Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 11/సంచిక6/కేంద్ర గ్రంథాలయాల యావశ్యకత

​త్వమువారిని అందులకై వలయు శాసనములను, శాసన సభలలో ప్రవేశ పెట్టవలయునని ఆంధ్ర అసెంబ్లీ కౌన్సిలు సభ్యులను ఈ సభవారు కోరుచున్నారు.

30 కేంద్రంథాలయముల వద్ద బ్రాడ్ కాస్టింగు నొక దాని నేర్పఱచి ప్రతి గ్రామ గ్రంథాలయముల వద్దను రిసీవింగు పెట్టు (Valve Set) నెలకొల్పవలయుననియు అందువలన నుపన్యాసము లాకర్షవంతముగా ప్రజలకు విన్పింపబడును గాన వెంటనే స్థానిక ప్రభుత్వము వారట్టి కార్య విధానమునకు గడంగవలసినదనియు ఈ సభవారు హెచ్చరించుచున్నారు.

తీర్మానములన్నియు పూర్తిగాకమునుపే పెదవడ్లపూడి నుండి పిడపఱ్ఱుపోవు బోటువచ్చుటచే అందరును మధ్యలేచి లాకువద్దకు వెళ్లి సేవాశ్రమము వారునడపుచున్న బోటు లోని గ్రంథాలయము దర్శింపవచ్చిరి. అల్పాహారముల యనంతరము మిగిలిన తీర్మానములు పూర్తిచేసిన పిమ్మట, అధ్యక్షుల ఉపసంహర వాక్యములతోను, ఆహ్వాన సంఘాధ్యక్షుల వందన సమర్పణము తోడను సభా [1] వ్యహారము సమాప్తమయ్యేను. శృగారపురవాస్తవ్యులు శ్రీయుత నాగేశ్వరం సుందరశర్మ గారు కడపట శ్రీ ఆదిపూడి సోమనాథరాయ కవి రచించిన ఆంధ్రమాతృస్తవమును పఠించి సభికులకు మంచి ప్రబోధము గావించిరి.

సభానంతరము ప్రతినిధులును ఇతర తాలూకాలనుండి వచ్చేసిన గ్రంథాలయ సేవకులను పెదెపాళెములో జరిగిన గ్రంధాలయ సేవకుల యిష్టాగోష్ఠి సమావేశమున పాల్గొను నిమిత్తము ప్రయాణమైపోయిరి.


కేంద్ర గ్రంథాలయావశ్యకత

గ్రంథాలయ సంస్కరణము

శ్రీ ఆత్మకూరి గోవిందాచార్యులు గారు

ఆంధ్రదేశమున గ్రంథాలయోద్యమము ప్రశంస నీయముగ కొనసాగుచున్నది. కడచిన యిరువదేండ్లలోను ఎన్నియో ఉద్యమములు తలలెత్తినవి; కాలప్రవాహమున తలలు వంచినవి; రూపుమాసి అనంతసాగర సంగమము నొందినవి.

ఆంధ్రులారంభళూరులు. ఉత్సాహోద్రేకములు వీరిసొమ్ము. ఆరంభించి పరిత్యజించుటయందాంధుల కితరులెవరును సాటిరారు. ఆయినను గ్రంథాలయోద్యమ మీ ఆంధ్రుల నైసర్గిక లక్షణముల కేలనో గుఱికాలేదు. బాలారిష్టము అన్నియుఁ గడతేరినవి. ఇందులకు గ్రంథాలయోద్యమ ప్రచారకులు స్తవనీయులు; ధన్యులు, ముఖ్యముగ కాలప్రవాహమున గంతులు వేయుటకై గ్రంథాలయోద్యమమును విడనాడక నిశ్చలకృషి సల్పిన అయ్యంకి వెంకట రమణయ్యగారు ఆంధ్రుల కృతజ్ఞతకు పాత్రులు. ఇంక గ్రంథాలయోద్యమము నవయౌవనముతో, నూత్న శోభాలంకారములతో, దినదిన ప్రవర్ధమానమై చిరంజీవి కాఁగలదనుట నిశ్చయము. కాని, ఆత్మావలోకనమున కిదేతరుణము.

ఆంధ్ర దేశమునందుఁగల ముఖ్యపట్టణములయందెల్ల నేఁడు పేర్కొనఁదగిన గ్రంథాలయములు కలవు. పలుతావుల పల్లెలయందుఁ గూడ గ్రంథాలయములు వెలసినవి.

ఎన్నియో గ్రంథాలయములకు సొంతభవనము లున్నవి. ప్రతి గ్రంథాలయమున ఎన్నెన్నియో వేలకొలది గ్రంథము లున్నవి. అయిన నేమి? ఈ గ్రంథాలయములన్నియు నిర్ణీత కార్యక్రమము ననుసరించి, నిర్మింపఁబడినవి కావు. వీని కొండొంటికి సహకార కార్యక్రమ ప్రణాళికయు లేదు. ఆంధ్ర గ్రంథాలయముల నన్నింటిని, ఏకోన్ముఖముగ, ఒక నిర్ణీత కార్యక్రమ ప్రణాళిక ననుగురించి, తేజోవంత మొనరింపఁగల కేంద్ర గ్రంథాలయమును లేదు. ఏ గ్రంథాలయమునందుఁగాని, ఏ ఒక ప్రత్యేక విషయమును గుఱించియైన, సంపూర్ణ పరిశోధనము గావించుటకు వలయు గ్రంథములు లభింపవు. “ఇది పరిశోధన గ్రంథాలయ” మని పేరిడదగిన గ్రంథాలయ మాంధ్ర దేశమున లేదనుట సాహసముకాదు. సంచార గ్రంథాలయములు లేనే లేవు.

గ్రంథాలయముల పుస్తకములు జాబితాల నొకపరి సింహావలోకన మొనరించుచో, అన్ని గ్రంథాలయముల యందును, అధిక సంఖ్యాకములగు పుస్తకము లొకేరకమునకుఁ జెందియుండును. ఎక్కడ చూచినను పురాణములును, కథలును, నవలలును, నాటకములును, కావ్యములును గోచరింపక మానవు. ప్రాచీన విజ్ఞాన కోశములగు తాటాకు పుస్తకములనన్ని గ్రంథాలయములు వాంఛించుచునే యుండును. గ్రంధముల సంఖ్యపై మమత ​పోలేదు. ప్రాశస్త్యముపై దృష్టి మరలలేదు. ఆధునిక విజ్ఞానకోశమనఁదగు, ఆంధ్రగ్రంథమును సంపాదింపఁ జూచుటకంటె, షేక్సుపియరు కవి, ఆంగ్ల నాటకములను సంపాదించవలెనను కుతూహల మింకను క్రుంక నారంభింప లేదు. కర్తవ్యమేమి?

నేఁడు దేశమునందు రాజకీయవిప్లవ మేమియును లేదు. వాతావరణము శాంతముగ నున్నది. ప్రశాంతచిత్తవృత్తితో కార్యక్రమము నిర్ణయించుటకు సావకాశము లభించినది. రాష్ట్ర పరిపాలనము ప్రజాప్రతినిధుల హస్తగతమైనది. ప్రజోపయోగ కార్యక్రమ నిర్ణయమునకును, నిర్వహణమునకును గూడ అదను సమకూడినది. గ్రంథాలయాధికారులును, గ్రంధాలయోద్యమ ప్రచారకులును, “నాది - నా" యను శబ్దమును మఱచిపోయి గ్రామ, పట్టణ, తాలూకా, జిల్లాల అభిమానములను వీడి, విశాలాంధ్ర దృక్పథమున కర్తవ్య నిరూపణమునకు పూనవలసియున్నది.

కేంద్ర గ్రంధాలయము

(౧) ఈకర్తవ్యనిరూపణమున ప్రధాన స్థానము వహించునదిది. ఈ కేంద్ర గ్రంథాలయమే పరిశోధన గ్రంథాలయముగ కూడ నుండవలెను. (Research Library) ఈ కేంద్రగ్రంధాలయము ప్రాచీన శాస్త్రసంబంధ పుస్తకములను, ఆధునిక రాజకీయార్థిక సమస్యలకు సంబంధించిన పుస్తకములను మాత్రమే సంపాదింపఁదగును, ప్రాచీనశాస్త్ర పరిశోధనము చేయఁ గోరువారికిని, ఆధునికార్థిక రాజకీయశాస్త్ర పరిశోధనములు చేయువారికిని ఈ కేంద్ర గ్రంధాలయ మొక్కటే సమస్త సౌకర్యముల నొనఁఁగూర్పఁ గలిగినదిగా నుండవలయును. నేఁడు ఆంధ్రదేశమునందుఁగల సమస్త గ్రంధాలయములయందునుగల ఆర్థిక రాజకీయ సంబంధ పుస్తకములును, ప్రాచీనశాస్త్ర గ్రంథములును, ఈ కేంద్ర గ్రంధాలయమున కేంద్రీకరింపనగును. అచ్చువడని తాటాకు పుస్తకములన్నియు, విద్యా విభాగమునకు జెందియున్నను, కేంద్ర గ్రంధాలయమునందే పదిలపఱుపఁదగును. వీలు వెంబడిని కేంద్ర గ్రంథాలయ మట్టి వ్రాతప్రతులను అచ్చువేయించి ప్రచారమునకు దీసికొని రాఁదగును.

(౨) ఈ కేంద్ర గ్రంథాలయము నుండి జిల్లా గ్రంథాలయములును వ్యక్తులును గూడ పుస్తకములను తెప్పించుకొను చుండఁదగును. కేంద్ర గ్రంథాలయము పుస్తకములను ఎరవిచ్చు గ్రంథాలయము (Lending library) గూడ పని చేయవలయును.

(3) కేంద్ర గ్రంథాలయము, జిల్లా గ్రంథాలయములు తెప్పించు పుస్తకములు నిర్ణయించుటకు సంపూర్ణాధికారము కలిగి యుండవలయును.

జిల్లా గ్రంథాలయములు

౧ ఆయా జిల్లా ముఖ్యపట్టణములయందుఁ గల గంథాలయములు, జిల్లా గ్రంథాలయములుగ పనిజేయఁదగును.

౨ ఈ జిల్లా గ్రంథాలయములకు గ్రామ గ్రంథాలయములు అనుబంధ గ్రంథాలయములుగ నుండఁదగును. గ్రామ గ్రంథాలయములపై జిల్లా గ్రంథాలయములకు పరిపాలనా, పరిశీలనాధికారములు రెండును నుండఁదగును.

3 జిల్లాగ్రంథాలయము అన్నిటికి ఒక ప్రణాళిక యుండఁదగును. ప్రతి జిల్లా గ్రంథాలయమునందునను, అన్నిరకముల పుస్తుకములును ఉండరాదు. ౧. ఒక గ్రంథాలయము భాషావిషయక గ్రంధములను ౨. మఱియొక గ్రంథాలయము మతవిషయక గ్రంధములను 3. ఇంకొక గ్రంథాలయము వ్యవసాయ పారిశ్రామిక విషయక గ్రంధములను ౪.వేరొక గ్రంథాలయము పురాణేతిహాస విషయక గ్రంధములను మాత్రము తెప్పించుకొనఁ దగును. ఈ విధముగ ఒక్కొక్క జిల్లా గ్రంథాలయ మొక్కొక్క తరగతి గ్రంథములను మాత్రమే సేకరింపఁదగును. ఇట్టి విషయ విభాగమునకు సంబంధించిన గ్రంథములను సక్రమముగ తెప్పించుకొనునట్లొనరించుటకే కేంద్ర గ్రంథాలయమునకు జిల్లా గ్రంథాలయముల పుస్తకములు నిర్ణయముపై నధికారముండుట ఆవశ్యకము.

౪ ఆయా గ్రంథాలయముల యందుఁగల పుస్తకము అన్నింటిని పరిశీలించి, విషయ విభాగము ననుసరించి, వివిధ జిల్లా గ్రంధాలయములలో కేంద్రీకరింపఁదగును. ఏ గ్రంథాలయమునందు, విషయములకు సంబంధించిన పుస్తకములు నేఁడధికముగ సేకరింపఁబడి యున్నవో ఆ గ్రంథాలయమునకా విషయక పుస్తకములన్నింటిని, ఇతర గ్రంథాలయము లిచ్చి వేయవలయును.

౫ జిల్లా గ్రంథాలయములు గ్రామ గ్రంధాలయములకు పుస్తకముల నెరవిచ్చుచుండవలయును.

గ్రామ గ్రంథాలయములు

౧ గ్రామ గ్రంథాలయములు ప్రజాసామాన్యమునకు పనికివచ్చు పుస్తకములు కలిగియుండవలయును.

౨ ఆధునిక విజ్ఞానప్రదములగు గ్రంథములను తెప్పించునట్లు చూడవలయును.

ఈ విధముగ గ్రంథాలయ ప్రణాళికను, నిర్ణయించుకొనుచో ఆంధ్రదేశమునందు, గ్రంథాలయోద్యమము సక్రమమార్గమున అభివృద్ధి చెందఁగలదు. ఇందులకు కేంద్ర గ్రంథాలయస్థాపన మత్యవసరము గాన కేంద్ర గ్రంథాలయ స్థాపనమునకై గ్రంథాలయోద్యమాభిలాషు లందఱును సత్వరముగ తగుకృషి సల్పెదరుగాక! వందేమాతరం.

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse

  1. ↑ ప్రారంభకులు, అధ్యక్షులు, ఆహ్వాన సంఘాధ్యక్షుల యుపన్యాసములు ముందు సంచికలో ప్రకటింపబడును