Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 1/తెనాలి తాలూకా యందలి గ్రంథాలయాలు

​

"తెనాలి ”తాలూకా యందలి గ్రంథాలయములు

కడచిన గ్రంథాలయచరిత్రకు చరిత్రనంపినవి ౨౨ ను, చరిత్ర సంపనివి ౧౬ ను కలసి 3౮ గ్రంథాలయము లీతాలూకాయందున్నవి. ఇవియే గాక యింకను వల్లభాపురము పిడపర్రు, అయితానగరప్పాలెము, తెనాలి, వోలేరు, తుమ్మపూడి, మున్నగుచోట్లను గ్రంథాలయములున్నవి. తాలూకాగ్రంథాలయ సంఘ మేర్పడినది. ఇందన్ని గ్రంథాలయములును జేర గోరబడినవి. కాని కొన్ని మాత్రమే చేరినవి. ఈతాలూకా గ్రంథాలయ సంఘమును గూర్చి ప్రత్యేకము నివేదింపుకొననుంటిని. కానీ ప్రస్తుతము గ్రంథాలయముల సహజస్వభావముల సతిస్వల్పమగ నిందుదహరించుచున్నాను.

ఈ గ్రంథాలయముల యథార్థ స్వరూప స్వభాముల నెరిగికొన నేనొకటి రెండుమారులు తాలూకాయందు సంచార మొనరించితిని. ఏయయిదారు గ్రంథాలయములని తప్ప మిగిలినవానినన్నిటిని నేను స్వయముగా జూచితిని. నాజూచినంతలో గ్రంథాలయ చరిత్రకు సరిపడు నములనే గలిగియున్నవి. ఏపొరబాటుననో ఒకటరెండు స్వల్పవి భేదములున్నను అవి నిరసనాపాత్రములు• ​గ్రంథాలయములన్నియు గ్రంథాలయతత్వము నాచరణలో బెట్టుచున్నవని నేను సాహసించి వ్రాయలేకున్నను ఈయుత్సాహమే, యీవూనికయే, భావికాల గ్రంథాలయోద్యమాభివృద్ధికి శుభసూచకమన వెరువను.

రేవేంద్రపాటి వీరేశలింగ పుస్తకభాండాగారమును, శృంగారపురం జ్ఞానదాయినీ గ్రంథాలయమును, పెదపాలెము ఆర్య బాలసమాజమును, పెరుకలపూడి జ్ఞానోదయ పుస్తక భాండాగారమును, ఈమని శ్రీనివాస సమాజమును, సంగం జాగర్లమూడి సర్వజన విద్యాప్రదాయినీ పుస్తక భాండాగారమును, కోరినవారి కుచితముగ గ్రంధములు నిండ్లకిచ్చుచున్నవి. కోరినవారి కెట్టియభ్యంతరమును లేక గ్రంధము లిండ్లకీయదగునను నిబంధనతో నటులొనర్చుచున్న యీగ్రంథాలయముల కార్యక్రము మెంతియు ప్రశంసాపాత్రము. దుగ్గిరాల భాషాభిలాషిణీ సంఘము స్త్రీలకును, సాంఘికేతరులకును గ్రంధముల నిండ్లకు కొన్ని కట్టుబానిచ్చుచున్నది. మిగిలిన గ్రంథాలయములు చ౦దాదారులకే గ్రంధముల నిండ్లకిచ్చును. అన్ని గ్రంథాలయములలోను చందాదారులు కానివారు గూడ తెరచియుండిన కాలములో నిరభ్యంతరముగ వలసినపత్రికలనో గ్రంథములనో చదువుకొనవచ్చును. శృంగారపురము జ్ఞానదాయినీపుస్తక భాండాగారమును, తెనాలి జార్జి ధర్మపఠనమందిరమును, ఈపూరుజ్ఞానప్రవర్ధనీసమాజమును పాఠశాలల ద్వారా బీదల విద్యాభివృద్ధికి తోడుపడుచున్నవి. అనంతవరము భారతీవిలాస విద్యానిలయము మాత్రము ప్రత్యేక మొకభాలికా పాఠశాలను నెలకొల్పినది. సంగం జాగర్లమూడి శ్రీవాగీశ్వరీ నిలయగ్రంథాలయమును, కూచిపూడి సరస్వతీనిలయమును, దుగ్గిరాల సంఘమును బాలబాలికల జాతీయవిద్యాభివృద్ధి కనువగు కొన్ని పరిషత్తుల నేర్పరచి వానిని సాగించుచున్నవి. కొల్లూరు విద్యార్ధి బృందము బీదబాలురకు విద్యార్ధి వేతనము లొసగుచున్నది. ఈతాలూకాలోగల గ్రంథాలయములన్నిటిలోను కొలకలూరు రాధాకృష్ణ గ్రంథాలయముమాత్రము ప్రత్యేక మొకరి హక్కుగ భావింపబడుచున్నవి. అట్లుండియు కొందరిచే కొన్ని గ్రంధములునేని చదివించుచున్నదని వినుటయు సంతసము. ప్రస్తుతము కూచిపూడి బాలుర విద్యాభివర్ధనీసంఘము, క్రాప సుజనవిధేయ సంఘము, తెనాలి యంగు మెన్సు ప్రోగ్రసీవు అస్సోసియేషనులు మూయబడినవి. స్థాపకులును కార్యనిర్వాహకులును విద్యార్థులై గ్రామాంతరములం దుండుటయును, గ్రామములయందు చదువగు లంతగ లేకుండుటయు, ఉన్నవారికి గ్రంథాల మోపయోగ మగ్రాహ్యమగుటయును ఇవి మూయబడుటకు గల కారణములు. కనుక ఇకముందేని గ్రంధాలయ కార్యనిర్వహణ భార మెప్పుడును గ్రామములో నుందువారియందే ఉంచుట ఉచితమనియు, గ్రంథాలయాభివృద్ధికి శుభప్రదమనియు గ్రంథాలయ స్థాపకులగు ఆంగ్లవిద్య నభ్యసించువారికి మననిచేయుచున్నాడను. దంతలూరు బాలభారతీ సంఘము నందివెలుగు స్వదేశీయ వాణీరత్నాకరము, చినపరిమి అగ్రహారము వీరశైవపుస్తక భాండాగారము, వరహాపురం ఆంధ్రభాషాభివర్ధనీ సంఘము, పిడుపర్రు, అయితానగరప్పాలెముల గోక్లేపుస్తకభాండాగారము - వీటిని నెలకొల్పినవారుత్సాహవంతులును ఉదారహృదయులుసగు యువకులేకాని, వారియుత్సాహమునకు తగినంత కార్యదీక్షతో కృషిసల్పినకాని యీ గ్రంథాలయములభివృద్ధినంద నేరవు. పరోపకారచింతితో నూతనఫక్కిని కార్యోపక్రరణముచేసి గ్రామస్తులయభిమానముల నందికొని కర్తవ్య కార్యనిర్వాహకు లందరుగాకయని యీ గ్రంథాలయముల వారిని కోరుచున్నారము. కార్యనిర్వాహకులు తమ విధిని సక్రమముగ నెర వేర్చినచో యీమని శ్రీనివాససమాజ మిదివర కెంతటి యున్నత దశయందుండెడిదో? దాని కార్యదర్శియే తాలూకాగ్రంథాలయసంఘ సహాయకార్యదర్శులు ఎన్నుకొనబడిరి; గనుక శ్రీనివాససమాజమికముందేని యభివృద్ధిని గాంక్షించుచు దాపున నున్న మోరంపూడి విద్యాభిలాషిణీసంఘమునకు మార్గదర్శనియగు గాక! పెదపాలెము ఆర్యబాల సమాజమునకును, దుగ్గిరాల భాషాభిలాషిణీ సంఘమునకురు, సంగంజాగర్లమూడి సర్వజనవిద్యాప్రదాయినీ గ్రంథాలయమునకును స్వంత భవనములు గలవు. రేవేంద్రపాటి వీరేశలింగపుస్తకభాండాగారమునకు భవన మర్పింపబడ సిద్దముగ నున్నది. అనంతరము భారతీవిలాస విద్యాని ​లయమునకు భవనము తయారగుచున్నది. ఈ తాలూకాలో 'రిజష్టు' రైన దీగ్రంథాలయ మొక్కటియే! మూలువూరు శ్రీమదిందిరా నిశాంతగ్రంథనిలయమునకును, పెదరావూరుబాల సమాజమునకును భవనములు నిర్మింప వాగ్దానములు జరిగినవి. కొల్లిపరవాణీవిలాస విద్యానిలయమును, మోరంపూడి విద్యాభిలాషిణీసంఘమును, అమృతలూరు ఉభయభాషాసంజీవనీ సంఘమును, జాగర్లమూడి శ్రీవాగీశ్వరీనిలయమును, కొల్లూరు విద్యార్థి బృందమును, ఈమని శ్రీనివాససమాజమును భవన నిర్మాణప్రయత్నము లొనర్చుచున్నవి. కార్య నిర్వాహకుల సంతతపరిశ్రమచే నీ గ్రంథాలయములకు త్వరలోనే స్వంతభవనములబ్బును గాక! స్వంతభవనము లేర్పడినగాని గ్రంథాలయముల స్థిరత్వము నిశ్చయింపబడినగాని గ్రంథాలయోద్యమ తత్వము గ్రాహ్యమై ఉపకరింపదు. కాన ఆంధ్రభాషోద్ధారకులగు ధనవంతులెల్లరు శారదామందిరముల గట్టింప ప్రార్ధితులు.

ఈతాలూకాలోగల గ్రంథాలయము లన్నియు సాలునకు దాదాపిరువదివేల గ్రంధములను, కొన్ని వార్తాపత్రికలను జనసామాన్యముచే చదివించి విజ్ఞానవ్యాప్తికి తోడగుచున్నవి. దాదాపు ముప్పది గ్రంథాలయములు గ్రంథాలయ సర్వస్వము మొదటి సంపుటమును దెప్పించినవి. ఈతాలూకాలోని కొన్ని గ్రంథాలయములు “ప్రారంభవిద్యాభివర్ధనీ సంఘము" ను స్థాపించి ఉచితకృషినోనర్చుచున్నవి. అత్తోటయను గ్రామమున హార్డింజి పేరపాఠశాల నెలకొల్పబడి దాదాపు ౧౦౦ బాలబాలికల కుచేరి విద్యనొసగుచున్నదీ సంఘకృషియే! ఈస౦ఘాభివృద్ధితోపాటు గ్రంథాలయాభివృద్ధికిని తోడ్పడ తెనాలి తాలూకా వాసులను మరిమరి గోరుచున్నాను. ఈతాలూకా యందంతటను ఆంధ్రదేశ గ్రంథభాండాగారసభవారి యేర్పాటు ప్రకారము గ్రంథాలయ పరిపాలనా పద్ధతుల నాచరణలో పెట్టుటకు యోచన మొనరింపబడుచున్నది. గ్రంథాలయజీవనమున కాధారప్రాయమగు గ్రంథవిభజనపట్టిక కెదురుచూచుచున్నాము. అదిబయల్పడినగాని గ్రంథాలయ పరిపాలనా పద్ధతు లోకే రూపమును దాల్పవలను గాదు.

—సత్తెనపల్లి హనుమంత రావు.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse