గరిమెళ్ళ వ్యాసాలు/నూతన సాహిత్య విజృంభణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నూతన సాహిత్య విజృంభణము

  ఆంగ్లేయ నాగరికత, ఆంగ్ల సాహిత్యము తోడి పరిచయము, ఆంగ్ల పాఠశాలలలో ప్రవేశము మొదలైనవి యేర్పాటు కాబడినప్పటి నుండి తెలుగు సాహిత్యములో కొన్ని మార్పులుదయములైనవి. ఈ మార్పుల యొక్క సూచనలంతకు ముందరి కాలములో కూడా నుండవచ్చును. వీటిలో నా కాలము యొక్క లక్షణము అలరారుచుండ వచ్చును. ఇవియును కావలసినంత పెద్దమార్పు లింకనూ కాకపొవచ్చును అయినను దీని నొక ప్రత్యేక యుగమని నిర్ణయించ వలసినత బేదమున్నది కనుఇఅ దీనిని "నూతనయుగ"మని బావించుట కాటంకము లెదు. ఈ యుగమేట్లు ప్రారంభించుచున్నదియు, ఎన్నెన్ని రూపములు దల్చినదియు, ఎట్లెట్లు పరిణామము నొందవలసినదియు మనము చూడవలసియున్నది.
   ఇంతకౌ ముందర కాలమును కాదని యీ యుగము యొక్క ప్రత్య్హేక విజృంభనములు గద్య రచనమును, ఖండకావ్యములును, నాటకమ్లును అచ్చు ఆఫీసులు యెక్కువయై, సంస్కార ప్రచారముల కవసరము పుట్టి, అక్షరజ్ఞానమును పఠనాసక్తియు ప్రజాసామాన్యములో మునుపటి కన్న విరివి యైన యీ కాలమ్లో నవి మూడును విజృంభింప దొరకొనుత సహజము. అట్లని పూర్వపు ప్రబంధములిప్పుడు వ్రాయబడకుండక పోలేదు. పూర్వము గద్యకావ్యములు కాని ఖంద కావ్యములు కాని లేవని కాదు. ఈ యుగములో ప్రబంధ సృష్టి తగ్గినదినియు, ఖండకావ్యం లెక్కువయైనవనియు, గద్యముయొక్క ఉపయోగములు హెచ్చినవనియు మాత్రమే దీని యభిప్రాయము. ఇప్పుడు వ్రాయబడిన కొలది ప్రబంధములకును అంతకు ముందరి పబంధములకును చాలా భేదము కూడ నున్నది.
   ఈ యుగము తిరుపతి వేంకట కవీశ్వరుల కైత్వములతోను, వీరేశలింగం పంతులు గారి వచనములతోను ధర్మవరం కృష్ణమాచార్యులు గారి నాటకముల తోను ప్రారభించుచున్నదని చెప్పవచ్చును. వీరి యుద్యమముల కంతకు ముందు ప్రారంభములు లేవని యర్ధము కాదు. కాని యిట్ట్ యుద్యమములలో కీర్తి ప్రారంభకులకు కాక, ఆ రంగముల గరిమెళ్ళ వ్యాసాలు పై పై కి వచ్చి విజృంభించిన వారికి దక్కులు సామాన్యము కనుక ఆ పట్టాభిషెకము వారికి కట్టుట యెవ్వరికిని యపచారము కాని యశ్రద్ధ కాని కానేరదు. 

శవావధాని కవులు

 ముందు పద్య కవిత్వములలోని పరిణామములను పరిశీలింతము తిరుపతి వేంకటకవీశ్వరులు గత యుగ సాంప్రదాయములలో సిక్షితులు సంస్కృత సాహిత్య పారంగతులు, పండిత శ్రేష్టులు, సుధీవిరాజితులు, అసదృశ ధారావిలాసితులు అనెకుల కంచుఢక్కలు పగులగొట్టి దిగ్విజయ మొనర్చిన వీరులు. వీరింతకు ముందరి యుగములో నుద్భవించి యుందురేని యేయొక్క రాజువొద్దనో పడియుండి, గూఢ శబ్దవితతిచే గుంభితములై యుండు ఏ కొలది పుస్తకములనో వ్రాసి, తమ యొద్దకు విద్యాసక్తి మెయి వచ్చునే కొలది మంది శష్యులలకో పాఠములు చెప్పి, తమంతటి వారిని చేసి తమ యశశ్శరీరమ్ల నీ ప్రపందముపై నాచంద్ర తారార్కముగ వెలయునట్లు విడిచిపెట్టి తమ యవతారములను చాలించి యుందురు. కాని కాలమానము మాఱిపోయినది. రాజులు చితికిపోయి పెద్ద స్థితిపరెఉలుగా మాత్ర్రము మారి యగ్రహారములను రాగి పట్టాల మీద శాసనములుగా వ్రాసియిచ్చి దానము చేయగల స్థితినుండి జారిపొయినారు. ఈ లాటి స్థితిపతులను పదిమందిని చక్కబెడితే కాని యొక కఫీశ్వరుని పొట్ట జరుగదు. కాక రైలుంబండ్లు హెచ్చి ప్రయాణ సౌక్ర్యములు చెలగు చున్నవి కనుక యొక్కని దగ్గర మాత్రమే వన్నీకెక్కుట కంటె పెక్కుర యెదుట కీర్తి గొందమను కొరిక పుట్టుట సహజము. కాక మునుపటి వలె శిష్యులు తమ వద్దకు అచ్చి శుశ్రూష చేయుచు జ్ఞానము గఱచుకొనెడి దినములు కావివి. శిష్యులలరాడెడి పాఠశాలలోకి కొలువుక్జు వెళ్లి వాళ్లకు చదువులు వచ్చినను రకున్నను తనపని తాను చేసుకొని నెలజీతమును అణాముద్రపై సంతకము పెట్టి పుచ్చు కోవలసిన పద్ధతులివి. పాండిత్య్హమునకును వివాదమునకును విక్ష్వాకుల నాటి నుండియు చుట్టరికము, ఇరువురును పండితులయ్యు ఒకరికొకల్రు "త్వంశుంఠ" యంటే "త్వంశుంఠ" యనుకొనుట వారిలో మామూలై యున్నది. రాజులక్ అల్పరాజుల నెల్ల మార్చుటట్లు పండిత కవీశ్వరులకు "గ్రంధపుం దెరువాట్లు" కొట్టు పామరులను ససిసంగుట విద్యుక్తమై యున్నది కనుక వీరు నానారజ సందర్శనములు, గుంటూరు సీమలు, గీరతములు మొదలగునవి రచింపవలసి వచ్చును. ఇవి చాటు పద్యములవలె నొకటియును రెండును గాక పత్రికలు సంచిక లెల్లను నిండి కావ్యరూపములు దాల్చవలసి వచ్చినది. వీటికి జవాబులు ఇటువంటివి, యితరుల వివాదమ్లు మొదలగుననెల్లను కూడ ఖండకావ్యములుగా వెలసినవి. ఈ తగాదా లెల్లయును శతావధానముల కొరకు కదా! శతావధానములళొ నెవ్వరే యంశము మీద పద్యము చెప్పుమనిన దాని మీద చెప్పవలెను. ఇట్టి పద్యములలో నెల్లకయిత తళుక్కులు అలరారుచున్నవి. వీటికి నిజముగా నీ సందర్భములలో కాకుండినచో పూర్ణకావ్యములలో ప్రవేశమున కనువు దొరకక కవితా సంస్పర్శన భాగ్యము దక్కెడిది కాదేమో! ఇప్పటి అభలు కేవలము పండితుల సభలు కాక పాండిత్యము లెక ఆంగ్ల విద్యాధికులు మొదలగు వారి కూటములగుట చేత ఈ పద్యములు కొంత వరకు ఈ కాలమున కనువులై, సులభ గ్ర్రాహ్యములై యుండిక తీరినది కాదు. కాక వారు నిజముగ కవీశ్వరులు - నిజమైన కవీశ్వరులకు ఏ గ్రంధయుగములొనో పడి యుండుట కష్తము తమ చుట్టు పట్ల నున్న యుగము, నాగరికత, విలాసములు, ఉద్యమములు మొదలైన నెల్లయును వారి విమర్శలకు పాత్రములై కవిత్వములోనికి జొరబడును. వీరి పాణిగ్రహిత, శ్వవణానందము మొదలగు గ్రంధములు పేరునకు ప్రబంధములే యయ్యు సమకాలిక నాగరికత యొక్క పటములు, కాని యివి యన్నియు తాత్కాలికము అనియు, పుణ్యమును పురుషార్ధమును సంపాదించునవి కాదనియు, శాశ్వత కీర్తిని సంపాదించుకై యేమి, జన్మతరింపచేసుకొనుటకై యేమి, సుప్రసిద్ధ సంస్కృత గ్రంధములను బాషాంతరీకరించుటో నాటకములుగా మార్చుటయో దైవప్రశంసకంబులగు పురాణములను రచించుటయో కవి యొనర్పవలెనను ప్రాచీన విశ్వాససాంప్రదాయము ననుసరించి, కొన్ని సంస్కృత నాటకములు భాషాంతరీకరించుటయు, పాండవ జనవాది గ్రంధములను స్వతంత్రించి వ్రాయుటయు, దేవీ భాగవతమును తెలుగు సేతయు కూడ కలిగినది. వీనిలో గూడ పాండవ జనవాది నాటకములలో వారు తీసుకొన్న భావ స్వాతంత్ర్యమున్ను దేవీ భాగవతములో వారు కనపరచిన రచనా స్వాతంత్ర్య మును నాటీకి నవీనయుగ సంబంధమైన యొక విశిష్టత్వము నిచ్చుచుండుట చేత్య నవి నవీరన్ నాటక రంగముల మీదను కవితాపరాయణం విలోకనము నందును నమలులో నున్నవి. ఇతర శతావధానులును మన్నారు పండిత కవీంద్రులును నున్నారు. కాని వారిలో నున్న ప్రాచీన నవీనపు తళ్కులెల్ల వీరిలో మూర్తీభవించి యుండుట గూర్చి కూడ యీ సూత్రముల ప్రకారము ప్రత్యేక ప్రశంసలకు పాలు సేయుచు విమర్శలు వ్రాయవలసి యున్నది.
   ఇట్టి ఖండ కావ్యములకును భావ కవిత్వములకును దగ్గర సంబందమున్నది. ఇట్టి సమయమున ఆంధ్రయువకులకు ఆంగ్ల కవీశ్వరులతోడి పరిచయముకలిగినది. ఆంగ్ల భాషలో మన భాషలో వెలె ప్రబంధముల వంటి పెద్ద పూర్ణ పద్యకావ్యములు లేవు. కావ్యమిహమున కీర్తిని పరమున ముక్తిని నొసగు మన మత విశ్వాసమగుట చేత దాని యందు నిష్ఠాబద్దమగు నొక శ్రద్ధ తీసుకొని చక్కని చిత్రకళగా చేయవలసి వచినది. దానిని గూర్చి కొన్ని నిబందములు, నిషిద్ధములు, అలంకారములు, క్రమములు మొదలగు నొక శ్రద్ధ తీసుకొని చక్కని చిత్రకళగా చేయవలసి వచ్చినది. దానిని గూర్చి కొన్ని నిబందములు, నిషిద్ధములు, అలంకారములు, క్రమములు మొదలగునవి యేర్పడి సంస్కృత కాలము నుండియు సాంఘికాచారముల వలె అనుసరించుబడుచు వచ్చినవి. వెఱ్ఱి, మొఱ్ఱి పద్యములెన్ని వ్రాసినను చాటుధారలెన్ని కురిపించినను వారు దాని నొక ప్రశంసనీయతకు కారణముగా గైకొనలేదు. పాశ్చాత్యదేశములలో నట్లు కాక కవిత్వము మనస్సు నాహ్లాదింపె చేసుకొనుట కొక చిత్ర విశేషమగుట చేత యెవరి యిష్టము వచ్చిన యంశమును వారు, యెంత వరకైతే అంతవరకు, యిష్టము వచ్చిన రీతిని రచించి లోకుల యెదుట పెట్టి వైచి ఆనందించుకొనుచుంటయె వారి యాశయము. ఇట్టి వానిలో యశ: ప్రేరితములగు కావ్యములు దీర్ఘములై కమబద్ధములై కళాసహితములై "పేరడైజు లాస్టూ వలె నలరారుచున్నవి. తక్కినవి గాలిపటములవలె కవితాప్రపంచములో కొట్టుకొనుచున్నవి. మతనిష్ఠతోను పాండిత్య ప్రదర్శనాహంకారముతొను యశోవాంచతోను వ్రాయబడినప్పుడు తప్ప, దీర్ఘకావ్యములు కాని, కావ్యాలంకారములు కాని బయలుదేరవు. ఆంగ్ల సాహిత్య చరిత్రములో నట్టి సంచలనములనే ప్రేరితమైన కాలమత్యల్పము. రినైజాన్సుకు ముందు ఫ్రెంచి యింగ్లీషే కాని ఆధునిక యింగ్లీషే లేదు. అక్కడితో పండిత యుగము ప్రారంభమగును. కాని పాండిత్యపరిశ్రమ యుగ భాగ్యమును ఆ దేశమెంతో కాలమనుభవించలేదు. దాని యడుగుల జాడలనే వెంబడించుకొని యీ నవీన వార్తా పత్రికాయుగము వచ్చినది. ఆ యుగము నిలచిన యీషత్కా లములో మిల్టను విజృంభించెను. అంతతో సరి. తరువాతను గబ గబ గ్రంధములు వాయడము, వేగము వేగము అచ్చాఫీసు కివ్వదము, తడి తది ఫ్రూఉలను దిద్దడము. షిల్లింగు పెట్టి వీధి పోయేవాళ్ళు కొనుక్కొని చదువుకొని బాగున్నదనో ఓగున్నదనో విమర్శించడము యిట్టి నవీన యుగము, ప్రారంబించినది.లందను నిండ్సా సంచికలు వెలసినవి ఎవరి యిష్టము వచిఅంట్లు వారు వ్రాయదొడగిని, జాన్సను, పోపు మొదలైన పండిత శ్రేష్మలిది నచ్చక దూషించుచు భూషించుచు సాహిత్య సామ్రాజ్య చక్రవర్తులై యేలుచుండుటలు, వెంటనే క్రొత్తక్రొత్తసూత్రములు లేచుటలు, ఒకరి మీద ఒకదు తిరుగుబడుటలు, ఈ గందరగోళము లోనికి దిగినది. తిరుపతి కవీశ్వరుల నాటికే మనదేశములో వ్యర్ధ పద్య ప్రచురణ మెక్కువయై నోటిలోనుంచి వచ్చెడి తుంపరులు కూడ అచ్చుపడుచున్నవేయని విచారింప వలసి వచ్చినది. అట్టిచో లండను నగరములో నిట్టి పత్రికలలో నెన్ని పద్యములు వ్రాసిన నైనను కొన్ని మంచివి బాగుగా నుండుటయు, కొందరు మంఇ కవీశ్వరులు కూడ చిన్న చిన్న పద్యములే కాని పెద్దవి వ్రాయలెకుండుటయు సహజము విద్యాదికులకు పెద్ద కావ్యములను వ్రాసి మిల్టను వలె కీర్తి పొందుదమని అప్పుడప్పుడు కోరిన వొడము చుండెడిది. కాని వాటితో తులతూగ లేక విరమించు కొనువారు కొందరును, కొందరు పెద్దకావ్యములు వ్రాసినను అవి అతికిన చితుకుల వలె నుండటయే కాని గంభీర కావ్యమునకు గల యేకత్వ మందులో లేకుడుటయు తటస్థించెను. ఇట్లు తాత్కాలిమముగా వ్రాసెడి చిన్ని చిన్ని పద్యములు కాక, తీరుబాటు సమయములలో ఆలోచించి కవితావేశములో వ్రాసెడి దీర్ఘ పద్యములు కూడా ప్రత్యేకమైన గ్రంధముకావలసినంత పెద్దరి కాక Major poems అని మాత్రము పిలువబడుచుండెను. Major poems ను ఖండ కావ్యము లన్నచో Major poems ను అఖండ కావ్యములనవచ్చును. కాని అవి నిజముగా అలంకార శాస్త్రక్రమము దేనికైన బద్దములైన కావ్యముల్ కావని మన మనవలెను. "రసాత్మకం కావ్య" మని అందులో రసము తళుకులున్నంత మాత్ర్రముననే అవి కావ్యములగుచున్నవని భావించి మనము ఖండకవ్యములను గత్యంతరము లేని నామకరణము చేసుకొన్నాము కాని రఘువంశము వలె గాని మనుచరిత్రము వలె గాని అవి కావ్యములు కావి యేరుగునది.

భావకవిత్వ ప్రారంభము

  ఆంగ్లభాష నభ్యసించు విద్యార్ధులు క్లాసులో పఠించి పాఠమును గ్రహించి ప్రశంసింప నేర్చుకొన్న వివియే కనుక యట్టి పద్యములు మన భాషలో లెకుండుటచే వానిని జొప్పింతమను కుతూహలము చెలరేగెను. కాక వీరికి సంస్కృత భాషా కావ్యముల పరిచయము కాని తెలుగు కావ్యముల నైనను ఆంగ్ల కావ్యము లంత శ్రద్ధగా పఠించెడి తీరుబాటు కాని తక్కువయయ్యను. కాక అట్టి ప్రబంధములున్ కావ్యములును యెక్కువగా నుండుటచేతను, చాదస్తపు పండిత్లెల్లరును నింకా అదే మతలపుల మీద పదములు మార్చి, చెప్పిన భావములు చెపుచు పదవిడంబనమే కని కవితా మాధుర్యమును చూపజాలకుండుట చేతను, అట్టి కావ్యముల కంటె ఇట్టి "కావములు" రచించుటయే వీరికి సులభముగా నుండుటయే కాక దేశహితమనియు, భాష కొక క్రొత్త పోకడయనియు, ఆంధ్రవణి కొక నవ్యాలంకార మనియు తొచినది. వార్తాపత్రికలును, మాససంచికలను వెలయుచుండేడి యుగమ్లో వాటికి దూరమై కాఱడవులలో గూర్చున్న వారికి తప్ప పూర్వకాలపు దీర్ఘ కావ్యముల వంటి కావ్యములు వ్రాయుటకు వీలు లేదు. ఇదియును కాక కావ్యరచన ముక్తిప్రదమను భావం పోయినది. సప్తసంతానములలో నొకటని యెంచి కృతి నంది కవితలకములను పోషించు రారాజులును అస్తమించిరి. ఇప్పటి కవిత్వము యొక్క్ ఆశయ మెల్లను వాలుకుర్చీలో కూర్చున్ వార్తాపత్రికా పుటముల నించుక తీరుబడి చూచుకొని తిరుగవేయచుండు పాఠకుని తృప్తిపరచుటయు, తోందర తొందరగను తప్పకుండను మాససంచికలకు "Matter" నిచ్చుటయును నైయున్నది ఇప్పటి "భావకవీశ్వరు" లలో కొందరు, తమకు మంచి సమయములలో దృశ్యమగు చిత్రములనప్పుడప్పుడు వ్రాసుకొని దఫదఫాలుగా పత్రికలకు పంపుతున్నారు. కొదరు పత్ర్కలకు పంపవలెననియే యేవైన అంశమును కల్పింఉకొని వ్రాయుచున్నరు పత్రికలును పెక్కులు వెలయుచున్నది. కనుక పద్యముల యొక్క గుణాగుణముల ప్రశంశనకుపోక చరణములైనంత మాత్రముననే వానిని తమ పత్రికలలో నిర్ణయించబడిన (Column) కాలములో నదికి ప్రచురించుచున్నవి. కవి పేరులు కూడ ప్రచురించుచుండుటచేత నామ ప్రచురణాభీలాష గల అనెకులు యుకులు కూడ ప్రతివారమూ పత్రికలకు పద్యములను పంపుచున్నారు. ప్రతి పత్రికాలయమునందును వారు కూడ ప్రచురింపజాలనన్ని ఖండకావ్యములు పెరుగుచు ప్రచురనమయేవి కాగా మిగిలినవి నెలకొకసారి పరశురామప్రీతి యగుచున్నవి. ఇట్లు మనదేశములో ఖండకావ్యముల యుగము ప్రారంభమైనది. ఇది యంతయు దేశానర్ధక మనియు భాషానాశకరమనియు, అపాండిత్య జన్య మనియు, అల్పజ్ఞతా సూచక మనియు భావించి సంస్కృత పాండిత్యము కావ్య ప్రబంధ పరిశ్రమమును, నుభయ బాషా ప్రభుత్వమును, విజృంభనమును, భాషాశుద్ధియును గల వారు తొంటి పద్దతిపైని బ్రమను విడిచిపెట్టుకొనలేక, అట్టి దైన సమబంధములును భక్తి సంబంధములును నగు కృతులు సేయుటయే వంశపావనమనియు, భవితారకమనియు భావించి - ప్రబంధముల జాబితా కింకొక గ్రంధమును ఆ మతలపు పద్యములకు మరి కొంత సంఖ్యయును చేర్చుచున్నారు.
     ఇట్లు మన నేటి ఆంధ్ర కవిత్వమును ప్రబంధ కవిత యొక వైపు నుంచి జూచుచు, యీ చెల్లా చెద్రేమిటి! యీ అగాధమేమిటి! యీ అజ్ఞానమెమిటి! అని విచారించుచు హేళన సేయుచున్నది. ఒక వైపు నుంచి పత్రికలు, సంచికలు, నామ ప్రచురణ వాంఛలు, నవీనతాభిలాషలు, క్రొత్త క్రొత్త దృశ్యములు, యెఱలు, భ్రమలు, ఆశలు, నిరాశలు మొదలగు నవి పెరిగి తమ వైపునకు లాగుకొనుచున్నవి. అయితే ప్రబంధ హెళనల నిది లెక్కసేయక, స్తాతంత్ర్యమును స్వవికాసమునే తన సంకల్పమైనట్లును బంధనములు ముళ్లు మొదలగు వారిలో నదియె నొవ్వ చెడుచున్నదనియు యెదురు హేళనలు సలుపుచున్నది. లాబమే కానిండు నష్టమే కానిండు తొంటి ప్రబంధ కవిత్వమిప్పటి కవిత్వ రచనారంగము నుండి సెలవు పుచ్చుకొని పోకతీరదు. అది యెంత సేపటికిని ఒకటే పిండి వంటయై మొగము మొత్తి విసిగించినది. స్వతంత్రమున కందులో అవకాశము తక్కువగుట చేత అది పూర్వపు ప్రబంధముల తాలూకు మరియొక ప్రతి యగునే కాని వేఱొకటి కాజాలదు. కాక పూర్వపు దేవుళ్లందరికిని దేవలోక పురుషులందరికిని మన పూర్వులె పెండ్లిండ్లు చేసి, వారి శృంగారములను వర్ణించినవారు. ఇప్పుడు మన మవరినైన వెదకి తీసుకుని రావలసినంత్ సులభము కాదు. ఇక మనము ప్రబంధములు వ్రాయక ప్రబంధముల సరళిలోనే క్రొత్త కధలు వ్రాయవలెనన్న ప్రబంధములలోని వర్ణనలు అలంకారముల వంటి వానిని మనము తీసివేయుచున్నప్పుడు ప్రబంధములు కాని పద్యములు కాని యేల వ్రాయవలెను. గద్యము చాలదా! యతి ప్రాస వృత్తములలొ మేమీ భావముల నిముడ్చగలమని గొప్ప చూపుటకా! చూడ చూడ ఏకాలములో భావమ్లలో మెరపెడి తళుకులు, స్వగరములగు దీర్ఘమగు తత్వ లేక అధ్యాత్మిక చింతనలు, ప్రకృతి పరవశత్వములు మొదలగు వానికి తప్ప కధలకు కవిత్వమునందు తావు లెదు. అయినను ప్రబంధ కవిత్వము నిప్పటికైనను మేము నిరసింప బూనము. ప్రాత వర్ణనలు కల్పనలు దొంగిలించి, వేరొక రీతి పదములతో తిరిగి యొప్ప చెప్పకుండా, వీలయినన్ని స్వాతంత్యములు తీసుకొని తమ కవి యనుబవములను కధా భాగమ్లలో జొప్పించి వ్రాయగల వారికి మాయభిననందు లీసున్నాము. అంతవరకున్ను అన తెనుగు కవిత్వమునకు ఖండ కావ్యములును భావకవిత్వములును కాక గత్యంతరము లేదు. అయినను భావకవిత్వరంగమిప్పుడు చాలా అరాచకముగా నున్నది. దానికొక సిద్ధాంత మంటూ లేదు. అర్ధం తెలియ నీయకపోవుట, అలంకార మంతంతలోనే మార్పులు, భావమును ప్రస్పుటము చేయకుండుట, స్వాంతమునందు నిమగ్నం చేసి సంగీతపు కళలు విసరి విసరిపాడుచు ఆనందించుట యివి యెల్లయు భావ కతిత్వ లక్షణములుగా పెక్కురు భావించి, కోరి యెట్లు వాని నొనరించుచున్నారు. నిజముగా భావమున కెట్టి నిబంధనలు లెవో భావకవిత్వమునకు గాని ఖండ కావ్యములకు గాని వ్రాసి పెట్టి నిర్ణయించగల నిమంధనల్ లేవనియు, ఉండజాలవనియు మేమును నొప్పుకొందుము. కని సహజత్వమును కూడ, ఒక యుండకూడని లక్షణ ముగా చేసుకొనుట భావకవిత్వపు లక్షణమని మేము తలంచము. మానవ స్వభావములకు, ఊహాగమనములకు, యుక్తజ్ఞానములక్ము, కవితా సంచారములకు చిట్టి చిట్టి భేదములు కొన్ని యున్నను వ్రాసి పెట్టి నిర్ణయింపజాలనట్టియు, విశాల విమర్శక్జ దృష్టి కలవారికి తమంతట తామే గోచరించునట్టియు కొన్ని జాడలున్నవి వాటిని కూడ జూడ లెక కాని, లక్ష్యపెట్టక కాని కలమునకు వాచ్చినట్లుగను, అల్పజ్ఞత్వమునకు తోచినట్లుగను, అహంకారములకు సరిపడునట్లును స్వాతంత్ర్యమను పేరిట స్వైరవిహారము వొనర్చుచుండు అనెకము కుప్పలు కుప్పలు ఖండకావ్యము లెల్లను అనతి కాలములో మఱువబడును. మన ఆధునిక భావ కవిత్వములలో అట్టి విశాల సూత్రముల కొప్పునట్టివియు పెక్కులున్నవి. ఒప్పనట్టివియు అంతకన్న పెక్కులున్నవి. ఈ కవుల పద్యములను ప్రటత్యేకము ప్రత్యేకముగా పట్టుకొని, నిస్వర్ధ దృష్టితో పరిశీలించి యీ విభెదము నీయగల భారము విమర్శక శిఖాముణులపై నున్నది. ప్రస్తుత సందర్భములలో భావకవిత్వరచనము కంటే కూడ యీ విమర్శక కార్యము తొందరగాపూనవలసిన అవశ్యకత లేకపోలేదు. విమర్శకులించుక నిష్పక్షపాతముగ నీ పనికి బూనుకొనిన యెడలను, కవులించుక నిగ్రహముతోను, తమ రచనలను దీర్ఘకాల జీవముండవలెననెడి ఆశతో వ్రాసిన యెడలను నీ పని చక్క పడక మానదు.

గీత కవిత్వము

  భావ కవిత్వములో కంటే గూడ గీత కవిత్వ మీ యుగములో పొందిన యభివృద్ధి యెక్కువ ప్రశంసనీయముగ నున్నదని దేశమెల్లను నంగీకరించుచున్నది. ఈ రంగములో నాచార్యపీఠము నారాయణదాసు గారి కిచ్చుటలో వెనుకకు గొంకెడి వారెప్పుడును లెరు. సహజముగనే గీత కవిత్వము పద్యకవిత్వము కంటె నెక్కువ హృదయరంజకమునను రమణీయముగను నుండును. దానికి చక్కని కట్టుబాటులున్నవి. దానిలో నుంచు తప్పుకొందమన్నను సాధ్యముకాదు. లయనుంచి అది తప్పుకొనలేదు కదా! ప్రాసములను, నంత్యప్రాసములను వాటంతట నవియే పడునుగదా! ఎంత తాపీగాపాడి యెంత గాన శక్తి చూపించి యెన్ని యెడ్దుపులు, కళలు వేసినను నది వద్దనరు గదా! పదములకందని దూరసీమలకు గూడ అది సులభముగ పోగలదు గదా! పండిత పామర జనబోధకమును రంజకమును గదా! అందుచేత మన దేశములో నేమి పరదేశములలో నెమి పద్యకవిత్వము కంటె నది యెక్కువ ప్రచారము నందును జనులు నందును నుండుటలో ఆశ్చర్యమేమి! ఇంతకు పూర్వ యుగములలో నది భక్తి రంగము నందును, శృంగారము నందును మాత్రమే ప్రభాసిల్లు చుండెను. ఈ యుగములలో నది సామాన్యములగు నంశములను, దేశభక్తిల్ ప్రబోధములను నాటకములలోని పాత్రల సంభాషణములను మొదలగు వానిని గూద గుత్త గొని జాతీయజీవనము నిఉత్తేజితము నొనర్చుచున్నది. సహజమృదుల మాధుర్యమై సంగీతపు కట్టుబాటులకు సాహచర్యము సలుపు కర్ణాటకపు కత్తునకు సాయముగా అనుభవైక రమ్యములగు హిందూస్తానీ కత్తు తళుకులుం ఆంగ్ల సీమలనుండి నరతెంచిన నొక్కుల నినాదములు మొదలగునవి, యెల్ల కూడుకొని ఆంధ్ర దేశపు గీతారంగము నెల్ల అవి ఆనందపులకితమ్లు చేయుచున్నవి. నారాయణదాసు గారు గాయక శిఖామణులును, లయబ్రహ్మలును, కవి తిలకములును, పండిత శ్రేష్ఠులును, స్వాతంత్ర్య గ్రహణము నందు ఆదర్శముగా నుండు నంత యోగ్యత సంపాదించిన వారునునై తమ హరికధలలో నెల్ల పెక్కు సందర్బములు చొప్పించి అక్కని గీతములు పొదివి మన భాషకును ఆధునిక పద కవిత్వమునకును అనుపమానమైన సేవ నొరర్చిన వారు. జానపదుల అకాల్పనిక సంగీతపు పొకడలు గూడ మన యువ కవులకు నచ్చి, వారి నుత్తేజింప జేయవలసిన అవసరము కూడ వచ్చుట చేత ఆమెట్టులలోనే ఉత్తమ బావములు, ఉత్తమ భాషను జొప్పించి, వాటిలో ననుశ్రుతములుగ వచ్చుచున్న జీవ భాషను భాషారూపుములను విచ్చిన్నముచేయకుండ సంగ్రహించి గ్రుచ్చి పద కవిత్వమును (Ballad poetry) గూడ మునుపెన్నటి కన్న ఒక ఉన్నత స్థానమునకు తెచ్చి క్రొత్త క్రొత్త పనులను దానిచేత చేయించుచున్నారు. మహాత్ముని రాజకీయాందోళన దీని కొక నూతన దర్మమును, నూతన రంగమును, నూతన భాషను, నూతన కవిబృందమును ప్రసాదించెననుట కాటంకము లేదు. ఇందులో నిప్పటికే తదితర రంగములలో కంటే నెక్కువ పని జరిగినది. ఇంకను జరిగవలసి యున్నది. మన పూర్వపు పక్కీలు, మెట్టులు, క్రొత్త పద్ధతుల యడుగున బడి అదృశ్యములగుచున్నవి. హిందూస్తానీ తళుకులును, బ్యాండు స్వరములను యానాదుల వీధి భాగవతములను గూడ ఆక్రమించుచున్నవి. కూచిపూడి భాగవతులు మొదలగు వారి శిష్యులు కూడ నాటకపు కత్తులలోనికి దిగుచున్నారు. ఇంకను గ్రామములలోనికి పోయి అక్కడి పూర్వపు బ్యాండుపద్దతులను భాగవత పద్దతులను నెర్చుకొని, సంగ్రహించవలసిన యావశ్యకత్ యున్నది. వాటిని మనము విసర్జింపజాలము. అరవదేశీయులు కర్ణాట్కపు కత్తులొవారితేరి త్యాగయ్య గారి కృతులను చక్కగా పాడగల్గుచునే, హిందూస్తానీ కత్తులో కూడా మనోహరములగు గీతములను రచించుచునే, ఇంగ్లీషు బెందు నోటుల యెడ వ్యామోహితులగుచునే వారి కావదిచిందు నొంది చిందు తేవారము, తెమాంగు, తిరుప్పుకళు, లావణి మొదలగు మెట్టుల నశ్రద్ధ చేయకుండ పాడగల్గుచు కీర్తిని సంపాదించుకొనుచున్నారు. మనవారిలో అధ్యాత్మ రామాయణము కీర్తనలు, అష్టపదులు, క్షేత్రయపదములు, తరంగములు మొదలగునవి పాడుట మఱచిపోయి ఆ పుస్తమములను మాత్రము బీరువాలలో పెట్టుకొనుచున్నారు. బాగవతము దరువులుకాని, బొమ్మలాట కలాపములుగాని, యక్ష గానౌలు కాని మునుపటి ఫక్కీని పాడలెరు సరేకదా వాటిని హేళన సేయుట గొప్ప యనుకొనుచున్నారు. కొన్ని సంవత్సరముల క్రిందట మనదేశపు పడవవాండ్రు, ఊరువుల వాండ్రు, దంపుల వాండ్రు, జోతలవాంద్రు, చెంచువాండ్రు నేవేవో గాధలు నెంతయో వింతయూగు మెట్తులో అపురూపమగు భావములతోను ఆచారములతోను పాడుచుండెడివారు. ఇప్పుడు వారి నందరిని "అప్పనాబనాతనా" ఆవేశించినది. సంగీతము, పదకవిత్వము, జానపదుల లౌకిక గానమాధుర్యము నందలిభాష మొదలగు గుణములు గల వారీ మొదలైన వాని నెల్ల సంగ్రహించవలెను. గీత గోవిందము మొదలగు వానిని పాడగల కొందరి దగ్గరకు తక్కిన వారు పోయి వాటి గమనికలు వారితో నశిమొపకుందునట్లు చిరస్థములు చేయవలెను. ఇక కర్ణాటకపు కత్తును, హిందూస్థానీ కత్తును, బ్యాండు కత్తును, నశించక వాటంతట అవియే వృద్ధి పొందగల పరిస్థితులు దేశములో పాధుకొనుచునే యున్నవి. మిశ్ర కావ్యములు
ఇక మిశ్ర కావ్యములను గూర్చి యాలోచించ వలసి యున్నది. హరికధలు, భాగవరములు, బొమ్మలాటలు, మొదలగునవి పద్య గద్య గీత మిశ్రితము లనుట కాటంకము లెదు. అని అట్లే యుండవలె ననుటలో కూద సందరును నేకగ్రీవముగా నొప్పుకొనుచున్నారు. హరికధలలో మనమెల్ల కత్తులను జొప్పించినను, బొమ్మలాటలు, భాగవతములలో మాత్రము పూర్వపు కత్తుల నింకను మంచి వాటి విశిష్టత్వమును నిలెబెట్ట వలసిన యావశ్యకత యున్నదనియే మా విశ్వాసము. మునుపటి కలాపములను రామ బాణముల నోటిలో నుండి తప్పించి యిప్పటి యాటగాండ్ర గాత్రములలో నుంచవలెను. అవసరమైనచో యీదేశకాల పరిస్థితులకు సరిపోవునట్లు కధా క్రమములు మార్చుచుండవలెను. వాటిలో పూర్వం నుండి వచ్చెడి నాగరికములగు హాస్యములను తగ్గించి సత్సస్సులును కులాంగనలును వినుటకు యోగ్యమైనంత సరసములు చెయవలెను. వాటిలోని హస్యములు ప్రస్తుత పద్దతులను విమర్సించు చుండవలెను. వీటికి కాలనుగుణ్యముగ నొక యాకారము వచ్చి యానాగరికజన హృదయరంజకములుగా చేసి విడిచిపెట్టినచో, మన పూచీ లేకుండా వాటంతట నవియే సమస్త శుభరార్యమూయందును దేవతోత్సవముల యందును ప్రాకిపోగలవు. ఇవి నాటకముల కంటెను, భవకవిత్వముల కంటెను, బలతరములై ప్రజలకెక్కువ బాగుగ నచ్చి, దేశమున నెక్కువ సేయుననుట కభ్యంతరము లెదు. పూర్వమివియే భారతవిజ్ఞానమును సంప్రదాయములను, ఆచారములను, వీర పరాక్రమములను, దేశ మతాభిమానములను, దైవభక్తిని, రాజనీతిజ్ఞానములను, వేదాంతరహస్యములను దేశమునందెల్ల వెదజల్లు చుండెడి ఖర్చులేని విశ్వ విద్యాలయములు (యూనివర్సిటీలు) అయి యుండేడివి ఇట్టి జ్ఞాన ప్రదారకములైన సధనములను విరగద్రోయుచు విద్యాభివృడ్దియు దేశాభివృద్ధియు చేసుకొనుచున్నామని సొమ్ము దండుగ పెట్టి కొనుచు యౌవనము వమ్ము చేసుకొనుచు, స్వాతంత్ర్యము చౌకచేసుకునుచు, దాస్యమె పరమవధిగాను, గౌరవముగను భావించుటకంటె అవివేకము వేఱొకటి లేదు.

ఈ కవిత్వములలో వాడుక భాషకు గల స్థానము

 ఇక వీటిలో ప్రయోగించెడి భాషను గూర్చి యించుక చెప్పవ. లసియున్నది. ఒక్క పద్యకవిత్వము నందును భాషకవిత్వము నందును తప్ప నన్నయచిన్నయ్యసూరిగార్ల వ్యాకరణముల నిబంధనలకు లొంగియుండవససిన యావశ్యకము మరి దేనికిని లేదు., వ్యావహారిక గ్రాంధిక భాషా మిశ్రమము వాటిలో ననుశ్రుతముగా వచ్చుచున్నది. దాని ననుసరించియే యని యెల్లయును పోవచ్చును. భాష యొక్క గాంభీర్యము చెడకుంద గూద భావములు కూడ వహించగలుగునంత ఔన్నత్యమును, అవి సులువుగా గ్రహింపగలుగుటకు తగినంత వాడుక సిద్ధియును వాటికున్నచో చాలును. పాత్రౌచితిని బట్టి వీటిలో నెచ్చు తగ్గులుండవచ్చును. కేవలం గ్రాంధికత్వమున కాశించి కష్టముగను అసహజమౌగను చేయకూడవచ్చును. కేవలం గ్రాంధికత్వమున కాశించి కష్టముగను అసహజముగను చేయకూడదని కేవలం సులభత్వమున కపేక్షించి హేయముగను వికారముగను చేయకున్నచో చాలును. మన ఆంధ్ర దేశములో జిల్లా కొక్కొక్క (district) పరిభాష యున్నదనియు, ఒకరి భావము లొకరికి తెలియవనియు వాదించెడి భావమునకు మేమెప్పుకొనము. ఒక జిల్లా కింకొక జిల్లాలో పరిచయము తక్కువగా నున్నదనియు, అందుచేత నొకరై వాడుక భాష యింకొకరి వాడుక భాష నుండి కొంచెము భిన్నముగ నున్నదనియు మే మొప్పుకొందుము కాని, ఆభేద మోరి ధోరణి యింకొకరికి తెలియునంతటిది కాదు. పరస్పర సంచారముల వల్న అవి అబగ్రహణము కాగలవు. పదును కాగలవు. వాటిలో ననేకములు గ్రంధములుగా జేసి గౌరవము నిచ్చుటకు తగియున్నవి. ఈ పని8ని మన మిప్పుడు మానివేసినచో వాడుక భాషా భేదౌలే మరియును పెద్దవై, ఒకరి భాష యొకరికి తెలియక, ఒకరితో ఒకరు గ్రాంధికముగా ననగా నన్నయభట్టు వెలెనో, పెద్దన్న వలెనో తప్ప మాటలాడుకొనుటకు వీలు లేక, అంత పాండిత్యము లెని వారు వేర్వేరు జాతులై, బొంబాయి తెలుగులు, ఆంధ్ర తెలుగులు, తంజావూరు తెలుగులు, తెలుగు తెలుగులువని వేర్వేరులై క్రమముగా తెలుగు రూపుమపి అచ్చటచ్చటికి సమీమపులలో నున్న బలవద్భాషలలో మిశ్రమమై పోయి అద్చటచ్చటి వారా యా భాషలను మాటలాడుకొనక తీరదు. ఇట్టి గతియే బొంబాయి లోని తెలుగు వారికిని అరవ దేశము తెలుగు వారికిని పట్టినది. వెల్లూరు, బళ్ళారి, కర్నూలు, చిత్తూరు, మొదలగు జిల్లాల వారికిని క్రమముగా గుంటూరు వారికిని గూడ అట్టి గతులే పట్టవలసి వచ్చును. గనుక ఆయా జిల్లాలలో ప్రజల ప్రచారములో నున్న వాడుక భాషను, వాడుక భాషా రూపుములను గ్రంధస్థములు చేయుట వలన వచ్చెడి నష్టము లేదు సరిగదా, లాభమధికముగా నున్నది. శబ్ధజాల మెక్కువయియినను, ఇరుగు పొరుగు వారల లక్షణములు, మాటలు తెలియును. ఇందుకు హరికధలు, భాగవతములు, యక్షగానములు, బొమ్మలాటలు, పాటల కంటె నెక్కువ ఉచితమైన సాదనములు స్థలములును వేరెవ్వి? ఇదియును గాక వీటి కనుశ్రుతముగా వచ్చుచున్న సంప్రదాయమును మాని వీని నన్నింటిని గూడా భారత భాగవతాదుల ప్రక్కలో గూర్చుండ బెట్టవలె ననుటలో అర్ధము లేదు. ఇక ఆధునిక కవిత్వమును భావగీతములలోనే అవి యెల్లయును ప్రయోగించుకొనుటయా మానుకొనుటయా అనునది కవి గారి యిష్టము ఆయన మాత్రముచితజ్ఞడు కాడా! మన పూర్వులు ప్రబంధకవిత్వములో గూడ నట్టి స్వాతంత్ర్యమును క్వచిత్తు క్వచిత్తుగా తీసుకొను చిండిరి. ఇప్పుడు మనవారు కూడా తీసుకొనుచున్నారు. అట్లు తీసుకొనుటలో తప్పేమియు లేదు. అసలులో ఈ గ్రాంధిక వ్యావహారిక భాషా వివాదము గద్యరచనకు మాత్రేమే సంబందించినది. హరికధాదుల కిది కొత్త కాదు. అందులో రెండును కలియుచునే యున్నవి. పద్య కవిత్వము దీనిని విస్తారమంగీకరించి యుండలేదు. క్వచిత్తుగా అప్పుడప్పుడును ఇప్పుడును కూడ నంగీకరించు చున్నారు. గద్యముచే యిట్లా? అట్లా? వ్రాయుట యని వివాదము లేచినది. అయినను ఈ వివాదము యొక్క తరంగములు పద్య కవిత్వము మీదికి కూడ ప్రాకి యీ వాడుక పదములందులోని కెక్కువగా వచ్చుచున్నది. దీనికి గారణ మీ వాదము యొక్క మూలపురుషులలో నొకరగు గురజాడ అప్పారావు గారు కవి కూడనై తన ముత్యాల సరములలో నుంచి యితరములలోనికి గూద ప్రాకజూచుచున్నది. కాని తక్కిన వృత్తముల లోనికి గాని పద్యాలలోనికి గాని యింత జోరుగా ప్రాకుటకు, వీలు లేదు. ముత్యాల సరములను పద్యము లనుటకంటె పాట అనవలెను. ఇట్టి చందస్సులే తెలుగు చందస్సులనియు, కందము, ఉత్పలమాల మొదలగునవి అసలు తెలుగు చందస్సులు కావనియు, వాటిని గైకొన రాదనుటయు విపరీతము. అసలు ఆంధ్రభాషయే మిశ్రభాష. కొన్ని సంస్కృత సంప్రదాయములను, కొన్ని ద్రవిడ సంప్రదాఅయములను గూడి అది యేర్పడినది. అసలు ఆంధ్ర భాషయో, యెదో ఇవి రెండును కాదని దాని విశిష్ఠ లక్షణములు ఏమిటో తెలుసు కొనుటకు చారిత్రక పరిశోధనల కైనను సాధ్యమగునో కాదో! ఇట్టి సందర్భములో ప్రస్తుతపు తెలుగులో పరిపాటియై యున్న పదములు, వృత్తములు, నడకలు మొదలగునవెల్లయును వాటి వాటి వ్యుత్పత్తు లెట్టి వైనను ఆంధ్రభాషలు, ఆంధ్రచందస్సు, ఆంధ్రరీతి యనుకొనవలసినదే. పాటలుకాని యిట్టి చందస్సులలోకి కూడా కవులు వాడుక భాష లోని రీతులు చొప్పించి యున్నారు. బాగుండని చోట బాగున్నయి కానందుమే కాని, అట్టుల జొప్పించకూడదని చెప్పి కవి స్వాతంత్ర్యమునకు మేమడ్దురాము. ప్రస్తుత భావకవీశ్వరుల పద్యములలోని రసస్ఫుటత్వము, భాషసహజత్వము, కవిత్వపు పాకము, మొదలగు వానిని గూర్చి మాకు కొన్ని సందియములుండవచ్చును గాని వారు తీసుకొనుచున్న భాషా స్వతంత్ర్యములను గూర్చి మేము తగవులాడం. భాష శరీరము, భావము హృదయము శరీరము చక్కగను లలితముగా నున్నది. ఆ హృదయమునకు గ్రహించుటకు మా హృదయము కూడా తడువులాడుకొనుచు అనేక చోటుల విసిగి, విహ్వలయై, చీకాకుపడి, యేమియును గానక కాల వ్యయమునకై విచారించి వెనుకకు వచ్చుచున్నది. ఆహృదయమునకు కాంతి నద్దవలెను. ఆ హృదయము విషాద విచార శోక దందహ్యమానమై గాఢాంధకారం కంటేను కాఱునలుపుగ నుండవచును కాని కవి యొక్క కవిత్వపు కాంతితో కూడ దాని వైపునకు ఇంచుక జ్ఞానవంతుడగు పాఠకుడు తొంగి చూడలేకున్నచో అది వ్రాయకున్నచో గలుగు గొఱంతయేమి? నేనెవ్వరికొఱకై కాని వ్రాయలేదు. పిట్టవలె అవ్యక్తముగా పాడుకున్నాను. ఆ ఆనందము నాకున్నది. దేశమునిండ పత్రికలును అఛ్చాఫీసులును నున్నవి కనుక పంపించి నాపేరుతో అచ్చువేయించుకొన్నానన్నచో విమర్శకుడు దానికొరకై సిరా దండుగ చేసి పాళీ మొద్దు చేసికొననక్కరలేదు. ప్రబంధ వచనములు
 ఇక నీ యాంగ్ల యుగములోని గద్యవచనమును గూర్చి యాలోచింప వలసి యున్నది. ఇంతకు ముందు ప్రబంధములలో గనబడుచుండెడి వచనములు పద్యముల కంటె కష్టములై, ద్వంద్వార్ధ సముపేతములై గంభీరములై, చందోబద్దముల కాని కారణం చేత యెక్కువ స్వతంత్రములై కవిప్రతిభకు పద్యములకంటె బ్రబలతర నిదర్శనములై యున్నవి.పోతనామాత్యుని గద్యములలో చాలమట్టుకు కాదంబరి పోకడలున్నవి. పెద్దన్న వచనములును సులభ సాద్యములు కావు. వచన వర్ణనము వాటి పోకడలోనే యున్నది. వచనముకూడ ఒక రీతి కవిత్వ విశేషమనియే భావించబడుచుండెను. గాని దానిలో నొక వ్యాహారిక ధర్మమున్నదని వారెవ్వరును దాని నుపయోగించినది కాదు. భారతములోని తిక్కన్న వచనములు అంతగా కవిత్వ విశేషములు కాక ముందరి కధకును వెనుకటి పద్యములకు గల సంబంధమును మాటవరుసగా చెప్పుచుండు అతుకుల వలె అతి రమ్యములై వచన లక్షణములు అనేకములు వాటికి పట్టి యున్నవి. భారతమే ఒక మోస్తరు వ్యవహార కావ్యము అందులో తిక్కన వ్యవహార జ్ఞాని భారతమును మనలో కొందరింకను "మాలమూట" యందురు. కవిత్వ నైపుణ్యములు, అలంకార విశేషములు, ద్వంద్వార్దములు మొదలగు వానికైగాక భారతము యొక్క గొప్పతనమెల్లను కురుపాండవ జ్ఞాతుల మత్సరాభిమానములను, వీరప్రరాక్రమములను రాజకీయ వ్యవహారములను కవికదకుడు చెప్పినటుల నుండెడి పటిమకై చెందుచున్నది.

గద్యకావ్యముల శైలి

 ఇవి గాక శుకసప్తతి, హంసద్వాదశి, విక్రమార్క, కాశీ మజిలీలు మొదలగు కధలు కేవలం వచన కావ్య్లములు- వీటిలోని వ్యవహారములు, సంభాషణములు మొదలగువానికి సంబందించిన భాష భారత వచనముల వలె టూకీగాను సులభముగాను నుండును కాని వర్ణనములను ప్రారంభించెడి చోట్ల ప్రబంధవచనముల యమకరణములుగా నున్నవి. అయినను వాటికిని వీటికిని భేదము లేకపోలేదు. ప్రబంధములు కేవలము పాండిత్య ప్రదర్శనము కోసము, పండితులకి తెలియడము కోసము, పామరులకు తెలియవలెననెడి సంకల్పమేమీ పెట్టుకోకుండా వ్రాసినవి ఈ కధలట్లు కాదు. పెద్ద పాండిత్యము లేక యించుకంత చదువుకొని విలాసముగ కాముకులై వీధులలో తిరుగువారి కొరకుగాని, చోరత్వములోగల నెరజాణతనముల నెల్ల స్వైరవిహారిణులెఱింగి యానందించు కొనుటకు గాని, లోకములో జరుగ గల యద్భుతములను తెలిసికొన సువ్విళు లూరు చుండునట్టి కొంచెము మట్టుగ చదువుకొన్న వారు పఠించుకొనుటకు గాని వ్రాయబడిన గ్రంధములు అట్లైనను, వాటిని హృదయరంజకముగను, భావమును ఉద్రేకించునట్లుగను, ప్రకృతిని చిత్రించు నట్లును అద్బుతమును ప్రసాదించునట్లును చేయవలెనని తలచి ప్రబంధ వచనముల పోకడ నందు చొప్పించనిదే దానికి కావ్య ప్రపంచములో నుండదగినంత ఘనత రాదని యూహించి విద్వత్కధకులు వ్రాసిన వే యవ్వి, ఇందు చేతనవి ఉత్తమ వర్ణనలు, మధురశైలి, సులభ కధనము మొదలగు లక్షణములతో గూడి ఇప్పటి నవల ప్రపంచమునకు జనకుడవదగు శైలిలొ నున్నవని చెప్పవచ్చు దేశ చరిత్రములు, విమర్శనములు, సమాచారములు, శాసనములు, పత్రములు, ఉత్తరములు మొదలగు వ్యావహారిక గ్రంధములుగా గాక రసవంతములై హృదయములలో సంచలనాదులు కల్పింప వలసిన శైలి కావలెనన్నచో ఆశైలి మన కెంతమాత్రమును తిరస్కరిణీయము కాదు. ఇవి కావ్యములకా కావ్యములు, చదువుకొనగల వారు పఠించుటకుదగిన కధలకా కధలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారి నవల శైలికి దీనికి చక్కని సంబంధమున్నది. ఈశైలి నోటికి వచ్చినటులెల్ల వ్రాసుకొని పోవుట కాదు. డెందములొ నుదయించెడి భావముల నెల్ల సుందర పదములతో చిత్రించి వినువారి వీనులను రంజింపజేయవలె ననెడి యభిలాషతోను, సుందర దృశ్యములను వర్ణించవలసిన యవకాశములు చిక్కినప్పుడెల్లా చేయి విరచుకొని యూరకొనక శాంతముగను ఆమూలాగ్రముగను దానిని వర్ణించి కధ కట్టి దృశ్యములతో గల సంబధముల నతికి రంజింపగ జేయు చాతుర్యముతోను వ్రాయబడిన శైలి యది. దీనికి ధోరణి యొక్కటియే ప్రధానముకాదు. సౌందర్య్లము కూడా మఱియొక గుఱి ఇట్టి సుందర ధోరణిని చిందించింది లక్ష్మీనరసింహముగారి కలము విశ్రాంతి చెందింది. అప్పటినుంచి ఆంధ్రగద్యశైలిలో నెన్నైనను చిందులాడు చున్నవి గాని సౌందర్యము కాని వీనులకు విందుగొల్పు కలక్వాణము కాని మందునకైన గాన రాదు.

ఆ శైలి పడిపోవుటకు కారణములు

  ఇది యాంధ్రుకవుల లోపముగాని కధకుల లోపముగాని కాదు. ఇది గద్యయుగము, వ్యవహార యుగము విద్యా పాండిత్యముల యుగముకాదు త్రొవదప్పి యెవ్వరికైనను విద్యయును రావచ్చును. పాండిత్యము కలుగవచ్చును. కవిత్వమును రావచ్చును ఏదో యొక శైలియునలవడవచ్చును కాని ప్రతివారు కోరుకున్నదియు వ్యవహారము మన విద్యా సంస్థయున్ను విధానమున్నూ వ్యవహార కర్మాగారములు కాక విద్యాలయములను కొనుట వెఱ్ఱి అక్కడ చదువులు చెప్పుచున్నారు. పుస్తకములు గలగల లాడుచున్నవి. బాలకులు నిద్రలు లేక యేవో కంఠతాపెట్టుచు తపశ్శాలుర కంటె గూడ నెక్కువగా కృశించుచున్నారు. కాని ఇదియెల్లయు జ్ఞానాజ్ఞాన సమస్యా పరిష్కారార్ధమే కాదు. పరీక్ష పేసవుట కొఱకు అది యెందుకు? ఉద్యోగము సంపాదించుకొని పొట్ట పొషించుకొనుట కొరకు ఇప్పుడు పరీక్ష పోయినచో యావజ్జీవనమును అన్న వస్త్రములు లేక మలమల మాడిపోవలెను. కాస్త స్థితిపరులో తమ ధనమును విద్యమీద మదుపు పెట్టి పరీక్షలు పేసయి అసలు వడ్డీలు కలిపి లాగవలెనని కోరుచున్నారు. కొంత కాలము వరకు నిది లాభప్రదమై తక్కిన అన్ని వృత్తుల కంటెను నెక్కువ లాభకరముగ నుండెను గాని యిప్పుడు నిరక్షకుక్షులార్జించినంత బాగా వీరార్జించుకొనలేక, వారు సునాయాసముగా శ్రీమంతులగుచుండుట చూచి వీరి చదువులకై వీరే సిగ్గును పొందుచు తమ తొంటి యాశయము తీరదు సరేగదా, దాని వలన తలవని తలంపుగా, గలిగిన జ్ఞానము యొక్క ఫలితమును గూడ దారిద్ర్యము చేతనో విఫలమనోరధులమైతిమను నిరాశ చేతనో అనుభవింపలేకున్నారు. కవిత్వమునకు గూడనిదే గతి పట్టినది. కాని భావకవీశ్వరులు యౌవనపు మెఱుపు ఉన్నవాళ్ళు షెల్లీ కీట్సుల వలె యే ప్రేయసి మీదనో నాలుగు ప్రేమగీతములు పాడి, అనతికాలములోనే విషాదచ్చాయ వారి నావరించుటచేత డెందములు చిన్నబోయి దు:ఖాక్రాంతులై విషాదము, నిరాశను, ప్రావృడ్జలదముల వంటి కాఱు చీకట్లను అవ్యక్తముగ ఆంధ్ర సారస్వతము నందెల్ల జిమ్ముచున్నారు. భావ కవిత్వము మా కర్ధము కాదనే వారలు దీనిని బాగుగా పరిశీలించవలెను. రవీంద్రునివలె Mystic అవ్యక్త గీతములను వ్రాయవలెననెడి కోరికయు రవీంద్రుని దనరును కొంత తగులుట యట్లుండనిచ్చి, పాపము వారి డెందములే అప్రాప్తమనోరధములై అరజవ్వనములోనే అనర్ధములు వారిపై వ్రాలి, పాట అవ్యక్తమై గుండె గొంతుకలో నుంచి రాకుండెడి వారును, గొంతు ముళ్ళు వీడని వారును నైయున్నారు. పాపము అట్టివారి గీతములు మన కవ్యక్తములుగా మన్నవన్న ఆశ్చర్యమేమి? వీరు నిజముగా నిష్కాముకముగా పాడుచున్నవారే. గీతములు చదువు వారుండరు, కొనువారుండరు. వీరి యెడ సానుభూతి చూపగలవారు కూడా అరుదగుచున్నారు. అయినను సాహిత్య కవాటముల నెల్ల ముట్టడించి, తలుపులు బిగ్గతట్టి తమ స్వరమును పది మందియు వినునట్లు నిర్భంధించ గలుగుచున్నారు.
 అయితే ఈ గద్య కవుల కింకను అంత దురావస్థ పట్టలేదు. ఏరాముని చరిత్రయో ఒక చిన్న కధగా వ్రాసినను, ఏ ఆంధ్ర వీరుల చరిత్రములనో ఒక చిన్న గుచ్చముగాగ్రుచ్చినను తెక్ట్సు బుక్కు కమిటీ వారి ప్రాపకముతో దానిని నేను చేయించుకొని ఖర్చులు పోగా ఒక పుస్తకము మీద రెండు వందల రూప్యములైనను లభించి వారు పొందుచున్న యితర వేతనమునకును పిత్రార్జితమగు భూమి యేమైన మిగిలియున్నచో దాని మీదనుండి వచ్చు కొంచెము శిస్తుకును తోడై జీవనమును కొంచెము సహన యోగ్యముగా చేయును. యూనివర్సిటీ వారు పద్యము లెల్లయును పూర్వ కవీశ్వరుల నుండియే యెత్తి నిర్ణయించు ట చేత ఆ లాభము కేవలము కంపెనీలవారికే పోవుచున్నది. పోతన్నగాని, తిక్కన్నగాని, మొల్లగాని, తెమ్మనరుకదా! కాక భావకవుల విషాదగీతములను ప్రేమ గీతములను యే కుర్రవాళ్ళకు టెక్ట్సుగా నిర్ణయింపనగును?

వచనము యుక్క కర్తవ్యములు

ఇప్పటి గద్యమెన్ని శాఖలుగా నున్నదో అవి యెట్లెట్లు ఉన్నచో, వాటి నెట్లు అభివృద్ధి పరచవలెనో నిర్ణయించు కొనుటకు ముందు గతయుగములో గద్యము చేసియుండిన పనియేమో యిప్పుడు చేయవలసిన పనియేమో, నిర్ణయించవలసి యున్నది. గతయుగములో వ్రాయబడిన యే కొలది గద్య గ్రంధములైనను వినువారి మనములను రంజింపజేయుటకు వ్రాయబడిన సుందరములగు కధలు, వాటికొక సుందరమగు శైలి యవసరము. గత యుగములో గద్యమున కిది తప్ప వేరే ప్రధానమగు పనిలేదు. ఇప్పుడు గద్యము చేయవలసిన పనులు హెచ్చినవి. చారిత్రము నెల్లను పరిశోధించి తిరగ వేసి వ్రాయవలెను. వృక్షశాస్త్రము, శరీరశాస్త్రము, పదార్ధవిజ్ఞాన శాస్త్రము, రసాయనశాస్త్రము మొదలగు శాస్త్రములను బాలురకును ఫ్రౌఢులకును తెలియజేయవలెను. దేశకాల పరిస్థితులను గూర్చి విమర్శనములు చేసి ప్రజలనుద్భోదించవలెను. ఎక్కడెక్కడి వింతలను విడ్దూర్యములను పత్రికలకు వ్రాసి లోకమునకు చాటవలెను. సభలందు చర్చలు చేసి తీర్మానములు చేయవలెను. కవీశ్వరుల గ్రంధములను పఠించి విమర్శనములను వ్రాయవలెను మహాపురుషుల జీవితములను వ్రాసి బాలురకు సదాశయములు చూపవలెను. ఇదిచేయవలసిన వ్యవహారము లపరిమితముగ నున్నవి. ఇవి యన్నియును కావ్యములు కావు. వీటిలో సౌందర్యమును చూచుకొనుచు నరములు తొట్రుపాటుతనము లెమియును, పూర్వాపర సందర్భములు తప్పిపోమియు తర్కశాస్త్ర సమ్మతముగ సిద్ధాంతములును తీర్మానములను రుజువు చేయుటయు, సౌలభ్యము మొదలగు గుణములే దీనికి ప్రధానములు పరిశోధకులును, భారమునెత్తిపైగల వారును, నెల్లరును ఈ కావ్యముల యందే నిమగ్నులై యున్నారు. వీరి కర్తవ్యము వేరు వీరికి కావలసిన శైలివేరు- ఇట్టి శైలికి పితామహుడై వీరేశలింగముగారు వెలసినారు. తెలుగు జాతి యీయీ శాఖలలో వృద్ధి పొందుచున్నన్నాళ్లు ఆ మహనీయుడొనర్చిన యుపకారమునకై చేతుల నెత్తి కృతజ్ఞతను చూపక మానదు.

నవలలు
  ఇట్లయ్యును గద్యమునుండి కావ్యలక్షణములను మనము సంపూర్ణముగా విడదీయ జాలము. వీరేశలింగము గారే తమ నీతి చంద్రిక యందు ఇట్టి లక్షణములైకై ప్రయత్నించిరి కాని, అతని తరువాతి వారు దానిని కేవలము కృత్రిమమని త్రోసి వేసి అతనికి గల ప్రాముఖ్య మెల్ల అందుకొరకై కాక వానికి విరుద్ధమైన దాని కొరకేయని కృతనిశ్చయులైరి. ఇతని తరువాత నట్టి లక్షణములు గల గద్య కావ్యములను వ్రాసినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహంగారే వీరు తెలుగులో స్వతంత్రములగు గద్య కావ్యములు వ్రాసి విస్తారమగు సాహిత్యము సృష్టించి కీర్తి పట్టము గట్టుకొని విద్యా వయోపవృద్ధులై విశ్రామము తీసుకొనుచున్నారు. ఆ తరువాత స్వతంత్రములగు గద్యకావ్యములను వ్రాయగల శక్తి తెలుగు విద్యావంతులలో నస్తమించినది. పద్య కావ్యములలో రవీంద్రుడును, ఆంగ్లేయుల Minor Poems ను శరణ్యము లైనట్లే గద్యకావ్యములలో బంగాళ నవలాకారుల తర్జుమాయున్ను, అయిరోపియ నవలాకారుల ప్లాటులున్ను (plots) శరణ్యము లైనవి. ఈ లోగా స్త్రీలలోనేమి, చదువురాని జాతులలో నేమి విద్య యెక్కువై పఠనజ్ఞానము వ్యాపించినది. ఆంగ్లేయ పాఠశాలలోనేమి కచేరీ సావిళ్లలోనేమి కొలువులు సేయుచు తీరుబాటు లేని విద్యాధికులకు పరిశోదనము విమర్శనము మొదలైన పరిశ్రమలు సేయుట కవకాశములు చిక్కలేదు. గాని, ఏకొలువులోనో కాలక్షేపము సేయుచు అప్పుడప్పుడొక శాస్త్రీయ గ్రంధమును వ్రాయుటకును, ఒక నవల నేభాషనుండియైనను తర్జుమా చేయుటకును plot ను త్రిప్పి వ్రాయుటకును వున్నచో బుద్దిమంతులకును ఓపిక కలవారికిని తప్ప సాధ్యముకానివి. కాని హిందూ దేశపు భాషలలో దేనినైనా సంపూర్తిగా నేర్చుకొని అందులోంచి నవలలను తెలుగులోనికి తర్జుమా చేయుట పెక్కు జనులకు సులభ సాధ్యమైన పని. వంగదేశీయులు పద్య కవిత్వమునందే కాక నవల రచనము నందును పేరెన్నిక గని యుండిరి. మధ్య యుగము నాటి బుందేలుఖండ చరిత్రను రసవంతములగు నవలలుగా వారు వ్రాసిరి. అవి కన్నడ భాషలోనికి కూడా తర్జుమా అయినవి. కొందరు కన్నడమును సుళువుగా నేర్చుకొని వాటిని తెలుగు చేసిరి. కొందరు బంగాళ, మహారాష్ట్రము, హిందీ మొదలగు భాషలనే స్వయముగా నభ్యసించి వాటిలో నుండు నవలలను కుప్పలు తిప్పలుగా తర్జుమా చేసినారు, చేయుచున్నారు. ఆంధ్ర ప్రచారిణీ గ్రంధమాల, సరస్వతీ గ్రంధమాల మొదలగు గ్రంధమాలలెన్నియో రెండేసి మాసముల కొక నవల చొప్పున దించి ఆంధ్రుల హస్త పద్మముల కర్పించుచున్నారు. గ్రంధాలయము లూరూరా వెలసినవి. ఆంధ్రులలో గ్రంధ పఠనాశక్తిహెచ్చినది కాని దినదినమునకు భాషాంతరీకరణములై మన భాషలో పడుచున్న యీ నవలలే మన దేశమునందు స్వతంత్ర గద్య కావ్య రచనము లేక నవల రచన మింకను ఎట్లు ఉద్బవించనే లేదో తెలియజేయుచున్నవి. ఎవ్వరిని జూచినను ఏదోయెక క్రొత్త భాష నభ్యసించుచు, అందులోనుంచి కూడబలుకు కొనుచు ఒక నవలను భాషాతరీకరించిచున్నవారే. ఆంధ్రులలో స్వతంత్ర గద్య కావ్యములుదయించుట కింకను నెంతో కాలము గడువవలెను కాబోలును రాయచూరు యుద్ధము, విజయనగర సామ్రాజ్యము, లక్ష్మీప్రసాదము మొదలగు నవి కొన్ని స్వతంత్ర కావ్యములు కలవు కాని అవి క్రొత్త రచనలకు మార్గదర్శకములైనవి కావు. నవల యనగా ప్లాటు నొకటి పెట్టి కధనల్లి వేయుట కాక సమకాలిక సాంఘిక జీవనమును చిత్రించుటయై యున్నది. అట్టి నవలలొకటి కాక రెందు తప్ప ఆంధ్రజీవనమును చిత్రించునవి లేనేలేవు.

ఆఖ్యాయికలు

  గద్యకావ్వములలో రెండవ విదానము చిన్ని కధ (Small story) బంగాళా భాషలో ప్రేమచందు యిట్టి కధల నెన్నింటినో వ్రాసెను. అవి మన భాషలోకి తర్జుమా అగుచున్నవి. మరియు నితర భాషలలో నుంచి కూడా తర్జుమా అగుచున్నవి. చిన్న కధ యొక్క చాతుర్యమెల్లను ఒక మనుజుని జీవితమును ఆఖ్యానములో నుండి యెక్కడ నుంచియో మొదలు పెట్టి చిత్రముగా కొంత వరకు తీసుకొని వెళ్ళి యెక్కడనో అద్భుతముగా నాపివేయుటలో నున్నది. ప్రతి మనుష్యుని జీవితమునందును వట్టి యద్భుతములు జరుగుచున్నవి. అట్లు ప్రదర్శింపవచ్చును. కాని ఆ అద్భుతమును గ్రహించి చిత్రించగల సూక్ష్మబుద్ది గల్స కధకుడు కావలసియున్నాడు. ఆతడు వచ్చే లోపల ఈ యద్భుతము ప్రాతగిల్లి పొవును లేదా మఱపు వడును. దానిని చిత్రించుటకు గూడ గద్యకవులు కావలసి యున్నారు. నవలకారుని కంటె యిట్టివాడు పుట్టుట సులభము. నవలలో మానవ జీవితము నొక అద్య్లాయము నెల్ల చిత్రించవలసి యున్నది. ఇందులో నాలుగైదు తావులు కాని, ఒకటి రెండు తవులు కాని ఒక్క తానైనను చిత్రించి పొడుగు కాకుండా చూచుకుంటే చాలును. భారతి యిట్టి వానిని కందామని నొప్పులు పడుచున్నది. ఎవరు పుడతారో చెప్పజాలము.

రాగల గద్య్లకావ్యములు

 పురాణములలోని నాయకుల జీవితములను ఈ నూతన దృష్టితో తిలకించుచు, వారి జీవితములు మన కెట్టి సందేశముల నిచ్చుచున్నవో యుద్భోదించుచు వారి చర్యలకు క్రొత్త క్రొత్త అర్ధములను వ్యాఖ్యానములను సేయుచు, గద్య గ్రంధములను వ్రాయుచో అవి చక్కని కావ్యములగును. లేదా చరిత్రక మహాపురుషుల, పరాక్రమశాలుర జీవితములను, వారిని వారి వారి పరిస్థితులళో నిలిపి వారి శత్రువులను కష్టములను వారు అతిక్రమించి యెట్లు ధన్యులైనారో అనుకూలమగు అధ్యాయములుగ కధ విభజించి వ్రాయుచో అదియును చక్కని గద్య కావ్యము కాకమానదు. అనేకము అంశములమీద సుందరమగు భాషలొ ప్రతి వారును తమ సుందరములగు అభిప్రాయములను వ్యాసరూపుములుగా వ్రాయవచ్చును. అవి సూరిశాస్త్రిగరి నాట్యలెఖల వలె గాని పానుగంటి లక్ష్మీనరసీహారావుగారి సాక్షి ఉపన్యాసముల వలె గాని అంత పెద్దవై యుండవచ్చును. లేదా యింకను చిన్నవి చేయవచ్చును. ఇట్టి వ్యాసములలో కేవలము ధోరణియు విపులత్వము కొరకు గాక క్లుప్తత, రూఢి, సుందరత్వముల కొరకు ప్రయత్నించుచుండుట మంచిది. వీటి యన్నిటిలోను కేవలము ధోరణికే కాక సౌందర్యూమునకు గూడా శైలి యందు తావుగలదు.

ఆంధ్రనాటకములు

  ఆంధ్రనాటకములను గూర్చి మన దేశములలో నీ మధ్యను లెచినంత విమర్శనము అభిప్రాయములు, పత్రికలు, వ్యాసములు గ్రంధములును మరియే యితర శాఖపైగాని లేవలేదు. ప్రజ్ఞావంతులు కొందరందులో పాల్గొనుచున్నారు. పాటలు కావలెననువారు, వద్దను వారు, పద్యమును రాగము విసరిచదువు మనేవారు. త్రుంచి చదువుమనువారు, రాగము లేకుండా చదువుమనువారు, అంతా గద్యమునే వ్రాయ మనువారు.గద్యపద్య మిశ్రమము చేయుమనువారు, షేక్సిపియరు వలె ప్రధాన పాత్రములకూ ప్రధాన రంగములకును సర్వదా పద్యమున్ను, మామూలు పాత్రలకు మామూలు వాదుక భాషయును కావలె నను వారు పెక్కురు పెక్కు అభిప్రాయముల నిచ్చుచున్నారు. ఇంకను ప్రారంభములును సోదాలను మాత్రము చేయుచున్నారు. ఏవో కొన్ని సిద్ధాంతములు బయలుచేరునను ఆశకలుగుచున్నది. నవలలు, చిన్న కధల కంటె దీనిలో విశేషమేమనగా ఇందులో భాషాంతరీకరణములు కన్న స్వయంరచితము లెక్కువ యున్నవి. ఇతర భాషలలో నాటకముల పోకడ లెట్లున్నవో బాషాంతరీకరణము చేసి విద్వాంసులు తెలుపుచున్నారు. ప్రపంచము లోను హిందూ దేశములో నితర బాగములలోను బయలుదేరుచున్న ప్రస్తుత నాటక సిద్ధాంతములు తెలియబడుచున్నవి. ఎన్ని వివాదములు అభిప్రాయ భేదములు ఉన్నను నాటకరంగ ముత్సాహవంతముగను శుబసూచకముగను నున్నదనియే చెప్పవలెను.

దేశచరిత్రములు

 ఇక కావ్యములు కాని ఇతర గద్య గ్రంధములను గూర్చి మనమాలోచింప వచ్చును. ముందు విమర్శన గ్రంధములు వీటిలో ప్రకృతి వర్ణనలు కాని, ఉత్సాహొద్రేకములు పుట్టించుట కాని, సుందర పదతుందిలమగు శైలి కాని అవసరములు కావు. విమర్శకుని దృష్టి యెల్లయు తన చెంతనున్న అసంఖ్యాక ములగు పత్రముల నుండియు, అభిప్రాయముల నుండియు సత్యమైన దెద్దియో నిర్ణయించి బలవత్తరముగ రుజువు పరచి, అందుకు వ్యతిరిక్తములైన నన్నింటిని కాదని చెప్పి త్రోసిపుచ్చుట ఇట్టస్థి విమర్శనము ముఖ్యముగా దేశ చరిత్రమున కవసరమై యున్నది. ఈ రంగములో మనకంటే ముందు పాశ్చాత్యులు ప్రవేశించి పత్రములు, శాసనములు, గ్రంధములు మొదలగునవి తిరగవేసి వారికి తోచిన సిద్ధాంతములను స్ధిరపరచి, నచ్చనివి త్రోసివేసి చరిత్రలు వ్రాసి, ప్రపంచము నకు ప్రచురించి మన దేశములొ పిల్లల చేతను పెద్దల చేతను పఠింపచేయుచున్నారు. ఇందు వాటి పరిశ్రమయే మనకు కొంత సహాయకరము కాగలదు. క్రొత్తక్రొత్త సంగతులు కూడా తెలియుచున్నవి. దేశభాషలును, శాసనముల లిపులును, దేశ లక్షణములును స్వదేశీయుల మగుటచేత వారి కంటె మనకు మఱీబాగుగా తెలియ గలవు. వారి సిద్ధాంతములు సరిగా లేవనియు అవిప్రబలినచో మన నిజ లక్షణములు బయలు వడక లోకము మోసపోవుననియు భావించి పెక్కులు దేశీయులా రంగములోనికి దిగి క్రొత్త చరిత్రలు వ్రాయుచున్నారు. దేశచరిత్ర వ్రాయు నుద్దేశముతో గాక సాహిత్య చరిత్రము నెఱుగు నుద్దేశ్యముతో కొందరు వానినెల్ల తిరగవేసియున్నారు. కొమర్రాజు లక్ష్మమణరావు గారు, వీరేశలింగం పంతులుగారు, గిడుగు రామమూర్తి పంతులు గారు, జయంతి రామయ్య పంతులుగారు మొదలైన వారెల్ల రెండవ తరగతి వారు వీరి పరిశ్రమల నాదారము చేసుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్రమును విపులముగా వ్రాయవలసి యున్నది. ఆంధ్ర సాహిత్య చరిత్రమునకును ఆంధ్రచరిత్రమునకు అవినాభావసంబంధమున్నది. కనుక ఆ సందర్భములోనే ఆంధ్రసాహిత్య చరిత్ర కవుల చరిత్రలు కూడ దొరకును.

వార్తాపత్రికలు

  వార్తాపత్రికల వైపున కొకసారి చూడనిదే గద్య కావ్య ప్రశంసను మనము విడచి పేట్టజాలము. వార్తాపత్రికలు కేవలమును వార్తావాహకములు మాత్రమే కావు. యుక్తాయుక్త విచక్షణము, సమహిత శీలము, దేశాభిమానము, స్వాతంత్ర్యకాంక్ష నిర్భీరుత్వము, మొదలగు గుణములు గల సంపాదకులచే నడుపబడుచుండు పత్రిక అనతి కాలములో దేశములో ఆచార్యపీఠము వహించి, ప్రజలకు విధినిషిద్దములను చూపుచు క్లిష్ట సమయముల యందు అనుసరణీయమైన సలహాల నీయగల హక్కును సంపాదించుకొనుచున్నది. దేశములో వివిధ రాజకిఈయాభిప్రాయము భేదములు సాంఘిక విదానములు, విశిష్టమతములు నుండి యొకరి సలహా యొకరికి వచ్చును గాక. మానుము గాక, వ్యాసముల యందలి, అందును ముఖ్యముగ సంపాదకీయములందలి శైలి, వారము వారమునో దినదినమునో వీనులపై డప్పుల శబ్దము వలె పడుచుండుట చేత ఇది రహస్యముగా పాఠకుల భావనలోనికి వచోవిధానములోనికిని దూరి, దేశీయ సాహిత్యమునకే యొక క్రొత్త ధోరణి కల్పించక మానరు. ఈ విషయములో దేశమాత చేసిన సేవయు కృష్ణాపత్రిక యొనరించుచున్నదియు మిగుల ప్రశంసింపదగినవి. ఇప్పుడు చేతిలో నైదువందలు గల గల లాడుచున్న వారందరును ఒక పక్షమునో, ఒకవ్యక్తినో, ఒక జాతినో దూషించుటకై యేక పత్రికను పెట్టుకొని కొన్ని నాళ్ళు గల గల లాడించి చిత్త జల్లుల వలె వెలసిపొవుచున్నారు. కొన్నిపత్రికలలో పత్రికలు సాగుటకు గల మదుపు, పేజీలు నిందుటకు గల మాటలు, ప్రకటనదారుల (Advertisers) నమూనా సొమ్ములను తప్ప ఒక శైలి గాని సాహిత్యచాతురిగాని కానరాకున్నవి. ఆంధ్రపత్రిక సంపాదకీయముల కొంచెము పొట్టితివైతే బాగుంటుంది. బ్రాహ్మణులు దానవులు కారని తలుస్తే సమదర్శిని మంచి ఆదరణ పాత్రమౌతుంది. బ్రాహ్మణేతరొద్యమముతో ఢీకొనుటయే తన అవతారము యొక్క ఆదేశమనుకోకుంటే తెలుగు గీతము నొక్క ప్రతి తగ్గించి పాపము సుబ్బమ్మగారి వంటి బాల వితంతువుల మీద మంచి తన ఆయుధపు గుఱిని తప్పించినచో తెలగపత్రిక యెక్కువ శౌర్యవంతమౌతుంది. దానిశైలియు సాహిత్య చాతుర్యమును నీచపు హెళనల నుండి విరమించవలెను. దురుసు తనమును బాల్య చాపల్యమును విసర్జించినచో కాంగ్రెసు పత్రిక యెక్కువ మన్నన పాత్రమౌతుంది. అయితే యెన్నికలు దాటే వరకు మాసలహా యెవరికి గాని నచ్చునని తొచదు. ఆ తరువాత మిగిలినవి యెక్కువ స్తుతి పాత్రము లౌతాయని నమ్మవచ్చును.

గ్రంధ విమర్శకుడు

  పిమ్మట నాంధ్రగ్రంధములు విమర్శనము చేయవలెను. మొన్న మొన్నటి వరకును గ్రంధ విమర్శన మనిన ఒప్పులు మానివేసి తప్పులు చూపించుట యనియే అర్ధము. అవియును వ్యాకరణము తప్పులు, గురుజాడ శ్రీరామమూర్తి గారు, వీరేశలింగం పంతులుగారు మొదలైనవారు అంతకన్న ఒక మెట్టు ముందుకు వచ్చి కవి జీవించిన కాలనిర్ణయము, అతని వంశావళి, అతని మతము, అతని పద్యముల నుండి రసగ్రఃహణార్ధము కొన్ని పద్యములనెత్తి వ్రాయుట యీ మొదలగు పనులు చేసినారు విమర్శనమనిన నింతకన్నను ముఖ్యమైనపని యున్నది. ఆ గ్రంధములలోని రసమును గ్రహించుట. అందులోని పాత్రముల స్వభావముల ఔచితులు చర్చించుట, తోడివారి గ్రంధములలోని పాత్రములతొ పోల్చిచూచుటలు, అందులో మానవస్వభావమున కొప్పిన నెంతవరకొ విపరీతమెంత వరకో మొదలగునవి యెల్ల విమర్శన చేసి కవితత్వమును గ్రహించి, పాఠకులకు దానిని చెప్పి, విద్యాధికులకును విద్యాహీనులకును గూడ ఆయా గ్రంధములను పఠించి, విమర్శించి తమ తమ అభిప్రాయములకు వారు వచ్చెడి రీతిని చేయగల యుత్సాహమును పురిగొల్పుట, ఇది నిజముగా నొక కధ. పాశ్చాత్యదేశములలో నిది చక్కగా వన్నె కెక్కి విమర్శకుడు కవితో తుల్యమైన స్థానము నలంకరించు చున్నాడు. విమర్శకుడు కేవలము వ్యాఖ్యాత కాదు. కవి హృదయగ్రహణ విద్యాధురీణుడు, కొత్త సిద్దాంతములను క్రొత్త సత్యములను గ్రహించుటలో నతనికి గల బుద్ధి కవిబుద్దితోను, చారిత్రకుని బుద్దితోను, ప్రకృతి శాస్త్రములలో గొప్ప గొప్ప సిద్ధాంతములను కనిపెట్టి పెద్ద మార్పులు చేయుచున్న బోసు మొదలగు వారల బుద్దితొను, జ్ఙానాధిక్యముచే బ్రహ్మమును తెలుసుకొన్న వేదాంత బుద్దితోను తుల్యమైనదిగా యెన్నబడుచున్నది. అట్టివారి బుద్ది ప్రసరించినచో రామాయణ బారత భాగవతములు ప్రబంధ రాజములు మొదలగున వెల్లయు మనకు క్రొత్త సత్యములను క్రొత్తధర్మములను క్రొత్త సందేశములను వ్యక్తీకరించును. ఈ పని కేవలమున్ను కవిని పొగడ దొరకొనుట వల్లను లభించదు. కవికి విముఖుడగుట వలన లభించదు  కవితో యేకమయి కవివలె చూడగల శక్తి నలవరచుకొనుట వలన లంబించును. గ్రంధపఠనపరాయాత్తచిత్తుల కది సులభసాధ్యము. మన యువక కవులలో పెక్కురు దీనికి గడంగ వలెను.

శాస్త్ర గ్రంధములు

   ప్రకృతి శాస్త్రములను గూర్చియు ఆర్హిక సహకార తత్వములను గ్ఫూర్ఫియు కృషి శాకఖలను కాని ఇవి ముఖ్యముగా తత్శాస్త్రములలోను, తత్శాఖలలోను పండియున్న పండితులు చేయవలసిన పనియై యున్నది. విశ్వవిద్యాలయముల వారును, విద్యాశాఖల వారును చేయించవలసిన పనియై యున్నది. ఎవరు చేసినను దీనికి కావలసినది భాషా పాండిత్య్హము కాదు. శాస్త్ర పాండిత్యము. భాష సుందరముగను మనోరంజకముగను నుండవలసిన పనిలేదు. తెలుగు మాటలాడుటలోను వ్రాయుటలోను కాస్త ధోరణియున్నచో చాలును. కాలక్రమేణ దానికి కొంత పరిభాష యేర్పడి, ధోరణి నలిగిపోయి ప్రవాహము వలె నుపన్యసించుటకు వీలిచ్చును. ఇంగ్లీషుభాష బెంగాలీ భాష, మొదలగు బాష లెల్లయు నీ శైలి నిట్లే యలవరచుకొన్నవి. తెలుగును నిట్లే యలవరచుకొనగలదు. ప్రయత్నము చేయకుండా వెనుకకు తగ్గియుండుట వలన పనియే ప్రారంభము కాదు. ఆంధ్ర యూనివర్సిటీ వారు లేనిపోని సందేహములు పెట్టుకొని కాల విలంబనము సేయుట కంటే యెక్కువ అవివేకమైన పనిచేయలేరు.

వాడుకభాష

'
 గిడుగు రామమూర్తి పంతులుగారు ప్రారంభించిన వ్యావహారిక భాషావాదము లోని సమంజసత్వము గూర్చి యొక్కసారి ఆలోచించి యీ అంశమును ముగింతము. ఈ వాదము అమలులో గద్యవచనము నిమిత్తమైయే ప్రారంభింప బడినదని ఆయనే చెప్పుచున్నారు. గీతకవిత్వము లోనికి వ్యావహారిక భాషా ప్రయోగములు జోరుగ బోవుచున్నవన్నచో గద్య కావ్యములోనికి పోకుందా వాటి నెవ్వెరాపగలరు? గద్య కావ్యము లోకి కంటెను గూడ గద్య విమర్శ గ్రంధముల లోనికిని , గద్య శాస్త్ర గ్రంధముల లోనికిని ఆవాడుక పదము లెక్కువగా పొక తీరదు. మాలపల్లి వంటి నవలలు ఆ వాడుక పదములను అసంఖ్యాకములుగా లోన జేర్చుకొనియును చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి నవలల కంటె తక్కువ మనోరంజకముగను మధురశైలి నంతముగను నున్నవని చెప్పంజాలము. బారతిలోను సఖిలోను ప్రచురింపబడుచుండు చిన్న కధలు లెక ఆఖ్యాయికలు రచన, రసపరిణామము, కళ మొదలగు విషయములలో నెట్లుండినను ఆకర్షణ శక్తిలో గ్రాంధిక భాషలోని కధల కంటే మిన్నగ నున్నవని చెప్పక తీరదు. చిన్నయసూరి నీతిచంద్రిక, యెక్కువ అపురూపములగు పదములతో వారు పరిచయము కల్పించి నిఘంటువు చూసుకొని భాషాజ్ఞానము వెచ్చించునట్లు చేయుచున్నను వీటికంటే యెక్కువ ఆకర్షకముగ లెదు. ఈ భాషలో ఆ కధలు వ్రాసినందువలన దాని వన్నె యేమియును తగ్గదని చెప్పగలము. భాషా పరిశ్రమము కావల్సిన వారే పుస్తకము నైనను చదివి అభ్యసించుకొనవచ్చును. కాని సులభశైలి నిర్ధుష్టముగా భావములను విప్పి చెప్పగలుగుట మొదలగు నేర్పులు చిక్కుటకు చిన్నయ్యసూరిగారి వంటి గ్రంధములు చదువ నవసమేలేదు.

వాడుకభాష నెట్లు చంపిరి

   కాక పంతులు గారు మరి యొక్కటి చెప్పుచున్నారు. అదియును మాకు సాధ్యమని తోచుచున్నది. తెలుగు గద్య కావ్యములకు, చారిత్రక గ్రంధములకు, ఆంధ్ర భాషలో ననుశ్రుతములుగా వచ్చుచున్నది వాడుక భాషా శైలియే యనియు చిన్నయ్యసూరి మొదలగు పండితులు వ్యవహారిక భాషయే మహా అపరిశుభ్రమైనట్లు భాషకు పరిసుద్ధత నిచ్చుకొనుటకు తన వ్యాకరణము ప్రకారము ప్రాత గ్రంధములలోని అకాల్పనిక శైలిని తన వ్యాకరనము ప్రకారము దిద్దెననియు, తన ప్తాత ప్రతులను గూడ ఈ సూత్రముల ప్రకారము దిద్దుకొనెననియు వారు చెప్పుచున్నారు. వారు సంగ్రహించుకొని యుంచుకొనిన పై కధల పుస్తకములు మొదలగు వాని నెల్లచూపి తమ సిద్దాంతమును వారు స్దిర పరచుచున్నారు. వసుచరిత్ర, భారతము మొదలగు మహాగ్రంధముల యొక్క పురాతన పండిత వ్యాఖ్యానములలో నీ వాడుక భాషాప్రయోగములే ఉన్నవి. వారికి గ్రాంధిక భాష రాదనరాదు. అవి అన్నియు అచ్చు తప్పులేయని త్రోసి వేయరాదు. అప్పటి చరిత్ర గ్రంధములును శాసనములును ఇంకను ఆ భాషలోనే యున్నవి.
  అయిననేమి చిన్నయ్యచూరి పందెమును ఇప్పటి పందితుల పందెమును నెగ్గినది అప్పటి అనుశ్రుతముగా వచ్చుచున్న దగ్య భాషను వారరికట్టి పద్య కావ్యములలోని వచన భాషకు మానవజీవిత వ్యవహరములలో నమలులో లేని గ్రాంధిక ప్రయోగముల భాషకు పట్టాభిషేకము చేసి, వ్యాకరణము వ్రాసి, మన యూనివర్సిటీ వారి సహాయముచే దానిని ప్రతిష్ఠించిరి. ఆంధ్ర విధ్యాధికులకు కూడ ఈ పాతపాలలవాటయి చంటిపాలు అంటూ ఒకటి ఉంటాయనే జ్ఞానము లెకుండా చేసినారు. ఆకృత్రిమ శైలిలో వ్రాయుటయే ఒక కాడికి సులభముగను, గద్యము వ్రాయవలసిన వాడుక భాషలో వ్రాయుట కష్టముగను చేసినారు. కొక్కొడ వెంకటరత్నం పంతులు మొదలగు వారి చేత నదియే యుత్తమ భాష కనుక యింట్లో కూడ నట్లే మాట్లాడవలయునని తలంప జెసి అట్లే మాట్లాడుట అభ్యాసము చేసుకొని నట్లు చేసినారు. నేడు యెన్ని తప్పులు ఎన్ని అవకతవకలైనా పడి ఆ గిరులలోనే కొట్టుకొందామని చూస్తున్నది. కాని దిగుతామని కోరిక ఉన్నా చాని స్వస్థానమున కది రాజాల కున్నది. మహామహోపాద్యయ బ్రహ్మశ్రీ ఆచంట వెంకటసాంఖ్యాయన శర్మ గారంతటివారు. "గిడుగు రామమూర్తి పంతులు గారు చెప్పినట్లే కావచ్చును వారు భాష యొక్క శ్రేయస్సునూహించి కృత్రిమమని అనుకోకుండా ఆకృత్రిమము నొనరించినవారే యనుకొందము. అది దేశమునకు మేలుగనే పరిణమించినది. అది వ్రాత కలవాటయినది. మావంటి వరము యుపన్యాసాలను కూడ అట్లే యిచ్దుచున్నాము. ఇప్పుడు దాని మీదికి తిరగబడి మునుపటి స్థితికి పొవలసినంత అగత్యమేమి? యని సేలవిచ్చినారు.
  మనము తిరుగుబాటు చేసి తొల్లిటి నుండి అనుశ్రుతముగా వచ్చుచున్న స్థితికి రాగలుగుదుము. రాలేకపోదుము పదియేండ్ల వరకును తెలుగుభాష నేర్చుకున్న తెలుగు కుఱ్రవాడు ఆ తరువాత అరవ దేశము వెళ్లి తెలుగు నేర్చుకొని, తనది ఒకప్పుడు శుద్దమైన తెలుగన్న సంగతే మరచిపోయినాడు. తనెదే మేల్తరమగు తెలుగనుకొనుచున్నాడు. చాలా కాల మట్లే అలవాటగుట చేత తన దేశపు తెలుగును తిరిగి నేర్చుకొనగల అవస్థను దాటిఫొయినాడు. అయినను ఎవరైన వెళ్లి "తమ్ముడూ నీ పూర్వపు తెలుగు ఇదికాదురా, అదిరా దానికలవాటు పడురా" అని ఉపదేశిస్తే వాడికి నచ్చితే కూడా వాడి తొల్తటి తెలుగుకు రాలేడు అయినా వాడా తెలుగు అని తెలుసుకొనుట వాడి కానంద దాయకముగా నుండక ఫోదు.
వాడుకభాష యొక్క భవిష్యద్భాగ్యము
   మే మెవ్వరమును ఇప్పుడట్టి అకాల్పనిక సహజ మధుర భాషను, ఈ కూసు విద్య నేర్చుకొన్న కతమున వ్రాయజాలకున్నను మన భాష కొక్కప్పుడట్టి యకృత్రిమ మాధుర్య ముండెను గదా యన్న ఆనందము లేకపోలేదు. ఒక్కసారిగా మే మా ముచ్చట లూరెడి మంజుల శైలికి రాజాలకున్మాము. రాగోరుచు గ్రాంధికములోనికి నడుచుచున్నాము. కాని వాడుక భాషయును తత్ప్రయోగములును వాటంటత అవియే మా కలముల లోనిక్ పోవుచున్నవి. వాటికి ఆతిధ్యమిచ్చి ఆదరించుచున్నాము కాని పండిత నైజమగు తిరస్కార దృష్టితో గెంటివేయలెదు. అది మాస్వస్థాన మనియు జన్మభూమి యనియును మాతృమందిరమనియును, పాలకోశ మనియును తెలిసిన తరువాత మేము దాని దగ్గరకు రెక్కలు కట్టుకొని యెగరాలనుకున్నాము కాని, అదియే దీనదృక్కుల తోను, తెలివి నవ్వులతోను, చిన్ని నవ్వులతోను, చేయి దాచుకొని వచ్చుచుండగా ఎత్తిపట్టుకొని ఆదరించకుండుట కలదా! అందరికీ వారు పుట్టిన యింటిలోనే పెరిగి వృద్ధి నొంది పేరు మోయడం సహజమైతే, మాకు మెము పుట్టినిల్లదే అని తెలుసుకోవడమే ఆనంద కారణముగా వుంది. సహస్రకోటి కంఠములు కాదు కాదని కేకలు వేస్తున్నా ఒక్కడూ ఔను ఔను అని చేతులు రెండు యెత్తుతూ ప్రాత పత్రాల వేపూ దిద్దిన గ్రంధాల వేపూ శాసనాల వేపూ చరిత్రల వేపూ చూపెడుతూ మొర్రపెట్టి స్వస్థానము చూపించేడు. ఇల్లు గుర్తు పెట్టుకున్నాము గదా! ఇటువేపు దృష్టి తిరిగించి గదా! ఇంటిలోకి వచ్చి కూర్చోవడం సాధ్యం కాకపోయినా ఆ ప్రాంతాలనేనా తచ్చాడుతాము. అటువేపు చూడడమే  భాషాద్రోహము, మహాపాతకం, అందవిహీనం అనే భయాలు పోయినాయి. పెక్కురకాల గ్రంధాలు, కవిత్వాలు విమర్శలు, శాస్త్రాలు బయలుదేరనున్నాయి. శ్రీ పంతులుగారు చూపించిన మార్గం రామసహాయమై వారి వేపు కృతజ్ఞతాదృష్టితో తిలకించేటట్లు చేయక మానరు. కొందరు ముందర వెళ్ళుతారు. కొందరు తాపీ పడతారు. కొందరు తొందరపడుతారు కొందరు నిక్కి నిక్కి వెనక్కి నక్కుతారు కొందరు సంతొషిస్తూ వెళుతారు. కొందరేడుస్తూ జారుతారు కాని అందరూ కూడా ఆ స్వస్థానానికే ఆ చుట్టుపట్లకే పొగలరు? లేకుంటే వీళ్లెవరో అక్కడి వాళ్లకే తెలియడమేలాగా!