Jump to content

కాళిదాస చరిత్ర/కాళిదాసుని జన్మవృత్తాంతము-మూడవకథ

వికీసోర్స్ నుండి
​

కాళిదాస చరిత్ర

కాళిదాసుని జన్మవృత్తాంతము

మూడవ కధ

అమౄతము సంపాదింపవలెనని

దేవతలు రాక్షసులుగలసి పాలసముద్ర

మును మధింపదలచిరి. అందునిమిత్తము వారు మందరపర్వతము గవ్వముజేసి, యాదిశేషుని గవ్వపుతాడుగాజేసి, యొకప్రక్క దేవతలు, మఱియొకప్రక్క రాక్షసులు బాముత్రాడు పట్టుకొని తఱచనారంభించిరి. అప్పుడాపర్వతము సముద్రములో గ్రుంగిపోయెను. అప్పుడు దేవదానవులు శ్రీమహావిష్ణును వేడుకొనగా నతడు కూర్మావతారమెత్తి క్రుంగిపోయున కొండక్రిందనిలిచి వారికి అయముచెసెను. అప్పుడు పాలసముద్రములో హాలాహలవిషము పొడమెను. అదిలోకములం గాల్చు చుండ దేవదానవులు భయపడి శివునిం బ్రార్దించిరి. భక్తవత్సలుడగు పరమేశ్వరుడు డా హలాహలవిషము మ్రింగి తనకంఠమున బెట్టుకొనెను. తరువాత క్షీరసాగరములో దేవదానవులు కోరినట్లు చావులేకుండ జేయునట్టి యమృతముపుట్టెను. ఆయమృతము సమానముగా బంచుకొనుటకై పాళ్లుతెగక దేవదానవులుపోరాడిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు జగన్మోహినీ రతీదేవికన్న, భారతీదేవికన్న, రమాదేవికన్న నెక్కువ చక్కనిరూపముగలిగి సురాసురలను భ్రమింపజేసెను. అనేక సంవత్సరములు జితేంద్రియుడై, మన్మధుని సంహరించి, మృత్యువునుగెలిచి, లోకైకపూజ్యుడైన శంకరుడు విష్ణు మాయలోబడి జన్మోహినీ రూపమునుజూచి మోహించి యొడలుదెలియక యామెవంటబడి యెట్టకేలకు నామెతో గొంతకాలము విహరించెను. అప్పుడు వారికి గాలభైరవుడు జన్మించెను. ​

39

కాళిదాస చరిత్ర

ఈకధ భరతమహాముని నాటకముగాజేసి స్వర్గలోకములో దేవేంద్రుని కొలువులో నాడించెను. భరతమహాముని మొట్టమొదట నాట్యశాస్త్రము, నభీనయశాస్త్రము, సంగీతశాస్త్రము రచియించిన మహానుభావుడు. ఆయన దే వ త ల ప్రీతికై యనేక నాటకములు రచియించెనని వాడుకకలదు. అందులో నీ జగన్మోహినీనాటక మొకటి. ఈ నాటకమును జూచుటకై దేవేంద్రుని కోరికెమీద బ్రహ్మవిష్ణు మహేశ్వరులు కుటుంబములతొ వచ్చిరి వసిష్ట విశ్వామిత్ర భరద్వాజ కాస్యసాంగీరస దుర్వాసప్రముఖు లైన మహర్షులు దయచేసిరి. సిద్ధసాధ్యవిద్యాధరకిన్నర కింపురుషాదులు సయితము ప్రేక్షకులైరి. రంభోర్వశి మేనకాదులైన యచ్చరమచ్చెకంబులును విచ్చేసిరి. ఆ నాటకములో జగన్మోహిని వేషమును 'పుంజికస్దల ' యను నప్సరసతాల్చెను. శంకరుని వేషము పుంజిక స్దలకు మిక్కిలి ప్రియుడైన హంసుండను గంధర్వుడు దాల్చెను. భరతమహాముని నాటకకర్తయంట! అచ్చరపదది స్త్రీ వేషము దల్చెనట! గంధర్వుడైన హంసుడు పురుషవేషముదాల్చునట. ఇంక రక్తి విషయమై చెప్పవలసినదేమున్నది? జగనోహినీరూపము దాల్చిన పుంజికస్దలయొక్క యభినయము, నాట్యము, గానవైఖరి, భావప్రకాశము, రూపలావణ్యవిశేషములు వర్ణనా తీతములైయుండెను., శంకవేషముదాల్చిన హంసుని యభినయముగూడ దాని కనుగుణముగానే యుండెను. కవి చాతుర్యము, నటకుల ప్రయోగ కౌశలము , ప్రేక్షకుల మహారసికత యను మూడు నొకచోట గూడియున్నప్పుడు చెప్పవలసినదే మున్నది? ప్రేక్షకులు నిశ్చేష్టులైరి. దేవతలు ఱెప్ప వాల్చక చూచుటచే వారికి నిలింపశబ్దము సార్దక మయ్యెను. రంభాదులైన యచ్చరలు పుంజికస్దల యొక్క నృత్యగానాబినయవిద్యలను జూచి సిగ్గుపడి తలవంచుకొనిరి. అది నాటకముగా దలంపక సభాసదులు, నిజముగా శంకరుడు జగన్మోహినిని దమ కన్నుల యెదుట వలచి ​

కాళిదాస చరిత్ర

పైబడుచున్నాడని భావించిరి. ఆసభలోనున్న దుర్వాసమహాముని పుంజికస్దలయొక్క హోయలు, హావభావములు జూచి మనోవికారము గలిగి సభాస్దారులు నవ్వునట్లు కొంతసేపు వికృతపు చేష్టలు చేసిచేసి యెట్టకేలకు మనస్సు పట్టజాలక బ్రహ్మవిష్ణు మహేశ్వరు లచ్చట సాక్షాత్కరించియుండిరని సందియము లేక, వసిష్ట భారద్వాజాంగీరస ప్రముఖులు జూచుచున్నారనుశంకలేక చివాలున దన యాసనమునుండి లేచి రంగస్దలముమీదికి విసవిస బరువెత్తి పుంజికస్దలయున్న యెడకు బోయెను. అదివఱకే వాని వికృతచేష్టలు కనిపెట్టుచున్న పుంజికస్దల యతని వాలకము జూచి భయపడి శరీరము గడగడనడక నేమియు జేయునదిలేక తనకేదో మహాపద సంభవించునని శంకించి శంకర వేషముతో నున్న తన మనోహరుడెగుహంసుని 'రక్షింపుము-రక్షింపు ' మని కౌగలించుకొనెను. సభయంతయు మిక్కిలి కలుత జెందెను. కొందఱు తమ యాసనంబుల నుండి లేచిరి. కొందఱు దుర్వాసుని నివారింపబోయిరి. సరస్వతీదేవి దుర్వాసుని మనోదౌర్భల్యముంజూచి పక్కున నవ్వెను. నాటకముచెడిపోయెను. భరతమహాముని తన ప్రయత్నము గిఘ్నమైనదని విచారించెను. ముఖ్యముగా నతనికి పుంజికస్దలమీద గోపము వచ్చెను. "వేలకొలది సభికులుండగా దుర్వాసుడు వచ్చి నిన్ను మ్రింగుననుకొంటివా? ఏల నీవు వేషములోనుండి హంసుని గౌగలించితివి? నీ మూలమున నాటకముచెడిపోయినది" అని భరతుడు పుంజిస్దలను గనులెఱ్ఱజేసిచూచి "నీవు భూలోకంబున మనుష్యాంగనవై పుట్టు" మని శపించెను. అక్కడనుండి కోపములు శాపములుగా మాఱెను. తన్నుజూచి సరస్వతి నవ్వినందున దుర్వాసుడు మండిపడి కన్నుల నుండి విస్ఫులింగములు చెదర కోపాదేశమున మాటలు తడబడ, శారదాదేవి నుద్దేశించి యిట్లనియె-- "ఓ వాణీ! సృష్టికర్తయైన బ్రహ్మదేవుని రాణినగుటచేతను, విద్యలకధిపతిదేవత నగుటచేతను, నీవు ​

41

కాళిదాస చరిత్ర

మిక్కిలి గర్వించుచుంటిని. ఏంత గర్వములేకిన్న నాయంతవానింజూచి నీవు పరిహసింతువా! నీవుభూలోకంబున ఒకకిరాతుడవై జన్మించి నీచ స్త్రీవలన మరణంబు నొందువుగాక! “యనిశపించెను. శారదాదేవియొక్క చెలికత్తెయైన సావిత్రి నిష్కారణముగా శారద దారుణశాసవిశయైనదని విషాదమునొంది, మూర్తీభవించిన కోపదేవతవలె నున్న దుర్వాసునిం యిట్లనియె, “అయ్యా! అష్టదిక్పాలకులు, త్రిమూర్తులు, సమస్తమహర్షులు కొలువుదీర్చియున్న యీసభలో నీవుపుంజికస్దలంజూచి కామమోహితుడవై నానావికారచేష్టలు చేసి మీదుమిక్కిలి రంగస్దలముమీదికురికి యింకేమేమో చేయబోతివి. నీయవస్దంనప్పు డెవరికి నవ్వురాదు! నీవుగొప్పతప్పుజేసి సిగ్గుపడి యూరకుండక పైగా నీమహాదేవిని శపించితివా? ఏందుకు నీతపము? ఏందుకునీనిష్ట? నిర్హేతుకముగ నామెను సపించితివిగావున నీవుభూలోకముంస నాడుదానివైపుట్టి యాకిరాతునకు భార్యవై సంసారసౌఖ్య మనుభవింపక దు:ఖముపాలై దీనమైన మరణమొందెదవుగాక“ యని ప్రతిశాపమిచ్చెను. సరస్వతి తనకుద్రుర్వారమైన దుర్వాససాపము గలుగుటచే దు:ఖారవశయై మగని పాద్ములపైబడి మూర్చిలెను. చతుర్ముఖుడు తనప్రియురాలికిని దనకును వియోగము సంభవించెనని మిక్కిలి వగచెను. సభాసదులలో గొప్పశబ్దము పుట్టెను కొందఱు దుర్వాసుని నిందించిరి. కొందఱుపుంజకస్దల యవివేకమునకు వగచిరి. కొందఱు భరతమహాముని తొందరపడెననిరి, కొందఱు సరస్వతిని జూచి జాలిపడిరి. కొండఱు సావిత్రి సాహసము మెచ్చిరి. తమ కేమిశాపములు తగులునోయని మఱికొందఱు పిరికితనమున సభనుండి మెల్ల మెల్లగ్ జారిరి.

అప్పుడు శ్రీమన్నారాయణుడు నిజాసనమునుండి లేచి రంబస్దలము మీదికుబోయి హస్తమెత్తి కేకవైచి కలచన ముడిసి యిట్లనియె ​
42

కాళిదాస చరిత్ర

"మహర్షులయొక్కయు దేవతలయొక్కయు నోటనుండి వెలువడిన మాటలు జరుగకమానవు. సకారణముగానో నిష్కారణముగానో శపింపబడిన వారు శాపముల ననుభవించి తీరవలెను. ఈ శాపములు పైకి మహాకష్టములుగా దోచుచున్నను బ్రపంచమునకు గొంచెము ప్రయోజనకరములగును. ఈసరస్వతీదేవి కిరాతజన్మ మెత్తినందులకు గొప్పఫలముకలదు. ఏమంటిరేని భూలోకమున సంస్కృతభాష క్రమక్రమముగా క్షీణించుచున్నది. చతుర్వేదములు, షడంగములు, షడ్దర్శనములు, నష్టాదశపురాణములు, ధర్మశాస్త్రములు, జ్యోతిశ్శాస్త్రములు, వైద్యశాస్త్రము, గానశాస్త్రము, చతుష్పషీకళలు గీర్వాణభాషలో నున్నవి. ఆ భాషాప్రచారము తగ్గుటయనగా జ్ఞానము తగ్గుట. అందువలన మనుష్యులు పశుప్రాయులగుదురు. యుక్తాయుక్త వివేకశూన్యులగుదురు. ధర్మ భ్రష్టులగుదురు. కావున నీ శారదాదేవి కిరాతజన్మ మొత్తము బూర్వజన్మవాసన చేతను, శ్రీ కాళికా వర ప్రసాదముచేతను, గీర్వాణభాషాభిమానము గలిగి కవిత్వము జెప్పగలిగి లోకోపకారము చేయుచు గీర్వాణభాషాభిమానము వృద్దిజేయును. ఓ బ్రహ్మదేవా! భార్యా వియోగ మయ్యెనని నీవు విచారింపకుము. నీభార్య కాళిదాసుడనుపేర గొప్ప కవియగును. ఆమె వియోగము లేకుండ నీవు భూలోకమున సింధులమహారాజుఇకు నందనుడవై జనియించి భోజరాజనుపేర మహాప్రసిద్ధుడవై కాళిదాసునితో నిరంతర మైత్రి కలిగి యుండుము. వాణికి బ్రాణసఖీయైన సావిత్రి మర్త్యలోకమున జన్మించి నీకిల్లాలైన పట్టపుదేవియైయుండును. భరతమహాముని శాపమునుబొందిన పుంజకస్దల వేశ్యాంగనయై జన్మించి కాళిదాసునకు ప్రేమాస్పదు రాలై యుండుంగాక! సావిత్రి శాపానుసారముగ దుర్వాసుడు సరస్వతీ యవతారమగు కాళిదాసుని బరిణయంబగుగాక! ఇదే నాశాపము . భోజకాలిదాసు లన్యోన్యవియోగము ​

43

కాళిదాస చరిత్ర

సహింపరు గావున గాళిదాసు మృతినొందిన యేడుగడియలకే భోజుడు కాలధర్మము నొందును. కావున వాణీ పంకజాసదులు మరల నొకచోట గూడుదురు నాటకము విఘ్నమొందినది. గావున జగన్నాటక సూత్రధారుడైన నా పలుకులు గౌరవించి మెరందఱు యధాస్దానములకు దయచేయుడు"

    ఆ గోవించుని యాజ్ఞప్రకారము బృందారకులందఱు దమతమ మందిరంబులకు జనిరి. అనంతరము తమతమ శాపముల ప్రకారము బ్రహ్మ, సరస్వతి, దుర్వాసుడు, సావిత్రి, పుంజికస్దల మధ్యమలోకమున జనన మొందిరి.

భో జ రా జు వృ త్తాం త ము

పూర్వకాలమున ధారానగరము

రాజధానిగా జేసికొని మాళవ

దేశమును సింధులుండనురాజు పాలించుచుండెను. అతడు చిరకాలము సంతానములేక తపించుచుండ ముసలితనమున నొక కుమారుడు కలిగెను. ఆ కుమారుని పేరు భోజుడు ఆకుమారుడైదేండ్ల ప్రాయముగలవాడైనప్పుడు వార్దకముచేత దనకు గాలము సమీపించుచున్నదని తెలిసికొని యిట్లు విచారించెను. "అయ్యో! నాకు మరణమాసన్నమగు చున్నది. కుమారుడు పసిబాలుడు. నాతమ్ముడు ముంజుడు మహాబలసంపన్నుడు.వానికన్నెప్పుడు రాజ్యముమీదనేయున్నది. నాకు వెఱచి యతడేమియు జేయలేకయుండెనుగాని, లేనిచో నత డెట్టిపనికైన సాహసించును. రాజ్యము ముంజుని కప్పగింపక నాకుమారునికిచ్చితినేని ముక్కుపచ్చలారని యాపసిబాలుడు దానిని నిలుపుకొనగలడా? విశేషించి నాకు లోకమునం దపవారము గలుగును.