గోలకొండ పత్రిక సంపాదకీయాలు/విజ్ఞాపన
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి
విజ్ఞాపన
సురవరం ప్రతాపరెడ్డి నామ సంస్మరణ మాత్రాన ఆనాటి తెలంగాణాలోని సాంఘిక చైతన్యం గుర్తుకు వస్తుంది. గోలకొండ వ్రాతం ఫిరంగి మ్రోతలతో తెలుగు గుండెలలో వీరావేశం నింపిన ధీరుడాయన. పత్రికా సంపాదకుడుగా పరిశోధక పండితుడుగా, అనేక సంస్థల ప్రోత్సాహకుడుగా, ఉత్తమాభిరుచిగల రచయితగా, విశాలాంధ్రోద్యమ ప్రేరకుడుగా సురవరం వారి కృషి సంస్తవనీయం. విశిష్టమైన శైలి, నిర్దిష్టమైన భావం, ఆర్జవావేశం, విషయవైభవం వారి రచనలోని సహజగుణాలు.
ప్రతాపరెడ్డిగారి ముద్రితాముద్రిత రచనలు సేకరించి వాటి ముద్రణ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏర్పాటైన సంస్థ “సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి". ఈ సంస్థలోని సభ్యులు :
అధ్యక్షుడు :
జస్టిస్ కొండా మాధవరెడ్డి
ఉపాధ్యక్షుడు :
శ్రీ దేవులపల్లి రామానుజరావు
సభ్యులు :
డా॥ సి. నారాయణ రెడ్డి
డా॥ బి. రామరాజు
డా॥ ముకురాల రామారెడ్డి
యస్.ఎన్. రెడ్డి
డా॥ ఎల్లూరి శివారెడ్డి
కార్యదర్శి :
శ్రీ మామిడి రామిరెడ్డి
కోశాధికారి :
శ్రీ గోలి ఈశ్వరయ్య
సురవరం వారి సంపూర్ణ గ్రంథావళి ప్రచురితమైతే పఠితృలోకానికి, పరిశోధక విద్వాంసులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సంస్థ భావిస్తున్నది. ఈ ఆశయంతో మొదట "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" ముద్రించటం జరిగింది. గ్రంథ ముద్రణ కార్యభారాన్ని వహించటానికి ఈ సంస్థ ప్రత్యేకంగా “సంపాదక మండలి"ని ఏర్పాటు చేసింది. ఇందులోని సభ్యులు :
అధ్యక్షుడు :
డా॥ సి. నారాయణ రెడ్డి
సభ్యులు :
శ్రీ దేవులపల్లి రామానుజరావు
డా॥ బి. రామరాజు
డా॥ ముకురాల రామారెడ్డి
శ్రీ గడియారం రామకృష్ణశర్మ
శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి
డా॥ సురవరం పుష్పలత
డా॥ ఇందుర్తి ప్రభాకరరావు
కార్యదర్శి :
డా॥ ఎల్లూరి శివారెడ్డి
కోశాధికారి :
శ్రీ యస్. యన్. రెడ్డి
సంపాదకమండలి ప్రతాపరెడ్డిగారి గ్రంథ ప్రచురణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంతవరకు ఎనిమిది గ్రంథాలను ప్రచురించింది. ప్రస్తుతం ప్రతాపరెడ్డిగారి గోలకొండ పత్రిక సంపాదకీయాలను రెండు సంపుటాలుగా ప్రచురిస్తున్నది. సురవరం వారి ముఖ్య రచనలన్నీ అనతికాలంలో ముద్రించాలన్నది సంపాదకమండలి నిర్ణయం. ఈ నిర్ణయానికి సహృదయులు, వదాన్యుల సహకారం తోడయితే మా ఆశయం అచిరకాలంలోనే నెరవేరుతుంది.
ప్రతాపరెడ్డిగారి రచనలు ముద్రించటంలో ఎంతో ఔదార్యం చూపి ఆర్థిక సహాయం చేసిన శ్రీ చల్లా రామభూపాల్ రెడ్డిగారికి, శ్రీ యస్. గోపాల్‌రెడ్డిగారికి, శ్రీ డా॥ టి. నందగోపాల్‌గారికి, శ్రీ మద్దూరు సుబ్బారెడ్డిగారికి, హుసేన్ అబ్బాస్ అండ్ కంపెనీవారికి శ్రీ చెరుకూరు రామరాజుగారికి, శ్రీమతి ఇ. సరస్వతమ్మగారికి చల్లా వెంకటేశ్వరమ్మగారికి, హెచ్. లక్ష్మీదేవమ్మగారికి, బిశ్వేశ్వర్‌లాల్ అగర్‌వాల్‌గారికి, శ్రీ వెంకట రామప్పగారికి - సాహిత్య వైజయంతి కృతజ్ఞత తెలుపుకుంటున్నది.
హైదారాబాద్
డా॥ సి. నారాయణరెడ్డి
1-6-1989.
అధ్యక్షుడు
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి
(సంపాదక మండలి)