గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 11/సంచిక6/శ్రీ దుర్గాపూజ - పశుబలిదానము
శ్రీదుర్గాపూజ - పశుబలి దానము
శ్రీ పండిత మదన మోహన మాలవ్యగారు
“యజ్ఞము పేరిడికొని మాంసము భుజించుట ధర్మము కాదు" అని అహింసా పక్షమున ప్రమాణము కలదు. అయినను “అహింసా వైదికం కర్మ యజ్ఞార్థం పశవః సృష్టాః, యజ్ఞే వధోఽవధః" మొదలగు శాస్త్రవచనముల నాధారము చేసికొని భట్టాది మీమాంసకులును, తంత్రశాస్త్రజ్ఞులును "దేవతాయజ్ఞ సంబంధమగు పశుహింస హింస కానేరదు; కాబట్టి ఆరూపమున చేయుహింస వలన యజమానులకు పాపదోషము లుండవు" అందురు. కాని కొందఱు వివేకజ్ఞులు దేవతాది నిమిత్తమగు పశుహింసయు హింసయే అనియు పాపఫలము సిద్ధించు ననియు సిద్ధాంతీకరించి యున్నారు. ఈసిద్ధాంతమున కనుకూలాధారములు శ్రుతిస్మృతులయందును గీతా భాగవత మహాభారతము లందును పురాణము లందును పూర్తిగా లభించుచున్నవి. భారతమందు అనుశాసనిక పర్వమున ౧౧౫వ అధ్యాయములో భీష్ముని ధర్మరాజిట్లు ప్రశ్నించెను. “ఓ పితామహా! నీవు అహింసను గూర్చి మహత్వపూర్ణముగా చెప్పియున్నావు. కాని శ్రాద్ధాది కర్మలందు పితృదేవతలకు మాంసము నిచ్చుటను గూర్చి చెప్పియున్నావు. మంచిది. హింస లేక దేవతలకు మాంసమెట్లు లభించును? ఈవిరుద్ధ విషయమునుగూర్చి నాకర్థమగుట లేదు,” అనఁగా భీష్ముఁ డిట్లు బదులు చెప్పెను. “యుధిష్ఠి రా!మాంసమును విడిచి అహింస కూడినకర్మ చాలమహత్తు కలది. రూపము, కాంతి, బలము, ఆయువు, కీర్తి, స్మృతి, వృద్ధి కోరుకొను మహాపురుషులు హింసను మాని వేయుదురు.”
"రూప మవ్యంగ తా మాయు
ర్బుద్ధి సత్త్వం బలం స్మృతిమ్
ప్ర్రాప్తుకామైర్నరై హింసా
వర్ణితాపై మహాత్మభి:"
'యుధిష్ఠి రా ! వాలఖిల్య సప్తర్షి మారీచ్యాదులు మాంసమును భుజింపమిచే ప్రశంసనీయులైరి. ఏ మానవుడు మాంసమును తినకుండునో, వధ చేయకుండునో, చేయింపకుండునో, అతడు
ప్ర్రాణికోటికి మిత్రుడని మనువుపల్కెను.'
“న భక్షయతి యో మాంస
నచ హన్యాన్న దాతయేత్
తన్మిత్రం సర్వభూ తానాం
మనుః స్వాయంభువోబ్రవీత్.*
ఈవిధముగా ప్రమాణములను తెలుపుచు భీష్ముడు తన ఉద్దేశము నిట్లు వెల్లడించెను. “ప్రతి నెలయు అశ్వమేధము నూరు సంవత్సరముల వరకు చేసిన వానికి ఫలమెంత కల్గునో మాంసమును వర్ణించినవానికి అంత ఫలము కల్గును.”
"మాసి మాస్యశ్వ మేధేన
యో యజేత శతం సమాః
నఖాదతిచ యో మాంసమ్
సమ మేత న్మతం మమ.”
మఱియు మానవుడు సుఖలాలసుడై నిరాఘాటముగా పశువులను వధించినచో తాను మరణించిన పిదప సుఖము ననుభవింపడని మహాభారతము శాసించుచున్నది...... ఏవిధముగా ప్రాణముపై తనకు ప్రీతియో ఆవిధముగనే ఇతరములకుకూడ ప్ర్రాణముపై ప్రేమ కలదు. కాబట్టి బుద్ధిమంతుడు తన్నే ఉదాహరణముగా తీసికొని మెలగవలెను.
మధుమాంస త్యాగము ౧౦౦ సంవత్సరముల తపస్సుతో సమానము. పుట్టినప్పటి నుండియు మధు మాంసములను విడిచినవాడు ముని సమానుడు. విద్వజ్జనులకు కూడ మృత్యుభయము కలచో, పాపము! నోరులేని జంతువుల గతిఏమి? కాన మాంసవర్ణనము శ్రేష్ఠమగు ధర్మము. ఇదే స్వర్గ సుఖమునకు స్థానము. "అహింస కాని భూతాని దండేన వినిహస్తి య: ఆత్మన స్సుఖమిచ్ఛ౯వై స ప్రేత్య నసుఖీ భవేత్,” న తత్పరస్య సందద్యా త్ప్రతికూలం యదాత్మనః యేష సంక్షేపతో ధర్మః కామా దన్యః ప్రవర్తతే ప్రాణా యథాత్మనోభీష్టా భూతానామపి తే తథా ఆత్మౌపమ్యేన మస్తవ్యం బుద్ధిమద్భిః కృతాత్మభిః యస్తు వర్షశతం పూర్ణం తపస్తప్యే త్సుదారుణమ్ యశ్చైవ వర్ణయే న్మాంసం సమ మేతన్మతం మమ మధుమాంసంచ యే నిత్యం వర్ణయం తీహ ధార్మికాః జన్మప్రభృతిమద్యంచ సర్వే తే మునయః స్మృతాః మృత్యుతో భయ మస్తీతి విదుషాం భూతి మిచ్ఛతామ్ కిం పునర్హ న్యమానానాం తరసాజీవితార్థినామ్ ఆరోగాణా మపాయానాం పాపే ర్మాంసోపజీవిభి: తస్మా ద్విద్ధి మహారాజ మాంసస్య పరివర్జనమ్ ధర్మస్యాయతనం శ్రేష్ఠం స్వర్గస్యచ సుఖస్యచ.”
ఈ విధముగా భీష్ముఁడు హింసను గూర్చియు, మాంసభక్షణ నిషేధమును గూర్చియు చెప్పి యుండెను. కాని, మాంసాహారప్రియులు మాంసమును ఒకేసారి మానివేయలేరు. కాన క్రమ క్రమముగా మానుకొననగును. మాంసభక్షణమును క్రమముగా మాన్పించుటకొరకే నిత్య విధులందుమాత్ర మప్పుడప్పుడు తినవచ్చుననియు, అందువలన అల్పదోషము మాత్రము వచ్చుననియు పల్కుచు తుదకు భీష్ముడు మాంసము సర్వదా వర్ణనీయమని తెలిపెను.
"స వర్ణయే న్మాంసాని
ప్ర్రాణినా మిహ సర్వశః"
“యుధిష్ఠిరా ! వింటివా ! పూర్వకాలమున యజ్ఞములందు పురోడాశ మే యజ్ఞ పశువు. దాని చేతనే వారు యజ్ఞములను జేయుచుండిరి.”
“శ్రూయతేహి పురాకల్పే
నృణాం ద్రోహిమయః పశుః"
ఇంకను భీష్ముఁ డిట్లు పలికి యున్నాడు. ప్రజాశ్మము తేమముకోరు అగస్త్య మునీంద్రుడు తన తపస్సు వలన అడవిమృగముల నన్నిటిని దేవతలకు ప్రోక్షించెనుకాని ప్ర్రాణములను తీయలేదు.
“ప్ర్రజానాం హిత కామేన
త్వగ స్త్యేన మహాత్మనా
ఆరణ్యా సర్వదై వత్యా
ప్రోక్షితాస్తపసా మృగాః”
మరియు భీష్ముఁడు మాంసభక్షకులు కాని అంబరీష, నాభాగ, దిలీప, రఘు, హరిశ్చంద్రాది మహాత్ముల గాథలను కూడ వినిపించెను.
“ఏతై శ్చాన్యైశ్చ రాజేంద్ర
పురా మాంసం నభక్షితమ్.”
ఈ వాక్యముల వలనను, ఉదాహరణముల వలనను దేవతల కొఱకుగాని యజ్ఞము కొఱకుగాని చేయు పశువధ హింస అనిపించు కొనునని సిద్ధమగుచున్నది.
కాన దేవతల పేరు పెట్టియు, యజ్ఞముల పేరు పెట్టియు పశువధ చేయరాదు.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse