గోమాత

వికీసోర్స్ నుండి
            గోమాత    

నమోగోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయీభ్య ఏవచ
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః ||

గావోమమాగ్రతః సంతుగావోమే సంతుపృష్టతః
గావోమే హృదయే నిత్యంగవాం మధ్యే వసామ్యహం||
 
సర్వదేవమయేదేవి సర్వ దేవైరలంకృతే
మాతర్నమాభిలషితం సఫలంకురువందిని||

గోమహాత్మ్యము[మార్చు]

1.గోవు పాదము పితృదేవతలు,2.పిక్కలు పిడుగంటలు,3అడుగులు ఆకాశగంగలు,4ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు,5కర్రి కర్రేనుగ,6.పొదుగు పుండరీకాక్ష,7.సన్ను కట్టు సప్తసాగరాలు,8.గోవుమయం శ్రీలక్షీ 9.పాలు పంచామృతాలు,10.తోక తొంభై కోటి ఋషులు,11.బొడ్డు పొన్నపువ్వు,12.కడుపు కైలాసమ్,13కొమ్ములు కోటిగుల్లు,14మొగముదెష్ట,15వెన్నుయమధర్మరాజు,16ముక్కుసిరి,17కళ్ళుకలువరేకులు,18.చెవులు శంఖనాదం,19.నాలుక నారాయణ స్వరూపం,20.దంతములు దేవతలు,21.పళ్ళు పరమేశ్వరి,22నోరు లోకనిధి.

1.దేవేంద్రుని భార్య శచీదేవి.2.బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి.3.శ్రీమన్నారాయణుని భార్య లక్షీదేవి.4.శ్రీరాములవారి భార్య సీతాదేవి.5.గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణిదేవి.6.ఈశ్వరుని భార్య పార్వతీదేవి.7.వశిష్టుల వారి భార్య అరుంధతీదేవి

వీరంతా గూడి ప్రాతఃకాలమున లేచి ఆడవారు చేసిన పాపముల ఎలాగును పోవును కృష్నా?అని అడిగినారు.ప్రొద్దుటే లేచి గోవు మహాత్మ్యము పటించుకుంటే సకల పాపములు పోవును.అంటు కలిపిన పాపము,ముట్టు కలిపిన పాపము,బంగారము దొంగిలించిన పాపము,ఎరిగీ ఎరగక చేసిన పాపము అంతా కూడా పరిహారము.

మధ్యాహ్నకాలమందు పటిస్తే ఏమిటి కృష్నా!అంటే సహస్ర గుళ్ళలో దీపారాధన చేసినట్లు,జన్మాంతరం అయిదోతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చేసినట్లు.

అర్దరాత్రివేళ పటిస్తే ఏమిటి కృష్ణా! అంటే యమభాధలు పడబోరు,యమకింకరులు చూడబోరు.గోవు మాహాత్మ్యం పటించిన పణతి వస్తుంది.ఏలాగున వస్తుంది? ఏ తీరునవస్తుంది.కనకాంబరాలతో కదులుతో తులాభారాలతో తులతూగుతూ తన భర్తను తలచుకొని తన పుత్రపుత్రికా పౌత్రులను తలుచుకొని,మిత్ర బంధువులు ననుకొని,లక్షీ మహాలక్షీ ఎదురుగుండా వచ్చినది.

ఆవిడను క్రిందకు దింపేసి పసుపు,పారాణి,అక్షింతలు,గంధములు యిచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి,ఇనుపముక్క కాకులను వెనక్కు త్రోసేసి,మండే మండే పెనాలను క్రిందకు దింపేసి-ఆవిడ కాశి,గయ.ప్రయోగ అన్నిచూసుకొని,వైకుంటమునకు వెళ్ళినిది.విన్న వారికి విష్ణులోకము,చెప్పినవారికి పుణ్యలోకము.


మూలాలు[మార్చు]

  • గొల్లపూడి వీరాస్వామి సన్,కోటగుమ్మం -రాజమండ్రి

బయటి లింకులు[మార్చు]

"https://te.wikisource.org/w/index.php?title=గోమాత&oldid=119538" నుండి వెలికితీశారు