గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/గంజామండల గ్రంథాలయ సంఘము
గంజాం మండల గ్రంథాలయ సంఘము
౧౯౧౭ సంవత్సరమున నవంబరు తే ౧౭ దీని ఛత్రపురమునందు జరిగిన గంజాంమండల గ్రంధాలయ సంఘ కార్యనిర్వాహక సభయందు చేయబడిన తీర్మానములు:-
౧ ఈ సంఘము పేరు “గంజాంమండల ఆంధ్రగ్రంధభాండాగార సంఘము"
౨ కార్యనిర్వాహకుల విధులు: -
అధ్యక్షుడు — ఈతడుభాండాగార సంఘమును సదాపాలించుచు కార్యనిర్వాహక సంఘమువారు చేయు కార్యములను లేఖలను అప్పుడప్పుడు పరీక్షించుచు లోపములున్న యెడల కార్యనిర్వాహక సంఘమువారితో నాలోచించి ఉచితరీతిని జరిగించుచుండవలయును.
3 ఉపాధ్యక్షుడు:— ఈయన సంచార కార్యదర్శులకు కార్యనిర్వాహకమందు సలహానిచ్చుచు సహాయభూతుడుగా నుండవలయును.
౪ ప్రధాన కార్యదర్శి:— ఈయన మండల గ్రంధాలయమును తనస్వాధీనములో నుంచుకొని ముందుఁ జేయ బోయే నిబంధనలననుసరించి గ్రంధాలయపాలనము చేయవలయును. ఈ సంఘము యొక్క ఆదాయవ్యయములకు సరియయిన లెక్కలనుంచి ఈ సంఘము పక్షమున అవసరమైన ఉత్తరప్రత్యుత్తరములు జరుపుచు ఇదివరలో చేయబడిన తీర్మానముననుసరించి త్రైమాసిక సభలను యేర్పాటుచేయుచు సంఘాభివృద్ధి కవసరమైన అన్ని పనులు చేయుచుండవలయును.
౫ సంచార కార్యదర్శులు: వీరు వీలైనన్ని చోట్ల నూతనముగా గ్రంధాలయములను స్థాపించుచు తమ తాలూకాలోని గ్రంధాలయములను వీలయినంతవరకు మూడుమూసముల కొక సారియైనను తనిఖీ చేయుచు అన్నివిధముల సలహాల నిచ్చుచుండవలయును. కార్యనిర్వాహకసభవారి తీర్మానములను గ్రంధాలయములవారు అమలులో పెట్టునట్లు చూచుచు గ్రంధాలయములనుండి సాంవత్సరిక చందాలను ఉదారవంతులనుండి మండలసంఘ నిధికై విరాళములును వసూలు చేసి ప్రధానకార్యదర్శికిబంపుచు తాము చేసినపనులను గూర్చి మూడు మాసముల కొక రిపోర్టువ్రాసి త్రైమాసిక సభయందు చదువుచుండవలయును.
౬ గ్రంధాలయములు:- ప్రతిగ్రంధాలయమువారును తమగ్రంధాలయము యొక్క త్రైమాసిక నివేదికలను ఆయా త్రైమానిక సభలలో చదువవలెను.
౭ వ్యవహారమునందును సంభాషణయందును ఉత్తరప్రత్యుత్తరములయందును వీలయినంతవరకు ఈసంఘమువారు ఆంధ్రభాషకు ప్రాముఖ్యతనొసగి జిల్లాలోని గ్రంధాలయముల సభ్యులు గూడ తమ్ము అనుసరించునట్లు చేయవలయును.
౮ గ్రంధాలయములయందుంచవలసిన పట్టికలనుగూర్చి గ్రంధాలయ సర్వస్వముయొక్క ప్రధమ సంపుటము నాల్గవభాగములో దెలుపబడిన నమూనాలను ఈమండలములోని గ్రంధాలయములవారు యెంతవరకు అనుసరించుటకు సాధ్యమగునో సంచార కార్యదర్శులు కనుగొని రాబోవు త్రైమాసిక సభయందు తెలియపర్చవలయును.
౯ రాబోవు త్రైమాసిక సభను గూర్చి నరసన్న పేట నుండి తంతివార్తమూలముగా పంపబడిన శ్రీ పొట్నూరి స్వామి బాబుగారి యాహ్వానము అంగీకరించడమయినది.
గంజాంమండల గ్రంథాలయ సంఘము
౧౯౧౮ సంవత్సరం మార్చి నెల ౨౪ తేదీన నరసన్నపేట శ్రీ నాగేశ్వరరాయ గ్రంథాలయమందిరమున ద్వితీయసభ జరిగింది. వరహగిరి వేంకటజోగయ్యపంతులుగారు అధ్యక్షత వహించిరి.
ప్రధమమున ప్రధానకార్యదర్శులకు పోతాప్రగడ సింహాచలంపంతులుగారు మూడుమాసముల కాలములో సంఘముయొక్క ఆదాయవ్యయములపట్టికను, జదివి గ్రంథాలయోద్యమమును గూర్చి మండలవాసులకు గలిగిన అభిమానమును గూర్చి ముచ్చటించిరి. పిమ్మట తాలూకాసంచార కార్యదర్శులకు పొట్నూరి స్వామిబాబు, తిత్తిబలరామయ్యగార్లు గతమూడు మాసములలో వారి వారితాలూకాలలోనున్న గ్రంథాలయములను తనిఖీ చేసిన కార్యనివేదికలను చదివిరి. అనంతరము యీదిగువ బేర్కొనిన గ్రంథాలయకార్యదర్శులు ఆయాగ్రంధాలయముల కార్యనివేదికలను చదివిరి:-
౧ ఆంధ్రభాషాభివర్ధనీ సమాజము (బరంపురం) ౨ యువజన సమాజము (బరంపురం) 3 బ్రాడ్లే పుస్తకభాండాగారము (గోపాలపురం) ౪ శ్రీరామకృష్ణ గ్రంథాలయము (ఇచ్ఛాపురం) ౫ శ్రీజగన్నాధ గ్రంథాలయము (నువాషడ) ౬ శ్రీకృష్ణ దేవరాయ గ్రంథాలయము (బారువ) ౭ శ్రీచంద్రశేఖర గ్రంథాలయము (పలాస) ౮ కాళిదాస గ్రంథాలయము (టెక్కలి) ౯ బాలకల వర్థనీ సమాజము (గొలాబంద) ౧౦ శ్రీ నాగేశ్వరరాయ గ్రంథాలయము (నరసన్న పేట) సుజనాను మోదినీ పుస్తకభాండాగారము (హీరమండలము) ౧౨ లక్ష్మీవిలాస పుస్తక భాండాగారము (లక్ష్మీవరుసుపేట), కార్యనిర్వాహక సభ్యులలో యీదిగువ సభ్యులు విచ్చేసిరి:- వరహగిరి వెంకటజోగయ్యపంతులు (బరంపురం) నేమాని వేంకటనరసింహశాస్త్రి, పోతాప్రగడ సింహాచలం పంతులు పుల్లెల వెంకటరమణయ్య పంతులు తిత్తి బలరామయ్య పొట్నూరి స్వామిబాబుగార్లు.
అనంతరము ఈదిగువ తీర్మానములు జరుపబడినవి.
౧ గంజాంమండలములోనున్న గ్రంథాలయసభ్యులందరకు ప్రతిసంవత్సరము బహుమతి పరిక్షలనుజరిపి అందు మొదటి తరగతిలో కృతార్ధులయిన ప్రతిగ్రంథాలయ సభ్యునకు గ్రంథాలయమహాసభలో బహుమతి గ్రంథములను ఆయా గ్రంథాలయ ములవారిచ్చుటకు ఈ సభవారు తీర్మానించుచున్నారు. ఈపరిక్షలను యేర్పరచి పరిక్షకు పత్రములను సరిచూచి బహుమతులు నిర్ణయించుటకు వరహగిరి వేంకటజోగయ్య పంతులుగారు. ౨ నేమాని వేంకటనరసింహశాస్త్రిగారు 3 ఉన్నం వేంకట వరహబుచ్చిరామలింగంగారు ౪ పోతాప్రగడ సింహాచలం పంతులుగారును ఉపసంఘములుగ నేర్పడుటకు యీసభవారు వారలను కోరుచున్నారు.
౨ ప్రధమగంజూంమండల ఆంధ్రగ్రంథాలయమహాసభను జరుపుటకు యీసభవారు తీర్మానించుచున్నారు. ఈ సభ సోంపేటలో జరుగనియెడల టంకాల సాంబపూర్తిగారి ఆహ్వానము నంగీకరించి టెక్కలిలో జరుపుటకు నిశ్చయించడమైనది.
3 గంజాంమండల గ్రంథాలయసంఘమునకు అయిన అప్పు రు ౧-౪-౬ లు శ్రీనాగేశ్వరరాయ గ్రంథాలయ సభ్యులొసగినందులకు అగ్రంథాలయమువారికి యీసభ వారు కృతజ్ఞతను తెలియజేయుచున్నారు.
— తిత్తి బలరామయ్య,
సంచార కార్యదర్శి.
మనుజుని జీవితములో నెప్పుడును మంచిగాని, చెడుగుగాని ప్రవేశించునపుడు ముందుగనే యోచ నామార్గములు సిద్ధపడియుండును. ఎవ్వానికి సందిచ్చిన నవి చొరబారును. ప్రవేశించినతరువాత వానిని దొలగించుట దుర్ఘటము. ప్రవే శింపకమును పే మేలుకో నెడివారు తత్వజ్ఞులు. — ప్రేమలత,
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse