గరిమెళ్ళ వ్యాసాలు/క్రొత్త అనుశాసనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

క్రొత్త అనుశాసనము

 ఆంధ్ర బాషలోగద్యము యొక్క అవశ్యకతయూ ప్రచారమునూ మిక్కిలి హెచ్చుచున్నది. ఆంధ్రశబ్దచింతామణి మొదలగు వ్యాకరణములు పద్య కవిత్వములో నుపయోగింప వలసిన ప్రయోగములను మాత్రమే విశదీకరించి చప్పునుగాని భాషాశాస్త్రము ను గూర్చి గాని మామూలు గద్యమునకు సరిపోయెడి పదములు వాక్యములు సంధులు మొదలగు వానిని గూర్చి కాని అధికముగా చెప్పవు. పద్య గద్యములకు పొదుపుగా ఒక్కటే వ్యాకరణము చాలునని వారు తలంచిరేమో! పురాణాదులలో వ్రాయబడేడి వచనములట్లే వ్రాయబడేడివి. కాని మామూలు వచనములు, వ్యాఖ్యానములు, కధలు, శాసనములు మొదలగునవి అట్టి భాషలో వ్రాయబడలేదనుట సువిదితం సుప్రసిద్ధ వ్యాకరణలక్షణ విరుద్దమగు నట్టియు, మామూలు వచనములు, వ్యాఖ్యానములు, కదలు శాసనములు, మొదలగునవి అట్టి భాషలో వ్రాయబడలెదనుట సువిదితము సుప్రసిద్ధ వ్యాకరనలక్షణ విరుద్దమగు నట్టియు, మామూలు మన శిష్ట వ్యవహార భాషకు సన్నిహితమగు నట్టియు భాషలో అగ్రతాంబూలాదులు వ్రాయబడు చుండెడివి. ఇట్లు వ్రాయబడిన గ్రంధములెంత మాత్రమును కొంచెము కావు. అట్లయినను వీటికి వేఱే యొక లక్షణము వ్రాయకుండుట బట్టి అవి ప్రత్యేక లక్షణమంటూ ఉండవలసిన అవశ్యకత యెకొటి లేదనియువారు తలంచిరని మన మూహించుకోవలెను.
   కేవల గద్య కావ్యములును, సులభ గ్రాహ్యములగు ప్రసంగములు, కధలు, వింతలు, వ్యాసములును ఈ యుగములో హెచ్చజొచ్చి నప్పటినుండియు, ఆవ్యాకరణములు వీటి అభివృద్దికి సరిపడవనియు, వీటి కనుకూలమగు వేఱే వ్యాకరణం వ్రాయనిచో పూర్వవ్యాకరణ సూత్రబంధితమై గద్యరచన పెరుగకుండుట కాని, నియమరహితమై పేలవమగుట కాని తటస్థించుననియు తలంచి గద్యముంకు వేఱే వ్యాకరనము వ్రాయవలసిన అవశ్యకత యున్నదని శ్రీ వీరేశలింగం పంతులుగారే గ్రహించిరి. ఇట్టి భావము నానాటికి ఆంధ్ర గద్యకారులలోను, భాషా పరిణామశాస్త్రజౣఅలోను వ్యవహారిక ప్రయోగములను సుదరముగా తమ పద్య్హ కావ్యములలోకే జొప్పించిన పూర్ఫ విఖ్యాత కవీంద్రుల గ్రంధమ్లను పఠించెడి వారిలోను హెచ్చజొచ్చినవి ఇట్టి భావములు పొడమునున్నట్లును అభివృద్ది యగునట్లును శ్రీ గిడుగు రమమూర్తి పంతులు గారి సిద్దాంతములు. తర్కములు, ప్రచురణములు, ప్రయత్నములును మిక్కిలి శ్లాఘ్యములనుటలో సందేహము లేదు.
  గద్య గ్రంద్ష భాష ఎంతవరకు కేవలము వాడుక భాషగానే నుండవలను. ఎంత వరకు దానికి సన్నిహితమై యుండవలెను. ఎంతవరకు దని కీషదతీతమై యుండి "కృతకము" గా ఉండవలెను అను సమస్యలకు విద్వాంసులు వారి వారి అభిరుచులకు తగినట్లు అభిప్రాయ భేదములను కలిగియున్నారు. గ్రంధకెర్తలును అట్లే వివిధ శైలులలో వ్రాయుచున్నారు. కాని ఎంతవరకో కొంతవరకు కేవలము వాడుక భాషకు కొంచంతీతమై యుండవలెననియు, ఇంచుమించుగా అందరును అంగీకరించుచున్నారు. ఇందుకై చేయవలసిన భగీరధ ప్రయత్నము కూడా విస్తారమేమీ లేదు. కొన్నిమాండలికములు కొన్నిదేశ్యములు, కొన్నిఅన్యయములు, సంధులు, విసందులు సముచ్చయములు పేరు మోసిన గ్రంధములో నున్నవాటిని కొన్నింటిని,లేకుండానే శిష్ట వ్యవహరములో ఉండే వాటిని కొన్నింటిని వైకల్పికముగానో బహుళముగానో ఆధునిక గద్యములో ప్రయోగించవచ్చునని అన్ని మండలముల లోని పెద్దలును గలసి ఒకతీర్మానమునకు వచ్చుటయే దీనికి కావలసిన దంతయు ఎద్దలు కొంతవరకు తమ అహంకారములనుజ్ మానుకొనుటయు, కొంతవర్కు తమప్రతికక్షులను కొనబడు వారి యభీప్రాయముల పట్ల కొంత సహనము చూపుటయూ మాత్రమే తప్పు అరసున్నలు తప్పుబండిఱాలు ప్రయోగింపకుండా సరియైనవి మాత్రమే ప్రయోగించవచ్చును. మానితే మానవచ్చును అన్న షరతుకు వ్యవహారిక భాషావాదులొప్పుకొనవలెను. తప్పుని ప్రయోగించకుండా సరియైనవి మాత్రమే ప్రయోగించవచ్చును. మానితే మానవచ్చును అన్ని షరతుకు వ్యవహారిక భషావాదు లొప్పుకొనవలెను. తప్పుని ప్రయోగించితేనే కృతకము కాని సరియైనవి ప్రయోగించుట కృతకముకాదు. ఇప్పటి గ్రాందిక భాషావాదులను కొంబడువారు కూడఱసున్నలు బండిఱాలు మేము విడువమని చెప్పుదురు. మాత్రమే కాని తప్పుగా ప్రయోగించుతామని వారిలో కొందరు తర్కకౌశల్యము కొరకు వాదింతురే కాని వ్రాత సమయమున పాటించలేరని వారి గ్రంధములు చదివిన వారికి
గరిమెళ్ళ వ్యాసాలు
గోచరము కాగలదు. కొన్ని సంధులను సముచ్చయరూపమగు మగాగమమును సందర్భానుసారముగా వారును విడుచుచునే యున్నారు ఇంతవరకు వారి తొల్లింటి కట్టుబాట్లను తెలిసియో, తెలియకయే కోరియే కోరకయే మీఱుచు వ్యావహారిక వాదమునకు సమీపముగా వచ్చుచు, సాపుగా చదువబడుచు వంద్యులగుచున్నారు.
  వ్యావహారిక భాషావాదులు పై వాని కొప్పుకొనుచునేయున్నరు. ఇట్లు వ్యావహారిక ప్రయోగములను చేయుటయే చాలునని వారు సంతసింపవలెను. గాని గ్రాంధిక ప్రయోగములను చేయనె రాదని పట్టుపట్టుట యవివేకము వాడుక భాషలో కూడ రెండు వాడుక భాషలున్నవేమో! సరీగా మనము మాటలాడే వాడుక భషనే గ్రాంధిక భాషాభిమానులు గ్రంధములలో వ్రాయరు వీటి కన్నింటికిని భేదములు బ్రహ్మాండ మంతవి కాకుండ దగ్గర దగ్గరవిగా ఉంటే ఛాలును. ఆందుచేత సుబోదక సుందర వ్యవహారిక శైలి పై మూడింటి లక్షణములతొను చెప్పలలరారవలెను ఇంతవరకు తెలుగులో వ్రాయబడిన గ్రంధములు చదివి, వ్యాకరణములు చూచి వ్యాసములు మొదలైనవి వ్రాయుట కలవాటుపడిన వారి శైలి నెట్టి వాదము తీసుకొని వచ్చి కాని ఆప్రమాణమని త్రోసివేయజాలము. అట్టివారిలోనుండి తప్పు ప్రయోగములుంటే తీసివేయవలెను. తప్పు ప్రయోగములు గ్రాంధిక వ్యావహారికములకు రెండింటికిని కూడినవి. తెలుగులో ఏదైనా వ్రాతాము. నలుగురు మనము వ్రాసినది చదవాలి అని అభిలషించే వారందరూ ఆ మాత్రము పునాది తొటి అయినా రాకుంటే నోటికి వచ్చే ఆశ్లీలముల దగ్గర నుంచీ గ్రంధస్థములై లక్షణములను కోరవలసిన గతి పట్టుతుంది. వ్యావహారికవాదులైననూ నిరక్షరకుక్షుల యొక్కయు, గ్రంధములు చదువని వారి యొక్కయ్లు, రచన గాని, శైలి గాని అలవడని వారి యొక్కయు నోళ్ళకు వచ్చే ధోరణులు సర్వమూ గ్రంధస్థములు కావలెనని కోరదు గదా! అట్లుకోరినచో దానికి శిష్టత్వ మేర్పడదు. కంక వారి వాదనకీ అది భంగకరమగును. ఉభయభాషా సిద్దాంతులకును పాదుపైన ఒక శైలి యేర్పడవలెనన్న బ్రస్తుతపు ప్రసిద్ధ గ్రంధకర్తలని పేరుమోసిన లక్ష్మీనరసింహంగారు, వీరేశలింగం గారు, కవిరాజుగారు, పొనుగంటి వారు తిరుపతివారు మొదలగు వారి యొక్క గద్య రచనలలోని శైలికి సంబంధములేని శైలిని ఒక దానిని తెచ్చి పెట్టగోరిన ప్రయోజనము లేదు గ్రాంధికమో గంధికమో దానికొక శైలి యనే పేరు, దానితో అనేక గ్రంధముల వ్రాత, అనేకులు పండితపామరుల కవి సుబోధములై చదువుకోవడం, ప్రౌఢకవుల ప్రౌడ గ్రంధకర్తలే కాకుండా క్రొత్తగా లేచుచున్న బాలకవ్లు బాలవ్యాసకర్తలు కూడా దానిలో ఇంచుమించుగా వ్రాయగలగడం చేస్తే, దానిని పిలకట్టు కొని యీడ్చి వేయడము అంత సులభము కాదనిన్నీ అట్లు యీడ్చి వేయవలసినంత మహాపరాధమేమి అది చేపట్టలేదనిన్నీ అందరికీ సుబోధకము కాగలదు. వారు చేసిన అపరాధమంతా ఒక్కటే. ప్రజల భాషలోని యింపితములగు ప్రయోగములకు, అనగా శిష్ట భాషకు, మన పూర్వ గద్యకారు లందరూ చోటిచ్చి యుండగా, చిన్నయ్యసూరి గారి దగ్గర నుండి తరువాత వరెవ్వరూ దానికి తగిన స్వాగత మీయక ఆశ్లీలము క్రింద్ త్రోసి పారవేయబూనినారు. అదియును వారికి సాధ్యము కాలేదు. వారికిష్టము లేకున్నా వారికి తెలియకుండానే ఇవి కొన్ని వారివ్రాతలలో తగిన స్థలములు వెతికి చూచుకొని కూర్చున్నవి. అవి అన్నీ దిద్దుకోవడానికి కొందరు ప్రముఖులు గడగడము అవివేకము వాటికస్ప్ర

శ్యతా దోషము నారోపించి మెడపట్టి గెంటివేయడము మన భాషా సాంప్రదాయమునకు విరుద్ధము. పైగా వారి కర్తవ్యమో అంతకు విరోదమై సవ్యమైనది. అదియేదనగా వాటికిని వాటి వంటి ఇతర వ్యావహారికములకును అనుశాసనం చేసి గ్రంధ భాషకును శిష్ట వ్యవహార భాషకును పొత్తు గూర్చి శైలిని సజీవము చేయుట, వ్యావహారిక వాదులు తమ శిష్ట ప్రయోగముములను అనుశాసన్ము చేసి గ్రంధ బాషకును శిశ్హ్ట వ్యవహార భాషమును పొత్తు గూర్చి శైలిని సజీవము చేయుట, వ్యావహారిక వాదులు తమ శిష్ట ప్రయోగములకు వర్తమాన రచనల యందును శైలి యందును తావు దొరకవలె ననియె ఆందోళనము చేయవలెను గాని యేభై సంవత్సరముల నుంచి ఆయెను పండిత గ్రంధకర్తలును, బహ్జజనులచే చదివి ఆనందింపబడు వారును అగు వారల కలవాటయిన శైలిని సమూలంగా ఒకసారి నిర్మూలము చేయవలెనని కొరుట అసాధ్యపు కోరిక అనర్ధము కూడా నేమో తెలియదు. అది అలవాటై, నిర్ధుస్ఝ్టమైతే,ఇది వాస్తమై మనోహరమైతే రెండూనూ చెట్టాపట్టాలు పట్టి తిరుగుతూ ఒక్కటి కావడానికేమీ అభ్య్హంతరం లేదు ఉందకూడదు. మన హరికధలు, వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు, జానపదములు, స్త్రీల పాటలు, వేదాంత తత్వములు మొదలగు వానిలోని భాషలో గ్రాంధిక వ్యవహారికములకు మధ్యన ఎటువంటి యేళ్లు కాని సముద్రాలు లేవు రెండు రెండుగా వుండక ఒక్కటిగా వుండి పండిత పామరజన సుబోధకములై అందంగా వుండేవి. రెండింటిని వేఱుచెయ్యడం రెండవదానిని ఆంక్ష పెట్టడం క్రొత్త శిష్టుల ప్రారంభీంచిన పద్దతి దీనిపైనే రామమూర్తి పంతులు గారు జెండా యెత్తి నారనిన్నీ దీనిని తొలగించుటకును రెండింటిని పొత్తుకూర్చుటకునే వీరేశలింగము నాటి నుండి నేటివరకు వచ్చుచున్న గ్రాంధికవాదులయ్యు సంస్కార ప్రియులెల్లరు అభిప్రాయపడుచున్నారనిన్నీ నాతలంపు. ఇట్లయినచో ఇరువురయుచెలిమి కూడుత కష్తము కాదు.

 శిష్ట గ్రాంధిక శైలి మీదకు కూడ తిరుగబడి దానిని నిర్మూలము చేయగోరుట వ్యావహారిక వాదులకు సముచితము కాదు. మనదేశములో అనుశ్రుతముగా వచ్చుచున్న సామాన్య జనుల సాహిత్యము కూడా అట్టి కార్యమునకై గడంగక దానికి తగిన గౌరవము చూపుచు వచినది అందేమాత్రమును తప్పు కాని సంప్రదాయవైరుద్యము కాని లేదు. వ్యావహారిక వాదులు మరి క్జొని వాడుకపరములనూ ప్రయోగములనూ శిష్ట గ్రాంధిక రానలలోకి చేర్చుకొనవలసిన వాటి కనుశాసనము చేయవలసినదాన్ని కోరుచున్నారు. అనుశాసనము చేసినంత మాత్రమున వాటినే తప్పో గ్రాంధికములను వ్ర్రాయనే కూడదను సిద్దాంత మేర్పడునని వారి యుద్దేశ్యము గాని నాయుద్దేశ్యము గాని కాదు. అవి అలవాటయినవారు వాటినె వ్రాతురు. ఇవి బాగుంటాయి అని తోచిన వారు వీటి నుపయోగించవచ్చునుం ఇవి రెండూను కలసిమలసియే యుండవచ్చును అట్లున్నచో ఒకటి నొకటి వెక్కిరించు నట్లుండునని ఆక్షేపించి అటువైపునకో ఇటువైపునకో కోరి దిద్దుకొనుటకు ప్రయత్నించడం నా కంత శ్లాఘ్యముగా తోచలేదు. ఈ విశ్వాసముతోనే నా రచనలనన్నిటిని నేను సాగించుచున్నాను. ఇట్లు చెయుటవలన నేనిరువురి హెళలకూ పాత్రుడ నగుచున్నానని యెరుగుదును. అయినను నా విశ్వాసము నుంది తప్పుకొనుటకు నాకు సాద్యమును కాకున్నది, అవసరమును తోచకున్నది.
 నే నెన్ని సారులు చర్చచేసి యాలోచించినను ఈ రెండింటిని సందర్భానుసారంగా సమ్మేళనము చేయుట తప్ప మన భాషాభివృద్ధికి వేరు మార్గము నాకు తొచకున్నది. కనుక వుభయపక్షముల్లోని పెద్దలకును నామస్కృతులొనరించి వుభయుల సిద్దాంతములను సౌందర్యములను నామనస్సునకు పట్టించుకొని, ఈ సమ్యగ్దృస్థితొ నొక శైలి నేర్పాటు చేసుకొని వ్రాయగడంగుచున్నందుకు పెద్దలు క్షమింతురు గాక! తారతమ్యములు కలవన్న మాటకాని గద్యకారులెల్లరు నిట్లే యెనరించుచున్నారు. నేమను నా కలవడిన జ్ఞానాభిమానములతో నట్లే యొనరించుచున్నాను ఇట్లు చేయుటవలన వాడుక భాషకును గ్రంధ భాషకును సన్నిహితమూ యేర్పడును. ఒక క్రొత్త రీతి సౌందర్యమూ చెకూరును. వచనరవనాకౌశల్యమున కిది యేర్పడక తీరదని, క్రొత్త పద్దతి యని యెల్లరు నంగీకరింతురని నమ్ముచున్నాను. ఇంతకు ప్రస్తుత వచన రచయితలు అందరు నిట్లే యొనరించుదున్నారు.
  ఇందుకు తగినట్లే అనుశాసన మొకటి యేర్పాటు కావలెను. అనుశాసనములకు సరిపడునట్లు రచనలైన నుండవలెను. రచనలకు సరిపడునట్లు అనుశాసనములైన మాఱవలెను. తొల్లింటి అనుశాసనములకు విధేయముగ రచనలు సంపూర్ణముగా నుండుటకు వీలు లేకున్నవి. ఉండకున్నవి, మార్పుకావలెననుట ఇది సూచన పెక్కుఱు కావలెనని కూడా అనుచున్నారు. ఇట్టి సందర్భములో అనుశాసనములను దిద్దుటే కొంత మంచి ఇట్లు కాలాను సారముగా మన పూర్వులు మార్చుకొనుచుండిరి. మార్చుకొనుట మన హక్కు మన మేల మార్చుకొనరాదు!
 ఈ శాసనపు మార్పు కూడ ఒక పెద్ద భాషా విప్లవ మనబడదు. పెద్ద పెద్ద గ్రంధకర్తళూణూ అనుశాసకులును అంగీకరించిన వాటిని గూ?డ మనము కాదనుట మన సంకోఛ దృష్టిని తెలియచేయును.అట్లు వారు ఉపయోగించని పెక్కింటికి గూడ అనుశాసనము కావలసినదే ఇట్లు అనుశాసనములను విపులము చేసినచో ఆపుటకు వీలులేని మార్పు కావలనను వారి గొల కొంత్గ తగ్గును. కొన్ని మార్పులు చేసినచో లక్షణసిధ్దముగ వ్రాతుమను సశాస్త్రీయమైన కోరిక గల వరి అభిలాషయును నెరవేరును. అట్లు చేసిన యెడల పెక్కుఱు పండితుల ప్రాతినిధ్యము వలన రచింపబడేడి ఆ క్రొత్త అనుశాసనమునకు ప్రాతయను శాసనమునకు గంటె ఎక్కువ అధికారము కూడ సిద్ధించును. అందుచేత యీ క్రొత్త కర్యమునకు గడంగుట పెద్దల యావశ్య కర్తవ్య మనుటలో ఎట్టి సందియమును లేదు.
  ఇట్టి పండిత పరిషత్తునొకదానిని నేర్పాటు చేసి క్జ్రొత్త సంస్కరణోద్యమములు చేయవలెనని ఉభయ పక్షములల్ని నాయకుల మధ్యను కొన్ని రాయబారములను ఉత్తర ప్రత్త్యుత్తరములును జరిగిన వన్న సంగతి వజ్రాయుధము, సుజనరంజని మొదలగు పత్రికలను పఠించెడి వారికెల్లరకు విదితమే కాని మేఘములు క్రమ్మి ఉరుములు మాత్రమురిమి పటాపంచలైనట్లు వాటిలో నుంచి కొంత శుష్కధ్వని తప్ప ఫల రూపమగు వర్షమేమి కురవకనే పోయినది. వాద ప్రతివాదములు, శుష్క సూచనలూ, వీటితో మనకేమి ప్రయోజనము? ఇది అంతయు వృధాకాలహరణమే అని భయపడి నవీన గ్రంధకర్తలెల్లరును, దేశాభ్యుదయమును, భాషాశ్రేయస్సును ఎట్లు చేకూరునని వారు తలంచుచుండిరో అట్లే గ్రంధముల నప్రతిహతముగా వ్రాయబూనుచున్నారు. సాహితి సఖి, రెడ్డిరాణీ, భారతి, ఆంధ్రభారతి, కవిత, లలిత, కృష్ణ తెలగ, సమదర్శిని మొదలగు వానినెల్ల పఠించు వారికిది గొచరము గాఅ అంత వరకు మనమేల వేచి యుండవలెను! భాషకును దేశమునకును అభ్యుదయ దాయకమైన అనుశాసనము నొకదానిని నేనే ముందుగా చేతును గాక, యని పూనుకొని బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారొక అనుశసనమును వ్రాయుటకు బూనుకొని కొంతవరకు సఫలీకృత మనోరధులైరని చెప్పుట కెంతయు సంతోషముగా నున్నది. 
 శ్రీ శాస్ద్త్రిగారు సుప్రసిద్ధ పండితులు అది మంచియు గ్రాంధిక శైలి యందభీమానులుగా నున్నారు. ఇప్పటికి గూడ అట్లే అయి యున్నారని అతని తలంపు అయిననూ, వీరేశలింగం పంతులుగారు, సీతారామశాస్త్రిగారు, రాయుడు శాస్త్రి గారు చెళ్ళపిళ్ల వారు, కీ.శే. పోలవరం జమీందారు గారు కొవ్వూరు సభ వారు మొదలగు వారెల్ల వారి శుద్ధ శ్రోత్రియాభిప్రాయముల నించుక మార్పుకొన్నట్లే వారు కూడా కొంత వరకు మార్చుకొన్నారు. వీరు మార్చుకొనుటకు కారణము రామమూర్తి పంతులుగారి నుండి ఆందోళకుల ధణధణలును ఆవేశములచే యెంత మాత్రము కాదనియు, వీరి తాలూకు సవిర్శన ప్రాచీనార్వాచీన ప్రసిద్ధ గ్రంధ పఠనము మాత్రమే యనియు, వీరి యనుశాసనపాఠకు లెల్లరకు ఇదితము కాగలదు. వీరను శాసించిన శబ్దములును రూపములును అనేకము పూర్వకవిగ్రంధస్థములై యుండుట మనకు గోచరము కాగలదు. అయినను వీరి మార్పులకును శ్రీరామమూర్తి పంతులుగారు కావలననుచున్న మార్పులకును భేదము, పోవలసిన మేఱలో హెచ్చుతగ్గులు కాని, దిక్కులో భేదమెంత మాత్రమును కాదని సువిదిరము. రామమూర్తి పంతులు గారును వీరును కూడ సాంప్రదయ పద్దతినే అభిలషించుచున్నారు. అతని పద్దతియూ పరిశ్రమయూ అతనిని మరికొంతదూరమెక్కువగా సాహసించి తీసుకొని పొవుచుండగా ఇతని పద్దతియు పరిశ్రమయు ఇతనిని కొంచెము దూరము మాత్రమే తీసుకొనివచ్చి నిస్సంశయ మైనట్టియు, నిపుణమైనట్టియు, సౌందర్యవంత మైనట్టియు సుప్రసిద్ధ కవీంద్ర గ్రంధ సంస్థిత ప్రయోజనములకు మాత్రమే కాక వాటి పొలిమేరలో గూడ క్రీడించుట కుత్సాహమును పురిగొల్పినవి. ఇందుచేతనే వీరి గ్రంధప్రయోగము లేక వాడుకలోనుండు పుచ్చుకు, తీసుకుకామోసు మొదలగు వాటికనుశాసనమిచ్చియు వాడుకలో ఉండి ప్రయోగ గౌరవము నందిన ఇస్తిని, వచ్చీనా, కూర్చొను మొదలగు మనోహర అదములకును రూపములకును అనుశాసన మీయక తాము "ప్రమాణముగా గొప్ప "ప్రయేగౌలం వ్యాకరణ" మన్ నార్యోక్తి నిప్పటికి మీఱిన వాడనైతిని" అనుటయు "మటీయుననుశాసించిన శబ్దముల నీయనుశాసనమున నిపుడుపయోగింపక భాషా సంప్రదాయ వేత్తల యనుమతికై దృష్టి నిలిపితిని" అనుటయు సంభవించినది. 
  అయినను శాస్త్రి గారి వంటి సనాతన గ్రాంధిక శైల్యభిమానులే అతివాదులనబడువారికంటె ముందుగా ముందంజవేసి, భాషాతత్వమునూ, మార్పు లక్షణములనూ తాము గురర్తెఱింగి అనుశాసన రూపకముగా ఒరులకు చాటుట మన ఆంధ్రభాష యొక్క భావ్యభివృద్ది సూచకమని నిజమైన భాషాభిమానులెల్లరి తలపైయున్నది. శాస్త్రి గారు చూపిన ప్రమాణము లెల్లయు లేఖక పాఠక రచయిత ప్రమాదములని తృణీకరించుట వీరగ్రాంధికుల మతమై యున్నది. మార్పేవద్దని కొమ్మమీద కూర్చొను వారికి ఇది ప్రశంసా పాత్రము కాకుండుటలో వింత లేదు. కాని మార్పు కావలెనని తలంచు వారికిని తలంచుట యెరుగకయే చేసి వ్రాయు వారికిని ఇది చాలా వరకు తృప్తికరముగా యున్నదనుటలో ఆటంకము లేదు. "ఉను" అను సముచ్చల్యమును "ఇన" అను చేదర్ధకమును, "ఏడు" అను విశేషణమును లోపించి వాటి ముందటి అక్షరములకు దీర్ఘములు వచ్చే ఉదాహరణములను చూపించి శాసించినారు. ఉదా అంతా, ఇంకా, చల్లాయంబలి, వెన్నా మీగడ, వినీవినని, చూచినా చెప్పినా, వచ్చే, పోయే, మొదలగునవి మఱియు, జనులవాడుకలో ఉండి శిష్టుల గ్రంధములలోకి యెక్కి శృతిరమ్యములై పాటలలోను, పద్యములలోను, శతకముల లోను గుత్తులు గుత్తులుగా కానిపించు, తెలుసుక, పట్టుక, పుచ్చుక, అనేటి, పోయేటి, కలపడము, చెక్కడము, పుచ్చుకోక, తీర్చుకోక, పడ్డ, పడ్డాడు, పోను, కాను, విందాము, చూతాము, రానేవచ్చితిరి, కరక్కాయ, వెలక్కాయ, ఎలుగ్గోడ్దు, బొట్టేట్లు, కద్ధు, పద్దు, చిలక, ఇరవై, అరవై, మొదలగు పదములకును రూపములకును, ప్రయోగములను చూపి అనుశాసనము నిచ్చియున్నారు. రసున్నలు, బండిఱాల విషయమును వ్రాసెడి వారి యధేచ్చకు విడచి పెట్టినారు. దేశ్యవిదేశ్యపదముల నుపయోగించుటలో కూడ మన పూర్వులెట్టి స్వాతంత్ర్యమును జూఱగొనితో మనకును అట్టి స్వాతంత్ర్యమును జాఱ యిచ్చినారు. స్నుశాసనములు లేవు గదా యని సాఅహసౌచార్యములు గల సత్కవీంద్రులును గద్యములో ముద్గ్రంధములను వ్రాయువారును ఇంపితములగు నవ్యప్రయోగములను చేసుకొని పోకమానరు కాని, కాలలక్షణమును భాషాతత్వమును గుర్తెఱిగి వారికందరికిని చేతులు వాచి స్వాతగమొసంగుట ఉదారనీతి గల విద్వాంసులకు సుభూషణము.
 ఇకను, వ్యావహారిక భషను వ్రాయుచున్నా మనుకొనే వారల సంగతి నాలోచింతాము. వారిలో ననేకులు ఈ ఒరయోగములనె కాక, వాడుకలో నున్న ఇంకా అనేకము వాటిని కూడా ఉపయోగించుచున్నారు. వెళ్ళింది, వచ్చాడు, మనం, ఊహిస్తూ, పోతోంటే, నుంచుని, పడతాయి, పడతిఅ ఇద్దరమూ, మఱిన్ని మొదలైన ప్రయోగాలను చేస్తున్నారు. ఈ ప్రవాహం చూడగా ఎక్కడా ఆగేటట్లు లేదు. శిష్ట ప్రయోగములను కవి ప్రయోగములనూ, విశిష్ట ప్రయోగాలుగా మాత్రమే వుంఛి మన పూర్వులు అనుశాసనం చెయ్యకపొవటానికి కారణం. ఒక కొంచెం సందు చెయ్యగానే లక్షోప లక్షలుగా ఇట్టి ప్రయోగాలందులో నుంచి దూరి లోపలకు ప్రవేశిస్తాయని భయమే కాబోలు. ఈ అనుమానంతోటే కాబోలు మన పూర్వపు అనుశాసనకులు ఈ పిశాఛాలు లోపలికి రాకుండా ద్వారాలు మూసేశారు. ఏ నలుగురు కిరీటమాంధాతలో మడిగట్టుకొని జన్మానికల్ల శివరాత్రి లాగ ఏ రెండుమూడు పుస్తకాలో వ్రాస్తే లక్షణ బద్ధములై గిరిదాటకుండా లోలోపుల జిలుగులతోటీ నగిషీలతోటి శ్లేషలతోటి, వ్యంగ్యాలతోటి, బంధాలతోటి శబ్దాలంకారాల తోటి అలరారుతూ వుండేటట్లు, ప్రారంబవిద్యలూ, పరదేశనాగరికత లూ, సామాన్య జన సంపర్కములూ, అతి పాండిత్యములూ, అల్ప పాండిత్యములూ, నిత్యసంభాషణలూ, వ్యవహారములూ, గ్రంధముల లోకి, పత్రికలలోకి సంచికలలోకి, కధలూ, కవిత్వం, విమర్శన, హేళన మొదలైన రూపాలతో ఎక్కుతూ వుండే సమయంలో, తర తరాలతో కూడుకొన్న విద్యగలవాళ్ళు, ఆశేతు శీతాచలం పర్యంతం అక్కడక్కడ చెదరిన్నీ ఒక్కొక్క చోట గుంపులుగా కూడిన్నీ జీవించు తూ వుండే వాళ్లు, మామండలంలోని మంచి భాష, అంటే మా మండలంలోది మంచి విఱ్ఱవీగడం యెఱిగిన వాళ్ళు వ్రాసే భాష సర్వమూ అనుశాసన రక్షితమఉంటుందని భావించడం కూడా వెఱ్ఱే అయినప్పటికీ, ఇవి అన్ని రావలసినదే. వీటిలోది చాలా మట్టుగ కొంతకాలం వరకైనా అనుశాసనములకు తప్పి ఉండవలసినదే. ప్రారంభకులు వాసినప్పుడు వరి వ్రాతలు దిద్దివాటికి మఱి శిష్ట ప్రయోగాలు చూపించి ఈలాగుంటే బాగుంటుందని హెచ్చరించవలనదే, కాని ఇవి అన్నీ అతనికి జ్ఞానం వచ్చి శైలి కుదిరేదాక చేయవలసిన సహాయాలే కాని, తరువాత, అతను గ్రంధకర్త అయిన తరువాత అతను ఒక లక్షణానికి కాని, సలహాకుకాని కట్టుబడి ఉండు ఇంగ్లీషులో "Style is the man" అంటారు. మనిషి యేలాంటి వాడైతే వాడి శైలి వాణ్ణీ అనుకరిస్తూ వుంటుంది.
 ఈలాగున అన్నంత మాత్రమున సూర్యనారాయణీయము వంటి అనుశాసన గ్రంధమొకతి ప్రస్తుత సందర్భములలో అనవసరమని అర్ధము కాదు. అది ఒకవైపున భాషాతత్వజ్ఞానమును సంపాదించుకొనుటకు సాధనమై, ఒకవైపున శాస్త్రిగారి ఉదార పాండిత్య స్తృతికి తార్కాణమై, ఒక వైపున బాలకులకు విద్యార్ధు లకును సుబోధకమై ఒక వైపున ఆంధ్ర గ్రంధకర్తల గౌరవమునకు వారి సలహాకి పాత్రమైన ఆంధ్రసాహిత్యములో చిరస్మరణీయంగ ఉంటుంది. అచిరకాలములోనే యింతకంటే విపులమైన మరియొక అనుశాసనమును కూడ రచించి వాడుక భాషకును తన్మూలమైన గ్రాంధిక భాషకును గూడ మరింత కృతజ్ఞతకు పాత్రులై శ్రీశాస్త్రిగారు దీర్ఘాయుష్మంతులను సుఖజీవులును నగుదురు గాక యని యీశ్వరుని ప్రార్ధించుచున్నాను. పరిషత్తు వరు చేయబూనుటకు సాహసించలేక పోయిన ఈ మహాత్కార్యమును తామొక్కరేయయ్యు గడంగుటచే వారి వందనములకు గూడ వీరెంతయు పాత్రులు.
30-4-27, క్రష్ణాపత్రిక