Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 11/సంచిక 3/గ్రంథాలయములలోని పుస్తకములు ప్రభుత్వము వారి తనిఖీ

​

గ్రంథాలయములలోని పుస్తకములు-ప్రభుత్వము వారి తనిఖీ

శ్రీమల్లెల శ్రీరామమూర్తిగారు

గ్రంథాలయోద్యమము విద్యకు సంబంధించినది. గ్రంథాలయములవలన ప్రజలలో విజ్ఞానవ్యాప్తి కాగలదని ఎల్లరంగీకరించిన విషయమే. పాశ్చాత్యదేశ ప్రభుత్వములు ప్రత్యేక గ్రంథాలయశాఖ నేర్పరచి, ధనమును ప్రత్యేకించి, తామే నిర్వహించుచు, గ్రంథాలయోద్యమాభి వృద్ధి చేయుచు, ప్రజలలో విజ్ఞానమును వెదజల్లుచున్నారు. విరివిగ ప్రభుత్వధన సహాయము లేనిది గ్రంథాలయోద్యమము సర్వతోముఖముగ వ్యాప్తి చెంద నేరదు. మన దేశమున ప్రభుత్వమువారు గ్రంథాలయోద్యమాభివృద్ధికి చేయు సహాయముకంటె, అడ్డంకులును, షరతులును, తీవ్రముగ నేర్పరచి గ్రంథాలయోద్యమమును అణగ తొక్కుచున్నారని చెప్పవచ్చును. అయినను, ఉద్యమ నాయకోత్తముల ప్రచారమువల్లను, ఉదారులగు ప్రజల ధన సహాయము వల్లను, భారతవర్షమున గ్రంథాలయోద్యమము దినదినాభివృద్ధి గాంచుచున్నది. భారతావనిలో గ్రంథాలయోద్యమమున ఆంధ్రదేశము ఉన్నతస్థానమాక్రమించినది. మన మద్రాసు ప్రభుత్వము వారు గ్రంథాలయములకు విరాళమిచ్చుటకై చాల కఠిన నియమములు చేసిరి. అందు గ్రాంటుకోరు గ్రంథాలయము రెజష్టరు చేయవలెనన్న షరతు విషతుల్యమైనది. గ్రంథాలయములు ఆంధ్ర దేశమున ౮౦౦ లకు పైగా ఉన్నవి. ఇందు ఈసంవత్సరము మద్రాసు ప్రభుత్వమువారి వలన ౫౯ గ్రంథాలయములు మాత్రమే రు ౪౪౭౦ ల గ్రాంటును పొందగలిగినవి. ఈ సంవత్సరము మదరాసు రాష్ట్రమంతటికిని ౧౨౯ గ్రంథాలయములకు మాత్రము రు ౯౮౪౨ ల గ్రాంటును ప్రభుత్వము మంజూరు చేసినది. దీనినిబట్టియే మద్రాసు ప్రభుత్వమువారికి గ్రంథాలయోధ్యమము పైగల విముఖత్వము స్పష్టపడుచున్నది. ప్రభుత్వమువా రిచ్చుగ్రాంటు ప్రకటింపగనే యియ్యరు. గవర్నమెంటు వారెంత ధనమిత్తురో అంత “మొత్తమును గ్రంథాలయము వారుకూడ చేర్చి, గ్రంథాలయమునకు గ్రంథములను ఖరీదు చేయవలెను. రెండు మొత్తములను కలిపి ఆ ధనముతో ఏ యే పుస్తకములు కొనదలచిరో ముందుగా ప్రభుత్వమువారికి అనగా జిల్లా విద్యా శాఖాధికారికి-జాబితా వ్రాసి పంపవలెను.

అందు జిల్లావిద్యా శాఖాధికారిగారు నిర్ణయించిన పుస్తకములనే కొనవలెను. వారు కాదనిన పుస్తకమును కొనరాదు. అప్పుడు వారిచ్చుధనము ఇచ్చెదరు. గ్రంథాలయములను రెజస్టగు చేయించుటకు ధనము లేనికతన ప్రభుత్వ సహాయమును చాల గ్రంథాలయములు పొందజాలకున్నవి. ప్రభుత్వమువారిపై చిక్కులను పడలేక చాల గ్రంథాలయములవారు సహాయమును కోరుట లేదు. ఆశపడి దరఖాస్తులను పెట్టుకొనినవారిలో చాలమంది దరఖాస్తులగతి ఏమైనదో తెలియక నిరాశ చెందుచున్నారు. ప్రభుత్వమువారికి గల గ్రంథాలయోద్యభిమానమిట్లున్నది. ఇంక జిల్లా విద్యాశాఖాధికార్లు పుస్తకములను నిర్ణయించు వైఖరిని విమర్శింతును. మన దేశమున రాజకీయ పుస్తకములే తక్కువ. ఇప్పుడిప్పుడే కొన్ని బయలు దేరుచున్నవి. జిల్లా విద్యాశాఖాధికారులు గ్రంథాలయములవారు పంపినజాబితాచూచి పుస్తకములను చూడకుండగనే చదువకుండగనే పేరును చూచి రాజకీయమైన పుస్తకమని భయపడి కొనకూడదని బహిష్కరించుచున్నారు. రాజద్రోహ పూరితములని ప్రభుత్వము వారు ప్రకటించిన గ్రంథములను బహిష్కరించుట ఒక విధముగ అంగీకరింప తగినదే. రాజకీయమై దేశమునకు సంబంధించిన వివిధ విషయములను గురించిన పుస్తకములు గ్రంథాలయములలో నుండకూడదని నిర్ణయించుట కడుంగడు శోచనీయము. జిల్లా విద్యాశాఖాధికారుల నిర్ణయములకు ఒక హద్దు ఒక పద్దులేదు. ఒక జిల్లా విద్యా శాఖాధికారి అంగీకరించిన నొక అధికారి అంగీకరింపడు. ఎవరిచిత్తము వచ్చినట్లు వారు తీసివేయుటతప్ప వారి కొక కట్టుబాటు లేదు. ఏ పుత్తసకము ఎందుకు తీసివేయుచున్నారో వారికే తెలియదు. పుస్తకములను చదివియైనను తీసివేయుట మేలు. ఏమియు తెలిసికొనక భ్రమ చెంది కొనకూడదని నిర్ణయించుట ఏటి న్యాయము?

కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారిగారీ సంవత్సరము ఈ దిగువ పుస్తకములను బెజవాడలోని శ్రీభ్రమరాంబా మల్లేశ్వరాంథ గ్రంథాలయమువారు కొనకూడదని నిర్ణయించిరి. దీనిని బట్టియే అ అధికారికిగల లోకజ్ఞానమును చదువరులు నిర్ణయింపవచ్చును.

భారత రాష్ట్ర శాసనసభల ఎన్నికలు, లోకలు బోర్డు ఎన్నికలు, ఎలెక్షను నేరములు, విశ్వాసరాహిత్యపు తీర్మానములు వీనిని గూర్చి శ్రీ అవసరాల వెంకటనర్సు, బి.ఏ. ​బి. ఎల్. గారు 'ఎలక్షన్లు' అను పేర ఒక గ్రంధమును రచించిరి. అది ఆంధ్ర పత్రికా ముద్రాలయమున ముద్రింపబడినది. ఆ పుస్తకమంతయు ౧౯3౫ సం॥రపు ఇండియా పరిపాలన చట్టములోని ఎన్నికలకు సంబంధించిన నియమములను ఆంగ్లమునుండి తెలుగు భాషలోనికి తర్జుమాచేయబడినదే. ౧-౮ 3౭ నుండి అమలు చేయబడనున్న రాజ్యాంగ మునకు సంబంధించిన నిబంధనలు అందువివరింపబడినవి. ఇక మునిసిపల్ ఎన్నికలు, హైకోర్టు తీర్పులు మున్నగునవి వ్రాయబడినవి. ప్రభుత్వము వారి నిబంధన అను తెలుగు భాషలోనికి తర్జుమా చేసి ప్రకటించిన యీగ్రంధమును కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి దేనినిబట్టి కొనకూడదనెవో తెలియదు. 'ఎలక్షన్లు' అని గ్రంధ నామంబగుటం చేసి కాంగ్రెస్సుకు సంబంధించిదని భ్రమించి తీసివేసి యుందురేమో ! మరియు కాశీనాధుని పూర్ణమల్లి కార్జునుడు గారిచే రచింపబడిన 'నూతన రాజ్యాంగ విధానము' అను పుస్తకమును కూడ కొనకూడదనిరి. ఈ గ్రంధమంతయు నూతన రాజ్యాంగ శాసనములోని రాజ్యాంగ విధానమును తెలుపుచున్నది. ఇదియు ఇండియా చట్టములోని ముఖ్య భాగములకు తెలుగుతర్జుమా అని చెప్పక చెప్పుచున్నది.

ప్రభుత్వమువారు ప్రకటించిన నిబంధనలకు, సూత్రములను అనువాదము లనందగిన యిట్టి గ్రంథములనే కొనకూడదనిన ఇక చెప్పెడిదేమున్నది? మచ్చున కీ రెండు ఉదాహరించితి. ఇంకను వారు కొనకూడదని నిర్ణయించిన పుస్తకముల పట్టిక పూర్తిగ క్రింద తెలుపుచున్నాడను.

ఆంధ్ర గ్రంథములు

౧. హిందూదేశము క్రైస్తవప్రభుత్వనిర్మాణతత్వము.
౨. ఫాసిజం - కమ్యూనిజం.
3. కారల్ మార్క్సు ఉపదేశములు .
8. సోషలిజం ఎందుకు.
౫. నేటి స్పెయిన్.
౬-౭. ఆధునిక రాజ్యాంగ సంస్థలు.

౧, ౨ భాగములు

౮-౯. చైనాజాతీయోద్యమము.

౧, ౨ భాగములు

౧౦. భారతీయ కార్మికోద్యమచరిత్ర,
౧౧. స్వాతంత్య్ర మెవరికొరకు.
౧౨. సురానంద.
03. కర్నాటక రాజ్య నాశనము.
౧౪. కల్లు పెంట.
౧౬. పరమార్థ జడ్జిమెంటు.
౧౬. ఓటు.
౧౭. సీతారామరాజు మరణకారణము,
౧౮. తిలకు సెక్యూరిటీ కేసు ఉపన్యాసము.
౧౯. నా ఎలెక్షను అనుభవము.
౨౦. లోక భయంకరుడు.

ఆంగ్ల గ్రంథములు

21. The Modern Indian Peasant
22. The Philosophy of the Village Movement
23. Why the Village Movement?
24. The Heart of India
25. Speeches and writings of Sarojini Naidu :
26. India and the World
27. New Constitution of India
28. Glimpses of World History
29. Letters from a Father to his Daughter

వర్తమాన కాలమున ఇట్టిXంధములను 'భారతదేశ ప్రజలు చదువుట చాల అవసరము. గ్రంథాలయములవారు ఇట్టి గ్రంధములను కొనకూడదని అధికారులు నిర్లయించుట చాల అన్యాయము. రాజకీయ విజ్ఞానము ప్రజలలో ఇనుమడింపవలసిన యిక్కాలమున ఇట్టినిర్ణయములు జిల్లా విద్యాధికారులు చేయుట కడుంగడు విమర్శనీయము. ప్రభుత్వమువా రీవిషయమై విచారణ గావించి యిట్టి నిర్ణయములు చేయకుండ విద్యాశాఖాధికారులను మందలింపవలసియున్నది. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము వారును, మద్రాసు అసెంబ్లి సభ్యులును ఈ విషయమై త్రీవవ్రాందోళనము చేసి, ప్రభుత్వముచే నిషేధింపబడని రాజకీయగ్రంధములను గ్రంథాలయములవారు కొనకూడదను జిల్లా విద్యాశాఖాధికారుల నిర్ణయములను రద్దు చేయించు టత్యవసరమని విన్నవించుచున్నాడను.




This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse