Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఆంధ్రదేవుని పద్యములు

​

ఆంధ్రదేవుని పద్యములు

 సీ. సీతనెత్తుకపోవఁ జెడియెనెవ్వనికొంప♦ మనకేల జదువ రామాయణంబు
వెలదినిసభకీడ్వ వెండ్రుక తెగదేరి♦ కేలభారతము మమ్మీడ్వమంట
గాండీవివిలుజార్చె భండనమ్మునటన్న♦ కేల్జంకదేల యాగీతమాకు
తారకుండింద్రునితన్న మాయాసనం♦ బగులదు మా కేలయట్టిగోల

గీ. అనెడివారికి గ్రంథాలయంబు లేల! జాతీయనుభవములు గ్రంథ♦శాలయందు
నున్న వను వారి కవినేటి♦కున్నవిగదా।అనుచు దెల్పవదేల మా♦కాంధ్రదేవా.

సీ. ఏకృష్ణరాయల నెదనెంచి శ్రీకృష్ణ♦ దేవరాయల కత్తిచేవమించె
ఏ పెద్దనక వీంద్రు నెదనెంచి పెద్దన్న♦ గంటాన జూపించె కత్తి పదును
ఏవీరు సతి నెదనెంచి తిక్కనిభార్య♦ పోర గెల్పునకునై ముండమోసె
ఏయుగంధరు నెదనెంచి యుగధరుం♦డరచునున్మాదియై యరునిబట్టె

గీ. చేవగలవారు వారలు♦ చేసిచూపి । రూరకేసరమావధులు♦ నోరునిండ
బలుకు మావంటిపేదలే♦వారునీకు|అంతయును గోచరంబెకా♦ ఆంధ్రదేవా.(ద.సు)

____________________