Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఎవరు?

​

IV పాట

 పున్నమజాబిలి! ఓభామా!
     పూచిన సుఖరాత్రి నో భామా!
నెవ్వగ తారలు! ఓభౌమా!
     నిదురఁబోవని వేళనోభామా!

 
పవనునిలాలన కోభామా!
    పువులు వేచెడి ఎందెనో భామా!
మొగలిపూ రేకులు ఓ భామా!
    మొగములెత్తెడి వేళ నో భామా!

​

నీమీదిమోహము నో భామా!
     నిలిపి యోపఁగలేక ఓ భామా!
వెన్నెలలే తెంచు ఓభామా!
     సన్న త్రోవలుబట్టి యోభామా!
తీయనిగీతము లోభామా!
     తీసిన తెన్నుల నోభామా!
సొగసు ప్రేమపుదీప మోభామా!
     చూపినజాడలనో భౌమా!
భావో త్తరీయము నోభామా!
     పఱచి చేసిన దారి నోభామా!
ఎవరునుగనకుండ నోభామా!
     యేకాకినై లేచి యోభామా !
కాళ్ళు నెప్పులుపుట్ట నోభామా !
     కడువడివచ్చితి నోభామా !
నీమేలి పడకిల్లు ఓభామా !
     ప్రేమతో వెదకితి నోభామా !
వేసినవాకిండ్లు ఓభామా !
     వీడఁగఁదట్టితి నోభామా !
సుఖశయనంబున నోభామా!
     సోలిన సుప్తిని నోభామా !
కాటుక రెప్పలు శ్రీభామా !
     కబళింపనీవుంటి పూభామా !
మీటిన కిన్నెర ఓభామా !
     పాటనాపఁగ లేదు ఓభామా !
ఏస్వర్ణ స్వప్నము లో భామా !
     నీవుంటి వోయప్పు డోభామా !
కనురెప్పలైనను ఓభామా !
     కదలలేదేయప్పు డోభామా !
బొటన వేలయినను ఓభామా !
     చిటుకనలేదప్పు డోభామా!
ఆపరవశదశ లో యోభామ !
     యడలింపరా! యోభౌమా!
అడుగుకదలకుండ నోభామా!
     ఆవలవచ్చితి నోభామా !
నీప్రేమయారాట మోభామా !
     నీకొప్పగించితి నోభామా !
సందెరంగులుబూయు నోభామా !
     యందపువాకిండ్ల 'నోభామా !
స్వరమధుధారలు ఓభామా !
     జల్లులా అనిచోట నోభామా!
ఆనందసూత్రము లో భామా ! '
     అల్లు తెల్లని బైట నోభామా !
నాయాటపట్టులె యోభామా !
     ననుపున్న రమ్మట కోభామా !

V

గీ.⁠

అతఁడు వలచిన ప్రేయసి యన్యయనుచు
నేను వలచిన వన్నెలా డితరుఁడనుచు,
వేఱువేఱైతిమంతట, చారుజలద
గర్భమునువదలిన జల కణములట్లు,

⁠


గీ.⁠

ప్రేమపుష్పమ్ముపైఁ గాంక్షఁ బెట్టి, మనసు
లుత్కటమ్మగు విరహాన నుడికి కమలఁ
జీలిపోతిమి త్రోవలఁ, జిరవిలీన
మధుర మైత్రి శరన్మేఘమాల గాఁగ.

⁠


గీ.⁠

అందమైన చందములఁ బ్రియమ్ములయిను
యాటపాటల, భక్తిలీలానురతుల,
ప్రియుని సుఖశోభనమ్ముఁ గోరితిని నేను
సరససుమములఁ బ్రియుఁబొందు చైత్రిచాయ.'

⁠


గీ.⁠

కర్కశములగు నియతులఁ, గష్టమయిన
జపతపంబుల, నిష్ఠాప్రచారగతుల,
ప్రియ సమాగమపుణ్యమర్ధించెనతఁడు
భీష్మతపరోహిణిఁబొందు గ్రీష్మునట్లు.

⁠


గీ.⁠

ప్రొద్దుపొడుపులఁ గమ్మని పూలజతల,
సందెవేళల: జల్లని చందనముల

⁠

​

⁠

నిశలమధురవీణాలాల నీయరుచుల
నది మొదల్ ప్రియుఁ గాంక్షించి వెదకుచుంటి.

⁠


గీ.⁠

పైరదిరిగి కళ్యాణపు పాటఁ బాడు
పచ్చి వంశీని బతిమాలి భంగపడితి,
'ముందుముం'దని వినఁబడ్డ మోహనోక్తి
సూత్రములు లాగినట్టు లంచులనునడచి.

⁠


గీ.⁠

సంకెలలుత్రెంచి పోడుఁ బూసం కెలలను
బ్రియుని బంధింపవలెనంచు పిన్నవాఁడ!
నాకు సహకారివగుచు నీనావవిచ్చి
కృష్ణ దాటింపు, మనల సుఖంపనగును.

⁠


గీ.⁠

నావ నడియేటనర్తించే నటి విధాన,
నిష్క్రమించిరి పాత్రల నియతివారు,
అలల చేతఁ బాడించెఁ బాటలను బ్రకృతి
యపుడు నిమ్మకునీరెత్తి నట్టులుండి.

⁠