Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/అనవేముని ఉప్పుగల్లు శాసనము

​

అనవేముని ఉప్పుగల్లు శాసనము

శాసనస్వరూపము — ఇది మూఁడంగుళములనర వెడల్పు, పదియంగుళములనర పొడుగుఁగల రాగి రేకులు నాల్గింటిపై రెండు వైపుల వ్రాయఁబడినది. నాల్గురేకులకొక రంధ్రము చేయఁబడి యందొక వలయము వేయఁబడినది. వలయాగ్రముననున్న ప్రతిమ గుఱుతింప వీలుకానంతగ నరిగిపోయినది. ఈ శాసనము కృష్ణాజిల్లా మంతెనలో భూమి త్రవ్వుచుండ నేలలోఁ దొరకినది.


శాసనభాష——శాసనమంతయు శోకములతోఁ గూడియున్నది. గ్రామపు హద్దులు మాత్రము తెలుఁగు భాషగను మిగిలిన గ్రంథమంతయు సంస్కృతముగ నున్నది. లిపియని తల్లి కలువచేరు శాసనము లిపికంటె నించుక మోటుగ నున్నది. పూర్ణానుస్వారము పూర్వమందుఁ గల వర్ణములకు ద్విత్వము కలదు. ద వర్ణము డ వర్ణముగను, థ వర్ణముగను, ద వర్ణముగను వ్రాయబడియున్నది. ఈ యను వర్ణము "ర్గ" అని వ్రాయఁబడినది. గుడికి దీర్ఘము, ఏత్వము ఓత్వములకుఁ బొల్లులు లేవు. వ వత్తు ప వత్తువలె నున్నది. భ ఛ ధ లోనగు వర్ణములకు నొత్తులు లేవు. వలపలగిలక రేఫ వత్తునకు మాఱు వాడఁబడినది. ట వర్ణము తలకట్టులేని డ వర్ణముగ నొత్తు పైనిఁగలిగియున్నది. ప్రతాపరుద్రుని నాఁటి శాసన లిపియు నీలిపియు సమానముగ నున్నది. హద్దులలోనున్న వెలంగపదము వృక్షవాచకమె యైనయెడ నర్ధానుస్వారము చింత్యము. పుట్టియనునది దేవళమునకుఁ బర్యాయపదముగ నున్నది. ఇది గ్రంథస్థరుగు నర్థమని తోఁచదు. “తెగువుమోచ” ఆను పదమునందలి “మోచ" శబ్దమున కర్థము తెలియరాదు. శ్రీనాధకృతమగు పిరంగిపుర శిలాశాసనములోఁ బ్రకృతశాసములోని రెండు ధ్యానశ్లోకములు కానవచ్చుచున్న వి.

శాసనచరిత్రాంశము - శూద్రవంశము (చతుర్థవంశము) పవిత్రమైనది. అందుఁ గాలక్రమమునఁ బ్రోలరాజు జనించెను, ఆయనకు, అహోబిలమునకు శ్రీశైలమునకు సోపానములు నిర్మించిన వాఁడును. వీర నారాయణ బిరుదాంకితుఁడును. కుండి, కృష్ణా, గోదావరీ తరంగణులకు భయతటముల బ్రాహ్మణుల కగ్రహారము లొసంగినవాఁ

​డు నగు వేరు భూపతి జనించెను. ఆయన కనపోతభూపాలకుఁడు, అన్న వేమనృపతి యను నిరువురు పుత్రులు జనించిరి. అన్న వేముఁడు జగరక్షపాల బిరుదాంకితుఁడు. అన్నయగునన్న పోత భూపుని యనంతర మన్న వేమనృపతిరాజ్యము (పైతృకము) పరిపాలించెను. ఇతఁడు పూర్వనృపాల దత్తములగు నగ్రహారములు మ్లేచ్ఛులచే నపహరింపఁబడ వానిని దిరుగ సాధించి బ్రాహ్మణుల కొసంగెను. పూర్వరాజులచే నపహరింపఁబడి భాగములు చెడిన “ఉప్పుగల్లు" అను గ్రామము నియన శా.శ.౧౨౯౩ సరియగు క్రీ.శ. ౧3౭౧ సంవత్సరమున బ్రాహ్మణుల కగ్రహారముగ నొసంగెను. శాసన రచయిత అన్న పోతభూపుని యాస్థాన కవియగు బాలసరస్వతి.


చరిత్రపరిశీలనము — కాకతీయుల పరిపాలనమున కనంతరము రాజ్యము కల్లోలమైనది. మ్లేచ్ఛాదులు విజృంభించి పరరాజ్యములు నాక్రమించిరి. అత్తణీ సామ్రాజ్యము స్థాపించినవారిలో వేమారెడ్డియొకఁడు. ఈయన యద్దంకి రాజధానిగఁ బూంగిదేశముఁ బాలించెను. పూర్వము వంగవోలు తాలూకాలోని కొంత భాగమునకుఁ బూంగి దేశమని పేరుండెనేమో. కొండవీటి కైఫీతులో, నీవేమభూపాలుఁడె కొండవీట సామ్రాజ్యము స్థాపించినట్లు - ధరణకోట త్రవ్వి కొండవీటిలోఁ బుట్టకోటఁ గట్టినట్లు - అంతకుమున్నా భాగముఁ బౌలించు కాకతీయుల వధించినట్లు - చెప్పఁబడెనేగాని యిది యదార్థముని తోఁచదు. గోదావరి మండలస్థుకు నొక శాసనవలనఁ బ్రోలయ వేముని పుత్రుఁడగు సన్న వేముఁడె కొండవీట సామ్రాజ్యము స్థాపించినటుల

“తతోన్న వేమనృపతిః ... అపొలయత్
కొండవీడుంరాజధాని౦, సతిచిత్రమకల్పయత్"

తెలియవచ్చుచున్నది. కైఫీతువ్రాసినవారు అన్న వేముని ప్రోలయవేమునిగ భావించి యటులవ్రాసియుందురు. ప్రోలయ వేముఁ డద్దంకి రాజధానిగఁ బాలించినటు లాయన కృతినందిన హరివంశములో

తే.గీ.⁠

  తనకు వద్దంకి తగు రాజధానిగాఁ బ
రాక్రమంబున బహుభుములాక్రమించి
యనుజతనయ బాంధవ మిత్రజనుల కిచ్చె
నెదురె యెవ్వారు నేనుమహీశ్వరునకు,”

⁠


అని మున్నెఱ్ఱాప్రగ్గడ చెప్పియున్నాఁడు. ఈ ప్రోలయ వేముఁడు శ్రీశైలమునకు సహోబిలగిరికి సోపానములు కట్టించినట్లు ప్రకృతశాసనము - అమరుక వ్యాఖ్యా పీఠిక - అనితల్లికలువచేఱుశాసనము - లోనగునవి వాకొనుచున్నవి. అమరావతిలోని యమరేశ్వరాలయ శాసనములోని "బ్రహ్మకుండి కృష్ణ వేణ్ణ గోదావరి మహానది తటద్వయ తన్మధ్యశదత్తానేకాగ్రహారం" అనున౦శము వలన నితఁడు కర్నూలు, కృష్ణా, గోదావరి మండలములు పాలించినటులఁ దెలియుచున్నది. ఈతఁడు క్రీ.శ.౧౩౨౪ మొదలు ౧౩౫౦ వఱకు రాజ్యము చేసినటుల శాసనాధారములవలన స్పష్టమగుచున్నది. ప్రోలయ వేమునకు “అన్న పోతరెడ్డి, అన్న వేమరెడ్డి, కోమటిరెడ్డి యను ముగ్గురు పుత్రులున్న టులును గోమటిరెడ్డి బాల్యముననే గతించినట్లును చరిత్రకారులు నిర్ణయించిరి. హరివంశములోన నన్నపోతరాజొకఁడె ప్రోలయ వేముని పుత్రుఁడని చెప్పఁబడెను. దీనివలనఁ గృతి గ్రహించుతఱికిఁ బోతారెడ్డి యొక్కరుండె తనయుఁడనియుఁ బిమ్మట నన్న వేముఁడు కోమటిరెడ్డి కలిగిరనియు తెలియును. ప్రోలయ వేముని యనంతర మన్నపోతారెడ్డి సైతృకమగు రాజ్యమును శాంతిపాదుకొల్పి క్రీ.శ.౧౩౫౦ మొదలు ౧౩౬౨ వఱకు పండ్రెండు సంవత్సరములు పాలించెను. ఇతఁడు పద్మనాయకులతోఁ బోరినటుల వెలుగోటివంశ చరిత్రము వాకొనుచున్నది. ఈయన పరాక్రమశాలి. అద్దంకియె రాజధానిగా నియనయుఁ బాలించినబుల నమరావతిలోని యీయన శాసనమెండు తెలుపు చున్నది. ఈయన పుత్రుఁడు కుమారగిరి బాల్యముననుంటచేఁ గాఁబోలు నీయనతమ్ముఁడన్న వేమభూపాలుఁడు రాజ్యము వహించెను, ఈయనయే ప్రకృత ధర్మప్రదాత. ఈయనయే కొండవీట సామ్రాజ్యము స్థాపించిన వాఁడు. ఈయనతండ్రి కృష్ణాగోదావరి [1] కుండితరంగి ​ణుల యుభయపార్శ్వముల నగ్రహారము లొసంగినటులఁ జెప్పఁబడుట చేతను - బైతృకరాజ్యమునకె యీయన యాధిపత్యము వహించినటుల వాకొనఁబడుట చేతను - నీయన యన్న కాలము సామ్రాజ్యము విస్తరింపఁబడినటుల కానరాక పిత్రాజి౯తము యధావిధిగా నిలిచినటులఁ దెలియుచున్నది. ఇదియు నొక విశేషమే. అన్న వేమనృపాలుఁడు మ్లేచ్ఛాపహృతమగు నుప్పుగల్లు అగ్రహారము క్రమ్మఱ బ్రాహ్మణుల కోసంగినటు లీ శాసనమునందు వాకొనఁబడుటచే, బ్రకృతో గ్రహారము కాకతీయ సామ్రాజ్యము చెడి రెడ్ల సామ్రాజ్యము స్థిరపడక మున్న మ్లేచ్ఛులు హరించిరని యూహింపనగును. ప్రోలయ వేముని కాలమునుండి యన్న వేముని కాలమువఱకు వీరి సామ్రాజ్యమున మ్లేచ్ఛులు మెదలినటులఁ గానరాదుగాన నీమ్లేచ్ఛాహరణము క్రీ.శ. ౧౩౧౦ ప్రాంతము లోనిదై యుండును. అన్న వేమ నృపాలుఁడు ధర్మాత్ముఁడనియుఁ బరాక్రమశాలియనియు బండితశిఖామణియనియుఁ బ్రతిశాసనము వాకొనుచున్నది. కాని కొండవీటిదండకవిలె యీతఁడు దుష్కృత్య మొనరించినటులను దండ్రితాతల గౌరవము చెఱచినటులు తెలుపు చున్నది. ఇది యెంతవఱకు విశ్వసనీయమొ తెలియదు. ఈయన వసంతోత్సవము లెక్కుడు గావించుటచే వసంత రాజను బిరుదము దాల్చి నాట్యశాస్త్ర మొండు రచించి దానికి వసంత రాజీయమని నామమిడెను. ఈయనను గుఱించి విశేషాంశములు తెలియరావు. క్రీ.శ. ౧౩౬౨ మొదలు ౧౩౮౦ వఱకు నీయన రాజ్యము పాలించినటు లితరాధారములు తెలుపుచున్నవి. ఈ నృపుఁడు జగనబ్బగండ, జగరక్షపాల, వీరనారాయణాది ఔరుదములదాల్చి రాజ్యము పాలించుచు, ప్రకృతధర్మము క్రీ.శ.౧౩౭౧ లో నొనరించెను. తుదకీ నరపాలుని బద్మనాయుఁడగు లింగమనాయఁడు చంపి సింహతలాట బిరుదమందినటుల వెలుగోటి వంశచరిత్రమునఁ గలదు. అందాధారముతో నిరూపింపమి యథార్థమిదియని విశ్వసింపవీలు కానరాదు. అన్న వేమనృపాలుఁడు స్వల్పకాలమే రాజ్యము పాలించుటయుఁ బద్మనాయకులకు రెడ్డివారికి విరోధములుండుటయుఁ జూడ నిజము కావచ్చునని తలంతుము. శాసన గ్రంధకర్తయగు బాలసరస్వతిని గూర్చి విశేషాంశములు తెలియరావు. పరిగ్రహణ గ్రామము నిరూపింప నాధారములు చిక్కమి నావిషయము పాఠకులకె వదలుచున్నారము.

- శేషాద్రిరమణకవులు, శతావధానులు.

అన్న వేముని ఉప్పుగల్లు శాసనము

ప్రధమ పక్త్రము. మొదటివైపు

౧. కళ్యాణం జగతాం తనోతు సవిభుః కాదంబినీ మేచకః | క్రీడాక్రోడ
౨. తనుఁపయోధిపయసోవిశ్వంభరాముద్వహత్ | భాగాపేతఫణొని
3. వర్తన వశాన్మోదాయయస్యాభవ | న్నిరత్నాభుజగేంద్రమౌళిమణి
౪. భినీ౯రాజనప్రక్రియా | తమోహరేతాంతవ పుష్పవంతౌ రాకాను పూ
౫. ర్వాపరశైలభాజౌ | రథాంగ్గలీలామివ దర్శయంతౌ పురాపు
౬. రారేః పృథివీరథస్యః సమాత్య కిరీటరత్నకలికా పుంజేనకింజ
౭. ల్కినోవాహిన్యామకరందినో దీనిషదాం వేదైస్సదా మోదినః | పాదా
౮. బాదవతారితా మధుకరశ్రేణీవ లక్ష్మీపతేసౌభాగ్యా యమహీభువా
౯. O జాతిశ్చతుర్థీ౯వరా ॥ కాలక్రమేణో ధబభూవత స్యాంప్రోల
౧౦. క్షితీశోబుధకామ్యసిద్యైః స్వచ్ఛాయయాతాపహ రోజనానాంపయ

రెండవవైపు

౧. పయోదావివపారిజాతః | తస్మాద్వేమమహీపాలో వీరనారాయణః ప్ర
౨ భుఃజాతో ధర్మప్రతిష్ఠాయైపురానారాయణో యథా ౹ వేమక్షితీశో ​
3. వృషమేకపాదంఖంజప్రచారం కలికాలదోషాత్ | దత్తాగ్రహారద్విజవేదశ
౪. క్యపదక్రమైరలించకార॥ స్తంభాత్ కీర్తికృతే ? సృజంత్యకుశలాభూమి
౫. శ్వరానశ్వరా ౹ న్ని స్సామాన్యకృతిర్యనిర్మలనుతి శ్రీ వేనుపృధ్విపతిః | యేన
౬. శ్రీగిరిరప్యహోబలగిరి స్సోపానమార్గాకితౌ | విఖ్యాతౌర
౭. చితౌసనాతన యశస్తంభావళింభూతలే ౹౹ ప్రాదాత్కుండితరంగిణీ
౮. ముభయతః కృష్ణాంచగోదావరిం విప్రేభ్యః కిలవేమభూతలపతి
౯. స్సారాగ్రహా౯బహూత్ | నైతచ్చిత్ర మనన్యరాజసుకరం నిస్సీను
౧౦.దానంభువోయేన బ్రాహ్మణజాతిమాత్ర సులభోవృత్తిః కృతాపణ్యతే ?

ద్వితీయ పక్త్రము. మొదటివైపు

౧. యత్కీర్తిలోలమనసామురగాంగనా నామాలోకితుం చముఖరాగమనం
౨. గ్లమూలంశ్రోతుంచ గీతరచనాంసమమప్రగల్భోన సహతేనయ
3. శ్రుతిత్వం | తస్మాచ్చవేమనృపతే రుదయాదివాద్రే | రా తాప్రతాపవరకీర్తినిధీ
౪. కుమారౌ ౹ నూర్యేందుతుల్యమహసావన పోత భూప శ్రీయన్నవేమనృపతి
౫. రగరక్షపాలః | జిత్వా శ్రీయనపోతభూతలపతిర్వీరా నరాతీ౯, బలాదాకృష్ణా
౬. తటినీతటిద్భువమవత్యాగౌతమీప్రోతసః । ఆవింధ్యా దితియత్కవీంద్ర
౭. వదనంయస్యాపదానస్తుతౌ ప్రత్యబ్దంప్రతిపక్షదేశజయి నస్తత్పూర్వపక్షాయి
౮. తం౹౹ రక్షోనూనమసావశోక విటపిర్నీలస్తమాలః పురాగౌరశ్చంపక భూరుహా
౯. కుసుమితశ్చూతళ్ళుకశ్యామలః | ఏవంవేమయఅన్న పోతనృపతేః కీర్త్యాసితా
౧౦. నాంవనేభాలేభ్యోబహుధావదంత్తిశఖరా ప్రాచీద శాంశాఖినాం | తస్యా ౼


రెండవవైపు.

౧. నుజస్తామరసాయతాక్షశ్రీయన్న వేమక్షితిపాలరత్నం సారాగ్ర
౨. గణ్యఃక్షురికాసహాయోవిభాతి వీరాహవపారదృశ్వా ॥ సోయంభ్రా
3. తురనంతరంనిజమహీభారంవహ౯పైతృకంగాజ్యశ్రీ రమణిస్వయ
౪.౦వరపతిశ్రీయన్న వేమప్రభుః | పూర్వం మ్లేచ్ఛనృపా లక్షైర పహృతా౯
౫. శిష్టాగ్రహారా౯ బహూ౯దాతుంకౌతుకవా నుదార చరితోజా
౬. గర్తిలోకోత్తరః ౹ శాకాబేగుణరత్న భాస్కరమితే రాదేశశాంకగ్రహేస్రాదా
౭. ద్వేమయఅన్న వేరునృపతిః శ్రీవీరనారాయణః | గ్రామంపూర్వ నృపాలకైర
౮. పహృతంవిచ్ఛిన్నభాగం చిరాద్వి ప్రేభ్యః పునరిప్పుగల్లురితీయోనామ్నాజ
౯. నైకీర్తితః | అధగ్రామస్య ప్రతిగ్రహీతారః | భారద్వాజగోత్రో మంచెన

తృతీయ పక్త్రము. మొదటివైపు

౧. సోమయాజి | అల్లాడసోమయాజి కేశవార్యః | దేవనార్యః | సాగి
౨. నార్యః। కొమ్మనార్యః | కామనార్యః |సార్ధభాగి | సింగవార్యః | ఏతేభరద్వాజ గో
3. త్రాః పండె నార్యః | రుద్రయభట్టః ద్విభాగి | కృష్ణుయార్యః | పెద్ద నార్యః | కొమ్మయా
४. భట్టః | భాస్కరార్యః | ఏతేకాండిన్యగోత్రాః | కూచేనార్యః | దామయార్యః। మం ​
౫.చెనార్యః | పెద్దనాగ్యః | కారనార్యః | దేవనార్యః | ఏతే కౌశికగోత్రాః | వీ
౬.రయార్యః | మారయార్యః | కందర్భార్యః | అప్పయ్యార్యః | మల్లుభట్టః సూ
౭.రయార్యః । పెమ్మయార్యః | భ్రమ్మయార్యః | ఏతే కాశ్యపగోత్రాః| వల్లభార్యః
౮.కూచెనార్యః । దండెనార్యః | కొమ్మనార్యః | దేవనార్యః | దేవ నార్యః | గంగ నార్యః॥ నె
౯.ద్దిభట్టః | కామనార్యః | లింగయభట్టః| గంగ నార్యః | లక్కి నార్యః। ఆ

రెండవ వైపు

౧.న్నయాూర్యః | పెరుమాండిభట్టని | చతుర్భాగి/ విశ్వేశ్వరార్యః |ద్విభాగిః | లింగ్ల
౨.నార్యః | సార్థద్విభాగి | వెన్నయార్యః | ద్విభాగి | ఏతే హరితగోత్రాః | పోత
3.త్రాః | అన్నయభట్ట / ప్రోలయార్యః | మల్లయార్యః | ఏతే శ్రీవత్సగో
४.త్రాః| అన్నయార్యః| తదితరత్రాః। అన్నయార్యః |మల్లయార్యః| ఎతౌ పు
౫.రుకుత్సగోత్రాః | అన్నయార్యః | మైత్రావరుణగోత్రః | నాగయార్యః
౬.గార్ద్యగోత్రః | గుండె నార్యః | దేవరాత గోత్రః | మాధవార్యః | భార్గవగోత్రః
౭.త్రః। కొమ్మనార్యః | భారద్వాజ గోత్రః। దేవనార్యః | తిప్పనార్యః | ఎతే కౌశికగొత్రే
౮.ఎతేసశుభాగినః | భాస్వద్భిర్ద్విజరాజైశ్చ | కవిభిర్గురు భిర్యతః | భూసు
F.రాణాం సమూహేయం | మత్యే? తిరుగుతాంసభాం |ధర్మోవిరాజితేయేషా

చతుర్థపత్రము మొదటివైపు

౧.మానసందుర్గమాశ్రితం | ఆరివర్గ దయామ్మక్తానియమాది బలాన్వితః
౨.కాంతినిర్మలచిత్తానాం యత్రభూమిసుపర్వణాం | ఆనుగ్రహపలైద్రష్టశా
3.పోస్తత్యనుమీయ్యతే | అధగ్రామస్యసీనూచిహ్నని తూర్పునకు కొలనుగుండు
౪.ఆగ్నేయానకు కనుమేఱు | దక్షిణానకు భీమరధి అందుండి ఉత్తరం ముఖ
౫.మైకునిపడిపోయికలు? కంభంసీమగాను బెజవాడ తెరువుమోచె
౬.నైరృతికి మల్లేశ్వరదేవరపుట్టి | పడమటపోతుగట్టు | పడమటికి దేచు
౭.కుంట పడమటిగట్టు | వాయువ్యానకు ఆలకోడు | ఉత్తరానకు నూనె
౮.కుంట ఉత్తరపుగట్టు | ఈశాన్యానకు వెలంగగట్టు | ఎతేషాం మధ్యవర్తి
౯.క్షేత్రం॥ సామాన్యోయంధర్మసే?తుః నృపాణాంకాలే కాలే పాల

రెండవ వైపు

౧.నీయోభవద్ది ధవరి | ఆత్తంసర్వంభావినోపార్ధివేంద్రా౯ | భూయోభూయో
౨.యాచతే రామచంద్రః ౹౹ ఏకైవభగినీలోకే సర్వేషానుపి భూ భుజాం
3.నభోగ్యానకరగ్రాహ్యానిప్రదత్తా వసుంధరా| శత్రుణాపికృతాంధ
౪.ర్మంపాలనీయః ప్రయత్నత | శత్రురేవహి శత్రుస్యాధర్మశత్రుర్నక
౫.స్యచిత్ ౹౹ స్వదత్తాద్ద్వగుణంపుణ్యం పరదత్తానుపాల నం| పర
౬.దత్తాపహారేణ స్వదత్తం నిష్పలంభ వేత్ | స్వదత్తాం పరదత్తాంవా
౭.యోహరేతవసుంధరాం | షష్టివర్ష సహప్రాణివిష్ఠాయాం జా
౮.యతేక్రిమిః | అన్నపోత నరేంద్రస్య విద్వా౯బాలసర స్వతి | ఆకరో
౯.దాకరోవాదాం? నిర్మలంధర్మశాసనం మంగళమహా శ్రీశ్రీశ్రీ...

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse

  1. ↑ కుండితరంగిణి=గుండ్లకమ్మ.