కాసిచ్చెడిదే గొప్పాయనురా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

గౌళిపంతు రాగం - ఆది తాళం


పల్లవి

కాసిచ్చెడిదే గొప్పాయనురా - కలిలో రాజులకు


అనుపల్లవి

(హరి)దాసులు సేవింపరనుచు ప్రభువులు

దయ మానిరి, పర మెంచక పోయిరి


చరణము

రాజాంగము కొరకు నాల్గుజాతుల రక్షణ పరసుఖమో ?

రాజసులై సన్మార్గ మెఱుగక పరాకు సేయ ఘనమో ?

ఆ జన్మము గొలిచెడి విప్రవరుల కానందము గలదో త్యాగ -

రాజ వినుత ! నీ మాయగాని,

నీరజనయన ! సుజనాఘ విమోచన !