Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 4/గ్రంథాలయములు

వికీసోర్స్ నుండి


గీ.

రాష్ట్రమును బాలనము సేయు రాజుబోలె | గృహముపాలన మొనరించు గృహిణిబోలె
గ్రంథ భాండార పాలనాక్రమము నెఱుగు। వాఁడు భాండారకుడొకండె వసుధయందు.

సీ.

వివిధజాతుల గ్రంథవితతి వేర్వేరుగా జాబితాలను మీరు సల్పుడయ్య
చదువంగ నేతెంచు జనముల కా గ్రంథసమితి నోపికతో మెసంగుడయ్య
చదువలేనట్టి యజ్ఞానుల కాపొత్తముల యర్థముల లెస్సదెలుపుడయ్య
గ్రంథాలయోపయోగము లెఱుంగనివారి కభిరుచి కలిగింప నరయుడయ్య
బాలురకు స్త్రీలకును గ్రంథపఠనమందు | ఘనతరాసక్తి గలిగింపఁ గడగుడయ్య
జ్ఞానభిక్షను జనుల కొసంగుడయ్య | ఆంధ్రసోదరులార మహాత్ములార

సీ.

 పఠనమందిరములఁ బటుసమర్ధత తోడ నెలకొల్పి పెంపఁగాఁ దలపరయ్య
ఘనసమాజములమి గ్రంథాలయములలో స్థాపించి చర్చల సలుపరయ్య
ఆంధ్రముఖ్యుల జ్ఞాపకార్థమ బహుమానసమితి బ్రోత్సాహంబు సల్పరయ్య
పురుషులకుకుబోలె తరుణీమణులకును జ్ఞానమీయఁగశ్రమ సలుపరయ్య
వేరు కార్యంబులఁ బ్రసక్తివిడువరయ్య | చేతఁ బూనిన కార్యంబు శీఘ్రగతిని
జయము న౦ది౦ప యత్నముల్ సలుపరయ్య | ఆంధ్రసోదరులార మహాత్ములార

- మైనంపాటి హనుమంతకవి.