గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆయుర్వేదము - మనము
ఆయుర్వేదము - మనము
2 - 5 - 1935
మనము అనగా నిజాం రాష్ట్ర వాసులము ఆయుర్వేదమన నేమో యెరుగము. అనేకులు యూనాని పేరు విన్నారు కాని ఆయుర్వేదము పేరు కూడా వినినవారుకారు. కాని వైద్యము మాత్రము పల్లెలలో విశేషభాగము ఆయుర్వేద వైద్యమె. ఈ పల్లెలలోని వైద్యుల మూలమున మన ఆయుర్వేదము కొంతవరకపకీర్తి పొందియున్నది. కారణ మేమన మంచి వైద్యులు పల్లెలలో లేరు. ఏ బసవరాజీయమో, ఏ వస్తుగుణ దీపికనో, యే చికిత్సాసారమునో, ఏ అనుభవ వైద్యమునో నాలుగు పుస్తకములు చదివి, నాలుగు గోలీలు వద్ద నుంచుకొని వైద్యముచేయువారు చాలామంది గలరు ఇందుచేత తెలియనివారు ఆయుర్వేద వైద్యము మంచిది కాదనుచుందురు
వైద్యుల లోపము వైద్యలోపము కానేరదు మన రాష్ట్రములో యూనాని వైద్యులుగూడ చాలామందిగలరు వారును తిబ్బె అక్బరి, ఇలాజుల్గుర్భాలవంటి యొండు రెండు గ్రంధములు చూచికొని వృత్తిని సాగించుచున్నారు అట్టి హకీములను జూచి యూనాని వైద్యము చెడ్డదనవచ్చునా ?
అస్సలు విషయము ఆలోచించి చూచిన ఆయుర్వేదమునకును, యూనానీకిని, అవినాభావ సంబంధము కలదు ఆయుర్వేదము ముద్దు బిడ్డయే యూనాని అనచెల్లును ప్రాచీనములో అరబ్బులు ఫార్సీలు, తుర్కీలు హిందూవులవద్ద వైద్యమును నేర్చినట్లు నిదర్శనములు చాల కలవు కితాబుల్ ఫెమిరిస్తు గ్రంధకర్త హాజిఖలీఫా (క్రీ శ 10 వ శతాబ్దమువారు) వ్రాసినదేమనగా - ఖలీఫా హరూన్, ఖలీఫా మస్‌న్సూర్‌గార్ల ఆజ్ఞచే అనేక హిందూ వైద్య గ్రంధములు (Materia medica therapeutics) అరబీ భాషలోనికి తర్జుమా చేయబడెను. మంఖుడు అను బ్రాహ్మణునిచే సుశ్రుతము అరబ్బీలోనికి తర్జుమా చేయబడెను హరూనుబ్రషీదు ఖలీఫా కొక పర్యాయము చాలయపాయకరమగు జాడ్యము సంభవింపగా ఈ మంఖుడే ఎవరి చేతను కానట్టి యీ రోగ చికిత్సను చేసి అతనికి బాగుచేసెను ఆపై ఈ మంఖుని మీద ఖలీఫాకు అత్యంతాభిమానము కలిగెను. వెంటనే మంఖుడు దవాఖాన సర్కారే అలీ పైన డైరక్టరుగా నేర్పాటు చేయబడెను. హిందూ నక్షత్ర శాస్త్రము, అల్జీబ్రా, వైద్యము చాలా శ్రద్ధతో అరబ్బులు ఈ ఖలీఫా కాలములో నేర్చుకొనిరి మరియు అనేక హిందూ పండితులను ప్రార్ధించి వారిని తమ దేశములో నిలిపికొని ఖలీఫాలు తమ బోధకులనుగా ఏర్పాటు చేసుకొనిరి ముసాల్మాను విద్యార్థులును హిందూ స్ధానములోని వైద్యాలయములలో హిందూవులవద్ద చాలా శ్రద్ధతో భక్తితో వైద్యశాస్త్రమునభ్యసించుటకు పుట్టలు పుట్టలుగా నేటేట వచ్చుచుండిరని సర్- ప్రపుల్ల చంద్రరాయ్ గారు తమ గ్రంధములో వ్రాసినారు ఈనాడు మన తెలివి తక్కువ తనముచే యూరోపులో నాలుగేండ్లుండి నాలుగు ముక్కలు చదువుకొని వచ్చిన విద్య పరిక్షుణ్ణమైనదని మనమనుకొన్నట్లుగాక ఆనాడు అరబీ ఫారశీక దేశములందలి ముసాల్మానులు చాల భ క్తితో శ్రద్ధతో ఆతురతతో హిందువుల వద్దకు వచ్చి నేర్చికొని పోవుచుండిరి
సులేమాన్ అను యాత్రికుడు విజయనగర సామ్రూజ్యమును జూచి విజయనగర పట్టణ రాజములో అనేకులగు అరబ్బులు వైద్యాలయములో పని నేర్చుటనుచూచి వర్ణించియుండెను ఇట్లు ఆయుర్వేదమునకును యూనానికిని చాల సన్నిహిత సంబంధముండెడిది కాని కొందరు దుష్టరాజుల మూలమున క్రమేణ ఈ సంబంధము దూరమయ్యెను అన్యోన్య ప్రేమలు మాసిపోయెను. హిందూముసాల్మానులలో ద్వేషములు ప్రబలెను సుమారు 300 సంవత్సరముల నుండి ఈ రెండును వేరువేరు మార్గముల బడెను
ఆయుర్వేద వైద్యము చాల చౌకయైనట్టిది పాశ్చాత్య వైద్యము మనకు తగనిది. అది మనకు సరిపడనిది చలి దేశముల వారికి పనికివచ్చినది ఉష్ణ దేశముల వారికంతగా పనికిరాదు. పై విదేశముల నుండి దిగుమతి అయిన మందులు చాలఖరీదు అవే మనదేశములో సిద్ధమైన చౌకగా నుండును. అయినను ఫలితము తక్కువ పాశ్చాత్య వైద్యులు బాగుచేయని జాడ్యములు ఆయుర్వేద వైద్యులు బాగుచేసినట్లు ఏ నగరములో విచారించినను గొప్ప గొప్ప డాక్టర్లే ఒప్పుకొనగలరు జర్మను డాక్టరు ఆయుర్వేదమును చూచి ఆశ్చర్యపడినాడు ఏమి ఇంతవొక, ఇంత గుణము ఇంత శ్రేష్టత దీనికెట్లబ్బెనని .................... అభిప్రాయపడినారు
అట్టి వైద్యమునకు, వైద్యశాలలు లేవు, వైద్యాలయములు లేవు ఉన్నవానికి ప్రభుత్వాదరణముసున్న. మన రాష్ట్రములో యూనానికి గత సవత్సరము 20 లక్షలు ప్రభుత్వము వారిచ్చినారని బొంబాయి ముసాల్మాను లభినందించి సభలో తీర్మానములు చేసిన వార్త ప్రకటించి యుంటిమి. కాని ఆయుర్వేద వైద్యమట్టి నోమునోచుకొనలేదు. అనేక తాలూకాలలో యునాని వైద్యాలయములు కలపు హకీములకు మంచిసాయము కలదు నగరములో యూనాని వైద్యశాల కలదు కాని అనేక సంవత్సరముల నుండి ఆయుర్వేద వైద్యమునకు కనిష్ఠ మొక్క కళాశాల అయిన యుండరాదాయని ప్రజలు ప్రార్ధించుచున్నారు. కాని యింతవరకు రూపము దాల్చలేదు. ఆ ఆయుర్వేదమును ఉర్దులో సంగ్రహించి వ్రాయించి యునానీ వైద్యాలయములోనే ఒక పాఠముగా నేర్పాటు చేయనెంచుచున్నారని ఒక వార్త వినియుంటిమి. అదే నిజమైన అట్లు చేయుటకన్న ఊరకుండుట మేలు, చరక శుశ్రుతములను ధన్వంతరినివాగ్భటాది ప్రచండ గ్రంధములను సుమారు ఒక వేయివరకు వైద్య గ్రంధరాజములు సంస్కృతములో తెలుగులో నుండగా వాటిసారము ఉర్దూలో వ్రాయుట బ్రహ్మదేవుని తరమా! అతని పుట్టించిన వాని తరమా! ఆయుర్వేద గ్రంధములను సంస్కృతములో దేశ భాషల ద్వారానే నేర్పవలసి యుండును
ఇప్పుడు చెప్పబోవున దేమన సుల్తాను బజారులో శ్రీ యువరాజు గారి సిద్ధహస్తముచే ప్రారంభింపబడి నెలకు సుమారు 4000 మందికి విశేషముగా నుచితముగా మందిచ్చి జాతిమత వివక్షత లేక సేవ జేయుచుండిన వైద్యమండలివారిని ఎంత ప్రశంసించినను అతిశయోక్తి కానేరదు. వారు చేయుచున్న కృషి ప్రభుత్వ దృష్టి నాకర్షింపవలసి యున్నది యూనాని కన్న ఆయుర్వేదములకే
GPS_13 (1) గ్రామములం దంతటను విశ్వాసము హెచ్చు ఈ వైద్యమునకు యూనానికిచ్చినట్టి సహాయమైన ఇచ్చుట చాలా అవసరము. బ్రిటీషిండియాలో సహిత మిప్పుడీ వైద్యమునకు చాల ఆదరణము కలుగుచున్నది. అనేక మునిసిపాలిటీలు చాల సాయపడుచున్నవి.
మన రాష్ట్రములో ముఖ్యముగా విద్యాధికులైన వారు ఈ సుల్తాను బజారు వైద్యాలయమును చూచి తీరవలెను. అచటి వైద్యులకు మంచి ప్రోత్సాహమీయవలెను వారి చేతనే అవసరమైన తావులందు చికిత్సలు చేయించవలెను ప్రభుత్వ సహాయమిప్పించుటకును గట్టి ప్రయత్నము చేయవలెను.