Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 11/సంచిక 3/తాడేపల్లిగూడెము తా॥ గ్రంథాలయ సంఘము-చతుర్థ వార్షిక నివేదిక

​

తాడేపల్లిగూడెము తాలూకా గ్రంథాలయ సంఘము

చతుర్థవార్షిక నివేదిక ౧౯౩౬౼౩౭

వెనుకటి చరిత్ర

తాడేపల్లిగూడెము తాలూకా గ్రంథాలయ సంఘము ౧౭-౧౧-33 వ తేదీని నెలకొల్పబడి, ఇప్పటికి సుమారు 3 సం॥రముల ౪ మాసములనుండి ఈ తాలూకాయందలి గ్రంథాలయోద్యమవ్యాప్తికి పాటుపడుచుండెను. ఈ సంఘము ప॥ గోదావరిజిల్లా సంఘమునకును, ఆంధ్ర రాష్ట్ర గ్రంథాలయ సంఘమునకును, శాఖగా చేర్చఁబడినది. లోగడ జరిగిన 3 తాలూకా సభలకు శ్రీ యుతన. సత్యనారాయణగారును, అ. కాళేశ్వరరావుగారును, శ. సుబ్బారావుగారును, అధ్యక్షత వహించియుండిరి. ఈ చతుర్థమహాసభకు గ్రంథాలయోద్యమ నాయకులగు శ్రీయుత గాడి చెర్ల హరిసర్వోత్తమరావు గారు ప్ర్రారంభకులుగను, శ్రీయుత మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు అధ్యక్షులుగను, అరుదెంచుట ముందు కార్యక్రమ సాఫల్యమునకు ఎంతయు శుభసూచకము, ౧౯3౫ సం॥ములో ప్రధమ గ్రంథాలయ యాత్రను ప్ర్రారంభింపజేసి యుంటిమి. మరల ౨ సం॥ములకు నేడు శ్రీయుత అయ్యంకి వెంకట రమ ణయ్య పంతులు గారి చే, ద్వితీయ గ్రంథాలయ యాత్రను

ఇప్పటి చరిత్ర

ఈ తాలూకాయందు ౬౦ గ్రంథాలయములు కలవు. ఇవి ౧౨ గ్రూపులుగా విభజింపబడి, గ్రూపు డైరెక్టరుల పరిశీలనము క్రింద పనిచేయుచున్నవి. ఇందు 3 జిల్లాబోర్డు గ్రంథాలయములు;3౭ పంచాయతీబోర్డు గ్రంథాలయములు; ౨౦ సంఘ(కమిటీ) గ్రంథాలయములు; జిల్లా బోర్డు గ్రంథాలయములు చక్కగ పని చేయుచున్నవి. సంఘగ్రంథాలయములు, ఆర్థికలోపము కలిగియున్నను యధాశక్తిని పొటుపడుచున్నవి. పంచాయతీబోర్డు గ్రంథాలయములు మాత్రము లోకలు బోర్డు ఇన్స్పెక్టరుగా రడుగడుగునకు పెట్టుచున్న యాటంకములవలన నిరుపయోగముగ పరిణమించుచున్నవి.

తాలూకాసంఘము చేసినకృషి

౧. తాలూకా కార్యనిర్వాహకవర్గము ౫ పర్యాయములు సమావేశమయ్యెను.

౨. ఆంధ్రపత్రిక ను రు ౧౮ లు తగ్గింపు రేటునకు తెప్పించుచున్నారు.

3. భారతీ రు ౪-౮-ం తగ్గింపు రేటునకు తెప్పించుచున్నారు.

౪, జిల్లాకలెక్టరు గారు, ఖాళీస్థలములను ఉచితముగ గ్రంథాలయభవనముల నిమిత్త మిచ్చుటకు వాగ్దానము చేసిరి.

౫. మూఁడు నూతనగ్రంథాలయములను పెట్టించిరి

౬. ఆంధ్రపత్రికను తెప్పించుచున్న గ్రంథాలయములు ౧౮

౩. భారతిని తెప్పించుచున్న గ్రంథాలయములు ౯

౮. సర్వస్వమును తెప్పించుచున్న గ్రంథాలయములు ౯

౯. గవర్న మెంటు గ్రాంటులకు దరఖాస్తులు పెట్టిన గ్రంథాలయములు ౧౫

౧౦. జిల్లాబోర్డు గ్రాంటునకు దరఖాస్తులు పెట్టిన గ్రంథాలయములు ౯

౧౧. లోకులు బోర్డు ఇనస్పెక్టరుకు ౨౧౩ వ సర్యులరు ప్రకారము అనుమతి నిమిత్తము పంపబడిన దరఖాస్తులు ౧౦

౧౨, జిల్లావిద్యాధి కారిఅంగీకారనిమిత్తము పంపబడిన గ్రంధముల జాబితాలు ౧౦

౧౩. వార్షికోత్సవములు జరిపిన గ్రంథాలయములు ౭

౧౪. మ్యాజికులాంతరుఉపన్యాసములు ౭

౧౫. కార్యదర్శి స్వయముగా వెళ్ళిన గ్రంథాలయముల సంఖ్య ౨౪

మరియు గ్రంథాలయ డెరెక్టర్లు, వారి వారి గ్రూపులు యందలి గ్రంథాలయములకు తఱచు వెళ్ళుచుండిరి.

౧౬. గీతాభూమిక, శ్రీకృపానందాభయప్రదీపిక మున్నగు గ్రంథములను గ్రంథకర్తలనుండి తెప్పించి ఉచితముగ గ్రంథాలయములకు ఈయబడెను.

౧౭. ఆ గోవిందాచార్యులు, మానికొండ సత్యనారాయణగార్లు, హిందూస్థాన్ పబ్లిషింగు కంపెని ఆనందప్రెస్సు, సరస్వతీ గ్రంథమాల, హరిజనగ్రంధమాల వీరి గ్రంధములను తగ్గింపు రేట్లకు మాటలాడి గ్రంథాలయములకు తెప్పించుటకు తోడ్పడి యుండిరి.

౧౮. గ్రంథాలయనిర్వాహకులను సమావేశపఱిచి చందాదార్లను చేర్చుటకును గ్రంథములజాబితాలను తయారు చేయుటకును గ్రాంటులను సంక్షను చేయుటకును హెచ్చరించి యుండిరి.

౧౯. కొన్ని గ్రంథాలయములకు రిజిష్టరు సప్లయి చేసి యుండిరి.

౨౦. “వయోజన విద్య” అను పొత్తములను ప్రచురించి జిల్లాయందలి అన్ని గ్రంథాలయలముకు ఉచితముగా పంచియుండిరి. ​"ప్రచురణలు" కొన్ని గ్రంథాలయముల ఉపయోగార్థము అచ్చువేయించి అన్ని గ్రంథాలయములకు సప్లయి చేసి యుండిరి.

౨౨ సాలు సరిని వేదికలు, లోకలు బోర్డు ఇన్ స్పెక్టరు దరఖాస్తు ఫారములు మున్నగునవి అచ్చువేయించి గ్రంథాలయములకు సప్లయి చేయబడెను.

గ్రంథాలయముల కృషి

శ్రీయుత టి. సి దత్తా గారి పర్యటనము

వంగ రాష్ట్ర గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శిగారగు శ్రీయుత టి.సి.దత్తాగారును, వారి సతీమణియు అయ్యంకి వేంకటరమణయ్య గారును ఈ తాలూకాయందు ౧౨ గ్రంథాలయములను దర్శించి, విశేషప్రబోధము కావించిరి.

గ్రంథాలయముల గ్రాంటులు

గవర్న మెంటువారు 3 జిల్లాబోర్డు గ్రంథాలయములకు రు 33౬ లును, ౨ సంఘగ్రంథాలయములకు రు 20 లును శాంక్షన్ చేసిరి. జిల్లా బోర్డు వారు గ్రంథాలయముల కెట్టి ఆర్ధిక సహాయమును చేసి యుండలేదు. పంచాయితీ బోర్డులకు ప్రత్యేకించిన గవర్న మెంటు గ్రాంటునకు దరఖాస్తులు సకాలమున వెళ్ళకపోవుటవలన, ఒక్క గ్రంథాలయమున కైనను గ్రాంటులు వచ్చియుండలేదు. పంచాయతీబోర్డులు 03 సర్క్యులరును బట్టి అనుమతిలేని కారణమున పంచాయతీద్రవ్యమును ఖర్చు చేసి యుండలేదు.

సంఘము యొక్క ఆదాయ వ్యయములు

ఆదాయము రు3౬ లు. వ్యయము రు౬౨. కార్యదర్శికి ఈసం||రము కూడ చేతి సొమ్ముపడుట తప్పినది కాదు. వివరములు ఇందు జతపఱంచుచున్నాను.

ఇప్పటి కర్తవ్యము

౧ గ్రంథాలయములు లేని ౨ పంచాయతీ బోర్డులచే గ్రంథాలయములను పెట్టింపవలెను.

౨. గ్రంథాలయములు లేక పంచాయతీబోర్డులు లేక ౧౦౦౦ జనాభా ఉన్న ౧౨ గ్రామములలో నూతన, గ్రంథాలయములు పెట్టవలెను.

3. “పొందువ్వ" ప్రణాళిక ప్రకారము గ్రంథాలయోద్యమ వ్యాప్తికి తోడ్పడుటకు జిల్లా బోర్డువారికి ఒత్తడి చేయవలయును.

౪. లోకలుబోర్డు ఇ౯స్పెక్టరుగారి ౨౧3 సర్క్యులరు వెంటనే రద్దు చేయుటకు కృషి చేయవలయును.

౫. గవర్నమెంటు గ్రాంటులను,అన్ని గ్రంథాలయములకు ఇచ్చునటుల సకాలమున కృషి చేయవలయును.

౬. రిజిస్ట్రేషను ఫీజు తగ్గించుటకు ప్రయత్నింపవలయును.

౭. ఎక్కువ కృషి చూపుటకు తాలూకా కొక గ్రంథాలయ విచారణకర్తను కొంత గౌరవభృతితో నియమింప వలయును.

౮. గ్రంథాలయ సంఘమును రిజిస్టరు చేయుటకు ప్రయత్నింపవలయును.

౯. గ్రంథాలయ సంఘమునకు ఆదాయము చేకూర్చుటకు ఒక నాటకమును ఏర్పాటు చేయవలయును.

౧౦.చక్కగ నడపబడుచున్న గ్రంథాలయమునకు తిరుగుడుగిన్నె (Rolling Cup) ఒకటి బహుమతి చేయుటకు ధనము చేకూర్పవలయును.

౧౧. మ్యాజికులాంతరు కొనవలయును. ౧౨. వేసవి సెలవులలో ఉన్నతవిద్యార్థుల చే గ్రం థాలయములవద్ద ఉపన్యాసములు ఏర్పాటు చేయవల యు. ౧౭. ఒకే గ్రామమున హెచ్చు గ్రంధాలయములున్నచో వాని నన్నిటిని సమ్మేళనము చేయుటకు ప్రత్నింప వలయును.

౧౪. గ్రంథాలయములకుగల స్థిరాస్తులకు టస్ట్రుదస్తావేజులు(Trust deeds) రెజిస్టరు చేయింపవలయును,

ముగింపు

ముందు సం॥ము పై కార్యక్రమము సరిగా జరుపుటకు గ్రంథాలయ సేవకులకు దృఢ సంకల్పమును, కార్య దీక్షయు ప్రసాదించుగాక యని యీశ్వరుని ప్రార్థించెదను.

తాడేపల్లిగూడెము,
5-8-32.

తే॥ సత్యనారాయణమూర్తి

తాకి గ్రంథాలయ సంఘ కార్యదర్శి.

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse