గరుడగమన
Appearance
యమునాకళ్యాణి రాగం ఆది తాళం
ప: గరుడగమన రారా నను నీ కరుణ నేలుకోరా
పరమ పురుష యే వెరవులేక నీ
మరుగుజొచ్చితిని అరమర సేయకు || గరుడ ||
చ 1: పిలువగానెరమ్మి అభయము తలుపగానె యిమ్మి
కలిమి బలిమి నాకిలలో నీవని
పలువరించితిని నను గన్నయ్య || గరుడ ||
చ 2: పాలకడలి శయన దశరధ బాల జలజనయన
పాలముంచు నను నీటముంచు నీ
పాలబడితి నిక జాలముసేయక || గరుడ ||
చ 3: ఏలరావు స్వామి నను యిపుడేలుకోవదేమి
ఏలువాడవని చాల నమ్మితిని
ఏలరావు కరుణాలవాల హరి || గరుడ ||
చ 4: ఇంత పంతమేల భద్రగిరీశ వరకృపాల
చింత లణచి శ్రీరామదాసుని
అంతరంగ పతివై రక్షింపుము || గరుడ ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.