ఈ గ్రంథాలయము 1880 సం॥మున నెలకొల్పబడినది, కాని కొన్ని అనివార్యములవలన, మూయబడి 1894సం॥మున మరల ప్రారంభింపబడియెను. అప్పటినుండి నాలుగు సంవత్సరములలో రూ 1,200ల వరకు శాశ్విత నిధిని
వనూలు చేయగలిగిరి. 1908 సం" వరకు నూరు రూప్యముల
ఆదాయముపై స్వంతముగా పోషింపబడెను. పాఠకుల
నాకర్షించుటకును — వారి సంఖ్య వృద్ధిరుగుటకును జనుల యొక్కయు ప్రభుత్వము వారి యొక్కము, సాయము
వలన రూ 6,000 ల వ్యయముతో గ్రంథాలయమునకు
గాను నూతనభవన మొకటి నిర్మింపబడెను. 1910 సం॥మున
గైక్వాడుమహారాజుల వారి సోదరులగు శ్రీమంత్ సంపత్రావు గాయిక్వాడు గారిచే గృహప్రవేశము మహోత్సవము జరిపింపబడియెను. 1911 సం॥రము నుండియు సంవత్సరమునకు గు 300 ల విరాళములను సంపాదింపగలిగెను; బరోడా ప్రభుత్వమునారును పంచాయతీయును గూడ అంత సొమ్మునే గ్రాంటు రూపమునగూడ ఒసంగుచుండిరి. ఒక సంవత్సరములో గానే ఇతర గ్రంథాలయములు ఇరువది సంవత్సవములలో సంపాదింపగలిగిన ఆదాయము నీ గ్రంథాలయము స్వీకరింపగలిగెను. ఈ గ్రంథాలయములో 2062 పుస్తకములు గలవు. వానిని గతసంవత్సరమున, 5131 మంది జనులు చదివిరి. ఈ నిలయమునకు 30 గుజరాతి, 6 యింగ్లీషు, 2 హిందీ పత్రికలు వచ్చుచున్నవి. 87 మంది యావజ్జీవ సభ్యులును, 300 మంది సభ్యులును నీగ్రంథాలయమునకు గలరు. మహారాజా
సార్వజనిక గ్రంథాలయము బయటి ఆకారమును జూపుపటము.
'వాసో (బరోడా రాష్ట్రము)
సార్వజనిక గ్రంథాలయము లోపలి ఆకారమును జూపు పటము.
వాసో (బరోడా రాష్ట్రము).
'గారు 'వాసో'ను దర్శించినపుకు గ్రంథాలకు కార్యనిర్వాహక సంఘమువారు వారికి సన్మానపత్రిక నొసంగి దాని నందరును రజత పేటికయందుంచి బహుమానముగా నొసంగిరి. దానిపై “నిర్బంధోచిత విద్యకును, గ్రంథాలయ మహోద్యమమునకురు, జనకులకు కృతజ్ఞతా పూర్వకముగ సమర్పింపబడినది" అని లిఖింపబడి యుండెను. వాసో గ్రంథాలయమునకు మహారాజులవారు దర్శన మొసంగినందులకుగాను గౌరవార్ధముగా పురప్రముఖులలో ముఖ్యులగు గోపాలదాసు అంబిదాసు గారు గ్రంథాలయుమునకు పుస్తకములు కొనుటకు రూ.1000 లను విరాళముగా నొసంగిరి. మహారాజు గారు సన్మానపత్రమునకు బ్రత్యుత్తరమొసంగుకు దాని వృద్ధికిని నూతన పద్ధతులపై దానిని నడపుచున్నందులకును తమ ఆమోదమును దెలిపిరి.