Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/శ్రీవీరేశలింగకవి సమాజము, కుముదవల్లి

​

శ్రీమద్విక్టోరియామహారాణీ చక్రవతి౯నీ గారి డైమండు జూబ్లీ మహోత్సవ సందర్భమున తమకుగల రాజభక్తిని వ్యక్త పరచుకొనుటకై, లోకోపకారపారీణులై సంఘసంస్కారధురీణులై ఆంధ్రదేశమాత కడుపున బుట్టిలోకమందెల్లెడల ప్రఖ్యాతినిగని ప్రసిద్ధకాముడై విలసిల్లుచున్న బ్రహ్మశ్రీ రావుబహద్దర్ శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులువారియందు గల దృఢమగు భక్తివిశ్వాసానురాగములనుబట్టి "శ్రీ వీరేశలింగకవి" సమాజమును ఈ చిన్న గ్రామములో శ్రీ భూపతి రాజు లచ్చిరాజుగారి చావడిలో శ్రీ పండ్రంగి చిన్నమరాజుగారి అధిక ప్రోత్సాహముచే ఆ 1897 సం౹౹రం జూన్ నెల 22వ తేదీని గ్రామస్థులచే స్థాపింపబడినది. ఈ సమాజప్రతిష్ఠాపనకత౯లగు చిన్నమరాజు గారు తమవద్దనున్న గ్రంధసామగ్రినంతయు దీనికుచితముగా నిచ్చుటచేతను వాటినవలోకన జేయించి విపులముగ బోధించి జెప్పుచు వార్తాపత్రికాభిరుచిని గలిగించుటచేతను ఈ సమాజము క్రమానుగతముగ అభివృద్ధికి రా మొదలు పెట్టెను. అందుచే ఆస్థలము కుశలమగుటయు, మరికొన్ని ఇతర కారణము ​లగుపడుటవలనను ఈ సమాజమునకు స్వంతమందిరముండుటావశ్యకమని తలపోసికొని ఈగ్రామాధికారులద్వారా తాలూకా అధికారులను స్థలమిప్పింపుడని కోరగా వారొక్క 'సెంటు'స్థల మిచ్చిరి. అది ప్రజల కూడికకు అనుకూలమైనదియే. ఆ స్థలమునందు ఆ 1897వ సంవత్సరాంతమున తాటియాకు కప్పుతో నొక చిన్న మందిరమును గట్టుకొనిరి. ప్రప్రధమమున మందిర నిర్మాణమునకు కోపల్లెగ్రామ నివాసులగు శ్రీ కాళ్ళకూరి నరసింహముగారి ప్రోత్సాహమువలన విద్యాధికులై ఆంధ్రభాషాభివృద్ధికి సదా కృషి జేయుచున్న పోలవరం జమీందారువారగు శ్రీరామచంద్ర వేంకటకృష్ణారావు పంతులు బి.ఏ. బహద్దరుగారు మొదట రు 25_0_0లు దయతో నొసంగుటవలన దీనికి కె.ఆర్.వి. కృష్ణారావు మందిరమని తగువారిచే అప్పుడు నామకరణము చేయబడినది. ఇట్లీసమాజము దినదినాభివృద్ధి నొందుచురాగా మందిరము నభివృద్ధి పరచి స్థిరమైనదిగా చేయవలసిన యగత్యత కలిగెను. సమాజమునకు తెనుగు గ్రంథములు విశేషముగా సమకూర్పబడినవి. జనుల వివేకాభివృద్ధికై సర్వదాకృషి చేయుదుమేని తప్పక ఈశ్వరసహాయము కలుగుననియు అప్పుడు గాని క్రమమగు ఫలితముతో కూడిన మనస్సంతుష్టి కలుగదనియు కావున ఎడతెగని కృషిచేయుటయే విధాయకధర్మమనియు ఈ సమాజము వారి యాశయము. ఇట్లుండ ఆ 1909 సం॥రం ఆగస్టు నెల 8 తేదీని నరసాపురం రెవిన్యూ డివిజక్షా అధికారులగు శ్రీ జ్యోతీంద్రనాధరాయి ఐ.సి.యస్. గారు ఈ గ్రామమునకు విచ్చేసి మా యాహ్వానముపైన ఈ మందిరమున ప్రవేశించి మా సమాజ స్థితిగతులను చక్కగా పరికించి ఆసమయమున దీనిని పెంకుటిల్లుగా జేసికొనుటకు యీ గ్రామ చెరువుగట్టుపై నున్న తాటి చెట్లలో 15 టి నుచితమగ నిప్పిఁపుడని వేడిరి. వారు దయతో 10 టిని కొట్టించుకొనుటకు వెంటనే యుత్తరువునొసంగిరి, తుదకవి చాలినంత పనికిరాకపోయినను వారు వాత్సల్యతతో దయ చేయుటవలననే ఈ మందిర నిర్మాణమునకు వారు మొదటి ప్రోత్సాహకులయిరి. ఈ మందిరము విశాలపరచి పెంకుటిదిగా చేయుటకు దీని చుట్టునున్న స్థలమొక్కంత ఇప్పింపుడని కోరగా ఏయాటంకమును కలిగింపక ఈ గ్రామాధికారులు సిఫార్సుచేయగా ఇదివర కిచట తాలూకా యధికారిగా నున్న ప్రాఙ్ఞలగు శ్రీ తుర్లపాటి వాసుదేవమూతి౯ పంతులు గారు వెంటనే స్థలమిప్పించిరి. ఈ యిల్లు కట్టుటలో సమాజికులును అభిమానులును వారివారి శక్తి కొలది ధనసహాయము చేయుటయేగాక కొందరు శరీరకష్టమును లెక్క చేయక స్వయముగా పాటుపడుచువచ్చిరి. అట్లయినను పూతి౯ పరచలేక పూనిన పని నిర్వహించుటకు తమకుగల మనోభిలాషను విడనాడక ఇతర గ్రామములలో నున్న మిత్రులను ధనసహాయము చేయగోరగా, వారు శక్తికొలది తోడ్పడిరి. ఇదియునుంగాక, ఆ గ్రామములోనున్న మువ్వురు ఆనాధలగు క్షత్రియ స్త్రీలు తగు ధనసహాయము చేసి మిగుల ప్రోత్సాహము గలిగించిరని దెలుపుటకెంతయు సంతసిల్లుచున్నారము. గుప్తదానపరులగు వారి నామములను వెల్లడిచేయుటకు వారంగీకరింపలేదు. పేరుచెప్పుకొనుట కిష్టము లేనివారే పెట్టున కుదార పరులన్న సామెత సాధ౯కపడుట కిదియొక ఉదాహరణము, మొదట ఈ గృహనిర్మాణమునకు ధనసహాయమొసగిన పోలవరం జమీందారువారిని కొంత కలపను ఇప్పింపుడని మనవిచేసుకొనగా నూరు రూపాయలు విలువగల కలపను దయచేసిరి. ఈ తోడ్పాటులవలనను ఈ సమాజము యొక్క నూతన మందిరమును 1910 సం॥ జూ౯ 1వ తేదికి పూతి౯ చేయగలిగిరి. మిగిలిన తలుపులు వగయిరా పనులు పూతి౯కొరకు, అనేకముగ ప్రజాక్షేమమగు శాశ్వతములలున ప్రతిష్ఠాపనలు చేసి ఈ చెన్నపురి రాజధానిలోని జమీందార్లలో నెల్ల సత్కార్యధౌరేయులని వాసిగాంచిన పిఠాపురంజమీందారు వారగు శ్రీరాజారావు వెంకటమహీపతి సూర్యారావు బహద్దరు వారికి విన్నవించుకొనగా వారు పరిపూర్ణదయతో నూరురూపాయలు మణియార్డరుద్వారా పంపిరి. ఈ సహాయముతో మందిర నిర్మాణమంతయు పూతి౯యైనది. ఆత్మకు శరీరమెట్లు నిలయమో అట్లే శరీరమునకు గృహమావశ్యకము. శరీరపోషణకోరు ప్రతిమనుజుడును గృహపోషణము జేయుట విధాయకకృత్యము. అట్టి వ్యక్తి గల ఈ సమాజికులందు ప్రతివారును ఈ యిల్లు తన శరీరమని దృఢముగ నమ్మి కంటికి చెప్పవలె దీని రక్ష ​ణకై హృదయపూర్వకముగా జూచుశక్తిని వారికి దేవుడు ప్రసాదించుగాక,

ఈ సమాజమున కనుబంధముగ, మానవ జీవితమువ కత్యావసరమై ఆత్మాభివృద్ధి కలిగించుకొనుట కెటు కృషి చేయవల మనో చక్కగా దెలిసికొని ఈ లోకమునందుగల చరాచర సముదాయమున కాధారభూతుండును, సృష్టి, స్థితి, లయ కారకుడుకు అరు జగదీశ్వరుని మా వాసికము గా సోత్ర, వండవ అనుతాప, శాంతిలక్షణములతో ఆరాధన చేయుట అలవరచుకొనుటయే ముక్తిని బొందుటకు రాజమార్గమని ధృఢవిశ్వాసము కలిగి ప్రార్థనా సమాజమును నెలకొల్పిరి. అందు ప్రతిభానువారము సాయంకాలమున కొందరుకూడి నిర్మల హృదయముతో ఈశ్వరస్తోత్ర పఠనాదికమున మనోవికాస ముద్భవిల్లులాగున శ్రావ్యగీతముల బాగుకు ఆనందింనుచు మానసిక ఈశ్వరోపాసన జేయునున్నారు. ఆపద్ధతి జనసామాన్యులలో సహితము వ్యాపింపజేయు కృషి బూనిరని చెప్పుటకు సంతసమగుచున్నది.

ఈ సమాజముయొక్క ప్రతిసంవత్సరీకోత్సవ సందర్భమున బీదలగు వృద్దులకు, దిక్కుమాలిన బిడ్డలకు, ఆంగవైకల్యులకు, అన్న వస్త్రదానము లొసంగుచున్నారు. ఈ గ్రామవాసి సుగుణవతి అనాధయః నయిన క్షత్రియకులోద్భవి యగు భూపతి రాజు క్షత్రియకులోద్భవి యగు నరసింహరాజు గారి భార్య వెంకయ్యమ్మగారు ఇది వరకే ఈ సమాజమునకు శాశ్వతముగా నుండుటకు రు 100 లు విరాళ మొసంగిరి. దాని వడ్డీ ధనముచే ఆమె కోరిక ప్రకారము ఏపేట అన్న దానము చేయబడుచున్నది. అట్లే పైన వ్రాసిన ఏర్పాటులతో మరియొక క్షత్రియ స్త్రీ రు 100 ల మూలధనము నిచ్చుటకు వాగ్దాన మిచ్చి అందుకు సాలుకగు వడ్డీ రు 10 లను మూడేండ్లనుండి యేటేట నిచ్చుకుండిరి. ఈ యిరువురు స్త్రీలును ధనవంతులు కాకున్నను మన దేశమునందు పల్లెటూళ్ళ లోని స్త్రీలు దానముల యొక్క యపయోగమును తెలిసికొనుటకును యిట్లాచరించుటకును వీరు మార్గ దర్శకులగుచున్నారు. ఈ సమాజము యొక్క యుపయోగమును సమీపమున నుండు గ్రామములలోని స్త్రీలు గూడ దెలిసికొని సహాయపకుట మిక్కిలి ప్రశంసనీయము. ద్రోణంరాజు పెదసోమరాజు గారి భార్య యణ, కోపల్లె నివాసులకు శ్రీ కాళ్ళకూరి సరసింహము గారికి సోదరియు, ఆనాధయునగు శీతమ్మగారు తమ యవసానకాలమున పైన వివరించిన దానమున్నకై మూల ధనముగా రు 25లు వారి సోదరునకిచ్చి ఈ సమాజమునకంపుమని జెప్పిరి. పాత్రదానమెరింగిన విద్యావివేకసంపత్తిగల ఆమెగారి యాత్మకు శాంతికలుగుగాక,

ఈ సమాజికులు బందరుపట్టణములోని ఆంధ్రజాతీయకళాశాలకు, దీపాళిపండుగనాడు ఇచ్చట ప్రతి యింటికింబోయి కొంతసొమ్ము జమచేసి వారికంపుచుండిరి. ఈసమాజ కార్యదర్శి గారు వార్షిక వృత్తాంతమునందు జెప్పిన ఈ క్రిందివిషయములు గమనింప దగియున్నవి:- “మనమందరమును ఈ సమాజమును ఎడతెగని పూనికతోను అత్యాసక్తితోను జాగరూకతతోను దేశకాల పాత్రత కనిపెట్టి దైవచింతనగలిగి కంటికి రెప్పవలె గాపాడుచుండినచో, అవకాశముపై క్రమక్రమముగ భావికాలమున అనంతములయిన సత్ఫలముల నొసంగును. సోదరులారా! దీనిఫలితములు ఇప్పుడు గుప్తముగానుండి, భావజ్యోతకములు, వివేకదృష్టికి కరతలామలకములుపలె, గానబడును; కాని బాహ్యదృష్టికగుపడునవి కావు ఈసత్యము విద్యా వివేక సంపత్తిగల, సత్యశీలురును, సద్ధర్మపరులుకు, పరోపకారపారీణులును, అనుభవముచే దెలిసికొని సదాతెలుపుకున్న విషయమేగాని నేవల్లిన యూహ కాదని నిష్కపటముగ జెప్పుచున్నాడను, సదాచార సంపత్తితో కూడిన విద్యాసక్తికొరకు పాటుపడుచు జ్ఞానధనమార్జింప సమకట్టి పుట్టినసమాజములు, నిరర్థకముల కాలహరణముల కాకరమయి వట్టి డాంబికములకు స్థానభూతములయి, యవివేకమును నెలకొల్పునని యోచించువాడు మానవుడో లేక జంతువో మరేమియో, వాని నెట్లుచూడవలెనో మీరే యోచించుకొనుడు, మనదేశమున పూర్వకాలమున ​బుషులు సయితము సుజ్ఞానులయి ప్రపంచమున ప్రసిద్ధి చెందిన నాగరికులయి, అంతములేని ఐహికాముష్మిక జ్ఞానసంపత్తిని మనకు పరంపరాభివృద్ధిగా నుండుటకొసంగి మృతజీవులై, లోకమందెల్లైన మార్గదర్శకులై శాశ్వతానందపదవి నొందగలిగిరని మన గ్రంథములే, మన కట్టుబాటులే, వేనోళ్ళ చాటి చెప్పుచున్నవి. కావున మీరెల్లకు ఈ సంగతిని మనమున పదిలపరచుకొని సాధ్యమై నంతవరకు మీ కాలమును, మీధనమును, ఈ సమాజాభివృద్ధికి వినియోగించెదరు గాక ”

ఈ సమాజము యొక్క మందిర నిర్మాణమునకు మొత్తము 625 రూపాయిలు వ్యయమయినవి. ఇత్వడీ సమాజము 600 కంటె నెక్కువ ఆంధ్రగ్రంథములతో, విరాజిల్లుచున్నది. పలువిధములగు వార్తాపత్రికలీ సమాజము నలంకరించుచున్నవి. ఈసమాజము శాశ్వత ప్రతిష్టాపనయై వెలయుటకు గాను రు 5000లు మూలధనమయినగావలయునని కార్యదక్షులభి ప్రాయపడుచున్నారు. అంధ్రదేశ పితామహుడగు రావుబహద్దరు శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులు గారి పవిత్ర నామముచే ప్రఖ్యాతినిగన్న ఈసమాజమున కింతపాటి ద్రవ్యము లభింపకపోదని మాయాశయము.

​

శ్రీ వీరేశలింగకవిసమాజము - కుముదవల్లి.

పదునెనిమిదన వార్షికోత్సవసమయమున దీయబడిన పటము
ఈ పటమునందు వెనుక భాగమున సమాజముయొక్క స్వంతభవనము కానవచ్చుచున్నది.