Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/డాక్టరు మెల్వి డేనీ

​

డాక్టరు మెల్విడేవీ

(ఎం.వి.ఎన్. శర్మగారిచే వ్రాయబడినది.)

ఈ మహాశయుడు అమెరికా దేశములోని గ్రంథాలయ మహోధ్వమమునుకు, పితామహుడు. కడచిన ముప్పది సంవత్సరములనుండియు ఈ యుద్యమముకొరకు వీరు నిరంతర పరిశ్రమ జేసి ప్రపంచమునంతకును అద్వితీయుడై విలసిల్లెను.

వృద్ధాప్యమున వీరిపుడు అమెరికాలోని 'ఆడి రాను డాకు' పర్వతముల నడుమనున్న ప్లాసేడు సరోవరతీరమున నొక కుటీరమును నిర్మించుకొని అంత్యదినములను ఆనందముగ గడుపుచున్నారు. వృద్ధులయినకు వీగు ఎక్కువ పట్టుదలతో నింకను గ్రంధములను జదువుచు దర్శనార్ధమై వచ్చు పేక్షకులకు గ్రంథాలయోద్యమము భాషాయుచ్చారణ సంస్కరణము మానవజాతికంతకును సామాన్యమయిన భాషానిర్మాణము కావలసిన మున్నగు సమస్యలను గుఱించి చెప్పుచు వారిని పరమానంద పరవశులుగ జేయుచుందురు. మన భారతభూమినుండి సయితమనేకులు సతతము ఆయన గారి యొద్దకు వెళ్ళి అనేక విషయముల నేర్చుకొనుచుందురు. బరోడా రాజ్యములోని గ్రంధాలయ సర్వస్వమునకు సంపాదకులుగ నున్న పూజ్యనీయులగు జె.ఎస్.కుదల్కరు ఎం. ఏ., ఎల్.ఎల్.బి., గారు అమెరికాకు వెళ్ళి వారిని దర్శించినప్పుడు బరోడా మహారాజుగారు గ్రంధాలయోధ్యమమునకు చేయుచున్న పరిశ్రమను వినినంతనే ఆయన గారెంతయో సంతసించి ఆనందబాష్పములు రాల్చి రాజు గారి నాశీర్వదించిరి. నిజముగా దేశభక్తులన నిట్టివారెగదా! ఎక్కడి బరోడారాజ్యము! ఎక్కడి అమెరికా! నిష్పక్షపాతులగు దేశభక్తు లిట్టివారు కొందరుండిన దేశమెందులకభివృద్ధి కానేరదు?

డాక్టరు మెల్విడేవి.

అమెరికాదేశ గ్రంథాలయోద్యమమునకు
మార్గదర్శకులు.

దేశమభివృద్ధి జెందవలయునవిన గ్రంథాలయము

​లను విరివిగా నెలకొల్పుటయు, వానిని సరియైన పద్ధతుల మీద నడపుటయు అత్యంతావశ్యకమని ఆయన యభిప్రాయము; భాష జనులకందరికిని సులభముగా నర్ధమగునటుల వ్రాయవలయుననియు, భాష సులభముగా ఉన్న యెడల జనసామాన్యము చులకనగా చదువు కొనగలుగుననియు ఆయన తలంపు. ఈ యాదర్శములను తమ హృదయ పేటిక యందుంచుకొని వానిని నిర్విస్నుముగా వృద్ధి చేయుటకు బూనుకొని 1878సం॥ము నుండి 'అముహష్టు' కళాశాలలో భాండాగారి పదవియందుండి, 1876వ సంవత్సరమునందాపదవికి రాజీనామా యిచ్చి తమ యాదర్శములను కార్యరూపముగ చూపుటకై బోష్టను పట్టణమునకు పోయెను, ఆసంవత్సరమునందు (పిలడర్పియా ' గ్రంథాలయ మహాజనసభ జరిగిన తదనంతరము డాక్టరుగారు అమెరికా గ్రంథాలయ సంఘమును (ఈ సంఘమున కాయన పదునయిదు సంవత్సరములు కార్యదర్శులుగను రెండు పర్యాయములు అధ్యక్షులుగను ఉండిరి) భాషోచ్ఛారణ సంస్కరణ సంఘమును నెలకొల్పిరి. ఈ సంఘముల మూలమున తమ యాదర్శములును క్రమక్రమముగా నెరవేర్చగలిగిరి. ఇంతటితో ఆయన తృప్తిని పొందక తమ అభిప్రాయములను జనులకందరికిని దెలియ జేయటకు వార్తాపత్రికలలో వ్యాసము లనేకములను వ్రాయదొడంగెను. గ్రంథాలయోద్యమమునకు ప్రత్యేకముగ పత్రికలను కొన్నిటిని నెలకొల్పి జనులకు తమ యాదర్శములను విపులముగా తెలియజేయచుండిరి. 1883సం౹౹ కొలంబియా కళాశాలకు ముఖ్య భాండాగారీకులుగను 1884సం'మున గ్రంథాలయ శాస్త్రోపధ్యాయులుగను గ్రంథాలయ విద్యాలయమునకు ముఖ్యాధికారులుగను నయోగింపబడిరి. కొలఁబియా' కళాశాలకు జెందియున్న ఆరు సంవత్సరములలోను, డాక్టరుగారు 180 సంవత్సరమునుండియు ఇతరులు సంపాదింప లేని గ్రంధసముదాయమును తమ నిరంతర పరిశ్రమవలన సంపాదింపగలిగిరి.

1888 సంవత్సరమున ప్రభుత్వమువారిచే రాజధాని నగరమందున్న ప్రభుత్వము వారి గ్రంథాలయమునకుహిత బోధకులుగను, న్యూయార్కు విశ్వవిద్యాలయమునకు ముఖ్యకార్యనిర్వాహకులుగను నియమింపబడిరి. మరియు ప్రభుత్వము వారి పుస్తకభాండాగారమునకు ముఖ్యాధికారులుగ నియోగింపబడిరి. డాక్టరు గారు తకు స్వాభవముంతను వినియోగించి గ్రంథాలయములలో ననేక మార్పులు గలుగ జేసిరి. కళాశాలలకును, విద్యాలయములకును అనుబంధముగా గ్రంధాలయములుండని యడల దేశములో విద్యాభివృద్ధి కాదని నిరూపింపగలిగెను. గ్రంధభాండాగారీకుల శిక్షితులజేసి దేశములో గ్రంథాలయోద్యనుమును పెంపొందింపజేయుటకు గాను 1897 సంవత్సరము నందాయన బోధనాభ్యాసన విద్యాలయమునొక దానిని 'కొలంబియా' పట్టణమునందు నెలకొల్పిరి. కొంతకాలమునకు తమ నివాసమును ఆల్బనీ పురమునకు మార్చుకొనినందున పాఠశాలను సహితమచ్చటికి మార్చిరి. అంత 1906ము వరకును ఆయన దాని కధ్యక్షులుగానుండి అనేకమందిని ఈ యద్యమమునందు నిధులనుగా తయారుజేసి దేశము నందంతటను ఈ యుద్యమమును పెంపొందించిరి. ఈ విద్యాలయము నందు శిక్షితులయిన విద్యార్థలు నేతులు దేశమెల్లెడల ఇట్టి పాఠశాలలనే నెలకొల్పిరి.

సెంటు లూయూలో 1889 సం॥న జరిగిన దేశీయసభ యందు ప్రభుత్వము వారి గ్రంథాలయ సంఘమునకు ఆధ్యక్షుగానెన్నుకోబడిరి. 1890సం.న ప్రధమ గ్రంధాలయ సంఘము నొకదానిని నెలకొల్పిరి. 1892వ సంవత్సరమున గ్రంథాలయ నిర్వహరణమునకుగాను కొన్ని చట్టములను తయారుచేసిరి. ఈ చట్టములననుసరించియు దొరతనమువారు గ్రంధాలయ శాఖను పేర ప్రత్యేకముగా నొకదానిని నెలకొల్పిరి. అనేక సంచారగ్రంధాలయములు బయలు దేరటకును ప్రభుత్వము వారి యాదరణకులుగుటకను ఈశాఖయే కారణము. జాతీయ విద్యాసంఘమువారు 1896 సంవత్సరమున గ్రంథాలయ శాఖకు ఏర్పాటు చేసిరి. ఆసందర్భము నందా సంఘమునకు డాక్టరుగారిని అధ్యక్షులుగా నెన్నుకొనిరి, లండను పుర రాజము నందు 1897 సం.న జరిగిన గ్రంథాలయ మహాజనసభకు అమెరికా దొరతనము వారిచే ప్రతినిధులుగా బంపబడిరి. ప్రభుత్వము వారి న్యూయార్కు ​గ్రంథాలయ సంఘమునకు 1904 సం॥ము నుండి 1906వ సం.వరకు అధ్యక్షులుగా నెన్నుకొనబడిరి. అమెరికా గ్రంథాలయ సమితి సయితము మన డాక్టరుగారి చే స్థాపింపబడెను. ఇంతటితో ఈ మహామహుడూరకుండక గ్రంథాలయ నిర్వహణమునకు కావలసిన అనేక గ్రంధరాజములను వ్రాసిరి, వీరు వ్రాసిన గ్రంధములన్నియు ప్రపంచమునంతకును మార్గదర్శకములై విలసిల్లి యున్నవి. 1904 సంవత్సరమున అమెరికా గ్రంథాలయసంఘము యొక్క పుస్తకముల జాబితాను తయారుచేసిరి. ఈ ప్రకారము ఆయన తనకాలమునంతను గ్రంథాలయోద్యముమునకై నిరంతరము పాటుపడుచున్నారు.