గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/గ్రంథాలయోద్యమ వ్యాప్తి
గ్రంథాలయోద్యమ వ్యాప్తి.
౧౯౧౪ సంవత్సరమున ఏప్రియలు యందు బెజవాడలో శ్రీ రామమోహన గ్రంథాలయసభ్యులు గ్రంథాలయసభను సమావేశము గావించినప్పుడు ఆసభలన కలుగు ఫలిములనుగూర్చి పలువురు పలువిధములుగ తమతమ సందేహములను వెల్లడించిరి. కొందరు పరిహసించిరి. కాని ప్రారంభించిన వారు పట్టుదలతో దైవముమీద భారమువైచి తమసంకల్పమును నెరవేర్చుకొనిరి. అప్పటి నుండీయు ప్రతిసంవత్సరమును గ్రంథాలయసభ లత్యుత్సాహముతో జరుగుచున్నవి.
ఈ సభలకు వచ్చుయు ప్రతినిధులు దేశాభివృద్ధికి పాటుపడుటకై ఏక్షవహించిన యువకులై యున్నారు గాని తతిమ్మాసభలకు వచ్చెడు ప్రతినిధులవలె కోర్టులలో పనిచేసిచేసి సెలవులలో అసభలయందు తమవాక్ళూరత్వమును వెల్లడిచేసి కాలము పుచ్చుచున్న వారు కారు. కనుక నే ఈసభ యందు చేయబడిన తీర్మానములు సక్రమముగ నారణలో పెట్టబడుచున్నవి. తీర్మానముల ననురించి ఈ సభ ప్రతినిధులు ఆంధ్రదేశమంతయు ప్రచారముచేసి ఆసేక గ్రంథాలయములను దర్శించి తగు సలహాల నొసంగుచు పలువిధముల గ్రంథాలయోద్యమమును వ్యాపింపజేయుచున్నారు.
మనదేశమందలి గ్రంథాలయాభివృద్ధిని గూర్చి బరోడా గ్రంథాలయశాఖాధ్యక్ష్యులు సంతోషించి ఇందునుగూర్చి విపులముగ తెలిసికొని ప్రోత్సాహించుచున్నారు. భారతవర్షమున వారితరువాత గ్రంథాలయోద్యమ విషయమైన కృషి చేయుచున్నది ఆంధ్రులొక్కరే. కనుకనే బరోడావా రియుద్యమము ఇచటమాత్రమే ప్రబలుటను చూచి తగిన సలహాలనిచ్చుచున్నారు. ఈ యుద్యమమును గూర్చి దూరముననున్న బరోడావారు అట్టిశ్రద్ధను వహించుచుండగా మన పెద్దవారు (నాయకులని పిలిపించుకొనుటకై ప్రయత్నము చేయుచున్నవారు) మాత్రము తగినంతవరకు ఆదరించకపోవుట కడుశోచనీయముగ నున్నది. గ్రంథాలయములు చక్కగ జరుప బడెనేని దేశాభివృద్ధి కవి మూలాధారములగు ననెడి యూహ వారికి కలుగలేదు. అట్టి యుద్దేశము ఎప్పుడు మన పెద్దవారికితట్టునో ఆనాడె మనదేశము బాగుపడును. మనము వైపైని పూతలు పూయుచున్నాము. గోడ ప్రాతది; పునాది లేదు. అట్టిదానికి పేడమెత్తి వెల్లకొట్టుచున్నాము; పెద్దగాలి వీచినచో ఈపెడ, సున్నము, ఆగోడను అపజాలవు. అది కూలును. అటుల అయినది మన దేశము పని. మనదేశమునందు జీవము లేదు. కృశించియున్నది. కనుక మొదటి నుంచి పునాది వేయుట ప్రారంభించవలయును. అట్లు చేయక దేశీయమహాజనసభను, 3౦ ఏండ్లు కాదు, ౬౦ సంవత్సరములు చేయుడు. రాజధానీసభలను చేయుడు. శాసననిర్మాణ సభలలో పెద్దలను నూరుమందిని కూర్చుండబెట్టు ప్రయోజనము నున్న. ఇందులకై చేయు ప్రయత్నములు నిరర్ధకములు. అందులకై వెచ్చించు సొమ్ముగంగలో బోయుట యగుచున్నది. మహాసభలయందు నమ్మకమున్నవారు నూటికి ఒకరైన కలరా? వదల జాలకయు, పునాదినుంచి ప్రారంభించు ఓపికలేకయు, అవస్థపడుచున్నారు. ఈలోపములను గ్రహించియే గోపాలకృష్ణ గోఖలే గారు ప్రారంభోచిత నిర్బంధ విద్యాపౌరశాసనమును ప్రవేశపెట్టను. ప్రభుత్వమువా రంగీకరింపలేదు. పోనించు, మనకర్తవ్యమును మనము నెరవేర్చుటకై ప్రయత్నించెదము. ప్రభుత్వమువారు మనకు పన్నులువేసి చేసెడిపని మనంతట మనమేల చేయకూడదు. కనుక ఆపనిని చేయబూచెదము.
దేశములో చదువుకొన్నవారికి ముందుగ చదువునందుదిభిరుచి కలిగించెదము. చదువుమానినతోడనే పల్లెటూరికాపు మొదలుకొని బి.ఏ. ప్యాసయిన యానితరువాత పుస్తకములను మూలను వైచి తర్వాత ఎప్పుడుయినను పుస్తకము తెరచిన పాపమునపోరు. పల్లెటూరువారు ఏపార్టీలతో ఏతప్పుసాక్ష్యములతో ఏజూదములతో ఏవ్యాజెృములతో తమశక్తిసామర్థ్యములను, ధనమును, విద్యను థారవోయుచున్నారు. ఇకను బి.ఏ. స్యాపయిన యాతడన్ననో గాపువానికంటె బుద్దిశాలి కాదు. ఏడస్కుబల్లయొద్దనో కూర్చొని కాలము గడుపుచు రూపస్థమండూకమువలె తనజీవయాత్రను గడపును. వీరిద్దరికి ఇట్టిగతి పట్టుటకు కారణమేమి? చదువుకొనుటకై తగిన యవకాశములు లేకపోవుట చేతనే. గ్రంథలయమును ఎప్పుడు దర్శించెదరో అప్పుడే, వీరి మనసులు లు జ్ఞానవంతములగును. ఈ మార్పు గ్రంథాలయములను విశేషముగ దర్శించువారికి స్పష్టముగ తేటపడును. అట్టిమార్పు కలుగని మూఢులులేరని నేను చెప్పజాలను గానీ, అప్పుడగూడ వారికి విద్యయందభిలాష కలుగదేని వారిగతి ఆధోగతియని చెప్పనగును.
ప్రతిగ్రంథాలయమునకును చందాలిచ్చు సభ్యులున్నారు; పనిచేయువారలు కొందరున్నారు. ఈపని చేయువారలు చాలమంది . నిరుద్యోగులైయున్నారు. వీరు తీరికచేసికొని కొందరు బీదలకు చదువు చెప్పవచ్చును. క్రిస్తవమత ప్రచారకుల సంఘమువారు, ఊరికొక బడిపెట్టుచున్నారు. అంతయు వారిదాతృత్వపనుకొని మోసపోవుచున్నావారికి ఈపాఠశాలవలన ఎంతవ్యయనుగుచున్నదో లెక్కచూడడు. బహుస్వల్పము. వారు ఖర్చుపెట్టు సొమ్ములో చాలభాగము ప్రభుత్వము వారినుండి గ్రాంటులు రూపమునవచ్చును. కనుక మనముగూడ శక్తికొలని ప్రయత్నించి గ్రంథాలయముల పక్షమున పాఠశాలలను గూడ స్థాపించవలయును. ఈపాఠశాలల ద్వారా చదువుగానివారికి విద్యాదానమును చేయవలయును. కేవలము నాలుగు పుస్తకములనొకమూల పెట్టుకొని కూర్చుండినచో లాభములేదు. గోపాల గోకలే గారి జ్ఞాపకార్థము చెన్నపట్టణములో నొక హమును వేయించినంత మాత్రమున ఆయనయాత్మ శాంతికలుగదు. దేశములో నెల్లెడల విద్యావ్యాపచేయుటయే ఆయన స్మరణచిహ్నమును నెలకొల్ప ఇట్టియత్కృష్ట కార్యమును చేయుట కవకాశము కనుకనే ఈ యుద్యమము దేశాభివృద్ధికి అత్యవసరమనిచెప్పా సాహసించుచున్నాను. ఆంధ్రదేశమున ౪౦౦ గ్ర౦థాలయముల యభివృద్ధికై పాటుపడువారి సంఖ్య ఆధమము ౪౦౦ ల కంటే తక్కువయుండఁదు. ఈ నాలుగువందల మంది సాధారణముగ ఉత్సాహఃవతులును, దేశసేవాతత్పరులును, అగు యువకులైనన్నారు. వీరికి మరియొక పనియేమియు లేదు. వీరియదర్శమొక్కటియే. వీరి యూహ యొక్కటియె ఇట్టి దేశారాధనపరులయొక్క శక్తిని ఫలవంతముగ చేముటకై దేశీయులెల్లరు ప్రయుత్నించవలయును. స్థానబలిమి యుండుటవలన వీరు పల్లెటూళ్ళయందు ఎక్కువపనిజేయుట కవకాశములు కలవు. ఎవరో ముఖమెరుగనివారు వెళ్ళి ఎన్నియుపన్యాసము లిచ్చినను వారికి రుచింపదు. కావున ఈ ౪౦౦ ల మందికి తగినశిక్షు నొసంగి వారియొక్క దేశాభిమానమును పల్లెటూరి జనులయందు జ్ఞానాభివృద్ధిని చేయుటయందు వినియోగించినచో, అద్భుతమైన అభివృద్ధి కన్పింపగలదు.
ప్రతిగ్రంధాగారమును పాలించుటకై కార్యనిర్వాహకసంఘముగలదు. ఈ కార్యనిర్వాహక సంఘములు గ్రంథాలయములయొక్క పరిపాలన సరిగా చేయుట ఎప్పుడు సంభవించునో అప్పుడే స్వపరిపాలనశక్తి లభించుచున్నది. గ్రంథాలయమున్నచోట పరపతి సంఘమును అవసరమైన ఇతర ప్రతిష్టాపనలకు గూడ స్థాపించుట మిక్కిలి సులభమగుకార్యము.
కావున, దేశప్రముఖులారా ! దేశముయొక్క స్థితి నారయుడి! పునాదినుండి దేశముయొక్క స్థితిని బాగుపరచుటకై ప్రయత్నింపుడి! ఈవత్సరము మే నెలలో విశాఖపట్నంజిల్లా అనకాపల్లియందు ఐదవ ఆంధ్రదేశ గ్రంథాలయప్రతినిధుల మహాసభ జరుగనున్నదిగదా! అప్పుడు, దేశప్రముఖులందరును విచ్చేసి ఈయుద్యమము దేశమును ఇంకను ఎక్కువ ప్రకాశవంతముగ చేమనటుల చేయుదురుగాక.
- గోపరాజు బ్రహ్మానందము.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse