Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/పుస్తకసాంగత్యము (పద్యములు)

వికీసోర్స్ నుండి

పుస్తక సాంగత్యము.

(అబ్బూరు రామకృష్ణారావు గారిచే వ్రాయబడినది]

గీ. పాడువడినకొండల సమీపమునఁ బాఱు
కృష్ణవేణీ విషాద సంగీత గతులు
నవ్యసరణిజాతీయ గానమ్ము సేయఁ
దలచు గీతాకుమారునిఁ బలుకరించె.

మ. 'సుకవీ! వెన్నెలలంతరించెడు; తమస్సుల్
కృష్ణపక్షమ్ము లెల్లకడల్నిండగ విప్పు
చున్నవి; పొలాల౯ ఱెల్లు పూల్కాను పిం|
పక ధ్వాంతమ్మున మాతృశాదముల క్రే
వ౯ నల్లనై పోయె; తారక లాలాపము
సేయుగానముల సారస్యమ్మునాలింతువా?'

గీ. కోరికలఁ జిక్కువడిన మూర్ఖులమనమ్ము
లలఁచు నార్తుల సందేశములను వినక
ప్రకృతిగంభీరమయిన శ్రావ్యస్వరమున
హృదయగీతిక నతఁడెలుగెత్తి పాడె.

ఉ. శ్రావణ నీరదాంగనల చక్కదనమ్ములఁ
జూచి కన్నె పూ! దీవ తటిల్ల తాభినవదీప్తు
లనెందు భయమ్ముఁగాంచి, యే ! వో వి
హగమ్ములాటవిక బోథల గానములందిమి
డ్చి, యాం| థ్రావతికొక్క ప్రీతి వినయ
మ్మగు గీతమువాడుతోటల౯.

గీ. శిఖర శిఖరమునుండి వచ్చెడు వినూత
నోదయం బార్ద్రమయ్యె జ్ఞానోదయమున
తారకలకన్న కడు నశ్రుతంపు నుడుల
మంచిచదువులు మమ్మావరించునిపుడు.

గీ. పడవలనుఁ గటికి చీకటి నడువఁ జేయ
కీర్తి దేహుల ప్రణయ సంకీర్తనములఁ
బుస్తకంపు చైతన్య సంపుటములెల్ల
విప్పిచదివింత్రు యౌవన వీధులందు.

గీ. వేఱువేఱురీతుల నాత్మపార
వశ్యమునకయి పాడెడు పాటలెల్ల
ఏకమయి, నేడు మంగళహృదులమయిన
ఉదధి సంగీత సాంగత్యమూనఁ గలవు.