Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 4/గ్రంథాలయోద్యమము

వికీసోర్స్ నుండి


సీ.

అక్షరజ్ఞులకెల్ల♦యమితజ్ఞానంబిచ్చి సతతంబు కాపాడు♦సంస్థయగుచు
అయిుకమత్యవిహీను♦లాంధ్రులంచనుదూరు - బాపగా జేయు స్వ♦రూపమగుచు
విలుయౌకాలము♦వ్యర్థమైపోకుండ వ్యర్థమైపోకుండ సత్కథాలాపనల్♦ జలుపదగుచు
స్వీయవైదేశిక♦చిత్రవార్తలదెల్పు పత్రికాళినిజేర్ప♦ పాత్రమగుచు

తే.గీ.

దేశమర్థింపదగిన దె♦ద్దేనియున్న - వానినన్నిఁటి సమకూర్ప♦వలయుననుచు
స్వీయజనులకు బోధనల్♦జేయుచుండు ఆంధ్రగ్రంథాలయోద్యమం♦బధికమగుత

సత్తెనపల్లి హనుమంతరావు.