Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/మా తొమ్మిదవ సంవత్సరము

వికీసోర్స్ నుండి


మా తొమ్మిదవ సంవత్సరము

7 - 5 - 1934

మా పత్రిక నేటితో ఏనిమిది సంవత్సరములను పూర్తిచేసి తొమ్మిదవ సంవత్సరమునకు ప్రవేశించినది ఎప్పటివలెనే దాటింపవలసిన రాజకీయార్థి కాదులైన గండములు దాటింపబడినవి

గత సంవత్సరము మేము వీలైనంతవరకు, చేతనైనంతవరకు, పత్రికను ఎక్కువగా ప్రజలకుపయోగపడునట్లుగా నడిపితిమని తలచుచున్నాము ఈ సంవత్సరము అనేకములగు మార్పులు చేయబడుచున్నవి. పత్రిక యొక్క సంవత్సరపు చందా 7 రూపాయీలు బదులు 6 రూపాయీలే చేయబడినది. అర్ధ సంవత్సరము చందా రూ 3.12.0 లకు మారుగా 3 రూపాయీలే చేయబడినది విడి పత్రిక ఖరీదు 0-1-4 లకు మారుగా 1 అణాచేయబడినది చందా తగ్గించినను పత్రిక యొక్క పుటలు తగ్గింపుటకు మారుగా 12 పుటల నుండి 16 పుటల వరకు హెచ్చింపబడినవి. మా చందా దారులు కాని యాంధ్రులును ఈ విషయములను గమనింప బ్రార్ధితులు.

స్థానికములగు నితర పత్రికలకన్న నీ పత్రిక యెందునను తీసిపోదని మా దృఢ విశ్వాసము. చందా అన్ని పత్రికల కన్న చౌక. విషయ బాహుళ్యము అన్ని స్థానిక పత్రికలలోకన్న హెచ్చు (స్థానిక ఉర్దు దిన పత్రికలలో కన్న హెచ్చె అని గట్టిగా చెప్పచున్నాము) అట్లుండియు మన యాంధ్ర సోదరులకు తమ మాతృభాషా పత్రికపై తమకై కష్టించునట్టి పత్రికపై అభిమానము తక్కువగా నుండుటకు కారణము దురూహ్యము