గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 3-4/కృష్ణా జిల్లాయందలి గ్రంథాలయోద్యమము
కృష్ణాజిల్లాయందలి గ్రంథాలయోద్యమము
దేశమందంతట నలముకొనియున్న నవశక్తియే ఈ గ్రంథాలయోద్యము వ్యాపనకై మనకింతభక్తి శ్రద్ధలను, విశ్వాసవాత్సల్యములను గల్గించినదని మెక్కి వక్కాణింపవచ్చును. ఆశక్తియే, రాజ్యాంగమునకేమి, ఆర్ధికమునకేమి, మతమునకేమి, వేయేల, సంఘప్రచారమునకు సర్వకార్యార్థ సాధనకు మూలస్వరూపిణియగు సరస్వతీ మహాదేవియొక్క యశగ్రహా ప్రసాదముల సంపాదించుకొనుటకు ప్రోత్సహించినది. బహురూపధారిణియగు, ఆమె లీలా విలాసముల గా౦చుట కుద్యమింపఁజేసినది. సాంఘిక శరీరములందు, జ్ఞానజ్యోతి,గద్ధగాయమానముగ ప్రజ్వరిల్లుచున్న గాని మానవయంత్రములు చలింపనేరవు; ముందుకు సాగనేరము రాజ్యాం గాందోళనమునకెట్లు సామ్రాజ్యసభలు, రాజధాని సభలు, మండలసభ లావశ్యకములని గ్రహింపగల్గితిమో ఈగ్రంథాలయోద్యమమునకు గూడ, ప్రత్యేకపు సభలును - శాసనసభలకు - డిస్ట్రిక్ట్ తాలూకా బోర్డులకు, ప్రతినిధులు, కార్యనిర్వాహకులు ముఖ్యులైనట్లు, గ్రంథాలయ ప్రతినిధులు, తాలూకా, జిల్లా కార్యదర్శులు,ముఖ్యులని బోధపడి, కార్యాచరణమందు బెట్టగల్గితిమి. అట్టి ప్రతినిధులాచరింప వలసిన కార్యములను, నిర్వర్తింపవలసిన విధులునూ, ఇదివరకే నిర్ణయింపబడి యుండుట చేతను, వ్యాసవిస్తర భీతిచేతను విరమింపుచు - ఆకార్యదర్శులలో నొక్కకుడనై, జిల్లా మొత్తమున - నే చేయగల్గిన పనిని, గ్రహించిన క్రొత్తవిషయములకు, గురైఱింగిన జిల్లాకార్యదర్శుల లోపములను, క్లుప్తముగ వచించెదను. మాకృష్ణాజిల్లాలో లోగడ వత్సరము 52 గ్రంథాలయములును, ఈవత్సరము 80 గ్రంథాలయములును గలవు. స్వంతభవనములు కలవి ౮ కలవు మొత్తము, ముప్పదింటిని మాత్రమే సందర్శింపగల్గితిని. అందుయెనిమిదిచోట్ల, సభలు జేయించి, నేనును మాబాల విద్యార్థి సాంఘికులును, ఉపన్యాసములు గావించియుంటిమి. మూడు భాండాగారములను, నేవెడలి స్వయముగ స్థాపించితిని. కొందర మిత్రుల, ప్రోత్సహించి, యింకను, రెండు భాండాగారములను, స్థాపింపజేసితిని. మాచుట్టుపట్ల కొన్ని, భాండాగారములకు, వెయ్యిగ్రంధములకు బైండును, నేనును మాసాంఘికులును కలసి, కట్టితిమి. కొన్ని గ్రంధాలయములకు, సుమారు నూరింటిని నాస్వంత గ్రంధముల మొసంగియు - కొందరికవురు కొందరి గ్రంధ విక్రేతలను ప్రార్థించి - సగముఖరీదునకు గాని తెచ్చియిచ్చితిని. ఇదంతయు తప్పక చెప్పవలసివచ్చినందుకు మన్నింతు గాక. స్వాతిశయప్రకటన మని భావింపకుందురు గాక. ఇంక, ప్రస్తుతాంశమునకు వత్తము. నే నెరిగినంతవర కీ వత్సరము, కృష్ణాజిల్లాలో, మంతెన, పెనుచుచ్చ, గొల్వేపల్లి, పెడణ, బొమ్ములూరు, కైకలూరు, వుయ్యూరులో రెండు, గుడ్లవల్లేరు, దొండపాడు, వెంట్రప్రగడ, మొత్తము పది భేండాగారములు, నూతనముగ, స్థాపించబడినవి. ఇందు, దొండపాడు నందలి, శ్రీ రామచంద్ర పుస్తక భాండాగార చరిత్ర ప్రశంసనీయంబ. ఏడువందల పొత్తములు గలవు; యువకుల సాహాయ్యసంపత్తి గలదు. కలసి మెలసి పట్టుదలతో పనిజేయు సంఘీభావము గలదు. ఒక రాత్రి పాఠశాల కలదు. పెనుమచ్చలో, నిన్న, మొన్ననే, స్థాపించినప్పటికిని, రెండువందల గ్రంధములను, రెండువందలపాతిక రూప్యములను, వెంటనే సంపాదింపగల్గిరి. దేవాలయములో వేరుగా భండాగారమున కొక చిన్న భవనమును కట్టించిరి. కైకలూరి భాండాగారము చిన్నదేకాని నాల్గువేల, రూప్యములతో పురమందిరమునకు భాండాగారమునకు వినియోగపడున ట్లొక నొక పెద్దభవనమును, కట్టింపుచు చున్నారు. ఉయ్యూరు, గుడ్లవల్లేరు, బొమ్ములూరు, మంతెన, మొదలగు గ్రామములందలి, గ్రంథాలయములు సామాన్యముగ నున్నవి. పెడణ, వెంట్రప్రగడ, లోనివి త్వరలో వృద్ధికిరావచ్చును. గొల్లేపల్లి భాండాగారము, నామమాత్రావసిష్టముగ నున్నది. తాలూకాల మొత్తములో, వరుసగా గ్రంథాలయ చరిత్రలో ప్రచురింపబడిన భాండాగారములలో ప్రముఖములైనవాటి, క్లుప్తపచరి . త్రనుమాత్రమే వివరించెద వినుండు. బెజవాడ తాలూకాలో, సుప్రసిద్ధ మగు, రామమోహనభాండాగారము నట్లుంచి, వల్లూరు పాలెమందలి ఆంధ్రభాషాభ్యాస జ్ఞానోదయానంద పుస్తక భాండాగారచరిత్ర గమనహర్షము. ఇచ్చట యేడువందల లోపుగ గ్రంథములునున్నవి. పాఠకులు విశేషముగ గ్రంధములు వినియోగించుకొను చున్నారు. కొందరు సంఘీభావముతో భాండాగారాభివృద్ధికై పాటుపడుచున్నారు. గత వార్షికోత్సవమునకే, మూడువందల రూప్యముల వ్యయ మొనర్చుట జూడ నా కాశ్చర్యమును గల్గించినది. ది. ఆ గ్రామస్తులలో, కొందరీ భాండాగారమును నిర్మూలించుటకై కక్షగా నేర్పడి, నిలబడినట్లు వినుట కెంతయు చింతిల్లుచున్నవాడ. రొయ్యూరినందలి ఆంధ్ర విజ్ఞానపుస్తుకభాండాగార కార్యనిర్వాహకుల, కార్యక్రమము ప్రశంసనీయము. ౪౫౦ గ్రంధములు కలవు. ఈ భాండాగారమూలమున పెక్కురీతుల నిజముగ సా౦ఘిక సేవ సల్పుచున్నారు. వీరే, ఒకస్వరాజ్యసమితిని, గ్రామపంచాయితీని, ప్రైవేటు పాఠశాలను స్థాపించి, సక్రమముగ పనిచేయుచున్నారు. ఒక రాత్రిపాఠశాల కలదు. 30 విద్యార్థుల కలరు. తోట్లవల్లూరినందలి శారదావిద్యానిలయ సంఘమువారు, గ్రంథవినియోగము అంతగా సల్పుచుండ లేదు గాని, బాడ్మెంటన్ కోర్జునందు మిక్కిలి శ్రద్ధ గల్గియున్నారు. ఏటేట వార్షికోత్సవములను, తప్పక జరుపుచున్నారు. పులిపాక బొడ్డపాడునందలి సత్యనారాయణ వరప్రసాద పుస్తుక భాండాగారచరిత్ర కూడ, గమనార్హముగను సక్రముగను, సంతోషకరముగ నున్నది. తెన్నేరునందళి, భక్త సమాజమువారు, భాండాగారమందంత భక్తి గనుపర్చుట లేదు. ఈడుపుగల్లునందలి కార్నేషన్ రీడింగురూముసంగతి విచారించగా పర్వతనేని చినకామయ్య గారు మొదలగువారు, అంతరించినదని సెలవిచ్చిరి. కాని, ఈమధ్య పునరోద్ధారణ గావింపబడినదని తెల్పురకు సంతసమగుచున్నది. గుడివాడ తాలూకా, భాండాగారస్థితిగతులు మా తాలూకా సంఘ కార్యదర్శిగారి, రిపోర్టువల్ల బహిర్గతములు గాగలవు. కాని గురజయందలి హనుమంతపఠనమందిర మ౦తరించినట్లు విచారింపగా శ్రీయెర్నేని లక్ష్మీనారాయణగారు మొదలగువారు, సెలవిచ్చిరి. పసుమర్తి గ్రామములో, సభజేసి పల్వురిని ప్రోత్సహించినను విముఖత్వము వహించిరని తెల్పుటకు విషాద మంకురించుచున్నది. దీవి తాలూకాయందలి, భట్లపెనుమర్రు గ్రామములోని, విజ్ఞానవర్ధనీ పుస్తుక భాండాగార ముచ్ఛదశయందే యున్నది. వేయిగ్రంధములు గలవు. సమర్థులగు పదిమంది పట్టుదలతో భాండాగారాభివృద్ధికై, ప్రయత్నపడుచున్నారు. కాని, గ్రంథోపయోగమంతగా కానించుటలేదు. బందరు నందలి కమ్మవిద్యార్థి సంఘము కలతలకు పుట్టినిల్లయి జమాఖర్చులెక్కలు సరిగాలేక, పట్టుకొనివెళ్లిన గ్రంధముల మరలగైకొనక అంతరించునా యన్నట్లున్నది. నూజివీడు తాలూకాలోని తాడంకి యందలి యువజన సంఘము సామాన్యముగ నున్నది. పాఠశాలయందుంచిరి. ముస్తాబాదాయందలి మైత్రేయ పఠనమందిరము సంగతి యెందరనడిగినను తెలియదన్నారు. రెండుదినంబు లుండి మీటింగుజేసి భాండాగార స్థాపనకు ఉత్సాహపరచితి. కారణాంతరములచే కొనసాగలేదు. మున్ముందు ప్రయత్నించిన నెరవేరవచ్చును. ముదునూరునందలి హిందూపుస్తక భాండాగారమును మా కార్యదర్శిగారు రెండుసార్లు ప్రయత్నించియు దర్శించు భాగ్యమునే బడయలేదు. కైకలూరు తాలూకాలోని దొడ్డిపట్లయందలి ఆంధ్ర విద్యార్థినీ పుస్తుకభాండాగారము వారు మిక్కిలి శ్రద్ధతో పనిచేయుచున్నట్లు మా కార్యదర్శిగారు సెలవిచ్చిరి. దీవితాలూకాలోని చినముత్తేవి గ్రామమునందలి వేణుగోపాల పఠనమందిరము మృతజీవియైనట్లును భాండాగారపు పేన ఉచితముగవచ్చు పొత్తములమాత్రము త్రిప్పివేయక, ఒరులపహరించు చున్నటులును తెలియవచ్చెడివి. ప్రయత్నించిన ఫలము చేకూరగలదు. ఇంకను నే వీక్షించిన గ్రంథాలయములు కలవు. కాని విస్తర భీతిచే విసర్జించితి. ఇక్కార్యమునందే గాక పవిత్ర భావ పుష్పమంజరులకు ఆంధ్రమాతృ పాదారవిందముల కడనిడి యధాశక్తిని దేశసేవసల్పుచు ప్రతికార్యము నకు నాకు చేయూత మెసంగు మాబాల విద్యార్థి సంఘ సాంఘికులకు నావందనములు. భాండాగార సంచార కార్యదర్శులఁగూర్చి కొంచెముగ మనవిఁజేసెద - మేము పామర్రు పసుమర్రు కైకలూరు పెనుమచ్చ మంతెన ముస్తాబాదు దొండపాడు మొదలగు గ్రామములం దుపన్యసించితిమి.
సామాన్యముగ జనసామాన్యమున కుపన్యాసముల మూలమున నలవడ: ఉత్సాహము వర్ణనాతీతము. ఈ సంచార కార్యదర్శులు కేవలము ఖాండాగారముల దర్శించి విమర్శించుటతోడనే, తృప్తివహించిన లాభము లేదు. నేను కొన్ని భాండాగారములందలి లోపముల వ్యక్తపరచి పరిష్కరించుకొని ప్రార్థించితి. వినియువిననట్లు విని చేసెదరుమని తలలూపరే కాని మరొక్కసారి వెళ్లిచూడ, మాపని మాకే ఒప్పజెప్పిరి. ఉపన్యాసము లొసంగిన కొన్నిచోట్ల ఎంతయో ప్రయోజనమలఁడినది. ఇందుచే నొండొక కర్తవ్యాంశము పొడ కట్టుచున్నది. మంచివక్తలకు సంచారకార్యదర్శులు బయల్వెడలి ఒక్కొక్కచోట రెండేసిదినంబు లుండి గ్రామస్థుల సమావేశపరచి భాండాగార ప్రయోజనముల ప్రబోధింపుచు తాము జెప్పినట్లొనర్పుచున్నాయని రాకపోకల చేతను ఉత్తర ప్రత్యుత్తరముల చేతను గుర్తెరుంగవలసి యున్నది. ఇందుచే నెంతయో లాభము సంప్రాప్తింపగలదు. లేనిచోట్లగూడ పెక్కు నెలకొల్పవచ్చు. ప్రయాణపు ఖర్చుల కధమపక్షము నూరురూపాయలేని కావలసివచ్చును. ఇతర వ్యావృత్తులుగల మాబోంట్లు జిల్లా మొత్తము మీద యొక్కొక్కచోటనే యిన్ని నాళ్లుండి, ప్రయాణవ్యయమును కూడా భరింపుచు సంచార మొనర్చుట దుర్భరము. ధనమును సేకరింపక, కేవల మభిమానముతో సావకాశమున్నను లేకున్నను పనిచేయువారల తాలూకా సంఘకార్యదర్శులుగా నియమించిన జిల్లానంతను పదిసార్లు చుట్టి వచ్చుటకంటె యిబ్బడియగు లాభమును జూపింప వచ్చును. ఇది నా గట్టినమ్మిక.
దుగ్గిరాల వేంకటసుబ్బయ్య
సంయుక్త కార్యదర్శి.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse