కల్పతరువు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
  • శతకం:కల్పతరువు
  • శతక రచన: లక్ష్మీకాంత్
  • ఛందస్సు: ఆటవెలది
  • ప్రస్తుత పద్యాలు:23

  
ఎండ ఉన్నయపుడె, ఎదుగును వృక్షంబు .....(1)
ఎండ ఎక్కువైన ఎండిపోవు
అవసరానుగుణము ,అర్జించు ఏదైనా
కనులు తెరిచి కనుము కల్పతరువు


గాలి వాన కలిసి, గగనాని కేగెను .....(2)
భూమి పంట బుగ్గి,పాలు
కాదు అనక మీరు కదలండి ధరణికి
కనులు తెరిచి కనుము కల్పతరువు


కలసి కనుకరించు కార్యంబు ఏదైనా .....(3)
కనుకరించబోని కాయమేల
కరుణ లేని జీవి ,కాటికేగుటబాగు
కనులు తెరిచి కనుము కల్పతరువు


కార్పొరేటు చదువు , కళ్ళ వరకు జేరు .....(4)
కళ్ళ నీళ్ళ తోటి , కరిగిపాయె
బయట పడును చూడు ,బట్టీ చదువు మీది
కనులు తెరిచి కనుము కల్పతరువు


చదువు చదువు అనిన , చదవరు పిల్లలు ......(5)
చదువు లోని విలువ చూపకున్న
చదువు యొక్క తీపి చూపించి చదివించు
కనులు తెరిచి కనుము కల్పతరువు


కన్ను లెట్టి జూడు,కనపడు సత్యంబు .....(6)
బోరుమన్న రైతు , బతుకు జూడు
మత్తు వీడి నీవు , మసులుకో అధికారి
కనులు తెరిచి కనుము కల్పతరువు


కలిమి కోరి ఒకడు , గడపను దొక్కిన
కాదు అనక నీవు, కలుపు చేయి
కలిసి మెలుగు వాడు , గగనాన చంద్రుడు
కనులు తెరిచి కనుము కల్పతరువు ......(7)


రైతు కష్టపడిన ,రాబడి సరిలేక ......(8)
దిగులుతోటి నేడు, తలను రాల్చె
భరత మాత ఎట్లు , బతుకు తను లేక
కనులు తెరిచి కనుము,కల్పతరువు


మంచి పనులు జేయ,ముడుపులు అర్జించి ......(9)
మందకొడిగ పనులు,మొదలుబెట్టి
మంచి పనిని తాను,ముగియించెదెన్నడు
కనులు తెరిచి కనుము ,కల్పతరువు


ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆహార గతిచూడు ......(10)
పక్కరాష్ట్రమునకు,పయనమాయె
అన్నపూర్ణయందు, ఆకలి కేకలా ?
కనులు తెరిచి కనుము ,కల్పతరువు


ఇంటిలోని చారు, ఇంపుగాలేదని ......(11)
పక్క ఇంటిలోని, పప్పుదెచ్చి
బహులబాగుయని,భుజియించు కాలంబు
కనులు తెరిచి కనుము ,కల్పతరువు


మంచి మనిషి చెంత , మర్యాద జూపుచు ......(12)
కానివాని చెంత,కసిరినంత
గుణము ఘనము చెందు,గుడిసిలో నుండిన
కనులు తెరిచి కనుము కల్పతరువు


చదువు కోర యనిన, చాలించి కుర్రాడు .......(13)
పిల్ల వెనుక నేడు, పరుగు పెట్టె
కన్న తల్లిదండ్రి , కానరారెందుకు
కనులు తెరిచి కనుము కల్పతరువు


రాజు పోయి నేడు రాజ్యాలు మిగిలెను ......(14)
రాజ్యమేలువారు, రాక్షసులయి
ఎవ్వరొత్తురోయి, ఏడ్పుతీర్చనురేపు
కనులు తెరిచి కనుము కల్పతరువు


కత్తి కన్న పదును, కలముకు గలదోయి .........(15)
కత్తికన్నకలము,గొప్పదౌను
కలము లోని శక్త్.కదిలించె లోకాలు
కనులు తెరిచి కనుము కల్పతరువు


కాలుతున్న నీవు, కానివాడివయిన ..........(16)
కరుణజూపి నరులు , కనుకరించె
అట్టి నరుల యొక్క, అత్మ బంధువు నీవు
కనులు తెరిచి కనుము కల్పతరువు


ఎండ ఉన్నయపుడె, ఎదుగును వృక్షంబు .............(17)
ఎండ ఎక్కువైన ఎండిపోవు
అవసరానుగుణము ,అర్జించు ఏదైనా
కనులు తెరిచి కనుము కల్పతరువు


గాలి వాన కలిసి, గగనాని కేగెను ........(18)
భూమి పంట బుగ్గి,పాలు
కాదు అనక మీరు కదలండి ధరణికి
కనులు తెరిచి కనుము కల్పతరువు


కలసి కనుకరించు కార్యంబు ఏదైనా ........(19)
కనుకరించబోని కాయమేల
కరుణ లేని జీవి ,కాటికేగుటబాగు
కనులు తెరిచి కనుము కల్పతరువు


కార్పొరేటు చదువు , కళ్ళ వరకు జేరు ........(20)
కళ్ళ నీళ్ళ తోటి , కరిగిపాయె
బయట పడును చూడు ,బట్టీ చదువు మీది
కనులు తెరిచి కనుము కల్పతరువు


చదువు చదువు అనిన , చదవరు పిల్లలు ............(21)
చదువు లోని విలువ చూపకున్న
చదువు యొక్క తీపి చూపించి చదివించు
కనులు తెరిచి కనుము కల్పతరువు


కన్ను లెట్టి జూడు,కనపడు సత్యంబు .......(22)
బోరుమన్న రైతు , బతుకు జూడు
మత్తు వీడి నీవు , మసులుకో అధికారి
కనులు తెరిచి కనుము కల్పతరువు


కలిమి కోరి ఒకడు , గడపను దొక్కిన ...........(23)
కాదు అనక నీవు, కలుపు చేయి
కలిసి మెలుగు వాడు , గగనాన చంద్రుడు
కనులు తెరిచి కనుము కల్పతరువు