కూసుమంచి గణపేశ్వరాలయం/కాకతీయ నిర్మాణం అనేందుకు కొన్ని సూటి ఆధారాలు

వికీసోర్స్ నుండి

కాకతీయ నిర్మాణం అనేందుకు కొన్ని సూటి ఆధారాలు


కాకతీయ దేవాలయాలలో కనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఈ దేవాలయం కాకతీయులకాలం నాటిదే అయివుండవచ్చని చెప్పేందుకు ఆకరాలుగా కనిపిస్తున్నాయి.

1. ముక్కంటేశ్వరాలయంలోనూ, వేణుగోపాలస్వామి ఆలయంలోనూ విశిష్ట రీతిలో చెక్కిన స్తంభాలు.
2. ముందుకు పొడుచుకు వచ్చినట్లుండే క్రింది గుమ్మాలూ, పై గుమ్మాలూ
3. గర్భాలయ ముఖద్వారం పైన లలాట బింబంగా గజలక్ష్మి రూపం
4. గర్భాలయంలో అర్చామూర్తికి పైన వున్న చక్రము లేదా రాతిపద్మం. దానిచుట్టూ ఒక పద్దతిలో చెక్కిన పద్మదళాలు.
5. అంతరాళము
6. పై కప్పుకు చెక్కిన పద్మదళాలు
7. రంగమండపము

8. ద్వారపాలకులు
9. వేయిస్తంభాల గుడిలో ప్రధాన లింగాన్ని అచ్చంగా పోలిన శివలింగము
10. రామప్పదేవాలయపు నిర్మాణాన్ని పోలిన గుడి నిర్మాణము
11. శివ-విష్ణు రూపాలను ఒకే చోట ప్రతిష్టించిన విధానం
12. త్రికూటాలయ పద్దతిలో నిర్మించిన ముక్కంటేశ్వరాలయం
13. శాసనంపై వున్న సూర్యచంద్రులు మరికొన్ని శాసన శిల్పాలు
14. టిటిటి పద్దతిలో నిర్మించిన గంగాదేవి చెరువు ఉనికి.