గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/ఇంద్రవర్మ కోణ్ణణగూరు శాసనము
ఇంద్రవర్మ కోణ్దణగూరు శాసనము
నేనీవఱ కొకసారి యింద్రవర్మ శాసనమును గురించి కృష్ణా పత్రికలో వ్రాసియుంటిని. ప్రస్తుతము నేనా శాసనప్రతి నిందుతోఁ బ్రకటించుచున్నాను. ఇంద్రవర్మ శాసనము లీవఱకుఁగూడఁగను పెట్టఁబడినవి. (Sewell Vol II 24, 25) అవి స్పష్టముగ నీతనివని కనఁబడుట లేదు. పూర్వ చాళుక్యవంశ మూలపురుషుఁడగు కుబ్జ పిష్ణువర్ధనుఁడన్న యగు సత్యాశ్రయునితో వచ్చి పిఠాపురము కోటలు జయించెను. పిమ్మట నన్నచే నీతఁడిచ్చట పరిపాలకుడిగా నియమింపఁబడెను. ఈతనికిఁ బిమ్మట నీతని కొడుకు జయసింహుఁడు పిఠాపురమును బాలించెను. కుళోత్తుంగచోడదేవుడు మొదలయినవారు పిఠాపురము సత్రమునకై కొంతభూమిని దానమిచ్చి యున్నారు. కాఁబట్టి చాళుక్యులు పిఠాపురమును బాలించిరి. జయసింహుని తమ్ముడుగు నింద్రభట్టారకుఁడు కూడఁ బిఠాపురమును బాలించెనని యీ శాసనమునందుఁ జెప్పఁబడకపోయినను నమ్మవలసి యున్నది. సత్యాశ్రయుఁడు బౌద్ధులగు సాలంకాయనులకడనుండి యాంధ్ర దేశమును దీసికొన్నట్లు కొందఱు చరిత్ర కారులు వ్రాయుచున్నారు. “ఆంధ్రభారతి” లోఁ బ్రకటింపఁబడిన మాధవవర్మ, జయసింహుల శాసనములవలన నీదేశము
చాళుక్యులకుఁ బూర్వము బ్రాహ్మణ భక్తిగల గోవిందవర్మ పుత్రుఁడగు మాధవవర్మాది క్షత్రియులచేఁ బాలింపఁబడినట్లును, గుద్దవాడయనఁగా గుడివాడ కాక గుద్రహరయనఁగా గోదావరి మండలమునకుఁ బేరనియు దెలియుచున్నది. గోవిందవర్మ రాష్ట్రకూటులలోనివాఁడని కొందఱనుచున్నారు.
కాఁబట్టి యింద్రవర్మ గోదావరి మండలములోని పిఠాపురమును భాలించిన రాజని నమ్మవలసినది. పిఠాపుర ప్రభువయిన యింద్రవర్మ యిచ్చిన శాసనము నేఁటికి 'ఒంగోలు' తాలూకా పాటిదిబ్బలలో బయటపడుటయునది తిరిగి మానగరమునందలి యాంధ్రపరిశోధక మహామండలికిఁ జదువవచ్చుటయు విచిత్రముగ లేగదా?
శాసనము వచ్చిన నాఁటికి నాకందలియక్షరములు చదువు నేర్పులేదు. ౮, ౧ం దినములలో గ్రంథసహాయములేని యిచ్చట పరిషత్ఫత్రికలతో నెట్లో యదిచదివి వ్రాయుచుంటిని. విషయము తెలిసికొనుటకు శ్రీజయంతి రామయ్యపంతులు గారు ప్రకటించిన శాసనములు నాకుఁ జాల సాయపడినవి. సంగతులు తెలియఁగానే వివరములు నాకుఁ దెలిసినంతవఱకుఁ బాఠకుల కెఱిఁగించితిని. ప్రస్తుతము · శాసనమునిచ్చిన మాగ్రామ భాండాగారమువారు పనియున్నదని యాశాసనమును దీసికొని పోయి మరల నాకంపలేదు. నేను వ్రాసియిచ్చిన కాగితపుఁ బ్రతినైన నీయరయిరి. ముందు వారిచ్చినప్పుడు సరిచూచు కొనవచ్చునని ప్రస్తుతము నాకడనున్న చిత్తుప్రతి నిందుతోఁ బ్రకటించితిని. శాసనములోఁ జివరభాగము రెండవమారు సరిపోల్పలేనందునఁ దప్పులున్నవి. ఈ చిత్తుప్రతియైనఁ బోవునేమో, దేహము లశాశ్వతములని ఇందుమూలమున బ్రకటించితిని. శాసనమును
సంపాదించినవారు మరియొకరి చేతనైన నాశాసన ప్రతిబింబములఁ బ్రకటింపఁ జేయుదురని నమ్ముచున్నాను. పరిషత్పత్రికలోఁ బ్రకటింపఁబంపిన సర్వోత్తమము! ఎవ్వరైనా నమలిమ్రింగునది లేదు. లోకము కొఱకుఁ గన్నులు మంటలెత్తునటులు చదివి ప్రకటింపవలసినదే కదా! నాచే నీమాత్రపుఁ బనియైనఁ జేయించిన శ్రీ సూర్యరాయ భాండాగారము వారికి నా వందనములు!
- ఇంద్రవర్మకోణ్దణగూరుశాసనము[1]
స్వస్తిశ్రీమతాం సకలభువనసంస్తూయమానమానవ్య సగో ! త్రాణాం హరితీ పుత్రాణాం స్వామిమహాసేనపదాన్యధ్యానధ్యా! నాణాం కాశికీవరప్రసాద లబ్ధరాజ్యానాం భగవన్నారాయణ ప్ర ! సాదాసమాసాదిత వరవరాహ లాఙ్చ సేకుణ&ణవశీక్రి (*) తాశేష ! మహీభృత అశ్వమేధావభృధస్నానపవి[త్రీ] క్రి(*)తమా | ణాం స్వయ శో విజయాక్రి (*) తత్రైలోక్యాణాంచలుక్యాణాం !
(కు) లనులంక్రి (*) త్యానిజజన్మనావిరాజమానాః శ్రీ కీర్తివర్మమహా | రాజస్యనప్తాశ్రీ విష్ణువర్ధన మహారాజః రణమువీగత (?)
రిపు | విజయసముపలభ్యః శ్రీవధూని వాసాయమాన విపులవక్ష స్తల | స్య పుత్రఃశక్తిత్రయ సమధిగతమహాజ్యతవిభూతిత్రి |
వర్గసేవా నిపుణఃపురాణపురుష ఇవబహులోకస్తుతః | పురారాతిరి వభూతగణప్రియః ద్వితీయ ఇవమకరధ్వజః | పులోమ(?)
యివ లోకపాలః పృధాగ్రసుత ఇవసత్యసన్ధః శరత్కాల ఇవక్రి(*) తబద్ధు జీవోత్యవః పూర్వాచలేన్ద్ర ఇవ మిత్రోదయానుకూల । మహిమా, మహీపతి మకుటతట పుటిత మహారత్న మరీచీ మ | ఞజరీఞ తచరణార విన్దయుగళః | శ్రీన్ద్రవర్మిమహారాజః త్యా | గధేన్వపరనామధేయః ఉదక పూర్వకం సర్వకరపరిహరోపేతం । జ్వమాదయతిత్వ (?) కొన్దణగూరనా - గ్రామ, గ్రామంహ్రదాతత
స్య గామస్య | దిగ్విభౌః (o) ఉత్తరతః మాజుణ్వరనామగ్రామ | పూర్వః పగుసిరునామగ్రా | మః దక్ష్మిణది గ్భాగతస్థితః
చేఱుపూరునామ గ్రామపశ్చిమతః ఇలు | తీనామగ్రామః| ఏతేషాంగ్రామాణాం మధ్యేనివాసీక్రి(*) తంవాజసనేయచ | చరణస్యదుర్గ శర్మణః బ్రహ్మవిహిత కర్మనిరతస్య ఇఱ్ఱద్దబోయనామ ధేయస్య పౌత్రాయ అభిజనవిద్యావి(ఽ)త్తవతః భరద్వాజసగోత్రస్య విష్ణుశర్మణఃపుత్రాయ వేదవిద్విప్రసంమాయమాన చరితాయ ౹ చెణ్దశర్మణేమాతా పిత్రోరాత్మనశ్చ పుణ్యావాప్తయేయితి చ (*[2]) భావినోరాజ్ఞాపి యధోపచార పురస్సరం సమార్ధనయతిక్షా య్య | ప్యతగంగాగ్గగవతిలకుభ్యాత కేబ్ధవర్మ నామహారాజస్యగ్రసత ఇ ౹ ౦ద్రశర్మణానామధేయవిజ్ఞాపనయ తస్య విశాప్తిరే వ అలపాకల ౹ బ్రాహ్మణ సోమయాజులచెదొకీబో తేమారషబః అపిచమోహలోభ |ద్యయా౦కద్దిద్విప్నుకత్తెరసపఈ మహాపాతకయు క్తి భవిష్యత ఇతిచ | వేదవ్యస్య శైకశ్చాత్ర నిప్నుతాభత్రి గోవి ప్రబాలయోషిత్త |పస్వినః యాగతి స్వాభావేత్ద్రి త్రిపారతశాసనాణ్కితా షష్ఠిం మచషస | హస్రాణిస్వర్గతిష్ఠతిభ్యామిదః శ్రీకాన్తామనుమన్త చ తాన్యవన । రకేవసేతబిపుభిర్వధాదత్తా బపూనిశ్వాను పాలితాయస్యయ | స్వయదాభ్యామి తస్యత స్యత దా ఫలం ఇతి | కనక గామలిగ్వి ౹ శానతిచతుషష్ఠ్యళః ఏ
తేషానామానాం ఏకో రాశ. త . తే X | పడ్డారు జ్ఞారాంశంచోదచేంద త్రితి యాగ్మం॥ చంద్రబింబ మున్నది. "త్యాగధేను” అని రాజముద్రయున్నది.
సూచన. పంక్తులకు మధ్యనున్న గీట్లు శాసనపంక్తులఁ దెలుపును. అనగా గీటు నడుమ దొకపంక్తిగా గ్రహింపవలెను. శాసనమున పంక్తు లెట్లున్నది తెలుపుట కిట్లు గుర్తింపబడినది. శాసనమునకుఁ జివర భాగము శాసనమున్న వారైన బోల్చి సవరించి ప్రకటింతురనియు, నెవ్వరు ప్రకటించినను దేశోపకారమనియు నేను మొదటవ్రాసినది వ్రాసినట్లే ప్రకటింపవలసి వచ్చినందులకుఁ జింతిల్లుచుఁ బాఠకుల మన్నింపవేడెదను.
- వంగూరి సుబ్బారావు.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse