Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/రామకృష్ణుని సందేశము

వికీసోర్స్ నుండి


రామకృష్ణుని సందేశములలో ఇంకొకటి ధైర్య గుణము భగవద్గీతలో ప్రారంభములోనే ఈ గుణము కృష్ణ భగవానునిచే అర్జునునికి బోధించబడినది ధైర్యమనగా నిర్మలమయిన మనస్సు కలుషమగుటకు ఎంతటి కారణములున్నను సరే, ఆ మనస్సును కలకబారనీయకుండ శాంతముగా కర్తవ్యము నెరవేర్చుట పిరికితనము, ఆత్మవిశ్వాసము లేకుండుట, దిగులు, విచారము అనిన శ్రీరామకృష్ణునికి ఎంతమాత్రము ఇష్టపడునవి కావు ఈ అనిష్ట గుణములన్నియు తమోలక్షణములు కనుకనే రామకష్ణుడు తమ శిష్యులందు అగ్రగణ్యుడగు వివేకానందుని ద్వారా భారతదేశమును సత్వ గుణమునకు తెచ్చుటకు ముందు రజోగుణములో అభ్యాసము చేయించవలెనని సందేశించిరి దేశములో బూటకపు సన్యాసులు ప్రబలి పనిలేక స్తబ్ధులై పిరికి హృదయములతో కూర్చుండుటజూచి, వివేకానందుడు సన్యాసమనునది అన్ని సుఖములను కల్గిన వానికేగాని దరిద్రులై అధీర లక్షణములలో తనుకులాడుచున్న వారలకు కాదు అని తప్పు త్రోవను బట్టిన వేదాంతమును సరియగు త్రోవకు దెచ్చెను వివేకానందుడు సూటిగా గుర్తించినదే నేడు భారత జాతి అవస్థలో గొప్ప దోషమును మాటను నేడు యెవరయినను కాదనగలరా?