ప్రవాస రాధిక.
[చండీదాసు మాతృకనుండి అనువదింపబడినది.]
| చ౦. |
చదలు పయోదమాలికల♦ శ్యామలమయ్యెఁ; దమాలపంక్తుల౯
కొదమవనమ్ము చీకటుల♦కున్ నెలవయ్యె; గుమారభీరుఁ డీ
యదుసుతుఁ; డిల్లు చేర్పుమని♦ యాడెడి నందుని దేశ మాలకిం
చి దెసలు సూచుచుం జనియె♦ స్నేహతపస్విని రాధ యొంటిమై.
|
|
| మ. |
కడలంగాల్నడ నేగు త్రోవరుల సై♦గల్ గానఁగారావు, చే
పెడుపాలిండ్ల రుచుల్ మరుల్ గొలుప గో♦బృందమ్ము పోలేదొ, పెం
పుడు లేళైనఁ గదంబకుంజములదా♦పుంజేర్ప వీసంజరా
యిడి వీధీముఖమందు నెందలసితో ♦యీ! ముగ్ధగోపాలకా!
|
|
| గీ. |
చెదరి విరిసిన యాఁబెయ్య కదుపులెల్ల♦ | మందఁ గూర్పంగ నాకర్షించు సుందరాను
రాగ రాగగీతికలైన రావు కృష్ణ!|యెంత చెవియొగ్గివినిన నీ ప్రాంతమందు.
|
|
| ఉ. |
పచ్చని యాకుజొంపముల♦ పైఁబడు నందపు సందెవన్నియల్
విచ్చిన శీషిగన్ ప్రతిఫ♦లించిన మించులు నేని దోఁప వీ
ముచ్చటయైన తోఁపునవి♦ ముగ్ధుఁడ! దట్టపు చెట్లనీడలం
జొచ్చితొ? యల్లికొన్న సొగసుం బొదలుంగను♦చాటులైతివో!
|
|
| చం. |
పొనపొసఁ బూలపిండికణ♦ముల్ కణముల్ దొరలంగఁ పూఁతమో
చిన యెలదీవయిండ్లకడఁ♦ జిక్కని నీ చరణాంకరేఖకల్
గనఁబడ వార్ద్రదర్భలు స♦గమ్ము సగమ్ము గ్రసించుచో నల
జనిన కురంగపుత్రికలు♦ సైతము చూపవు నీదుజాడలన్.
|
|
| ఉ. |
పాదములొత్తుకో నిసుక♦వాగుల రేవుల కాలఁద్రిప్పి యా
యాదగులం బ్రదోషసమ♦యప్రియరాగములాలపించు వే
ణూదయభాగ్య మెందణఁగె♦నోయి? కుమారయశస్వి! పల్లవ
స్వేదములై కఱంగిన స♦సిన్ వెలయింపవు పో వనస్పతుల్.
|
|