గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/గ్రంథాలయములు
గ్రంథాలయములు
(ఉమర్ ఆలీషాకవిగారిచే రచియింపబడినవి)
చ. జననియు జన్మభూమియును♦స్వర్గముకన్న గరీయమైనవం
చనియెను వాణి వీనులకు♦ సోకినరీతి శారికా
స్వనములు చంద్రి కాధవళి♦ శారదరాత్రులు సొంపుకుంపలే
వనఘ మరోహరంబు సము♦పార్జిత కాంతియుతంబు గావున౯.
ఉ. భారతమాత నిన్ను పరి♦పాలన చేసినవారు కీర్తి గ
న్నారు విలాసమేర్పడ న♦సంతశుభంబులమైంది స్వర్ణ దీ
నారముల౯ గురించి చని♦నారు వసుంధరలందు మేటి వ
న్నారుగదమ్మ నిద్ధరణి♦నాధులు యోధులు చిత్రమేర్పడ౯.
తే.గీ.నీవు స్వర్ణంబవో లేక నిఖిలవిభవ ౹ ములకు నెలవైన తేజప్ర♦పూర్ణ వొక్కొ
గంపెడు నిసుంగులకుగాంచి♦ కాంచనములు ౹ గురియుచు కళావిలాసముల్♦ గఱపినావు.
తే.గీ.మున్ను నీ గర్భవనమునఁ♦బుట్టినట్టి ౹ ప్రతిసుమంబు సుంగుధముల్♦ పరిఢవిల్ల
వైదుషీ ధృగరుతి చెవిఁ♦బరుచునుండె ౹ నిప్పుడవి లేవు వనమేదో♦చెప్పలేము.
సీ. వినసొంపునింపెడు♦ విమలగాంధర్వంబు - నలరించు మేటిగా♦యకులు లేరు
రమణీయ జాతి♦గీతములకు రచియించి - పాడింపగల కవీ♦శ్వరులు లేరు
లలిత నూతన కళా♦ కలితరీతిని యంత్ర - ములు సేయఁగల కార్మి♦కులును లేరు
ప్రకృతి పదార్థ జీ♦వజ్యోతిశోధించి - భ్రాతృభూమిధరించు♦వారు లేరు
దేశమును సంఘమును సము♦దీర్ణవృత్తి ౹ నరసి యుద్ధరింపఁగల నా♦యకులు లేరు
అట్టి మన పూర్వికులకథ♦లరలయుందు| పుస్తకాకృతి వీక్షింపఁ బోలునింక .
శా. ఏదేశోదయ దివ్యదీపికలచే♦నీరేడు లోకంబుల౯
బ్రాదుర్భావకళాప్రదీపకళికా♦దీపకశిగా వ్రాతంబు వెల్గొందెనో
ఆహా బిపు డంధకారమయమై♦యల్లాడుచు౯ రోజు లెం
తో ధైర్యంబునఁ బుచ్చుచున్నవకటా♦యూహింప నింకేటికి౯.
సీ. మధు మాసముల మేయు♦మావి చిగుళ్ళకై - పంచమస్వరమభ్య♦సించె పికము
కుసుమాసనము ప్రేమ మెసవి వినోదింప - వనచరత్వము నేర్చు♦కొనియె భృంగి
మేఘమాలికతోడ♦మిత్రానురాగంబు - ప్రకటింపఁగఱచె న♦ర్తనము నెమలి
పూదీవఁతీవకుఁ♦ బోయితేనెగడించు - పాండితి నలవాటు♦పడియె జుంటి
ఇట్లు జడములు సహజ సా♦హిత్యగరిమ/ ప్రకృతిని నలంకరింపుచు♦బరగుచుండ
మనము మనుజాశయంబు నార్జన విధంబు వదలినాము సౌభాగ్యంబు♦వదలినాము.
సీ. దేశాభిమానంబు♦ దీపింప నూరూర - గ్రంథాలయములుంచి♦గ్రాలవలయు
సంఘసంస్కారంబు♦ సవరింప నూరూర - గ్రంథాన్వయముజెప్ప♦గడగవలయు
జాత్యభివృద్ధి వి♦చారింప నూహర- గ్రంథార్థపఠనంబు ♦ గడపవలయు
జన్మభూమికి మేలు సలుపుట కూరూర - గ్రంథదర్శనవృత్తి♦గాంచవలయు
అటులగాకున్న శుష్క వాక్యములవలన ఫలము చేకూర దాంధ్రుల♦ భావి జీవి
తమ మహానర్థములఁగూలి తల్లడిల్లు |గాన భారతికొకయిల్లు♦గట్టుడయ్య.