కవిరాక్షసీయము/కవిరాక్షసీయము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

కవిరాక్షసీయము

ఆంధ్రటీకాతాత్పర్యవ్యాఖ్యానసహితము

అవ.

కవి స్వాహంకారమును పరిహరించువాఁడై చెప్పుచున్నాఁడు:—


శ్లో.

గుణదోషౌ బుధోగృహ్ణ న్నిన్దుక్ష్వేళానివేశ్వరః,
శిరసా శ్లాఘతే పూర్వం పరం కణ్ఠే నియచ్ఛతి.
ప్రణమ్య లోకనాథో౽హం పార్వతీప్రాణవల్లభమ్,
టీకా మాన్ధ్రాత్మికాం కుర్వే కవిరాక్షస సత్కృతేః.

1


వ్యా.

కవి స్స్వౌద్ధత్యం పరిజిహీర్షు రాహ — గుణదోషావితి బుధ్యత ఇతి బుధ విద్వాన్, గుణః శ్లేషప్రసాదాదిః, దోషః అసాధ్వశ్లీలాప్రయుక్తాదిః, క్రూరకృత్యం తా వుభౌ గృహ్ణ న్సన్ పరిగృహీతవాన్ పూర్వం గుణం శిరసా శ్లాఘతే, శిరఃకంపన పూర్వం స్తౌతీ త్యర్థః. పరం దోషం, కంఠే గళే, నియచ్ఛతి స్థాపయతిన పక్తీత్యర్థః. ఈశ్వరః శివః, ఇందుక్ష్వేళౌ శశివిషే ఇన సో౽పి చంద్రమసం శిరసా ధత్తే విషంతు కంఠే ధృతవాన్ తథా మత్కావ్యస్థా న్గుణా న్గృహ్ణంతు దోషా న్న గృహ్ణం త్వితి కవి ర్విపశ్చితః ప్రార్థితవా నిత్యనుసంధేయమ్.


టీక.

బుధః = పండితుఁడు, గుణదోషా = గుణదోషముల రెంటిని,ఈశ్వరః = పరమేశ్వరుఁడు, ఇన్దుక్ష్వేళా వివ = చంద్రవిషములనువలెనే, గృహ్ణన్ = గ్రహియించినవాఁడై, పూర్వం = మొదటిదియగు గుణమును, శిరసా = తలచేత, శ్లాఘతే = కొనియాడుచున్నాఁడు. పరం = వెనుకటిదియగు దోషమును, కణ్ఠే = కుత్తుకయందే, నియచ్ఛతి = నిలుపుచున్నాఁడు.


అర్థాంతరము.

ఈశ్వరః = పరమేశ్వరుఁడు, ఇన్దుక్ష్వేళా = చంద్రుని విషమును, బుధః = విద్వాంసుఁడు, గుణదోషావివ = గుణదోషములనువలె, గృహ్ణన్ = తీసికొనినవాఁడై, పూర్వం = మొదటివాఁడగుచంద్రుని, శిరసా = శీర్షముచేత, శ్లాఘతే = కొనియాడుచున్నాడు. పరం = వెనుకటిదియగు దోషమును, కణ్ఠే = గొంతునందు, నియచ్ఛతి = నిలుపుచున్నాఁడు.

తాత్పర్యము.

పాలసముద్రమును దఱచునెడ నందు పుట్టిన చంద్రుని విషమును పరమేశ్వరుఁడు పరిగ్రహించి, చంద్రునిఁ దలయందు భూషణముగా నుంచికొని విషమును వెలిబఱచక యేతీరున తనకంఠమందే నిలిపికొనియెనో ఆప్రకారము నేర్పరి యగువాఁడు కావ్యములందు సౌకుమార్యమాధుర్యప్రసాదాదిగుణములను, అప్రయుక్తక్లిష్టాదికావ్యదోషములను తెలిసినవాఁడై గుణములను శిరఃకంపనపూర్వకముగా పొగడుచున్నాఁడనియు, దోషములను వెలిబఱుపక కంఠమందే యణఁచుకొనుచున్నాఁడనియుఁ దెలియవలయును. ఇట్లనుటచేఁ గవియు ప్రమాదవశమున నెందేని యప్రయుక్తాదికావ్యములను బ్రయోగించియున్నచో దానినిగన్న విద్వాంసుఁ డట్టిదోషములను చాటింపక గుణములనే గ్రహింపవలయుననియు, తాను తప్పులు లేక కావ్యమును జెప్పువాఁడను నహంకారమును జెప్పక తనతప్పులను మన్నింపవలయుననియు, పరమేశ్వరుని యుపమానపూర్వకముగాఁ జెప్పి పండితులను బ్రార్థించుచున్నాఁడు.


అవ.

ఇప్పుడు సత్కావ్యప్రశంసాముఖముగా కావ్యమును బ్రశంసించు చున్నాఁడు:—


శ్లో.

శబ్దశక్త్యైవ కుర్వాణా సర్వదానవ నిర్వృతిమ్,
కావ్యవిద్యా శ్రుతిగతా స్యా న్మృత స్యాపి జీవనీ.

2


వ్యా.

ఇదానీం సత్కావ్యప్రశంసాముఖేన స్వకావ్యం ప్రశంసతి — శబ్దేతి. శబ్ద శక్త్యా శబ్దానాం శక్తి ర్నామ వివక్షితార్థాభిధాయకత్వం తయా శక్త్యా, సర్వదా నవనిర్వృతిం, నవా చాసౌ నిర్వృతి శ్చేతి విశేషణసమాసః-తాం నవనిర్వృతిం, నూతనసుఖం, కుర్వాణా, కరోతే స్తాచ్ఛీల్యే చానశ్ ప్రత్యయః. కావ్యవిద్యా కావ్యం నామ 'సగుణౌ సాలంకారౌ దోషరహితే శబ్దార్థౌ' తా వేవ విద్యా సా కావ్యవిద్యా, శ్రుతిం కర్ణం, గతా, శ్రుతేతి యావత్. తథాభూతా సతీ, మృతశబ్దే నోపచరితవృత్త్యా మూడో లక్ష్యతే. జీవతీతి జీవనీ జీవయిత్రీ స్యాత్ అంతర్భావితణ్యర్థో౽యం కావ్యవిద్యా శ్రుతమాత్రా మూఢ మ ప్యానందయతి కిమంత రసికమి త్యపిశబ్దార్థః.


అన్యో౽ప్యర్థః.

శబ్దః శబ్దనం, ఉచ్చారణ మిత్యర్థః తస్య శక్త్యా మహిమ్నా హేతునా, సర్వేషాం దానవానాం రాక్షసానాం నిర్వృతిం పునరుజ్జీవనరూపం సుఖం, కుర్వాణా, కావ్యస్య శుక్రస్య విద్యా, సంజీవనీ విద్యే త్యర్థః. ని. 'శుక్రో దైత్యగురుః కావ్య' ఇత్యమరః. శ్రుతిగతా కర్ణే ఉపవిష్టా సతీ, మృతస్య మరణం ప్రాప్తస్యాపి, రక్షోబలస్యేతి శేషః. జీవనీ జీవయిత్రీ, స్యాత్. శుక్రః కదనే మృతా నసురాం త్సంజీవనీవిద్యయోజ్జీవయతీతి పురాణకథా శ్రూయతే.

టీ.

శబ్దశక్త్యైవ - శబ్ద = శబ్దములయొక్క, శక్త్యైవ = చెప్పఁదగిన యర్థములను జెప్పెడిసామర్థ్యముచేతనే, సర్వదా = ఎప్పుడును, నవనిర్వృతిం = నూతనసుఖమును, కుర్వాణా = చేయుచుండెడి, కావ్యవిద్యా = గుణాలంకారసహితంబై యప్రయుక్తాది దోషరహితంబైన కవిత్వవిద్య, ప్రతిగతా = చెవికి వినఁబడినదియై, మృతస్యా౽పి = మూఢునకుఁగూడ (ఇందు మృతశబ్ద ముపచారవృత్తిచే మూఢునిపరం బగును), జీవనీ = జీవము గలుగఁజేయునది, స్యాత్ = అగును. (అనఁగా సంతసింపఁజేయునది యగును.)


అర్థాంతరము.

శబ్దశక్త్యైవ - శబ్ద = ఉచ్చారణముయొక్క, శక్త్యైవ = మహిమకారణముచేతనే, సర్వదానవనిర్వృతిం - సర్వదానవ = సమస్తరాక్షసులయొక్క, నిర్వృతిం = మరల బ్రతికించుట యనెడిసౌఖ్యమును, కుర్వాణా = చేయుచుండెడి, కావ్యవిద్యా - కావ్య =శుక్రునియొక్క (‘శుక్రోదైత్యగురుః కావ్య' అని యమరము.), విద్యా= సంజీవినీవిద్య, శ్రుతిగతా = చెవినిఁ బొందినదియై, మృతస్యా౽పి = చచ్చిన రక్కసులబలమునకుఁ గూడ, జీవనీ = జీవం బొసంగునది, స్యాత్ = అగును.


తా.

రాక్షసులకు గురువగు శుక్రాచార్యుఁడు ఏలాగున తనసంజీవినీవిద్యయొక్క యుచ్ఛారణమాత్రముచేతనే యుద్ధమందు మృతులగు దైత్యులను జీవింపఁజేయుచు వారికి నూతనసుఖమును గలుగఁజేయునో, ఆలాగుననే కవిత్వము చెప్పెడిపండితుఁడు తనశబ్దశక్తిచేత నూతనసుఖములును గలుగఁజేయుచు వినికిచేతనే మృతప్రాయు లగు మూఢులకుఁ గూడ సంతోషము నొనర్చును.

మఱియు పూర్వము శుక్రుఁడు మృతసంజీవినియను నొకవిద్యను నేర్చుకొని యందుచే మృతులగు దైత్యులను బ్రతికించుచుండఁగ దేవత లావిద్యను గ్రహించుటకు బృహస్పతి సుతుఁడగు కచుండనువాని శుక్రునియొద్దకు బంపఁగా నతఁడు గురువు నారాధించి యావిద్యను బడసె నని భారతమున నాదిపర్వమునఁ జెప్పంబడినది. ఈవిద్య కేవల మంత్రోచ్చారణము మంగనుత్రపూతమగు నౌషధముగను ప్రయోగించుటచేతను సిద్ధించును.ఇదియు గాయత్రీమంత్రగర్భితంబగు మృత్యుంజయమంత్ర మై యొప్పియున్నది. దీనివిధానంబు కౌతుకరత్నభాండాగారం బను గ్రంథమున 308 - 309 పుటములందును, రసరత్నాకర మంత్రఖండమందును జూడందగును.


అవ.

కావ్యంబు సుందర మనుట వివేకులయంద వెల్గు నని చెప్పుచున్నాఁడు:—


శ్లో.

కల్యాణవర్ణపదతాం వా గ్విద్యు దిప భిభ్రతీ,
అజ్ఞానేషు సదాసారసంగిషు స్యా త్స్ఫురద్గుణా.

3

వ్యా.

కావ్యం సుభగ మితి వివేకి ష్వేవ శోభత ఇత్యాహ - కల్యాణేతి. కల్యాణాని ప్రశస్తాని వర్ణానియేషాంతాని కల్యాణవర్ణాని తాని పదాని యస్యా స్సా తథోక్తా. తస్యాభావ స్తత్తాతాం. భిభ్రతీ వాక్ వాణీ, సదా, సర్వదా, సారసంగిషు గుణగ్రాహిషు, భ్రాంతానభవంతీ త్యభ్రాంతాః వివేకినః తేషువిషయే స్ఫురంతః విరాజమానాః గుణాశ్శ్లేషాదయో యస్యా. స్సాభవేత్ విద్వా నేవ విజానాతి శబ్దశక్తి మిత్యర్థః కథం? విద్యుత్తటి దివ. సా౽పి కల్యాణవర్ణపదతాం సువర్ణవర్ణాశ్రయతాం బిభ్రతీ సతీ ని. 'కల్యాణ మక్షరే స్వర్ణే కల్యాణం మంగళే౽పి చే'తి విశ్వప్రకాశః. ని. 'పదం వ్యవసితత్రాణస్థానలక్ష్మాంఘ్రి వస్తుష్వి'త్యమరః. సదా సారసంగిషు ప్రశస్తవృష్టిధారాసంబంధవత్సు అభ్రాంతేషు మేఘేషు, అంతశబ్దో౽త్ర స్వరూపవచనః, స్ఫురన్ గుణః పీతాదిః యస్యా స్సా భవతి.


టీ.

కల్యాణవర్ణపదతాం - కల్యాణ = శుభములైన, వర్ణ = అక్కరములుగల, పదతాం = పదములభావమును, బిభ్రతీ = వహించుచుండెడి, వాక్ = కావ్యమందలి పలుకు, సదా = ఎల్లపుడు, సారసంగిషు = గుణగ్రాహకులగు, అభ్రాన్తేషు = భ్రాంతులు కానివారి (వివేకుల) విషయమందు, స్ఫురద్గుణా - స్ఫురత్ = వెలుగుచుండెడి, గుణా = శ్లేషాదిగుణములుగలదియై, విద్యుత్ = మెఱుమువలె, స్యాత్ = ప్రకాశించుచుండును.


అర్థాంతరము.

కల్యాణవర్ణపదతాం - కల్యాణవర్ణ = బంగరువన్నెయొక్క, పదతాం = ఆశ్రయభావమును, బిభ్రత్ = భరించుచున్నదియై, సదాసారసంగిషు = శ్రేష్ఠములగు జల్లులను బొందియుండెడి, అభ్రాన్తేషు = మేఘములందు, స్ఫురద్గుణా -
స్ఫురత్ = ప్రకాశించుచుండు, గుణా = పచ్చవన్నె గల, విద్యుత్ = మెఱుమువలె, స్యాత్ = ప్రకాశించుచుండును.


తా.

బంగరురంగులను దురంగలించు మెఱుంగుతీవెలు మేఘములపై నెట్లు పచ్చనిరంగులచే వెలుంగుచుండునో, అట్లు మంచియక్కరంబుల పదంబులతో గూడిన సత్కావ్యములు ఎల్లపుడును గుణగ్రాహకు లగు వివేకులయందు శ్లేష ప్రసాదమాధుర్యాది గుణములతోఁ గూడినవియై ప్రకాశించును.


అవ.

ఇపుడు వివేకు లనేకులు పుట్టుట లేదని చెప్పుచున్నాఁడు—


శ్లో.

గూఢభావాస్పదత్వేన య దనాదేయవ ద్భవేత్,
సారస్వతామృతం సర్వే కవయ స్తన్నజానతే.

4


వ్యా.

ఇదానీం వివేకినో న బహవో విద్యంత ఇత్యాహ - గూఢేతి. యత్ సరస్వత్యాః వాగ్దేవతాయా ఇదం సారస్వతం తదేవామృతం సుధా కర్తృ, గూఢభావో

గూఢాభిప్రాయః తస్యాస్పదత్వే నాశ్రయత్వేన అనాదేయవత్ అనుపాదేయ మివ భవేత్ తత్సారస్వతం కర్మ, సర్వే విద్వాంసః కవయః, న జానతే న విదుః - కేచిదేవ జానత ఇత్యర్థః, ‘ఆత్మనేపదేష్వనత' ఇతి ఝస్యా దాదేశః.


అన్యో౽ప్యర్థః.

యత్ సరస్వతీనామనదీ తస్యా ఇదం సారస్వతం త దమృతంజలంకర్తృ. ని. 'పయః కీలాలమమృత' మిత్యమరః. గూఢభావస్య గూఢత్వ స్యాశ్రయత్వేన, ఉపరిసికతావృతత్వాదితి భావః అనాదేవయత్ నద్యా ఇదం నాచేదేయం 'నద్యాదిభ్యో ఢ'గితి శైషికో ఢక్ - త న్న భవతి అనాదేయం తద్వత్ భవేత్ - తత్సారస్వతం నదీసంబం ధ్యమృతం, సర్వేకవయః సర్వే జలపక్షిణః, న జానతే కేచి దేవ హంసాదయో జానత ఇత్యర్థః.


టీ.

యత్ = ఏ, సారస్వతామృతం - సారస్వత =సరస్వతీ సంబంధమైన, అమృతం= కావ్యామృతము, గూఢ = రహస్యమైన, భావ = అభిప్రాయమునకు, ఆస్పదత్వేన = ఆశ్రయ మగుటచే, అనా చేదేయవత్ = గ్రహింపఁగూడనియట్లు, భవేత్ = అగునో, తత్ = ఆసారస్వతామృతమును, కవయః = విద్వాంసులు, సర్వే= అందఱు, నజాసనతే = తెలియరు.


అర్థాంతరము.

యత్ = ఏ, సారస్వతామృతం = సరస్వతీనదీసంబంధమైన నీరు, గూఢభావాస్పదత్వేన - గూఢభావ = రహస్యముగా లోపలనే ప్రవహించుచు పైని కనుపింపకుండుటకు, ఆస్పదత్వేన = ఆధారమగుటచే, అనాదేయవత్ = నదీసంబంధము కానిదివలె, భవేత్ = అగునో, తత్ =అట్టి సరస్వతీనదీజలమును, సర్వేకవయః = అన్ని జలపక్షులు, నజానతే = తెలియఁజాలవు.


తా.

గుప్తగామినియైన సరస్వతీనదియొక్క జలమును కొంగలు మొదలగు నన్నిజలపక్షులు దెలిసికొనక, హంసలు మొదలగుకొన్నిమాత్ర మేరీతిగాఁ దెలిసికొనుచున్నవో, అవ్విధమున గూఢములైన రసభావాదులను శ్లేషాదిగుణములుగల కావ్యామృతమును సామాన్యవిద్వాంసు లందఱు తెలిసికొనరనియు మంచిపండితులు కొందఱుమాత్రమే తెలిసికొందురనియు భావము. అనఁగా రహస్యమైన శ్లేషాదిగుణములుగల నాకావ్యము సామాన్యపండితులకుఁ దెలియదనుట. ఇచట సరస్వతీనది యన్ని నదులవలె ప్రవహింపక గంగాయమునలలో నంతర్భూతమై ప్రవహించుచున్నదని పురాణప్రసిద్ధము.


అవ.

విద్వాంసు లనేకు లుండినను దాత లట్లుండరని చెప్పుచున్నాఁడు—


శ్లో.

న ఏవ కేవలః కర్ణః శ్రేయా నఙ్గేషు గణ్యతే,
యః కుణ్డలస్య వహనా త్యాగేనైవ ప్రకాశతే.

5

వ్యా.

సత్స్వపి విద్వత్సు బహుషు దాతారో న బహవ స్సంతీత్యాహ - సఇతి. సః ప్రసిద్ధః కేవలః ఏకః. ని. 'కేవలః కృత్స్న ఏక శ్చే'తి శాశ్వతః కర్ణో రాధేయ
ఏవ అంగేషు దేశవిశేషేషు శ్రేయాన్, ఔదార్యత ఇతి యావత్ గణ్యతే కథ్యతే యః కర్ణః కుండలస్య సూర్యదత్తస్య వహనా ద్ధారణా త్ప్రకాశతే త్యాగే సతి న ప్రకాశతే అప్రకాశనం చ పరిపంథిగణాజేయతాభంగలక్షణహైన్యప్రయుక్తం. యద్వా - రాధేయః కుండలస్య త్యాగే యథాప్రకాశతే తథాసహనా న్నైవ ప్రశాశతే. 'తనిమ్నా శోభంతే గళికవిభవా శ్చార్థిషు నృపా' ఇతి భావః.


అన్యోప్యర్థః.

అంగేషు వపురాది ష్వవయవేషు మధ్యే ఏకః కేవలః కర్ణః శ్రవణ మేవ శ్రేయాన్ శ్రేష్ఠ ఇతి గణ్యతే - యః కర్ణః కుండలస్య కర్ణవేష్టనన్య వహనా త్ప్రకాశతే - తస్య త్యాగే సతి నైవ ప్రకాశతే.


టీ.

యః = ఎవఁడు, కుణ్డలస్య = సూర్యదత్త కర్ణాభరణముయొక్క, వహనాత్ = ధారణమువలన, ప్రకాశతే = శత్రువిజయముచే వెలుంగునో, త్యాగేన = విడుచుటచేత, నైవప్రకాశతే = ప్రకాశించఁడో, (లేక, కుణ్డలస్య వహనాత్ = కర్ణభూషణధారణమునకంటె, త్యాగేనైవ = దానిని విడుచుటచేతనే, ప్రకాశతే = వెలుంగుచున్నవాఁడో, సః = అట్టి, కేవలః = ఒకఁడైన, శ్రేయాన్ = ఔదార్యముచే శ్రేష్ఠుఁడైన, కర్ణ ఏవ = కర్ణుఁడే, అఙ్గేషు = అంగదేశమందు, గణ్యతే = ఎన్నఁబడుచున్నాఁడు.


అర్థాంతరము.

యః = ఏచెవి, కుణ్ణలస్య = కర్ణాభరణముయొక్క, వహనాత్ = ధారణమువలన, ప్రకాశతే = వెలుంగుచున్నదియో, త్యాగేసతి = విడువఁగా, నైవప్రకాశతే = వెలయదో, సః = అట్టి, కేవలః = ముఖ్యమైన, కర్ణఏవ = చెవియే, అఙ్గేషు = అవయవముల మధ్యమందు, ప్రకాశతే= వెలుఁగుచున్నది.


తా.

సకలశరీరావయవములును జెవిపోగులవలన నెట్లు మిక్కిలి ప్రకాశించుచున్నదో, యవ్విధమున దాతలగువా రనేకులుండినను, తాను జనించినపుడు సూర్యునిచే నియ్యఁబడిన సహజములైన కవచకుండలములుగల కర్ణుఁడు ఇంద్రునిచే యాచింపఁబడినవాఁడై తనకు జయము నొసంగుచు నలంకారమైయుండు కర్ణకుండలములను ఇంద్రునికి దానము చేసిన యారాధేయుఁ డొకఁడ అంగదేశమందు ప్రసిద్ధుఁడైనవాఁడు.

పూర్వమున, పాండురాజపత్నియైన కుంతిదేవి తనచిన్ననాఁడు దుర్వాసుఁ డనుముని నారాధించుచు ప్రసన్నుఁడగు నామునివలన నొకమంత్రమును బడసి యామంత్రమహిమ నెఱుంగవేఁడి సూర్యుని బిలిచిన నాతఁ డామెకోర్కి నెఱవేర్పఁగా, గర్భిణియై సిగ్గుచేతను భయముచేతను తాఁ గనిన శిశువును నదియందు పాఱవైచి చనినంత, సూర్యదత్తకవచకుండలములచే వెలింగెడి యక్కుమారుఁడు సూతుఁ డనువానికిఁ జిక్కి,

రాధ యను నతనిభార్యకు పుత్త్రుఁడై రాధేయుఁ డనఁబరఁగి దుర్యోధనునింటఁ బెరిఁగి యర్జునునకు విరోధియైనందున నింద్రుఁడు తన కొమరుఁ డగునర్జునునకు శుభము కలుగుటకై జయప్రదమైన యాకుండలములను వేఁడినప్పుడు దాని నిచ్చుటచే కర్ణునకు మహాదాత యనుపేరు గలిగె నని భారతకథ నిట ననుసంధించునది.


శ్లో.

వసన్నప్యవదాతానాం ద్విజానాం సవిధే సదా,
రాగాసుబన్ధమధరో న కదాచి ద్విముఞ్చతి.

6


వ్యా.

వసన్నితి. అవదాతానాం శుద్ధానాం, దైవ్ శోధన ఇత్యస్మా ద్ధాతోః కర్తరి నిష్ఠాద్విర్జాయంతే జన్మకర్మభ్యా మితి ద్విజాః. శ్లో. 'మాతు ర్యదగ్రే జాయంతే ద్వితీయం మౌంజిబంధనాత్, బ్రాహ్మణక్షత్రియవిశ స్తస్మా దేతే ద్వితా స్మృతా' ఇతి యాజ్ఞవల్క్యస్మరణా దితి భావః. తేషాం సవిధే సమీపే, వస న్నపి సదా అనవరతం, అధరః నికృష్టః, నీచాశ్రయవత్. రజ్యంతే మనో మనోరమా ఇవ ప్రతీయంత ఇతి రాగాః విషయాః తై రనుబధ్యత ఇత్యనుబంధః సంబంధః తం రాగానుబంధం, కదాచి త్కాలాంతరే౽పినవిముంచతి, 'సంసర్గజా దోషగుణా భవం'తీత్యేత న్మృషేతిభావః. అథవా రాగో మాత్సర్యం. ని. 'రాగో౽నురాగే మాత్సర్య' ఇతి విశ్వః తేన అనుబంధః దోషోత్పాదనం, ని. ‘అనుబంధః ప్రకృత్యాదౌ దోషోత్పాదే నరేశ్వర' ఇతి విశ్వః.


అన్యో౽ప్యర్థః

అవదాతానాం శుభ్రాణాం. ని. 'అవదాత స్సితే గౌర' ఇత్యమరః. ద్విజానాం దంతానాం. ని. 'దంతవిప్రాండజా ద్విజా' ఇత్యమరః. సవిధే సదా వస న్నపి అధరః ఓష్ఠః కదాచి దపి రాగేణ రక్తిమ్ణా అనుబంధం న విముంచతి.
త త్తస్య స్వాభావిక మిత్యర్థః.


టీ.

అధరః = నీచుఁడు, అవదాతానాం = పరిశుద్ధులైన, ద్విజానాం = బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులయొక్క, సవిధే = సమీపమందు, సదా = ఎపుడును, వసన్నపి = ఉండువాఁడైనను, కదాచిత్ = ఒకానొకప్పుడును, రాగానుబన్ధం = విషయాసక్తిసంబంధమును, =
నవిముఞ్చతి = విడువఁడు.


అర్థాంతరము.

అధరః = పెదవి, అవదాతానాం= తెల్లనైన, ద్విజానాం = దంతములయొక్క, సవిధే= చెంగటి, సదా= ఎప్పుడును, వసన్నపి = ఉండునదియైనను, రాగానుబన్ధం = ఎఱ్ఱదనముతోడిసంబంధమును, కదాచిత్ = ఒకానొకప్పుడును, నవిముఞ్చతి = విడువడు.


తా.

నీచుఁడగువాఁడు పరిశుద్ధులైన బ్రాహ్మణాదుల సమీపమందు సదావాసము చేయుచునుండినను దెలుపువన్నెగల పండ్ల సమీపమందుండు పెదవి యెవ్విధమున దన

యెఱ్ఱఁదనమును విడువదో, అవ్విధమున దనవిషయాసక్తిని విడువఁజాలఁడు. ఇట్లనుటచే సహవాసమువలన గుణములు వేఱగుననుమాట యబద్ధ మనియు, స్వభావగుణము నెవ్వఁడు విడువఁడనియు భావము.


శ్లో.

అలకాశ్చ ఖలా శ్చైవ మూర్ధ్ని భీరుజనై ర్ధృతాః,
ఉపర్యుపరిసత్కారే ప్యావిష్కుర్వన్తివక్రతామ్.

7


వ్యా.

భీరూణాం స్త్రీణాం జనైః మూర్థ్ని ధృతాః, అలకాః చూర్ణకుంతలాః, ఉపర్యుపరి సత్కారే౽పి, తైలాదినేతి శేషః వక్రతాం అనృజుత్వం, ఆవిష్కుర్వంతి. ఖలాః దుర్జనాః, భీరూణాం భయశీలానాం, జనైః మూర్ధ్ని ధృతా అసి ఉపర్యుపరి సత్కారే౽పి, ధనాదిభి రితి శేషః వక్రతాం దౌర్జన్యలక్షణం, ఆవిష్కుర్వంతి ప్రకటీకుర్వతే. ఉపర్యుపరీతి నిత్యవీప్సయో రితి ద్విర్భావః.


టీ.

భీరుజనైః = స్త్రీజనులచే, మూర్ధ్ని = శిరస్సునందు, ధృతాః = ధరింపబడిన, అలశాశ్చ = ముంగురులును, ఉపర్యుపరి = పైపైన, సత్కారే౽పి = తైలాదులచే నుపచారములు గలుగుచుండినను, వక్రతాం = వంకరదనమును, ఆవిష్కుర్వన్తి = కలుగఁజేయుచున్నవి.


అర్థాంతరము.

ఖలాశ్చ = దుర్జనులును, భీరుజనైః = భయపడెడిజనములచేత, మూర్ధ్ని = శిరసునందు, ధృతా అపి = ధరింపఁబడినవారైనను, ఉపర్యుపరి = పైపైన, సత్కారే౽పి =ధనాదులచే నుపచారము గలుగుచుండినను, వక్రతాం = దుష్ప్రభావమును, ఆవిష్కుర్వన్తి = ప్రకటించుచున్నారు.


తా.

చెలులచేత నూనె మొదలగువానిచే నుపచరించఁబడిన శిరమందలి ముంగురు లేలాగు దమవక్రభావమును విడువవో, అట్లే దుష్టులగువారు భయపడువారిచే నమస్కరించఁబడినవారై ధనాదులచే నాదరింపఁబడినవారైనను, తమస్వభావమగు దౌర్జన్యమును మానరు.


శ్లో.

గుణానార్తిం పరాం నీత్వా ధనినో ధన్వినో యథా,
నిఘ్నన్తి హృదయం దృప్తా విదుషాం విద్విషా మివ.

8


వ్యా.

గుణానితి, ధనినః ధనవంతః పురుషాః, దృప్తా ఉద్ధతా స్సంతః, గుణాన్ అమానిత్వాదీన్, పరా ముత్కృష్టాం, ఆర్తిం పీడాం, నీత్వా గుణాన్ దోషీకృత్యేత్యర్థః. ని. ‘ఆర్తిః పీడాధనుష్కోట్యో' రిత్యుభయత్రాప్యమరః. గత్యర్థత్వా న్నయతే ర్ద్వికర్మకత్వం తేషాం విదుషాం, హృదయం మనః, నిఘ్నంతి క్లేశయంతి. కథం? ధన్వినో యథా ధానుష్కా ఇవ, ధన్వన్శబ్దస్య వ్రీహ్యాదిత్వా దినిప్రత్యయః. 'ధన్వీతి వ్రీహ్యాది

పాఠా' దితి వామనః. తే దృప్తాః రణలాభా ద్ధృష్టా స్సంతః, 'దృపహర్ష మోహనయో' రిత్యస్మా ద్ధాతోః కర్తరి నిష్ఠా-గుణాన్ మౌర్వీః. ని. 'మౌర్వీ జ్యా శింజినీ గుణ' ఇత్యమరః. పరా ముత్తరాం ఆర్తింధనుష్కోటిం, నీత్వా ప్రాపయ్య, విద్విషాం హృదయం వక్షో నిఘ్నంతి విధ్యంతి.


టీ.

ధనినః = ధనముగలవారు, దృప్తాః సంతః = గర్వించినవారై, గుణాన్ = వినయాదిగుణములను, పరాం = హెచ్చైన, ఆర్తిం = పీడను, నీత్వా=పొందించి, ధన్వినో యథా = విలుకాండ్రవలె, విదుషాం = విద్వాంసులయొక్క, హృదయం = మనసును, విద్విషా = శత్రువులయొక్క, హృదయమివ = ఎదనువలె, నిఘ్నన్తి = తల్లడింపఁజేయుచుననారు.


అర్థాంతరము.

ధన్వినః = విలుకాండ్రు, దృప్తాస్సంతః = రణలాభముచే హర్షము గలవారై, గుణాన్ = అల్లెత్రాళ్లను, పరాం= శ్రేష్ఠమైన, ఆర్తిం = వింటికొప్పును, నీత్వా = పొందించి, ధనినోయథా = ధనవంతులువలె, విద్విషాం = శత్రువులయొక్క, హృదయం = ఎదను, విదుషాం = విద్వాంసులయొక్క, హృదయమివ = మనస్సునువలె, నిఘ్నన్తి = కొట్టుచున్నారు.


తా.

యుద్ధాపేక్షగల విలుకాండ్రు తమధనుస్సుల కొప్పులందు అల్లెత్రాళ్లును బొందించి శత్రువులహృదయములను భేదించునట్లు, ధనవంతులు గర్వించినవారై వినయాదిసద్గుణములను నశింపఁజేసి విద్వాంసుల మనసులను వ్యధపఱచుచున్నారు.


శ్లో.

కృపాణేన కథంకారం కృపణ స్సహగణ్యతే,
పరేషాం దానసమయే యస్స్వకోశం విముఞ్చతి.

9


వ్యా.

కృపాణేనేతి. కృపణః లోభి కృపాణేన కరవాలేన సహ ని. 'కరవాలః కృపాణవ'దిత్యమరః. కథంకారం? కథ మిత్యర్థః 'అన్యథైవ' మిత్యాదినాకరోతే ర్నిరర్థకాణ్ణముల్ప్రత్యయః. గణ్యతే కథ్యతే కృపణస్య కృపాణేన సామ్యాభిధాన మనుచిత మిత్యర్థః. తత్ర హేతు మాహ-యః కృపాణః, పరేషాం శత్రూణాం దానస్య విదారణస్య సమయే కాలే, స్వస్య కోశం పిధానం, విముంచతి. ని. 'కోశో౽స్త్రీ కుట్మలే ఖడ్గపిధానే౽ర్థౌఘదివ్యయో' రిత్యమరః. కృపణో హి పరేషాం అర్థినాం దానస్య వితరణస్య సమయే కాలే, స్వస్య కోశ మర్థౌఘం, న విముంచతీతి కృపాణా దపి కృపణస్య నికృష్ట త్వమితి ధ్వనిః.


టీ.

యః = ఏకృపాణము (కత్తి), పరేషాం=ఇతరులయొక్క, దానసమయే = విదారణసమయమునందు, స్వకోశం = తనయొరను, విముఞ్చతి = విడుచుచున్నదో, (అట్టి కత్తి) పరేషాం = ఇతరులకు, దానసమయే = ఇచ్చెడివేళలో, స్వకోశం = తనధన

పుట:కవిరాక్షసీయము.pdf/12 పుట:కవిరాక్షసీయము.pdf/13 పుట:కవిరాక్షసీయము.pdf/14 పుట:కవిరాక్షసీయము.pdf/15 పుట:కవిరాక్షసీయము.pdf/16 పుట:కవిరాక్షసీయము.pdf/17 పుట:కవిరాక్షసీయము.pdf/18 పుట:కవిరాక్షసీయము.pdf/19 పుట:కవిరాక్షసీయము.pdf/20 పుట:కవిరాక్షసీయము.pdf/21 పుట:కవిరాక్షసీయము.pdf/22 పుట:కవిరాక్షసీయము.pdf/23 పుట:కవిరాక్షసీయము.pdf/24 పుట:కవిరాక్షసీయము.pdf/25 పుట:కవిరాక్షసీయము.pdf/26 పుట:కవిరాక్షసీయము.pdf/27 పుట:కవిరాక్షసీయము.pdf/28 పుట:కవిరాక్షసీయము.pdf/29 పుట:కవిరాక్షసీయము.pdf/30 పుట:కవిరాక్షసీయము.pdf/31 పుట:కవిరాక్షసీయము.pdf/32 పుట:కవిరాక్షసీయము.pdf/33 పుట:కవిరాక్షసీయము.pdf/34 పుట:కవిరాక్షసీయము.pdf/35 పుట:కవిరాక్షసీయము.pdf/36 పుట:కవిరాక్షసీయము.pdf/37 పుట:కవిరాక్షసీయము.pdf/38 పుట:కవిరాక్షసీయము.pdf/39 పుట:కవిరాక్షసీయము.pdf/40 పుట:కవిరాక్షసీయము.pdf/41 పుట:కవిరాక్షసీయము.pdf/42 పుట:కవిరాక్షసీయము.pdf/43 పుట:కవిరాక్షసీయము.pdf/44 పుట:కవిరాక్షసీయము.pdf/45 పుట:కవిరాక్షసీయము.pdf/46 పుట:కవిరాక్షసీయము.pdf/47 పుట:కవిరాక్షసీయము.pdf/48 పుట:కవిరాక్షసీయము.pdf/49 పుట:కవిరాక్షసీయము.pdf/50 పుట:కవిరాక్షసీయము.pdf/51 పుట:కవిరాక్షసీయము.pdf/52 పుట:కవిరాక్షసీయము.pdf/53 పుట:కవిరాక్షసీయము.pdf/54 పుట:కవిరాక్షసీయము.pdf/55 పుట:కవిరాక్షసీయము.pdf/56 పుట:కవిరాక్షసీయము.pdf/57 పుట:కవిరాక్షసీయము.pdf/58 పుట:కవిరాక్షసీయము.pdf/59 పుట:కవిరాక్షసీయము.pdf/60 పుట:కవిరాక్షసీయము.pdf/61 పుట:కవిరాక్షసీయము.pdf/62 పుట:కవిరాక్షసీయము.pdf/63 పుట:కవిరాక్షసీయము.pdf/64 పుట:కవిరాక్షసీయము.pdf/65 పుట:కవిరాక్షసీయము.pdf/66 పుట:కవిరాక్షసీయము.pdf/67 పుట:కవిరాక్షసీయము.pdf/68 పుట:కవిరాక్షసీయము.pdf/69 పుట:కవిరాక్షసీయము.pdf/70 పుట:కవిరాక్షసీయము.pdf/71 పుట:కవిరాక్షసీయము.pdf/72 పుట:కవిరాక్షసీయము.pdf/73 పుట:కవిరాక్షసీయము.pdf/74 పుట:కవిరాక్షసీయము.pdf/75 పుట:కవిరాక్షసీయము.pdf/76 పుట:కవిరాక్షసీయము.pdf/77 పుట:కవిరాక్షసీయము.pdf/78 పుట:కవిరాక్షసీయము.pdf/79 పుట:కవిరాక్షసీయము.pdf/80 పుట:కవిరాక్షసీయము.pdf/81 పుట:కవిరాక్షసీయము.pdf/82 పుట:కవిరాక్షసీయము.pdf/83 పుట:కవిరాక్షసీయము.pdf/84 పుట:కవిరాక్షసీయము.pdf/85 పుట:కవిరాక్షసీయము.pdf/86 పుట:కవిరాక్షసీయము.pdf/87 పుట:కవిరాక్షసీయము.pdf/88 పుట:కవిరాక్షసీయము.pdf/89 పుట:కవిరాక్షసీయము.pdf/90 పుట:కవిరాక్షసీయము.pdf/91 పుట:కవిరాక్షసీయము.pdf/92 పుట:కవిరాక్షసీయము.pdf/93 పుట:కవిరాక్షసీయము.pdf/94 పుట:కవిరాక్షసీయము.pdf/95 పుట:కవిరాక్షసీయము.pdf/96 పుట:కవిరాక్షసీయము.pdf/97 పుట:కవిరాక్షసీయము.pdf/98 పుట:కవిరాక్షసీయము.pdf/99 పుట:కవిరాక్షసీయము.pdf/100 పుట:కవిరాక్షసీయము.pdf/101 పుట:కవిరాక్షసీయము.pdf/102 పుట:కవిరాక్షసీయము.pdf/103 పుట:కవిరాక్షసీయము.pdf/104

శ్లో.

మహాం త్సఏవ పురుషో యస్య సత్యానురోధినః,
ఆక్షిప్తపారిజాతేన బాహునా రక్ష్యతే జగత్.

105


వ్యా.

మహానితి. తథ్యం యథార్థభాషణం అనురుణద్థి అనుసరతీతి సత్యానురోధీ. ని. 'సత్యం తథ్యమృతం సమ్య గనురోధోనువర్తన' మితి చామరః. తస్య యస్య పురుషస్య ఆక్షిప్తపారిజాతేన ఆక్షిప్త నిపాతితాః కిం యుక్తిధర్మేర్వాలమితి నిరస్తాః పరిజాతా ఏవ పారిజాతాః భృత్యా స్వార్థే౽ణీ ప్రత్యయః. ని, 'పరాచితాపరాస్కందపారిజాతపరేధితా' ఇత్యమరః. ఆక్షిప్తాః పారిజాతాః యేన స తథోక్తః తేన బాహునా బాహుబలేన - యద్వా ఆక్షిప్తపారిజాతేన స్వౌదార్యాక్షిప్తభూతదేవద్రుమేణ బాహునా జగత్ రక్ష్యతే పాల్యతే. స పురుషః మహాన్పురుష ఏవ మహావిష్ణు సదృశ ఏవ. అన్యేన దుష్కరత్వాదన్యేతి భావః.


అన్యో౽ప్యర్థః.

సత్యా సత్యభామా - శబ్దైకదేశేన శబ్దగ్రహణమ్, భీమో భీమసేన ఇతి వత్. తాం ప్రణయకుపితాం అనురుణద్ధి ప్రణయవచనాదిభీరనుసరతీతి స తథో క్తః తస్య యస్య వాసుదేవస్య ఆక్షిప్త ఉన్మూలితః పారిజాతః దేవతరుః యేన స తథోక్తేన బాహునా కరణేన జగద్రక్ష్యతే. సప్రసిద్ధః పూర్ణత్వాత్ పురిశయనా ద్వా పురుషః వాసుదేవోమహాన్. అచింత్యమహిమేతియావత్. పారిజాతోన్మూలనాదేరన్యైర్ధుష్కరత్వాదితిభావః. అత్ర వాసుదేవకీర్తనేన కావ్యాంతే మంగళాచారః కృత ఇత్యనుసంధేయమ్. 'మంగళాచారయుక్తానాం వినిపాతో న విద్యత' ఇతి శ్రుతేః. అత్రాదౌ త్రయీత్యాదినా భగవద్వర్ణనరూపో మంగళాచారః కృతః. మధ్యే తు స్వస్థానాదపరోప్యేత్యాదినా అంతేత్వనేన శ్లోకేనేతి వివేకః.


ఇతి శ్రీభగవన్మాహేశ్వరస్య రేవణారాధ్యస్య సూనునా నాగనార్యేణ విరచితా కవిరాక్షసశ్లోకశతకటీకాశ్లిష్టార్థదీపికా సమాఖ్యా సమాప్తా.


సాక్షరేషు భవ తీహ జగత్యాం సర్వ ఏవ హృది మత్సరయుక్తః,
సాక్షరం కవిజనేషు య దేనం లోక ఏష కవిరాక్షస మాహ.

కవిరాక్షసీయం సమాఫ్తమ్.

టీ.

సత్యానురోధినః - సత్య= యథార్థభాషణమును, అనురోధినః = అనుసరించి యుండెడి, యస్య = ఏపురుషునియొక్క, ఆక్షిప్తపారిజాతేన - ఆక్షిప్త = తనయీవిచే నిరాకరింపఁబడిన, పారిజాతేన = కల్పవృక్షము గల, లేక, ఆక్షిప్త = తిరస్కరింపఁబడిన, పారిజా

తేన = భృత్యులుగల, బాహునా= భుజబలముచేత, అనఁగా అసహాయశూరత్వముచేత, జగత్ = లోకము, రక్ష్యతే = పాలింపఁబడుచున్నదో, సః = అట్టి, పురుషఏవ =పురుషుఁడే, మహాన్ = శ్రేష్ఠుఁడు.


అర్థాంతరము.

సత్యానురోధినః - సత్యా= సత్యభామను, అనురోధినః = అనుసరించుచున్న, యస్య = ఏ శ్రీకృష్ణునియొక్క, ఆక్షిప్తపారిజాతేన - ఆక్షిప్త = పెరికివేయఁబడినట్టి, పారిజాతేన = పారిజాతవృక్షము కలిగినట్టి, బాహునా = భుజముచేత, జగత్ = లోకము, రక్ష్యతే = పాలింపఁబడుచున్నదో, సః = అట్టి, పురుషః ఏవ = పురుషోత్తముఁ డైన శ్రీకృష్ణమూర్తియే, మహాన్ = గొప్పదేవుఁడు.


తా.

సత్యము విడువక భూభారమును తనభృత్యులగు రాజపురుషులం దుంచక తనబాహుబలముచేతనే భూపరిపాలనముచేయు పురుషుఁడే హెచ్చైనవాఁ డనియు, రుక్ష్మీణీదేవికి పారిజాతపుష్ప మిచ్చుటచే అసూయాపరవశ యగుసత్యభామచే ప్రార్థింపఁబడినవాఁడై ఇంద్రలోకముననున్న పారిజాతవృక్షమునే తెచ్చి సత్యభామగృహమందు నాటి కంసాదిదుష్టుల నడంచి లోకములను పాలించెడి శ్రీకృష్ణమూర్తి యొక్కఁడే దేవాదిదేవుఁడు.


కావ్యముయొక్క ఆదిమధ్యాంతములందు మంగళం బాచరించుట శిష్టాచారంబు గాన, నీగ్రంథమందు ప్రారంభమున “గుణదోషౌ బుధోగృహ్ణన్ ” అనుశ్లోకమున పరమేశ్వర గుణవర్ణనరూపమైన మంగళమును, మధ్యమందు ‘స్వస్థానాదవరోప్య' అను మొదలగువానిచేతను, తుదియం దీశ్లోకముచేతను మంగళము నాచరించి యున్నాఁడు. సంస్కృతవ్యాఖ్యయందు "అత్రాదౌ త్రయీత్యాదినా భగవద్వర్ణనరూపో మఙ్గళాచారః కృతః" అని యుండుటచే నీ గ్రంథమునకు ముఖమందు వేఱొకశ్లోక ముండవలయునని తోఁచుచున్నది.


శ్లో.

సాక్షరా విపరీతాశ్చేత్ రాక్షసా ఏవ కేవలం,
కవిరాక్షస ఏవాయం కవిరాక్షసకృత్యతః.

ఇది శ్రీ శ్రీనివాసపుర సుబ్బరాయార్యపుత్త్ర లోకనాథకవి
విరచితంబైన కవిరాక్షసీయాంధ్రవ్యాఖ్యానము
సంపూర్ణము.

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.