గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/యుద్ధభటులకు గ్రంధాలయములు
యుద్ధభటులకు గ్రంథాలయములు
ఇప్పుడు జరుగుచున్న ఘోర సంగ్రామమునందు యుద్దభటులకు, ప్రతినిత్యమును తమ విధాయక కృత్యములునుజేసి విశ్రాంతిని పొందుకు సమయములయందు ఉబుసు పోకయున్నది. పగలెల్ల కష్టపడి పనిజేసి సాయంకాలమున బసకు వచ్చుసరికి, చదువుకొనుటకు నొన్ని గ్రంధములును సచిత్రములతో గూడిన మాసపత్రికలును యుద్ధభటున కందిచ్చిన, వానికి ఉల్లాసకరముగను ఉత్సాహకరముగను ఉండును గదా. ఈ సూత్రమును గనిపెట్టి, ఆంగ్లేయులు యుద్ధమునుజేయు భటులకెల్ల పుస్తకములను, పత్రికలను అందజేయుటకు బూనుకొరి. ప్రధమమున కొందరు పెద్దలు జేరి, కొన్ని గ్రంధములను ప్రోగుజేసి “వెస్టుమినిష్టురు” నందు ఈపనికి బూనిరి. ఆరంభమున 30,000 ల గ్రంధములు కావలెనని ప్రకటించిరి. స్త్రీలు ఇంటింటికిని దిరిగి గ్రంధములను సేకరించిరి. ప్రతిదినమును తపాలాద్వారాను, రైలుద్వారాను, మనుష్యుల ద్వారాను పుస్తకములు కట్టలు రా నారంభించెను. ఇటుల స్వల్పకాలమునకే ఔదార్యవంతుల సహాయము వలన ఈ ముప్పదివేల గ్రంథములును లభించినవి. ఈగ్రంథములను రైల్వే కంపెనీలవారు వలయుస్థలముల కెల్ల ఉచితముగ దీసికొనిపోయిరి.
ఇటుల ప్రోగుజేయబడిన పుస్తకములన్నిటిని దులిపి చీట్లనతికించి కనడా దేశమునుండి వచ్చిన భటులకు ప్రధమముమున పంపిరి. పుస్తకముల నెరునిచ్చుటకు కఠినమైన నిబంధనలనుచేయక, గ్రంథముయొక్క నామము, తీసికొనినవారి పేరు, తేదీలను వ్రాయించి పుస్తకముల నిచ్చుచుండిరి. కనడా యుద్ధభేటులకు పుస్తకముల నిచ్చుచుండగనే, ఈజిప్టు దేశమునందు విడిపి యున్న ఆస్ట్రేలియా - న్యూజీలండు యుద్ధభటులనుండి గ్రంథములకొర కాహ్వానము 'వచ్చినది. వెంటనే వారికి కావలసిన గ్రంధములును, సచిత్ర మాసపత్రికలుకు పంపబడినని.
ఇట్లు ప్రారంభింపబడిన పనియొక్క ఉపయోగమును జయప్రదమునుజూచి, ఆంగ్లేయదేశము యొక్క సేనలు పనిజేయుచున్న స్థలముల కెల్ల పుస్తకములను పత్రికలను పంపుట కేర్సరచిరి. నేనలన్నియు, పట్టణములకును, గ్రామములకును గూడ దూర ప్రదేశములయందు విడిసి యుండును. అందుజేత యుద్ధభటులకు సంతోషమును గలుగజేయు వినోదము లెవ్వియు అచట ఉండుట అసంభవము. ఇంతేగాక కందకములలో నుండు యుద్ధభటులలో ఎల్లప్పుడును నాలుగవ వంతు భటులు మాత్రము యుద్ధ కార్యములను నిర్వర్తించు చుండెదరు. మిగిలిన మూడువంతుల జనులును కందకములకు అడుగు భాగమున విశ్రాంతిని దీసికొనుచు౦డెదరు. అందుచేత ఈ మూడువంతుల జనులును ఎల్లప్పుడును కందకములయందే తమకాలమును గడపుచుండవలసిన స్థితియందు, వారికి కాలము గడచుట ఎంతకష్టము గానుండునో ఊహింపవలసినదే గాని వ్రాయనలవిగాను. అట్టివారు గ్రంధములనో పత్రికలనో చదువుచుండుటవలన వికాసము గలిగి వారెల్లప్పుడును ఉల్లాసవంతులైయుందురు.
అందుచేతి వారికిగూడ గ్రంధములనంపుట అగత్యమయ్యెను. అంతట గ్రంథములకొరకును పత్రికలకొరకును దేశస్థులకెల్ల నిజ్ఞాపనల౦పిరి. వెంట నే పుస్తకముల వర్షము కురియనారంభించెను. దేశమునండుచ్చటచ్చట పుస్తకములను వసూలు జేయుటకు స్థలముల నేర్పరచిరి. ఆయస్థలములకు తగినన్ని గ్రంధములు రాగానే వాని నన్నింటిని ప్రధాన కార్యాలయమునకు కంపుచుండిరి. ప్రధాన కార్యాలయమునుండి ఆయా దేశములయందున్న యుద్ధ భటుల కంపుచుండిరి.
ఇట్లు కొంతకాలము జరిగిన పిమ్మట, గ్రంధములు యుద్ధభటులకు జేయుచున్న సహాయమును స్వయముగా జూచినవాడై తపాలా శాఖాధ్యక్షుకుకూడ ఈయుద్యమమునకు సహాయభూతుడగుటకు నిశ్చయించుకొనెను. ఏగ్రామమునందైన సరియే, ఒక గ్రంధమునుగాని, సచిత్ర మాసపత్రికను గాని యుద్ధభటులకొరకై తపాలా కచ్చేరియందుండు అధికారికిచ్చినయెడల దాని నాతడు ఖర్చులేమియు లేకుండగ ఉచితముగనే యుద్ధభటులకంపు ప్రధాన కార్యాలయమునకు తపాలాద్వారా పంపును. ఈప్రకారము ఎన్ని గ్రంధములను తపలఆఫీసు లందిచ్చినను అవియన్నియు యుద్ధభటులకు పోయిచేరును. ఈసహాయమువలన జనులు ఇంకను ఎక్కువగ్రంధములంపుట సులభమయ్యెను. ఈమహత్కార్యమును నిర్వహించుకు పుస్తకములేగాక ధనమును ఆవశ్యకమయ్యెను. ఔదార్యవంతులు విరాళముల నొసంగి ధనలోపమును గూడ లేకుండ జేసిరి.
యుద్ధ గ్రంథాలయము.
ఇంతే గాక “పర్రేహౌసు” నందు యుద్ధ గ్రంథాలయము నొకదానిని గూడ స్థాపించిరి. ఈ యుద్ధగ్రంథాలయము నుండి గాయములు తగిలిన యుద్ధభటులుగల ఆసుపత్రులకు ఆసుపత్రి యోదులకు కావలసిన గ్రంథముల నెల్ల పంపుచుందురు. ఆంగ్లేయ దేశమునందే గాక ఫ్రాన్సుదేశము నందున్న ఆసుపత్రులకు గూడ గ్రంధములనంపెదరు. ఇంతే గాక “మాల్టా” “అలెగ్జాండ్రియా" మున్నగు ప్రదేశములకు కూడ అమితముగ గ్రంధములనంపిరి. యుద్ధము చేయుచున్న ఓడలమీద ఉన్నట్టి వారికిగూడ వలయుగ్రంధముల నంపుచుండిరి. ఈ యుద్ధ గ్రంథాలయమునకు గూడ జనులు అసంఖ్యాకములగు గ్రంథముల సంపుచుండిరి. అపాలాద్వారా వచ్చిన "పార్సిల్సు” గాక ౫౦౦ పెట్టెల గ్రంధములు ఒకేదినమున వచ్చినవి. కొందరు పనికిరాని గ్రంథములనుగూడ పంపుచువచ్చిరి. కాని అట్టివి బహుస్వల్పము, యుద్ధభటులకు ముఖ్యముగా నవలలును, సచిత్ర మాసపత్రికలును ఆవశ్యకములైయున్నవి. ఇతర విధము లగు గ్రంధములను కొందరు చదివెదరు. కాని అట్లు చదువువారు కొద్దిమంది. ఈగ్రంథాలయమునకు వచ్చు పచిత్ర మాసపత్రికల యొక్క చినిగిపోయిన కాగితములను బాగుచేయుటకును బరువు తగ్గునటుల ప్రకటన పత్రికలుగల కాగితములను మాసపత్రికలనుండి తీసివేయుటకును ముగ్గురు స్త్రీలు ఎల్లప్పుడును పనిచేయుచుందురు. ఆయాస్థలములనుండి యుద్ధభటులకై పంపబడిన గ్రంధముల యందప్పుడప్పుడు అపూర్వ గ్రంథములుగూడ కన్పట్టుచుండును. అట్టి అపూర్వ గ్రంధములను అమ్మి యుద్ధభటులకు కావలసిన ఇతర గ్రంథములను కొనెదరు. ఈయుద్ధ గ్రంథాలయము యొక్క పనులను నిర్వర్తించుటకై కావలసిన సొమ్మును అంతకు ఇద్దరు మహానీ ములిచ్చుచుండిరి. ఇట్లు ఆంగ్లేయులు, యుద్ధభటుల మనస్సులెప్పుడును ఉత్సాహమయములు, ఆనందమయములు గా నుండుటకు అనేకవిధముల పాటుపడుచున్నారు.
యుద్ధ గ్రంథాలయాలు
'సర్రే' గృహమునందున్న యుద్ధ గ్రంథాలయాలు

స్త్రీలు తపాలా కార్యాలయంలో పుస్తకాలు వేరు చేస్తున్నారు

బాలికలు తపాలా కార్యాలయానికి పుస్తకాలు తీసుకెళ్తున్నారు

పుస్తకములతో నిండిన తపాలా సంచులు యుద్ధభటులకు పంపుటకు సిద్ధముగా ఉన్నాయి.

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse