలవారిగా చేయవలెను. అ యా జాతులవారివృత్తు లభివృద్ధిజెందుమార్గములు బోధించు పుస్తకసామగ్రి గ్రంథాలయములయం దుండవలెను. వానిలోని విషయములను బాలురు మొదలు వృద్ధులవఱకును సులభముగ బోధించుచు రావలెను. ఇట్టి పని జరిగినచో గ్రంథాలయములు సర్వజన సమాదరణీయంబులయి దిన దిన ప్రవర్ధమానంబులయి విరాజిల్లెడును.

గ్రంధాలయోద్యమము పూర్వ మెన్నడునులే దనియు కేవలము నవీనమనియు నాతాత్పర్యము కానేకాదు. పూర్వము ముద్రణా యంత్రములు లేకపోబట్టి తాళీయదళసంపుటంబులగు గ్రంథములు పండితులయిండ్లలో మెండుగా నుండెను. ఇవి గృహస్థ గ్రంధాలయములు. ఇక రాజభవనములలోను, మఠములలోను, దేవాలయములలోను, పుస్తకభాండాగారములు ప్రత్యేకముగా ననేక ప్రదేశములనుండినట్లు స్పష్టపడుచున్నది. ఇవి సార్వజనిక గ్రంథాలయములు. తెనుగు గ్రంథము లచ్చుపడుటకు ప్రారంభమగు ౧౮౩౫ సం॥ రము నాటనుండి క్రొత్తగ్రంథము లనేకములు బయలుదేరినవి. ఆచ్చు గ్రంథములు హెచ్చయినకొలది నవీన గ్రంథాలయములు లేచినవి. ఇప్పటికి మన యాంధ్రదేశములో ౪౦౦ కు పయిగా లెక్కకు వచ్చినవి. ఆంధ్రదేశజనసంఖ్యను బట్టిచూడు నీ సంఖ్య మిక్కిలి తక్కువయని చెప్పవచ్చును.

ఈ సందర్భమున ప్రథానాంశ మొక్కటి విన్నవింప మఱచితిని. గ్రంథాలయము లభివృద్ధిపొందవలెనన్న ముందుగ మనవాఙ్మయమభివృద్ధి చెందవలెను. సామాన్యజనులకు సులభముగ బోధపడు జ్ఞానదాయక గ్రంధములు మిక్కిలి తక్కువ. అవి అందఱకు బోధపడు మాటలతో వ్రాయబడవలెను. అన్యదేశ పదములు వాడుట దోషమని భీష్మించి కూర్చునియుండినచో పురోవృద్ధియెప్పటికిని రానేరదు. మోటారుబండి, గ్యాసులయిటులు, మాజిక్కు లాంతరు, రెయిలుబండి, బయిసికిలు, కోర్టు, కచేరి, మునుపు మొదలగు - వన్యదేశపదంబు లసఖ్యాకంబుగ ప్రస్తుతము మన వ్యవహారములో వాడుక చేయబడుచున్నవి. వీని సన్ని సంస్కృతములోనికిగాని తెనుగులోనికి గాని భాషాంతరీకరించిన జనులకు వెంటనే తెలియనే తెలియక వ్యవహారము నడువదు. విధిలేనిచోట్ల నట్టిపదము లుపయోగించుటకు మన మనుజ్ఞనియ్యక తప్పదు. అట్లుగాక అవసరము లేనిచోట్ల గూడ నన్యదేశపదంబులు బ్రయోగించుచు గ్రంథములు వ్రాయట, క్షేమసమాచారము తెలుపు నుత్తర ప్రత్యుత్తరములు స్వభాషలో వ్రాసికొనక అవ్యభాషలో వ్రాసికొనుట — ఈ దురభ్యాసములు మనము మానినచో నానాటికి దేశభాషలు కేవలము విస్మృతిలోనికి వచ్చును. నేను “లాష్టు నైటు" వక డ్రామాకు “ఎలెండు” అయినాను చాలా “ప్లీజు" అయినాను. “క్యారక్టర్లు" అన్నిబహు “స్పె౦డిడ్” గా నున్నవి. సీనులు అన్ని మహా "గ్రాండు” గా నున్నవి. “మ్యూజిక్" అంతా నిండా "హోర్మోనియస్సు” గా నున్నది. అందువల్ల హాలులోనల్లా “సైలెన్సు ప్రిజర్వు" అయినది, కాని “డాన్సింగు క్లోజు” అయినప్పుడల్లా “ఆడియన్సు” “లవుడ్, షవుట్సు" ఇస్తూన్నారు. పాట ఆఖరయ్యే సరికి “వన్సుమోరు” అంటుండేవారు. ఇట్టి సంకర పదభరితంబులగు వాక్యములు వాడుక చేయగూడదని వామతము. గ్రాంధిక వ్యవహారిక భాషా భేదంబులచే బుఱ్ఱ బుట్టి నింతగా బ్రద్దలుకొట్టుకొనక యేజయైన నొక మార్గముత్రొక్కి పయి నియమములకు లోబడి సులభశైలిని గ్రంథములు వ్రాసి వాఙ్మయాభివృద్ధి గావి౦తురని దేశాభిమానులను కోరుచున్నాడను. నానుడవులు వృద్ధప్రలాపములుగ భావింపబడిన యెడల తమ యిష్టానుసారముగ నడువవచ్చును.

మఱియు నొక చిన్న విన్నపముచేసేది. మన్నింపవెడదను. గ్రంథాలయములనుండి పుస్తకములను తీసికొనిపోయి చదువువారికి ప్రతిసంవత్సర మొక పోటీపరీక్ష నేర్పరచి అందు నుతీర్ణులగువారికి అధిక సాను ​ధ్యానుసారంబుగ నొకటి రెండు బహుమానంబులు పుస్తకరూపంబుగ నొసంగుచుండిన గ్రంథాలయముల కనేకులువచ్చి భాషాభివృద్ధి చెందుదురని నాయభిప్రాయము.

ఇక మన టెక్కలిపురములోని గ్రంథాలయ ప్రశంస కొంత సేతము. ఈ గ్రంథాలయము శ్రీయుక టంకాల సాంబమూతి౯యను వైశ్యశిఖామణియొక్క సుప్రయత్నమువలన ౧౯౧౭ సంవత్సరములో స్థాపింపబడినది. దీనికి కాళిదాసగ్రంథాలయ మని పేరు. అది సాంబమూతి౯ గారి భవనమునందే ప్రస్తుతము నెలకొల్పబడి యున్నది. దానికి వారును, వారి తండ్రిగారుగు సూర్యనారాయణశ్రేష్టి గారును దాదాపు 3౦౦ గ్రంథంబు లొసంగిరి. పురజనులు, తాలూకా ప్రజలు కొన్నిటి నొసంగిరి. ప్రస్తుతము దానిలో ౪౯౦ తెనుగు పుస్తకములును ౨౫ం ఆంగ్లగ్రంథములును ౮ సంస్కృతపుస్తకములును ౧౪ తాళపత్రగ్రంథములును గలవు. వేరవి ౭౬౨ పుస్తకములు గలవు. కొందరు విద్యార్థులు పుస్తకముల నిండ్లకు తీసికొనిపోయి చదివితిరుగ నిచ్చివేయు చుందురు. భగవద్గీతోపన్యాస మప్పుడప్పుడు జురుగు చుండును. దీని యధ్యక్షతక్రింద నన్నదానసమాజ మొకటి యేర్పాటు కాబడినది. వారమునకు 3౮ మంది బీదలకు జన ౧కి తవ్వెడు బియ్యము ఒక కాని నగదు చొ॥ ప్రతి ఆదివారము నాడు పంచిపెట్టబడుచుండును. రాత్రొత్యచితపాఠశాల నొకదానిని స్థాపించుట నాలోచన చేయబడుచున్నది. ఈ గ్రంథాలయముయొక్క ప్రధము వార్షికోత్సవము నిన్ననే జరిగినది. కార్యదర్శి గారు చదివిన చరిత్రవలన అన్ని సంగతులు విశదమయి యుండును. కనుక చర్వితచర్వణము నుండునని భావించి యిచ్చట సంక్షేపముగ విన్నవించితిని.

పిమ్మట ప్రభల లక్ష్మీనర సింహంపంతులుగారిని సభాధిపత్యమునకు ఉపపాదించుచు గరిమెళ్ళ సీతారామమూతి౯గారు ఉపన్యసించిరి. ఈ తీర్మానమును గిడుగు సీతాపతిరావు, టంకాల సాంబమూర్తి గార్లు బలపరచిరి. అంతట లక్ష్మీనరసింహంపంతులు గారు ఆహ్వాన సంఘాధ్యక్షునిచే కర్పూరమాలాలంకృతులై అగ్రాసనాధిపత్యమును వహించి ఈ యుపన్యాసమిచ్చిరి:౼

అధ్యక్షుని యుపన్యాసము.

ఆంధ్రోద్యమ మెల్లయెడల బ్రాకి దుర్నిరీక్ష్యతేజోవిభాసితమై వెలుంగుచున్నది. అట్టి ఆంధ్రోద్యమమునకు మూలశక్తి యాంధ్రభావయే. ఆంధ్రభాషయే మనయాంధ్రత్వమునకు బ్రధానలక్షణమై యున్నది. “దేశభాషల లోన దెనుగు లెస్స”యని ప్రాచీనకవిపుంగవులును, మృదుమధుర ఫణితిని ప్రాచ్య భాషలయం దాంధ్రమిటాలియా భాష వంటిదని పాశ్చాత్యులును మన తల్లి భాషను గీర్తించుచుందురు. నేటికిని నెనలేని తీపులూకు తేనె సోనలపగిది తేట తెనుంగుపల్కు లుల్లముల జొక్కజేయుచుందురు. ఆంధ్రకల్పవల్లి భూలోకమున బాదుకొనినది మొదలు దిశలబ్రాకి యనంతశాఖాపరివృతంబై నూతనాదర్శ రూప నానావిధసౌరభ్య సంభరితదివ్యపుష్పశోభావిభాసితమై నిండు వెలుంగుతోడ గోదసినిండి గ్రాలుచున్నది. మధురానగరమున నీయేడు జరిగిన యాంధ్రపరిషత్సమావేళమును నచ్చటి యాంధ్రులయానందమును, మనకు దార్కాణము. మఱియు బర్మా, బొంబాయి, వంగదేశము మొదలగు భారతవర్ష సీమలయందును, సీమయందును, అమెరికా, ఆఫ్రికా మొదలగు విదేశములయందును మనయాంధ్రసోదరులు నివాసము గాంచుచు యాత్రలు సలుపుచు విద్యలగఱచుచు కలనబోరుచు నాంధ్రవ్యక్తికి వన్నె దెచ్చుచున్నారు. బర్మాదేశమున నాంధ్రులు చిరనివాసము గాంచి రాజ్యము లేలుచుండిరి. భారతవర్షమున సామ్రాజ్యపదవులగూడ నలంకరించియుండిరి. దక్షిణదేశమున నిరుపమసంపదలతో దులదూగు చుండిరి. ఆంధ్రులమని నిండుగరువమ్ముతో మనము దలలెత్తదగు గౌరవాతిశయముల, మన పెద్దలు మనకు మూలధనముగ నొసంగి యుండిరి. ఇట్టి ప్రాక్తనౌన్నత్యమునకును వర్తమాన నూతన సంరంభ నవ్యకళాదీప్తికిని ప్రాణభూతమగునది మన మాతృభాషయే. వాగనుశాసనుండు కుండలీంద్రుడు శ్రీనాధుడు నాంధ్రకవితాపితామహుండు మున్నగుమహాకవీంద్రులవలన బోషింపబడి భాస్కర సోములవలన దీప్తి గాంచిన యీ “బహుళాంధ్రోక్తి మయప్రపంచమును” రామ రాజభూషణను చక్కగ వర్ణించియుండెను. అంధ్రో ద్యమమునకు నాంధ్రభాషకును కార్యకారణసంబంధము గలదు. భాషాశక్తి సాంఘిక జీవనమునకు జీవగఱ్ఱ. మింటి 2 ​కెగయ మెట్లు కట్ట సమకట్టిన మానవులకు పెక్కుబాసల గల్పించి కలహములు పెంచి కార్యవైకల్యము గావించిన పరాత్పరుని మాయను క్రైస్తవవేదము కొనియాడు చున్నది. అట్టిపొగడ్త భాషాశక్తిని వేనోళ్ళబ్రకటించు చున్నది. మన భాగ్యవశమున నాంధ్రభాషవంటి పైతృక ధనము మనకు దొరకినది. దానివృద్ధి గావించి మన సంతతికి నమూల్యమగు నిధానముగ మనము విడచు బాధ్యతయును మనయెడగలదు.

ఆంధ్రసారస్వతము.

ఆంధ్రసారస్వత మేనాకు బాదుకొనినదోయింతవఱకును గుర్తింప రాకున్నది. వాగమశాసనుండు సృజియించినట్లు వర్ణింపబడి యుండెనుగాన నన్నయభట్టారకునికి పూర్వమున సుపూర్ణవిశాసముతో నాంధ్రకవిత్వము విరాజిల్లుచు౦డెననుటకు భారతమే సాక్షిగనున్నది. ఇంకను నాంధ్రవాఙ్మయచారిత్రము పరిశోధింపదగియున్నది. వ్రాయబడవలసియున్నది. కవిజీవితములు గలవుగాని సవిమర్శకమగు సారస్వత చరిత్రము వ్రాయ దజ్ఞులగువారలు యత్నింతురు గాక! ఏ దేశముననేని సాంఘిక జీవనమునకు వాఙ్మయము దర్పణతుల్యముగనుండును. నాగరికత, ఔన్నత్యము, సౌశీల్యము, శిల్పకళాకాశలము, అభినవాభిప్రాయప్రాదుర్భావము ౼ పెక్కేల సాంఘిక జీవనమంతయు నిరుపమశోధచే వాఙ్మయమున ప్రతిఫలించుచునే యుండును. సామ్రాజ్యములు పరివర్తనమును జెందినవి. సారస్వతము మాత్రము నిలచియున్నది. పూర్వదేశములు గౌరవము వాఙ్మయప్రసిద్ధివలననే గ్రహియింపదగి యున్నది. గీర్వాణవాఙ్మయ ప్రశస్తిని పాశ్చాత్య పండితవర్యులు - వేనోళ్లగీర్తించియుండిరి. దేవభాషయంతయు మనపైతామహధనము. సంస్కృతభాషా పరిచయమున ప్రపంచక చరిత్రమును వ్రాయదగియుండునని నిర్ణయింపుబడి యున్నది. భాసలకెల్ల దల్లియగు సంస్కృతమున ప్రాచదువులు బయలు వెడలినవి. ఆంధ్రవాఙ్మయ చరిత్రముగూడ నాహ్లాదజనకము గాకపోదు. వర్తమానమం దనంత శాఖలు గలిగి విజృంభించుచున్నది. భాషాంతరిక్షము నిరంతరశోభాభాసమానమై వెలుగుచున్నది. ఆంధ్రవాఙ్మయము నందంతటను నాంధ్రత్వమే ప్రతిఫలించుచున్నది. భారతజాతీయతత్వము నూతనవికాసము గాంచి యాంధ్రవ్యక్తి మూలమున బ్రస్ఫుటవీప్తి తో బ్రకాశించుచున్నది.

ఆంధ్రగ్రంథాలయములు.

ఇమ్మహాతరుణమున గ్రంథాలయోద్యమము ప్రాముఖ్యముగాంచుట యరిదికాదు. గ్రంథాలయోద్యమ మాంధ్రోద్యమమునకు వెరువెంట తదంతక్భూతముగ వెలసినది. జీవశక్తియగు భాష పెంపుజెంది విజ్ఞానము విస్తరిల్లిన గాని యాంధ్రోద్యమమునకు సంపూర్ణ వికాసము చేకూరదు. కావున గ్రంథాలయోద్యమము మన యాందోద్యమమునకు ప్రధానాంగమగు ననుబంధము. ఇయ్యది విజయ వాటిక నెలకొల్పబడినది మొదలు దినదిన ప్రవర్ధమానముగ వింత తేజమును చెందుచున్నది. గ్రంథాలయములు పూర్వమునుండియు గలవు. గ్రంథభాండాగారములు చిరకాలమునుండియు దేశమున నిలచియున్నవి. కాని వానికి నూతనశక్తిని బ్రసాదించి గ్రంథాలయ సూత్రములు కేంద్రీకృతములు గావించి యభినవపక్కిని విజృంభింప జేయదలచినది గ్రంథాలయోద్యమము. ఆంధ్రదేశగ్రంథాలయ సభ మా విశాఖపురిని కొలదిదినములలో జరుగనున్నది. సుప్రసిద్ధ కవిపుంగవులును, ఉభయభాషా సాహితీమండనులును ఆంధ్రభాషాపోషకులునగు శ్రీయుత పోలవరం జమీందారు వారి యాధిపత్యము క్రింద జరుగనున్నది. మండల సభలుగూడ మెండుగ జరుగుచున్నవి. వివిధ గ్రంథాలయములు వార్షికోత్సవములు మిక్కిలి యుత్సాహముతోడను వైభవముతోడను జరుపుచున్నవి. ఆంధ్రదేశమునందంతటను, యాంధ్రులునివసించుచోట్ల నెల్లెడులను గ్రంధాలయములు దినదినప్రవృద్ధిగా స్థాపింపబడుచున్నవి. ఈ యభివృద్ధి గ్రంథాలయోద్యమముయొక్క బలిమిని బ్రకటించుచున్నది. మనగంజాముమండలమున గత సెప్టెంబరుమాసమున తమ యాదరణము క్రింద గంజాముమండ లాంధ్రగ్రంథాలయ సంఘమును నెలకొల్పి బ్రహ్మపురాంధ్రభాషాభివర్ధనీ సమాజమువారు మనకృతజ్ఞతను బడిసిరి. భారువగ్రామమున శ్రీకృష్ణదేవరాయ గ్రంథభాండాగారమువారు ఆంధ్రదేశగ్రంథాలయ ప్రతినిధులు చతుర్ధ సమావేశమును బహుజయప్రదముగ గతసంవత్సరమున జరిపి మెప్పువడసిరి. ప్రస్తుతమీమండలమున బురువదియైదు గ్రంథభాం ​డాగారములు గలవు. దీని కార్యక్రమమును బరిశీలింప హృదయాహ్లాదము జనించుచుండును. పెక్కువిధముల భాషాసేవయు, దేశసేవయుగూడ జేయుచున్నవి. ప్రత్యేకము స్త్రీ సమాజములుండుటయు గ్రంథభాండాగారములు హెచ్చుసంఖ్యలుగ స్త్రీలు సభ్యురాండ్రుగ నుండుటయు స్త్రీ విద్యాభిమానము బ్రకటించుచున్నవి. గ్రంథాలయములు నాంధ్రగ్రంథములే గాక యన్యభాషా గ్రంధములు గూడ సంగ్రహించుచున్నవి. ఆంధ్రభాష యాదినుండియు స్వేచ్ఛాప్రకృత్తిగలిగి యన్యభాషాపదముల వాడుకొనుచు వచ్చినది. అన్యదేశ్యపదములు మెండుగా గానవచ్చుచున్నవి. ఇట్టిస్థితిలో భాషాసాంప్రదాయము ననుసరించి యితర భాషా గ్రంధములను గూడా సంపాదించి తద్భాషా పరిచయమును లభింపచేసికొని వాఙ్మయమునకు వింతవన్నెల బచరించుట మన విధియును సనాతన కవిధర్మమునై యున్నది. భాషామిశ్రమముగల మండలములయందిది ముఖ్యమగు కత౯వ్యము, అన్యభాషా పరిచితిగలవారలందఱకును తద్భాషాసౌందర్యము హృదయాహ్లాదమును బుట్టించుచునే యుండును. భాషాపరివర్తనమూలమున నన్యభాషాగ్రంథరాజములు గొన్ని యాంధ్రవాఙ్మయము నలంకరించుచున్నవి. ప్రాయికముగ వంగభాషనుండియు, మహారాష్ట్రము నుండియు, ఉర్దూభాష నుండియు కథలు, కల్పనలు, నాటకములు, ఇతిహాసములు, నవలలనేకములు గ్రహింపబడుచున్నవి. సంస్కృత పురాణగాధలు తరుగులేని గనియై యున్నది. ఆంగ్లమునుండి భాషాంతరీకము లనేకములు వెడలియున్నవి. ఈ విధమున నుపనదీ సందోహసమ్మిళితమై యాంధ్రవాఙ్మయవాహినీలహరినిస్తుల గాంభీర్యముతోడ విజ్ఞానమును వెదజల్లుచు వెల్లువిఱిసి ప్రవహించుచున్నది. ఆంధ్రజీవనమును వాఙ్మయవాహినీ జీవనము పునీతము గావించుచున్నది. మఱియు నుద్వేలగతి విజృభించి మించునటుల పరాత్పరు డను గ్రహించుగాత!

గ్రంథములు, వానియుపయోగము.

ఏ భాషయందైన నెంతజదివిన తనివితీఱని యమూల్యరత్నములు కొన్ని యుండును. ఎన్నితడవలు చదివిన మఱలజదువ మనము లువ్విళులూరుచుండును. అట్టి గ్రంథరాజములసంఖ్య యత్యల్పముగ నుండును. ఆంగ్లకవివర్యులొక రానతిచ్చినటులు కొన్ని పుస్తకములు వాచవిక్రమాత్రమర్హములయి యుండును. కొన్ని కడుపార గుడువదగినవి. కొలది పొత్తములుమాత్రము జీర్ణము జేసికొనదగినవి యై యుండును. ఈ కడపటితరము గ్రంథములే మనకు సన్నిహితబంధువులవంటివి; నిరంతర సాన్నిధ్యముతో సాహచర్యము జరుపవలసినవి; విసువు పుట్టింపని వింతచోద్యములు రసములు గ్రోలినకొలదిని బ్రసాదించునవి; శ్రమమునుబాపి, హితమును గఱపీ, హృదయ పీడను బోగొట్టి, యానందవార్ధినోలలాడించి తన్మయత్వమును గాలమును, శరీరమును,పరిసర వస్తువులను విస్మృతంబులుగ జేయునవి; గురువు, నెచ్చెలి, మంత్రి, హితుండు నందఱు నొక్కచో గూడినయటుల విజ్ఞాన ప్రదాయకములై పాఠకుల జీవనములు ధర్మక్షణ్ణములగు నేమిపథములు దాటకుండ బ్రవతి౯ంపజేయునవి - అట్టి గ్రంథము లెప్పుడును చెంగట ముండదగినవియై యున్నవి. బాలురకు విద్యాభ్యాస తరుణమువ భాషయందభిరుచియు, సౌశీల్యాద్యుత్తమగుణ ప్రవృద్ధియు నిట్టి గ్రంథపఠనము వలననే గలుగుచుండును. ఇయ్యది మనకందఱకు ననుభవవేద్యమై యున్నది. ఒకటి రెండు మాత్ర ముత్తమగ్రంథములు నిశ్చలభక్తితో చదివి యొంటబట్టించుకొని తన్మూలమున భాషాకోవిదులయినవారనేకులు గలరు. ఆంగ్లమున మత గ్రంథమును, తెనుగున భారత భాగవత రామాయణములు నట్టి ప్రభావము గలవిగా నున్నవి. మఱియు పుస్తకముల చదువుటయందు మననము, నిదిధ్యాసము నత్యావశ్యకములు. విద్యయు, దపమును నేకస్వభావము గలవి. గ్రంధము జదువునపుడు తన్మయత్వమున వణి౯ంపబడిన యంశము లన్నియును నెట్టయెదుట గనులగట్టినరీతిని సాక్షాత్కరించునటుల శ్రద్ధవహింపవలయును. వాల్మీకి రామాయణమున సుందరాకా౦డము, ఆంధ్ర భాగవతమున ప్రహ్లాదచరిత్రమును, శంకరకవి హరిశ్చంద్రోపాఖ్యానమును జదివి కంట దడిబెట్టని దిట్ట యొకండును గానరాడు. భారతమున నన్నిపట్ల సన్నిరసము లొల్కుచునే యుండును. శోధించి లెక్కింప శక్యము గాదు. గ్రంథస్థవిషయముల నేపట్టుననయిన ననుభవగోచరములు గావించు కొనుట ముఖ్యవిషయము. అట్టి యనుభవమున గాని ​విషయములు హృద్గతములై జ్ఞానోదయమును గలుగజేయు సామర్ధ్యమును బొందజాలవు. పూర్వకాలమన నచ్చుయంత్రములు, వ్రాతకు సులభసాధనములు, లేనిసమయమున నిరంతరకృషివలన తాళపత్రములపై హెచ్చుశ్రద్ధతో గ్రంధముల లిఖయించుకొని సంగ్రహించి పఠనముజేసి యుత్తమజ్ఞానమును బొందుచుండెడివారు. దూరప్రయాణములు జేసి, యధ్వశ్రమములకోర్చి కాయ క్లేశములు సంకుసేయక యెన్నియో యుపచారములు సలిపి యెటులనో యజమానులహృదయములను గఱగింప జేసి గ్రంధములు సంపాదించుచుండెడివారు. అట్టికృషియు శ్రమమును నిరర్ధకములు గాక కష్టసాధ్యములుగ సంపాదింపబడిన గ్రంథములన్నియు నుత్తమరూపమున వాడుకొనబడుచుండెను. అకారణముననే చిరజీవులుగ నుండతగిన పొత్తములే కాలగతిదప్పి మిగిలియున్నవి. ఎన్నియో నవలలు, చరిత్రలు, నాటకములు, కథలు, ప్రబంధములు, గ్రంధమాలలు, వెలువడు నీసమయమున నన్నిటిని సంపాదించుకొని ప్రతిమనుజుడును జదువుట దుస్తరమగును. కావున గ్రంథాలయవ్యాప్తి వత౯మాన పరిస్థితులయందు ఆవశ్యక మైయున్నది.

ప్రాచీన గ్రంథాలయములు.

గ్రంథాలయములు గ్రంథ భాండాగారములునను నీపదముల వినినతోడనే, యివియెవ్వియో విదేశవస్తువులను సంశయము కలుగవచ్చును. పేర్లు నూతనమైనవి యైనను వస్తువులుప్రాచీనమైయున్నను, ఇటింట సరస్వతి నాట్యమాడుచుండెడి దినములలో ప్రతిగృహమును సరస్వతీనిలయమై భాసిల్లుచుండెను. పిదప దేవాలయములు,మఠములు, విహారములు, చైత్యములు, రాజమందిరములు, పండితగృహములు మొదలగునవి యుత్తమ గ్రంథాలయములై యొప్పుచుండెడివి. పూర్వకాలమున మతమున కను గ్రంధమునకును "హెచ్చుసంబంధముగలిగి యుండెడిది. దేశమున స్వాతంత్య్రమస్తమించి రాజ్యము పరహస్తగతం బైనపిదప గ్రంధరచనగూడ దేశమున క్షీణించినది. ఏ దేశముననైన బ్రజలు స్వాతంత్య్రము గలవారైనచో బుద్ధివికాసముహెచ్చి యున్నత గ్రంథములు వెలువడును. నానాటికి దేశమునందున్న యుత్తమగ్రంథములు గూడ నాశనముజెందినవి. కొన్ని భూస్థాపనము జెందినవి. మఱికొన్ని యగ్నిప్రవేశము గావించినవి. కొన్నినీటగలసినవి. మణికొన్ని కీటకములు వాతబడినవి. కొన్ని విదేశగాములయినవి. ఈ విధమున ప్రాక్తనవిజ్ఞాన సర్వస్వమంతయు చెల్లాచెదరుగ నాశనముజెందినది. ఈమహోపద్రవములు గడచినకొలది పొత్తములు మాత్రము ప్రపంచముయొక్క పూర్వచారిత్రమును దెలియపరచి మనల నాశ్చర్యనిమగ్నుల గావించుచున్నవి. ఇంతవరకును క్షీణించి ప్రపంచకమునందలి నాగరికత హెచ్చినదియో నిణ౯యింపశక్యముగాకున్నది. ఈజిప్టు బాబిలోను మున్నగు దేశముల పూర్వనాగరికతా చిహ్నములను దిలకించినచో నీసందియము మఱియు పెంపుజెందును. మనదేశమున సంస్కృతభాష కానరానిచో పెక్కు విషయములు దురవగాహములైయుండును. ప్రపంచమున గలిగిన ప్రశయములలో అలెగ్జాండ్రియావంటి గ్రంథాలయములు దగ్ధములగుటవలన గలిగిన జ్ఞానప్రశయము హెచ్చుఘోరమైనదైయున్నది. నదులు, పర్వతములు, గిరిగహ్వరములు, గులకరాలు, చుక్కలు, నాకసము సైతము సృష్టికత౯ రచియించిన పెద్దపొత్తములనలె ప్రకృతిశోభను వైచిత్రిని విచ్చి కనులఎదుట నిలుపుచున్నవి. కాని సృష్టికత౯మాయ వీని నన్నిటిని గప్పియుండుటవలన దాని భేదిఁప యత్నించిన ఋషుల విజ్ఞానరత్నాకరము లనదగు పుస్తకములు నశించుటచే నెన్నియోశాస్త్రములు కళలు సమసిపోయినవి. మిగిలిన వానినైన సంరంక్ష్మీంప బ్రయత్నము లాలస్యముగ జరుపబడినవి. మైసూరు, కాశ్మీరము, నేపాళము, తంజావూరు దేశములయందు ప్రభువులు గొప్పగ్రంథ భాండాగారముల స్థాపించిరి. దొరతనము వారుగూడ ప్రారంభమున కొన్ని గ్రంథనిలయములు నెలకొల్పినను ఇటీవల నట్టి

ప్రయత్నములు పూనికతో గావింపనందున కొన్నియు ఉత్తమగ్రంథములు విదేశగాము లయినవి. నేటికిని పల్లెటూళ్ళ వ్రాతపుస్తకములు తాళపత్ర ప్రతులెన్నియోగలవు. వాని సంగ్రహించుటకు దొరతనము వారు ప్రయత్నములు సలుపుచున్నారు. కాని గ్ర౦థాలయములు గూడ నీయుద్యమమును చేబూనినచోనంతకంటె హెచ్చు సులభముగ నీయమూల్య గ్రంథముల సంగ్రహింపవచ్చును. ​

గ్రంథాలయవిధులు.

అజ్ఞానతమము దేశము నిండి యున్నది. చదువను వ్రాయను నేర్చినవారిసంఖ్య స్వల్పముగ నున్నది. గ్రంథముల జదివి రసము గ్రహియించువారిసంఖ్య యత్యల్పమని చెప్పుటకు సంశయము లేదు. ప్రారంభవిద్య నిర్బంధముగను ఉచితముగను బ్రసాదించుటకై ప్రభుత్వమువారివలన కొన్నిప్రయత్నములు సలుపబడు చున్నని. ఇంకను నవి రూపు గనలేదుగాని శుభసూచకములు మెండుగా గానవచ్చుచున్నవి. రాజకీయవిషయములగూడ హెచ్చుస్వాతంత్య్రము ప్రజలకు గలుగు సంస్కరణము లుపపాదింప బడునని దేశ ముత్కంఠవృత్తితో నెదురుచూచు చున్నది. ఈ సమయమున బ్రజలకు జ్ఞానాభివృద్ధియు కార్యనిర్వహణశక్తియు గలుగునటుల బనిసేయు విధి మనయందుగూడ గలదు. అట్టి జ్ఞానప్రదానమున గ్రంథాలయములు ముఖ్యముగ బాల్గొనవలసియున్నది. ఆంధ్రమున వార్తాపత్రికలు వెలువడినది మొదలీకొఱంత కొంతవఱకు దీరినది. ఉత్తమగ్రంథరచనవలన బ్రజలకు ప్రబోధము గలిగించుట గ్రంధకత౯లకును, తద్గ్రంథ సంపాదమునను ప్రచురమునను జ్ఞానవ్యాప్తి గలిగించుట గ్రంధాలయములకును విధియై యున్నది. పూర్వకాలమున కవులు గ్రంథకతలు ప్రభువుల నాశ్రయించి యుక్తముగ భోషింపబడు చుండెడివారు. మహాకవులును శాస్త్రజ్ఞులును గొ౦దఱు దారిద్య్రాద్యముననే ప్రశస్తిగాంచి లోకోపకార మొనరించిరి. ఈ కాలపరిస్థితుల ననుసరించి రాజావలంబనము కంటె ప్రజావలంబనమే గ్రంధకతలకు జీవనాధారమై యున్నది. “సంఘే శక్తిః కలౌయుగే" యను నార్యరచనము స్మరణకు వచ్చు చున్నది. ప్రజాహితియులగు గ్రంధములు ఆదరణమును బడసి వాసిగాంచ గలవు. పూర్వకాలముకంటే చౌకగ గ్రంథములు లభించుట చేతను, సులభముగ రాకపోకలు జరుగుచుండుటను చదువరులు హెచ్చుగ నుందురు. కాని వారలకు గ్రంథములు చదువుటయందభిరుచి మాత్రము జనియించునటుల గ్రంథాలయములు పాటుపడవలసి యుండును. ప్రజల హృదయము నాకషీ౦పని గ్రంథ మేనాడును జీపింప జాలదు. గుణగ్రహణము, నిమార్షకజ్ఞానము అందరకును సామాన్యముగ లభింపవు. గ్రంథాలయము లట్టి వివేచనముతో గ్రంథసంపాద్యమును జేసిపాఠకులకుద్బోధము గావించుచుండ వలయును. దేశమున నూతనయుగము ప్రారంభమగుచున్నది. ఇట్టి సంధికాలమున నన్నివిధముల పుస్తకములును బయలు వెడలును. మంచివి, చెడ్డవి, సామాన్యముయినవి - యన్నియు నీ ప్రవాహమున బోవుచుండును. గ్రంధకర్తలయందు ముఖ్యముగ స్వాతంత్రము హెచ్చుగ గానవచ్చుచున్నది. కవు లెప్పుడును నిరంకుశ ప్రతిభ గలవారలేగాని పూర్వకాలమున కావ్యనాటకరచనలయందును, శైలియందును, రసపోషణమునందును, ఇతివృత్తి నిర్మాణమునందును, పాత్రల యౌచిత్యమునందును, దృశ్యప్రబంధముల ప్రదర్శింపదగిన విషయములగూర్చియు కఠినసూత్రములు నిర్మింపబడి యున్నవి. ఆధునికనాటకములయందు పూర్వపు నాటకలక్షణములు పాటింపబడుచున్నట్లు కానరాదు. ప్రదర్శనమున కర్హములగు రంగము లెన్నియో కూర్పబడు చున్నవి. సంఘసంస్కరము మొదలుగాగల యంశముల గ్రంథకర్తలు తమకభిమానము గలవాని నౌచిత్యమును నాటకనిబంధనలను దాటి యుపన్యాసరూపకమున పాత్రల ముఖమునుండి వెలువడజేయంచుందురు. మఱియు నవలలయందీ విషయమున మిక్కిలి దోషము గన్పట్టుచున్నది. గ్రంథాలయములు కొన్ని పనిబూని పారితోషికములనిచ్చి గ్రంథరచనకు సాహాయ్యమొనరించు చుండుటచే నీ విషయమును గూర్చి యిచ్చట బ్రస్తావింపవలసి వచ్చినది. కావ్యనాటక రచన యందు ప్రాచీన సంస్కృతాంధ్రసూత్రముల విడువక రచించుట యొప్పని తోచుచున్నది. నాటకము లాంధ్రమున క్రొత్తగ బయలు దేరు చున్నరు. సంస్కృతి నాటకములు భాషాంతరీకరణములు సమాప్తి జెందినవి. సుప్రసిద్ధాంగ్లనాటకములుగూడ పూతి౯యైనవి.

పురాణకధల ననుసరించి క్రొత్తనాటకములు వ్రాయబడుచున్నవి. భాషాంతరీకరణములందు భాష చిత్రముగ నుండును. కొన్నిపట్ల నుభయభాషాభ్రష్టత్వము గానూపించును. మాతృకయొక్క సహాయముండినగాని పరివర్ధనము మగవగాహమే యు౦డును. అన్యభాషా సాంప్రదాయము లటులనే అనుగుని నిమిడ్చిముండుట ​చే వైమనస్యము వాటిల్లుచుండును. వార్తాపత్రికలయం దీదోషము తంత్రీవార్తల దెలుపుపట్లను, నితరవిషయముల నాంగ్లమునుండి తెనుగున రచించుచోట్లను వింత వింత స్వరూపములుగ గానవచ్చును. భాషాంతరీకరణమున భావము గ్రహించి చక్కని తేటమాటల దెల్పుట సమంజసముగా దోచెడిని. భారతాదిగ్రంథములే యిందుకు దృష్టాంతములు. గ్రంథరచనకు గుడుగువాడు లోకజ్ఞుడై యుండవలయుననియు, చతుష్షష్టి కళాకౌశలము గలవాడయి యుండవలయు ననియును, ప్రాచీనకవిపుంగవులు నుడివియుండిరి. పాలకులీకాలమున ప్రాభవముసుజూపుచుండిరి. ఇయ్యది వినూతనభాషావిజృంభణమునకు ముఖ్యలక్షణము. వారి ప్రయత్నములు ప్రశంసార్హములు, సాంఘిక విషయముల జర్చించునపుడును, హితబోధ నవలంబించు నపుడును లోకానుభవమావశ్యకము.

శాస్త్రగ్రంథములు కళలు

విజ్ఞానచంద్రికామండలివారు కొన్ని శాస్త్రగ్రంథముల దెనుగున బ్రచురించిరి. ఇంకను వ్రాయదగినగ్రంధములెన్ని యో కలవు. ప్రాథమిక పాఠశాలయందు సైతము పసిపిల్లలకు చదువు గఱపుటకు నియమింపబడిన చిన్నిపొత్తముల విప్పజూచినచో పెద్దలకలవడని యంశము లెన్నియో యందు బొందుపరచియుండును. మఱికొన్ని విషయములు పసిపిల్లలకు సైతము బాగుగ తెలిసియుండుటచే వారికి నవ్వు పుట్టించుచుండును. బిడ్లలు బడినుండి యింటికి వచ్చినపిదప తలిదండ్రులు బిడ్డలను నాటి చదువునుగూర్చి సంప్రశ్నించినచో నట్టి వింతలు బయల్పడకమానవు. రాత్రి దీపముకడ జదువు వేళల గనిపెట్టిచూచిన గనుగొందుము. బాలుర విద్యాభ్యాసమున లేతవయసున మనస్సు వికాసము జెందుతఱిని అట్టి జ్ఞానోన్మీలనమునకు దగిన పుస్తకములు వారిహస్తముల యందుంప వలయును. ఉపాధ్యాయులు గూడ కొన్నిపట్ల బాలురైయుంట కడుశోచనీయము. మన శ్శాస్త్రమును బాగుగ గుర్తెఱింగియుండి, పిల్లల మనోవికాసమును గనిపెట్టి యందుకు దోడ్పడుచునే బుద్ధికే దిరుచించునో యద్దాని పూనికతో గఱపుచు జ్ఞానోదయము గలుగజేయుట యుపాధ్యాయుల విధి. విద్యా విషయమున లోపములెన్నియో కలవు. వాని నిచ్చట యుగ్గడించుట యప్రస్తుతము గాన దానిగూర్చి బ్రశంసింపను. మనోధ్వాంతమును బోగొట్టువాడే గురువు. పరీక్షల పెక్కండ్రుబాలు రుత్తీర్ణులు గాకుండుట జూడ విద్య గఱపువిధమున నెద్దియో పెద్దలోపమున్నట్లు తప్పక పొడగట్టుచున్నది. ప్రారంభవిద్య యుచితముగను నిర్బంధముగను నేర్చుసమయ మఱుదెంచిన యీతరుణమున తగినపుస్తకము లెన్నియో యుండవలయును. కొన్ని తగిన పుస్తకములు జయలువెడలు చున్నవి. కాని యింకను బయలువెడలగియున్నవి. విదేశీయులగు పుస్తకపు వత౯కులవలన నియోగింపబడికాక, స్వతంత్రముగను అనుభవముగల యుపాధ్యాయులవలనను వ్రాయబడినచో పొత్తములయం దట్టిలోపము లుండవు. ఆరోగ్యశాస్త్రము, వృక్షశాస్త్రము మొదలగు శాస్త్రములను గూర్చి వ్రాయుటయందు దేషభాషలన్నిటియందు సామాన్యముగ నొక్క పదము వాడుచుండట మంచిదియని తోచుచున్నది. వంగబాషాయందును మహారాష్ట్రమునందు నిట్టి పదములు చక్కగ వాడబడు చుండునట్లు తెలియవచ్చుచున్నది. అంగారక్షార వాయువు” “బొగ్గుపులుసుగాలి” యను నర్థము నెవరికయినను దురవగాహములే. పండితసభ లీవిషయమున గృషిసల్పి సరియగు పదముల నిణ౯యింతురు గాక! రాజకీయ వ్యవహారములయందు గూడ సరియగుపదముల నిర్వచించి యర్ధము భావము సరిపోవునటుల నిర్ధారణము జేసి ప్రకటించుట పండితసభల నిధియై యున్నది. పూర్వకాలమున మనదేశమునందు రాజ్యాంగతత్వము చక్కగ నివతి౯౦పబడుటచేతను శాస్త్రములన్నియు బాగుగ వికసించియుండుట చేతను పూర్వ గ్రంధపరిశోధవమున నీకొఱంత కొంతవఱకు దీఱునని తోచెడిని. అట్టి పరిశోధనమును గ్రంథాలయములు పూనవలయును. గ్రంథాలయములు పూర్వపు సాహిత్య గ్రంథములే గాక శాస్త్రగ్రంథములు మొదలగువానిని సంగ్రహించి ప్రస్తుతోపయోగములగు విషయములకు సరియైన పదములట్టి శాస్త్రములయందు గానవచ్చినచో వానినెంచి ప్రకటించుట మేలు. వత౯మానమందు ఘోరయుద్ధము చెలరేగుచున్నది. ఈయుద్ధమును వణి౯౦చుట కానేకప్రయత్న ​ములు జరుగుచున్నవి. వాతాళ పత్రికలు ముఖ్యముగ నీవిషయమునమిక్కిలి గష్టముజెందుచున్నవి. మహాభారతమును నిఘంటువులను జూచనచో నీవణ౯మునకు దగిన పదము లెన్ని యో దొరకును. ప్రకృతిశాస్త్రము, రసాయనశాస్త్రము, ఖగోళశాస్త్రము, రేఖాగణితము, బీజగణితము మెదలగుశాస్త్రముల దెనిగించుటయందు పూర్వగ్రంధముల సహాయ మంతగా గైకొనబడుచున్నట్లు కానరాదు. ఆంధ్రసాహిత్యపరిషత్తువా దీవిషయమున దగిన కార్యము నిర్వతికాంతురని నమ్ముచున్నారము. పరిషత్సభ వారివలన నుత్తమాంధ్రనిఘంటువు పచురింపబడిన వెంట నే యీకొఱంత దీరునని యోచించుచున్నారము. గ్రంథాలయములు కూడ నీవిషయమున హెచ్చుశ్రద్ధ వహించి పనిచేయుట యావశ్యకమైయున్నిది. ఈవిషయమున కృషిసలుపుటకు గ్రంథాలయములకు హెచ్చుఅవకాశము గలదు. అట్టి అవకాశమును సద్వినియోగము గావింప ప్రాధి౦చుచున్నాడను మణీయు నీ కార్యమున నన్యభాషల పరిచయము గూడ మిక్కిలిగ సహకారియగును. గ్రంథాలయముల నన్య భాషాగ్రంథములుండుటయు సభ్యులు వారియభిరుచిని బట్టి నుఱియొక భాష నైన అభ్యసించుటయు వత౯మాన మందాపశ్యకమని తోచుచున్నది. మనమాంధ్రమున నవలలని పిలచు పుస్తకము లుత్కలభాష నుపన్యాసములని వాడబడును. ఉత్కలభాష యందును, ఉర్దూభాషయందును నాకుగల యల్పజ్ఞానముతో బరికించికూడ తత్తద్భాషల నుందు కొన్ని కొన్ని నూత నాభిప్రాయములు చక్కగవఱి౯౦పబడి యున్నట్లు కానవచ్చినది. భాషాపరి వత౯న మెంతయో సౌకర్యముగ గావింపబడినది. కావున నన్యభాషాపరిచితి ముఖ్యముగ నావశ్యకమని చెప్పవచ్చును. హిందీభాష దేశమందంతటను వాడబడవలయుసని మహాత్మాగాంధి గారి యాశయమై యున్నది. అట్టిహిందీభాషకూడ ముఖ్యముగ వ్యాప్తమగు నటుల గృషిసల్పబడవలయును. సంస్కృత సాహిత్యముండినచో దేశభాషలు సులభముగ పట్టుపడును. ఉర్దూ, వంగభాష, మహారాష్ట్రము, ద్రవిడము, కన్నడము, ఓడ్రశ్రము - ముఖ్యముగ వారివారి యభిరుచినిబట్టి యభ్యసింపబడవలయును. ఉత్తమ గ్రంధము లీభాషలయందు వెలువడి యున్నవి. వంగ భాషయందును మహారాష్ట్ర భాషయందను వాఙ్మయాభివృద్ధి మిక్కిలి జరిగినది. శ్రీయుత రవీంద్రనాధఠాకురుగారి నిరూపమానమగు కవిత్వము జగత్ప్రఖ్యాతిని బడసినది. అనుత్తమమగు బహుమానమును పొందినది. చదువరుల హర్ష పులకితాంగులుగ జేయుచున్నది. అట్టికవీంద్రుడాంధ్రమున గూడ వెలయు గాత! తగినగ్రంధపరికర మున్నచో మధ్యమవిద్యకూడ మాతృభాషయందే గఱుపవచ్చును. రాజకీయవ్యవహారములు సైతము దేశభాష యందు జరుపవచ్చును. జఱుప బడవలయును. ప్రజాసామాన్యమున కారీతినిగాని తగిన యనుభవజ్ఞానము కలుగనేరదు. స్వతంత్రరాజ్యములయందు కొన్ని సంస్థానములలో నీపద్ధతి చక్కగ నెరవేర్పబడుచున్నది. ఇట్టి కార్యసిద్ధికంతకును భాషాప్రవృద్ధి మూల కారణము. నూతనశకావిర్భావము నందు జాతీయతత్వము పెంపుజెందుతరుణమున, ప్రభుత్వము ప్రజారంజకమై ప్రజానురాగబద్ధమై యుండుతఱిని, ప్రజాశక్తులు నవోన్మేషముగాంచి విజృంభించు సమయమున, ప్రజలెల్లెడలను దేశభక్తి పరాయణులై యు౦డుజతనున, మాతృభాషాభివృద్ధికై వలయు ప్రయత్నములు నితంతర కృషితో సలుపబడవలసియున్నది. గ్రంథాలయములు కొన్ని యన్నదానము, నాటపాటలు – మొదలగు సౌకర్యములు గూర్చుచున్నవి. భాషావిషయమున హెచ్చుపూనిక బూని కార్యసంసిద్ధి జెందుట ముఖ్యము. స్త్రీవిద్య వ్యాప్తిజెందుట కూపాయము లన్వేషింపబడవలయును. మండలసభ వారివలన కేంద్రగ్రంథాలయము పింపబడవలయును. సంచార గ్రంథాలయములు మెండుగా నుండవలయును. గ్రంథము లన్నియు సంగ్రహించుటందఱకు సాధ్యము కాదు కావున కేంద్ర గ్రంథాలయ మొండు మండలమున నావశ్యకము. ఆంధ్రదేశమున కంతకు ముత్తమ కేంద్రగ్రంథాలయమొండు మిక్కిలి యావశ్యకమై యున్నది. ఆవిషయమున నాంధ్రదేశగ్రంథాలయసభవారు కృషి సల్పుదురు గాక!

ఉపసంహారము.

తా మందఱు నింతవఱకు దయతో నాయాలాపముల వినినందులకు కడు గృతజ్ఞుడనై యున్నవాడను. ​కార్యము దొడ్డది. కాల మల్పము. వృథాతత్త్వాన్వేషణమున కాలము బుచ్చక కార్యనిర్వహణదీక్షవహించు మహాసమయ మరుదెంచినది. నిద్రమేల్కాంచి కనులు విచ్చితిమి. జ్ఞానసూర్యోదయప్రభామరీచికలు దిక్కుల బ్రాకుచున్నవి. అంతరిక్షము నవ్యనుషమాదీప్తులచే గ్రాలుచున్నది. సోదరులారా! లెండు! త్వరపడుడు! త్వరపడుడు!! పిమ్మటసభాధ్యక్షుల గుణగణములను యగళ్ళ జానకిరామయ్య గారు ఆంధ్రపద్యములతో ప్రశంసించిరి. టంకాల సత్యన్నారాయణగారు స్వాగతపద్యములను జదివిరి.

అనంతరము గంజాంమండల ఆంధ్రగ్రంధాలయ సంఘమునకు గౌరవ కార్యదర్శులకు పోతాప్రగడ సింహాచలంగారు ఈసంఘము యొక్క గతసంవత్సర నివేదికను జదివిరి.

పిమ్మట ఈతీర్మానములు చేయబడెను:౼

తీర్మానములు.

౧ ప్రస్తుతము ఐరోపాఖండమునందు జరుగుచున్న ఘోరసంగ్రామమున, మన చక్రవతి౯గారికిని మిత్రమండలివారికిని సంపూణ౯ విజయ సంప్రాప్తి త్వరలో కలుగుగాకయని యీసభవారు పరమేశ్వరుని ప్రాధి౯ంచు చున్నారు. ఈఘోర సంగ్రామమునందు మన ప్రభుత్వమువారు జయమొందుటకు వలయుసాధనసామగ్రిని వీలైనంతవరకు సమకూర్చుటకు సంసిద్ధులైయున్నారు.

౨ గంజాంమండలమందున్న అన్ని పట్టణములందును పల్లెలయందును గ్రంథాలయములను పఠనమందిరములను స్థాపింపవలెనని మండల ప్రజలను యీసభవారు ప్రాధి౯ంచు చున్నారు.

3 ఇప్పటికి స్థాపింపబడియున్న గ్రంధాలయములవారు తమతాలూకాలయందును గ్రామములయందును తాళపత్రాదిలిఖిత గ్రంధములను సంపాదించి తమగ్రంధాలయములయందు భద్రపరచి భాషాభివృద్ధికి ప్రోత్సాహము గలిగింపవలెనని యీసభవారు తీర్మానించు చున్నారు.

౪ ప్రస్తుతము గంజాంమ౦డలమున స్థాపింపబడిన గ్రంధాలయములకును, పఠనమందిరములకును గంజాంజిల్లా బోడు౯వారును, తాలూకాబోడు౯వారును, మున్సిపాలిటీలును ద్రవ్యసహాయము జేయమని యీ సభవారు తీర్మానించుచున్నారు.

౫ పుస్తక భాండాగారములను పఠనమందిరములను ౧౮౬౦ సం॥ ౨౧ నెంబరు యాక్టునుసరించి రిజిస్ట్రీరీ చేయుటకు చెల్లించవలసిన రుసుములేకుండగనే రిజస్టరీ చేయించుటకు ప్రభుత్వమువారిని యీసభవారు ప్రార్థించు చున్నారు.

౬. దొరతనమువారిచే ప్రచురింపబడు వ్యవసాయిక, పాశ్రామిక, ఆరోగ్యవిషయిక ప్రచురములన్నిటిని జిల్లా గెజటులను, ఆంధ్రభాషయందు ముద్రింపబడు గ్రంథపట్టికలను, ఆంధ్ర దేశమునందు మండల గ్రంథాలయములన్నిటికిని ఉచితముగా దయచేయించమని ఈ సభ వారు ప్రభుత్వమువారిని ప్రార్ధించు చున్నారు.

౭ గంజాం మండలమునందలి అన్ని గ్రంథాలయములవారు ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘమువారి పక్షమున ప్రచురింపబడుచున్న గ్రంథాలయ సర్వస్వమును తెప్పింపవలెనని ఈ సభవారు కోరుచున్నారు.

౮ గ్రంథాలయోద్యమము ప్రోత్సాహముజేయునుద్దేళముతో ఆంధ్ర దేశమునందుగల పదునొకండు జిల్లాలలో స్థాపింపబడిన పదునొకండు కేంద్ర గ్రంథాలయములకు శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండుసన్సువారు తాము ఇదివరలో ప్రచురించినట్టియు ప్రచురింపబోవు నట్టియు గ్రంథములన్నిటిని ఉచితముగా నొసంగనున్నందులకు సభవారు కజ్ఞతాపూర్వక వందనము లొనర్చుచున్నారు.

౯ వ్యవహారమునందును, సంభాషణయందును, ఉత్తరప్రత్యుత్తరములయందును, ఆంధ్రు లందరు ఆంధ్రభాషకు ప్రాముఖ్యత నొసగవలెనని ఈ సభ వారు తీర్మానించుచున్నారు.

౧౦ ఆంధ్రమండలమందు ఉన్నతవిద్యను వ్యాపింపజేయుటకు విజయనగరమునం దేర్పడియున్న ఆంధ్ర ​విద్యానిలయమునకు ప్రోత్సాహకరముగా ఈ మండలి గ్రంథాలయములు తగురీతిని తోడ్పడవలెనని ఈ సభవారు తీర్మానించు చున్నారు.

౧౧ గజా౦మండల ఆంధ్రభాండాగార సంఘమునకు, ఈ సంవత్సరమునం దీదిగువ నుదహరింపబడినవారు కార్యనిర్వాహక సభ్యులుగ నెన్నుకొనబడిరి.

అగ్రాసనాధిపతి:—వరహగిరి వేంకట జోగయ్య పంతులుగారు, బరంపురం.
ఉపాగ్రాసనాధిపతి:— గరిమెళ్ళ సీతారామమూతి౯ పంతులు గారు, సోంపేట
ప్రధానకార్యదర్శి:—పోతాప్రగడ సింహాచలంగారు, బరంపురం

సంచారకార్యదర్శులు:౼

౧ తిత్తి బలరామయ్యగారు, ఛత్రిపురం బిరిడి తాలూకాలు;
౨ మద్దూరి సూర్యనారాయణరావుగారు, బరంపురం గుంసూరు తాలూకాలు;
3 టంకాల సాంబమూతి గారు, టెక్కలి, సోంపేట, పర్లాకిమిడి తాలూకాలు;
౪ పొట్నూరు స్వామిబాబుగారు, శ్రీకాకుళం నరసన్న పేట తాలూకాలు; ఇంకను
౧౨ గురు సభ్యులు.

అంతటితో ప్రాతఃకాల సభ ముగిసెను. తిరిగి మధ్యాము 3 గంటలకు సభ ప్రారంభ మాయెను.

బుర్రా శేషగిరిరావుగారు ఆంధ్రభాషావ్యక్తిని గూర్చియు, గిడుగు సీతాపతిరావుగారు “ఛందస్సు” ను గూర్చియు గంబీరపన్యాసలొసఁగిరి. కాకరపతి౯ జగనాధశాస్త్రిగారు ఆంధ్రభాషనుగూర్చిన పద్యములను జదివిరి.

సభాధ్యక్షులు తమ అఁత్యోపన్యాసమున గ్రంథాలయోద్యమమునందు పలువురు శ్రద్ధబూని కృషిజేసి మాతృభాషాభివృద్ధికి బద్ధకఁకణులయి యుండుమని ప్రజలను ఉత్సాహపూర్వకముగ నుపన్యసించి విశాఖపట్న మునందు ఒరగు అంధ్రదేశగ్రంథాలయ మహాసభకు ప్రతినిధులను విచ్చేయమని ఉద్భోధించిరి. విజయనగరములో స్థాపించిన విద్యానిలయపక్షమున గజాంమండలములో నున్న గ్రంథాలయముల స్థానములఁదు ఉపన్యాసము లొసగుటకు బుర్రా శేషగిరిరావుగారు, భోగరాజు నారాయణమూతి౯ గారు, దయతో నంగీకరించిరి.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse