గురుజాడలు/వ్యాసములు
వ్యాసములు
మాట, మంతీ - 1
గ్రామ్య శబ్ద విచారణము
నవంబరు 5వ తేది శశిలేఖలో మ. చినపురుషోత్తం పంతులుగారు మొదలైనవారున్ను, 7వ తేదీని మా మిత్రులగు మ. లక్ష్మణరావు పంతులుగారున్ను వ్రాసిన లేఖలు చూస్తిని.
శశిలేఖా సంపాదకులు నాకు చాలా కాలము నాటి మిత్రులు. చెడుగు చేతామనే వూహతో నన్నుగూర్చి యేమిన్ని వ్రాయరు, అచ్చొత్తరు. కాక, యేమి ప్రచురించినా, మా స్నేహానకు భంగము రాబోదు.
విద్వాంసుల ధోరణులు వేరు వేరు రీతుల నుంటవి. హాస్యరసము మీద కొందరి కలము పరుగులిడుతుంది. కొందరి బుద్దులు దోషాన్వేషణములో వాడితేరుతవి. మరికొందరి బుద్దులు తిట్లకు తీరివుంటవి. ఈ మూడు రీతులూ చాలినంత లేకపోవడము వల్లనే, మన భాష యిప్పటి యీ దురవస్థలో వున్నదని నా అభిప్రాయము.
కాని, కన్ను కొంచెము తెరచి, యితర దేశములలో భాషలు యేలా పెరుగుతున్నవో, అదిన్నీ, గత కాలములో మన దేశభాషలు యెట్లు పెరిగినవో అదిన్నీ, కానీ; శ్రద్దతో భాషా శాస్త్రమును కరచి, గ్రాంథిక వ్యావహారిక భాషలను పరిశీలించి, మరి తప్పులు పట్టతలవడితే, ఉభయ తారకంగా వుండును. తీర్పులు చెప్పడం సులభం; విద్యా పరిశ్రమ కష్టం.
అంతవరకు యెవరి స్వభావానుసారముగా వారిని వ్రాయనిస్తేనే తప్ప, పేపర్లకు యీపాటి వ్రాయడమూ వుండదు. అచ్చు ఆఫీసులు మూసి, పత్రికా సంపాదకులు తపస్సుకు కూచోవలసి వస్తుంది.
ఇక మా మిత్రులు మ. లక్ష్మణరావుగారి మాట-మ.రాయప్రోలు సుబ్బారావు పంతులుగారు యేమివ్రాశారో నేను చూచియుండలేదు. లక్ష్మణరావు గారి వ్రాతను పట్టి చూడగా వారికి, వాడుక భాషయందు నిరసన భావం వున్నట్టు కనబడుతుంది ఏలనో? వారు దయచేసి కారణము చెప్పుదురు గాక.
గత కాలములో నవమాష్టం పారాయణము చెయ్యడమందు నిపుణులైన బ్రాహ్మణ వుద్యోగస్థులు రయితును, రట్రను, పరిపాటిగా, ఒక స్వారస్యమైన తిట్టు తిట్టుతూ వచ్చేవారు. ఇప్పుడైనా కడపెడలను ఆ శబ్దం, వినబడ్డం కద్దు. యీనాడు కొందరు పండితులూ, కవులూ అట్టిదీయే, ఆ గ్రామ్యోక్తివొకటి. గ్రామ్య భాషను గురించి వినియోగించుదురు.
వారిలో తెగబడి దీవించినవారు శ్రీ బాలకవి భోగరాజు నారాయణమూర్తిగారు, వారు వ్రాసిరి -
గీ. అజుని సృష్టి విచిత్రమేమందు సౌర
ఘనుల నిరుపమ పాండిత్యగరిమమేమొ
అంబురాసిలో గాలకూటంబు వోలె
గ్రామ్యభాష కొత్తగా ప్రబలే నిపుడు.
గీ. నీరత మవలక్షణంబుల గడుచుండి
ఆంధ్ర భాషతోఁబోరాట మాడదొడగే
లంజసంతతి సొత్తుకై లావుమించి
మౌరసునీతోడ బోరాటమాడునట్లు.
సీ. నవనవాలంకార నవ్య వైభవమన్న
దలనొప్పియట దీని సరణి యేమొ
మహిని వ్యాకరణోక్తి మాటలాడుటయన్న
వాంతి నట దీనీ వరుసయేమొ
సాహిత్య విధ్యుక్త సల్లక్షణములన్న
నురిబోసికొను దీని సరయేమొ
వివిధ భవ్యాకార వృత్తగీతములన్న
మూలడాగును దీని లీలలేమొ
గీ. తగుదునని తానుగూడను తగవులిపుడు
సేయగాబూనె దేన్గుతో వేయి యేల
ఆంధ్రభాషా వధూటీ గృహాంగణమున
దాసియై మెలగుటకు నైన దగునె చెపుడ.
Appearances are deceptive-అనీ వొక ఆంగ్లేయోక్తి కలదు. తిట్టగానే, అసూయ కాబోదు. భూషించగానే, అనురాగం కాబోదు. ముద్దుతిట్లూ, భక్తి తిట్లూ, రస భరితములు. నారాయణమూర్తిగారి తిట్లు కూడా అట్టివేమో యని సందేహం పొడముతున్నది. లేని యెడల అవలక్షణములు వారి కవిత్వమందు వారేల వాడుదురు? వీరు ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకు వ్రాసిన పైపద్యములు కాక, శ్రీ రాయబహద్దర్ వీరేశలింగం పంతులు గారి లైబ్రరీని గురించి ఆంధ్రప్రకాశికకు వ్రాసిన పద్యములను కూడా నేను చదివితిని. అందు కొన్ని స్వారస్యములు కానవచ్చినవి.
- 1) స్వభాషను దేశమునందునన్ జీవవినాశ ఘోరమును బొందగనీయక.
- 2) పూజితమై కవీంద్రసుమపుష్కలమై ద్విజరాజపుంజమై చెలంగు నీ రాజమహేంద్ర పట్టణ వరస్థిత బాలక పుస్తకాలయోర్వీజము,
- 3) కల్పతరోపమానమై
- 4) నవనవ గ్రంథసంధానుడై యే కవి
- 5) అతులతేజసంయుతంబయి
ఈ సంస్కృత ప్రయోగములు మిక్కిలి సరళములు కావనుకుంటాను. ఇక తెనుగున కళలు ద్రుత ప్రకృతికములతో సంబంధించిన నియమములను వీరు సంస్కరించినట్లు కనబడుతుంది.
- 1) చాల యుపద్రవమయ్యె.
- 2) దేశభాషలందెల్ల యనుచు.
- 3) కథల నవ్వుల కల్లమి కలలబడుట.
- 4) భాషను చక్కగా.
- 5) అటుచేతురు గాక.
ఇది గ్రామ్యమునకు వృత్తి కల్పించుట కాదా! బలీయులు బలియురు కావలయును.
పై వ్రాసిన మాటలు, రాయవలసివచ్చినందుకు చాలా చింతిస్తున్నాను. బాలకవులు ప్రతిభావంతులని వింటిని. మన ప్రాచీనకవుల గ్రాంథిక భాషలో రాయడమన్నది గరిడీవిద్య. భగవంతుడు కాళ్ళు యిచ్చినందుకు సుఖంగా నడవక గెడలెక్కుదురు; యేమి చెయ్యను?
రామాయణమును తెలుగు చేసిన మ. వావిలికొలను సుబ్బారావు పంతులుగారు కూడా ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో గ్రామ్యమును గురించి సరసముగా కొంత ముచ్చటించిరి. “కులటయగు మాతకన్న బతివ్రతయగు మాత యెక్కువ పూజ్యురాలైనట్లు, గ్రామ్యభాషకన్న లాక్షణిక భాషయే ప్రశస్తమని బుద్ధిమంతులెల్ల నంగీకరింతురు. అట్టి సలక్షణ భాష నుపేక్షించినచో గలుగు ననర్థములు పెక్కులు గలవు. గ్రంథవిస్తరభీతి సంక్షేపించెద. గాని తుద కాంధ్రపదము నామావశిష్టమగు”.
పరభాషల నేర్చుట కడుపుకూటి విద్యగా నెంచి ఇంకొక చోట రాయడంలో సుబ్బారావు పంతులుగారు పరభాషల నేర్చుట కేవల గర్ఘ్యము కాదనుటకు ప్రమాణముగా యీ కింది పద్యమును వుదహరించిరి:
క్షితి మేచ్ఛభాష శృతి గ
రితమగునట్లే నని ధరిత్రిని దానిన్।
మతీరోసి విడువగూడదు
సతతము వ్యవహారహాని సంధీలు కతనన్॥
పై పద్యమున మ్లేచ్ఛభాషయని రాయడములో అప్పకవి తురకల భాషను మనస్సులో వుంచుకున్నాడు. ఆ కింది ఉదాహరణములను చూడండి. సుబ్బారావు పంతులుగారు యింగ్లీషు భాషను మనస్సులో వుంచు కొనిరి. గాని శృతి గరితమయిన మెచ్చితము, యిది గాని, అది గానీ కాదనుకుంటాను.
పతంజలి, వ్యాకరణాధ్యయన ప్రయోజనములను చెప్పడములో, శతపథ బ్రాహ్మణంలోని ముక్కొకటి యెత్తి రాసినారు.
తె సురా, హేలయో, హేలయ ఇతి కుర్వన్తః పరాబభూవు:
తస్మాద్రాహ్మణే న మ్లేచ్ఛితవై నాపభాషితవై
మేచ్ఛోహవా ఏషయ దపశబ్దః|
మరివొకచోట మహాభాష్యంలో - గరీయా నపశబ్రోపదేశః! ఏకైకస్య శబ్దస్య బహవో అప భ్రంశాః| తద్యథా గౌరిత్య శబ్దస్య గావీ | గోణీ, గోతా, గోపోతలికేత్యేవ మాదయోపభ్రంశాః”
శృతిదృష్ట్యా, సంస్కృతపు మాట, లోకులనోట మారి సంస్కృత లక్షణమునకు పొందక పోగా, అట్టిమాట మ్లేచ్ఛితము లేక అపశబ్దమగును. అంతేగాని తురకమూ, యింగిలీషూ మెచ్ఛితములు కావనుకుంటాను.
ఉద్యోతంలో నాగోజీ భట్టు "నమేచ్చితమై ఇత్యేత న్మేచ్చభాషా విషయ మితి భ్రమనివృత్త్యర్థం తద్వివరణం నాపభాషితవై ఇతి అపశబ్దత్వం వ్యాకరణానుగత శబ్ద స్యేషద్భంశన ఏవ ప్రసిద్ధ మితి భావః| నను మేచ్ఛనామ పురుష విశేషో దేశ విశేషోవాస కథ పమశబ్లో|| త అహ ఘజితీ! నిన్గావచనా న్మేచ్చతే రితి భావః| నిన్గా చ శాస్త్ర బోధిత విపరీతోచ్చారణేన పాపసాధనత్వాత్ ఏవం చ బ్లోచ్ఛా ఇత్యస్య నిన్యా ఇత్యర్థ ఇతి దిక్”
వేదదృష్ట్యా, అన్య దేశభాషలకు మ్లేచ్చిత దోషము వర్తించనేరదు. "గ్రామ్యము నందు గల యనేక దోషంబుల గ్రహించియే పూర్వులు “అపశబ్దం ప్రయుంజానో రౌరవం నరకం వ్రజేత్” అని శాసించి” రని సుబ్బారావుగారు ఒక బాంబును నా బోట్ల మీద విసరజూడగా అది, పంతులు గారి చేతిలోనే పేలినది. యుక్తమే కదా?
సుబ్బారావు పంతులుగారు రామాయణము తెనిగించినారు. వారి తెనుగు సంస్కృత పదములతో నిండివున్నది. వీరి సంస్కృత ప్రయోగములలో మ్లేచ్చితములు అక్కడక్కడ కలవు. “గావీ, గోణీ, ఆణవయతి" ఇత్యాది అపభ్రంశములను పఠించిన శిష్టేతరులకు, లోకసిద్ధి అయినా శరణమై యుండెను. స్వసిద్ధాంత ప్రకారము, పంతులుగారికి యే శరణమూ కానరాదు.
గాని, ఉద్యోతంలో “ప్రకరణాఛ్ఛక్రత్వం గోయం నిషేధః" అని - అహోబలపండితీయములో అతయేవ వ్యాకరణ మహాభాష్యే సర్వోష్యపశబ్ద నిషేధః క్రతువిషయ ఏవ ఇతి ప్రతిపాదితం” ఇటువలెనే శబ్ద కౌస్తుభంలో కూడా మహా భాష్యమందు "యాజ్ఞే కర్మణి సనియమో అన్యత్రా నియమః” ఉద్యోతంలో “యజ్ఞే సుశబ్ద ప్రయోగా ధర్మోపశబ్ద ప్రయోగాదధర్మ ఇతి తత్రైవతయోః ప్రయోగ నియమః తదతిరిక్తస్థలేతు సుశబ్దాపశబ్దయోః ప్రయోగే అనియమః
ఇలా రాయడంచేత సుబ్బారావు పంతులుగారి రామాయణ మందు నాకు అనాదరణ కలదని భావించకండి. వీరి కవిత్వం సాఫైనది. వీరి దైవభక్తి అందరూ యెన్నతగియున్నది. తెనుగులో వీరిపాండిత్యము అసమానము, గాని తెనుగులు నేర్చి, వీరి ఆంధ్రీకరణమును చదువుట కన్న, సంస్కృతంలో మిడిమిడి జ్ఞానం సంపాదించుకొని వాల్మీకి రామాయణం చదువుకోవడమే శ్రేయమని నా అభిప్రాయము.
ఆంధ్రపత్రికలో "గ్రామ్యము నిరసించుచు" వీరు వ్రాసిన వ్యాసమును బ్ర.శ్రీ. కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రిగారు పొగిడి, తమ పత్రికలో ప్రచురించిరి. బ్రహ్మయ్యశాస్త్రి గారు కూడా వ్యావహారిక భాష "అందరి నోటంబడి కులటవలే భ్రష్టత నందియుండును" అని వ్రాసిరి. బ్రహ్మయ్యశాస్త్రులు గారి దర్శనము నేను చేసి వుండకపోయినా చాలా కాలమునుండి వారి నెరుగుదును. వారిభాష నిర్దుష్టము. విద్యయు, తత్వాన్వేషణమును వారికి వ్యసనములవుటచేత, మాలో అభిప్రాయ భేదములున్నా వారియెడల నాకు విశేష గౌరవము కలదు.
వాడుక భాషను గురించి నా అభిప్రాయములను ప్రమాణములతో విమర్శించినవారు వీరొక్కరే. సమాధానములు, మరివొకచోట చెప్పదలచితి గాని, వారు ఉదహరించిన యింగ్లీషు పుస్తకములు ప్రస్తుత వాదమునకు ప్రసక్తములు కావు. ఇక వారి వాదమునకు సంస్కృత వ్యాకరణము యెటుల సహకారియో తెలియవలసి వున్నది. కన్నడ గ్రాంథికభాష మారుచు వచ్చెను గదా? ఆ మారుదలకు ఆదేశపు శిష్టులు యెటుల వొప్పిరో? తెనుగు గ్రాంథికభాష మాత్రము మారలేదా?
ఈ మధ్య యిలస్ట్రేటెడ్ లండన్ న్యూస్ అను పత్రికలో చెస్టర్టన్ (Chesterton) అను బుద్ధిశాలి, వైరుధ్యం లేని విరోధమును గురించి చమత్కారంగా ముచ్చటించిరి. సీమలో (Unionist versus Freetrader) అనునది, అటువంటిదే. పాత గ్రాంథిక భాషను, సలక్షణముగా వ్రాయ వలసినదన్న శాస్త్రులుగారి మతమునకున్నూ, శిష్టులు యీనాడు వాడుకుంటూ వున్న భాషలో నుంచి కొత్త గ్రాంథిక భాషాకటి కల్పించుకోవలసినదన్న నా మతమునకున్నూ, వైరుధ్యం యెక్కడ? మా జాగాలే వేరు. పరిశీలించి చూడగా, శాస్త్రుల్లుగారికిని, నాకును అభిప్రాయభేదము చాలా తక్కువ. గ్రాంథికభాష వాడుక చేసేవారు, దాని నియమములను పూర్తిగా మన్నించవలసినదనే నా అభిప్రాయము. ఆ భాషను సాధించలేని వారు, అనగా, లోకానికల్లా బ్రహ్మయ్య శాస్త్రులుగారి వంటి పది మంది తప్ప కడమందరూ, వాడుకభాషలో నుంచి సులభ సాధ్యమైన వొక కొత్త గ్రాంథిక భాషను కల్పించుకుంటే, శాస్త్రులు గారికి యేమికొరత?
వాడుక భాషను కులట అని మర్యాద చేసే పండితులు, దానిని దూరముగా విసర్జించక యేల వాడుక చేతురో? వారు "యాంటీనాచ్" కారు గాబోలును.
ఇక కళింగ దేశ చరిత్ర మాట :- దానిని గురించి మా మిత్రులు నాతో ముచ్చటించినప్పుడు, వారు కోరకముందే వారి నిర్ణయములను యెరిగిన వాడ నౌటచేత, యిదివరకు నలుగురూ వ్రాస్తూ యున్న భాషనే వ్రాతునంటిని. అట్టి వొప్పుదలకు కారణము దేశమున చరిత్ర జ్ఞానము విరివికావలెనని మా మిత్రులు చేస్తూ వున్న మహోద్యమమునకు తోడ్పడను అభిలాషే. అంతేగాని యిప్పుడు గ్రంథకర్తలు వ్రాస్తూ వున్న అత్యంత కృత్రిమ భాషకంటె, బ్రాహ్మణాదులు వాడుకొనే భాష మంచిదని తెలియకకాదు.
ఇప్పుడు లక్ష్మణరావు పంతులు గారు నాకు వొక చిక్కు తెచ్చిపెట్టినారు. వారు రాసిన లేఖలో లక్షణ ప్రయుక్తమనే మాటొకటి ప్రయోగించారు. ఈ లక్షణం స్వభావం యెట్టిదో వారు కొంచెము శ్రమచేసి పత్రికా ముఖంగా లోకానికి వ్యక్తీకరిస్తే ఉపయోగంగా ఉంటుంది.
వ్రాతను బట్టి పోల్చుకుందామని, విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో చటుక్కున చేతికి వచ్చిన ఆంధ్రుల చరిత్రను తీసి చూస్తిని. దానిలో భూమిక మా మిత్రులు రాసినదే. మొదటి వాక్యకదంబమును చదివి చూడగా, భాష, లక్షణానుసారంగా వున్నట్లు నాకు కానరాలేదు. " అనియమాద్రామ్యం హియత్వపభ్రంశః" అనే లక్షణము ప్రమాణం అయిన యెడల, ఈ భాషకు గ్రామ్యత గట్టిగా పట్టి వున్నది. గ్రామ్యంలో దిగిన వెనుక ఆగడం యెక్కడో!
అది అటుండగా “గ్రామ్య శబ్దార్థం యేమిటి?, శతాంథాః కూపం ప్రవిశంతి" వొకడన్నాడని వొకడనడమేనా, తత్వ విచారం కద్దా? సంస్కృత భాషా కావ్య శాస్త్రములో మోటుమాటకూ, మోటు అర్థమునకూ, గ్రామ్యత అని పేరు పెట్టిరి. ఇది వొక కావ్య దోషము. అహోబల పండితులు దీనిని గురించి కొంత రాసినారు. (రాజా భుజంగరావుగారి పుస్తకములో 117 పేజీ చూడండి)
గ్రామ్య శబ్దానకు సాధారణమైన అర్థము మోటు. ఈ శబ్దమునకు విరోధి "నాగరము, నాగరికము, నాగరకము" ఇంగిలీషులో నాగరికము Polite, refined అందురు; గ్రామ్యము Low, vulgar అందురు. "శబ్దేపి గ్రామ్యతాస్త్యేవ సా సభ్యతరకీర్తనాత్" శిష్టులు రాత్రీ పగలు వాడుకచేసే భాషను గ్రామ్య మనడము, అనాలోచితమనుకుంటాను. అదే గ్రామ్యమౌట నిజమైతే, ఇప్పటి మన గ్రంథకర్తలంతా గ్రామ్య జనమే, ఒక్క మహా మహోపాధ్యాయులు తక్క! "పామరాది ప్రయుక్తంయత్త ద్రామ్య మభిధీయతే.”
గనుక యిటుపైని బ్రాహ్మణాదులు వాడుకొనే నాగరికమైన భాషను పండితులు గ్రామ్యమ నకపోవడము ఉచితమని భావిస్తాను. నాగరమని దానికి పేరు పెట్టి, గ్రామ్యమును వొక చీడీ దించితే, శబ్దాచిత్యము సాధిత మవుతుంది.
“అనియమాద్రామ్యం హి యత్వపభ్రంశః" అని కొందరనగలరు. ఆ మాటకు వస్తే, నియమం లేని భాషే వుండదు. ఒక వేళ వుండుననుకున్నా, గ్రామ్య భాషకు వొక నియమం చేసుకుంటే, గ్రామ్యత పోవలెను. ఈ కారికరాసిన వైయ్యాకరణుడు అయితేనేమి, అహోబల పండితుడైతేనేమి, సంస్కృత లక్షణానుసారంగా, తెనుగుకు లక్షణం కల్పించకోరి, అసందర్భములు కల్పించుకున్నారు.
కాదంటిరా, నియమమంటే యేమిటో, సంస్కారం అంటే యేమిటో, వాటి స్వభావమెట్టిదో వాటి చరిత్ర మెట్టిదో స్పష్టముగానూ, విపులముగానూ యెవ్వరేని ఉపన్యసించి మమ్ముల తరింపజేతురు గాక. సాంకేతిక సుప్రసిద్ధ పదములు కూడా యెట్టివో తెలియగోరితిని.
గ్రామ్య, మ్లేచ్ఛిత, అపభ్రంశ శబ్దములను గురించి ముందు వ్రాసెదను. గ్రామ్యమును గురించి మా మిత్రులు బ్రహ్మశ్రీ వేదం వేంకటరాయ శాస్త్రులువారు చాటలు చెరిగి చర్చించినారు. వారు గ్రామ్యభాషను రాసిన కొన్ని పాటలు బర్న్స్ అను మహాకవి పాటలను పోలి యున్నవి.
గ్రామ్య భాషను గురించి యెవరేమి ప్రచురించినను, దయచేసి ఆ పత్రికల నాకు అంప వేడెదను. గ్రామ్య భాషా చర్చ గోరిన పత్రికా సంపాదకులు గ్రామ్యమును గురించిన నా వ్యాస ములు వారి పత్రికలలో యెత్తి ప్రచురింతురు గాక.
ఇంతవరకు వ్రాసిన పిదప మా మిత్రులొకరు శ్రీ బాలకవి గారి విమలా దేవి అను నవలను నాకిచ్చిరి. స్థాలీపులాకన్యాయముగా పరిశీలించి ఈ ప్రయోగములు కానవచ్చినవి. (అ) అనవసరమైన చోట్లను అనగా అనుకరణము లేని చోట్ల అన్య దేశములు.
సూచీ పత్రములో ఔరంగజేబు ఖాయిలా, యాఖుదా యా అల్లా, హుషారీ, ఖత్తల్ ఇట్టివి చాలా కలవు (ఆ) సంధి విసంధుల తోవలు కానరావు; వఱకు ఆంధ్రోపాధ్యాయ పదవి; గ్రంథకర్తను అగు; సమగ్ర సృష్టియనియు, ఇందు; అప్పుడు; ఇందిర; ఇట్లు - ఉదయమున ॥ గార్లు - ఆశ్చర్యాతి రేకము చేత॥ రాజసింహుడు- అతని ఏమి యీ యన్యాయము ॥ ఇంతలో నా రాజభటులు ఆ పురుషుని ఈడ్చుకొని బాటసారిని సమీపించిరి. (ఇ) తనకు గల - నుత్సాహము ॥ విరిచి - గట్టినాకిది యే ప్రథమ ప్రయత్నమని దెలుపుచుండ; రాజ్యము నకు వారసననియు (వారిన్ లేక వారిస) చంద్రావతి మహారాణిని బట్టి తెచ్చిన యాతడు సంతోషాతిశయమున ॥
ఈ) న్యాయమైన ఆడుది ॥ సాటివంశజుడే ॥ అన్యధా తలంచి ॥ సంరక్షణ ॥ స్మరణ ॥ ఈ ప్రయాస కూడ ॥ కుంభ కర్ణుని పాత్ర ॥ నిర్ఘాతపడి ॥ అర్ధపూర్ణ దృష్టి ॥ సృష్టింపబడె అంతా రామమయం (మిగిలినపాట సంస్కరించబడినది) నీవు చింతాక్రాంతయై ॥ దండన ॥ ఘటనము। సాహాయము ॥ జాగ్రత్తగా ॥ అసహ్యపరుడు (అసహ్య పాత్రుడనుటకు॥) ఇతరత్ర ॥ తన తదంతరము॥ కుమారిత॥ భగవాన్ వశిష్ఠుల వారు ॥ ఆపద నివారణోపాయము ॥ ఆడుబడుచు||
ఇవన్నీ తప్పులని నా అభిప్రాయమని కాదు "అపశబ్ద భయం నాస్తి అప్పలాచార్య సన్నిధౌ" అని చెప్పే వుంచాడు ॥ బాల కవుల ప్రయోగ సరణి కవిత్రయము వారి సరణికి చాలా దూరమనుకుంటాను.
(.24.11. 1910) మాట - మంతి - 2
ఆకాశరామన్న ఉత్తరాలు
O, would some power the giftie gie us To see ourselves as others see us - Burns
ఆకాశరామన్న బహు దొడ్డ మనిషి. బహు ప్రాచీనుడు, గాని రాతలు లేని అదృష్టపు కాలములో, ఆయన ఆఫీసు అమలు యెలా జరిగెనో నిశ్చయించలేము. చెట్టు చాటు నుంచీ, పుట్ట చాటునుంచీ ముఖం పెట్టి యెదట చెప్పరాని వార్త కేకవేసి వెళ్ళేవారు కాబోలు. ఇప్పుడు ఇంగ్లీషు వారు, పోస్టు, టెలిగ్రాఫు, ఖణాయించి, వార్తా పత్రికలు ప్రబలిన తరువాత అన్ని ఆఫీసుల వలెనే, స్కై ఆఫీసు పని కూడా హెచ్చినది. డబ్బున్నర ఖర్చుతో మనసులో బిరడా వేసి బిగించుకున్న దుఃఖమును వెలిబుచ్చవచ్చును.
వెనకటి కొక బుద్ధిమంతుడు, తాను చచ్చిపోయినట్లు తనవారికి తంతివార్త పంపెను. టెలిగ్రాఫు యొక్క ఉపయోగమును పూర్తిగా గుర్తెరిగిన వాడితడొక్కడే. డొంకచాటు నుంచి బాణం విసరవలె నంటే, వార్తా పత్రిక చాలా సుళువు. కొంతమంది సైంధవుణ్ణాకణ్ణి ముందు వుంచుకుని యుద్ధము చేస్తారు. యెగిరిపోతే, వాడి బుర్ర యెగిరిపోతుంది. గెలిస్తే యెవడి దెబ్బో అవతలాడు గుర్తెరిగే వుంటాడు. అభిమానం లావుగా వున్న చోట మాత్రం ఆకాశరామన్న గారు ఆటోగ్రాఫ్ లెటరే, అంపిస్తారు. Autograph letter అనగా స్వహస్తలిఖిత లేఖ.
ఈ మధ్య నన్ను కూడా ఆకాశరామన్న గారు అనుగ్రహించారు. అంతవరకూ, వారు ఖాతరీ చెయ్యవలసిన పాటి అధికుడను కానని అనుకుంటూ వుంటిని. యిప్పుడా కొరత తీరినది.
“నేను మిమ్ములనెరుగుదును. మీరు నన్నెరుగుదురో లేదో? అను ప్రశ్నతో శ్రీముఖమును ఆరంభించిరి. తమరి నెరుగనివారెవర”ని ఆ యుత్తరము. కవరు పెద్దాపురము పోస్టున వెడలినది. తమరు ఆ ప్రాంతమున వెలసియుందురు.
కాని, నేను మిత్రుడననియే మిమ్ముల భావించుచుండ బట్టి మిమ్ములను మిత్రమా! యని పిలుచుచున్న లోపమునకు మన్నించండి” ఇది యొక లోపముగా నేను తలంచలేదు. అయం బంధుః పరోవేతిగణనా లఘుచేతసాం | పుంసా ముదారచిత్తానాం వసుధైవ కుటుంబకమ్ ॥
ఇదియను గాక దేశమాత పుత్రులమగు మన మందరము సోదర సమానులముగాన మిత్రులనుచున్నాను. ఇది పై శ్లోకార్థ దృష్ట్యా అల్ప దృష్టేమో? మనము జగన్మాత పుత్రులము.
దేశమాత అంటే, వొక చిక్కు కూడా వున్నది. యే దేశం? తెలుగులకు అరవలకు వుండే భ్రాతృభావం చాలా కనిపెట్టేను. బంగాళీలకు హిందూస్థానీలకూ గల ఐకమత్యము కూడా కొంత వరకు చూశాను. మన తెనుగులలోనైనా, దేశ మాతృ పుత్రత్వాద్భాతృత్వం, లెక్చర్లలోనూ, వ్రాతలలోనే కాని, చర్యలలోనూ, ఆలోచనలోనూ, సిగపట్ల గోత్రత్వమూ, స్వప్రయోజక పరత్వమే మెండేమో? మాలవాడు కనపడగానే భ్రాతృత్వం చాలాదూరం పలాయనం చేస్తుంది. మాలవాణ్ణి చూడగానే అమాంతంగా కాగలించుకొని వాడికి దేశమాత పేరు యెత్తడముకు అర్హత లేదని నా గట్టి నమ్మకం. దేశమాత కథ అలా వుణ్ణియ్యండి. ఉగ్గుపాలతో మనము నేర్చిన తల్లిభాష యగు వాడుక తెనుగు భాషకే కొందరు తాళంబట్టుచున్నారు. మిద్దెలు మింగే బావగారికి తలుపులప్పడాలా!
“సంబంధ మాభాషణపూర్వమాహుః" అన్నాడు మహాకవి. పోస్టుద్వారా మాట్లాడుకొన్న మనకు, మిత్రత్వం సిద్ధంకానే బంది. దానికి యింత డొంక తిరుగుడేలా! ఆకాశరామన్నను యింగ్లీషు వారు కొంచెము దర్జా తక్కువగా చూస్తారు గాని, స్నేహాలకు దర్జా అంత అడ్డురానేరదని, నా మతం గనుక ఆకాశరామన్న గారితో నేస్తము నాకు యిష్టాపత్తే.
ఇష్టాపత్తే, అంటినా? బ్రహ్మానంద మనవలసినది, యేలనంటిరా, నావలెనే ఆకాశరామన్న గారు కూడా గ్రామ్య భాషాభిమానులు. రత్నములూ, ముత్యములూ కలిపిగుచ్చినట్లు వారు గ్రామ గ్రాంథిక పదములతో సొంపైన వాక్యములు రచించిరి.
ఇకవారిలేఖతరువాయి వినుడు : “మహారాజశ్రీ శ్రీవావిలకొలను సుబ్బారావు పంతులు గారు చేసిన రామాయణమును గురించి తాము వ్రాసిన మాటలేమి, శ్రీ విజ్ఞాన చంద్రికా గ్రంథమాల సంపాదకులును, సంస్కృతాంధ్ర మహారాష్ట్ర హూణ, హిందీత్యాది భాషా కోవిదులును నగు శ్రీ లక్ష్మణరావు పంతులు గారిని గురించి తాము వెలిబుచ్చిన యుద్దేశ మేమి? శ్రీ బాల కవి భోగరాజు నారాయణమూర్తిగారు మున్నగు వారిని గురించి తాము ప్రసంగించిన సంగతు లేమి మాకు చాలా హాశ్చర్యము కలుగజేయుచున్నవి. పులిని చూచి నక్క వాత పెట్టుకున్న దాని నటుల మీ చర్య తోచుచున్నది. బహుశహ ఈ పై ముక్కలు అచ్చు వెయ్యడముకు వీలు వుండదు. అవి కాన్ఫిడెన్షిల్ confidential not meant for publication మరియు "మీరు విద్యాధికులయ్యును, ప్రస్తుతము దేశము శాంతి కొరకు పాటు పడుచున్నదని తరుచు పత్రికలను చదువుచున్న తమకు తెలిసియున్నను, మీ వ్యాసము ఆ కల్లు త్రాగెడు వారి వ్యాసము వలె తోచుచున్నది. “నిజముగా ఆలోచించి చూడగా మీకు అనుభవమే యెక్కువగాని విద్యా నైపుణ్యత తక్కువ. గుట్టు మట్టు నాకు తెలుసును. సంగతులన్నియు పత్రికా ముఖమున ప్రచురపరచమనిన ప్రచురపరచుతాను. గాని తమ యిట్టి గొప్ప కీర్తి ఆంధ్ర మహాజనులకు తెలియచేయ నా కిష్టము లేదు. అయినా మీ శలవేమిటి? పంతులు గారూ... దిక్కుమాలిన హాస్యోక్తులతో ఎదటి వారి మనస్సు నొప్పి కలుగచేయకండి. ఏమంటారు? నామాట నమ్ముతారా నమ్మరా? ప్రస్తుతము ఇంతటితో చాలించినాను, మీకు నా యుత్తరము వల్ల బుద్ధివచ్చినటుల పత్రికా ముఖమున ప్రచురించండి. నేనెవరినో మీ రెరుగుదురా? కొద్ది రోజులలో మిమ్ములను కల్సుకొని అప్పుడు చెపుతాను”
లేఖారంభమందు ఆ ప్రశ్న చూడగానే, మీరెవరో యెరుగుదుననుకున్నాను గాని, లేఖాం తమందు ఆ ప్రశ్న తిరిగి పఠించడము వల్ల సందేహమునకు కారణమైనది. “పంతులు గారూ” అని నన్ను నొక్కి పిలవటం చూడగా, ఆకాశరామన్న గారు పంతులుగారు కారని అనుకుంటాను, 'మాకు' అని బహువచనం ప్రయోగించటం చేత యేమనుకోవడమునకూ పాలు పోకుండా వున్నది. మీరేమనుకుంటారు? సహస్రపాదాక్షి కాబోలు.
ఆకాశ ఆస్థానము నుండి నాకు ఈ ఫర్మానా జారీ కావడమునకు కారణము తప్పకుండా నాకు బుద్ధి రావలెననే. బుద్ధి వచ్చిదనదన్నమాట తాము నిరఖుగా తెలిసికొనగోరియే పత్రికా ముఖమున ప్రచురించమని వ్రాసిరి గాని నేను యెట్లు ప్రచురించగలుగుదును? చిన్ననాటి బెత్తపుదెబ్బల వల్ల బుద్ధి రాలేదు. పెద్దల మాట వినక దాట్లు వేసినపుడు కాలు విరిగినా బుద్ధి రాలేదు. నాటికి, నేటికి యెప్పటికప్పుడు బుద్ధిని యెంత ఆసక్తితో బతిమాలి పిలిచినా రాలేదు. అరవై యేళ్ళకి అగ్గిగండం అన్నట్లు, యిప్పుడు మామిత్రులు నొక్కి నొక్కి వ్రాసినారని బుద్ధిని విరిచికట్టి తెచ్చి పెట్టుకున్నా భరించడం కష్టం. ఆ శ్రమ నేను పూనుకోజాలను. మిగిలివున్న నాలుగు రోజులూ కొంచెం స్వేచ్ఛగా బతకవలెనని వున్నది. యెవరి కుండదు? అంతేగాక, నావంటి వాళ్ళకు కూడా బుద్ధి కలిగితే బుద్ధి చవకైపోతుంది. కనుక ఆ బుద్ధన్నదేదో ఆకాశరామన్న గారు భద్రంగానూ, రహస్యముగానూ దాచుకుంటేనే విలవ.
ఆకాశరామన్న గారి మాటయందు నాకు గట్టి నమ్మకమే గాని బుద్ధిరావడమన్న మాట మట్టుకు అబద్ధం. బైబిలులో "ది పేరబిల్ ఆఫ్ టెన్ టాలెంట్సు" అని నీతిబోధకమైన కథ వొకటి వున్నది. (The Parable of ten talents) భగవంతుడు ప్రతి మనిషికీ లావో, కొంచమో ప్రతిభను యిస్తాడు. యెక్కువ యివ్వలేదని తక్కువ ఉన్నవాడు సోమరియై వుండకూడదు. తన స్వల్ప ప్రతిభను పూర్తిగా వినియోగపరచ వలసి వుంటుంది. గాన నాకు చేతనైన రీతిని యిటుపైని కూడా రాయడమునకే తలచియున్నాను. గాని ఆగతలుచుకోలేదు. దేశము శాంతి కొరకు పాటుపడుచున్న రోజులలో నా రాతల వల్ల పితూరీలు కలుగునని ఆకాశరామన్న గారు భయపడు చున్నట్టు కానవచ్చినది. ఏల నీ భయము? మేమంతా తిట్లాటలకు వీరులము గాని, తుపాకి పేల్చడం నేర్చి వుండలేదు. నేర్చిన వారివైనా తుపాకులు తుప్పట్టివున్నవనుకుంటాను.
ఏతావతా నేను హాస్యోక్తులు రాయడము మానకుంటే ఆకాశరామన్న గారు నా గుట్టు మట్టు ప్రచురించి నా గొప్ప కీర్తి ఆంధ్ర మహాజనులకు వెల్లడి చేస్తారట. ఇంతకన్న లోకోప కారమూ, నాకు ఉపకారమూ కద్దా? కోహం? అనే ప్రశ్నతో ఆరంభమైంది వేదాంత చర్చ అంతాను. నా గుట్టుమట్లేవో నాకే తెలియవు గదా, వారు శ్రమచేసి కనిపెట్టి చెప్పడం కన్న మిత్రత్వం వుండునా? లేక యే కారణము చేతనయినా వారికి నా యెడల ఆగ్రహము పొడమి, పత్రికా ముఖమున నాలుగు రానిత్తుమని బెదరించ తలచియుందురా? వృధా శ్రమ. ఒక రాతి స్థంభమును భూషిస్తే యెంత చరితార్థమో నన్ను మన్నించినా అంతే. ఆనందమహారాజును యెరిగిన నరుడికి ఆగ్రహం ఉండబోదు.
అయినా నేను ఆకాశరామన్న గారికి యే విధమైన అపరాధమైనా చేసివుందునా అని తలపోసి చూస్తిని. కాన రాలేదు. శ్రీ సుబ్బారావు పంతులుగారూ, లక్ష్మణరావు పంతులు గారూ, బాలకవి గారూ నా మాటలను అపరాధముగా తలచవలసిన వారు కారు. వారు ఆరి తేరిన గ్రంథకర్తలు. అయితే వారికి లేని ఆగ్రహము ఆకాశరామన్న గారికి కలుగునా? ఒక కథ వుంది.
వెనుకటి కొక గొప్ప ప్రభువు ఒక మహా పండితుణ్ణి అడిగెనట. యేమండీ మీరు భంగు పుచ్చుకుంటారట; నిజమేనా? అని. అప్పుడు ఆ వార్త విన్నవించియున్న మహానుభావుడు యెదటనే వుండెనట. అందుకా పండితుడనెను, “మహారాజా! నేను భంగు సేవిస్తానన్న మాట సత్యమే గాని, మత్తు మట్టుకు యీయనకు కలుగుతుంది".
లోకంలో యిట్టి వింతలువున్నా, ఆకాశరామన్న గారికి మట్టుకు నిజంగా నాపైని కోపం లేదు. ఈ మధ్య ఒక కవి సరికొత్త వృత్తమున నా రూప రేఖా విలాసములను వర్ణించిరి, యీ లేఖలో ఆకాశరామన్న గారు నా గుణసంపత్తి వర్ణించిరి. మొత్తము మీద తమ హస్తము హాస్యరసము వ్రాయుటలో నిరర్గళమయినదిగా తోచుచున్నది అని వ్రాసి, మీరు విద్యాధికు లయ్యును అని వ్రాసి, తిరిగీ నిజముగా ఆలోచించి చూడగా 'మీకు అనుభవమే యెక్కువ గాని విద్యా నైపుణ్యత తక్కువ' అని వ్రాసిరే అని శంకించగలరు. వారు శలవిచ్చిన రెండు మాటలూ యథార్థమే. శిష్టా నవగతములైనట్టిన్నీ, మ్లేచ్ఛ ప్రయుక్తములైనట్టిన్నీ “పిక, నేమ" ఇత్యాది వైదిక శబ్ద ముల అర్థము శాస్త్రము వల్ల కల్పించుకోవలసినదా లేక, మ్లేచ్ఛ ప్రయోగమును అంగీకరించ వలసినదా అని ప్రశ్న వేసుకుని శరభస్వామి పలికెను. “యత్తు అభిముక్తాః శబ్దార్థేషు శిష్టాః ఇతి, తత్రోచ్యతే అభియుక్తతరాః పక్షిణాం పోషణే బంధనేచమ్లేచ్ఛాః" అని నాకు శాస్త్రములు రావు గాని చిన్ననాడు బొమ్మలాట నేర్చుకున్నాను.
ఆకాశరామన్న గారి మాటలకు గూఢార్థం కూడా వొకటి వున్నది. స్టెడ్ (Stead) అను మహా ప్రాజ్ఞుడు ఈ నెల రివ్యూ ఆప్ రివ్యూజ్ (Review of Reviews) అను పత్రికారత్నములో యిప్పటి పార్లమెంటు యెలెక్షనుల (Elections) ను గురించి ప్రజల తరపున వ్రాస్తూ హ్విట్టియరు (Whittier) అను కవి రాసిన రెండు చరణములు ఉదహరించిరి :
I set the plain man's common sense against the Pedant's pride.
విద్యల విషయమై ఆకాశరామన్న గారి అభిప్రాయములను ముందు విపులముగా వ్యాఖ్యా నము చేసి చెప్పుదును. రాస్తే వారే రాయాలి. వ్యాఖ్యానం చేస్తే నేనే చేయాలి.
మనుష్యుల విద్యలను పోల్చడమే కాకుండా, ఆకాశరామన్న గారు వైద్య శాస్త్రంలో కూడా ఉద్దండులు. చేవ్రాలు చూసేటప్పటికి యీ మనిషికి బహుమూత్ర రుగ్మత వుందని పోల్చుకుం టారు. డాక్టర్లు పోల్చుకోలేకపోతే లేక పోదురు. అది వాళ్లలోపం.
నా అదృష్టం యెట్టిదో గాని నాకు పరిచయం కలిగే మనిషల్లా వేలలో యెన్న తగినవాడై వుంటాడు. కోట్లలో యెన్నతగినవాడై వుంటాడు. నాటికి నేటికి ఆనందమహారాజు వలె లోకానికల్లా యెన్నతగినవాడై వుంటాడు. ఆకాశరామన్న గారు కూడా యెక్కడో వొకచోట ఆ గణనలో రావ లసినవారే. పరుల గుణములు కనిపెట్టుటలో నేనే ప్రవీణుడనని నా గర్వం.
చిన్నతనంలో బొమ్మలాట నేర్చి వుండుట చేత లోకమనే రంగంలో చిత్రకోటి రీతులను ఆటాడే మనుష్యులనే పాత్రములు సొగసు నేకనిపెట్టడము నాకు అలవాటైనది. సొగసులేని మనిషే వుండడు. స్నేహమూ -ప్రేమా-అనేవి అనాది అయిన్నీ, యెప్పటికీ సరిక్రొత్తగా వుండే రెండు వెలుగులను నరుని మీద తిప్పి కాంచితే వింత వింత సొగసులు బయలు దేరుతవి. అసూయ అనే అంధకారంలో అంతా ఏక నలుపే!
అందులో జ్ఞాపకము వుంచుకోతగిన మాట పలికిన వాడల్లా యెన్నికైన మనిషే అని నా అభిప్రాయము. అట్టిమాట బ్రతుకు తెరువును దేనినైనా చూపేమాటైతే అది పలికినవాడు మహానుభావుడు కాడా? ఆకాశరామన్న గారు అట్టివారే. వారి మాటలు వినండి.
నిజముగా మీరు వ్రాసిన వారి యందు తప్పులేయున్నవనుకుందాము. అట్టి తప్పులను పత్రికా ముఖమున ఆంధ్ర మహాజనుల యెదుట రసవంతముగా చెప్పవలెను గాని దిక్కుమాలిన హాస్యోక్తులతో ఎదటివారి మనసు నొప్పి కలుగచేయకండి. ఇప్పటి దేవాసుర యుద్ధ కాలంలో ఈ అమృతమయమైన వాక్కులు సాక్షాత్తూ ఆకాశవాణీ వాక్కులు కావా? విని మనమందరమూ బుద్ధి తెచ్చు కోవద్దా? ఆ రసవంతముగా తప్పులు చెప్పుట ఆకాశరామన్న గారి యొద్ద నేర్చికొనవద్దా? మనమంతా అనగా మీరంతా అని అర్థము.
దేవాసుర యుద్ధమని యేల నంటినా! భారత యుద్ధము పద్దెనిమిది రోజులతోనూ, రామరావణాయుద్దము ఇరవై యేడు రోజులతోనూ చల్లారెనట. నన్నయ్యను గురించిన యుద్ధమూ, కవుల యుద్ధమూ, యింతటంతట చల్లారేటట్టు కానరాలేదు. ఈ దెబ్బలాడే వారంతా బుద్ధి మంతులూ, ప్రజ్ఞావంతులూ, విద్వాంసులూ అన్నందుకు సందేహము కద్దా! వీరిలో ప్రసిద్ధి లేని వారెవరు? మనసు రంజించునట్లు రాయనేరని వారెవరు? విద్యాబలంలోనూ, బుద్ధి బలంలోనూ ఈషత్తారతమ్యము ఉండుగాక! అది యెవడు తూచగలడు. ఒకరికొక విషయము యెక్కువ తెలిసియుండవచ్చును. మరొకరికి మరొక విషయము యెక్కువ తెలిసియుండవచ్చును. విద్య వొకరి సొమ్ము కాదు. అడుగు పెట్టిన చోటల్లా జ్ఞానపు గనులున్నవి. కన్ను తెరిచి చూసే సరికి గనులలో లక్ష్మి పెట్లో వచ్చి నిలుస్తుంది. యిక కవితా శక్తి మాట. మన దిక్కుమాలిన గ్రాంథిక భాషలో పద్యాలల్లడానికి కొండను త్రవ్వి ఆంధ్రగీర్వాణములు అభ్యసించవలెను గాని యింగ్లీషు, యింకా మరికొన్ని భాషలలో యీనట్టు లేదే! చచ్చి చెడి ఆంధ్ర గీర్వాణములు నేర్చిన, నాలుగడుగులకొకమాటు కాలు మెల్తపడుతూ వుంటుంది. మరిన్ని యెవడు వ్రాసిన పద్యాలు వాడికే అర్థం కావాలి. కావ్యాలు రాసినవారు పుస్తకములు అచ్చువేసి కట్టలు కట్టి అటక మీద భద్రము చేసి యెలకల పాలు చెయ్యవలె. యూనివర్శిటీ పద్ధతులు మార్పగుటవల్ల కావ్యములు టెక్సుబుక్కులై (Text book) బాలుర ప్రాణముమీదికి రాకుండా భగవంతుడు కాపాడినాడు. ఇది అప్రస్తుత ప్రశంస, వుండబట్టక యాకరువేశాను. బంగాళీలను చూసి మనము నేర్చుకోరాదా!
విద్యా వివాదాలలో పెద్దల యెడల కనపరచవలసిన విలువలు, వినయాది గుణములు పిన్నలు మరువరాదు. పెద్దలు పిన్నల యెడల వాత్సల్యత మరవరాదు. ఒకొ నొకప్పుడు కొంచెం రహస్యంగా పెద్దలను గూర్చి పిన్నలూ, పిన్నలను గూర్చి పెద్దలూ నిరసనగా మాట్లాడటం మనుష్య స్వభావం. అందుకు తేట తెల్లమైన కారణము భగవంతుడు పెద్దలనూ, పిన్నలనూ గూడా లోప ములు లేకుండా సృజింపకపోవడమే. అందుకు తోడు భగవంతుడు మంచి చెడ్డలను యెన్నే పనికిమాలిన శక్తి, ఆసక్తి ఒకటి పెద్దకీ పిన్నకీ కూడా కల్పించాడు. పెద్దలు ధోకాలు తిని వుండుటను కొంచం సహనమును నేర్చియుంటారు. పిన్నలకు ఆ సహనం వుండదు.
కనుక రహస్యముగా ఆ తప్పులు పలికిన నిరసన వాక్కులు ఒకప్పుడు చెవి సోకెనేని మనసున పెట్టకపోవడము న్యాయము కాదా? తండ్రి కొడుకును అంటాడు. కొడుకు తండ్రిని అంటాడు. ప్రభువు భృత్యుణ్ణి అంటాడు, భృత్యుడు ప్రభువును అంటాడు. అన్న మంచి మాటలను జ్ఞాపకం వుంచుకొని, నిందలు మరచిపోవలెను. లేకున్న మనిషికి సుఖమేదీ?
యిన్ని శ్రీరంగనీతులు పలుకుతున్నారు గదా. మీ "మాటా మంతీ” మాటేమని అడగగలరు. నా అంత మృదువుగా తప్పులు విజ్ఞాపన చేసేవాడు లేడని నా అభిప్రాయము. కోరివెళ్ళి నేను తప్పులు పట్టలేదు. గ్రామ్య భాష దిక్కుమాలిన స్త్రీ. ఆమెను పండితులు నిష్కారణముగా దూషించి అవమానించగా కనికరించి ఫీజు లేకుండా ఆమె తరఫున వకాల్తీ పట్టితిని. సమయా సమయము లలో ఆమెను అవలంబించిన వారే తిట్టడము భావ్యము కాదంటిని. వకీలుకు యేమన్నా చెల్లుతుంది గాని, అంత అధికారముండే నేనేమంటిని. ఒక్క దూషణ వాక్కు పలకలేదే! నన్ను, మృదువు తప్పితినని నిందించుట మొగనికొట్టి మొగసా లెక్కినరీతి నున్నది. ఆకాశరామన్న గారు పేర్కొనిన వారలలో శ్రీ బ్రహ్మయ్య, సుబ్బారావు పంతులు గారి యెడల నాకు భక్తి కలదు. శ్రీ లక్ష్మణరావు గారు నాకు ముఖ్య మిత్రులు. వారి విద్యను, దేశాభిమానమును నే నెరిగి వున్నట్టు ఆకాశరాములు యెరగరేమో! శ్రీ బాలకవి గారు యింకా ముందుకు రావలెనని నిర్వ్యాజమైన ఆసక్తి నాకు కలదు గాని, గ్రంథకర్తలు విమర్శనమునకు వెరచితే, భాష అభివృద్ధి అగుటయెట్లు? నవ్వుల వల్ల విమర్శనము యొక్క వాడి మొరపోవునని ఇంగ్లీషువారి సిద్ధాంతము. తలవరి వలె ముఖము మాడ్చుకొని పీక ఉత్తరించడము నాకు చేత కాదు. విమర్శనా పద్ధతులను గూర్చి యింకొకమాటు చర్చించెద.
29-12-2010.
ఆంధ్రకవితాపిత - 1
“ధరణి వడంకె, ధూళిదీవిదన్నిన భానుని గానరాదు.” 'కాటమరాజుకు కర్ణుడోడె
“నన్నయభట్టు ప్రథమాంధ్రకవియేనా?” అని ప్రశ్న వేసుకొని, మా మిత్రులు శ్రీ లక్ష్మణరావు గారు రెండు వ్యాసములు వ్రాసిరి. చదీవి సంతోషించినాను. వొకప్పుడు నేను కూడా నన్నయను గురించి విపులముగా రాయదలచి యుంటిని. మా మిత్రులు శ్రీ జయంతి రామయ్య పంతులు గారు కూడా రాయదలచీరని విని, ఆగితిని. వారే రాసినచో, యితరులకు వ్రాయవలసినది అట్టే మిగిలియుండదని నా నమ్మకము.
కానీ, ఢంకా దెబ్ళ విన్న తరువాత యుద్ధంలో జొరకనిల్పడం కష్టం! ఫలితము రెండు తెగల వారివల్లనూ దెబ్బలు తినడమే కావచ్చును. అదీ ఒక ముచ్చటే!
లోకం పుట్టిన దగ్గరనుంచీ, లోకులు ప్రాణం పెట్టి దెబ్బలాడే అన్ని వివాదాంశములూ, కొంచెం నిదానించి చూస్తే, 'అవునూ- కాదూ', కూడా అని తేలుతవి. ఈ రహస్యమును మా మిత్రులు లక్ష్మణరావు గారు గ్రహించి నన్నయ వాదానికి తగిలించినారు. యిట్టి తీర్పులలో తేటతెల్లమైన మేరుగొకటి కలదు. నీజం యెటు ప్రక్కను వున్నా, మన ప్రక్కన కూడా వుండక తీరదు. మా మిత్రుల అభిప్రాయముతో నేను పూర్ణముగా యేకీభవింతును. గానీ వొకరు అన్నమాటే మనం కూడా అనడం సొగసుకాదనీ తోచి, కొత్తమాట యేమైనా అందామని విశ్వప్రయత్నం చెయ్యగా, ఒకటి దైవవశాత్తు స్ఫురించినది.
అదీ యేమనగా, “నన్నయ ప్రథమాంధ్రకవి అవునన్న మాటా, కాదు. వాడన్నమాటా, కాదు. యిదీకాక అదీ కాకపోతే, అయినమాటేది? యేదా? చెవిఒగ్గి వినండి. “మనకు తెలియదన్నమాట!” దేనికైనా సందేహం వుండవచ్చును గానీ, దీనికి సందేహం వుండబోదు. యీ మట్టుకైనా తెలియడమన్నది సామాన్యమైన మాటకాదు. వెనుకటికి, గ్రీకులలో సొక్రెటీసనే పండితాగ్రేసరుడు వుండే వాడు. అతనికడకు పోయిమనబోట్లడిగిరట : “యేమయ్యా లోకానికల్లా నీవే మహా జ్ఞానీవని ఒక దేవత చెప్పినది. మాకన్న నీకు తెలిసిన దేమిటి? సోక్రటీసనేనట : “నాకు యేమీ తెలియదు. ఆ సంగతి మట్టుకు నాకు తెలుసును. మీకైతేనో, ఆ తెలియదన్న మాటా తెలియదు. అదే, నా ఆధిక్యత కావచ్చును.” ప్రథమంలో తీర్పు చెప్పి వేశాం గనుక, యిక ఆ తీర్పు నిలబెట్టుకోవడమునకు తగిన యుక్తులు కల్పించుకుందాము. ప్రపంచము యే రీతిని వున్నా ఆ రీతినే అది వుండడమునకు మనము ఒడబడ వలసి వచ్చిందిగదా అని లోకంలో పుట్టిన పండిత పామరులు ప్రతి వారికీ, ఒకప్పుడైనా విచారం పొడమక మానదు, “యిది యిలా వుంటే బాగుండును" అని మనకు తోచినపుడల్లా, లోకం యొక్క స్థితిలో సంతుష్టి లేక దానిని మరమ్మతు చేయడపు వూహ మనకు కలిగినదనే అర్థము. మాట లన్నవి ప్రపంచములోనివేగనుక, సృష్టి యావత్తువలెనే అవి కూడా లోపములతో కూడియుంటవి.
ప్రాయేణ సామ్యగ్ర్య విధౌగుణానాం పరాఙ్ముఖీ విశ్వసృజః ప్రవృత్తిః||
విద్వాంసుల జుత్తులు తెగిపోవడము, యీ శబ్దముల వల్లనే, రామన్న గారు ఒక మాటకు, ఒక అర్థం చేసి, ఉపన్యాసం ఆరంభిస్తారు. ఆ అర్థంతో నాలుగు వాక్యాలు నడచిన తరువాత, అయిదో వాక్యంలో మరో అర్థం అందుకుంటారు. మరి పది పంక్తులైన వెనుక మరియొక అర్థాన్ని దాటుతారు. అలా కోతి, చెట్టు మీద నుంచి చెట్టుమీదికి దాటునట్టు, అర్థం మీద నుంచి అర్థం మీదికి దాటి, తుదకు సిద్ధాంతం చేసే వేళకు "మొదటి నుంచీ, ఈ చెట్టు మీదే ఉన్నామయా” అంటారు కృష్ణయ్య గారు, ఆ అర్థాలలో వొక అర్థం తీసుకొని పచ్చడి చేసి విడచి పెడతారు. తరువాత, ఆ వాదములో జొరబడే పెద్ద, పిన్నలు తలొక అర్థం లాగుతారు. తుదకు అర్థం అనర్థ మవుతుంది. యిది లోకపాటి.
నేను లోకంలో వాడనే అవుటను దాట్లు వెయ్యడంలో ప్రవీణుడనే. మీరంతా వున్నారు కనుక, అట్లా దాట్లు వేసేటప్పుడల్లా హుంకారం చెయ్యండి. ఈ కట్టుదిట్టంతో చర్చ వుపక్రమిత్తాం.
కవి అనగా యెవరు? ఒక అర్థము ఒట్టో, గట్టో నాలుగు పదాలు అల్లినవాడల్లా కవియే అని. ఈ అర్థమున నన్నయ్య ప్రధమాంధ్రకవి కాడనుకుంటాను. కిందటి సంవత్సరము మా మిత్రులు కృష్ణశాస్త్రిగారు వ్రాసిన శాసన పరిశోధన రిపోర్టులో 3, 81, 82వ పేజీలలో వుదహ రించబడిన యుద్ధమల్లుని శాసనము, మా మిత్రులు వ్రాసియున్నట్టు ఛందోబద్ధముగానే వున్నది.
స్వస్తినృపాంకు సాత్యన్తవల్లల నత్యత్రిణేత్ర విస్తర శ్రీ యుద్ధమల్లుణ్ణ నవద్య విఖ్యాతకీర్తి ప్రస్తుత రాజాశ్రయుణు ద్రిభువనాభరణుణ్ణు సకల వస్తుసమేతుణ్ణు రాజసర్కి భూవల్లభుణ్ణర్థిన్।
ఇది మొదటి పద్యము మధ్యాక్కర. నన్నయ అక్కర లందువలెనే, దీని యతి అయిదవ గణమున నిలిచినది. ప్రతి అర్ధము చరణమునా, మూడవగణమున బ్రహ్మ గణము అనగా
సూర్యగణము గాని, సగణ, గగములు గాని అయివుంటుంది. ఆంధ్రకవితా పిత - 2
ఈ నెల 2, 5 తేదీలను శ్రీ కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రులు వారును, శ్రీ తేకుమళ్ళ రాజ గోపాలరావు పంతులు గారును, శ్రీ కోటీశ్వరశర్మగారును శశిలేఖలో ప్రచురించిన జాబులను చదివితిని. శ్రీ బ్రహ్మయ్య శాస్త్రులు వారి లేఖ ప్రచురితమైన తరువాతనే కోటీశ్వరశర్మ గారి లేఖ ప్రచురమాయెను.
“ప్రమాదో ధీమతామపి” అని శర్మగారు వ్రాసిరి. "ప్రమాదో ధీమతామేవ" అని నేనంటాను. నేలను నడిచేవాడికి మీది నుంచి పడడమనేది వుండదు. విపులమైన విచారణ చేసి వ్యాసములు రాసేవారి అభిప్రాయములు ఒకప్పుడుకొన్ని తేలిపోవడము సహజము. అట్లు తేలిపోవడం వల్ల ఆ గ్రంథకర్తల ప్రతిష్టకు ఒక లోపము లేదు. లోపములన్నవి యవరు పడితే వారు పట్ట గలరు. అది యొక గొప్ప ప్రజ్ఞ కాదు.
బ్రహ్మయ్య శాస్త్రులు గారికి ఇదమిద్ధం అని శాసించి రాయడం కొంత అలవాటను కుంటాను. అది వక తప్పుగా నేను యెంచను. "సంశయాత్మా వినశ్యతి" అన్నాడు. తన శక్తి యందు తనకు నమ్మకం లేనివాడు గట్టిపని యేదీ చెయ్యలేడు. వివాదాస్పదమైన చిక్కు అంశ ములలో ధైర్యముతో యేదో వొక తోవతొక్కిన వాడల్లా లోకోపకారి. నిజము తేలుటకు అది వొక సాధనము. విక్రమార్క “సంవత్" ఉత్పత్తిని గురించి యడతెగని వివాదం ప్రబలియున్న రోజులలో శిల్పకళాకుశలులయిన ఫెర్గ్యూసన్ దొర యేమి నిర్ణయము చేసెనంటే, "విక్రమార్క శకారంభ కాలమందు విక్రమార్కుడనే రాజు వుండి వుండలేదు. మరి ఆరువందల సంవత్సరముల వెనుకనుండెను. జ్యోతిషముతో సంబంధించిన గణనలకొరకు శకారంభ కాలము ఆరువందల యేండ్లు వెనుకకు జరిపెను" అని. ఇట్టి సిద్ధాంతము తత్వ నిర్ణయమునకు సహకారి అని కీర్తి శేషులైన మాక్సుముల్లరు దొరవారు వాటిండియా టీచస్ అజ్ (What India Teaches us) అను గ్రంథమున మెచ్చి వ్రాసి ఆ సిద్ధాంతము ననుసరించి కొందరు సంస్కృత కవుల కాలమును యేర్పరిచిరి. ఇది కాదనువారు క్రీస్తు శకము 544కు ముందు “సంవత్" వాడుకొనునటుల రుజువు చూపుదురు కాక! యనిరి.
అంతట కీల్హారన్, బూలర్ అను జర్మను పండితుల బట్టి నిదర్శనములను చూపిరి. వాటిండియా టీచస్ అస్ (What India Teaches us) అను గ్రంథము రెండవ కూర్పులో మాక్సుముల్లరు (Max Muller) దొరగారు తమ వ్యాసమును విసర్జించిరి. అటులనే బ్రహ్మయ్య శాస్త్రులు గారు కూడా బెజవాడ శాసనము విషయమై తమకు నిజము తెలిసిన వెంటనే సవ రణను ప్రచురించిరి. పండితులు మరివకలాగు యెందుకు చేతురు? బెజవాడ శాసనము ఛందోబద్ధమైతే యేమొచ్చె? కాకపోతే యేమొచ్చె? అది యవరూ చెప్పరు. అసలు శాసనమును "అందున్నవి సౌష్టవము లేని వచనములు" అని బ్రహ్మయ్య శాస్త్రులు గారున్నూ 'యిందలిది భాష కాదు' అని రాజగోపాలరావు గారును దించివేసిరి. గ్రాంథిక భాష మారుననుమాట నమ్మని వారేమందురో!
ఈనాడు చుట్టు చూపూ, వెనక చూపూ లేని విద్యను విద్యగా పరిగణించరు. చుట్టు చూపు అనగా సరిపోల్చి తారతమ్యము తెలిసి చదువుట. ఒక దేశపు చరిత్ర బాగా తెలియవలెనంటే యితర దేశముల చరిత్రను కూడా నేర్చి చరిత్ర స్వభావమును గుర్తెరగవలె. వక భాషను బాగా తెలియవలెనంటే యితర భాషల చరిత్రము కొంత నేర్చి భాషా శాస్త్రము నెరుగవలె. నన్నయనాడు ఆంధ్ర కర్ణాటక భాషలు రెండును నేర్చిన కవులుండిరి. నాడు కన్నడ భాషా జ్ఞానమును వెలు తురును తెనుగుపై పరపి కొత్త సంగతులు తెలిపిన వారు శ్రీ రాజగోపాలరావుగారొక్కరు కనబడుచున్నారు. గాని నేను కర్ణాటక ఛందస్సును చాలా కాలము కిందటనే యెరిగియుంటిని. కన్నడ భాషను నేరనివారు కూడా కన్నడ ఛందస్సు సులభముగ గ్రహించుటకు సాధనము న్నది. మంగళూరు బేసిల్ మిషన్ ప్రెస్సులో అచ్చుపడిన నాగవర్మ ఛందస్సులో కన్నడ ఛందస్సును గురించిన్నీ, కన్నడ కావ్య ప్రపంచమును గురించిన్నీ విపులమైన వ్యాసములు ఇంగ్లీషున వ్రాయబడి యున్నవి. ప్రతి పద్యము యొక్క లక్షణము కూడా ఆ పుస్తకములో ఇంగ్లీషున తేటతెల్లముగ రాయబడినది. అక్కరల లక్షణము 102; 108 పుటలోనూ, అక్కరకె లక్షణము 109 పుటలోనూ అక్కరలలో వాడబడే గణములలో వివరము అయిదవ అధ్యాయారంభములోనూ యీయబడినవి. నాగవర్మ ఛందస్సున్నూ కర్ణాట సాహిత్య లక్షణ సంగ్రహమున్నూ కలిపి చెన్న పట్టణము గ్రంథ రత్నాకర ముద్రాక్షరశాలలో అచ్చుపడినవి. ఇందులో యింగ్లీషు లేదు. వెల తక్కువ. రెండవ నాగవర్మ కృతమైన కర్ణాట భాషాభూషణమనే వ్యాకరణమును రైస్ (Rice) దొరగారు. బెంగుళూరు గవర్నమెంట్ ప్రెస్ అచ్చువేసిరి. ఈ వ్యాకరణము సంస్కృత సూత్రములు వృత్తి కలిగి వున్నది. గ్రంథము రోమను అక్షరములతోను కన్నడ అక్షరములతోనూ కూడా అచ్చు అయి వున్నది. సంస్కృత మెరిగిన వారు యీ వ్యాకరణమును సులభముగా జదువుకోవచ్చును. ఈ పుస్తకములో నాగవర్మను గురించిన్నీ కన్నడభాష, కన్నడ కవులను గురించిన్నీ, కన్నడ కావ్య ప్రపంచమును గూర్చిన్నీ యింగ్లీషు వ్యాసములు కలవు. 6వ పుటకు యెదురుగనున్న పటములో కన్నడ లిపికి కలిగిన మార్పులు చూపబడినవి. నాలుగు అయిదు కాలములలోని అక్షరములను తైఫారు వేసి చూసిన యెడల తెనుగున కూడా తలకట్లెట్లు మారినవో తెలియవచ్చును. మైసూరు గవర్నమెంటు ప్రెస్ లో శ్రీ ఆర్. నరసింహాచారిగారు నాగవర్మకృత కావ్యాలోకనమును కర్ణాటక భాషాభూషణమును కలిపి ముద్రించినారు. యింగ్లీషున విపులమైన ఉపోద్ఘాతము కలదు. అందులో ఛందోంబుధి వ్రాసిన నాగవర్మా, కావ్యావలోక నాదీ గ్రంథములు వ్రాసిన నాగవర్మా భిన్నులని ఋజువు పరచిరి. కేశరాజు రచించిన శబ్దమణి దర్పణమను వ్యాకరణమును మంగుళూరు బేసిల్ మిషన్ ప్రెస్లో కిట్టెలు దొరగారు ముద్రించిరి. యిందు సూత్రములు కన్నడ పద్యములుగానున్నవి. సూత్రాథమింగ్లీషున మార్జినులో నీబడినది. భట్టకలంక దేవుని కర్ణాటక శబ్దాను శాసనము విపులమైన వ్యాకరణము. దీనిని రైస్ (Rice) దొరగారు మైసూరు గవర్నమెంటు సెంట్రల్ ప్రెస్ లో అచ్చు వేయించిరి. సంస్కృతమున సూత్రములు, వృత్తి వ్యాఖ్య కూడా కలవు. పుస్తకము రోమను లిపిని కన్నడ లిపిని కూడా అచ్చు అయినది. కర్ణాటక కవిచరిత మొకటి ఆర్. నరసింహాచారి గారు, యస్. నరసింహాచారి గారు మైసూర్ వెస్లియన్ మిషన్ ప్రెస్ లో అచ్చు వేయించిరి. (Wesleyan Mission Press Mysore) ఇంగ్లీషున ఉపోద్ఘాతము కలదు. నృపతుంగుని కవి రాజమార్గము కె. పాఠక్ గారు మైసూరు గవర్నమెంటు ప్రెస్ లో అచ్చు వేసిరి. విపులమయిన ఇంగ్లీషు ఉపోద్ఘాతము కలదు. గ్రంథము రోమను లిపిని కూడా అచ్చువేసి యున్నది. కెటిల్ దొరగారు కన్నడ, ఇంగ్లీషు నిఘంటువు రచించిరి. గురుజాడలు 574
ఆంధ్రకవితాపిత - 1 ఆంధ్ర కవితాపిత - 3
బెజవాడలోని యుద్ధమల్లుని శాసనము రాజరాజ నరేంద్రుని కన్న చాలా ప్రాచీనమనే నా అభిప్రాయము. లిపినిబట్టి ఆలా అనక తీరదేమో అనుకుంటాను. 1893 సంవత్సరములో గవర్నమెంటు యెపిగ్రాఫిక్ డిపార్టుమెంటు (Epigraphic Department) వారు ఈ రాతిపైని కాగితము ఒత్తి అచ్చు తీసిరి. (Estampa face) దానిని ఆ దరిమిలాను మా మిత్రులు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారితో కలిసి పరిశీలించియుంటిని. తరువాత ఆ శాసనపు రాతిని కూడా చూచితిని.
యెపిగ్రాఫిస్టు గారి 1893 సంవత్సరపు రిపోర్టులో 12వ పుటలో ఈ శాసనము గూర్చి యిట్లు వ్రాయబడి యున్నది. Telgu-In very archaic characters mentions the King's Grandfather Mallaparaju"
(తెనుగు చాలా ప్రాచీనమైన అక్షరములతో నున్నది. రాజు తాతమల్లపరాజని వున్నది.)
ఆ సంవత్సర మెత్తిన శాసనపు అచ్చు కాగితము విలియ కాగా యిప్పటి యెఫిగ్రాఫిస్టులును నా మిత్రులును అగు శ్రీ హెచ్చికృష్ణ శాస్త్రిగారు కిందటి సంవత్సరం తిరిగి ఒక అచ్చు యెత్తి ఆ శాసనమును గురించి వారి 1910 సం॥పు రిపోర్టు 2, 82, పేజీలలో వ్రాసిరి.
2వ పేజీలో దానిని గూర్చి "One of the earliest to lethic records written in Telugu Language in that part of the country" అని వ్రాసి (ఆ ప్రాంతమునందు వున్న మిక్కిలి ప్రాచీనమైన తెలుగు భాషలో వ్రాయబడిన శిలా శాసనములలో వొకటి)
82వ పుటలో :- "This epigraph may be roughly assigned to the 9th century of the Christian Era" (యీశాసనము అందిందుగా క్రీస్తు శకము తొమ్మిదవ శతాబ్దము నాటి దని చెప్పవచ్చును)
ఇలియటుదొర గారి తెనుగు శాసనములలో ఈ శాసనమును గూర్చి యిట్లు వ్రాయబడినది. గర్భాలయమునకు తూర్పున నంది మండపములో నందీశ్వరుని మంటపమునకు వుత్తరముగా వున్న తూము మీద అడ్డుగా వేసియున్న రాయిమీద శాసనము, ఈ రాతి పలకను తెలియని అక్షరములున్నవి. ఇలియటు దొరగారు నియోగించిన పండితులు పదకొండు, పన్నెండవ శతాబ్దముల శాసనములెన్నో సులభముగా భేదించిరి. ఈ శాసనమును భేదించలేకపోయిరి.
కృష్ణ శాస్త్రిగారి కోరికపైని ఈ శాసనపు రాయి బెజవాడ మ్యూజియములో భద్రపరచబడి అందరూ చూచుటకు అనువైయున్నది. అందలి అక్షరములను పదకొండు, పన్నెండవ శతాబ్దముల లిపులతో సరిచూసిన అవి పాతవని చూచినంతనే తెలియును. ఆ శాసనపు లిపిని పరీక్షించగోరిన వారికి బూలర్ దొరగారి ఇండియన్ పెలియాగ్రఫీ (Buhler's Indian Palaeography translated by Dr. Fleet) యున్నూ, బర్మల్ దొరగారి సౌతిండియన్ పెలియాగ్రఫీయున్నూ సహాయ పడును. మొదటి పుస్తకములోని పటములు జర్మను ప్రతిలోనే గాని యింగ్లీషు ప్రతిలో లేవు. ఆ పటములలో 8వ పటమున నాలుగు, అయిదు, ఆరు కాలములలో తూర్పు చాళుక్య లిపులీబడినవి. అందులో అయిదవ కాలములోని లిపి రెండవ అమ్మరాజు (A.D. 945- 970) శాసనము నుండి యెత్తబడినది. (ఇండియన్ యాంటిక్వరీ 7వ సంపుటము 15 పుట పటము 160వ పుటకు యెదుటనున్నది. ఆరవకాలములోని లిపి రాజరాజ నరేంద్రుని కోరుమిల్లి శాసనమునుంచి యెత్తబడినది. ఇండియన్ యాంటిక్వరీ 14వ సంపుట 48వ పుట.)
ఈ రెండు లిపులకును చాలా భేదము వుండబట్టే బూలరు దొరగారు అమ్మరాజ శాసనలిపికి, మధ్యకాలపు లిపి The middle variety అనిన్నీ, రాజరాజు కాలపు లిపికి పాత కన్నడ లిపి అనిన్నీ పేరుపెట్టిరి. ఈ పాత కన్నడ లిపి అన్న దానికే, బర్నలు దొరగారు ట్రాన్సిషనల్ Transitional character (మారుదల కాలపు) లిపి (ట్రాన్సిషనల్) అని పేరిడిరి. ఈ లిపి పదకొండవ శతాబ్దపు వేంగీ దేశపు శాసనములలో మొదట బయలు వెడలినది.
It first appears in the Vengi Inscriptions of the 11th Century Buhler's Indian Palaeography, Fleets translation p. 68.
అమ్మిరాజు నాటి లిపులకు రాజరాజునాటి లిపులకును గొప్ప భేదమొకటి యేదనగా, అమ్మిరాజుల నాటి లిపిలోని అక్షరముల తలకట్టు సూక్ష్మముగా శాణాంవలే నుండును (Wedge) రాజరాజు నాడు కొమ్ముల వలె తలకట్లు లేచి కోణము తేరినవి. రెండవ అమ్మరాజు శాసనముల పటములు యిండియను యాంటిక్వరీ 12, 13 సంపుటములలోనూ, బటర్వర్తు నెల్లూరు శాసనములు 1. సంపుట (Butterworth Nellore Inscriptions vol 1) 164 పుటలోనూ యీబడినవి. వీటి లిపిని కోరుమల్లి శాసనపు లిపితో సరిజూసి, ఆపైని యుద్ధమల్లుని బెజవాడ శాసనపు లిపిని పరీక్షించిన యెడల, అది రాజరాజు నాటికి ప్రాచీనమని స్పష్టపడగలదు. యెపిగ్రాపికా ఇండియా 5వ సంపుటములో 118 పుట వెనుక 6 తూర్పు చాళుక్య శాసనముల పటము లీబడినవి. వాటిలిపులు తొమ్మిది, పది శతాబ్దముల నాటివి. బూలర్ ఇండియన్ పెలియాగ్రఫీకి యింగ్లీషు తర్జుమా బొంబాయిలో యెడ్యుకేషనల్ సొసటీ ప్రెస్‌లో దొరుకును.
Educational society's Press Bombay, “శాసనమునందున్న పురుషులను బట్టి, కాలము తెలిసికొందుమనిన నట్లగుచో నీ శాసనము రాజరాజ నరేంద్రునకు దరువాత వ్రాయ బడినట్లు తోచు చున్నది. గానీ పూర్వము నందు వ్రాయబడినట్లు తోచుట లేదు. “శ్రీయుత అప్పారావు పంతులు వారీ శాసనము రాజ రాజ నరేంద్రునకు బూర్వముదని వ్రాయించిరి. కాని వారు వ్రాసిన దానితో నేనేకీభవింపజాలను” అని బ్రహ్మయ్య శాస్త్రులు గారు వ్రాసిరి.
ఇట్టి అభిప్రాయమునకు శ్రీశాస్రులు వారు చెప్పిన యుక్తులు యివి అని అనుకుంటాను: (అ) బెజవాడ శాసనములో శాసనకర్త పేరు మల్లుడు, యుద్ధ మల్లుడు అని కూడా వున్నది. తాతపేరు మల్లపుడు. ఇట్టి లక్షణము గల (యుద్ద) మల్లుడు రాజ నరేంద్రునకు బూర్వమునందు లేడు. (ఆ) ఈ శాసనమున పేర్కొన బడిన యుద్ధమల్లుడు తూర్పు చాళుక్యుడని వ్రాయబడి యుండలేదు. (ఇ) రాజరాజనరేంద్రున కిటీవల మల్లపు దేవుని మనమడైన మల్లుడొకడు కాన్పించుచున్నాడు. ఇతడు క్రీస్తు శకము 1202లో బరిపాలనము చేసినాడు.
బెజవాడ శాసనపు యుద్ధమల్లుడు క్రీస్తు శకము 927 నుండి 934 వరకూ తూర్పు చాళుక్యులసింహాసన మెక్కి పాలించిన యుద్ధమల్లుడయే వుండునని నా అభిప్రాయము.
శాస్రుల వారు పేర్కొనిన మల్లపుదేవుని శాసనము క్రీస్తు శకము 1202 నాటిది. ఆ సంవత్సరమున ఆ రాజు పిఠాపురమున పట్టాభిషిక్తుడాయెను. ఈ శాసనము యెఫిగ్రాఫిక్ ఇండియాలో 4వ సంపుటములో 231 పుటను ప్రచురింపబడినది. పటము ఆరవ సంపుట 270 పుటను కలదు. ఈ శాసనపు లిపి బెజవాడ శాసనపు లిపితో చేర్చి చూసిన వెంటనే దీని కొత్త బయలుపడును. గాన నీమల్లపను గూర్చి చర్చించుట అనవసరము. అయినను పిఠాపురపు శాసనపు తెలుగు భాగము మొదటను, మల్లప పేరిట్లీ బడినది. 86 పంక్తి “స్వస్తి శ్రీ సర్వలోకాశ్రమ శ్రీ విష్ణువర్ధన మహారాజులైన మల్లపదేవ చక్రవర్తి" బెజవాడ శాసనములో ఈ రీతిని లేదు. ఆంధ్ర కవితాపిత - 4
యుద్ధమల్లుని కధ యించుక ముచ్చటింతము. హియంతసాంగుడను చీనా దేశపు బౌద్ధ పండితుడు యేడవ శతాబ్దారంభ మందు మన దేశమునకు వచ్చెను. అప్పుడు దక్కను దేశమును చాళుక్య రాజగు రెండవ పొలికేసి, సత్యాశ్రయుడు పాలించుచుండెను. అతను ఆంధ్ర దేశమును జయించినట్లు అయిహోవి శాసనమందు జెప్పబడినది. (ఎపిగ్రాఫికా ఇండియా 6వ సంపుటలో 1, 12 పుటలు) యీ శాసనకావ్యకర్త రవికీర్తి అనే జయనుడు. సంస్కృత కవిత్వమందు అభిరుచి కలవారీ శాసనము చదవవలెను. సత్యాశ్రయుని తమ్ముడు కుబ్జ విష్ణు వర్ధనుడు తూర్పు చాళుక్యశాఖకు మూల పురుషుడు. ఇతని సంతతిలో కవి విష్ణువర్ధనుడనెడి రాజు క్రీస్తు శకము 843-844లలో పద్దెనిమిది మాసములు రాజ్యము చేసెను. యీ కవి విష్ణువర్ధనునికి ముగ్గురు కొడుకులు. జ్యేష్టుడగు గుణక విజయాదిత్యుడు 844 నుండి 888 వరకు 44 వత్స రములు పాలించి, సంతానము లేకుండా గతించినట్లు కనబడును.
అతని తమ్ములు మొదటి విక్రమాదిత్యుడు, మొదటి యుద్ధమల్లుడు. ఉభయులకూ సంతతి కలిగియుండెను. ఇక జట్టీలకు కొదవేమిటి?
గుణకుడు గతించగానే విక్రమాదిత్యుని కొడుకు మొదటి చాళుక్య భీముడు రాజ్యమునకు వచ్చెను. ఇతనికి దాయదుల వల్ల చిక్కులు కలిగినట్లు శాసనముల వల్ల కనబడును. ఇతని కాలానకు పశ్చిమ చాళుక్య రాజ్యము అంతరించి, మన్యభేట రాష్ట్ర కూట రాజులకు చేరినది. పశ్చిమ దేశం యేలే ఈ రాష్ట్ర కూటులకున్నూ, తూర్పు చాళుక్యులకున్నూ అనుశ్రుతమైన వైరమున్నట్లు కానవచ్చుచున్నది. పూర్వ చాళుక్యరాజుల దాయాదులను కొందరిని వెనక వేసుకొని ఈ రాష్ట్ర కూట రాజులు వేగి దేశముపై దండెత్తి వచ్చు చుండిరి. మొదటి భీముడు రాష్ట్ర కూటరాజగు రెండవ కృష్ణునితోనో, తన దాయాదులతోనో యుద్ధము చేసి జయించి నట్లు నాకు దొరికిన కశింకోట శాసనములో వ్రాయబడినది. యీ దాయాదులలో భీమునికి పినతండ్రి అయిన యుద్ధమల్లుడు గాని అతని కుమారుడు తాడపుడు గాని వుండివుండవచ్చును. ఇది వూహ. భీముడు 888 నుంచి 919 వరకూ 30 సంవత్సరములు పాలించెను. ఇతని అనంతరము ఇతని పెద్దకొడుకు కొల్లభిగండ విజయాదిత్యుడు ఆరు మాసము లేలెను. తదనంతరమతని పెద్ద కుమారుడు మొదటి అమ్మరాజు 925 వరకు ఏడేళ్ళేలెను. ఇతని కుమారుడు బాలుడైన బేతవిజయాదిత్యుడు పదిహేను రోజులు ఏలెను. ఇతనిని కంఠికా విజయాదిత్యుడందురు.
ఈ ప్రకారము మొదటి భీముడి సంతతిలో, అతని మునిమనమడి వరకూ రాజ్యము వచ్చెను. అంతట భీముడి పినతండ్రియు మొదటి యుద్ధ మల్లుని కొడుకును అగు తాళపరాజు, బాలుడగు కంఠిక విజయాదిత్యుని తొలగించి, రాజ్యమాక్రమించుకొని ఒక్కనెల రోజులు యేలెను. (మొదటి భీముని పెద్ద కొడుకగు కొల్లభిగండ విజయాదిత్యుని సంతతి వారు రాజ్య భ్రష్టులై యేమీ చెయ్యజాలక ఊరకుండిరి గాని) భీముని రెండవ కుమారుడైన రెండవ విక్రమాదిత్యుడు తాళప రాజును చంపి, రాజ్యమాక్రమించి, పదకొండు మాసములు రాజ్యము చేసెను. అంతట రాజ్య భ్రష్టుడైన బేత విజయా దిత్యుని తమ్ముడొకడు, మూడవ భీముడనువాడు, తన పినతాత అగు రెండవ విక్రమాదిత్యుని జయించి ఎనిమిదిమాసములు రాజ్యము చేసెను. ఆ వెనుక యీ మూడవ భీముని కొట్టి తాళపరాజు కుమారుడగు రెండవ యుద్ధమల్లుడు రాజ్యమును ఆక్రమించు కొని 927 నుండి 934 వరకు యేడేండ్లు యేలెను.
యిది బీరకాయపీచు. ఈ యుద్ధమల్లుడే బెజవాడ శాసనపు యుద్ధమల్లుడు కావచ్చునని నా అభిప్రాయము. ఇతనికి దాయాదులు మనకు తెలిసిన వారెవరనగా :-
1. మొదటి భీముని మనుమడు రాజ్య భ్రష్టుడైన బేత లేక కంఠికా విజయాదిత్యుడు;
2. పదకొండు మాసములు రాజ్యము చేసి తాళప రాజు వలన తొలగింపబడిన బేత విజయాదిత్యుని పినతాత రెండవ విక్రమాదిత్యుడు;
3. కంఠికా బేతవిజయాదిత్యుని పినతండ్రియగు రెండవ భీమరాజు.
క్రీస్తు శకము 934లో ఈ మూడవ దాయాదియగు రెండవ భీముడు యుద్ధమల్లుని జయించి దేశము నుండి వెడలగొట్టినట్లు శాసనముల వల్ల కనబడును. (Epigraphica In- dica Vol. VII P. 181 ; Vol. IX P. 49. Nellore Inscriptions Vol.I. P. 170, 171)
రెండవ భీమునకు రాజ్యము సులభముగా సంప్రాప్తము కాలేదు. అతని శత్రువులకు రాష్ట్రకూట రాజగు నాలుగవ గోవిందుడు తోడ్పడెను. రాజ్యకాంక్షులై పోరిన దాయాదులతో యుద్ధమల్లుడు (Nellore Inscriptions Vol. I pp 170, 171; Epigraphica Indica Vol VII P. 181) కంఠికవిజయాదిత్యుడును జేరియుండిరి. ఇతర శత్రువులు యవరనిన, రాజమయ్య, ధళగ తాత బిక్కి, బిజ్జి; అయ్యప; లోవబిక్కి, వీరిలో తాతబిక్కి బేతవిజయాదిత్యుని పినతాత అయిన విక్రమాదిత్యుడని నేను పోల్చినాను. ఒక శాసనములో ఇతని పేరు తాత బిక్క్యన అని వున్నది. పశ్చిమ చాళుక్య రాజగు ఆరవ విక్రమార్కుని శాసనములలో విక్కలన్ అనుటకలదు. కంఠిక విజయాదిత్యుని, యుద్ధమల్లుని, రెండవ భీముడు దేశము నుండి తొలగించెనంటిమి. ఈ బేతవిజయాదిత్యుని సంతతి తూర్పున చేరి, గాంగులతో సంబంధములు చేసి, తిరిగీ కొంత కాలమునకు తలయెత్తినట్లు కనుపడును. Indian Antiquary Vol. XX.p. 267-268 అటువలెనే యుద్ధమల్లుని సంతతి కృష్ణా జిల్లా ప్రాంతమందు రాష్ట్ర కూటుల సహాయము వలన కొంత రాజ్యము కల్పించుకొని కొంత కాలము మన్నినట్లు కనుపడును. యిందుకు ఆధారము యెపిగ్రాఫిస్టు గారి 1909 సంవత్సరపు రిపోర్టులో చెప్పబడిన గుంటూరు శాసనము (Pages 109; 110). శాసనకర్త విష్ణువర్ధన తాళరాజు. ఇతని వంశము పూర్వ చాళుక్య వంశము. ఇతను పైని చెప్పిన పూర్వ చాళుక్య రాజగు తాళపరాజు సంతతిలోని వాడు. ఈ శాసనములో మొదటి తాళపరాజు మొదటి భీముని తమ్ముడని వ్రాయబడియున్నది. పినతండ్రి పెత్తండ్రి బిడ్డలను, అన్నదమ్ములను వాడుక మనదేశమున నున్నది. మొదటి తాళప కుమారుడు యుద్ధమల్లుడు. ఇతనికి యిద్దరు కుమాళ్ళు. మహారాజాధిరాజ పరమేశ్వర బాడబరాజు, విష్ణువర్ధన తాళరాజు.
గుంటూరు ప్రాంతమందు రెండవ యుద్ధమల్లుని సంతతి వారు రాజ్యము చేసి యున్నప్పుడు ఆ కాలపు లిపినివున్న బెజవాడ శాసనములోని యుద్ధమల్లుడు పూర్వ చాళుక్యులలోని యుద్ధమల్లుడయి వుండడనుటకు కారణములు నాకు కానరాలేదు.
ఇక పేరులకా? యుద్ధమల్లుడను పేరు “మల్ల, మల్లప" అనియు, తాళరాజను పేరు, "తాహ, తాళప, తాలప, తాల, తాడప" అనియు శాసనములలో కానవచ్చు చున్నవి. నేను పైనుదహరించిన శాసనములే ప్రమాణము.
కన్యాశుల్కము
మంచి నాటకముల గనుట, జదువుట, కన్న విద్యాభిమానులకు ఎక్కుడు ఆనందముండ బోదు. అట్లు చూచుచు, చదువుచు, నుండునపుడు మనము భగవన్నిర్మాణమగు నీమాయా ప్రపంచమును మరచి కవి నిర్మాణమగు మరియొక మహా మాయా ప్రపంచమలో నానంద మగ్నులమై యుందుము. సాధారణ నాటకములెల్ల నిటుల నానందజాయకములగునపుడు ప్రతిభావంతులగు కవిశ్రేష్ఠుల నాటకముల మాట చెప్పనేల? మ.రా. శ్రీ. గురజాడ అప్పారావు పంతులు బి.ఏ. గారు రచించిన యీ నాటకమును పోలిన నాటకములు ఆంధ్రభాషలో లేవు. కథాకల్పన, పాత్రరచనా చమత్కృతి, రసపుష్టియు, నీ నాటకమున శ్రేష్ఠతరముగ నున్నవి. వీరికి హూణకవిశ్రేష్ఠుల కలాకౌశలము పూర్ణముగ పట్టుపడుటంజేసి, వీరు ఆపూర్వగ్రంథరచనచే నాంధ్రభాషా వధూటి నలంకరించిరి. ఈ నాటకము DTF 2వ సంవత్సరమున నైదకంములుగా రచింపబడి, రాజర్షులును, విద్యా భోజులును, పండిత పోషకులునునగు శ్రీ ఆనందగజపతి మహారాజావారలకు అంకిత మీయబడినది. అచ్చుపడిన కొద్ది వారములలో నన్ని ప్రతులును చెల్లుటయే కాక, పత్రికాధిపతులు ఈ నాటకమును వేనోళ్ళ పొగడిరి. ఇన్నాళ్ల వరకు రెండవ కూర్పు అచ్చొత్తించక పోవుటకు కారణము మన దేశములో గ్రంథముల నచ్చాత్తించి యమ్ము పడివాటుల భీతియే యని గ్రంథకర్తగారు ఉపోద్ఘాతమున వక్కాణించిరి. ఈ మాట యెంత నిజము! కొందరి స్నేహితుల ప్రోద్భలమున నీ రెండవ కూర్పిప్పుడచ్చొంతించిరి. రెండవ కూర్పులో నాటకమును మిక్కిలిగ మార్చి, అయిదంకములను యేడంకములుగ పెంచిరి. ఈ నాటకము గ్రామ్యభాషను వ్రాయబడి పండిత పామరులకు ఆనంద జనకమై యున్నది. గ్రంథకర్త గారు గ్రామ్యగ్రాంథిక భాషల తారతమ్యముం గూర్చి ఆంగ్లేయ భాషను విపులమగు క్రోడము వ్రాసి, నాటకమునకు ఉపోద్ఘాతముగా నచ్చొత్తి, వారి పాండిత్య ప్రకర్షను గనపరచిరి. వీరి నాటకమున గ్రామ్యభాష కెంతయో వన్నె తెచ్చి, రసానుగుణ్యముగ పలికించీరనుటకు సందీయము లేదు. ఇటులనేకదా ప్రాచీనకవులు ప్రాకృత భాషల యందు కావ్యములు వ్రాసిరి. ఆప్రాకృతములే యిప్పుడు బంగాళీ, ఓత్రము, మహారాష్ట్రము, మున్నగు భాషలుగా మారినవి. ఇప్పటి యీ వ్యావహారిక భాషలలోనే ఆయా దేశపు కవులు ఉద్ధంథముల వ్రాసి, ఆయా భాషలకు వన్నె తెచ్చిరి. ఆంధ్రమున గ్రామ్యగ్రాంథిక భాషల తారతమ్యమెటుల నున్నను, హాస్యరస ప్రధానములగు నాటకములు గ్రామ్యభాషనే వ్రాయనగుననుటకు అంగీకరించని వారు ఉండబోరు. స్వభావము ననుసరించి వాడుకలో నుండు మాటలతో వ్రాయబడుటం జేసి, యీ నాటకమున భాష ముద్దులు మూటకట్టుచున్నది. కన్యాశుల్కమున కాశించి వృద్ధులకు పిల్లలనిచ్చు దురాచారమును మాన్పుటకై యీ నాటకము వ్రాయబడినది. కృష్ణారాయపురమను నగ్రహారమున నగ్నిహోత్రావ ధానీ యను బ్రాహ్మణుడు కలడు. ఆయనకిద్దరు పుత్రికలు. పెద్దపిల్లను కన్యాశుల్కమున కాశించి వృద్ధున కొకనికి కట్టబెట్టుటంజేసి, ఆమెకు బాల్యమునందే వైధవ్యము సంభవించినది. అంతటను బుద్దిరాక రెండవ పిల్లను గూడ లుబ్ధావధానులను నొక ముసలివానికి పెండ్లి చేయుటకు అవధానులు గారు తలపెట్టిరి. ఈ వివాహము విఘ్నముచేయుటకుగాను ఆయన బావమరది యగు కరటకశాస్త్రి తన శిష్యునకొకనికి స్త్రీ వేషము వేసి తక్కువ వెలకు ఆ లుబ్ధావధానులకు పెండ్లి చేయును. వివాహమైన కొద్ది దినములలో నా శిష్యుడు వేషము విప్పి పారిపోవును. ఇటుల పెండ్లికూతురు అదృశ్యముకాగానే, ప్రాణహత్య జరిగినదని పోలీసువారు క్రిమనలు కేసును లేవనెత్తుదురు. ఈ రసకందాయములో నగ్నిహోత్రావధాని పుత్రునికి విద్యనేర్పు గిరీశ మను మోసగాడొకడు అవధానులుగారి జ్యేష్ఠపుత్రికను పెండ్లికిబోవు మార్గమధ్యమున లేవతీసుక పోవును. దీనంజేసి చిలవపలవలుగ కోర్టు చిక్కు లెన్నియో పుట్టి, న్యాయమార్గానువర్తియగు నొక బ్రాహ్మణోత్తమునిచే బాపబడును. గ్రంథము చదివి చూడవలెగాని, చెప్పి తెలుపశక్యమైనది కాదు. షేక్స్పియరు మహాకవి నాటకములలోని ఫాల్ స్టాఫ్ అను పాత్రమువలె, నీ నాటకమున గిరీశమను నతడు నవ్వులబండి. కావ్యగుణములన్నిటికన్నను లలితమగు హాస్యరసము కష్ట సాధ్యమని యాంగ్లేయ పండితుల యభిప్రాయము. అట్టి సరసమగు హాస్యము యీగ్రంథమంతట నిండియున్నది. కాన నీకవిని ఆంధ్రమోలియరని యనతగియున్నది. అంకితమును, ఉపోద్ఘాతము లును ఇంగ్లీషు భాషను వ్రాయబడియున్నవి. తెనుగున వ్రాసిన బాగుండునని మా యభిప్రాయము. ఈ గ్రంథమును ఆనందగజపతి మహారాజుల సుందరరూపమును తెలుపు పొటిపొకటి యలంకరించుచున్నది. గ్రంథము వెల ౧౨ అణాలు. ఇది చెన్నపురి ఎప్షనేడులో సంస్కృతాంధ్ర గ్రంథముల విక్రయించు వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు వారి షాపునను, తెలుగు దేశమునగల రెయిలు స్టేషనులలో హిగ్గిన్ బాతం కంపెనీవారి పుస్తకముల యంగళ్ళవద్దను దొరుకును. ప్రఫుల్ల లేక రాణీ చౌదరి (బంకించంద్రుని నవలారచన)
ఒకరివెనకొకరు ఆడపిల్లలీగ్రంథమును చదువుచున్నారు. ఈమాట వొక్కటియే దీని విలు వను తెల్పజాలును. శ్రీసుబ్బారావుగారు ఇంగ్లీషునుండియో, కన్నడమునుండియో తెనిగించిరని నాజ్ఞాపకము. మన తెనుగుదేశమున కెంత దురవస్థ! బంగాలీ గ్రంథముల చదువు నేర్చిన కవి మనలో వొక్కడు లేడుగదా?
నూరు సంవత్సరము క్రిందట బంగాళీ విద్వాంసులు, బంగాళీ భాషలో వ్యాకరణము గాని, నిఘంటువు గాని లేకుండుట గాని, గత యాభై, అరవై ఏళ్ళలో బంగాళీ వాడుక భాష నుండి ఒక సులభమైన గ్రాంథిక భాషను కల్పించుకొని, లోకములో యెన్నిక కెక్కిన గ్రంథ ప్రపంచమును కల్పించిరి. ప్రక్కనున్న వారిని చూచి నేర్చుకొను నేర్పయినను మనకు లేదాయెను. ఇకనైనను మనలో బుద్ధిమంతులు బంగాళి భాష నేర్చి, దానగల మంచిని తెనుగునకు కూర్తురు గాక.
సుబ్బారావు గారి శైలి చిన్నయ్యసూరిగా రేర్పరిచిన త్రోవనున్నది. ఆ శైలిని వీరి రచన మిక్కిలి రసవంతముగా నున్నది. అసమానమే అనవచ్చును. 45వ పుటలో "ప్రఫుల్ల ముఖ దిగ్రమముజెంది" అని ఆరంభమైన వాక్యకదంబమును చదివిన శ్రీ సుబ్బారావు గారి రచనా సామర్థ్యము తెలియును. వీరి శైలిలో రెండు దోషములు నాకు కనపడ్డవి. అనవసరమైన సంస్కృత శబ్దములును, వాడుకలోలేని తెనుగు మాటలును గ్రంథమందు నిండియున్నవి. సంస్కృత వ్యాకరణము నేర్చకుండా పాత గ్రాంథిక శయిలిలో వ్రాయబూను వారికి కలుగు స్టాలిత్యములు శ్రీ సుబ్బారావుగారికి కూడ కలిగినవి. మొదట అధ్యాయముల సంఖ్య వీరు సంస్కృత పదముల నిచ్చిరి. అందు షష్టమాధ్యాయము, చతుర్దశమాధ్యాయము, ఏకాదశమాధ్యా యమను ప్రయో గములు దొర్లినవి. అది తెలిసి కానోపును. రెండవ భాగములో అధ్యాయముల సంఖ్య తెనుగు పదముల నిచ్చియు, అందులో సప్తమాధ్యాయమునకు మాత్రమే తత్సమము వుంచిరి. వీరు కొన్ని చోట్ల వాడుకలో నున్న తత్సమదేశ్య శబ్దముల విడిచి, అంతరించిన తద్భవశబ్దములను వాడియున్నారు.
రెండవ దోషము : అక్కడక్కడ అనుప్రాసమును వొత్తుగా తగిలించుట (అ) “ఇంక నేమే మింబెట్టుకో, తిట్టుకో, భూషించుకో, దూషించుకో” (ఆ) కెంపు పెంపు గల, "కెంపు సొంపు నింపు నధరంబు, కుందముల యందము డిందుపడంజేయు ద్విజాలియు” (ఇ) “అత్తరు ణీతరుణుల మనముల గలిగిన దలపులు వలపుల పొలుపులు దెలుపవశమగునె” (ఈ) "పెచ్చు పెరిగి విచ్చలవిడి పచ్చవిల్తు డొచ్చము లేక.” ఇప్పుడు మన పత్రికలలో రెండు విమర్శన మార్గములు కనబడుతున్నవి. ఇష్టులైన కవులను పొగిడి వారి గ్రంథములందు తప్పులెన్నక పోవడము, అయిష్టులగు కవుల గ్రంథములయందు వున్నవి లేనివి తప్పులే యెన్ని, గుణములను మరుగు పరచడము. ఇంతకన్న భాషకు కీడు వుండబోదు. తప్పులని నాకు తోచినవి కనపరిచి నందుకు శ్రీ సుబ్బారావుగారు నన్ను క్షమింతురుగాక. కథ యొక్క గుణదోషములు బంకిం చంద్రులవి. కీర్తిశేషులైనవారి తప్పులెన్నినను చిక్కుకలగబోదు. బతికివున్న కవులకు శ్రాద్ధము పెట్టడము, చచ్చిన వారికి వర్ధంతులు చేయడము, యీనాడు మనవారి కలవాటైన ఈ పద్ధతి తలకిందులు చెయ్యడము వల్ల భాషకు కొంత మేలు కూడునని నా అభిప్రాయము.
బంకిముల కథలు తెనుగైనవి నా యెదట మూడున్నవి. శ్రీ సుబ్బారావుగారి ప్రఫుల్ల యొకటి; శ్రీ ఓ.వై. దొరసామయ్య గారు కన్నడము నుంచి తెనిగించి శ్రీవావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ అచ్చొత్తిన, ఆనంద మఠమొకటి; అటులనే శ్రీ దొరసామయ్యగారు ఆంధ్రీకరించి కలారత్నాకర ముద్రాక్షరశాలలో అచ్చుపడిన కపాలకుండలము యొకటి. ఇంతకు మున్నింగ్లీషున బంకిము కథలనే రెండు మూడు చదివియుంటిని.
బంకిము వ్రాసినట్లే తాము తెనిగించితిమని శ్రీ సుబ్బారావుగారు వ్రాసిరి గాని, కొన్ని చోట్ల ఆంధ్ర లోకోక్తులును, లోకోక్తులవంటి ఆంధ్ర పద్యములును వీరి తెనుగులో కానవచ్చు చున్నవి. ఇదిగాక బంకిముల రచనా మార్గమునకు పొందిన వర్ణనాంశములను పెంచుట కూడా కొన్ని చోట్ల కలదు. బంగాళానేరనివాడనౌటచేత, దీని నిజమును కనిపెట్టజాలను.
ఈ మూడు గ్రంథములు ఇంగ్లీషులో 'రొమాన్సు' అను జాతిలో చేరును. దేశ కాలములను బట్టి జరగరాని సంగతులు, జరగతగిన సంగతులు వుంటవి. జరగతగిన సంగతులను వర్ణిం చునది ఉత్కృష్ట కథ. జరగనేరని సంగతులతో నిండి ఉండినది రొమాన్సు. అందులోను అంతరులు కలవు. బంకిముల రొమాన్సులు, ఇంగ్లీషు 'నవలి' యగు 'స్కాట్' తోవను కొంతవరకు అనుసరించి పోవును. దేశకాల భేదములను మన్నించక స్కాటు నవలలలోని కొన్ని అంశములను బంకిములు తన నవలలో చేర్చిరి. సీమలో మొదటి రిచర్డుఅను రాజు కాలమున రాబిన్ హుడ్ అను బందిపోట్ల మొనగాడొకడుండెను. వానికి స్కాటు సుగుణసంపత్తిని కల్పించెను. ఇది స్కాటు నందే కావ్య దోషమై వుండెను. రాబిన్ హుడ్నకు ప్రతిగా, బంకిములు ప్రఫుల్లలో భవానీ ఠాకూరను వాని నమర్చియున్నారు. ఈ భవానీ ఠాకూరు దొంగల మొనగాడైనను శౌర్యౌచార్య దేశాభిమానాది గుణసముద్రుడు; "సంపూర్ణ ధిషణాధురంధరుడు". ఆనంద మఠములో కూడా గుణసంపత్తి కల బందిపోట్లు కలరు. సన్యాసుల దేశాభిమానము యింతంత కాదు. అట్టి బందిపోట్లను, యిట్టి సన్యాసులును, మనసు కల్పించిన మాయా ప్రపంచములోనే వుందురు గాని, లోకములో వుండి వుండలేదు. దేశోద్ధరణమునకు భవాని ఠాకూరునకు దొరికిన సాధనము ప్రఫుల్ల ముఖియను ఒక మగడు విడనాడిన పేద బ్రాహ్మణస్త్రీ. రూపసి, బుద్ధిమంతురాలు. అడవిపట్టి పోవుచుండగా ఆమెకు నట్టడవిని వొక గాజుయిల్లు గానవచ్చెను. ఆ యిల్లు అంతటను అద్దములు కూర్చి కట్టిరి గాన, అడవి ఆ అద్దములయందు ప్రతిఫలించి అంతా యేక అడవిగా కనపడునట! ప్రఫుల్లముఖి ముఖము అద్దములో ప్రతిఫలించగా అది అద్దమని యామె పోల్చు కొనెనట. ఆ అద్దపుటింటికింద నొక నేలమాన్యములో లెక్కలేని ధనరాసులు పడియుండెను. ఆ ధనముతో సైన్యమును గూర్చికొని, భవాని ఠాకూరు ప్రఫుల్లముఖికి రాణీపదవి నిచ్చి పట్టాభి షేకము చేసెను. చెప్పన్న విద్యలు ఆమె అవలీలగా నేర్చెను. ప్రఫుల్లముఖి నేర్చిన శాస్త్రములు కళల పట్టీ 69-70 పుటలో నీబడినది. ప్రఫుల్లముఖి గారిడీవాడు అరగడియలో పుట్టించి, పూపించి, కాపించిన మామిడిని పోలియున్నది. ఇట్టి అసందర్భమును బంకిములు కల్పింతు రాయని నాకు శంక కద్దు.
ప్రఫుల్లముఖని అత్తవారు విడనాడుటకు కారణము పొందుకగా కానరాదు. "ప్రఫుల్లతల్లి ధనహీనురాలైనను, గొప్పవారి తోడి సంబంధము కలిగెనని వారితో తులతూగు ప్రయత్నంబున తన సర్వస్వమును వమ్ము చేసెను. ఒకనాడూరు బంతి పెట్టినప్పుడు తమకు మనసుదీర్ఘ భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయంబు లెల్ల సమకూర్చదాయెననుచు నాయూరిలోన నెందుకు గొఱ గాని దుష్టులు కొందరు భోజనమధ్యమున లేచిపోయిరి. ఆ యవమానమునకు గినుక యొదవ ప్రఫుల్ల ముఖితల్లి వారిని నిందించెను. అందుల కాగ్రహముగదుర నామెపై బగబూని యా తిండిబోతులు గలసి యాలోచించుకొని హరవల్లభుడు తన చుట్టముల తోడంగూర్చుండి యుండ, నాయూరిలోని వారెవరు లేకుండ జూచుకొని, వారొకరొకరుగ సభలోన గూర్చుండిరి. అందొకడు హరవల్లభుడు వినుచుండ "ఆహా! యేమి సంబంధము!" అనుచు దనలో దాను గొణిగెను. ఆ మాటకు దత్తరపడి “ఏమేమ”నుచు హరవల్లభుడు ఆతురత నడుగ "మాకెందుకండీ? ఎవరెట్లు పోయిన నేమ"నియె. అందులకు మరింత మనంబున దొందరు గలుగ హరవల్లభుడు వేడుకోలుగ నడుగ “ఏమోనండి, కులభ్రష్టులట!” అనుచు జివాలున లేచిపోయెను. అంత విషాదాకులిత చేతస్కుండై హరవల్లభుడప్పుడే సభలో ప్రవేశించిన మరియొకని నాయూరివాని సత్యాతురతతో “నేను జేసిన సంబంధము మంచిది కాదా?" యని యడిగెను. కుట్రలో జేరినవాడగుటం జేసి యా దుష్టుడు పెదవి విఱుచుచు నూరకుండెను. 7వ పుట.
ఇటులనే మరికొందరు గ్రామస్థులు అనుమానమును బలపరుతురు. అంతట హరవల్లభుడు తనకు కూడా లోకము కులభ్రష్టత్వ మాపాదించునేమో యని భీతిల్లి “తనవారినెల్ల బిలిచి స్థితిగతులను వివరించి చెప్పి ఈ యూరికి మనము వచ్చిన సంగతిని గుణించి గాని, మనము చేసిన సంబంధ విషయమై గాని యెవరితోడను మాటలాడకుండ భద్రముగా నుండుడు. మన గ్రామమున నెవ్వరికైన నీ మానహీనమగు వృత్తాంతము దెలియవచ్చునేని మనకు జేటు మూడును. కావున నత్యంత జాగ్రత్త తోడ రహస్యమును గాపాడు"డనుచు నొక్కి చెప్పి యారేయి యెవరికిని దెలియకుండ మూటలనుగట్టుకొని సందడిగాకుండ పయనమై తెల్లవారకమునుపేయిల్లు చేరెను.
ఈ చరిత్రము, చిన్నపిల్లలు చెప్పుకొను కాళ్ళూ చేతులూ లేని కథలను పోలియున్నది. మామగారు ధనవంతుడట. పరమలౌక్యుడు. మొదట కులగోత్రములు తెలుసుకొనకనే వివాహ మును నిశ్చయించెనో? కులగోత్రము లెరుగకనే, తన ఆప్తబంధువులు సమ్మతించిరో? అప్పుడు సభలో నుండిన బంధువులలో మొదట సంబంధము కుదిర్చిన రాయబారు లేమయిరి? గ్రామమునందలి పెద్దలిట్టి దుర్నయములకు దిగియుండరు గదా! మామగారు వారి నడిగి నిజము తెలిసికొనకనే, కులభ్రష్టులని నిశ్చయించెనో? యిందరు బ్రాహ్మణులు భ్రష్టులయింట యెటుల భుజించి యుందురను శంక పొడమలేదో? నమ్మె, పోనిండు. సంబంధము జరిగినమాట దాచుటెట్లు? తరలిపోయినపుడు లోకమెల్ల నెరిగి యుండలేదో? అందరు బంధువుల నోళ్ళు కట్టుబడునని మామగారెట్లు నమ్మిరి? ప్రఫుల్లముఖి భ్రష్టయైన తాను కూడ భ్రష్టాయెనే? అజ్ఞాన కృత దోషము ప్రాయశ్చిత్తము వలన నివర్తించునే? అది అటుండ ప్రఫుల్ల కుటుంబమునకు భ్రష్టత యెటులవచ్చెనో గ్రంథకర్త చెప్పలేదు. రైలు బయలుదేరి తెల్లవారక మునుపే యిల్లు చేరినంత దగ్గరనుండెను మామగారి యిల్లు! ప్రఫుల్లముఖి శైశ వవృత్తాంతము గాని, ఆమె కుటుంబము యొక్క పూర్వవృత్తాంతము గాని యీయబడి యుండలేదు. నాయిక యెవరి నడుమ యెటుల పెరిగెనో తెలియక, ఆమెను తెలియనేరము. చిత్రరచనా కళలో సెటింగ్ అని ఇంగ్లీషు వారనునది ప్రఫుల్లముఖికి లేదు. సెటింగ్ అనగా ఒక ప్రతిమ యేవస్తు జాలమునడుమ నిలిచియుండునో అట్టి వస్తుప్రపంచము. సెటింగ్ అనుమాటకు తెనుగు భాషయందు పర్యంత ప్రపంచమని వాడుదుము.
ఈ జాతి నవలలు ఉత్కృష్టమైనవి కావు. లోకములో నున్నట్టే వ్రాయవలెనని నా అభిప్రా యము కాదు. ఇంగ్లీషువారు ఐడియల్ (యేది యేలా వుంటే బాగుండునో అలా భావించుట) అను లోకోత్తర కల్పనలుండక, లోకోత్తరమైన రచనముండనేరదు. గాని మనుష్య జాతము యొక్క మనో ధర్మములను, వస్తుతత్వము ననుసరించి కథ నడుపవలెను. కళ్ళెము వదలి,
చిత్తమును పరుగిడనిచ్చిన నవలలు జ్ఞానదాయకములు కానేరవు. కావ్యము నందు శృంగారము
(ఒక గొప్ప పండితులిటుల వ్రాయుచున్నారు.)
కావ్యములలో శృంగార మెంతవరకు వర్ణనీయమను చర్చ తెనుగు పత్రికలలో జరుగు చున్నది. ఒక్కొక్క పుస్తకమును బట్టి దానిలో పది పంక్తులు తీసి, వాటిని పచ్చి శృంగారముగా నెంచి, పుస్తకమును గ్రహించుటన్నది అల్పదృష్టి. గత కాలములోను, అన్యదేశములలోను కళల స్థితిని కానీక చేయు సిద్ధాంతములుట్టి సిద్ధాంతములు కాని, గట్టి సిద్ధాంతములు కానేరవు.
పాశ్చాత్య కవులలో శృంగారము మెండా, మనలో మెండా అను విషయమును పండితులు భిన్నాభిప్రాయలయి యున్నారు. పాశ్చాత్యులు మన కావ్యముల యందు పచ్చి శృంగారము మెండని అనులోచితముగా వ్రాయుటకలదు గాని, వారింటి మంటికుంపటిని వారు చూచు కున్నచో, వారు నోరెత్తరని నా నమ్మకము.
గ్రీకు దేశమున శిల్ప కారులు కళ దిశమొల బొమ్మలతో నారంభమై, ఈనాటి ఫ్రెంచి యకాడమి బొమ్మలుగ పరిణమించినది. ఒంటినత్తి, యవయవములు బయటబెట్టు పుట్టముల గట్టి, వేలకొలది పెద్ద మనుష్యులమను మగవారి యెదుట, నాటలాడి, వారి నానందమగ్నులను జేయు కౌశలము పాశ్చాత్యులదే కదా. పదుగురి యెదుట స్త్రీని ముద్దు పెట్టుకొనుట, ఆలింగనము చేసికొనుట, వారిలో సర్వసామాన్యమే కదా.
మత గ్రంథములటుండగా బొకాషియో వ్రాసిన డికామిరన్ మొదలగు యూరోపు భాషలలోని పచ్చి శృంగార గ్రంథముల మాట చెప్పనవసరము లేదు. అందులో ఫ్రెంచి కవుల మాట లోక ప్రసిద్దమే కదా!.
ఇంగ్లీషు కవులలో వాల్మీకి యగు చాసరు కథలందలి పచ్చి శృంగారమునకు ఈనాడు సమాధానము కల్పించుకోవలసి వచ్చినది. 'మార్లో' అను కవికృతమగు "హీరో అండ్ లియాండర్” అను కావ్యమును, ఆవిడ్ అను రోమను కవి కావ్యములు భాషాంతరీకరణమును, షేక్స్పియరుని “రేప్ ఆఫ్ లుక్రేన్” “వీనస్ అండ్ యనిస్" అను కావ్యములను, "మెర్రీ వైవ్స్ ఆఫ్ విండ్సర్”, "హెన్రీ ది ఫోర్తు" అను నాటకములును మన ప్రబంధములకు తీసిపోవు. బైరను కవి వ్రాసిన డాంజు అన్ మొన్నమొన్నటి గ్రంథము. మన దేశమున సంస్కృతములో వేదము మొదలుకొని ఈనాటి వరకును రచితములయిన యనేక గ్రంథములలో పచ్చి శృంగారమున్నదే. సంస్కృత కవుల త్రోవను బోయిన ప్రాచీన ఆంధ్ర కవుల మాట యటుంతము. ఈనాటి కవులలో మొనగాండ్ర కొందరి నెంచి వారి సరణిని పరీక్షించినచో కూడిన దెద్దియో కూడనిదెద్దియో బయలుపడగలదు.
అందు భాషా సంస్కర్తలలో మొనగాండ్రు శ్రీ రాయబహద్దర్ వీరేశలింగము పంతులుగారు. వారి మార్గమును ముందు విచారించి చూచెదను. గ్రామ్య భాషకు ప్రాణము పోసినవారు వీరేశలింగము పంతులుగారు. వారు తమ గ్రంథములనన్నింటిని అనేక సంపుటములుగా నచ్చొత్తిరి. తెనుగు భాషకు వారు మహోపకారము చేసిరనుటకు సందియము లేదు. అట్టి సంపుటములలో నగ్ర స్థానము పొంది ప్రథమ సంపుటములో జేరినవి గ్రామ్యభాషలో వ్రాయబడిన కొన్ని ప్రహసనములు.
శ్రీ పంతులు వారు భాషా సంస్కరణ కర్తలును, సంఘ సంస్కర్తలును నైనను, రక్త బలిమి చేత మన ప్రాచీన కవుల శృంగారము వీరికి ఆమూలాగ్రముగా నబ్బినది. అందుకు నిదర్శనము ప్రథమ సంపుటములో నగ్రాసనమునకు బూనిన అపూర్వ బ్రహ్మ చర్యమను ప్రహసనమే.
పచ్చి శృంగారము రెండు రీతులుగా నుండును. రత్యాది వర్ణనమును, స్త్రీల అవయవ ములను వర్ణించుటయు నందొకటి. ఇదంత ప్రమాదకరము కాదు. కవి వర్ణించినను వర్ణింప కున్నను యెన్ని పుట్టంబులచే నాచ్చాదనము చేసినను స్త్రీల యవయవముల నెరుగని పురుషు లుండరు. మరచియున్న వారికి వర్ణనలు జ్ఞాపకమునకు తెచ్చుననుట అసంభావితము. దేవుడు సృజించిన స్త్రీ యవయవములలో నేమి తప్పున్నది. రహస్యములని చేసికొన్న మనుష్య నిర్ణయముల వలననే కొన్ని వాడక లేర్పడినవి. మళయాళమున స్త్రీలు రవికలు లేకనుండురో. చూచినంతట గలుగని ప్రమాదము వ్రాసినంత మాత్రమున కలుగునా? నిజమయిన పచ్చి శృంగారమన్నది పరకీయా శృంగారము. ఈ శృంగారమే అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనము నందు వర్ణింపబడినది.
ఈనాటక కథానాయకుడు రామాకాంతము పంతులు. ఇతని యోగ్యత భృత్యుడగు కరటక రెడ్డి, ఈ రీతిని వర్ణించుచున్నాడు.
"రెండు సంవత్సరముల నుండి నా భార్యను యజమానుని కంటపడకుండా కాపాడుకొని వచ్చినాను. అతని కంట బడితే యిక నాకు భార్య ఆశలేదు. పెళ్ళాలు వున్న ఈ వీధి వారు అంతా ఆయన జీవానికి వుసూరుమని యేడుస్తూ వున్నారు. ఆయన మునిసిపల్ కమీషనరు. లోకల్ ఫండు మెంబరు. బెంచి మేజిస్ట్రేటు, డిస్ట్రిక్టు కోర్టు ప్లీడరుకావడం చేత యెప్పుడు యేమి చేసి పోతాడో అని అందరు జడుస్తూ వుంటారు. వాసుదేవరావు పంతులు గారి భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం చేత ఆవిడ నిమిత్తం మా పంతులుగారు, యీవాళ స్టీమరు మీద కొవ్వూరు వెళ్లుతారు”. ఈ నాటకమునందు కథ యేమనగా రామాకాంతం పంతులు భార్య పుట్టింటికి వెళ్ళి యుండును. పట్టుమని పది రోజులు అయినను తన్ను వదలి పుట్టింట నామె యుండదనియు, వర్తమానమందగనే బండి చేసుకొని, దుడుంగున వచ్చి తన స్వేచ్ఛా ప్రవర్తనకు భంగము కలుగ చేయుననియు, రామాకాంత పంతులుకు విచారము మెండు. వాసుదేవరావు పంతులు పెండ్లాము పుట్టింటికి పోవుచుండ, నామెను తగిలిపోవుటకు రామాకాంతము కొవ్వూరుకు ప్రయాణమయి వెడలును. ఈ పంతులుగారి భృత్యుడు కరటక రెడ్డి అనునతడు రెండు సంవత్సర ములకు ముందే రూపవతియగు భార్యను పెండ్లాడియున్నను, తన భార్యను యజమానుని కంటి యెదుట బెట్టవెరచి తన పెండ్లి కథనే యజమానునికి జెప్పకుండెను గాని, ఆనాడు యజమానుడు పొరుగూరు పోయెనని యెంచి, తన భార్యను తెచ్చి యజమానుని యింట ఆమెతో సుఖింప తలచును. అంతలో యజమానుడు పొరుగూరుకు పోక, యింటికి మరలి వచ్చి, భృత్యుని భార్యయగు మోహినిని చూచి అతని భార్యయని యెరుగక, మగని యెదుటనే ఆమె తోడ సరసమాడ నారంభించును.
అది చూచి భర్త దిగులొందును. ఇంతలో యజమానురాలగు శ్యామలాంబ కూడా యింటికి వచ్చును. ఆమె రాగానే రామాకాంతం పంతులు మోహినిని వసారాలోనికి పంపివేయును. యజమానురాలు కూడా ఒక మల్లిచెట్టును చూచుటకు, ఆ వసారాలోనికి పోవనుంకించును. అట్టి చిక్కు సమయములో, నేదైన ఒక పెద్ద బొంకు బొంకి, తన మానమును దక్కించుమని రామాకాంతము కరటకరెడ్డిని రహస్యముగా వేడును. మోహిని తన భార్యయనియు, పంతులుగారు యజమానురాలు నిమిత్తము మంచి దాసీని కుదర్చమనియు చెప్పియుండుట తానామెను అటకు తెచ్చితిననియు కరటకరెడ్డి యజమానురాలితో చెప్పెను.
శ్యామలాంబ పోయి, మోహినిని చూచి దాని రూపమునకును, మాటలకును సంతసించి, తిరిగివచ్చి మగనితో తన సంతోషము నీ రీతి చెప్పెను. "వాళ్ళ అనురాగము, ఐకమత్యమూ చూస్తే నాకును ముచ్చటవుతూ ఉన్నది." గాని రామాకాంతమునకు సంతోషము లేదు. మోహినిని తన వస్తువుగా నెంచి, అతడేమనుకొనును :
“వాడు యెంతసేటికీ కదలిరాకుండా వున్నాడు. దొడ్లో దానితో యేమి చేస్తూ వున్నాడో.”
శ్యామల : యీ అద్దంలో వాళ్లు కనబడుతున్నారు. మన రెడ్డి పెళ్ళామును యేలా ముద్దు పెట్టుకుంటూ వున్నాడో?
రామా : పట్టపగలు ఆడదాన్ని వాడలా చెయ్యడం నీకు యిష్టముగా నున్నదా?
శ్యామల : మొగుడు పెళ్ళామును ముద్దుపెట్టుకుంటే అందులో తప్పేం వున్నది? రామా : “తప్పిదం లేదు గాని నేను వక్క మాటు కరటక రెడ్డిని కూకలు వెయ్యవలెను. నీ వవతలకు పో"
ఆపైని యజమానునకును, భృత్యునకును జరిగిన సంభాషణలోని రెండు ముక్కల నుదహరింతము.
కర : మీ కోసమే ముద్దు పెట్టుకున్నాను. అమ్మగారి మనసులో మీ యందు వుండే అను మానము పోగొట్టడానికి నేనా పని చేసినాను.
రామా : ఆ ముద్దు నా కోసం కాకుండా నీ కోసమే పెట్టుకున్నావని నాకు యిప్పటికీ అనుమానం బాధిస్తూనే వున్నది.
కర : అయ్యా, మోహిని వకవేళ వచ్చి మోహించి నన్ను యేమయినా చేస్తే అది నా తప్పేనా? ఆడవాళ్లు వచ్చి యెదుట నిలవబడ్డప్పుడు మగవాళ్ళు మనసు పట్టలేరు.”
తుదకు కరటక రెడ్డియు మోహినియు దంపతులని క్లర్జిమేను రుజువిచ్చును. కథ కంచికి వెళ్ళినది. మన మింటికి వచ్చితిమి! కాని ఈ గొప్ప కథ వలన వ్యక్తమగు నీతి యెద్దియో? శ్రీ రాయి బహదర్ గారు తెలుపవలసి యున్నది.
దుష్టవర్తనునకు తగిన శిక్ష జోడుకంచుకాగడాలు వేసి వెతకినను గానరాదు. ఇది పచ్చి బూతు శృంగారమునకు గొప్ప నిదర్శనము.
ఇట్టి గ్రంథ రచన లోకమునకు హాని చేయును. దీనిని నిలుపవలయునని మా మతము.
వీరేశలింగము పంతులుగారు ఆంగ్లేయ నాటక మహాప్రపంచములోనుండి తెనుగుచేసిన ప్రహసనములు చాల మట్టుకు విషయవినోద సాఫల్యములే. చుంబనాలింగములను గూర్పి మొదటి సంపుటము, వాల్యుం : 10, 15, 34, 41 పుటల జూడుడు.
బ్రహ్మ వివాహమను ప్రహసనాంతమున, భానుమూర్తి అనునతడు పాపావధానులతో నిట్లు పలికెను. “యీ రోజంతా రంకు పురాణములతోనే కాలక్షేపము చేసినాము” ఇట్టి రంకు పురాణములు బ్రహ్మశ్రీ వీరేశలింగము పంతులు గారు తాము కల్పించిన ప్రహసనములయందు నిండియున్నవి.
దాని నెత్తి వ్రాయ తగదు కాని సత్యమరయ గోరినవారి కొరకు కొన్ని పట్లు సూచించెదము. పుట సంఖ్య 310 312 పంక్తులు 15, 16, 17, 23, 24, 25 26 గురుజాడలు 590 కావ్యమునందు శృంగారము 313 318 14 మూడవ రంగము 2, 6, 7, 11, 12 12, 13, 14, 15, 16 12, 13, 14, 15, 16, 27, 28 13, 15, 16, 25 1, 6, 10, 11, 12, 13, 20, 21, 22, 23 368 370 372 402 408 415 462 29, 30, 31 463 8, 9, 10 464 5 467 16 468 7 21, 22 522 16, 17, 18
రెండవ సంపుటములో బ్రహ్మ వివాహము నందలి సప్తమాంకము రెండవ రంగము. శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధము ప్రథమాశ్వాసమునందలి 33వ పద్యమును, అభాగ్యో పాఖ్యానము నందలి 52 మొదలు 84వ పద్యము వరకును ప్రాచీనుల వ్రాత అణగద్రొక్క బడినది. ఇక రసికజన మనోరంజనము చతుర్థాశ్వాసమున 114వ పద్యము నుండి స్త్రీ పురుష సంసర్గము తెరమరుగు లేక వర్ణింపబడినవి.
లాక్షణికులలో బ్రహ్మశ్రీ వేదము వెంకటరాయ శాస్త్రులవారు అగ్రగణ్యులు గదా. వారు రచించిన ఉషయను నాటకమున నీక్రింది పట్టులు చూడనగును.
పుటలు : 13, 25, 27, 28, 37, 38, 68, 69. మాటా మంతీ - 3
ఆంధ్రసాహిత్య పరిషత్
“ఆంధ్ర సాహిత్య పరిషత్కార్య నిర్వాహక సభ 1915 సం॥ ఫిబ్రవరి నెల 20వ తేదీ శనివారమునాడు ఉదయము 8 గంటలకు బెజవాడలో సోషలు క్లబ్బులో సమావేశమగును.”
నిద్రబోతున్నానా? అనుకున్నాను. కళ్ళు నులుపుకొని, తిరిగీ నిదానించి చూశాను. కార్డు మీద అచ్చు అక్షరాలు స్పష్టముగా కనబడ్డాయి. షేక్స్పియర్ అన్నట్లు కలలైనా యెరగని కార్యాలు యెన్నో వున్నాయి, అందులో ఇది వొకటి కావొచ్చును, అనుకున్నాను.
అయితే చెన్నపట్నం రాజధానిలో జరుగుతూ వచ్చిన సభ రెండువందల యాభయమైళ్ళు ఉత్తరానికి యెలాడేకిరిందని శంకపొడమింది. కారణం వినా కార్యం వుండబోదు. ఆలోచించిన కొద్ది కారణాలు శరపరంపరగా స్ఫురించాయి.
1. (ఆంధ్ర) దేశానికి ఒకప్పుడు బెజవాడ రాజధానిగా వుండేది.
2. (సా)ర్వభౌముడైన కృష్ణరాయలు పూర్వదిగ్విజయయాత్రకు విచ్చేస్తూ బెజవాడలో కొన్ని దినములు వున్నాడు.
3. (హి)యం
4. (త్) సాంగ్ అనే చైనా దేశపు బౌద్ధయాత్రికుడు బెజవాడలొ కొన్ని దినములు గడిపాడు.
5. (య) బోనెటాపర్ సెయ్, అనే పరాసుయాత్రికుడు కూడా బెజవాడలో కాలు ఊనాడు.
6. (పరిషత్తు)కు కొంతకాలం సెక్రటరీగా వుండిన మ.రా.రా. హనుమంతరావు పంతులు గారు బెజవాడలో యిప్పుడు చెయిరుమాన్గా వున్నారు.
యింకా కారణాలు కావాలా? బెజవాడ దగ్గిర యెన్నో రెయిళ్లు కలుస్తాయి. బెజవాడ చెన్నపట్నానికి విజయనగరానికి మధ్యనుంది. ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు తపస్సు చేశాడు. యుద్ధమల్లుడి శాసనం. "ఆగు! ఆగు! యిన్ని కారణాలు చెబుతున్నావుగాని, ఆంధ్రసాహిత్య పరిషత్తుకూ యీ కారణాలకూ సంబంధమేమిటి? ఆంధ్రవాఙ్మయానికి చక్రవర్తి తిక్కనసోమయాజి గదా? అట్టి తిక్కయజ్వ ఉత్తరరామాయణంలో "సారకవితాభిరాము గుంటూరు విభుని మంత్రి భాస్కరు మత్పితామహుని దలతు" అన్నాడు. అంతవాడి తాత పాలించిన గుంటూరులోనే యేల సభ జరగకూడదు? అని ఒక నవ నాగరుకుడు అన్నాడు.
“చేసినదానికల్లా అడ్డుచెప్పడమేనా తెలివికి చిహ్న? బెజవాడలోనో, ఆకాశంమీదో, యెక్కడో ఒక చోట సభ చేస్తూన్నారని సంతోషించరాదా? ఇది చేయకపోతే మీరు చేసేదేమిటి? ఇన్నాళ్ళూ సభ చెయ్యకపోతే మీరేం చేయగలిగారు? అని సమాధానం చెప్పాను.
మోడ్రన్ పిల్లకాయలకు పెద్దలయెడల ప్రపత్తి తక్కువ “మహాజనో యేన గతస్సపంథాః" అని వారి అడుగుల్లో అడుగు వేసి నడవరు - ఎంతటివార్నీ తప్పులు పడతారు. వాళ్ళకు శంకలకు సమాధానం చెప్పడం యెంతటివాడికైనా ఒకప్పుడు కష్టసాధ్యమవుతుంది. మరివక బుద్ధిమంతుడు అన్నాడు. బెజవాడలో సభ చేయడం పద్ధతికాదట. ఏమి అనాలోచితమయిన మాట! కాంస్టిట్యూషన్లో విద్వాంసులైన సెక్రటరీలు చేసే పని యేమూలనైనా యిమడక పోతుందా?
"సరేనయ్యా! ఇమిడిందనుకుందాంగాని హటాత్తుగా బెజవాడకు డేకిరించివారు రేపు ఉత్తరధ్రువానికి డేకిరిస్తారు. చెన్నపట్నంలో సభచేస్తే అక్కడ నివసించి ఉన్న మెంబర్లు మీటింగుకు రావడానకు వీలువుంటుంది. అక్కడైన మీటింగులకే కొంత మంది అక్కడివారు రారు. అలాటి స్థితిలో వ్యయప్రయాసముల మీద బెజవాడ మీటింగుకు వెళ్లబోతారా? ఆ చెన్నపట్నంలోనైనా పై జిల్లాల పెద్దమనుష్యులు వచ్చే రోజుల్లో అనగా లెజిస్లేటివ్ కౌన్సిల్ మీటింగు మొదలయిన మీటింగుల కాలమునకు సామీప్యంలో అవకాశంకలుగుతుంది. అదంతామాని తోచినప్పుడు, తోచినచోట, ఆవాయిదాస్తుగా సభలు చేయడమేమిటయ్యా?”
అని ఉపన్యసించాడు ఇంకొక బుద్ధిమంతుడు.
కొంచెం ఆలోచించిన పైబలవత్తరమైన సమాధానం తోచింది. యెందుకు తోచదూ? మాట్లాడ్డానికి పని చెయ్యడానికి చాలాదూరం పదిమంది చేరితే మాటలు మెండవుతాయి పన్లు పాడౌతాయి? కోడొకడు తీస్తే కొమ్మొకడు తీస్తాడు. ఒక డౌనంటే ఒకడు కాదంటాడు. అందులో హిందూదేశానికి పార్లమెంటరీ గవర్నమెంటు యెంతమాత్రం పనికిరాదు. గనుక పనులన్నవి, ఒకరిద్దరి మీదనే జరుగవలసినది. కడం మెంబర్లందరూ హాయిగా పడుకొని నిద్రపోవచ్చును. పనితో వారికేమీ పనిలేదు. కారణం లేక నేనా అనుకున్నారు? ఆంధ్రమహాజన సభకు అంటకుండా సాహిత్య పరిషత్తులు యెలా కాపాడుకువస్తున్నారో? ఈ జ్ఞానం అప్పుడు నాకు లేక తొలి సంవత్సరం ఆంధ్రసాహిత్య పరిషతు యొక్క సాంవత్సరిక సభ ఆంధ్రమహాజన సభతో పాటు బాపట్లలో జరగవలసిందని, యీ సంవత్సరం విశాఖపట్నంలో జరగవలసిందని నొక్కిచెప్పాను. నా మాటగా నా మిత్రులు విని అలా చేసివుంటే ఆంధ్రమహాజన సభలో వుండే నవ దేశాభిమానుల ఢాకాకు సాహిత్య పరిషత్తు మూడు ముక్కలయి పోయియుండదా?
ఐతే నిన్నగాక మొన్ననే ఆంధ్రమహాజన సభ కూడినది గదా? ఆ స్థలంలోనే పరిషత్కార్య నిర్వాహక సభ యేలా చేయతలచేరు.
ఫర్వాలేదు. కృష్ణవరదలకి దాని వాసన యావత్తూ కొట్టుకుపోయింది. మాటా మంతీ - 4
వాడుక భాషలు : గ్రామ్యము
అత్తగారూ, కోడలూ విషయమై ఒక సామెత కద్దు. రసావేశం మిక్కటమైతే గద్యలతూగు ఆగక, మాటలు పాటలుగా పరిణమిస్తాయి. గ్రామ్యానికి అలిగి, కసితీరక కొందరు మహాకవులు ఛందోబద్ధంగా తొమ్మిదో అష్టం పారాయణ చేస్తారు. వారికి పై సామెత వర్తిస్తుందేమో అనుకుంటాను.
శ్రీరాముల సచ్చిదానందశాస్త్రిగారు ఆరు పద్యములనే మహాస్త్రములను గ్రామ్యావలంబ కులైన 'కూళలపై' కృష్ణాపత్రిక ముఖమున ప్రయోగించినారు. ఆనాడు శ్రీరాముల వారి బాణములు శత్రువులను కొట్టి తిరిగి శ్రీరాముల వారి చేతికి వచ్చేవట! యీనాడు శ్రీరాములవారైన సచ్చిదానందశాస్త్రులుగారి బాణములకు కూడా ఆ ధర్మం పట్టింది. ఒక విశేషంతో, అనగా వెయ్యగానే వెనక్కి తిరుగుతాయి. శత్రువులను ముట్టవు.
ఈ లెంపకొడితే ఆ లెంప చూపమన్నాడు, మహాను భావుడైన యేసు. తన లెంప తానే వాయించుకోవడం అంతకంటే గొప్ప ప్రజ్ఞ కాదు? అంతశ్శత్రువులను అణగ్గొట్టడం అన్నమాట. ఆ పనే సచ్చిదానందశాస్త్రులు గారు చేసినట్టు కానవస్తుంది. వెనకటి కొక మహానుభావుడు "దూర్వాలంటె యేమిటో అనుకొని తిరిగి చచ్చాను, గరిగడ్డిట్రా?" అన్నాడట. గ్రామ్యమంటే యెక్కడో కోస్తాను వుందనుకొని, సచ్చిదానందశాస్త్రులుగారు కత్తులు, కటార్లూ నూరారు. ఆ దూర్వాలన్నవి, వారివే పద్యాలల్లోనే యెటు జూసినా, నవనవలాడుతూ నవ్వుతూ వుండెను. దగ్గిర వస్తువును నరుడు సరకుగొనడు.
నన్నయభట్టు సూత్రములు (అనగా ఆంధ్రశబ్ద చింతామణి) అహోబలీయము, అప్ప కవీయము మొదలైన గ్రంథములు చదివిగాని, తెనుగు కావ్యములు రాయకూడదని శాస్త్రులు గారి అభిప్రాయము.
ఉ. నన్నయభట్టు సూత్రముల నాలుకచే బలుకంగమానియే యెన్న నహోబలీయమును నించుకనైనను చేతముట్టకే కన్నుల చేతనైన నిఁక గాంచక నప్పకవీయమాదియౌ వన్నెలుగల్గు గ్రంథముల వ్రాయగవచ్చును గావ్య జాలమున్ లక్షణ గ్రంథముల పేరెత్తిన పద్యంలోనైనా, శాస్త్రులు గారు లక్షణం ఇంచుక పాటించినారు కారు. కడం పద్యములు దీనిని మీరివున్నవి. ఒక జాతి గ్రామ్యమైనా తప్పిపోకుండా వెతికి వెతికి పట్టితెచ్చి, వాటిని ఛందో బద్ధంగా బంధించి శాస్త్రులుగారు తమ పద్యాలను గొప్ప “గ్రామ్య ప్రదర్శనాగారము"గా చేసినారు. అందుచేతనే కాబోలును గ్రామ్యపద ప్రయోగమనే శీర్షిక నెత్తిరి.
పద్యాలంతటనూ చీకటి రాత్రిలో చుక్కలవలే గ్రామ్యములు మెరుగుతుండగా, కృష్ణా పత్రిక కానకపోవడం ఆశ్చర్యం. ఆ పద్యాలను మెచ్చి, యెత్తి అచ్చొత్తిన శశిలేఖ కానకపోయిన కానక పోవునుగాక!
ఆశ్చర్యమేలా? ప్రాచీనుల తెనుగు లక్షణం, కోరి చదివే మనుషులు కొంచం. చదివి తెలుసుకున్న వారు మరికొంచెం. వొంటబట్టిన వాళ్ళు మిక్కిలీ కొంచం. వొంటబట్టిన పండితుల క్కూడా కలం చేతపడితే దూడలు దొర్లుతాయి. బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయశాస్త్రిగారు, మహా మహోపాధ్యాయ బిరుదాంకితులైన శ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులుగారి ప్రసన్న రాఘవమును విమర్శించి, విమర్శించి, మహా మహోపాధ్యాయులవారికి లక్షణజ్ఞానం యించుమించు పూజ్యమని సిద్ధాంతీకరించారు. ప్రమాణం చూపనిదీ శాస్త్రులుగారు మాటాడరు. అవతారికను యీ మాట లతో ఉపక్రమించారు.
"ఈ కాలములో ఆంధ్రభాషలో ప్రబంధములు పెచ్చు పెరుఁగుచున్నవి కదా. వానిలో అనేకముల వలన భాష కడుం బెట్టకలుగుచుంటం గాంచి, ఏదేనొక గ్రంథ మాధారముగా నీ చెరుపు నెల్ల విద్యార్థిజనోపయోగముకై భాషారక్షకై వెల్లడి సేయ దలంపుగొన్నవాడనై...”
మహా గజాః పలాయంతే మశకానాంతు కాకథా? ఇన్ని లక్షణ గ్రంథాలు చదివి రెండు వార్తా పత్రికల వల్ల మెప్పుగొన్న సచ్చిదానందశాస్త్రులుగారికే నాలుగు పద్యాల్లో నలభై చోట్ల కాలుజారినప్పుడు, యిక పసిపిల్లల గతి యేమిటి? యీ లక్షణమును స్కూలు పిల్లలు నేర్చగల రనుట వెళ్ళి భ్రమ కాదా? నేర్చమనడం ఉట్టి గట్టుకొని స్వర్గానికి యెగరమనడం కాదా?
ఓం ప్రథమం అని పల్లె కూటముల అయ్యవార్లకి లక్షణం పొంతే తెలియదు. యీ స్కూళ్ళల్లో తెనుగు మేష్టర్లకు వచ్చీ రావడం. ఇంగ్లీషు మేష్టర్లకు రానే రాదు. కాలేజీ పండితుల మాట మనం యేమీ చెప్పడానికి తగం. గాని మనకి శ్రమ లేకుండా, వారిలో వారే “వీరికి లక్షణం తెలియదని” వారూ, “వారికి లక్షణం తెలియదని వీరూ” తీర్పులు రాసి అచ్చువేసి వుంచారు.
మా చిన్నతనంలో శ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ప్రెసిడెన్సీ కాలేజీలో పండితులుగా వుండి ఆంధ్ర భాషా సంజీవని అనే పత్రికను ప్రచురించే వారు. రాజమహేంద్ర వరంలో వుండి శ్రీ వీరేశలింగం పంతులు గారు వివేకవర్ధనిని ప్రచురించేవారు. కొంత కాలానికి వీరున్నూ, కాలేజీ పండితులైనారు. ఇద్దరూ ఆరితీరిన గ్రంథకర్తలు. యూనివర్శిటీకి పరీక్షకులు. వారిని మెచ్చి గవర్నమెంటువారు మహా మహోపాధ్యాయులను చేసిరి. వీరిని మెచ్చి రాయ్ బహద్దరులను చేసిరి. ఆనాడు తెనుగు భాషలకు వీరిరువురును పట్టభద్రులై యుండేవారు. గాని వీరికి లక్షణం రాదని వారూ, వారికి లక్షణం రాదని వీరూ గజకచ్ఛపముల వలె పోరాడేవారు. ఇదే, దేవాసుర యుద్ధం అనుకునేవాళ్ళం.
వారు విరమించి చాలాకాలమైంది. గాని యే ముహూర్తాన్న పోరు తలపెట్టిరో గాని, ఆ యుద్ధ రంగం మట్టుకు యెన్నడూ చల్లారలేదు. కవులు లావైనారు. కాట్లాటలు లావైనాయి. History is repeating it self. చరిత్ర పునరావృత్తమవుతున్నది. నలుదిక్కులా జయభేరీలు మోగుతున్నాయి. యేమని? బిరుదులు గట్టిన పండిత కవులకు తెలుగు లక్షణం రాదు, రాదు, రాదని.
పదాతుల మాటా, మూటలు మోసే వాళ్ళమాటా చెప్పేదేవిఁటి?
సంస్కర్తల ఉద్యమముల మూలంగా తెనుగు లక్షణం మట్టిగలిసి పోతున్నదని యెలుగెత్తే మహానుభావులలో లక్షణం బాగా తెలియని వాళ్ళూ, లక్షణానుసారంగా రాయలేని వాళ్ళే మెండు. ఒక తోవా, తెన్నూ లేకుండా, యెవడికి తోచిన రీతిని వాడు తెనుగు లక్షణం అడుగడుగునా పడగొడుతూ, గొప్ప కోసం సంస్కృతం మాటలు ప్రయోగించి, కృత్తద్ధితల రూపుమాపి, లింగ వ్యత్యయము చేసి, శబ్దాచిత్యమును చెడగొట్టి, లోకంలో యెన్నడూ, యే దేశం యెరగని దౌర్భాగ్యపు భాషను రాస్తూ అది తలుచుకు ఆనందిస్తున్నారు. మనుషులకు బుద్ధులు లేవా? కళ్లు లేవా? ఇన్ని విధాల గ్రాంథిక భాష తగలబడుతూ వుంటే, ఈ ఉపద్రవమును తొలగించ ప్రయత్నించక, వాడుక భాష రాసినందువల్ల యేమో తెనుగుకు చేటు వచ్చునని వగలబొగులుతారేమి? మనలో నాగరికులు వాడుకునే భాషా, ఉత్తరాల్లో రాసుకొనే భాషా చెడ్డదా? యీ మహనీయులు రాసే భాష మంచిదా? అయితే లక్షణము పట్టుబడని వారు గ్రాంథిక భాషను యేల రాయబూనుతారు? మీది మిక్కిలి పద్య రచన యేల తలపెడతారు? అని అడగలరు. సచ్చిదానంద శాస్త్రిగారి పద్యములు కొంచెం పరీక్షిస్తే ఈ శంకలకు సమాధానం తేలవచ్చును.
ప్రతిభ భగవంతుడు యివ్వాలి. కావ్య గుణాలు, పూనినేర్చి, విసగక రాసి, మంచి కావ్యములు యెడతెగక చదివి సాధించవలె. అట్టి శ్రమకోరని సులభ సాధ్యములు రెండు మూడున్నాయి. ఛందస్సు వొకటి. గణాలు సరిపెడితే ఒక మోస్తరు లయ కుదురుతుంది. కడంవి నిఘంటువుల్లో మాటలూ, వ్యాకరణాల్లో ప్రత్యయాలూను. ఇవి వాడుక భాషలో లేకపోవడంచేత ఒక విలక్షణ ధ్వనిని కొలుపుతాయి. అంతటితో ఆనందించే వారు అనేకులు. గంగిరెద్దుమీద గుడ్డపాతలవలె యివి లోపల పసను కమ్ముతవి. రసం ఆట్టే లేని తలపులకు గద్య రచన తగి వుంటుంది. రసం చాలని చోట పద్యరచన విరసం. అందుకు తోడు తలపులు తక్కువైతే వృత్తాలు నిండడం కోసం గంగిరెద్దు గుడ్డలు మెట్లుగా పడవలె. ఆ గుడ్డలనైనా అందంగా అమర్చడం చేతకాకుంటే మాటలు మాసి, అన్వయం చెడి, పద్యాలు టొంకర నడకలు నడిచి కవిత్వం కపిత్వం అవుతుంది.
పెద్ద కవులకే పొల్లు మాటలు లేకుండా వొదగని చంపక మాలలకు, ఉత్పలమాలలకూ తలపడితే అంత్య గురువు లభించుటకు గాను, ఏకాక్షర శబ్దాలు అతకవలసి వస్తుంది. యతి ప్రాసలకోసం నిరర్థక పదములను ఫర్లాంగు రాళ్ళ వలె నిలవెయ్యాలి. కౌపీన సంరక్షణార్థ మయం పటాటోపః!"
రెండో పద్యంలో నియమ శబ్దం ప్రాసకోసం రెండుమార్లు వెలసింది. మూడో పద్యంలో ప్రాసస్థానమందు "1. భువిని, 2. కవులు, 3. అవనిని, 4. కవివరులు" అమిరాయి. వృత్తం తలపెట్టేటప్పటికల్లా భూ దేవత శ్రీరాములు వారికి తోడై సాగిస్తుంది. యుక్తమే కదా!
మొదటి పద్యంలో 'ఇల'
రెండవ పద్యంలో 'ఉర్విలోన'
మూడో పద్యంలో 'భువిని' 'అవనిని,' అని జమిలినవి. ఆరోపద్యంలో "ఉర్విలో”” “సుండు” “సుమీ” కూడా దగ్గిర సీస చరణాల్లో తగిలాయి. మొదటి పద్యంలో గ్రామ్యా వలంబకులు 'కొందరు' అయి, మూడో పద్యంలో 'అందరు' అయినారు. అందులో శాస్త్రులుగారు కలిసిరో లేదో?
"కాలము చేయు చిత్రమొకా” అని మొదటి పద్యం ఎత్తుబడి చేసిన్ని, మళ్ళీ యేమి చిత్రమో, అంటేనే గాని పద్యం ముగిసింది కాదు. "నింద్యమంచు” అనే దానిని కమ్మెచ్చున సాగదీసి, నింద్య మటంచని, యీడిస్తేనేగాని, గణాలు సరిపోయినవి కావు. మచ్చులు చూపాను. ఆరుమాటల్లో చెప్పవలసిన భావం, ఆరు పద్యాల్లో చెబితే వొచ్చే అనర్థకాలన్నీ యెవడితరం చెప్పడానికి? "అమలిన తారకాసముదయంబుల నెన్నను .... విధాతృనకైనను నేరఁబోలునే?”
ఇక ఆంధ్ర శబ్ద చింతామణి, అహోబలీయము, అప్పకవీయము మొదలైన లక్షణ గ్రంథములలోని నియమములను, పటుక్కుమని త్రెంచినచోట్లు కొన్ని చూపుతాను.
1. అరసున్న వుండవలసిన చోట లేకపోవడం (అ) ఎక్కుడు బొందగోరి (ఆ) తెల్గు జేర్పగా (ఇ) ఇలగోరుచు (ఈ) అబ్రమౌగదా. 2. అరసున్న వుండగూడని చోట వుండుట : (అ) జీవమున్ జయముగ (ఆ) తిప్పలుఁ దెచ్చిపెట్టి (ఇ) వ్రాయగఁవచ్చు (ఈ) ఓం కవివరులార
3. స్థిరానకు ముందు పూర్ణానుస్వారం కావ్యములందున
4. సరళాదేశం చెయ్యవలసిన చోట మానడం : (అ) చాల ప్రయాస (ఆ) ఐయినను చేత
5. సరాళాదేశం చెయ్యరాని చోట చెయ్యడం : (అ) మన దెల్లు (ఆ) ఆంధ్రము బాడుసేయ.
6. ద్రుతముపై గసడవాదేశము : (అ) వలయుంసుడు (ఆ) వలెసుమీ
7. కళలను ద్రుతాంతములుగా వాడడం: (అ) కాంచక నప్పకవీయ మాదియౌ (ఆ) ఇంచుకనైనను.
8. కక్కూర్తి ప్రయోగాలు, అపశబ్దాలు : (అ) మున్ (ఆ) వద్దు (ఇ) విప్పలు (ఈ) చదువుకోవలెను (ఉ) కష్టముగూడను (ఊ) మొండి వివాదలేల యని మూర్ఖులతోడుత నంచు (ఋ) ప్రయాస.
కొనకు శ్రీరాముల సచ్చిదానందశాస్త్రులుగారు నిజం చెప్పేశారు ఇదుగో : దండిగ గ్రామ్య శబ్దముల దార్చుచు నాంధ్రము బాడుసేయఁగా జండతపూనకున్ననిఁకఁజయ్యన దెళ్ళును భాషయుర్విలో”.
"ఆంధ్రము పాడుసేయగా” శాస్త్రులుగారు చండతపూనారు. కడంవారిని పూనమన్నారు. గాని ఆ హెచ్చరిక అనవసరం. మాటా-మంతీ -5 యిద్దరు రాజులు రారాజు బంగాళాకువచ్చి, చేసిన చనువూ, చూపిన నెనరు కాంచితిని. కంటిని పట్నంపల్లె విరగబడి, ప్రేమార్థములైన చూపుటరులతో రేని నించి పూజించడు. వారీవీరి సరాగం పొలయల్క తీరిన ఆలుమగల కలయికను పోలినది. మన ఆంగ్లేయుల రాజు, ఒక చిన్న కరణం మొదలు వైసరాయి వరకూ, అధికారములకు చిన్నె. ఊరినాయుడు మొదలు మేటు తీర్పరి వరకూ, పద్ధతికి చిన్నె. ప్రజలను పీడిస్తూ, కాపాడే కనిష్టబు మొదలు దండిదండ నాయకుడి వరకూ, మగటిమికి, చిన్నగాని యీనాడు జాజిన్ ప్రభువు, మనపాటి మీద చిన్నెలుదాల్చి, దయాధర్మముల అవతారమై నిలిచాడు. బంగాళా విరాళికొనడము ఆశ్చర్యమా? ఇది వొక రాజు కథ : కవి రాజైన రవీంద్రునికి బంగాళా చూపిన మిక్కుటపు పేరూ, పొరలేని భక్తి, యేనాడేరాజెరుగును? ఆ మహాకవి భాషను యెత్తాడు. తలపుల నెత్తాడు. చెయ్యులనెత్తాడు. కీర్తి వెన్నెలల దిక్కులు నింపాడు. అది తనకీర్తి అని వంగదేశము గుర్తెరిగినది. అతడు తన సిరియని గర్వించినది. దేవుఁడని పూజించినది. చిత్పూర్ రోడ్డులో చిన్న సందొకటి మళ్ళితే యెదుట పొయిపొక్కిళ్ళవలె మూడు మేడలు కనపడతవి. అందులో మధ్యది, కలకాలమూ దేశ చరిత్రములో వన్నెకెక్కి వుండగలదు. అది రవీంద్రునిది. బ్రహ్మసమాజ మహోత్సవం రోజున, చీకట్లు కమ్మేవేళపుడు నేను వెళ్ళాను. గుమ్మం దాటితే బ్రహ్మాండమైన అంగణం. ఆ అంగణం చుట్టూ ఉన్నతమైన యెజ్జిటికల మేడ. మేడల చూర్లంట మెరుపు దీపాలు వెలుగుతుండినవి. అంగణమంతా సామాజికులతో నిండివుండెను. చూడబోయిన మా బోట్లమూ, టాగూరు కుటుంబమువారూ, దక్షిణపు ప్రక్క మేడమీద నిలుచుంటిమి. మా కెదురుగా సారసను నాదుల పూజా భవనం వుండినది. లోపల దీపములు లేమిని, వెలుగు చీకట్లు పెనుగులాడుతున్న ఆ పూజా మందిరములో బ్రాహ్మ సుందరులు ఆకులలో పండ్లవలెనూ, చదువు చీకట్లో మరుగున ముక్తి కాంతవలెనూ, కనీ కానరాక వుండిరి. గురుజాడలు 600 యిద్దరు రాజులు అంగణంలో దక్షిణం వేపు సామాజికులకు యెదురుగా వొక మంటపం యేర్పరిచారు. ఆ మంటపం మీద ముందుకు రెండు యెజ్జగాజు దీపపుచెట్ల నడుమను రవీంద్రుడూ, వొక పండితుడూ, ధోవతి అంగ వస్త్రములతో కూచున్నారు. వారి యిరుప్రక్కలనూ, వెనకకూ సామా జికులలో పేరుపడ్డ వారూ, గాయకులూ కూచున్నారు. వారిలో పండిత శివనాథ శాస్త్రిగారినీ, హేరంబచంద్రమిత్రగారినీ పోల్చగలిగితిని. నేను వెళ్ళేసరికి రవీంద్రులు మేఘ గర్జనమును పోలిన కంఠంతో భగవంతుణ్ణి కొని యాడుతుండెను. సామాజికులకు జ్ఞానోపదేశము చేస్తుండెను. మధ్య మధ్యను రవీంద్రుడూ, గాయకులూ భక్తి పారవశ్యం పుట్టేటట్టు కీర్తనలను పాడుతూ వచ్చిరి. అప్పుడప్పుడు మెరుపు దీపాలు గప్పుగప్పున ఆరి వెలుగుతూ వచ్చినవి. అలా ఆరినప్పుడు భవనం మీద రాలిన చీకటి యొక్క రెక్కలమీద భగవంతుడు సన్నిహితుడయినట్టు మనస్సుకు తోచేది. కాదా? చీకటే వెలుతురు. మరుపే జ్ఞానము. చిన్ననాటి మాట యేమో, యిప్పుడు రవీంద్రుడుత్కృష్టమైన బతుకు బతుకుతున్నాడు. శాంతుడు, భక్తుడు, దయాపరుడు, పరోపకారమే బతుకునకు వినియోగమని నమ్మినవాడు, మంచివాడు. ఇట్టి మహాత్ములు వుండబట్టే బంగాళా బాగై వన్నెకెక్కింది. బ్రహ్మమతం బంగాళాకు చాలా మేలు చేసింది. కొందరికైనా స్త్రీలకు చెరవొదల్చింది. బంగాళాకూ, సీమకూ బాట వేసింది. ఆ సుందరులు దీపమువలే దేశమునకు వెలుతురు నిస్తు న్నారు. ఆ బాటను సీమనుండి నాగరికత ఆ దేశానకు దిగబడ్డది. రవీంద్రుని వాజ్మాధుర్యంను క్రోలి క్రోలి, ఉత్సవం ముగిసే వరకు వుంటే, తొడిదొక్కిడి లావగునని యెంచి, నా మిత్రులను వీడ్కొని చీత్పూరు రోడ్డుకు వచ్చితిని. అక్కడ అంతకంటే తొడిదొక్కిడి కానవచ్చింది. ఆ రోజు మాఘ పంచమి. బంగాళీలు సరస్వతీ పూజ చేస్తారు. రాత్రి ఉత్సవంలో సరస్వతీ ప్రతిమల్ని ఊరేగిస్తారు. ఆ పట్నంలో సామంతులు యిసకపాతర. ప్రతి సామంతుడూ తన యింట సరస్వతిని నిలిపి వూరేగిస్తాడు. ముచ్చిపనితో ధగధగలాడే వాహనాల తోటి, రథాల తోటి జన ప్రవాహం ఆ వీధిలో అడ్డు కలిగిన నీటి ప్రవాహం వలె పొంగి వెనకాడుతూ, కొంత సాగుతూ యెడతెగక కనబడినది. ఉపాధికల ప్రతి బంగాళీ యింట్లోనూ, మొదటి అంగణంలో రమ్యమైన పూజామందిరం వుంటుంది. కాళీ, సరస్వతీ మొదలైన దేవతల వుత్సవములు ఆ మందిరంలో విశేషమైన వైభవంతో చేస్తారు. ఆ పూజలు ఆబాల వృద్ధులకు, స్త్రీ, పురుషులకు యింటిలిపాదికీ పనులు కల్పిస్తవి. మందిరమును అలంకరించడం, పూజా ద్రవ్యములను సమకూర్చడం స్త్రీ బాలుల వేడుక. యీ రీతిని యింటిలిపాదీ కలిసి చేసే పూజలు మనదేశంలో తక్కువ. నలుగురికీ గురుజాడలు యిద్దరు రాజులు 601 వినబడే దేవతార్చనగంట వొక్కటే కొన్ని యిళ్ళలో మిగిలింది. అదైనా దేవుణ్ణి జ్ఞాపకం చెయ్యదు. భోజనపు గంట అయింది. మిగిలిన యిళ్ళలో ఆ గంట మేజాబల్ల మీద యెక్కింది. 1912వ సంవత్సరం, డిసెంబరు నెల, రెండవ తేదీని కలకత్తాలో రవీంద్రుణ్ణి చూశాను. ఆయన ఒక పెద్ద టేబిల్ ముందు కూర్చునివున్నారు. గది అలంకరణతో, వస్తు సామాగ్రితో ఏమంత తీర్చిదిద్దినట్టు లేదు. భవంతి మొదటి అంతస్తులో పశ్చిమదిశగా వుంది ఆయన గది. రవీంద్రుడి కుడి భాగాన యువకుడొకడు ఆసీనుడయి వున్నాడు. టాగూరు సాధుస్వభావి. మాటపొందిక మహా మెత్తన. నాజూకైన ముఖలక్షణాలు. తేటగా, సున్నితంగా నవ్వుతారు. మాటలాడేటపుడు పురుషత్వం తొణికిసలాడుతుంది. ఒక విధమైన ప్రశాంత, మనోనిశ్చయం ప్రస్ఫుటమౌతుంది. మన వీరేశలింగం పంతులుగారి మనః ప్రవృత్తికిది పూర్తిగా విరుద్ధం. ఆయన వలె, రవీంద్రుడు గడబిడగా మాట్లాడరు. సంభాషిస్తున్నప్పుడు సజీవత్వం వెల్లడి అవుతుంది. అయితే, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు కంఠం సంగీత శ్రావ్యంగా వుంటుంది. వినసొంపైన గొంతుక. రవీంద్రునిది. బెంగాల్ లో నాటక రచన నీరసావస్థలో వుందని ఆయన అభిప్రాయం. షేక్స్పియర్ నో, లేదా మరొక ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయితనో, వంగదేశ కవులు అనుసరిస్తున్నారని చెప్పలేం; కొంతమంది రచయితలు మాత్రం పాశ్చాత్య సాహితీపరులతో సంపర్కం పెట్టుకుంటున్నారు. కానీ వారి రచనా ప్రభావం, వీరి నాటకాలను సోకడం లేదు. రంగభూమి శిధిలావస్థలో వుంది. ప్రేక్షకులను ఆకర్షించడానికై యధేచ్ఛగా పాటలను, పదాలను నాటకాలలో తెచ్చి పెడుతున్నారు. మొదట ఈ నాటకాలు చారిత్రక యితివృత్తజనితాలు. వీటిలో చాలా మటుకు రాజపుత్ర కథలతో నిండినవే. ఇప్పుడిప్పుడు పౌరాణిక గాధలలోనికి దిగజారిపోయాయి. గేయకవిత్వంలో బెంగాల్ ముందంజ వేసింది. రవీంద్రుడు వాడే భాష వ్యవహారికమే. అంటే అందరూ మాట్లాడుకొనే భాష, ప్రామాణిక గ్రంథప్రయోగాలకు విరుద్ధమైన భాష. వ్యాకరణ సూత్రాలు కాదంటూ ఈ రకమైన బెంగాలీ భాషను ప్రయోగిస్తాడని ఆయనను పండితులు నిందిస్తారు. ఇప్పుడు మద్రాసు యూనివర్శిటీ గ్రాంథిక భాషను సంరక్షించాలని చేస్తున్న ప్రయత్నమే, నాడు కలకత్తా విశ్వ విద్యాలయమూ చేసింది. కలకత్తాలో జనులు మాట్లాడుకునే భాషలో తప్పిస్తే, ఇంకొక భాషలో మనకు వ్యాకరణ గ్రంథం ఎక్కడ లభిస్తుంది? “తెడకొరి తెచ్చె” అనే పద ప్రయోగము మీద రవీంద్రునికీ, నాకూ సంభాషణ జరిగింది. ఆయన కొద్దిసేపాలోచించి, పూర్వకవుల ప్రయోగాలలో వుందని చెప్పారు. “3” అనేది జానపదుల భాషలో కనిపిస్తున్నదని నేను సూచించాను. గురుజాడలు యిద్దరు రాజులు 602 ఆంగ్ల సారస్వత బోధనా పద్ధతులు చాలా లోపభూయిష్టంగా వున్నాయని వారి అభిప్రాయం. ఆంగ్ల సాహిత్యంపై హెన్రీ మోర్లే యిచ్చిన ఉపన్యాసాలను, రవీంద్రుడు ఎంతో ఆహ్లాదంతో విన్నారు. విద్యార్థులకు పరీక్షలు చాలా ఆవశ్యకాలని వారి మతం. సిస్టర్ నివేదిత ఆయన కథలను కొన్నింటిని అనువదించింది, కాని ఆమె చనిపోయిన తరువాత, ఆ వ్రాత ప్రతులు కనిపించలేదు. 'మైకేల్'ను రవీంద్రుడు అనుసరించారు. ఆయన గీతంలోని పాదాలు ఏ పాదానికాపాదం అంతం కావు. ప్రయోగాలనూ, వ్యాకరణ నియమాలనూ, కాలదన్ని సరికొత్త శబ్దరూపాలను కల్పించినా, ఆయన సృష్టించిన 'శబ్దాలు' చలామణిలోకి రాలేదు. అందుచేత మన వెనకాల ఒక టిప్పణి వుంటే కానీ, కావ్యం అర్థం కాదు. భాష ఐలీ అయిపోతున్నా సరే, ఆయన “మైకేల్” అనే కావ్యం శబ్దాలంకారాలనే దృష్టిలో పెట్టుకుంది. ఈ విషయాన్ని నేను రవీంద్రునికి సూచించాను. రవీంద్రునికొక పాఠశాల వుంది. ఆ స్కూలులో తనకు తానై సహాయం చేసుకోవడ మెలాగో చెబుతూ, ఆయన ఉపజ్ఞావంతమైన విద్యను ప్రసాదిస్తూ వుంటారు. మెట్రిక్యులేషను, విశ్వవిద్యా లయ పరీక్షలకు కూర్చునే విద్యార్థులు ఎన్నెన్నో విషయాలను అధ్యయనం చేయవలసి వుంటుంది. తన ప్రక్కనే కూర్చున్న యువకుణ్ని 'కావ్యభాష" పై ఒక వ్యాసం వ్రాయమని రవీంద్రుడు ఆదేశించారు. అరుణాస్పదమనే నగరాన్ని వర్ణిస్తూ పెద్దనగారు "అచట బుట్టిన చిగురు గొమ్మైనఁజేవ” అన్నారు. అదే విధంగా కలకత్తా పట్టణంలో చిట్టచివరకి దోమలుసైతం పొలిటీషియన్సే! గురుజాడలు 603 యిద్దరు రాజులు కవిత్వము: వర్సు వర్తు వర్డ్సు వర్తు కవిత్వమునకును, అంతకు పూర్వము కవిత్వము వ్రాసిన ఇంగ్లీషు కవీశ్వరుల కవిత్వమున కును చాల భేదము కలదు. అతనికి ముందు పదునెనిమిదవ శతాబ్దమున నుండిన కవులు రెండు నిశ్చయములు చేసికొనియుండిరి. అవి యెవ్వియనిన (1) కావ్యమున నుపయోగించు మాటలు (Poetic Diction) నాజూకు గను లలితముగను నుండవలయు ననియు (2) కవిత్వమున వర్ణించతగిన వస్తువులు (Subjects) కూడ సామాన్యమైనవి కాక నాజూకు గాను, లలితముగాను, గొప్పవిగాను నుండవలయుననియు. మనలో కూడా కావ్యములు లోకములో వాడుకలో లేని గ్రాంథిక భాషలోనే వ్రాయవల యునని లక్షణములు వ్రాసిన కవుల నిర్ణయము. అటుల గాక, సామాన్యమగు వస్తువులను గూర్చి, వాడుకలో నుండు మాటలలో కవిత్వము చెప్పి కవితా సామర్థ్యము వలన వానికి సొంపు తెచ్చి చదువరుల మనసుల రంజింప చేయ వచ్చునని వర్డ్సువర్తుని అభిప్రాయము. అట్లని నాజూకు మాటలనతడు ఉపయోగించక పోలేదు. నాజూకగు సంగతుల గూర్చి కావ్యములు వ్రాయకపోలేదు. ఇతని కాలము నుండి ఇంగ్లీషు కవిత్వము తోవయే మారి మిక్కిలి గొప్ప స్థితికి వచ్చినది. మన దేశపు కవులు కావ్యములలో వర్ణించు పాత్రములు, దేవతలు, దేవతా స్త్రీలు, రాజులు, రాజకుమారికలు, పెద్ద యింటి పురుషులు, స్త్రీలు, వీరి చర్యలు అవస్థలనే వర్ణింతురు. అందులో కథానాయకులకు (Heroes of the poem) లోకములో కానరాని గుణ సంపత్తి, పరాక్రమాదులు, సౌందర్యమును ఆరోపింతురు. తక్కువ జాతి వారిని గూర్చి వర్ణించి వ్రాయరు. కవిత్వమున వ్రాయతగిన చర్యలు అట్టి తక్కువ మనుష్యుల బ్రతుకులలో నుండనేరవని మన దేశపు కవుల అభిప్రాయము. వర్డ్సువర్తుకు పూర్వపు కవుల అభిప్రాయము కూడా కొంతవరకట్టిదియే. ఆధునిక కవులు అటుగాక మనుష్యుల సుఖ దుఃఖములు అన్నియును వొక్కలాటి వేయనియు, మనిషి అయివుండుటలో వకని తక్కువ, వకని హెచ్చు లేదనియు, సుగుణములు, సత్ప్రవర్తన గొప్ప అవస్థలో నుండువారికిని, తక్కువ అవస్థలో నుండు వారికి సామాన్యములనియు, కావ్యములను రసవంతము చేయుటకు రాజుల, రెడ్ల, బ్రాహ్మణుల చర్యల వర్ణన యెటుల తగియున్నదో, రయితుల యొక్కయు, తక్కువ జాతుల వారి చర్యలు కూడా నటులనే గురుజాడలు కవిత్వము : వర్డ్సువర్తు 604 తగియున్నవనియు నభిప్రాయపడి, యింపయిన కావ్యములు తక్కువ స్థితిలో నుండు మనుజుల సుఖ దుఃఖముల గూర్చి వ్రాసిరి. వర్డ్సువర్లు అందుచేతనే ఒక గొల్లవాడి బ్రతుకును గూర్చి కావ్యము వ్రాసెను. మన పండితులీ కావ్యమును జూచినచో “ఇదియా కావ్యము; ఒక గొల్లవాడు కొండలవెంట దిరిగెనట. వాని కుమారుడు చెడు తిరుగులు తిరిగి దేశాంతరగతుడాయెనట. తండ్రి మందకు పాకకట్ట నారంభించి దుఃఖముచే గాంచలేకపోయెనట. ఇదియా కావ్యమునకు తగిన కథ?” అని నవ్వుదురు? పుట్టుకవల్ల గొప్ప రానేరదు. గుణయోగ్యతల వలననే గొప్ప వచ్చును. పెద్ద యవస్థలో నుండు దుర్జనుని కన్న తక్కువ స్థితిలో నుండు సజ్జనుడు నిజమైన గొప్పవాడు కాడా? టెన్నిసన్ అనెను : "Kind hearts are better Than coronets and served Faith than Norman blood" పెద్ద ప్రభువులై యుండుట కంటే దయగల హృదయము కలిగియుండుటే శ్రేష్టము. రాజరక్తము కన్న నమ్మిన నీతియే శ్రేష్టము. బర్ను కవియనెను : "Rank is but the guinea stamp The man is the gold for all this" " లోకములో యెక్కువ అవస్థ అనునది తెచ్చిపెట్టు కున్నది. నాణెముపై ముద్దర వంటిది. మనిషే బంగారము. అనగా గుణయోగ్యతలను బట్టి మనిషికి కలుగును. గానీ ఉద్యోగము వలన, ధనధాన్యముల వలన పెద్దింట పుట్టుట వలన కలుగనేరదు. మైకేల్ అను గొల్లపిల్లవాడు అట్టి బంగారము. గుణ సంపదచే ఎన్నికైన మనుష్యుడు. గురుజాడలు 605 కవిత్వము : వర్డ్సువర్తు వంశీయ సాహిత్య పరిషత్తు నారాయణమూర్తి పంతులు, నేను జస్టిస్ ఆశుతోష ముకర్జీగారిని చూడవెళ్ళాం. కొంత ప్రసంగమైన తరువాత “మీలో గొప్ప విద్వాంసులను చూడవలెనని నాకు అభిలాష కలదని” నేనన్నాను. సాహిత్య పరిషత్తులో కొందరు ప్రముఖుల్ని మమ్మును కలుసుకోవడనుకు సమావేశం చెయ్యమని, వారు దాస్ గుప్తాగారితో శలవిచ్చారు. దాస్ గుప్తాగారు వకీలు, బంకించంద్రుడి 'ఆనందమర్' యింగ్లీషు చేశారు. అయిదుగంటలకు సాహిత్య పరిషత్తుకు రమ్మని మాకు ఆహ్వానపత్రిక వచ్చింది. మేం వెళ్ళాం. సాహిత్య పరిషత్తు మందిరం అప్పర్ సక్యులర్ రోడ్డులో జైనమందిరానికి సమీపంగా వున్నది. అది ఒక పెద్దమేడ. కట్టడానికి నలభై యాభై వేలు అయివుండును. గుమ్మం దాటగానే కీర్తిశేషులయిన కాసింబజారు మహారాజావారి ప్రతిమ నేత్రోత్సవం చేసింది. ఆయన స్ఫురద్రూపి. శ్రీ పిఠాపురం రాజావారి వంటి విద్యాభిమానులు. పరిషత్తుకు చాలా ద్రవ్య సహాయం చేసి వుండిరి. అప్పట్లో మేడ రెండో అంతస్తులో పరిషత్తుతో సంబంధించిన యగ్జిబిషను అనగా వింతలయి నట్టి గొప్పవైనట్టి వస్తువులను చూపుట జరుగుతుండెను. మేడకు దక్షిణంవేపు అరలా వొకటి వున్నది. ఆ అర సభలైనప్పుడు, నాటకములు ఆడడానకూ, ఉపన్యాసము లిచ్చుటకూ, ఉపకరిం చును. ఆ అరలో యెదురుగుండా బంకించంద్రుడి పూర్ణచిత్రము కద్దు. బకించంద్రుడు వంగభాషా కావ్య ప్రపంచమునకు బ్రహ్మ అనిన్ని, చంద్రుడు సాటిలేని కవి అనిన్ని ఆ దేశంలో పండిత పామరుల నమ్మకం. ఈయన ముఖాన శాంతమూ శౌర్యమూ కనబడతవి. బంగాళీలలో అనగా నాగరికులలో రెండు రకముల మనుషులను కనిపెట్టాను, గుండ్రని ముఖం, స్థూలకాయం వకటి. ఒంటిపేక కోలముఖం మరివకటి. చిన్నతనంలో బంగాళీ పిల్లలు చాలా సుందరులుగా వుంటారు; చిక్కితే (గిల్లితే) పాలుగారు చెక్కులు; విశాల నేత్రములూ తరుచు. బంకిం కొంచము వొలంగా వుంటాడు. ఆయన పఠానకు యెడంవేపు భారతమును బంగాళీ గద్యంగా రాసిన ఒక కవిపఠం వున్నది. దానికి యెడంవేపు మైకేల్ మధుసూదన దత్తు, గురుజాడలు వంశీయ సాహిత్య పరిషత్తు 606 అలలు తీరిన కత్తిరీజుత్తు పాపిట దువ్వి తా రచించిన "మేఘనాథబధ” అను మహా కావ్యమును చేతబూని తన విశాల నేత్రములతో చూచెడి వారివేపు చూస్తూ పఠంలో కూచున్నాడు. బంగాళా కవుల పటములు బొవుబజారు యిండియన్ ఆర్డు స్టూడియోలో అణాపరక (అణన్నర) కొకొక్కటి అమ్ముతవి. మధుసూదనుడి పెదవులలో చిన్న నవ్వొకటి దాగి ఉంది. ఈయన నాతో మాట్లాడు తూన్నట్టే కనిపిస్తాడు. ఆనాటి యింగిలీషు బారిష్టరులు వీరివిద్యకు జంకేవారని 'రీస్ అండ్ రయ్యత్' పత్రిక సంపాదకులు బాబూ జోగీశ చంద్రదత్తుగారు నాతో చెప్పినారు. గ్రీకు, లాటిన్లు సంస్కృత భాషను, ఫ్రెంచి, జర్మను, ఇవియే కాక తెలుగు, అలవమును మైఖేలు నేర్చియుండిరట. చదువుకునే రోజుల్లోనే వివాహము చేతునని తండ్రి సంకల్పించగా అందుకు అంగీకరించక కిరస్తానం అవలంబించి 1848వ సంవత్సరములో కొందరు చెన్నపట్నపు సహాధ్యాయులతో కూడి చెన్నాపట్నం వెళ్ళాడు. అక్కడ జీవనం జరగడం కష్టమై పత్రికలకు రాసి కాలం వెళ్ళబుచ్చవలసి వచ్చింది. ఆ రోజుల్లోనే బైరన్ రీతిని “కాప్టిల్ లేడి” అనెడి యింగ్లీషు కావ్యం రాయడం. ఇంగ్లీషున గ్రంథములు రాసి పేరు ప్రతిష్ఠలు సంపాదింతుమనే ఆనాటి బంగాళీ విద్వాంసులు ఆశించిరి గాని దేశ భాషను తలపెట్టరయిరి. మధుసూదనుడి మొదటి భార్య ఒక ఇండిగోపొంటరు కుమార్తె. భార్యాభర్తలకు సమరసచెడి ఆమె విడాకులు పుచ్చుకున్నారు. తిరిగి మధుసూదనుడు వరించిన మరొక దొరసాని కష్ట సుఖములలోను ప్రతిష్ట అప్రతిష్టలలోను ప్రేమతో కనిపెట్టి తిరిగినది. ఆమెకు సంతానం కలిగెను. యెనిమిది సంవత్సరాలు చెన్నపట్నంలో వుండి కలకత్తా తిరిగి వచ్చేసరికి పెళ్ళినాటి పెద్దపెళ్ళాం అంటకాగింది. గురుజాడలు 607 వంగీయ సాహిత్య పరిషత్తు విద్యా పునరుజ్జీవనము విద్యలలోనూ, కళలలోనూ మునపటి గ్రీకులు సాటిలేనివారై యుండేవారు. గ్రీకుల స్వాతం త్ర్యము సన్నగిలిన తరువాత రోమనులు తలయెత్తి ఆనాటి లోకమును ఏకఛత్రంగా యేలిరి, గాని విద్యలలో గ్రీకుల చాయను బట్టి పోయిరి. కొంతకాలానకు, ఇటలీ దేశము కిరాతులు జయించడమూ, రోమనులు కిరస్తానులు కావడమూ జరిగింది. కిరస్తానులకు కిరాతులకు గ్రీకుల విద్యలయందు ఆదరం లేక దేశం కొన్ని సంవత్సరములు అజ్ఞానాంధకారం కమ్మి వుండినది. అంతట కొన్ని కారణముల చేత ఇటలీలో జాత్యభిమానమూ, దేశాభిమానమూ మొలకెత్తి బలిసినది. పాత విద్యలు నేర్చను అభిలాష కలిగినది. ఆ సమయంలో యిస్తంబూల్ తురకల పాలుకాగా, అక్కడి గ్రీకుపండితులు కొందరు యిటలీకి వచ్చి అక్కడి ప్రభువులవల్ల మన్ననలంది, గ్రీకు విద్యలను తిరిగి లేవనెత్తిరి. దీనినే “రివైవల్ ఆఫ్ లెటర్స్” (Revival of letters) అని అంటారు. యూరోపుఖండం అజ్ఞానంలో నుండి మేలుకోవడం అప్పుడే. అదివరకు టోపీ జాతులవారు కిరస్తానీ మతమే నిజమైన మతమనిన్ని, విగ్రహారాధన చేసే గ్రీకు, రోమనుల విద్యలలో విలవ వుండనేరదనీ, వారి విద్యలు చదువుటే పాపమనీ నమ్మి వుండేవారు. ప్రజలకు విద్య నేర్పితే దేశం బాగుపడునన్న జ్ఞానం లేకపోయెను. బైబిలు నిర్జీవమైన లాటిను భాషలో చదివే వారు. దైవ ప్రార్థనలు కూడా ప్రజలకు అర్థముకాని లాటిను భాషలోనే వుండేవి. బయిబిలు దాటి సత్యమూ, జ్ఞానమూ లేదనిన్ని, విగ్రహారాధకులై వుండే గ్రీకు, రోమనులు మూర్ఖ్యులనిన్నీ కిరస్తానులు నమ్మేవారు. ఇటలీలో గ్రీకు, లాటిను సరస్వతి ఉదయించగానే జనులకు కళ్ళ మసక మాసినది. బుద్ధిమంతులు కిరస్తానుల మోటతనమూ, మూర్ఖమూ, విగ్రహారాధకులై వుండిన గ్రీకు లాటినుల జ్ఞానమూ, కళాకౌశలమూ చూడగలిగిరి. యూరోపులో బుద్ధికి గొలుసులు విడినవి. గ్రీకు, లాటిను విద్యలను చేపట్టుట పరువు ప్రతిష్టలకు తెరువైంది. వాటి రసానకులోనై విద్వాంసులు దేశభాషను నిరసించేవారు. గాని దేశాభిమానమూ, జాత్యభిమానమూ ప్రబలుట చేత దేశ భాషలో చెయిపట్టి రాయించింది. ఆ కథ ముందు చెబుతాను. విద్యా పునరుజ్జీవనము గురుజాడలు 608 లాటినుకూ, యిటాలియనుకూ ఆనాడు వుండే భేదం, సంస్కృతముకూ, ప్రాకృతములకూ వుండిన యట్టిది. కొంతవరకు గ్రాంథిక తెనుగుకూ, వాడుక తెనుగుకూ వున్న భేదం వంటిది. వుత్తర దేశాలలో సంస్కృత ప్రాకృతములనే గాని, దేశ భాషలలో రాయడం పరువు తక్కువని పండితులు చాలాకాలం తలచేవారు. ఇప్పుడు ఆ భ్రమ తరిగిపోయింది. బంగాళీలలో లేనేలేదు. రవీంద్రనాధుని ఆదరించడముకు సాహిత్య పరిషత్తు భవనంలో సభ అయినప్పుడు: “యిప్పటి బంగాళీ కవులు సంస్కృత కవులుగా మారినారు” అని వొకసందర్భములో అన్నాడు. తెలుగు దేశంలోనూ యిట్టి చిక్కుమునుపు కలిగింది. ఇప్పుడు కలుగుతుంది. సంస్కృతాన్ని పట్టి అప్పుడు కలిగింది. గ్రాంథిక భాషను పట్టి యిప్పుడు కలుగుతుంది. ఆంధ్రశబ్ద చింతామణికర్త అన్నాడు: “స్వస్థాన వేష భాషాభిమతా.....” తొలికాలపు నాటి తెలుగు కవులు తాము ఉభయ భాషా కవులమని చెప్పుకోకపోతే గౌడు మూకలో కలుపుతారేమో అని, “ఉభయ భాషా కావ్యరచనాభిశోభితు”, “ఉభయకవి మిత్రు” అని తమ సంస్కృత పాండిత్యము వెల్లడించుతూ వుండేవారు. తెనుగులో కూడా కావ్యములు రాస్తే ప్రత్యవాయం లేదని అధర్వణుడు చాటభారతం రాశాడు. భట్టకలంకదేవుడి శబ్దానుశాసనం యిప్పుడు దొరకడం కష్టం. 1890 సంవత్సరంలో మైసూరుగవర్నమెంటువారు అచ్చువేశారు. ఇది వొక గొప్ప కన్నడ వ్యాకరణం. దీనిని గురించి రైదొర వ్రాసినారు. " "The date of its completion as given at the end of the work corre- sponds with 1604 A.D. it is thus from its period, not an antique treatise dealing with archaisms and absolete terms; interesting as a literary monu- ment, though of citter practical value now, but has the advantage of treat- ing of the whole range of the language down to the modern period and its rules are such as apply to the present times." కన్నడమునకు వ్యాకరణమేల? అనే విషయమును, భట్టకలంకుడు యిలాగున చర్చించాడు:- మంగళశ్లోకం “నమః శ్రీవర్ధమానాయ విశ్వవిద్యావబాసినే ! సర్వభాషామయా భాషా ప్రవృత్తా యన్ముఖాంబుజాత్”. విద్యా పునరుజ్జీవనము గురుజాడలు 609 “శబ్దానుశాసనంవా ప్రస్తుతమ్. తత్రచ అనుశాసన విషయభూతాః శబ్దాః కర్ణాటక ఏవ. తే చ సంస్కృత శబ్దవత్సకల దేశ ప్రసిద్ధాః సకల శాస్త్రాపయోగితయాసకల మహాజనపరి గ్రాహ్యశ్చ నభవస్త్రి; భాషా విషయత్వాత్, భాషాయాం చ పామరాణా మేవాధికారో న పణితానామితివై తేను శాస్యాః ప్రయోగార్హ త్వాదితి కేషాం చిత్సంస్కృతానామన్యధా ఖ్యాతిం ప్రత్యాఖ్యాతు మేతదేవ విశేషణం సర్వఇతి ప్రవర్ణితవాన్ గ్రంథకారః. ఇదమ కూతమ్ యథాసంస్కృత శబ్దాః సాధ్వసాధు వివేచన విషయతయాను శాసనారాః తథా భాషాశబ్దా అవి. గురుజాడలు 610 విద్యా పునరుజ్జీవనము ఆంధ్ర కవితాపిత అని బెజవాడ శాసనములో యుద్ధమల్లుని గూర్చి “రాజ్య పట్టంబుగట్టినపతి వ్రాసియున్నది. “బాడబు మహారాజాధి రాజు”ని గుంటూరు శాసనమున నున్నది. యుద్ధమల్లుడును అతని సంతతి వారును తామే పూర్వ చాళుక్య రాజ్యమునకు హక్కుదార్లమను వాదమున నిలిచియుందురు. “రాజసల్కిభూవల్లభుండ”ను చోట “సల్కి” అనుమాట “చాళుక్య" అనుమాటకు దేశ్యము. ప్రాచీనమగు శివానందయోగేశ్వరుని మరాఠీ వంశావళియును గ్రంథములో “చాళ్కే” అనుపేరు “చలకియా” “సాళంగే” రూపములు కూడ నీయబడినది. కవిరాజ మార్గము ఉపోద్ఘాతం 8వ పుట చూడుడు. చాళుక్య అనుమాటకు గల రూపములను గురించి Fleet, dynasties of the Canareses districts in Bombay gazette volume 1. Part Il' pages 336, 337 లోచూడుడు. “చాళుక్యర్” అను రూపము కుబ్జవిష్ణువర్ధనుని సతారా శాసనములో నున్నది. Indian antiquary vol. XXI. P.303) మరియు ఓఘాగారి పుస్తకము 1 పేజీలో నోటు చూడుడు. ఇరియటు దొరగారు సంపాదించిన శాసనముల వల్ల వేంగిగొంక రాజనునతడు యుద్ధమల్లుని వంశము వాడయినట్టు కానవచ్చుచున్నది. నా ప్రతి శుద్ధమైనది కాదు. శాసనపు రాతీలో కొంత ముక్క కూడా విరిగిపోయినట్లు తెలియుచున్నది. అసలు శాసనమును చూడడము ఆవశ్యకము, ఇరియటు దొరగారి ప్రతిలోని పంక్తులు కొన్ని ఈ క్రింద ఉదహరించెదను. “సదరు జిల్లా రావిమట్ల గ్రామంలో వూరికి పడమర వయిపున తాడిమళ్ళ ప్రకాశనాయుడు గారి లోగిలి ప్రహరీ గోడకు ఉత్తర భాగమున పడివున్న నల్ల రాతి మీదీ లివి. పయి పలకవాత యీ రాయిపయివరస కొంత విరిగిపోయినది. అందుచేత రాత కూడా కొంత పోయినది. “పుత్రస్తస్య త్రిణేత్రప్రభు... రాజేశ్యన్వర్థ సంజ్ఞ : కుముద వనహిత శ్రీ.... వతంస.... వేంగి గొంకేశనామా... గురుజాడలు ఆంధ్ర కవితాపిత 611 యుద్ధమల్ల నృప వంశాంభోధిర శ్న స్యతస్యాపో... సహా గతమహమమాత్యశ్చ సేనాపతి. యాశ్చాసౌ గుడియూరిపూ ర్శకబహు గ్రామాధినాథః. “స్వస్తిశక వర్షంబులు 1100 అగు నేటి వుత్తరాయణ నిమిత్తంబున గుడియూరి వెన్నపరెడ్డి కొడుకు దండనాయక మల్లిరెడ్డి దన్నేలిన శ్రీ మన్మహామండలేశ్వర వేంగి గొంక రాజునకు ధర్మముగా మాద్యపల్లి శకటేశ్వర మహాదేవర గుడియును మంటపము గోపుర ప్రాకారపరివార సహితముగా దను యెత్తించి దేవరకు సాలునకు మానులకు నిబంధన నైవేద్యములకు....” ఇరియటు దొరవారి శాసనములలోనే మరివక శాసనము కలదు. అది యిట్లున్నది. “బందరు జిల్లాలోని గణపవరం గ్రామములో గ్రామానకు తూర్పున సువర్ణ గుండం దక్షిణపు వైపున వేంచేసియున్న శ్రీ సువర్ణేశ్వర స్వాముల వారి దేవాలయం ముఖ మంటపంలో వాయువ్య మూల స్తంభం పడమర వైపు పలక మీద శాసనము. “స్వస్తి సమధీగత పంచమహాశబ్ద మహా మండలేశ్వర... పురనరాధీశ్వర, మానవ్యసగోత్ర హరీతిపుత్ర సోమవంశార్ణవ చంద్ర, సత్య హరిశ్చంద్ర, దళితరిపుదర రాజకందర్ప. యుద్ధమల్లవంశ సముద్ధరణ, భయలోభ... హర్న షట్సహస్రావనీనాయక, వయిరి భయదాయక శ్రీ మల్లేశ్వర మహాదేవ దివ్యశ్రీ పాదపద్మారాధక పరబలసాధక నామాది సమస్త ప్రశస్తిసహితము శ్రీమన్ మహామండలేశ్వర వేంగిమల్లి దేవరాజు కొడుకు గోకరాజులు శకవర్షంబులు 1066 అగునేటి ఆషాఢకృష్ణ ఏకాదశియు బుధవారము నాడు దక్షిణాయన ...తినిమిత్తంన శ్రీమతు పద్మినీపురమున శ్రీ సర్వేశ్వర మహా దేవరకు నఖండవర్తి దీపమునకు నిచ్చిన సురభలు 30. దీనింజేకొని తోకల కొండబోయిండు పుత్రానుపౌత్రికముగా సాగనీయంబెట్టి నిత్యం మానెడు నెయ్యి నడుపంగల వాడు. శ్రీ వేంగి సాకాచారి లిఖిత. పై శాసనములలో గణపవరం శాసనము సూయల్ దొరగారి జాబితాలలో ఒకటవ సంపుట 39వ పేజీలో ఉదహరింపబడియున్నది. శకము 1096గా నీబడినది. ఇరియటు దొర వారివి సూయల్ దొరగారివి సరి అయిన ప్రతులు కాకపోవడం చేత లేఖకులు ఒక అంకెనే 6 గాను 9 గానూ చదివి యుందురు. ఇట్టి శాసనములున్నవని తెలుపుటకంటె వీటి ప్రయోజనము వుండబోదు. చాళుక్య యుద్ధమల్లుని సంతతివారు కృష్ణాజిల్లాలో సామంత ప్రభువులుగా వుండిరనుటకు ఈ నిదర్శనములు చాలు ననుకుంటాను. ఇతర స్తలములలో కూడా ఈ వంశము వారి శాసనములు కలవు. బెజవాడలోనే వేంగి గొంకరాజు కొమారుడున్ను మల్లపరాజు మనమడున్ను అయిన మహాదేవరాజు శాసనములు ఆంధ్ర కవితాపిత గురుజాడలు 612 రెండు కలవు. 1893 సం|| యపిగ్రాఫిష్టుగారి రిపోర్టును 11వ పుట చూడుడు. ఒక శాసనపు కాలము 1062 శాలివాహన శకము. బెజవాడ శాసనపు యుద్ధమల్లుడు చాళుక్య వంశము లోని వాడన్నమాట బెజవాడ శాసనము లోనే చెప్పబడి యున్నది. ఆరవ పంక్తిలో “రాజసల్కి భూవల్లభుండు” అని వున్నది. సల్కి అనగా చాళుక్య, రెండవ పులి కేశి యొక్క హైదరాబాదు శాసనములో చిలిక్య అనే రూపమున్నది. చాళుక్యుల యింటి పేరు అనేక రూపములుగా వుండెను. బొంబాయి గెజిటీయరు 1 టవ సంపుటం 2వ భాగములో షీటు దొరగారు Dynasties of the Canarese districts 336, 337 పుటలు చూడుడు. కే.బీ. పాఠకకవి రాజమార్గము 8వ పుట కూడా చూడుడు. గౌరీశంకరు ఓగారి సోలంకేయుల చరిత్ర కూడా చూడుడు. గురుజాడలు 613 ఆంధ్ర కవితాపిత ఇతర యుద్ధమల్లులు చాళుక్య రాజులందు గల యుద్ధ (ఆహవ) మల్లులలో రాజనరేంద్రునకు తరువాత వారు కూడగలరు అని శ్రీ బ్రహ్మయ్య శాస్త్రులు వారు వ్రాసిరి. పర్యాయ పదములను పెట్టి పేర్లు మార్చడము కారణాంతరములు లేనిదీ యుక్తము కాదనుకుంటాను. బెజవాడ శాసనపు యుద్ధమల్లుడు కాక యితర చాళుక్య యుద్ధమల్లులు కావలసినచో కలరు. Fleets Canarese Dynasties 211, 212. పుటలను, 380, 381 పుటలను రైస్ దొరగారి కర్ణాటక భాషా భూష ణము ఉపోద్ఘాతము. 13, 14 పుటలను చూచునది. కన్నడ భాషలోని పంప భారతము అరికేసరి అనెడి చాళుక్య రాజుకోరికను వ్రాయబడినది. ఈ రాజు యొక్క పూర్వులలో యుద్ధమల్లుడనే ఆయన వేంగి దేశము నుండి కన్నడ దేశమునకు వచ్చి ధార్వాడ జిల్లా ప్రాంతమందు ఒక సంస్థానమును స్థాపించెను. ఆ యుద్ధ మల్లుడి తరువాత అయిదో పురుషుడు మరియొక యుద్ధమల్లుడు. అరికేసరి యితని మనవడే. పంప భారతము శాలివాహన శకము 863వ సంవత్సరములో వ్రాయబడెను. గనుక ఈ యుద్ధమల్లులు రాజు రాజునకు ప్రాచీనులే. రాజరాజునకు తరువాత కూడా చాళుక్య యుద్ధ మల్లులు వుండి వుండలేదని యెవరు చెప్పగలరు? దేశ చరిత్రయు పూర్తిగా నున్నచో యిట్టివారుండి యుండలేదు అని చెప్పుటకు అవకాశము వుండును. మన పూర్వులు చరిత్ర ముఖమే యెరుగరే! ఒక్క పేరును బట్టి యితడు యితనని నిర్ణయించరాదు. బెజవాడ శాసనపు భాషకును నన్నయభట్టు భాషకును వ్యత్యాసము కూడా వున్నది. అందు గూర్చి ముందు చర్చించెద. గురుజాడలు 614 యితర యుద్ధమల్లులు ముత్యాల సరాల లక్షణము ఆగష్టు నెల 17వ తేదీని వెలువడిన ఆంధ్రపత్రికలో వొక శతావధాని గారు నే రాసిన ముత్యాల సరములను గేయములను విమర్శించిరి. ఆపత్రిక నాకు అందినప్పుడు, నేనా విమర్శనమును చూసియుండలేదు. తరువాత కొందరు మిత్రులు చూసి నాతో చెప్పిరి. ఇంతట్లో మా వూరి 'భారతమాత' శతావధాని గారి వ్రాతను గర్జించుతూ వ్రాసినది. పిమ్మట శతావధానిగారి విమర్శనమును కూడా నేను చదివితిని. విమర్శనమును రాసినందుకు శతావధానిగారికి నేను కృతజ్ఞుడను. చర్చ జరిగిన గాని నిజము వెల్లడి కానేరదు. నా ఉద్యమము వల్ల ఆంధ్రభాషకు ముప్పు వచ్చునను భయము వారికి పొడమి, వారు కొంచము కఠినముగా రాసియుందురు. తప్పేమి? ఆంధ్ర భాషయందు వారికి మిక్కిలి యభిమానముండుటనే కదా? వారి మనసుకు వ్యధ కలిగి ఆ రీతిని వ్రాసి యుండిరి. స్వమతాభిమానమును, పరమత నిరసనమును అందరికిని సహజమే కదా! 'భారతమాత' శతావధానులు గారిని గురించి కొంచము కఠినముగా వ్రాసినందుకు నేను యెంతో విచారిస్తున్నాను. లోకోపకారకములైన గొప్ప సంగతులు చర్చించుతున్నప్పుడు, మనసులు నొచ్చునట్లు రాసి, ఆగ్రహమునకు అవకాశము కలుగ చెయ్యరాదని నా అభిప్రాయము. శతావధానులు పండితులు; పూజ్యులు. వారి వల్ల నాలుగు తిన్నను, చేతనైన యెడల వారిని వొప్పించడము గాని, తెలియని చోట వారి వల్ల తెలుసుకోవడము గానీ, లాభకరము. దూషణము వల్ల లాభము లేదు. సులభమైన కొత్త గ్రాంథిక భాషను కల్పించుకొనడమును గురించి నా అభిప్రాయములను తెలియజేయవలెనన్నచో, పెద్ద గ్రంథమును రాయవలసివచ్చును. ఆ విషయము చర్చించుటకు నాకు యిప్పుడు అవకాశము చాలదు. శతావధాని గారు ఇంగ్లీషు నేర్చిన వారివలే కనపడు తున్నారు. వారు సంస్కృత, ద్రావిడ భాషల వ్యాకరణము లే కాక, ఇంగ్లీషున వ్రాయబడియున్న భాషాశాస్త్ర, భాషాచరిత్రములను కూడా చదివియున్నయెడల, వారిని అందలి సంగతులు జ్ఞాపకము తెచ్చుకొండని ప్రార్థించుట తప్ప, నేను చేయవలసిన పని వుండబోదు. ముత్యాల సరములు గురించి మాత్రం యిక్కడ వ్రాసెదను. ముత్యాలసరములలో కొన్ని అచ్చు తప్పులున్నవి. గురుజాడలు ముత్యాల సరాల లక్షణము 615 పద్య సంఖ్య ఒప్పు చప్పరంబు 10 17 తప్పు చెప్పరంబు వెల్లకల్లె ఒక్కటి పలుకకయుండు 18 ఒక్కటే పలుకకయుండి 29 శతావధానులు గారు నా పద్యములందు మూడు పెద్ద తప్పులు పట్టినట్లు కనబడుచున్నది. ఒకటి, నేను గ్రాంథిక భాషా వ్యాకరణమును పాటించలేదని, రెండు, ఛందశ్శాస్త్రమును పాటించ లేదని, మూడు, పద్యములలో కావ్య గుణములు లేవని. కావ్య గుణములు ఒకరిసొమ్ము కావు. లక్షణ గ్రంథములెంత చదివినను, అందలి అలంకారాదులు తమ కబ్బమునందెంత యెక్కించవలెనని ప్రయత్నించినను, అనేకమంది పండితులు మనసును రంజించు కావ్యములు వ్రాయలేదు. అది వారి పాండిత్యముననొక లోపముగా తలచకూడదు. కావ్య గుణములు ముఖ్యముగా ప్రతిభ వల్లనూ, కొంతవరకు కావ్య పఠనా కళా జ్ఞానము వల్లనూ, కొంతవరకు పూర్వకవుల కావ్యరసము మనసును పట్టి, ప్రవర్తింపజేయుట వల్లనూ కలుగును. అది అలా వుండగా, గుణ గ్రహణము కూడా కొంతవరకూ అలవాటును పట్టేయుండును. ఇంగ్లీషు సంగీతము సహించని ఇంగ్లీషు వారెందరో గలరు. ఒకవేళ మన లక్షణ గ్రంథములనే తీసి, యీ యీ గుణములు యీ యీ పట్ల పట్టినవని, యెత్తి చూపినను, శతావధానులు గారు అంగీకరింతురని నే తలచను. ఇక మన లక్షణ గ్రంథములలో కానరాని కావ్య గుణముల మాటో, లక్షణ గ్రంథములలో చెప్పడమునకు శక్యము కాని కావ్య గుణముల మాటో, చెప్పనేల? గ్రాంథిక భాషా వ్యాకరణమును అనుసరించని తెనుగు వ్రాతలు శతావధాని గారికి అసహ్యములై యుండును. ఇందును గురించి అట్టే చర్చించిన వినియోగము వుండదు. ముత్యాలసరముల మాట అటుండనియ్యండి. ఆంధ్రభారతి యందు ప్రచురించిన వ్యాసము లలో రెండు మూడు దక్క తక్కినవన్నియు తమ స్తుతి, తామే యొనరించవలెనట. బుద్ధిశాలులును, గద్య ప్రబంధ రచనాచణులును అగు ఆంధ్ర భారతీ విలేఖకుల వ్రాతలు శతావధాని గారికి మనస్కరించకపోవుటకు కారణము యూహింపజాలను. శతావధానులు గారు, ఛంధశ్శాస్త సంస్కారము నెత్తిరి. అట్టి సంస్కారమునకు నే చూపినది దారి కాదనిరి. ఛందశ్శాస్త సంస్కారము శతావధానులు గారికి అభిమతమైనట్లే కానవచ్చుచున్నది. ఛంధశ్శాస్త్రమనగా తెలుగున లాక్షణికులు చేసిన నియమములని వారి యభిప్రాయము కావచ్చును. లేకున్న శాస్త్రమునకు సంస్కారమన్న మాటీవరకు విని యుండలేదు. ముత్యాల సరాల లక్షణము గురుజాడలు 616 శతావధానులు గారిని నేనొక ప్రశ్న అడిగెద. పూర్వులు చేసిన ఛందోనియమములు మార్చతగియున్నప్పుడు ఆంధ్రవైయ్యాకరణుల శాసనము లేల మార్చరాదు? "తెనుగు భాషకు అనుగుణమైన వృత్తముల నన్నింటినీ, ప్రాచీనకవు లెరిగి నిరూపించిరి. ఇక మన స్వేచ్ఛా ప్రచారమునకు అవకాశము లేదు” అనే యడల కథ ముగిసినది. యూరోపి యను భాషలలో కవులు కొత్త వృత్తములను కల్పించి భాషాభివృద్ధి చేయలేదో? కొత్త వృత్తములను కల్పించవచ్చునన్నచో, నా నేర్పు కొలది నేనొక కొత్త తోవ తొక్కితిని. తప్పేమి? నలుగురూ ఆమోదించిరా, నేను కల్పించిన వృత్తమును అవలంబింతురు. ఆమోదించరా, పరిత్యజింతురు. గాని దానిని గర్జించుటలో అక్షర విన్యాస మెచటెచట పెటకుగానున్నదో, విరామము లెచటెచట శ్రావ్యతను చెరచెనో, శతావధాని గారు శలవియ్యరైరి. ముత్యాల సరములలో నే చేసుకున్న నియమమిది. మొదటి మూడు చరణములలోను సామాన్యముగా పధ్నాలుగేశమాత్ర లుండును. నాలుగో చరణమున యేడు మొదలు పధ్నాలుగు వరకూ వుండును. విరామమును అర్థానుసారముగా చెవి కింపగునట్లు మార్చయత్నించితిని. ఎంత వరకూ నా యుద్యమము కొనసాగెనో, మార్పుల యెడ నసహనము లేని చదువరులు చెప్పవలె. ఇక యతిప్రాసల మాట. నేను అజ్ఞుడనే కావచ్చును. కాని తెనుగు లాక్షణికులు యతి ప్రాసములని చేసుకున్న సంకేతములు బడి కుర్రవాళ్ళకును తెలిసియుండును గదా. నాకు తెలియకనే అవి నా పద్యములందు అమరినవని శతావధానిగా రెట్లు దలచిరి? తెనుగు నాకు మాతృభాష అవుటను యతిప్రాసములు దొరలినవట. తెనుగు భాషకును, యతి ప్రాసములకును నైసర్గిక సంబంధ మెట్టిదో శతావధానులు శలవిత్తురు గాక! పాత యింగ్లీషులో మన యతి నియమము వంటి నియమముండెను. తరువాత అంత్య నియమము ప్రబలెను. వర్డు వర్తు మొదలైన మహాకవులు అంత్య నియమమును విడనాడి ఉత్కృష్ట కావ్యములు వ్రాసిరి. అప్పుడు మార్పులు సహింపజాలని విమర్శకులు గొల్లు పెట్టిరి. ఇంగ్లీషు భాషకు యవి నైసర్గిక మైనట్టా? అంత్య నియమమయినట్టా? రెండూ కానట్టా? తెనుగును, కన్నడమును అక్క చెల్లెళ్ళు. కన్నడ భాషలో యతి నియమము లేదే? యేమి సాధనము? తెనుగులో కొన్ని జాతులకు, వృత్తములకును ప్రాస నియమము లేదే; దీని కేమి సాధనము? ప్రాకృతాది భాషలలో అంత్య నియమము ప్రబలినది. సంస్కృతమునకు స్వాభావికము కాని ఈ అంత్య నియమము వీటి కేలాగు స్వాభావికమాయెను? తెనుగున మనము యతి ప్రాసములను వాటిని, సంస్కృతకవులచ్చటచ్చట నలంకారములుగా తగిలించుచు వచ్చిరి. చేతగా కనా, లేక సంస్కృత భాష యీ యతిప్రాసములకు వొదగకనా, వారు నియమములుగా నుంచుకొనరైరి? గురుజాడలు ముత్యాల సరాల లక్షణము 617 బంగాళీలలో మొన్నటి వరకూ అంత్య నియమముండెను. మైఖేల్ మధుసూదనదత్తు అనునతడు అంత్య నియమమును విడిచి, ఒక మహా కావ్యమును వ్రాసి, బంగాళీ కవులలో అగ్రగణ్యుడాయెను. నేను యెరిగియె యతిప్రాసములను, అలంకారములను ముత్యాలసరములలో ప్రయోగిం చితిని. నియమముగా నుంచిన యడల, యతిప్రాసములకు గాను తెచ్చిపెట్టుకున్న శబ్దములు అర్థ పటుత్వమును చెరచి, సందర్భమును తప్పించి, యీడ్చుకుపోవును. అందుకు శతావధానిగారు ఎత్తిన ముతకస్మాతయే ప్రమాణము. ఒకజాతి పార్శీగజలు యొక్క నడక ముత్యాల సరములలో తెచ్చుటకు నే యత్నించి యుంటిని. కలమునకు వచ్చినట్లు వ్రాసితీనని శతావధానిగారు అభిప్రాయపడిరి. అది నిజము కాదు. కలమునకు వచ్చినట్టు రాయుట శతావధానిగారికి అలవాటయి యుండును. లేనియడల శతావధాన మెట్లు చేయగలుగుదురు? ఏకైక దిన ప్రబంధ ఘటికాసద్యశృత గ్రంథకల్పన కొందరి మతమున, కవితకు మేర. ఇతరులు అర్థపటుత్వ శబ్రౌచిత్యములను సాధించుటకు మిక్కిలి శ్రమచేతురు. చిత్రములు వ్రాయునప్పుడూ, జిలుగు చెక్కునప్పుడూ శిల్పకుడు యెట్టి పరిశ్రమము చేయునో, అట్టి పరిశ్రమము చేసినగాని కావ్యగుణము లబ్బనేరవని మా మతము. గ్రాంథిక భాషా సంస్కరణమును గురించి నా అభిప్రాయముల నిక్కడ రాయజాలనంటిని. ఒకటి రెండు మాటలు మాత్రము రాయక వుండబట్టక రాస్తున్నాను. శతావధానులుగారు వొక తప్పైనా లేకుండా సంస్కృతము రాయగలిగియుందురు. తెలుగు మాత్రము విస్పష్టముగా రాయజాలరు. లక్షణ గ్రంథములనూ, ప్రాచీన కావ్యములనూ, అనుసరించి గ్రాంథిక భాషనే రాద్దామని వారు యెంత యత్నించిననూ, మాతృభాషా ప్రభావమువల్ల వాడుక భాషలోని ప్రయోగములు, తెలిసో, తెలియకనో పంక్తులలో వచ్చి కూచుంటవి. లేఖరులు; ఎక్కడ యాగినదో; రెండు మాటలు దక్క తెనుగున; వరకు చదివిన; ఉండ వలయు కాని; సిరాయును కాగితము; ఇట్టివి; ఇందు పెక్కులు గానబడుచున్నవి. అని శతావ ధానులు గారు వ్రాసిరి. “సీసపద్య అర్థము యను శీర్షికతో” ననిరట. అకారమునకు యకారము అచ్చుతప్పు యెట్లగును? యిక శతావధాని గారి రాతలలోనూ, వారి మిత్రులు యం.వి. కృష్ణా రావు గారి రాతలలోనూ విసంధులు కానవచ్చుచున్నవి. యే ఆంధ్రశబ్దాను శాసనమో అందులకు ప్రమాణము? బహుశః కౌస్తుభకారుడు ప్రాచీనులమతమని ఉదహరించిన 'సంహితైకపదే నిత్యా” ఇత్యాది కారికలను వారు చూపగలరు. అది కుదరదు. నా రాతల వలన ఆంధ్రభాషకు ముప్పెట్లు వచ్చును? ప్రాచీన గ్రాంథిక భాష, గ్రంథములలో నున్నది. ఎక్కడి మారుమూలల గ్రంథములూ చావుదప్పి అచ్చుపడ్డవి. ప్రాచీన గ్రాంథిక భాష ముత్యాల సరాల లక్షణము గురుజాడలు 618 నిరర్గళముగా తూగినవారు, ఆ భాషనే వ్రాసి ఆనందింతురు గాక! ఎవరు వొద్దనిరి? పండితులు వ్రాయనూ వచ్చును. వెతికి తప్పుల బట్టి ఒకరినొకరు దూషించుకొను వ్యాపారమును కల్పించు కోనూవచ్చును. యెవరు వొద్దనగలరు? చిత్రము! నా రాతలవల్ల “త్రిలింగ” భాషకు ముప్పు వచ్చెనని శతావధానిగారు విలపించుచుండగా ఆ పేజీలోనే వెంకటరాయ శాస్త్రిగారు, శతావ ధానులుగారి రాతల వల్ల “ఆంధ్రభాషా యోషామణి కెన్నిపాట్లు వచ్చుచున్నవి” అని వ్రాసిరి. భాషకు ముప్పువచ్చునో లేదోకానీ, ఈ దొమ్మిలాట వల్ల పత్రికలు చదువు వారికి తప్పక ముప్పు వచ్చుచున్నది. కవిత్రయము వారి గద్యములను, అవధానిగారు వ్రాసిన విమర్శన గద్యమును, పాక్షిక దృష్టి విడిచి, శతావధానులుగారు తైపారువేసి చూచినచో శబ్దములయందును, రూపముల యందును, అన్వయఫక్కియందును వారి తోవను తప్పి వీరెంత దవ్వున నడచిరో, శతావధానులే తెలియగలరు. ఇంత మార్పును తెచ్చిన శతావధానులే భాషా సంస్కరణధురీణులు గాక ఒరులెట్లు కాగలరు? వారితోవనే కదా, మా బోట్లము పోవుట. “మహాజనో యేన గతస్సపంథాః”. ఆంధ్ర గీర్వాణ సాహిత్యములు కలిగి తెనుగు వ్రాయు వారు మిక్కిలి యరుదు. దేశములో నూరుమంది వుండరని నిశ్చయముగా చెప్పగలను. మాట వరసకు నూరంటిని. అంతకును చాలా తక్కువే. సంస్కృత సాహిత్యము లేని వారు కోటాను కోట్లు. పత్రికలలోనూ, నవీన నాటకాది గ్రంథములలోనూ వారి లక్షణ సాలిత్యములు యెన్న వశమా? అట్టి తప్పుల తడకను వ్రాసి, ఆ రాతను గ్రాంథిక భాష అనుకొనుట కన్న, ఇప్పటి నాగరకులును, శిష్టులును వ్యవహరించు భాషనే రాసుకొనరాదా? ప్రౌఢ గద్య కావ్యములనూ, పద్య కావ్యములనూ వ్రాయువారు గ్రాంథిక భాషలోని యింపగు పదములను తీసికొందురు గాక. సులభ సాధ్యమగు నవీన వ్యావహారిక భాషాకటి ప్రబలిన యెడల, బుద్ధిబలము కలిగియు, మూగులైయున్న మనవారెందరు గ్రంథము లను వ్రాసి భాషను వృద్ధి చేయరు? పుట్టు కవులయి, కఠినమగు గ్రాంథిక భాష నేరని వారి కది మహోపకారము కదా? వాడుక భాష కావ్యరచనకు తగదని శతావధానుల అభిప్రాయము. తగునని నా అభి ప్రాయము. వాడుక భాషలే కదా, కవులు రాయ రాయ గ్రాంథిక భాషలైనవి. యీ భారత వర్షములోనూ, యితర దేశములలోనూ, వాడుక భాషలలో రసవంతమైన కావ్యములు పుట్టి యుండలేదా? బర్న్స్ అను మహాకవి మాట, శతావధానులు గారు వినలేదో! గురుజాడలు 619 ముత్యాల సరాల లక్షణము భట్టకలంకుడు (కన్నడ వ్యాకరణములు) భట్టకలంకుడు జైనుడు. కర్ణాటక శబ్దానుశాసనమనే గొప్ప కన్నడ వ్యాకరణం రాశాడు. 1604 సంవత్సరంలో గ్రంథం పూర్తి అయినట్లు కనబడుతుంది. ఈనాటికి నిలిచిన కన్నడ వ్యాకరణములలో మొదటివి, రెండవ నాగవర్మ రాసిన కర్ణాటక భాషా భూషణము, కావ్యా లోకములో మొదటి అధికరణమును, రెండవ నాగవర్మ పన్నెండవ శతాబ్ద మధ్య కాలంలో వుండెను. భాషా భూషణము ఆధారంగా చేసుకుని, పదమూడో శతాబ్దంలో కేశిరాజు శబ్ద మణి దర్పణం అనే వ్యాకరణం రాశాడు. డాక్టర్ బర్నలు అనే విద్వాంసులు శబ్దమణి దర్పణమును గురించి ఇలా రాసినారు. "The great and real merit of Sabdamanidarpana is that it bases the rules on independent research and the usage of wirters of repute; in this way it is far ahead of the Tamil and Telugu treatise, which are much occupied with vain scholastic disputations" శబ్దమణిదర్పణములోని సూత్రాలు ప్రత్యేక స్వతంత్ర పరిశోధన మీదనూ, గొప్ప ప్రాచీనకవుల ప్రయోగాల మీదనూ ఆధారపడి రచింపబడినవి. నిరర్థక పాండిత్య ప్రకర్షకమైన వివాదగ్రస్త విషయాలతో నిండిన తెలుగు, తమిళ వ్యాకరణాలకంటే శబ్దమణిదర్పణం ఎంతో మెరుగైనదీ అని దీని భావం. భట్టకలంకుల శబ్దానుశాసనమనే గ్రంథాన్ని మైసూరు ప్రభుత్వము వారు 1890వ సంవత్సరములో బెంగుళూరులో అచ్చు వేయించినారు. యిప్పుడు ప్రతులు దొరకవు. మైసూరు గవర్నమెంటు లైబ్రరీలో వున్న పుస్తకాన్ని నేను అరువు తెచ్చాను. అది తిరిగీ యిచ్చి వెయ్యవలసిన కాలం వచ్చినందున అందులో నుంచి తెనుగు వారికి తెలియతగిన భాగాలు కొన్ని యెత్తి రాస్తున్నాను. ఈ గ్రంథాన్ని గురించి రైసుదొర యిట్లు రాసినారు : "It is ..... not an antique treatise dealing with archaisms and obsolete terms, interesting as a literary monument though of little practical value now, but has the advantage of treating of the whole range of the language down to the mod- ern period and its rules are such as apply to the present time" గురుజాడలు 620 భట్టకలంకుడు ప్రాచీనమైనవీ, యిప్పుడు వాడుకలో లేకుండా నశించినవీ అయిన అనేక శబ్ద ప్రయోగాల సరళిని తెలిపే వ్యాకరణాలు వున్నాయి. ఇవి ప్రస్తుత కాలానికి ఉపయోగపడకపోయినప్పటికీ ప్రాచీన భాషా ప్రయోగ సంప్రదాయాలను గ్రహించడానకు ఉపకరిస్తాయి. అయితే శబ్దానుశాసన మనే వ్యాకరణం ప్రాచీనమైనది. కాని ప్రాచీన కాలం నుంచీ ఆధునిక కాలం వరకు గల భాషా ప్లవాన్ని గురించి ప్రస్తావించే అవకాశాన్ని ఈ శబ్దానుశాసనం కలిగివున్నది. శబ్దానుశాసనం లోని సూత్రాలను ప్రస్తుత కాలానకు కూడా అనువర్తింపజేసుకోవచ్చును అని పై వాక్యాల తాత్పర్యం. Some what curious statements are made in works that have come to hand regarding the constituent parts that combine to form Kannada. Thus the unknown author of Subhasthita or Neetikanda an old Jain work says" ఒళుగన్నడ బెళుగన్నడ తెళుగన్నడ అచ్చగన్నడం సక్కజముం ఎళగన్నడ హళగన్నడ సలెదేశియ కెనెయదుణ్ణి కన్నడికిళియోల్ Local (or home) Kannada, white Kannada, clear Kannada, and derivatives from Sanskrit young (or new) Kannada, old Kannada, being combined in the lan- guage of the country, is there any equal to Kannada in the world?" ఏ అంతర్భాష వలన కన్నడమేర్పడినదో వాటిని గురించి తెలుసుకోదగ్గ కొన్ని వింత సంగతులు యిప్పుడు మనకు లభించిన గ్రంథాలలో కనిపిస్తున్నవి. సుభాషిత అనే ప్రాచీన జైన గ్రంథకర్త పేరెవరో తెలియదు కాని, ఆయన యిలా వ్రాస్తున్నారు : ఒళు, బెళు, తెళు, అచ్చ, ఎల, హళ మొదలైన కన్నడములు దేశభాషతో కలిసిపోయినవి. కన్నడ భాషకు సరితూగగల మరివొక భాష లోకమున కలదా? లేదని పై వాక్యముల సారాంశము. హళగన్నడ మనగా పాత కన్నడమనీ తెళుగన్నడమనగా తేట అయిన కన్నడమని అర్థము. ఇదే విధముగా ఈ శతాబ్ద ఆరంభమున దేవచంద్రునిచే రాయబడిన “రాజావలి కథై” అను గ్రంథమున యిట్లు కలదు. దేవచంద్రుడు జైనుడు. హళగన్నడ బెళుగన్నడ వళగన్నడ పొసతెంబుదుం తెళుగన్నడ మిశ్రదీనిద నిశెయోళు సత్పురుష రోడికేళ్వుడు సతతం. గురుజాడలు భట్టకలంకుడు 621 "This, in which old Kannada, white Kannada, local Kannada, pure Kannada, and that called new, are mingled into clear Kannada, may good men in the world ever read and listen to" " పాత కన్నడము ప్రాదేశిక, కొత్త కన్నడాదులు తెగుగన్నడ భాషలో కలిసిపోయినవి. దీనిని లోకములోని మంచి మనుష్యులు సదా చదువుతూ వింటూ వుండెదరు గాక! అని దీని భావము. హళగన్నడ ఆర్ హళకన్నడ is the early form of the language, Belu Kannada or white Kannada, seems to refer to a belief of the Jains, who attribute substances to sound and say that it is white. Thus Kesiraju in his grammar Sabdamanidarpana" has the following : (1) శబ్ద ద్రవ్యం జనియిసుగుంస్వేతం (2) శబ్దం జనియిసుగుం ధవళవర్ణం అక్షరరూపం బెళుకన్నడ లేక తెళుకన్నడ అనే దానికి ప్రాచీన రూపం హళగన్నడము లేదా హళకన్నడము. శబ్దాన్ని ద్రవ్య రూపముగా జైనులు భావిస్తూ వుండేవారు. మరి కొంతమంది దానిని అక్షరరూపంగా భావించారు. జైన సంబంధమైన శబ్ద ద్రవ్యం శ్వేతరూపంగా పరిగణింపబడినది. మరివొక చోట జైన సంబంధమైన శబ్దము అక్షర రూపముగనూ, ధవళరూపముగనూ తన శబ్ద మణి దర్పణములో కేశిరాజు పేర్కొన్నాడు. ధవళమంటే స్వచ్ఛమైనదని అర్థము. “వళగన్నడ లేదా ఓళదేశకన్నడ, refers to the word called దేశ్య, the native tongue including local peculiarities and dialects. అచ్చగన్నడ is the universal term of pure కన్నడ, తెళుగన్నడ means clear, transparent కన్నడ, and from the same root derived the name Telugu, the other language which has so close and affinity to Kannda and which is written in the same characters" వళగన్నడము లేదా ఓళ దేశ కన్నడ మనేది దేశ్య మనే శబ్దానికి చెందుతున్నది. దేశ్యమనగా మాతృభాష. ఇందులో మాండలిక భేదాలు, భాషలు చేరివున్నవి. శుద్ధ కన్నడ మనే దానిని విశాలమైన అర్థంలో అచ్చగన్నడ మందురు. తెళుగన్నడమంటే తేట అయిన కన్నడమని, పలుచనిదని, సన్ననిదని అర్థము. స్ఫటికము వంటి స్పష్టమైన భాష తెళుగన్నడము. తెళు గన్నడమనే పదము నుంచే, మరివొక భాషావాచకమైన “తెలుగు” అనే మాట పుట్టినది. కన్నడమునకును, తెనుగునకును ఎంతో దగ్గర సంబంధము కలదనీ, తెలుగు అక్షరముల వ్రాత కన్నడ లిపిని పోలియుండుననీ రెయిసు దొరగారి వ్యాఖ్యానమునకు అర్థము. పైదీ రెయిసు దొరగారి పీఠకలోనిది. గురుజాడలు 622 భట్టకలంకుడు ఈ కిందిది గ్రంథారంభ మంగళ శ్లోకము : సమగ్రోవర్ధమానాయ విశ్వవిద్యావభాసినే సర్వభాషా మయీభాషా ప్రవృత్తాయన్ముఖాంబుజాత్|| యే వస్తువు నుండి అన్ని భాషలకూ సంబంధించి నటువంటి భాష కలిగినదో సంపత్తును కలుగచేసేటటువంటిన్నీ, అన్ని విద్యల్నీ తెలియచేసేటటువంటిన్నీ ఆ వస్తువుకు ప్రణామములు. ఈ శ్లోకము పై వ్యాఖ్యానంలోని కొంత భాగమిది. శబ్దాను శాసనం హి ప్రస్తుతమ్ | తత్రచ అనుశాసన విషయ భూతాః శబ్దాః కర్ణాటకా ఏవ, తేచ సంస్కృత శబ్ద వత్సకల దేశ ప్రసిద్ధాః సకల శాస్త్రపయోగితయా సకల మహాజన పరిగ్రాహ్యశ్చ నభవంతి! భాషా విషయత్వాత్ | భాషాయాం చ పామరాణామే వాధి కారోన పండితానామేతి వైతేనుశాస్యాః ప్రయోగానర్హత్వాదితి| కేషాంచిత్సంస్కృతా గ్రహ గ్రహగ్రస్తానాం పండితమ్మన్యానామ్ మనసిప్రఖ్యాతా మన్యథా ఖ్యాతిం ప్రత్యాఖ్యాతుమేత దేవ విశేషణ ముపవర్ణి తవాన్ గ్రంథకారః ఇదమత్రా కూతమ్ | యథాసంస్కృత శబ్దాః స్వాధ్వసాధు వివేచన విషయతయానుశాసనారా | తథా భాషా శబ్దా అపి | యదిచామీనానుశాశ్యాః కథంతర్షి భగవద్భాషా తన్మయీస్యాత్ | సహ్యపశబ్దమయీసా. శబ్దమేరీతిగా ఉపయోగింపబడుతున్నదో యిప్పుడు మనం చెప్పుకుందాము. అందులో ముఖ్యంగా యిప్పుడు మనం తెలుసుకోవలసినది కన్నడ శబ్దాలు యేలాగున ప్రయోగింప బడుతున్నవనే విషయం. సంస్కృత శబ్దాలు అందరిచేతా పరిగ్రహింపబడుతున్నట్లు, అన్ని చోట్లా ప్రసిద్ధమైనట్లు, అన్ని శాస్త్రాలను సమన్వయించినట్లు కన్నడ శబ్దాలు పరిగణింపబడడం లేదు. యిక భాషను గురించి ముచ్చటించుకుందాం. జనుల వాడుకలో వుంటున్నది కనక, పండితులకు గ్రంథాలలో ఉపయోగార్హమైనది కాదు కనుక పండితులకు భాష ఉపయోగపడక జనులకు మాత్రమే మిక్కిలి ఉపయోగపడుతున్నది. అందులోనూ సంస్కృతం తెలియని కొందరు తాము పండితులమనుకుంటూ కొన్ని అనుకూల శబ్దాలను అననుకూలమైనవిగానూ మరికొన్ని అనను కూల శబ్దాలను అనుకూలమైనవిగానూ పొరపాటు పడుతున్నారు. అటువంటి పండితమ్మన్యులను గురించి మాత్రమే మేమిక్కడ ప్రస్తావిస్తున్నాము. సంస్కృత శబ్దాలను అవసరానవసరాలను బట్టి యెలాగున ప్రయోగించుకుంటున్నామో అలాగునే యీ భాషా పదాలు కూడా ఉపయోగిం చుకోవచ్చును. అన్ని విధాలా యీ భాషా శబ్దాలకు సంస్కృతంతో సంబంధమున్నది కనుక యివి సర్వదా ప్రయోగార్హములే. వీటిని అపశబ్దాలని యెంత మాత్రం పేర్కొనడానకు వీలులేదు. ఇదీ వ్యాఖ్యానం. పై వ్యాఖ్యానమును మన తెనుగు భాషా పదాలకు కూడా అనువర్తింప చేసుకొనవచ్చును. గురుజాడలు 623 భట్టకలంకుడు