గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 11/సంచిక 4/దేశ భాషల ప్రాముఖ్యము - భారత జాతీమైక్యత
దేశభాషల ప్రాముఖ్యము - భారతజాతీయైక్యత
శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారు, ఎమ్.ఏ
నేడు మన దేశము నెదుర్కొను సమస్యలయందు భాషలసమస్య గొప్ప సమస్యయే.
ఒక వైపున దేశభాష తరువాత దేశభాష గ్రంథస్థమగుటయందు ఉద్యోగించుచుండగా భారత భూమియంతటికిని వ్యవహారము నందు పనికివచ్చు భాష యొకటి యావశ్యకరణమను భావము సర్వత్రయేర్పడినది.
గాంధీజీ యుద్యమము మహాజనోద్యమము. అతడా నాయకత్త్వమారంభించిన దినములలోనే లక్షలకొలది ప్రజలొక్కొక యుపన్యాస వేదికకడకు మూగిరి. దేశభాషలలోనే మహోపన్యాసములు పట్టణ పట్టణము పల్లియ పల్లియలలో దశదిశలను మారుమోగునట్లు విన్పించినవి. దేశభాషలే సర్వాధారముగా బోధకు గడంగిన విద్యాలయములు మరల స్థాపితమైనవి దేశభాషలలో గ్ర౦థసామగ్రి-పద్యములు, పాటలు, భజనలతో సహా - విరివిగా బయల్వెడలినది. గుజరాత్ విద్యాపీఠముబోటి విశ్వవిద్యాలయ ప్రయత్నములును నెలకొనినవి మరల దేశభాషల చరిత్రయందు నవీన యుగ మారంభమైనది.
ఒక వైపు ముస్లిము నాయకులయు ఒక వైపు మద౯మోహళ్ మాళవ్యా నాయకుడుగ హిందీ ప్రచారకులయు ప్రాబల్యము కలుగగా గాంధీజీ హిందీయే రాష్ట్ర భాష కావలెనని ప్రచారము సాగించినాడు. అసహాయోద్యమ నాయకత్వము నెహ్రూ కుటుంబమునకు సంక్రమించుట హిందీ వ్యాప్తికి దోహద మొనర్చినది.
౨౦ ముఖ్య భాషలలో ౪ భాషలు హిందీగాని హిందీరూపాంతరముగానియై యున్నవి. తరువాత భాష జనసంఖ్యనుబట్టి బంగాళీ. మూడవది మన తెలుగు. నాల్గనది మహారాష్ట్రము, తరువాతివి అరవము గుజరాతీ ఉరియా కన్నడములు. బంగాళీలు ౫ కోట్లు, తెలుగువారు ౨4 కోట్లు. ఇతర భావల వారు కోటికి పైబడి కోటిసంఖ్యవారు. మళయాళము ౭౪ లక్షల ప్రజలకు మాత. ఈ యన్ని భాషలును చాల గొప్పయభివృద్ధి పొందినవి. గాంధి యుగ మేర్పడువరకు బంగాళీ మహారాస్ట్రా౦ధములు హిందీకంటె ఎక్కువ చురుకుగా పనిచేయుచుండినవి. ఇట్టి వానికి నేటిదిన మొకరీతియైన పోటీ హిందీతో కలిసిన దనుటకు సంశయము లేదు. అందులోను కొత్తయనిన నొక వెఱ్ఱి యావేశమును కనపరచు తెలుగువారికీ పోటీ ఢాక తీక్షతరముగా తాకు చున్నవి.
ముప్పదియైదుకోట్ల భారతీయులలో పది కోట్ల భారతీయులకు స్పష్టముగా అర్థచుగునదియు ఇతర సర్వ భారతభాషలతో పదసామగ్రియందు సంస్కృతపదముల మట్టుకైనను సామ్యము కలదియు బంగాళీ, గుజరాతీ, మహారాష్ట్ర, ఓఢములతో కొంత వ్యాకరణ సామ్యము కలదియు నైన హిందీ భాషను అధవా హిందూస్థానీ భాషను సర్వేంద్రియవ్యవహారములకు వాడుట మిక్కిలి సమంజసమనియు న్యాయమనియు సంగీకరింపక తప్పదు.
కాని హిందీకి ఈమాత్ప్రస్థానమును కల్పించి యూరకుండక తెలుగు దేశములోని ఎలిమెంటరీ పాఠశాలలలో హిందీ నిర్బంధముగా నేర్పేదమనువారును, తెలుగువారు తమలో తాము ఇదివరలో ఇంగ్లీషుమాట్లాడుకొనినరీతిని ఇప్పుడు హిందీ మాట్లాడుకొనువారును కలుగుట చేత దేశభాషలకు మహాపచారము జరుగుచున్నదని వాపోవు మాతృభాషాభక్తులు కన్పించినారు. గాంధీజీ మొదలుకొని తుదిదర్జా హిందీ ప్రచారకునివరకునుగల హిందీ అధికారపరంపర యంతయు దేశభాషలకు హిందీ శత్రువు కాదని యుద్ధోషించు చుండ దేశ భాషా వాదమును జేయువారు వట్టి వెఱ్ఱులని మొగము గంటువేసి చేతులు విదిలించి తోసిపుచ్చు దేశాభిమానులనేకు లున్నారు. హిందీవలన దేశమునకు మహాపచారము కలుగలదనువారలలో నేనును నొక్కడనే. కాని ఈవిధమగు జబర్దస్తీ త్రోసివేతలు మాత్రము తగవని నమ్రుడనైనే చేయుమనవి. విద్యారంభమునుండి హిందీని నిర్బంధము చేసి పై మెట్టు లోని దేశీయసభలలోను హిందీయేవాడుదుమనిన పిదప దేశ భాషలకు తావెక్కడిది? చిన్న భార్యకు సర్వాధికారము నిచ్చి పెద్ద భార్య నింట సంసారముండు మన్నట్లగుచున్నది. అంతా రామమయమన్నట్లు అంతా హిందీమయము చేసినను నేను సంతసింతును కాని దుఃఖింపను. అయిన నింత చక్కగా పెరిగిన మాతృభాషల నీరీతి తుదియవస్థకు తెచ్చుచున్నారను భావము ఏభాషాపుత్రుని కేనాడు తోచినను హిందీ మీదగట్టి తిరుగు బాటు కలిగి వెగటు పుట్టుననుట నిజము. కాబట్టి హిందీకి రాష్ట్రసామ్య భాషాస్థానము నిలుపుచు దేశభాషల కేమాత్రము దైన్యము కలుగని పథకము మీబోటి పండిత పరిషత్తులు నిష్పాక్షికముగ నాలోచింపదగును. హిందీయందు కలప్రేమచే సర్వమును హిందీ మయము చేయుదుమనువారు తమ యుత్సాహమును కొంత తగ్గించు కొనవలసియుందురు. కండ్లుమూసికొని ఇతరోపాయము లరయక హిందీకి తావొనంగ మనుటయు పొరబాటగును.
దేశ భాషలనిన మాతృభాషలు వీనిని తప్పించి మరియే భాషలో విద్యాబోధ చేసినను పిల్లలకు విజ్ఞానము సక్రమరీతిని అభివృద్ధి కాజాలదు. ఇదియంగీకృతమైన సిద్ధాంతము. కావున విద్యాబోధ జరుపునప్పుడు హైస్కూలు అంతస్తు దాటువరకును దేశభాషాధారక బోధయే ప్రచారము నందుండవలెను. మాతృభాషత గూడ నిర్బంధముగా మరియొక భాష నేర్పని ఏర్పాటు హైయ్యరు ఎలిమెంటరీ స్కూళ్ళలో ౮ వ తరగతివరకును గలదు. హైస్కూళ్ళనుకొను వానిలో మాత్రము నాలుగవతరగతి మొదలు ఇంగ్లీషు నిర్బంధముగా రెండవ భాషగా నేర్చుచున్నారు అనేక మైన హైస్కూళ్ళలో లోయరు సెకండరీ భాగము దాటిన పిదప అనగా ౮ వ తరగతికి పైన బోధన భాగము, ఒక్క మాతృభాషావిషయము నదక్క, అంతయు ఆంగ్ల భాషయందే జరుగుచున్నది. ఈ పద్ధతి తగదని మనమిదివరలో గట్టిగా విమర్శించి ప్రతిఘటించినాము. తుదకు కళాశాలలలో సహి తము దేశభాషాధారక బోధయే జరుగదగు నని అభిమానముతో పోరాడినాము, ఈ యు దేశ జాతీయపభుత్వము - కాంగ్రెసువారు మంత్రిపదవులు స్వీకరించుటచే ఏర్పడినయీ - దినములలో తీర్చుకొనక పోయిన మరియెప్పుడు తీర్చుకొనగలము ! తప్పక మాతృభాషల కీసహజ స్థానము సంపాదించి తీరవలయును. స్థానమును మనము దీనిని కాదని వాదించువారు జాతీయ వాదుల యం దొక్కరును కాన రారు. ములు ->>> ఇక భారత భూమియందు సర్వ దేశవ్యవహార మున కుపకరింపదగిన హిందీకిని, ప్రపంచవ్యవ • హారప్రయోజనమును కోరి నిలుపుకొనదగిన ఇంగ్లీషునకును, స్థానము ఎచ్చట నెప్పుడు చేయుదు రనుట ప్రశ్న. ఎనిమిదవ తరగతి వరకు మాతృభాషయు తదాధారక విద్యాబోధయు తప్ప మరియే భాషకును నిర్బంధమగు ప్రాధాన్యముండరాదు. అయిదవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకును కుఱ్ఱవారి కందఱకును పరీక్షలతోను ఫలములతోను సంబంధము పెట్టక వ్యవహార మాత్రమునకు పనికివచ్చునట్లు హిందీ యభ్యాసము చేయించవచ్చును. విశ్వకళాపరిషత్తులలో ఇంగ్లీషులో బోధ జరుగుచున్నంత కాలము ఐదవ తరగతి దాటిన దాదిగ ఇంగ్లీషుకు భాషాభ్యాసమాత్రమునకు నిర్బంధము పెట్టక తీరదు. విశ్వకళాపరిషద్విద్య దేశ భాషామూలకమై నడచునాడు ఈ నిర్బంధమును తొలగించి ఇంగ్లీషును ఎనిమిదవ తరగతి దాటిన పిదప అభిమాన శాఖలలో చేర్చవచ్చును. ఎనిమిదవతరగతి దాటిన వెనుక హిందీకిని అట్టి యవకాశమే కల్పింపతగును. సర్వతదేశభాషాధారక బోధయే జరుగునప్పుడు ౮ వ తరగతివరకు గల బళ్లకును హైస్కూళ్లకును ఇప్పుడు కల భేదముండదని గమనింపదగును.
విద్యాలయములయందలి ఏర్పాటులు మాత్రమాలోచించి మిన్నకుండిన నీ హింది సమస్య తీరిపోవు ననుకొనరాదు. ఏనాడు హిందీని భారత జాతీయ భాష కావింప నొప్పుకొంటిమో ఆనాటి నుండి దేశ భాషలకును హిందీకిని ఎంతటి పూర్ణసామ్యమును సాధింపవచ్చునో అంతటి సామ్యమును సాధించుట వైషమ్యమును నిరోధించుటకును ముందు తరములవారికి సౌలభ్యమును సమకూర్చుటకును పనికివచ్చును. అంతే కాదు దేశములోని వివిధ దేశభాషలను పరస్పరము ఏకరూపముగల యక్క సెలియండును గావించుటకును అవకాశము కలుగును.
పదజాలము మట్టుకైనను అన్ని దేశభాషలకును పాకృతములకు నెన్నెముకయైన మరియే భాష యోయగునని అందరును అంగీకరించినారు. ఇంగ్లీషు శాస్త్రవేత్తలు మన ౨౨౨ భాషలకును ఆధారమైనవి. ౫ మూల భాషాంకురములున్నపని నిర్ణయించినారనుట మరవలేదు. కాని ఇది మన ప్రస్తుత కార్యమున కనావశ్యము, డాక్టరు చిలుకూరి నారాయణ రావుగారిమతమున నేడు ద్రావిడ భాషలను కొనునవిగూడ — తెలుగు,కన్నడము, మళయాళము, తమిళము ఇత్యాదులు సర్వవిషయములందును వ్యాకరణ విషయమునందుసహా - ప్రాకృతజన్యములు. ఏనాడో ఏళ్లొద్ది భాగమో-ఏవంద-రెండు వందల పదములో - సంస్కృతసంబంధము లేనివి వనిన మనమంత గొప్పక లత పెట్టుకొననక్కర లేదు. ఆర్యనాగరళము ఆర్య వాఙ్మయము ఆసేతుహిమాచలము ప్రజలరక్తమున జీర్ణించిపోవుట చేత ప్ర్రాతిపదిక జాలమున సంస్కృతము మూలకముగా మన కైక్యము కలదనుట నెవ్వరును ప్రతిఘటింపలేరు. యవనులు, హూణులు, శకులాదిగా గల జాతులు దేశమును ప్రవేశించి
రాజపుత్ర జాతివంటి వీరజాతిని మన కిచ్చుట చేత ప్రాచీన పాశ్చాత్యార్యభాషల పదజాలమును మన భాషయందు కొంత ఇమిడినది. ముసల్మానులు ౮౦౦ సంవత్సరములు రాజ్యాధికారులుగ నేర్పడుటచేత అరబ్బీ, పారసీత్యాది భాషాపదములు కుప్పలు కుప్పలుగ మన భాషలలోనికి వచ్చి చేరినవి. అక్బరు కల్పించిన హిందూ ముస్లిము సమ్మేళన స్వరూపమైన ఉర్దూభాష, ఒక్క అరవమలయాళ దేశములలో తప్ప, తక్కిన భూములలో ఊరూరను నివాసము కల్పించుకొని మన భాషలకెంతో పదజాలమును చేర్చినది. దేశమును తరువాత ప్రవేశించిన పాశ్చాత్యజాతుల భాషలన్ని యును మనకు కొద్దిగనో గొప్పగనో పదముల సమర్పించినవి. ఇంగ్లీషు తక్కిన సర్వ భాషలకంటె చొరవగా మన వంటయింటిలోనికే ప్రవేశించి కాఫీ, టీ లరూపమును దాల్చినది. పాశ్చాత్యభూములలో సఖండముగా నభివృద్ధి చెందిన భౌతిక సాంఘికశాస్త్ర పరిభాష రమారమిగ నంతయు ఆంగ్ల పరిభాషనే యుండవలసి వచ్చినది. ఈ పరివర్తనమంతటిని నుదాహరించుటకు పదములపట్టికలను నిచట వ్రాయుచుండనక్కర లేదు. పట్టికలు పట్టికలుగు సిద్ధపరిచి డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు తమ యాంధ్రభాషాచరిత్ర ప్రథమ భాగమున పొందు పరచినారు. తక్కుంగల చోట్లను నవి కలవు.
పై వివరణము చేత స్థాపింపదలచిన విషయమిది. మన దేశ భాష లన్నిటియందును గల పద జాలమున చాల విశేష భాగము సమమయినది కలదు. దానిని పరిశీలించి విమర్శించి ప్రత్యేక పదముల యర్థము వ్యవహారమున భిన్న భిన్నమయి పోని తెరంగున ఇట్టి సాహిత్య పరిషత్తుల వారు నడపగలరేని దేశభాషల సౌభాతృత్వస్థిరీ కరణమునకు తోడ్పడిన వారగుదురు.
ఏభాష కాభాష వారు తమతమ సాహిత్య పరిషత్తుల యధీనమున నీ పని చేయవలసి యుందురు. అన్ని భాషల పరిషత్తులతో సంప్రదింపు జరిపి కేంద్ర పరిషత్తును - గాంధీజీ నాయకత్త్వమున నడచుచుండు అఖిలభారత సాహిత్య పరిషత్తు వంటి దానిని ఆధారభూమి చేసికొని తమ తమ భాషాపుత్రులకీ సంప్రదింపుల ఫలితములను తమ స్వంత పరిశోధనల ఫలితములను ప్రకటించుట ప్రథమక_ర్తవ్యమని తోచుచున్నది.
ఈ విధమగుకృషి జరిగినయెడల హిందీ తది తరదేశ భాషలసమస్య యొకటే కాక దేశ భాషలలో పరస్పరము కలుగునని ఇతరులు జంకించుచుండు సమస్యలును తీరుట కవకాశమగును. అరవవారు తెలుగువారు, తెలుగువారు కన్నడమువారు, కన్నడము వారు అరవము వారు,మలయాళము వారు, తమలో తాము కుమ్ములాడుకొని జాతీయైక్యతకు కల్గింతురను వాదమునకును బలము సడలును. నిజమునకు మన దేశములోని యొక్కొక్క ప్రముఖ భాషాభాగమును నేటి నాగరక రాష్ట్రములలో మిన్నయైన వేరు వేరు రాష్ట్రములయంత కలదు. జనసంఖ్యనుబట్టి యూరపులోని స్పెయిను,పోలండ్లు తెలుగుదేశముతో పోల్చదగినవి. రుష్యా, ఫ్రైఁసు, గేటుబిటనులు దప్ప తక్కిన వన్నియు తెలుగుజన సంఖ్యకు తగ్గునట్టివి. మన దేశమునందు హిందీ మాట్లాడుజనసంఖ్య రుష్యను మాట్లాడు జనసంఖ్యకు సరిపోవును. ఫ్రాంసు గేటుబిటనులు బంగాళీకి కొరవడును. ఈ పరిస్థితులాలోచించి యూరోపు ఖండమున వివిధరాష్ట్రములకు గల వైమనస్య వైషమ్యములను జ్ఞప్తికి దెచ్చుకొనిన యెడల మన దేశభాషల పుత్రులలో పరస్పరముకుల విభేదము లేనిదిగానే యెన్నదగునని యెవరైనను ఒప్పుకొన వలసివచ్చును. కాని మహోదారమగు భారతజాతీయైక్యత ప్రయత్నమును గావించుచుండు మనము తగిన పరిశ్రమచేసి ఉన్న కొలది భేదములనుగూడ భేదములు కానట్లు దిద్దగలమేని యూరపు ఖండ మాత్ర శాంతిని ఆశించి పలుపాట్లు పడుచుండు సర్వరాష్ట్ర సమితికి మార్గదర్శకము కాగల భారత సమితిని స్థిరపరచగలము. ఈమహాఫల సాధించు సదుద్యమమున మీబోటి పండిత పరిషత్తులు ముందంజె వైచి పనిచేయవలసినదను ప్రార్థనాపూర్వకహృదయ వేదనను బహిర్గత మొనర్చి యానందించుటకే మీయాహ్వానము నంగీకరించితిని. శుభంబగుగాక !
[ఇది ఆంధ్రసాహిత్యపరిష ద్రజతోత్సవసమయమున చదివిన వ్యాసమునుండి] నారనవ్వారు
శ్రీ గొల్లపూడి సీతారామశాస్త్రి గారు నూలుతోగాని నారతోగాని నవ్వారు నేయ వచ్చును. నారను పురిపెట్టి, ఆపురితో నవ్వారు తయారు చేయనగును. గోగునారతోగాని, జనుప నారతోగాని పురి పెట్టవచ్చును. కాని, జనుపనార పురి ఆరోగ్యకరము కాదు. గోగునారపురి యంత్ర ములమీదగాని, తిక్కిడిమీద చేతితోగా తయారగును. మరపురికంటే చేపురి నాణెమయి నది. పెక్కుమందికి పని కల్పించును. కాబట్టి, గోగునారను చేతితో పురిపెట్టి, చేతితో నేసిన నవ్వారు శ్రేష్టము, "గాని మణుగుపురి సుమారు రు 3-0-0 అగును. లకు 0-80 కు మించదు. నేత మగ్గము మంచిది రు ౧-౦-౦. కాన, పెట్టుబడి రు ×-O-ం లకు లోపుగానే ఉండును. పురిపెట్టు య రోజుకు E వానికి రోజుకు ౨,౩ అణాలు గిట్టును. వానికి రోజుకు 8 అణాలు గిట్టును. గంటలలో గం గజములు నేయవచ్చును. ఇం గజాలనవ్వారు వీ సెడు తూగును. దాని ఖరీదు రు ౦-౧౩-౦. మంచమునకు 3 వీసెలు సరిపోవును. గట్టిగా ఉండును. మేలుగా ఉండును. చాల స్త్రీలును, పురుషులును, వృద్ధులును, పిల్లలును, ఈపనిచేయవచ్చును. ౧౦ ఏండ్లలోపలివారు కూడ నేయగలరు. నీళ్ళలో నాన వేసినను నవ్వారు పోదు. నూలున వ్వారుకంటె చాలఏండ్లు మనును. కాబట్టి, ఇది ప్రోత్సహింప దగిన తేలిక పని. ౧౦ రోజులలో నేర్చుకొనవచ్చును. వలయు వారు వినయాశ్రమములో తర్చీతు పొందనగును.
కూచిపూడి వారి రంగము
దివాకర్ల రామమూర్తి గారు
కాళిదాస భవభూతులు కాలములందు రంగము లెట్లలంకృతములో మనకు చిత్రఫలకములు లేవు. కాని కాళిదాసునితో తుల్యుడనుకొను ఆంగ్లనాటకకర్తయగు “షేక్స్పియరు" మహాశయుని కాలమునందు నాటక రంగము ట్లుండెనో వారు దాచియుంచిన ఛాయాచిత్రములవలన తెలియును. రంగము లెట్లు క్రమ క్రమముగా వృద్ధిపొంది ఏ పరిణామము నవలంబి ఊహించుటకు వలయు సాధన పరికరములు మృగ్యము. (ఆంధ్ర దేశమున) మన దేశమున కూచిపూడి వారి రంగము ప్ర్రాచీన సంప్రదాయాను గుణముగ వారిరంగములయందును మార్పు వచ్చినదిగాని ౨౦ వ శతాబ్ద ప్రారంభమున ప్రాచీన సంప్రదాయములు వారలను వదలలేదు. ఇప్పటికయినను కొన్ని కాలప్రవాహము యొక్క వడికి కొట్టుకొనిపోక నిలిచినవి.
నేడు వారి రంగములు ప్రాచీన వీధీరంగముల కొక మెట్టు ఉన్నత నాగరక స్థితిలో నున్నను, ఆధునిక నాగరక రంగములకు చాల లొచ్చుగా నున్నవనుటలో సందేహము లేదు. నూతనరంగములు కపరిచితు లయిన ప్ర్రాచీన
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse