Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ద్వితీయ ఆంధ్రదేశ గ్రంథభాండాగార ప్రతినిధుల మహాసభా ...

వికీసోర్స్ నుండి

ద్వితీయ గ్రంథభాండాగార ప్రతినిధుల మహాసభ


ఆహ్వాన సంఘాధ్యక్షులగు
బారు శ్రీరామనరసింహారావుగారు.

మహాజనసభకు అగ్రాసనాధిపతిగారగు హానరబిల్
పానుగంటి రామారాయనింగారు.

ద్వితీయ ఆంధ్రదేశ గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభ

రాజమహేంద్రవర పట్టణమున శ్రీ వీరేశలింగ, వసురాయ పుస్తకభాండాగారములు యాహ్వానము ననుసరించి 1915 సం॥ మేనెల 9వ తేదీ మధ్యాహ్నము 2-30 గంటలకు శ్రీ వీరేశలింగము గారి హైస్కూలు భవనమున ద్వితీయ ఆంధ్రదేశ గ్రంధభాండాగార ప్రతినిధుల మహాసభకూడెను. కృష్ణా, గుంటూరు, గోదావరి, విశాఖపట్నము, గంజాం, నెల్లూరు జిల్లాలనుండి 120కంటె నెక్కువగ ప్రతినిధులేతెంచిరి. ప్రతినిధులును ఇతర జనులును మొత్తము మీద 800 మంది జనులు సభనలంకరించిరి.

ప్రధమమున సన్మాన సంఘాధ్యక్షులగు శ్రీ బారు నరసింహారావు గారు, బి.ఏ., బి.ఎల్., తమ స్వాగతోపన్యాసమును జదివిరి. తరువాత చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు పానుగంటి రామారాయనిం గారిని సభకు అగ్రాసనాధిపతిగా నుండునట్లు కోరుచు వారి విషయమై కొంత ముచ్చటించిరి. పెద్దిభొట్ల వీరయ్య గారును, కొండమూడి శ్రీరాములుగారును పై విషయమును బలపరచిరి. అందఱు నేకగ్రీవముగ నొప్పుకొనుచు కరతాళధ్వనుల జేసిరి. అనంతరము శ్రీ పానుగంటి రామారాయనిం గారిని పూలహారముతో గౌరవించి అగ్రాసనాసీనునిం జేసిరి. అగ్రాసనాధిపతి గారు తమ ప్రారంభోపన్యాసమును ఆంధ్రభాషయందు జదివిరి. శ్రీ రామారాయనింగారి సోదరులు గూడ నేతెంచి సభనలంకరించిరి.

తరువాత కార్యదర్శి గారిచే సభకు రాజాలమని వ్రాసిన లేఖలు జదువబడెను. అందు రవీంద్రనాధ ఠాకూరు గారి శాంతి నికేతన మందు విద్యాభ్యాసము జేయుచున్న రాయప్రోలు సుబ్బారావు గారు వ్రాసి పంపించిన పద్యములు మిగుల రసవంతములై, మనోరంజకములై, భావపూరితములై సభ్యుల నందరిని ఆనందవార్థిలోనోలలాడించెను. తరువాత నాళం కృష్ణారావు గారు ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘము యొక్క 1914 ఏప్రిలు మొదలు 1915 ఏప్రిలు ఆఖరువరకు జరిగిన వృత్తాంతమును జదివిరి. పిమ్మట విషయనిణయ సంఘమేర్పాటు గావింపబడి నాటి సభ ముగింపబడెను.

10వ తేదీన ఉదయము 8 గంటలకు తిరిగి సభ కూడెను. ప్రధమమున వడ్డాది సుబ్బారాయుడు గారు దైవప్రార్ధన గావించిరి. తరువాత నూరి వేంకట నరసింహంగారు ఆంధ్రదేశ గ్రంధభాండాగారోద్యమును గూర్చియు, సంచారపుస్తక భాండాగారములను గూర్చి శ్రీపాద సుబ్రహ్మణ్యము గారును, గ్రంథాలయములన నేమి?అవి చేయదగిన పనియేమి? అను విషయమును గూర్చి అయ్యంకి వేంకటరమణయ్యగారును, దేశభాషాప్రాముఖ్యతను గూర్చి వల్లూరి సూర్యనారాయణరావు గారును, ప్రారంభవిద్యకు గ్రంథభాండాగారము లెట్లు తోడ్పడును? యను వంశమును గూర్చి సత్తెనపల్లి హనుమంతరావుగారును, గ్రంధపాలకుని ధర్మములను గూర్చి తేకుమళ్ళ వెంకాజీరావు గారుసు, గ్రంధ విభజనమును గూర్చి వెలిదెండ శ్రీనివాసరావు గారిచే వ్రాయబడిన వ్యాసమును మరొకరును, గ్రంథాలయ ధర్మములనుగూర్చి గుడిపాటి సూర్యనారాయణ గారును ఉపన్యాసముల నిచ్చిరి,

అంతటితో ప్రాతఃకాల సభ ముగిసెను, సాయంకాలము తిరిగి 8.20 గంటలకు సభ సమావేశమయ్యేను. గ్రంథ భాండాగారము లెట్లుండవలెను యను విషయమును గూర్చి చి౦తపంటి వేంకటరమణయ్య గారును, తీత్తి బలరామయ్యగారును, దుగ్గిరాల నుండి వచ్చిన వారొకరును ముచ్చటించిరి. నా యనుభవము'లను గూర్చి కే.జోగారావుగారు జెప్పిరి. ఆనంతర మీదిగువ తీర్మానములు జేయబడినవి:___

1.వ తీర్మానము.

గోపాలకృష్ణగోక్లే గారును, కొక్కొండ వేంకటరత్నం పంతులుగారును, పురాణం వెంకటప్పయ్య గారును, జొన్నవిత్తుల గురునాధం గారును, చనిపోయినందుల కీసభవారు వారి కుటుంబములకు తమ సానుభూతిని దెలుపుచున్నారు.

అగ్రాసనాధిపతి గారిచే నుపపాదింపబడినది.

2.వ తీర్మానము.

విద్యాభివృద్ధి చేయుటయందు గ్రంధాలయములు ముఖ్యస్థానములు గనుక (ఏ) ప్రస్తుతము ఆంధ్రదేశమున స్థాపింపబడియున్న గ్రంథాలయములకును, పఠన మందిరములకును, మ్యునిసిపాలిటీ, డిస్ట్రిక్టు తాలూకా బోర్డుల యొక్క ద్రవ్యములనుండియు, ప్రొవి౯షియల్ రివిన్యూలనుండియు ద్రవ్యసహాయమును జేయుటకు సదుపాయములను గలుగ జేయవలసినదని ప్రభుత్వము వారిని ఈ సభ వారు ప్రాథి౯ంచుచున్నారు. (బి) ఆంధ్రదేశమధ్యమున అనుకూలమైన స్థలమునందు, ఆంధ్రభాషయందు ప్రచురింపబడు గ్రంథములనన్నిటిని పత్రికలనన్నిటిని చెన్నపట్టణ ప్రాచ్యలీఖితపుస్తక భాండాగారమందలి ఇతర అముద్రిత గ్రంధప్రతుల నన్నిటిని జేర్చి ఆంధ్రదేశ మందలి ఇతర గ్రంధాలయములకు సహాయభూతముగ నుండునటుల గ్రంధాలయము నొకదానిని ప్రభుత్వమువారు నెలకొల్పుట ఆత్యావశ్యకము గనుక అట్టి గ్రంథాలయమును త్వరలో స్థాపించుటకు ప్రభుత్వమువారిని ఈ సభవారు ప్రాథి౯ంచుచున్నారు.

ఈ తీర్మానమును హానరబిల్ రావు బహద్దరు మోచర్ల రామచంద్రరావు పంతులుగారు ఉపపాదించిరి. ఒంగోలు పురవాసులగు మిట్టదొడ్డి సుబ్బారావు పంతులుగారు బలపరచిరి.

3వ తీర్మానము.

దొరతనము వారిచే ప్రచురింపబడు పరిశ్రామిక ఆరోగ్యవిషయిక ప్రచురణముల నన్నిటిని, జిల్లా గెజిటీలను, ఆంధ్రభాషయందు ముద్రింపబడిన గ్రంథముల పట్టికలను ఆంధ్రదేశమునందలి గ్రంధాలయముల కన్నిటికిని ఉచితముగా దయచేయవలెనని ఈసభ వారు ప్రభుత్వము వారిని ప్రాథి౯ంచుచున్నారు.

4.వ తీర్మానము.

ఆంధ్ర దేశమునందంతటను గ్రంధాలయోద్యమమును వ్యాపింపజేయుటకై సంచార కార్యదర్శి నేర్పాటుజేయుటకు కావలసిన ద్రవ్యమును సమకూర్చుటకు అందఱును సహాయపడెదరని ఈ సభవారు జనులనందఱిని ప్రాథి౯ంచుచున్నారు.

5వ తీర్మానము.

ఆంధ్రదేశమునందున్న అన్ని పట్టణములయందును పల్లెల యందునుగూడ గ్రంథాలయములను గాని పఠనమందిరములను గాని స్థాపింపవలెనని జనులనీ సభవారు ప్రాధి౯ంచుచున్నారు.

6వ తీర్మానము.

ప్రతి గ్రంథాలయమును తాము గత సంవత్సరమునందు చేసిన పనిని నివేదించుటకును, ముందు చేయబూనుకొన్న పనిని గూర్చి ప్రస్తావన చేయుటకును, జనసామావ్యమునకు సంఘాద్దేశ్యములను తెలియజేయుటకును గాను సంవత్సరోత్సవములను జరుపుటకును ఆసమయమున జదువబడిన కార్యనివేదనమును ఈ సంఘపక్షమున బ్రకటించు పత్రికలో ప్రకటించుటకు గాను కార్యదర్శులకు బంపుటకును గ్రంథాలయ సంఘములను ఈసభవారు గోరుచున్నారు.

7వ తీర్మానము.

తినిధుల కట్నముల వలన వసూలు అయిన సొమ్మును సంచార కార్యదర్శియొక్క ఖర్చుల కొఱకును ఇతర ఖర్చులకొఱకును ఈ సభవారిచే నేర్పరుపబడిన గ్రంథాలయ సంఘమునకు ఇచ్చుటకు ఈ సభవారు తీర్మానించుచున్నారు.

8వ తీర్మానము.

ఆంధ్రదేశ గ్రంధ భాండాగార సంఘమునకు ఈ సంవత్సరమున నీదిగువ నుదహరింపబడినవారు కార్యనిర్వాహక సభ్యులుగ నెన్ను కొనబడిరి.

అగ్రాసనాధిపతి,—— గౌ.మోచర్ల రామచంద్రరావుగారు. ఉపాగ్రాసనాధిపతులు, — చిలకమర్తి లక్ష్మీనరసింహము గారు, నూరి నరసింహము గారు.
కార్యదర్శులు,—నాళం కృష్ణారావుగారు, అయ్యంకి వేంకటరమణయ్య గారు.

ఇతర సభ్యులు

రొయ్యూరు రామచంద్రప్రసాదరావు గారు, రొయ్యూరు.
గోపరాజు బ్రహ్మానందంగారు, బెజవాడ.
బొడ్డపాటి శేషగిరి రావుగారు, పొద్దుటూరు.
బొడ్డపాటి హనుమంతరావుగారు, బొడ్డపాడు,
బాలసరస్వతీ సంఘము, అంగలూరు.
వేమూరి రాంజీరావుగారు, మచిలీపట్నం.
కొడాలి శివరామకృష్ణారావుగారు, డిటొ
టి.యన్.శర్మగారు, ఉంగుటూరు.
నిడమర్తి లక్ష్మీనారాయణగారు, నిడమర్రు.
బెల్లంకొండ రాఘవరావుగారు, పమిడిపాడు. నర్సారావుపేట పోష్టు.
సత్తెనపల్లి హనుమంతరావుగారు, దుగ్గిరాల.
చట్టి నరసింహారావుగారు, గుంటూరు,
చలా శేషగిరిరావు గారు, గుంటూరు.
పులిపాక వెంకటరామారావుగారు,ఈమని.
అంచే శివయ్యగారు, ఈమని. తెనాలి తాలూకా.
కుప్పా శ్రీ రామశర్మ గారు, అనంతవరం. తెనాలి తాలూకా.
అద్దంకి సత్యనారాయణమూర్తి గారు, రాజమండ్రి.
రామానుజ పుస్తక భాండాగారము, తుని.
ఆకెళ్ళ వెంకట సుబ్బారాయుడు గారు, అమలాపురం.
పీపిల్సు ఎస్సోసియేషన్, కాకినాడ,
బిక్కని వెంకటరత్నంగారు, చోడవరం. రామచంద్రపురం తా.
భాగి సుబ్రహ్మణ్యం గారు, సికింద్రాబాదు.
ఇ. సుబ్బుకృష్ణయ్య గారు, హైదరాబాదు.
చివుకుల అప్పయ్యశాస్త్రి గారు, సికింద్రాబాదు.
యస్. నగరాజారావు గారు, జానోదయ సమాజం. నెల్లూరు.
తిక్కన పుస్తక భాండాగారము, డిటో
రామమోహన ధర్మపుస్తక భాండాగారము, గండివరం,
కడవలూరు పొష్టు, నెల్లూరుజిల్లా.
పొణకా పట్టాభిరామరెడ్డి గారు, పొట్లపూడి,
మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు, విశాఖపట్నము.
కే. జోగారావుగారు, ఎలమంచిలి.
ఆంధ్రభాషాభివర్ధనీ సంఘము, బరంపురం.
తిత్తి బలరామయ్యగారు, బారువ,
డి.కృష్ణారావుగారు, బరంపురం.
ఆంధ్రభాషాభి వర్ధనీ సంఘము, పొద్దుటూరు, కడపజిల్లా.
రామకృష్ణ పరమహంస రీడింగురూమ్, కడప,
దేశపాండ్య సుబ్బారావుగారు, నంద్యాల.
మిత్రమండలి, బళ్ళారి.

9వ తీర్మానము.

తెనాలి తాలూకా దుగ్గిరాల భాషాభిలాషిణీ సంఘమునకు భవనమును నిర్మించుచున్న పునాదిపాటి గ్రామవాస్తవ్యులును ఉదార స్వభావులునుగు, యేర్లగడ్డ పెన్నీడు చౌదరి గారి కీ సభ వారు వందనము లర్పించుచున్నారు. ఇట్లే ఆంధ్రదేశములోని జమీందారులును ధనవంతులును గ్రంధాలయోద్యమమునకు సహాయమును జేయుదురని ప్రార్ధించుచున్నారము.

10వ తీర్మానము.

ముందు సంవత్సరమీ సభను నెల్లూరు జిల్లాయందు చేయుటకు తీర్మానింపడమైనది. ఈతీర్మానమును పొట్లపూడి వాస్తవ్యులగు పొణకా పట్టాభిరామ రెడ్డి గారు ఉపపాదించిరి. నెల్లూరు వాస్తవ్యులగు యన్.నాగరాజారావుగారు బలపరచిరి.

తదుపరి అగ్రాసనాధిపతిగారు తమ యంత్యోపన్యాసమును ముగించిన పిమ్మట, కొవ్యూరు వాస్తవ్యులగు తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు అగ్రాసనాధిపతి గారికిని, ప్రతినిధులకును వందనము లర్పించిరి.

అంతటితో సభ ముగిసెను,

ఆహ్వాన సంఘాధ్యక్షులగు బారు శ్రీరామ నరసింహా రావుగారి యుపన్యాసము.

మహనీయులారా! ఆంధ్రభాషాభిమానులారా! ఆంధ్రదేశాభివృద్ధి చికీర్షులారా!

ఆంధ్రదేశ గ్రంధ భాండాగార ద్వితీయమహాసభా ప్రతినిధి ప్రముఖ సన్మాన సంఘ పక్షమున నాహృదయపూర్వక స్వాగతము నిచ్చుటకై నాకవకాశము కలిగింపఁబడినందుకు మిక్కిలి సంతసించుచున్నాను. ఈదినములలో తీవ్రనిదాఘతాపమున బాధలకోర్చి కడు దూరమునుండి మిక్కిలి ప్రయాసముతోఁ బ్రయాణము చేసి మా యాహ్వానమును గౌరవించి ఇచటికి దయచేసినందులకు ఈ భాండాగారోద్యమమునందు మీ కెల్లరకుగల సానుభూతీయు, నుత్సాహమును మాత్రమే కారణంబులు గాని మరియొకటి కాదు. ఇంత శ్రమపడి మీరందఱిక్కడకు విచ్చేసినందులకు మీకుఁ దగిన సత్కారములొనర్చి మీ భోజనమజ్జనపానాదులకుందగు సౌకర్యములను ఉచితరీతిని గలుగఁజేయునంతటి శక్తి మాకు లేనందులకు మిక్కిలి చింతించుచున్నారము. అయినను ఈ భారము మాపై వైచుకొనుట దానిని జయప్రదముగా కొనసాగింపఁగల శక్తి మాకుఁ గలదనెడి ధైర్యముండికాదు. మీ యందఱివలె మాకును ఈ భాండాగారోద్యమమందు గల యుత్సాహమే కారణము. శ్రీమదఖండి గౌతమీపవిత్రసలిల స్నానపానములును, పౌరాణిక, చరిత్రాత్మక గాధలతో నిండియుండి సుప్రసిద్ధ ప్రాచీనాధునిక కవులచే నలంకరింపఁబడినటువంటి యు, దక్షిణ కాశీ నా వాసిగాంచిన మారాణ్మహేంద్రవర పుణ్యక్షేత్ర సందర్శనమును మాత్రమే మీకుఁ గలుగఁజేయఁగలిగిన లాభములని యెంచుకొనుచున్నాము. మేము మీ యెడల జరుపవలసిన యుదారకృత్యముల విషయమై మాకుఁగల యుద్దేశముల మాత్రమే మీరు భావించి లోపములను మన్నింపఁ గోరుచున్నాము.

ఈ యాంధ్ర దేశ గ్రంథ భాండాగార, మహాసభ నిరుటి సంవత్సరము విజయవాడలో పుట్టిన పసికూనయని మీయెల్లరకు విశదమే, దీనిని కడు శ్రద్ధతో, నాదరముతోఁ బోషించి పెంచు భారము మనదైయున్నది.

ఆంధ్రసాహిత్యపరిషత్తు భాషాభిమానులైనయనేక రాజులయొక్కయు, రాజకీయోద్యోగులు మొదలయిన వారి యొక్కయు నాదరమువలన వర్థిల్లుచున్న సంగతి మీకుఁ దెలిసియేయుండును. ఆపరిషత్తు యొక్కయు నీ గ్రంధభాండాగార సభ యొక్క యు నుద్దేశము లించుమించుగా సమానములై, యన్యోన్య సంబంధము గలవైయున్నందున నీ రెండు సభలును ప్రతిసంవత్సర మొకచోట నే యేక కాలమున జరుపుట యనుకూలమనియు, నవి పరస్పర సహకారములుగా నుండుననియు నాయభిప్రాయము. ఇపుడు మీరందరీ విషయమై కూడ నాలోచించి ముందు సంవత్సరమునుంచి యీమహాసభ యెక్కడ జరుగవలసియుండిన లాభకరమో నిశ్చయింపవలసియున్నది.

ఈ యుద్యమము యొక్క ముఖ్యోద్దేశము జనసామాన్యమునకు జ్ఞానోపదేశము చేయుటయే. ఈ యుద్యమము మన హిందూ దేశమునకు క్రొత్తకాదు. ఐహికాముష్మికములకుఁ దగిన జ్ఞానము మన పురాణములయందు నిబిడీకృతమై యున్నది. అట్టి పురాణములను వీధులలోను, తదితర బహిరంగ ప్రదేశములలోను పఠనము చేయుట వలన, వీధినాటకములు మొదలగు వానిని ప్రదర్శించుటవలనను జనసామాన్యమునకు జ్ఞానోపదేశము కలుగఁజేయఁబడుచుండేడిది. కాని యిప్పటి కాలస్థితిని బట్టి అరీతుల జ్ఞానాభివృద్ధిని దీని కలుగఁజేయుట కందఱకవకాశము లేదు. ప్రాచీనకాలమున మన హిందూరాజ్యమున గూడ ననేక భాండాగారములను మనరాజులు నెలకొల్పి యుండిరన్న సంగతి చరిత్రల వలన తెలిసి కొనుచున్నారము.తరువాత తురుష్క రాజ్యములో నెట్టి దురవస్థకలిగి యెంతెంతటి భాండాగారము లెటులు నశించినవో తెలిసిన యంశమే. ఇప్పుడో, ప్రస్తుతాంగ్లేయ రాజ్యపాలనము నందలి ప్రశాంతకాలమున మన కట్టిక్కట్టులెల్ల తొలిగిపోయినవి. ఈ యుద్యమము ప్రబలి జనసామాన్యమునకు జ్ఞానదాయకమగుట కనుకూల సమయమై యున్నది. ఈ భాండాగారోద్యమమును సరియై న రీతిని నిర్వహింపజేసినచో నిందువలన గలిగెడు లాభమమితము. అమెరికా దేశమున నీయుద్యమ మ సేక విధముల సర్వజనాదరణీయముగా జేయబడి దేశమున కమితోపకారము కలుగ జేయుచున్నది. ఇట్టి భాండాగారముల వలననే జ్ఞానోపదేశమును బొంది ఆండ్రూ కార్నీ జీ అనునతడు అపరిమితైశ్వర్య సంపన్నుఁడై యట్టి లాభము నె యితరుల కందఱకు గలుగ జే మనిచ్చగించి తన యా జీతములో విస్తారభాగ మాయుద్యమము నిమిత్తము వి నియోగపఱచి యెల్లెడల గ్రంథభాండాగారములను స్థాప నముచేసి బీదసాదల కుచితముగా జానసంపాదన సాధ నముల కలుగజేసి యున్నాడు. అట్టి పద్ధతుల నెల్ల కడు శ్రద్ధతో పరిశీలించి శ్రీ బగోడా మహారాజు వారుగూడ తమ రాష్ట్రములో నట్టి భాండాగారములను స్థాపించి, కుగ్రామవాసులకు గూడ వానిలాభము నందజేయు నుద్దే శముతో (Circulating Libraries) పరివత౯న పుస్తక భాండాగారములను కూడ నెలకొల్పినారు. అట్టి ప్రయ త్నము లమిక ధన సాధ్యములు. మన కిప్పుడవి దుస్సా ధ్యములు. అయినను కాలక్రమమున దొరతనము వారి సహాయ్యమువలన గాని, మన పరస్పర సహాయమువలన గాని లేక జమీందారుల యొక్కయు మహారాజుల యొ క్కయు తోడుపాటువలన గాని యవి సాధ్యములు కా వచ్చును. ఈ భాండాగారములు చేయవలసిన కార్యవి ధానము మనకింకను సరిగా బోధపడలేదు. ఈ కార్యము నందు దగు ననుభవము గల వారిని నియమించి ఆయా దేశముల కనిపి, అక్కడక్కడి పద్ధతులను పరిశీలించి వానిని మన దేశమున బ్రవేశ పెట్టవలసి యున్నది.

ఈ భాండాగారముల నేయేవిధముగా నడిపిన నెక్కువ లాభకరముగా నుండునో యామార్గముల నెల్ల మీూ రారసి చూడవలయును. వీనిని గ్రమమైన విధమున నడిపినచో నత్యంతో పయోగకరములుగ మాత్రిము నిస్సందేహము.

మతాంతరులనేకులు మన దేశమందుండి స్వమత భూషణము, పరమత దూషణము చేసి మనలను మత దూరులుగ జేయుచున్నారు. జనసామాన్య మజ్ఞానాంధ కారమున మురిగియున్నది. ఇట్టి యరిష్టముల నన్నిటిని దొలగించుటలో నీయుద్యను మొక ముఖ్య సాధనము గనుక దీనిని క్రమముగ నుపయోగించు మార్గము ననుభవ శాలులైన విూరందఱు కనిపెట్టుదురు గాక! మనమట్టి విషయమై యిప్పుడు చర్చింప సమావేశమై యున్నా ము గావున నా నాస్థలములనుండి యిందుకొఱకై యిట కువచ్చిన ప్రతినిధులయెడల సన్మాన సంఘము వారి వలన కలిగిన లోపములనుమన్నింపుడని సంఘపక్షమున మిమ్ము లను గ్రమ్మఱ వేడుకొనుచు నపారానుభవము, కార్యని ర్వహణ నైపుణ్యము జ్ఞానసంపద మొదలగు సుగుణము ల కాకరమై మనకందఱకు మార్గదర్శకులుగా నుండదగు నగ్రాసనాధిపతి 'నెన్న కొని యీసభను జయప్రదము గా జరుపుదురు గాక!

మహాజన సభాధ్యక్షులగు హానరబిల్ పానుగంటి రామా రాయనిగారి యుపన్యాసము.

సోదరసోదరీమణులారా! భాషాభిమాన ఘనులా రా! ఆంధ్రగ్రంధాలయ కార్యనిర్వాహక సభ్యులారా! అవధరింపుడు.

ఆంధ్రమహామండలికి మండనాయమానమై రాజి ల్లు నీరాజమహేంద్రవరమున నేడు జరుగనున్న శ్రీమ దాంధ్రదేశ గ్రంధాలయ సభయందు నన్ను గౌరవించి యగ్రాసనాధి పతిత్వము వహింప నాజ్ఞాపించినందుకుఁ దమయెడ నేనెంతయుఁ గృతజ్ఞుఁడను,

ప్రప్రధమమున లోకమున లిపి యేర్పడకమునుపు మానవులు తమ ప్రజ్ఞాబలముచే జ్ఞానమును సంపాదించి జ్ఞాననిధులై జిజ్ఞాసువులగు నితరులకుఁ దామెఱిగిన విష యములు సమయోచితముగఁ గఱపుచు లోకోపకారము చేయుచుండిరి. జ్ఞాన మభివృద్ధి కానుగాను నట్టి జ్ఞానము నశింపకుండుటకై జ్ఞానులు తాము సంపాదించిన జ్ఞానము ను ఛందోబద్ధమగు భాషయందు నిలిపి స్థిరపఱచిరి. మన వేదాదులట్టివి. వానిని మనఋషులు తమ శిష్య పరంపరకు గఱపి ప్రపంచమున వ్యాపింపఁజేయుచుండిరి. చిరకాలా నంతరము లిపి యేర్పడి జ్ఞానమును గ్రంధస్థాపితమై సుస్థి రమయ్యె. ఇట్లు జ్ఞానము లిఖిత గ్రంధస్థమైన యనంతరము నిట్టి గ్రంధము లరుదుగ దొఱకుట చేతఁ బ్రభువులు ప్రసిధ్ధ దేవాలయముల యందును దమనగరుల సరస్వతీ నిల యములందును నట్టి గ్రంధములు సంపాదించియుంచి జనులకు జ్ఞాన ధారమును గల్పించుచుండిరి. ఇదియె మన దేశ మునఁ బుస్తక భాండాగారముల కారంభము.

మన దేశమున నార్యస్వతంత్ర ప్రభువులు ప్రభుత్వ ము చేయుఁచుండ భాండాగారములు క్రమక్రమముగా వర్ధిల్లుచుండినవి. తరువాత జైన బౌద్ధులు ప్రబలి తమ మఠ ములయందు మొదట తమతమ గ్రంధములను బిమ్మట నితర గ్రంధముల సైతము సేకరించి గ్రంధభాండాగారము సభివృద్ధి చేయుచుండిరి.

ఆనంతరము భరతఖండమున మహమ్మదీయ ప్రభువులు ప్రవేశింప మన దౌర్భాగ్య కృష్ణ పక్షాంధతమసము దేశమంతయు నావరించె. గ్రంథ భాండాగారము లంగారకున కాహుతులయ్యె. జ్ఞానాభివృద్ధికి హానిగలె.భాషలకు క్షేణ్యము సంభవించె.

అంతే భారతీయ భాగ్యవశమునఁ నాంగ్లేయ ప్రభుత్వమను శుక్లపక్షము బ్రారంభమయ్యే. ఆంగ్లేయ రాజ్యము చల్లదనమున మాత్రము చందురునిబోలి వాని యస్థిరతి వహింపక సూర్యునిపగిది సుస్థిరమై తేజోవంతమై నిఖిలజీవనాధారమై దేశీయ స్వాతంత్ర్యప్రదాయకమై నాట నాటుకొని నానాటఁ జలపడుచు వెలుంగుచుండుగాత.

గ్రంధభాండాగారముల పునరుద్ధానముచేయ సమయము వచ్చినయది. మనదేశము మహమ్మదీయ ప్రభుత్వాంధకారమున మునిఁగి బలవత్సుషిప్తిని బొంది జీవచ్ఛవముపగిది నిర్వ్యాపారతఁ జెందియుండు కాలమున నన్యదేశీయులు విజానమందును నాగరికత యందును మనల జ్ఞానమందాఁటి ముందు మిగిలిపోయిరి. మనము మేల్కొని మనల మిగిలిపోయినవారినిఁ బరువంటుకొనవలసి యున్నది. ఇది ప్రబలప్రయత్న మున గాని సాధ్యము గానేరదు. మన యదృష్ట వశమున ప్రభుత్వమువారు మనకన్ని విధములఁ దోడ్పడనున్నారు. మన ముత్సాహసమన్వితులమై ప్రయత్నింపఁదగును. దేశమున కొలఁది మంది మాత్రము తమ జ్ఞానము సంపాదించుట వలన దేశాభివృద్ధి కలుగఁజాలదు. జనసామాన్యమునకు యధోచిత జ్ఞానము కలుగవలయు. వలయు గ్రంధభాండాగారముల స్థాపించి ముందడుగిడినారము. ఇక వెనుకతీయక పట్టువిడువక మన ప్రయత్నమును గొనసాగించి కృతకృత్యులము గావలయు.

“విఘ్నేర్ముహుర్ముహురపి ప్రతిపాన్యమా నాః
ప్రారబ్ధము తమగుణానపరిత్యజంతి”

ఇట్టి గ్రంథాలయములన్య దేశములందుఁ మిగులఁ బ్రబలి యున్నవి. వీనికిని పూర్వకాలపు గ్రంథాలయములకును గొంత తారతమ్యము కలదు. రాకపోకలకు సులభములు కాని కాలమందెక్కడ నేగ్రంథము దొరకునది గుటయే దుస్తరముగా నుండినది. తెలిసిన యనంతరము నొక్కొక్క గ్రంథమునకై యెంతెంత దూరప్రయాణ ములో చేయవలసియుండె. అచ్చులేనందున బ్రచురము లేక యెన్నియో కష్టముల యనంతరము లభించిన గ్రంధమును మొదలునుండి చివరవఱకుఁ జేతులార వ్రాసికొనినం గాని తనదిగాదు, ఇట్లొక్కొక్క గ్రంధమును సంపాదించుటయం దింతటి కష్టముండ నాకాలమున గ్రంథభాండాగారములఁ జేర్చుటయన్ననెంతటి కష్ట కార్యమొ యోజింపుఁడు, ఇట్టి గ్రంథ భాండాగారము లరుదుగ మూలకొక్కటెక్కడెక్కడనో మాత్రముండుట చిత్రము గాదు.

పండితులీ పుస్తక భాండాగారములకు యాత్రలు సలిపి యేఁడుల కొలఁది యట నిల్చి జ్ఞానము సంపాదించు చుండిరి. అట్టి యాత్రికులకు వలయునన్ని విధములయిన సౌకర్యములును నన్నపానాది సాహాయ్యములును భాండాగారాధిపతు లొడగూర్చుచుండిరి. కాని యెన్ని చేసినను జనసామాన్యమువుకీ గ్రంథ భాండాగారములుప యోగించుచుండినవి కావు. జనసామాన్యమునకు చదువక్కఱ లేదను నాకాలపు దురభిప్రాయము గూడ దీనికి గారణముగా నుండచోపు. అప్పటి యభిప్రాయములెట్లుండినను కాలమిప్పుడు మాఱినది. చదువందఱకు నవశ్యమనుట తేటపడినది.

ఇప్పుడనేక దేశములయందు జనుల కందఱకును జదువను వ్రాయను దెలిసియుండవలసినదని నిర్బంధపఱ చు జట్టములఁజేసి యందు కనుగుణ్యముగ ధర్మపాఠశా లల సైతము నేర్పాటు చేయుచున్నారు. జనసామాన్య మునకుఁ జదువను వ్రాయను దెలియునంతవరకు మాత్ర మీ పాఠశాలయందు నిర్బంధముగ నేర్పవచ్చునే గాని యంతకు పైన నిర్బంధ పఱచుట యిప్పటి కాలస్థితినిబట్టి కతవ్యముగాదు. అంతకుపైన జ్ఞానము సంపాదించుకో ను విషయములో స్వాతంత్య్రమునిచ్చి పైనఁ గోరువారి కవకాశము కల్పించి మాగణము చూపి సాహాయ్యము చే యవలయును. ద్రవ్యాద్యుపపత్తులుగల విద్యార్థుల కుత్త మపాఠశాలల నట్టి యవకాశము కలిగి యున్నది. అట్టి యుపపత్తులులేని బీదసాదలకు జ్ఞానార్జనకు గ్రంథాల యములే శరణ్యములు కావలయు. పాఠశాలలఁ జదువఁ దగినవారలు సైతము సర్వకాలమును బాఠశాలలయందు జదువుచుండుట సాధ్యము గాదు. పాఠశాలలను విడిచి న యనంతరము నూతనముగ నుత్పన్నములగు గ్రంధములఁ బదువవలయుననిన స్వయముగ వానిని సంపాదింపలేని వారికి నీ గ్రంథాలయములే శరణ్యములు.

గ్రంథసాన్నిధ్యము గ్రంధకత ల సాన్నిధ్యము సంతటిది. అట్టి యీసాన్నిధ్య మెంతటి మేలులఁ జేశూ ర్పఁగలదు. చదువని వారలంగూడఁ జదువఁ బురికొల్పగ లదు. నలువుఁటఁ జేరినతోడనే గ్రంథముల గురించిన ప్ర సావము రాకపోవదు. ఆమాటలు వినువారు గ్రంధముల స్వయముగఁజదివి యందలి సారస్యముల గ్రహింప్ నువ్వికు లూఱుచుందురు, తద్గ్రంథములఁ జదువ నిదియె పెద్ద ప్రోత్సాహము కాఁగలదు. కాఁబట్టి యీగ్రంధాలయ ముల నెంత విరివిగ నేర్పాటు చేసి జనుల కెంత సులభసా ధ్యములుగఁ జేసిన దేశమున కంత క్షేమము. నందేమూల నేమి జరుగుచున్నదియు నిముసములోన నె ఱుఁగ గలిగినట్టియు, మా సత్రియమున భూప్రదక్షిణము చేయనగునట్టియు, గడియలోన వేనవేల ప్రతుల ముద్రిం పఁ దగినట్టియు, నీకాలమున గ్రంధముల ప్రతుల సేకరిం చుట కష్టముగాదు. పాశ్చాత్య దేశస్థు లీవిషయమున నె క్కువ ప్రయత్నము చేసి యనేక గ్రంధాలయముల నే ర్పఱచి జనులకు మేలుజేయుచున్నారు. మన హిందూ దేశములో స్వదేశాభిమానమునకుఁ బేరు గాంచిన బరోడా మహారాజుగారు వారి రాష్ట్రమున ననేక పుస్తకభాం డాగారముల స్థాపించి ప్రజల కన్ని విధముల సుఖములు గలిగించుచున్నారు. ఇంతటితోఁ దృప్తినందక వారు కే వల కు గ్రామవాసులకుఁ గూడ : నీలాభము కలుగుటకుగా ను నూకూర దిరుగుచుండుటకునై చరద్గ్రంథ భాండా గారముల సయితము కల్పించి యితరులకు మార్గము చూ పుచున్నారు. మన మాతృభాష నభివృద్ధి జేయ సమకట్టి యున్నారముకదా. ఈ విషయమున మిగుల వనుభవము గలిగియుండు పాశ్చాత్య దేశీయుల గ్రంథభాండాగారము మాతృకలఁగా నిడికొని మన భాండాగారములు స్థిర ములుగాను జనోపయోగకరములు గాను నడుచునట్లు క ట్టుదిట్టములు జేయవలెను.

౧౭౫౩ (1753)వ సంవత్సరమున స్థాపింపఁబడిన బ్రిటిష్ మ్యూజియమను వస్తుప్రదర్శ కళాశాలా సంబంధమగు గ్రంథాలయము లోకములోని యన్నిటికన్న మిక్కిలి ప్రసిద్ధి కాంచినయది. ప్యారిస్ పట్టణమునందలి బిబ్లియోధి కె న్యాష నేల్ యను గ్రంథాలయము గ్రంధసంఖ్యయం దు బ్రిటీష్ మ్యూజియమును మించియుండినను పాఠక సౌ కర్యములగు నేర్పాటులందు బ్రిటిషు గ్రంథాలయమున కు సాటిరాదని చెప్పఁదగి యున్నది. ఈ బ్రిటిష్ గ్రంధా లయమందు ౧౫౫౦౦౦ (155000) ముద్రిత గ్రంధములును ౫౦౦౦౦ (50000) యముద్రిత గ్రంధములు నున్నవి. ఇందొక విశేషము. కేవల మాంగ్లేయ భాషా గ్రంధములేకాక యన్యభాషాగ్రంధము లుకూడఁ బెక్కులుగలవు. ఐరోపాఖండము దేశ భాష లలో నాయా దేశమున గల శ్రేష్ఠ గ్రంధ సముదాయముల నెల్ల నిందుఁ జేర్చియున్నారు.

ఈగ్రంథములన్నిటిని వలయాకృతిఁగల పఠనాల యమునఁ జుట్టును మంచలపై నమర్చియున్నారు. పఠనా లయములోని ౮౦౦౦౦(80000)గ్రంథములలో పాఠకుల యవిచ్ఛి న్నో పయోగమునకై క్రిందియంతస్తున 90000 గ్రంథము లున్నవి. గ్రంథముల వాడునతఁడు చదువరులకు సహా యము చేయుచుండును. ఈగ్రంథాలయమునఁ జదువు టకు గ్రంథాలయాధిపతి యనుమతి యుండవలయు. ఈయనుమతి ౨౧(21)సంవత్సరమునకుఁ బైపడినవారికి మాత్ర మొసగబడును. వారికిని మఱియొకగృహస్థుని ప్రార్ధన మీఁదనె యొఁసగఁ బడును. చదువఁగోరువారు ముఖ్య గ్రంధాలయాధిపతి య నుమతిలేఖను గవాటమునొద్దఁ గనఁబఱచిననే యంతః బ్రవేశము గలుగఁ కలదు.

౧౮౮౦ (1880) సంవత్సరమున ౧౩౩౮౪౨ (133843)రు చదువరు లీ గ్రంధముల నుపయోగించిరట. సామాన్య గ్రంధాల యములును బ్రత్యేక శాస్త్రగ్రంధాలయములును ననేక ప్రదేశముల ననేకము లున్నవిగాని యిదియే బ్రిటిషు రా ష్ట్రములలో ముఖ్యగ్రంధాలయము.

చందాలవలన నేర్పాటుచేయఁబడిన గ్రంధాలయ ములలో లండ౯ లైబ్రరియను గ్రంథాలయము ముఖ్య మైనది. ఆక్స్ఫర్డ్ పట్టణమునందలి బోర్డిలియ౯ గ్రం థాలయమున నచ్చటి విశ్వవిద్యాలయ విద్యాబ్రహ్మచా రులకును, పలుకుతోడుఁగల వారికిని, ౧౮ సంవత్సరముల వయస్సుకు మిగిలిన యితరులకును మాత్రము ప్రవేశము కలదు. గ్రంధాలయ పాలకుల ప్రత్యేకానుమతిలేనిదె గ్రంథముల గ్రంథాలయము బైటకుఁ బంపుటలేదు.

బర్మనీదేశపు గ్రంథాలయములలో జదువరుల వి వయమైన చట్టము లంతకన్న కొంత ధారాళముగ ను న్నవి. ప్రాయికముగ యౌవనులకందఱకును బఠనాలయ మునఁ బ్రవేశము కలదు. గొప్పయుద్యోగస్థులకందఱకు ను, దటస్థుల ప్రార్ధనమీద నితరులకును గ్రంథములు చ దువ నవకాశము గలదు. పత్రికాశాఖకు మాత్రము ప్రవే శము గొంత కష్టతరము.

ఇటలీదేశమున గ్రంథాలయములు తఱుచుగ ప్రభుత్వ సంబంధము గలవియై వారి విధులచేఁ బాలింపబడు చుండును. అమెరికా దేశమున గ్రంథాలయములు మిక్కి లి యాధునికములు. ఈదేశమున గ్రంథాలయములు మి క్కిలి ప్రబలియున్నవి. కట్టుదిట్టములును జక్కఁగఁచేసి యున్నారు కాఁబట్టి నూతన సృష్టి చేయవలసియుండు మ నకు మనయాంధ్రదేశ గ్రంధాలయ నిర్మాణమనందు వీరి గ్రంధాలయములాదర్శములుగ నుపయోగింపఁ దగియు న్నవి. అయిన నీవిషయమున నిర్నయముగ నిబంధనలఁ జే యుట యనపేక్షణీయము. ఆయాసందర్భముల ననుస రించి సమయోచితముగ నేర్పాటులఁ జేసికొనుచుండవల యును, ఆయిన స్థూలముగఁ గొంత మట్టు కాలోచింపవ చ్చును.

గ్రంధాలయముయొక్క గృహనిర్మాణమువిషయ ములో గ్రంధాలయోపయోగమును జక్కఁగ నెఱిఁగిన యనుభవశాలి యభిప్రాయము ననుసరించి గృహభాగము ల నిర్మింపవలయు. పఠనాగారములు గ్రంథాగారములు కర్మాగారములు కార్యస్థానములు మొదలగునవన్ని యు నొక్కటొకటికిఁ గలసంబంధము ననుసరించి చక్కఁగ్ర సమర్పఁబడవలయు, గ్రంధాలయ మవిచ్ఛిన్నముగ వభి వృద్ధియగుచుండునది కనుక నట్టి యభివృద్ధి కభ్యంతరము లేకుఁడ గృహవిన్యాసము నేర్పాటు చేయవలయు, చె మ్మలేనిచోటున నగ్నిభయమున కెడమియ్యని పరికరము గృహనిర్మాణము చేయునదియుక్తము.

అలంకారముకంటె గ్రంధక్షేమమును సౌకర్యము ను ముఖ్యముగ గమనింపఁదగును. అయినను ప్రసిద్ధ గ్రం ధకర్తల చిత్తరవులచే రమ్యముగ నలంకరింపఁబడి జనా కర్షకముగా నుండుట యవశ్యకము. పఠనాగారములు వైశాల్యముగలిగి వలయు నంతవాయు సంచారముగలవి గాను, నైఘంటిక గ్రంధ భరితములుగాను నుండవలయు. పఠనాగారములలో స్త్రీ పురుషులకుఁ బ్రత్యేకమవకాశ ముండుట యుక్తము, ప్రథాన గ్రంధనిలయము పాఠకుల కుఁ బ్రవేశముండునది కాదు కావున నందు గ్రంథముల నిమిడిక నుంచవచ్చును. పొడవగు నిచ్చెనల నుప యోగింప నక్కఱలేకుండునట్లు మిక్కిలి యున్నతము గాని మంచెలను గోడలంటకుండ వెంబడిగా నుంచవచ్చు ను. నడుమ గజముచోటిచ్చి ద్విముఖములగు మంచెల నుంచవచ్చు. ఈ విధమున నెక్కువస్థలము నాక్రమింపక స్వల్పస్థలమునసే యనేక గ్రంధముల నిమిడింపవచ్చు. గ్రంథాలయము వలయాకృతిగ నుండుటలో స్థలము సిరాఁగలదు. మనుష్యులకువ లెనె పుస్తకములకును గాలి వెలుతురు నవశ్యకము గనుక దీనిని గమనింపఁదగును. గ్రంథములనుఁ జెదలంటకుండ దుమ్ముచేఁ జెడకుండను భద్రపఱచవలెను. గ్రంథాలయములకు ముఖ్యాంగము గ్రంధముల పట్టిక, పట్టికను మిక్కిలి నేర్పుతో నేర్పా టు చేయవలయు. పట్టికను జక్కఁగా నేర్పాటు చేయ నంతట గ్రంథాలయమునకు న్యూనత కలిగి దాని ముఖ్యోద్దేశమునకు భంగము కలుగవచ్చును. చదువరు లకు వలయు గ్రంథము లున్నదియు లేనిదియు సు లభముగాఁ దెలియునట్లు పట్టికల నేర్పఱచ వలయు పాఠకుఁడే దేని విషయమును జదువఁగోరి యావి షయముననే యేగ్రంధకత రచియించిన యేయేగ్రంథ ములున్నవో తెలిసికొనఁ గోరవచ్చును. అది సులభముగ దెలియునట్లు పట్టికను గావింపవలయు. ప్రాయిక ముగ నొక్కొక్కగ్రంధాలయమునందును బహువిధపట్టిక లుం డవలయును, గ్రంధనామములఁబట్టియొక పట్టికను, గ్రంధవి షయమునుబట్టి వేఱకటిని నేర్పఱచునది యవశ్యము, గ్రంథాలయము వృద్ధిపొందుచుండుకొలఁది పట్టిక యు మాఱుచుండవలయును. పట్టిక నేర్పఱచుటలో గ్రంథా లయాధిపతి తోడ్పాటు ముఖ్యముగా నుండవలయును. గ్రంథాలయమునందుగల గ్రంథములను గ్రంధాలయాధిప తి యెఱిఁగియుండవలయును. పట్టికలు పలుమాఱు మా ఱుచుండుటనుబట్టి వాని నచ్చువేయించుట వ్రయకరమై నను వ్రయమునకుఁ బ్రాల్మాలక పాఠక సౌకర్యమునకై యచ్చొత్తించుట కార్యము. చదువరుల కుపయోగించు నీపట్టికలు గాక గ్రంథాలయ పాఠకుల యెఱుకకై మఱి రెండువిధములగు పట్టికలుండవలెను. ఒకటి గ్రంథసం పాదన పట్టిక. ఇందు గ్రంధాలయమునకు వచ్చు పూర్ణ గ్రంథములను గాని గ్రంధభాగములనుగాని మాసాది పత్రిక లనుగాని యప్పటప్పటికి జేర్చుచుండవలయు. ఎట్లు ల భించినది యెవరివలననో సంగబడినదియేనాఁడు చేరినది మొ దలగు నన్ని యంశములు నిందుండవలెను. రెండవది మం చలపట్టిక. ఏయేమంచయం దేయేగ్రంధములున్నదియు నిందుండవలెను.

గ్రంధాలయ పాలన.

పైనఁజెప్పిన రెండుపట్టికలనుబట్టి గ్రంధాలయపా లకు, డప్పుడప్పుడు గ్రంధముల నుండఁజూచుచుండవల యును. క్రొత్త గావచ్చిన గ్రంధములను గొంతకాలమువ రకును బ్రత్యేకముగా నుంచియుండి తరువాత వాని ని ర్హితసలములఁ జేర్చుచుండవలయు. గ్రంధాలయమునందు జదువరులకుఁ దోఁచు గుణాగుణములు సూచించి వారికిఁ దోఁచిన సంస్కారమార్గములను బోధించుటకుఁగా నొక పుస్తకము నుంచఁదగు. పత్రములఁగత్రించు నుద్యోగము చదువరులకు విడువక గ్రంధము రాగానే గ్రంథాలయో ద్యోగస్థులే యాపనిఁ దీర్చుచు గ్రంధములందు దుమ్ము నిలువనీయక నేర్పుతో గ్రంధములు నలుగకుండఁ దట్టివే యుచుండవలెను.

చదువఁగోరువారికి వలయు గ్రంధములఁ జదువ నవ కాశమిచ్చుటయే గాక యుక్తమగు విషయములను జదు వునట్లు జదువరులఁబ్రోత్సాహపఱచుటయు గ్రంథాలయ ప్రయత్నముగా నుండవలయు. ఈవిషయమై గ్రంధాల యములలో నప్పుడప్పుడు నుపన్యాసములఁ బండితులచే నిప్పించుచుఁ జరద్భింబ ప్రదర్శనములచే విషయముల జను లకు బోధపఱచుచుఁ జదువనివారికి సైతము చదువవలయు నను నభిలాష కలిగించుచుఁ జదువువారి కెట్టివిషయముల నేతీరునఁ జదువవలసినదియుఁ దెలుపుచు గ్రంధాలయ ముల యుద్యమము సఫలముఁ జేయవలయును. గ్రంధాల యపాలకుని సామర్థ్యమునఁ జాలవఱకు నీ కార్యము నెఱ వేఱఁగలదు. గ్రంథాలయపాలకుఁడు పండితుఁడు గాను గ్రంధములయందును దత్పఠనమునందును మిగుల నాసక్తి గలవాఁడుగాను, శాంతుఁడుగాను, గంభీరుఁడుగాను, సమయస్ఫూర్తి కలవాఁడుగా నుండవలయు, పాలకుని సహాయోద్యోగస్థులుగూడఁ జదివినవారుగాను ననుభవ శాలురుగాను నుండవలయును. ఐన మన దేశమున గ్రం ధాలయముల నేర్పఱచుట కిదియే యారంభముగాన మన కట్టి యనుభవముగల యుద్యోగస్థులు దొఱకుట దుస్సా ధ్యము. మొదట నేర్పడు గ్రంధాలయమున నట్టి యు ద్యోగస్థులకుఁ బనులఁ గఱపి కాలక్రమమున నేర్పడు గ్రంధాలయములకుఁ బంపుచుండవలయును. అట్టి యు ద్యోగములు నేర్చుకొనుటకుఁ గొందఱఁ బ్రోత్సహించి సహాయము చేసి వారల కుద్యోగముల నొసంగుచుండిన గొలఁదికాలములో నే వలయు నుద్యోగస్థులు దొఱకఁగల రని తలఁచెద.

గ్రంధముల నేర్పఱచుట.

కేంద్ర గ్రంథాలయమునందు భాషలోనున్న గ్రం ధములన్నియు నుండవలయుఁ గాని తక్కినశాఖా గ్రంధా లయములు నది సాధ్యముకాదు. మఱి యంతగాఁ గోఱఁ దగినదియును గాదు. కాఁబట్టి యట్టి గ్రంధాలయమున నే యేగ్రంధముల నుంపవలయుననులు చక్కఁగా నాలోచిం పఁదగిన విషయము. దుర్ణీతులఁ గఱపునట్టి గ్రంధముల గ్రంథాలయముఁ జేరనీయకుండుట క్షేమము. గ్రంథాల యము యొక్క స్థితిగతులను నుపపత్తిని అనుసరించి దొ ఱకఁగల గ్రంథములలోనుండి యుచితములగు గ్రంధము ల నేర్పఱచుకొనవలెను. కేంద్ర గ్రంథాలయమున మాత్ర ము భాషలోనియన్ని గ్రంథములుండుట యుక్తమని చె ప్పియుంటినిగదా? ముద్రిత గ్రంథములు ద్రవ్యసాధ్యములు. అముద్రిత గ్రంధములు కేవల ద్రవ్యైక సాధ్యములుగావు. ఇ దివరకట్టి గ్రంధములుఁజేర్చియుండు విద్యారసికులు మహా నుభావులందఱును దోడ్పడిన గాని సాధ్యముకాదు. ఇంక ముద్రించు గ్రంధముల విషయములోఁ బ్రభుత్వమువారు ను భాషాభిమానులకు ముద్రించువారును గ్రంధకర్తలును దాముముద్రించు ప్రతిగ్రంథము యొక్క ప్రతిని మన కేం ద్రగ్రంథాలయమునకుఁ బం పెద లేని వారు మిక్కిలి సహా యము చేసినవారగుదురు.

పత్రిక.

గ్రంథాలయమున కను బంధముగ గ్రంథాలయ వి వయమును గ్రంధవిమర్శనములను బ్రచురించు మాసపత్రి కయో వారపత్రికయో యొకటియున్న యుక్తముగానుం డును. కాలక్రమమున నట్టివిమర్శనయందు తేలినగ్రంధ ములు మాత్రమె పఠనీయ గ్రంథములు గాఁ గావచ్చును. ఆంధ్రరాష్ట్రమునఁ బ్రత్యేక విశ్వవిద్యాలయమునకై మ నము జేయు ప్రయత్నము సఫలమగు నేని కేంద్ర గ్రంథాల య మావిశ్వవిద్యాలయమున కనుబంధముగ నుండఁదగు.

మహాజనులార! గ్రంథాలయ ప్రయత్నము ద్రవ్యై కసాధ్యమనునది తమకు సమర్పక మె. ఆంధ్రులలో ప్రభు వులు ధనికుల నేకులుగలరు. శ్రీమాననీయ పీఠికాపురప్రభు ప్రభృత లయాచితముగఁ దమ సానుభూతిని నుదార దాతృత్వమును గనబఱచియితరులకు మార్గదర్శకులై యున్నారు. అధైర్యపడి నక్కఱలేదు. సర్వేశ్వరుఁడు గ్రంథాలయ ప్రయత్నమును సఫలము జేయుఁగాత,