గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 11/సంచిక 1/మానవహృదయము శాంతిపరము
మానవహృదయము శాంతిపరము
గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఎం.ఏ.
లోకము నేడుండే స్థితినిజూచి కొందరు మహా ప్రళయమును ఎదురుచూస్తున్నారు. మాన వులు రాక్షసులైనారని విశ్వసిస్తున్నారు ఇప్పటి యంత్రాల నాగరికము నశిస్తుందనుకుంటు న్నారు. మానవుడు మళ్ళీ గోచి పెట్టుకొని అర ణ్యంలో నివసిస్తా డనుకొంటున్నారు.
★ ★ ★ ★
దీనికి కారణం చాలదూరం వెదుక పనిలేదు. మానవుని హృదయం శాంతిపరం. ఆవిషయం లోకం మరచిపోయింది. అంతట అంతట స్వలాభపర త్వాన్ని యంత్రయుగం ప్రేరేపింది. వ్యక్తులకు వ్యక్తులు, రాష్ట్రాలకు రాష్ట్రాలు భోగలాలసులై తమస్వభావమును తాము విస్మృతి చెందినారు. కాబట్టి మానవులలో ఉండే సత్వం నివురుగప్పిన నిప్పువలె బూడిదలో కలిసిపోయినట్లు తోచడం ఆరంభమయింది.
★ ★ ★ ★
కాని, నిస్పృహ చెందనక్కరలేదు. మాన వుడు తేరుకుంటాడనే ఆశ కనిపిస్తుంది. స్పైనులో జరిగే యుద్ధం విషయంలో ఇంగ్లండు ఫ్యాన్సులు తాటస్థ్యంగా ఇతర రాష్ట్రాల నన్నిటిని ఉంచ డానికి చేసే ప్రయత్నాలు చాలమట్టుకు తమకు ఎగ్గుకలుగకుండా ఉండవలెనని చేసే ప్రయత్నా లుగా ప్రస్తుత పరిస్థితులలో కన్పించినా నిజాని కివి మానవహృదయం శాంతిపరమనే సత్యాన్ని రుజువు చేస్తున్నవి.
★ ★ ★ ★
ఈ సత్యం ఎల్లకాలము రుజువవుతూనే ఉన్నది. యూరోపు చరిత్రలో రోమక సామ్రా జ్యమునాటినుండి యుద్ధంవిషయములో విముఖత్వమును శాంతియుతంగా వివాదాలు పరిష్కారం చేసుకోడం విషయంలో సుముఖత్వమునూ కనబడుచునే యున్నవి. దీనికిని యంత్రయుగానికిని ఎక్కువ సంబంధము పెట్టడం అంత సహే తుకంగా కనుపడదు, యంత్రయుగం మారణ కర్మను సులభం చేసినకొద్దీ సైన్యాలూ మందు గుండ్లూ పెరిగిన శొద్దీ శాంతంగా కార్యాలు నడుపుకోవలెననే యిచ్ఛకూడా పెరిగినట్లుగానే కనుపిస్తుంది. పర్యవసానము తేలలేదని ఈ పరిణా మాన్ని నిరసించి వేయడం న్యాయంగా తోచదు. కొంత ఆధునిక చరిత్ర పరిశీలించి చూతము.
★ ★ ★ ★
౧౮౩౫ వ సం౹౹ లో స్విట్జర్ ల్యాండుకున్నూ ఫ్రాన్సుకున్నూ కొంత తగాదా వచ్చినది. అప్పట్లో ఫ్రాన్సులో కొత్త సార్వభౌమకుటుంబ మేర్పడినది. వారిని తరుమగొట్టవలెనని విప్ల. వముకూడ వెంటనే ఏర్పడినది. విప్లవకారులు పక్క నుఉండే స్వీట్ జర్ ల్యాండులో తలదాచు కున్నారు. అందువలన వివాదా లేర్పడి రెండు దేశాలకు పోరాటం కలిగే సందర్భము తటస్థిం చింది. జినీవాకు చెందిన సెల్లెను ప్రభువును మసాఛు సెట్సుకు చెందిన విలియం ల్యాడ్ను (౧) శాంతి, (౨) పంచాయతీ తీర్మానము అనునీరెండుఉపా యములను ప్రముఖంగా ప్రచారానికి తెచ్చి నారు. సెల్లను ప్రభువు ఎనిమిది ప్రశ్నలను తయారు చేసినాడు. ఫ్రెంచి, ఇంగ్లీషు, జర్మను, ఇటాలి యను, స్పానిష్, లాటిను భాషలలోనికి తర్జుమా చేయించినాడు. ప్రపంచములోని విశ్వకళాపరి షత్తులకు పండితసభలకు వీనిని పంపించినాడు, ఇవి ముఖ్యముగా (౧) ఒక రాష్ట్రము మరి యొక రాష్ట్రపు రాజకీయ విషయములలో ఎంత వరకు జోక్యము పుచ్చుకొనవచ్చును. (౨) ఒక రాష్ట్రము చేశ రాజకీయాపరాధు లుగా ఎంచబడినవారు మరియొక రాష్ట్రమున సురక్షితులగుటకు ఎంతవరకు హక్కుండవలెను. (3) రెండు రాష్ట్రములకు తగాదా వచ్చి నపుడు శాంతముగా పరిష్కారము చేసికొనుటకు పంచాయతీ పరిష్కారము కోరతగును - అను విషయములకు సంబంధించినవి. కడపటి ప్రశ్న యందు రోమక రాజకీయ శాస్త్రవేత్త సల్లీ వ్రాసిన పంచాయతీపద్ధతిని కూడ నమోదు చేసిరట.
★ ★ ★ ★
౧౮౩౫వ సం౹౹ తరువాత రాష్ట్రములు తమలో తాము వివాదపరిష్కారము చేసికొనుటకు పంచాయితీ నిర్ణయములకు కట్టుపడవలెనని అభిప్రాయపడి నానారాష్ట్రశాంతిసమావేశములు జరిగినవి.
౧౮౪౮ వ సం॥ లో బ్రూసెల్సు పట్టణము లోను, ౧౨౪౯ సం॥ లో ప్యారిస్ లోను, ౧౮౪౯ లో మేయిన్ నది మీది ఫ్రాన్క్ ఫర్ట్ పట్టణములోను జరిగిన సమావేశములు ప్రముఖములు. ప్యారిస్ లో సమావేశము జరిగినపుడు విక్టర్ హ్యూగో యను గ్రంథకర్త అద్భుత వాచాలత్వముతో ఐరోపాఖండమంతయు ఏకసంయుక్త రాష్ట్రము గా నేర్పడవలెనని వాదించెను. అంతకు ముందే లండనులోని టెలిగ్రాఫ్ పత్రికయందు ఛార్లెస్ మ్యాకే యను నతడు ఈవిషయమే వ్రాసి యుండినాడు. ౧౮౪౭ లో ఇంగ్లీషు పార్లమెంటు సభలో కాల్డెన్ అను శాంతపర మహాపురుషుడు పంచాయతీ నిర్ణయములనే ఒప్పుకొనదగునని గొప్పయాందోళన కల్పించినది చరిత్రాత్మక ౧౮౫౬లో ప్యారీస్ సంధియని ఒక సంధి జరిగినది. అందులో ముందు ఎప్పుడైనను పోరాటములు కలిగేయెడల పంచాయతీపరి ష్కారములకు అవకాశ ముండవలెనని నిర్ణయ ములు వ్రాసికొనిరి. అలబామాకే సని ౧౯ వ శతాబ్దములో అద్భుతమైన పంచాయతీ పరిష్కార మొకటి జరిగినది. దానిని పరిష్కరించిన పంచాయతీకి "జనీవా టిబునల్" అని గొప్ప పేరు వచ్చినది.
★ ★ ★ ★
౧౯౭౩ లో "ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ లా" అని ఒక సంస్థయు “ఇంటర్ నేషనల్ లా అసోసియేషన్” అని ఒక సంస్థయు ఏర్పడి సర్వరాజ్యములకు సంబంధించిన లాపాయింట్ల వివరణము చేయుచు శాంతిని నిలువబెట్టు టకు మిక్కిలి తోడ్పడినవి. ౧౮౬౮ లో సర్వరాష్ట్రములు పార్లమెంట్లసంఘమొకటి స్థాపిత మైనది. దాని మొదటి సమావేశము ౧౮౬౮లో జరిగి రాష్ట్రమునకు రాష్ట్రమునకు జరిగే వివాదాలు పంచాయితీలద్వారా పరిష్కారము కావలె ననువిషయము గట్టిగా నొక్కబడినది. ప్రపంచ చరిత్రలో ఆ సమావేశపు చరిత్ర సువర్ణాక్షరము లతో వ్రాయదగినది. నాటినుండి సర్వరాజ్య ముల శాంతి సమావేశములు ఆరంభమైనవి. ఆ సంవత్సరమే అమెరికా ఖండమునందలి అన్ని రాజ్యములు శాంతిసమావేశము జరిగి అటు అమెరికా, ఇటు యూరపులకు శాంత్యుద్యమము ప్రాకినది. ఇంగ్లీషువారును అమెరికావారును పంచాయతీ పరిష్కారపుసంధిని జేసికొన్నారు. ఆసంధిని జరుపుటలో నేడు లోక మునందు మహత్తమ దానములకు పేరుగన్న ఆండ్రూ కార్నీజీ పాలుపుచ్చుకున్నాడు. నాటి నుండి నేటివరకు అతని పేరిటనే లోకపు సర్వ శాంతిప్రయత్నములును జరుగుచున్నవి. ౧౯౩౫లో హేగునగరమున శాంతినగ రులో జరిగిన కార్నీజీ ప్రదర్శనము ఈ విషయ ములను లోకపున్మరణకు తెచ్చినది.
★ ★ ★ ★
౧౮౯౩ లో ఇంగ్లండునకును అమెరికా సం యుక్త రాష్ట్రములకును బేరింగు సముద్రమును గూర్చి వివాదము కలిగినది. అప్పుడు పంచా యతీపరిష్కారమును గూర్చి ఇంగ్లీషు పార్లమెం టులో విమర్శయైనది. సుప్రసిద్ధ బ్రిటిషునాయ కుడు గ్లాడ్ స్టన్ మాట్లాడుచు ఐరోపాఖండమం తటికిని న్యాయవిచారణకు కేంద్ర న్యాయస్థానము కావలెనన్నాడు. తరువాతి సంవత్సరమే సర్వ రాజ్యముల పార్లమెంటరీ సభవారు శాశ్వత కేంద్ర న్యాయస్థానము నేర్పరుచుటకై ఒక కమిటీని నియమించిరి.
ఇట్టి ప్రయత్నములు ఒక వైపు జరుగుచుండ ౧౯౧౪ సం॥ ప్రపంచసంగ్రామము లోకమును ముంచివేసినది. దాని దుష్ఫలములు పెక్కు లున్నవి. ఇప్పటికిని అట్టిదుష్ఫలములు కలుగు టకు అవకాశములనుకూడ ఆసంగ్రామమే ఏర్పరిచినది. నాడు ఎక్కువ అభివృద్ధి కానిఆకాశ విమానదళము నాటియనుభవము చేత లోకమును నేడు వినాశము చేయుదునని బెదరించునంతటి స్థితికి వచ్చినది. నాడు జర్మనీ చేత ప్రయోగింప బడిన విషవాయు సాధనము నేడు నిరపరాధులైన సాధారణ ప్రజలను తుదముట్టించుటకు స్పెయి నులో తోడ్పడుచున్నది. ఇంతటి ఘోరరాక్షస స్వరూపమును నాటి సంగ్రామము లోకమునకుకల్పించుట నిజమేయై ననూ, ఆ సంగ్రామమే లోకశాంతిబీజములను గూడ విరివిగా వెదజల్లినది. సర్వరాజ్యసమితి, సర్వరాజ్య కేంద్రన్యాయస్థానము ఇత్యాదులు తరువాత రూపుదాల్చి నేటిదనుక లోకవిప్ల వము కలుగకుండ అరికట్టుకొని వచ్చినవి.
★ ★ ★ ★
వాని బలమును నేటికి చాలలేదను మాట నిజమే. మరల మహాసంగ్రామపు చిన్నెలు కన్పించుచుండుటయు నిజమే, ఇవి ఎంతస్ఫుట ముగా కన్పించుచున్నవో అంతకంటె స్ఫుటతర ముగా శాంతియే కావలెనను కోరికయు అన్ని రాష్ట్రముల లోను కన్పించుచున్నది. ఇది సంధికాలము. ఇదివరకు జరిగిన ప్రయత్న ములలోని లోపములు పరిశీలింపదగును. అప్పుడు లోకశాంతికి పురోమార్గము కనిపించును.
★ ★ ★ ★
ఇదివరలో చేసిన శాంతి ప్రయత్నములు ఐరోపాఖండమే సర్వప్రపంచమని తలంచి చేసిన ప్రయత్నములనుట స్పష్టము. ఇంగ్లీషు వారికి సన్నిహితజ్ఞాతులైన జాతులచేతులలో అమె రికా ఖండముండబట్టి అఖండపు పేరును అప్పట ప్పటికి ఈప్రయత్నములలో వినవచ్చుచున్నది. నిజముగా శాంతిస్థాపనకు మహాప్రయత్నములు చేసిన కార్నీజీ, ఉడ్రోవిల్స౯ ఇత్యాదులు అమె రికా ప్రముఖులే. ఇటీవల జపాను, ఐరోపా రాష్ట్ర ములతో సమముగా తలయెత్తినదికాని ఆ రాష్ట్ర మునకు సామ్రాజ్యాకాంక్ష కొత్తగా పట్టుపడి నందున నూతన వైష్ణవము బిర్రబిగిసిన దను సామెతననుసరించి అది తదేకదృష్టితో ప్రవర్తిం చుటచేత శాంతివాతావరణమును పెంచలేక పోయినది.
★ ★ ★ ★
మహారాజ్యములన్నియు తదితర రాష్ట్రము లును సజీవములై యున్నవని నేడు గుర్తింప నారంభించినవి. భారతభూమిలోని వికాసము చేతను, అసదృశ త్యాగమహిమ చేతను, మహా త్మునివంటి శాంతచిత్తుల ప్రతిష్ఠ చేతను యంత్రయుగపు టుర్వడి తగ్గి తీరవలసిన దను భావములో కైకసామాన్య మైనది. అయి నా భారతసత్వజీవనసం దేశము ప్రపంచమునకు ప్ర్రాకుటకు అవకాశము చాలనందున పాశ్చాత్య నాగరికములోనే పుట్టి పెరుగుచును గూడ శాంతినే కోరునట్టి మహానుభావులు ప్రయత్నము పూర్ణఫల మొందక నిలచిపోయినది. మనము వట్టి భోగలాలసత్వమును ఆరాధింపక మన స్వాతంత్య్రమును సంపాదించిననాడు మానవ హృదయము శాంతిపరమను సందేశమును లోకమున ప్రచారమునకు తేగలుగుదుము. అప్పుడే ఐరోపా మాత్రమున కని అసంపూర్తిగా జరుగు చుండు శాంతిప్రయత్నము లోకకళ్యాణ ప్ర యత్నము కాగలదు. కార్నీజీ మహాశయుని అనంతకోటిధనముచే జరుగు ప్రయత్నమునకు పరిపాకము కలిగించు మహాశక్తి భారతఋషి సాంప్రదాయమున నిమిడియున్నది. మనము స్వతంత్రులమై వ్యాప్తి జెందజేయు ధర్మము ఈశ్వరదత్తముగా మనపైబడినది. వివే కానంద, తిలకు, గాంధి, ఇత్యాది మహాపురుషుల నాయకత్వము కల్గినపిదప మనమధైర్యపడనక్కర లేదు. ఆత్మవిశ్వాసము వీడకుందుమేని ముందు నకు నడువగలము. ఇది తథ్యము; నిత్యము.