Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/భక్తగీతములు (పద్యములు)

​

I

(కన్యా మీరాబాయి)

 
ఇంత తపించెద వేమిటి కింతీ !
కాంతి విరహమున . కగ్గి కృశింప
వలపులు వాడిన ఫలమేమిగలదు
వాసనబోయిన ప్రసవము లేల.

* * *

 ప్రేయసివని నడి రేయి నేతెంచి
వాకిట నిలచినఁ బలుక కపోతి!

* * *

 సందెకడల నిండు సందెడు కురులు
దువ్వుకొనుచునున్న మవ్వపు సొగసు
చూచిచూచి సకియా!సోలినమనసు
ఆపఁజాలక విరహంబున వెడలి.

* * *

మెల్లమెల్లన నురు పిల్లనగ్రోవి
వాయించినాను నీవాకిలిముందు
చూడ వైతివి నను సుందరి యపుడు
కడగన్నుల రాగ . కళికలు గురియ

* * *

చెదరిన పయ్యెద . చెంగులు గనక
చెమరించు చెక్కుల • చేష్టలు గనక
ఉయ్యాల లూచెడి | యుత్తమ వేళ
శయ్యలు సవరించు . తియ్యని వేళ.

* * *

నీహృదయము కరు . ణించునో యనుచు
నీరాగములు రన ణించును యనుచు
అలత 'గీతాందేహి' యని పాడినాఁడ
'ధన్య మీ రా'యని తలపించినాఁడు.

* * *

నాగర*[1] గురుచరణంబుల మరఁగి
లోకాపవాద వి లోలత కడలి
ననుజూడ లజ్జించి . తమపమగాత్రి!
ననుగూడఁగ నను మానము పడితి.

* * *

II
(దా సీ క్షే మ.)

సాధింపులేలోయి సావాసకాడ!
ఈదీనురాలితో . నేమి వాదాడ!
నీరూపు రేకల . నెమ్మదిఁవలచి
ఎన్ని వెన్నెల రేల నీశ్చితి వగల.

* * *

మబ్బులు గ్రమ్మిన మాపులయందు
పులుగులుపాడిన తొలిజాములుగు
నీ నీడలే భ్రమ లోన నీక్షించి
నీయడుగులజాడ • నే యాలకించి.

* * *

నడి రేయి యనకయె నకనక పడుచు
పడకటింటితలుపుల్ ఫక్కున తెఱచి
త్రుళ్ళుచు నటునిటు .త్రోవలు సూచి
యడియాసపాలయి యారడి కడలి.

* * *

అందెలు మ్రోగునో! యని జంకిజంకి
కుచ్చెళ్ళ పెళ పెళ. కును క్రుంగి క్రుంగి
సిగ్గున మ్రుగ్గుచు. జింతఁ గమలుచు
ఎన్నెన్ని సాకులు చిన్న వోయితిని.

మీరాబాయి, క్షేమ – వీరు ఉ త్తర హిందూస్థానపు భక్తురాండ్రు. వీరు పాడిన గీతములు భక్తి పరవశములుగ గానము చేయఁబడుచున్నవి. ఈ పై రెండు పాటలును హిందీపదములకు యధానువాదములు. (రా.సు.)


  1. ↑ నాగరుఁడను తాపసి మీరాబాయి గురువు.