Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 11/సంచిక 2/విద్యావ్యాప్తి-గ్రంథాలయాలు

​

విద్యావ్యాప్తి గ్రంథాలయములు

శ్రీకందుకూరి విశ్వనాధము, బి. ఏ.

నేటి సభకు నన్ను ప్ర్రారంభకునిగా నిర్ణయించి గౌరవించినందుకు కృతజ్ఞడను. ఈ గ్రామవాసులును, పంచాయతీవారును విద్యావ్యాప్తి పట్ల చూపుచున్న ఉత్సాహము శ్లాఘనీయము. మనదేశమున నెలకొనిన అనారోగ్యపరిస్థితులును, సాంఘిక వైషమ్యములును, ఆర్థిక ప్రతిబంధకములును తొలగి పోవలెనన్నచో, సర్వతోముఖమగు విద్యావ్యాప్తికి మించిన యుపాయములేదు. విద్యావశ్యకతను శంకించువారిప్పుడెవ్వరును లేరు. కాని నేటి విద్యావిధానము విశేషమగు ధనవ్యయమునకు కారణమగుటచే సామాన్య ప్రజల కందుబాటులో లేదు. ఉన్నత పాఠశాలలును, కళాశాలలును, విశ్వవిద్యాలయములును పట్టణములలో నెలకొల్పబడి యున్నవి. కావున పల్లెటూరి ప్రజలకు వాని ప్రయోజన మంతగా సిద్ధించుటలేదు. ప్రస్తుత పరిస్థితుల క్లిష్టతనుబట్టి వానిని పల్లెలలో నిర్మించుట అసాధ్యము. కావున సామాన్యముగా పల్లెటూరివారు ప్రారంభ విద్యతో, సంతుష్టిపడవలసి వచ్చుచున్నది.

ఈ ప్ర్రారంభ విద్యయైనను నూటికి ఏ పదిమ౦దికో గాని లభించుటలేదు. అదియు అభివృద్ధి కవకాశము లేక భావముననే జీర్ణమగు చున్నది. కావున ప్రారంభవిద్యకై పడిన శ్రమయు, చేసిన ఖర్చును చాలవరకు నిష్ఫలమగు చున్నవి. అది చురుకుగా కొనసాగుట లేదనుకొనుచుండగా పై పెచ్చు నేర్చిన కొలదిమందిలో సైతమది పూర్తిగా నిలుచుట లేదు. నేర్చిన దానిని నిల బెట్టుకొనుటకును, దాని నభివృద్ధి మార్గమున నడపుకొనుటకును గ్రంధాలయములే పరమసాధనములు.

ముద్రణయంత్రములు నిర్మించబడినప్పటినుండియు ఉపాధ్యాయుల అవసరము తగ్గిపోవుచున్నది. వారిస్థానమున గ్రంధములు సాయపడుచున్నవి. ఉపయోగానువయోగముల గమనించి సేకరించిన గ్రంధములే పాఠశాలలవలెను, కళాశాలలవలెను, విశ్వవిద్యాలయములవలెను వ్యవహరింప గలవు. కావున మీ గ్రంథాలయము మీ గ్రామములో స్థాపితమైన యొకానొక విశ్వవిద్యాలయమని గుర్తించవలెను. కేవల గ్రంధిసహాయమాత్రమున విద్యాధికులైన వారనేకులు గలరు. ఆంధ్రకవితా ప్రపంచమున మహాప్రఖ్యాతి వడసిన పోతన కవి గురుసహాయమపేక్షింపక గ్రంధాధారమున పాండిత్యము సంపాదించెను. మహావక్త యగు బీపిన్ చంద్రపాలు గ్రంథాలయ సహాయమున నంతటి వాడయ్యెను. జగత్కవియగు రవీంద్రనాధ టాగూరు గారికీ గ్రంధములే గురువులు. కేవలగ్రంధములే పోతన,బిపిన్ చంద్ర పాలు టాగూరు వంటి మహా పురుషులను నిర్మింప జాలినప్పుడు గ్రంథాలయములపట్ల మన మెంత శ్రద్ధవహింపవలెనో గమనింపుడు.

కాని గురువులవలె గ్రంథములు కోపించి, దండించి మనలను పఠనోన్ముఖుల గావింపజాలవు. మనలో విద్యాతృష్ణము కలిగిన గాని గ్రంథములు సాయపడజాలవు. మనలో విద్యాతృష్టము కలిగినగాని గ్రంధములు సాయపడజాలవు. విశ్వవిద్యాలయములలో పట్టభద్రులైన వారిలో సైతము పఠనాభిలాష కొరవడియున్నది. సామాన్యప్రజలలో విద్యాతృష్ణ ఆకస్మికముగా నుత్పన్నము కాగలదనుకొను టెట్లు? కావున గ్రంథాలయమును స్థాపించిన మాత్రమున స్థాపకుల కార్యము పూర్తికాదు. ప్రజలలో విద్యాతృష్ణ పుట్టించుట మొదటి కర్తవ్యము. లేనిచో గ్రంథాలయములు నిరుపయోగమగును, జనాకార్షకమగు గ్రంథములు సేకరించుటీందులకొక సాధనము. నేనీ జిల్లాలోని పంచాయతీ గ్రంథాలయములను తదితర గ్రామగ్రంథాలయములను చాలవరకు చూచితిని. సంఖ్యయు ధరయు మాత్రమే అందలి పుస్తకముల సేకరించినవారికి ప్రధాన సూత్రము లైనట్లు నేననుకొనవలసివచ్చినది. కంటికింపైన ప్రతులు బహుస్వల్నముగా కౌన్పించినవి. మరియు పుస్తకములు కొనుటలో పాఠకులగాని ఇష్టానిష్టములు గాని ఉపయోగానుపయోగములు గాని యోచింపక స్వీకర్తలు నిరంకుశముగా వ్యవహరించిన జాడ గోచరించినది. కొన్ని గ్రంథాలయములలో కర్మకాండకు చెందిన ప్ర్రతకల్పములు మొదలగు వట్టివైదిక గ్రంధములు మాత్రమే కనబడినవి, కొన్నిచోట్ల కథాప్ర్రాధాన్యముగల ఆపరాధ పరిశోధక నవలలు మాత్రము ప్రత్యక్షమైనవి, మరికొన్ని చోట్ల వేయిమందిలో ఒకనికైన అర్థము గాని బంధకవిత్వ గ్రంధములు మాత్రమే కనబడినవి. ఏదో ఒక్క విషయమునకు సంబంధించిన గ్రంధములే సేకరించుటయు, వినిమయ పద్దతులతో వ్యవహరించుటయు పరస్పర సంబంధ వ్యవహారములుగల గ్రంథాలయములకు సరిపడుగాక; కాని ఇతరేతర సంబంధములు లేని గ్రంథాలయములకు మాత్ర మిట్టి పద్ధతి శ్రేయస్కరము కాదు. గ్రంథతత్త్వమెరిగి కొనవలెను. కొన్నవి కంటి కింపుగా నుండవలెను. గ్రంథాలయోద్యమము విరివిగా వ్యాప్తమైయున్న అమెరికా మొదలగు దేశములలో గ్రంధాల ​యోపయోగమునకై ప్రఖ్యాత గ్రంధములకు ప్రత్యేక ముద్రణములు జరుగుచున్నవి. సామాన్యముగా ముద్రిత మైన ప్రతులకంటే వాని విలువ హెచ్చుగానుండును. అవి చూచినంతనే ప్రజలను తమవంక కొకర్షింపజాలును. మన పల్లెటూరి గ్రంథాలయములలోనో సర్వము విరుద్ధము. చాకలి కొంపలలో గ్రామమాలిన్య మంతయు చేరుకొన్నట్లు అచటచింకిరి పుస్తకములన్నియు చేరుకొనును. వస్తుతః పుస్తకములు పేరందిన చైనను వాని వికృతస్వరూపమునంజేసి చదువరులు దరిజేరరు. కావున గ్రంథముల సేకరించుటలో మీరు తగు శ్రద్ధ జూపవలెను. ఒక సంస్థ యొక్క. స్ప్రయోజన సిద్ధి దాని వ్యవహార నిర్వహణ పద్ధతిపై ఆధారపడి యుండును, స్థాపించినంతనే కాదు.

మన జిల్లాలో స్వంతభవనములు గల గ్రంథాలయములు స్వల్పముగా నున్నవి. తక్కినవి అద్దెయిండ్లలోనో మరెక్కడనో కునుకుచున్నవి. ఆత్మకు శరీరమువలె గ్రంథాలయమునకు భవనము వ్యవహారాధారము. అట్టిభవన మన్నికులముల వారును చేరుట కనుకూలముగా నుండవలెను. సాధారణముగా గ్రంధాలయములలోనికి తక్కువకులముల వారిని రానీయరు కులములలోని నిమ్నతోన్నతులు విద్యపైననే ఆధారపడి యున్నవనియు, విద్య సజీవమై యుండవలెనన్నచో సర్వజనోపభోగ్యమై యుండవలెననియు గ్రహింపజాలినచో మనము నిమ్నకులములవారికే ఎక్కువ విద్యాసౌకర్యములను కల్పింతుము. వ్యక్తులు స్థాపించుకొన్న గ్రంథాలయములను ప్రజాభిప్రాయము నిబంధింపజాలదు. కాని యావన్మందికిని సంబంధించిన పంచాయతీవంటి ప్రజాసంస్థలచే నడపబడు గ్రంథాలయములు ఏకొలది మందికో భుక్తపడుట విరుద్ధ ప్రకృతి. కావున మీపంచాయతీ గ్రంథాలయమును సర్వజనోపయోగ్యమగు భవనమున నెల కొల్పుదురని విశ్వసించుచున్నాను.

[ఇది బెల్ల మెల్లి పంచాయతీ గ్రంథాలయ ప్రారంభోత్సవ సమయమున పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ ఆఫీసు గారు ఇచ్చిన ఉపన్యాసము.]



శ్రీమత్ భ్రమరాంబా పుస్తక భాండాగారము, పెనుమాక

ఈ గ్రంథాలయ దశమవార్షికోత్సవము ది ౬-౬-33 తేదీ సాయంకాల మారుగంటలకు అత్యంత వైభవముగా జగుపబడెను. గుంటూరుజిల్లా బోర్డు ప్రెసిడెంటు పాతూరి సుబ్బయ్య చౌదరి జిల్లా బోర్డు వైస్ ప్రెసిడెంట్ అవుతు రామిరెడ్డి ఎమ్.యల్, ఏ కాసు వెంకట రెడ్డి బి. ఎ.బి.ఎల్. అడ్వకేటు ఎం. యల్. ఎ గార్లను పుష్పమాలాలంకృతుల గావించి బ్యాండు వాద్యములతో పురవీధుల నెల్ల నూరేగించిన పిమ్మట గ్రంథాలయ భవనము యొక్క ఆవరణలో ప్ర్రాతూరి సుబ్బయ్య చౌదరి గారు జాతీయపతాకోత్సవమును జరిపిరి.

సభ సాయంకాలము 3 గంటలకు కాసు వెంకటరెడ్డి బి.ఎ.బి.ఎల్ అడ్వకేటు ఎమ్. యల్. ఎ.గారి అధ్యక్షత క్రింద సమావేశమయ్యెను. ప్ర్రాతూరి సుబ్బయ్య చౌదరి గారు ప్ర్రారంభోపన్యాసమును గావించిరి. అవుతు రామిరెడ్డి కొమ్మారెడ్డి వెంకట రెడ్డి బి. ఎ. పాలెం వీరయ్య, మేకా కోటిరెడ్డిగార్లు గ్రంథాల యావశ్యకతను గూర్పి ఉపన్యసించిరి. గ్రంథాలయము తరఫున గ్రంథాలయాధ్యక్షలగు మేకా కోటిరెడ్డిగారిచే కాసు వెంకటరెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి అవుతు రామిరెడ్డి ప్ర్రాత్రూరు సుబ్బయ్య చౌదరి గార్లకు సన్మానపత్రము సమర్పింపబడియెను. ఇతర గ్రామాదులనుండివచ్చిన అతిధులకు షుమారు ౨౦౦ మిఁదికి విందు గావింపబడియెను.

ఈసభకు చిర్రా రామిరెడ్డి బి.ఎ.బి. ఎల్ అడ్వకేటు (గుంటూరు) తమ్మా రంగారెడ్డి బి.ఎ.బి.ఎల్. (గుంటూరు), కలకోటి వీరారెడ్డి జిల్లాబోర్డు శెక్రటరీ (గుంటూరు), దండాసుబ్బారెడ్డి బి. ఎ, కారుమంచి వెంకటకృష్ణయ్య జిల్లాబోర్డు మెంబరు గురిజవోలు రాజయ్య ప్రత్తిపాడు సింగం పుల్లారెడ్డి ఓరియంటల్ ఏజన్సీ రామారావు గార్లును మరికొందరు మిత్రులును విచ్చేసిరి.

మేకా రామసుబ్బారెడ్డి,

కార్యదర్శి.

ది 7-6-37

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse