కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/వెంకప్ప సోమయాజులు

వికీసోర్స్ నుండి



వెంకప్ప సోమయాజులు

వీరు కోనసీమలో అయినపల్లి అనే గ్రామకాపురస్టులు. బులుసు అచ్చయ్యగారనే జగత్ర్పసిద్ధవిద్వాంసుల ప్రథమపుత్రులు. తండ్రిగారి వలెనే వేదశాస్త్ర శ్రాతములలో నఖండప్రజ్ఞకలిగి &S సేతుహిమాచలమున్నూ ప్రసిద్ధిచెందిన పుణ్యపురుషులు. అసలు బులుసువారి వంశము “బలుసులేని తద్దినమున్నూ బులుసులేని యజ్ఞమున్నూలేదు" అనే సామెతకు స్థానమైనది. అందులో నీ సోమయాజులుగారు అగ్రగణ్యులు. వీరి నగ్రగణ్యులందామంటే, తండ్రి అచ్చయ్యగారి నేమనవలెనో, తాత జగన్నాథశాస్రులవారి నేమనవలెనో, కుమాళ్లు పూర్ణయ్య సోమయాజులు గారి నేమనవలెనో తెలియదు. కాcబట్టి మొత్తం ఆ నాలుగుతరాలున్నూ వరుసగా వేద శాస్త్ర పుంజాలుగా ప్రకాశించాయనుకొందాం. ഋeാ అయినప్పటికీ ప్రస్తుతం మనం వ్రాస్తూవున్నది వేంకప్ప సోమయాజులు గారిని గూర్చి కాcబట్టి వీరిని అగ్రగణ్యపదంతో వాడడం అంత తప్ప గాదనుకుందాం. "వ్రతానా ముత్తమవ్రతమ్.” యీ సోమయాజులుగారు ఆపౌండరీకాంత శ్రాతియై అనేకులచే యజ్ఞాలెన్నో చేయించడమే కాకుండా స్వయంగాకూడా చేసి చిరకాలం జీవించిన పుణ్యమూర్తులై వున్నారు. ఆయీదేశంలో వుండే పెద్దపెద్ద శౌతులందఱున్నూ వీరివద్ద దివిటీకింద దీపాలే అని చెప్పకోవడం నేనెఱుగుదును. వీరిచేత చివాట్లు తినని శ్రాతియేలేడని చెప్పకోవడం నేను స్వయంగా విన్నదే. నా బాల్యంలో వీరు సజీవులే కాని వీరి దర్శనభాగ్యం నాకు లభించలేదు. చరిత్రమాత్రం పలువురువల్ల విని ఆనందించడం తటస్థించింది. వీరు తండ్రిగారివలె నప్రతిగ్రహీతలు కారుగాని సుప్రతి గ్రహీతలు. అట్లయ్యను తృణీకృత బ్రహ్మపురందరులు.

తండ్రిగారి నప్రతిగ్రహీతృత్వాన్ని గుణించినగాథలు కొన్నివున్నాయి. అందులో వకటి వుదాహరిస్తాను. వకరోజున వుదయం గుమ్మం అలుకుతూవున్న సమయంలో వీరి తల్లిగారిని తండ్రి అచ్చయ్యగారు “ఈవేళ శాకపాకా లేమిటి” అని ప్రశ్నించేటప్పటికి ఆమె, యేముంది, ఇత్యర్థలు పులుసూ ఇతిభావలు కూరానున్నూ, అని జవాబు చెప్పినట్టున్నూ, దాని మీంద అచ్చయ్యగారు ఆవిడ భావాన్ని గ్రహించి నీకేమాత్రమో ధనాపేక్ష వున్నట్టుగా తోస్తూవుంది అది యెంతవఱకో వకమాటుబయటపెడితే తెచ్చి యీయడానికి ప్రయత్నిస్తా నన్నట్టున్నూ, ఆ పట్టాన్ని ఆమె గుమ్మం అలకడానికి నీళ్లు తెచ్చుకొన్న నిలువుచెంబుచూపించి దీనెండు వరహాలు తెస్తే చాలునన్నట్లున్నూ, అప్పడే ఆచెంబుచేతcబుచ్చుకొని అచ్చయ్యగారు దేశాంతర గమనాభిముఖులై కొన్ని ప్రయాణాల మీంద హైదరాబాదు చేరుకొన్నట్టున్నూ అక్కడ వక బ్రాహ్మడు యజ్ఞం చేస్తూవుండగా కాకతాళీయంగా వీరా యజ్ఞసమయానికే అక్కడికి వెళ్లి యజ్ఞశాలలోకి వెళ్లినట్టున్నూ అక్కడ యేదో ప్రాయశ్చిత్తవిషయంలో శ్రాతులలో శ్రాతులకు వివాదవచ్చి వాదించుకుంటూ వుంటే, యీ అచ్చయ్యగారు కలగజేసుకొని “యిదమిత్థం" అని ఖండించి చెప్పినట్లున్నూ దానిమీద వక శ్రాతి “నిన్నెవరడిగారయ్యా నీవు చెప్పడానికి, అబ్బో.! నీవేమో బులుసు అచ్చయ్య వయిపోయినావే" అని సోల్లంఠంగా మాట్లాడేటప్పటికి అచ్చయ్యగారు “అలాగేఅనుకోండి" అని జవాబు చెప్పినట్టున్నూ, తుట్టతుదకు వారిలోవారు ముఖముఖాలు చూచుకొని, అచ్చయ్యగారే అని స్థిరపడేటప్పటికి, అచ్చయ్య గారిని ఆశ్రాతులందఱూ విస్తారంగా గౌరవించి, అప్పడు గోలకొండ నవాబుకు దివాన్జీగారున్నూ దేవబ్రాహ్మణ భక్తుఁడున్నూ, మిక్కిలి ఆస్టికుండున్నూ అయిన చందోలాలాగారికి విన్నవించేటప్పటికి వారుకూడా వీరి పేరు అంతకు పూర్వమే వినివుండడంచేత అచ్చయ్యగారిని విశేషంగా గౌరవించి తాము యేకోరికమీంద యిక్కడికి దయచేశారో సెలవీయవలసిందని ప్రార్థించేటప్పటికి, నాకు యేకోరికా లేదు. “పంచమేలి_ హనిషష్లేవా" అన్నట్లు కాలక్షేపం చేయడమేనాకోరికగాని వేటేకోరిక లేశమున్నూ లేదని చెపుతూ, చేతులోవున్న చెంబును చూపి యింట్లో ఆడవాళ్లకోరిక యిట్టిది అని చెప్పినమీందట దివాన్జీగారు యేదేనా జహగీరు యివ్వడానికి ఉద్యుక్తులుకాంగా, వారు దానిని అంగీకరింపలేనట్టున్నూ, దానిమీంద విధిలేక ఆ చెంబెండు వరహాలు మాత్రమే యిచ్చి పంపినట్లున్నూ, అవి తీసుకువచ్చి భార్యకిచ్చి అది మొదలు నప్రతిగృహీతలుగానే వుండి కాలక్షేపం చేసినట్లున్నూ, అందఱున్నూ యిప్పటికిన్నీ చెప్పకుంటారు. యింకా అచ్చయ్యగారి నప్రతిగ్రహీతృత్వాన్ని గూర్చిన యితిహాసాలు చాలా వున్నాయి మచ్చుకు వకటిమాత్రం వుటంకించాను.

ఇCక పాండిత్యం యేలాంటిదంటారా? “విస్సన్న చెప్పింది వేదం" అన్న సామెతకి కారణభూతులైన యింద్రగంటి విశ్వపతిశాస్రుల్లు గారు అచ్చయ్యగారి శిష్యులే అన్నచో వారి పాండిత్యం యెట్టిదో చెప్పనక్కరలేదు; అయితే అంతగొప్పపండితులుగదా శాస్త్రి, అవధాని, సోమయాజి, లోనైన బిరుదు లేమీలేకుండా వట్టి అచ్చయ్యగారే అనిపించుకున్నా రేమని వకశంకరావచ్చును. సోమయాజులు అనిపించుకోవడానికి అచ్చయ్యగారు యజ్ఞం చేయలేదంట. వేదశాస్త్ర శ్రాతాలు వచ్చిన మహాపండితుండుగదా? ఆయన యజ్ఞం యెందుకు చేశారుకారు? అని మళ్లా శంక రావచ్చును. యెందుకు యజ్ఞంచేయలేదో మనకేం తెలుస్తుందికాని, లోకంలో ప్రవాదమాత్రం, యీ కలియుగంలో ఆధానం వఱకు మాత్రం చేసి త్రేతాగిసిద్ధిని పొందితే చాలుననిన్నీ పశుహింసతో చేరిన తక్కిన యజ్ఞయాగాలకు పోంగూడదనిన్నీ వారి యభిప్రాయమైనట్లు పలువురు పెద్దలు చెప్పంగా విన్నాను. ఇది సత్యమైతే కావచ్చు. యింక తక్కిన శాస్త్రివగయిరా బిరుదాలు ధరించడానికి అన్నీ రావడం వల్ల వకదాన్నే బోధించే బిరుదాన్ని ధరించడం యిష్టంలేక అచ్చయ్యగారు అచ్చయ్యగారుగానే యావజ్జీవమున్నూ కాలక్షేపం చేసినట్లువిన్నాను. వినడంలో అసలు అచ్చయ్యగారే యీ విషయం యిట్టిదని యెప్పుడో స్వయముగా వక్కాణించారనికూడా విన్నాను. యిందులో సత్యమెంతో, కల్పితమెంతో! అది అల్లా వుంచుదాం. అచ్చయ్యగారు సాక్షాత్తూ రెండో చతుర్ముఖుండు అన్నంతవఱకు అందఱూ నిర్వివాదంగా వప్పకుంటారు. వకరిని గూర్చి వ్రాసేటప్పుడు వేరొకరి ప్రసంగం యెత్తితే తేలదు. యిప్పడు మనకథానాయకులు వెంకప్పసోమయాజులుగారు గాని వారి తండ్రి అచ్చయ్యగారు కారు.

వెంకప్ప సోమయాజులుగారివి కూడా వేదశ్రాతాలకు సంబంధించిన గాథలు చాలా వున్నాయి. యీ వేంకప్పసోమయాజులుగా రనేవారటకదా:- యీ శ్రాతప్పల్లకీ వకవైపు దండి మాత్రమే బుజాన్ని పెట్టుకొని నేను మోస్తువున్నాను. రెండోదండి బుజాన్ని పెట్టుకొనేవాళ్లు కనపడడంలేదనేవారంట. కాలకర్మదోషాన్ని బట్టి యిప్పడీ విషయాలు ముచ్చటించుకునేవారు కూడా లేరుగాని శ్రాతమంటే సామాన్యంగాదు. యిప్పటికీ యీ గోదావరీతీరంలోనూ, కృష్ణాతీరంలోనూ, కావేరీ తీరంలోనూ, యింకా శ్రాతవిద్య శేషించివుంది. పూర్తిగా నశించలేదు. వెంకప్ప సోమయాజులుగారే కాదు, బులుసు వారందఱున్నూ వేదశ్రాతాలు వచ్చికూడా ఛాందసులుగా మాట్లాడడం కాక యుక్తియుక్తంగా సభారంజకంగా మాట్లాడే నేర్పు కలవారని పలువురవల్ల వినివున్నాను. ప్రస్తుతానికి అంతగా అవసరం లేక వుదాహరించలేదు. గాని యెనభైయేండ్లవయస్సులో తిరిగీ వివాహం చేసుకొనేనిమిత్తం తూర్పు దేశంలోవున్న జమీందారులను చూడడానికి వేంకప్ప సోమయాజులుగారు ప్రయాణం చేస్తూ వున్నప్పటిగాథలు చాలా హృదయంగమంగా వుంటాయి. పెండ్లిచేసికొన్న పిమ్మట వక రాజుగారు యొకసక్కెంగా, సోమయాజులుగారూ! అవ్వగారు చెప్పినట్టు వింటూవున్నారా? అని ప్రశ్నించినట్టున్నూ దానిమీద మన సోమయాజులుగారు యొకసక్కెమాడిన ప్రభువుగారికి నసాళం అంటేటట్టుగా “రాeూ? వక్కపిల్లవినదూ? వక్కపిల్ల" అని యేడుసార్లు కాంబోలును రెట్టించి జవాబు చెప్పినట్టున్నూ చెప్పకుంటారు. యిట్లామాట్లాడడం ఛాందసులలో మిక్కిలి అరుదు.

ఈ వేంకప్పసోమయాజులుగారి తమ్ములే మిక్కిలి సుప్రసిద్దులైన పాపయ్యశాస్రుల్లు గారు. అచ్చయ్యగారి ప్రతిష్ట సరేకదా! వేంకప్ప సోమయాజులుగారి ప్రతిష్ట విన్నారుకదా! \

యీ పాపయ్యశ్రాస్రుల్లుగారి ప్రతిష్ఠనుగూర్చి యెంతని వ్రాయను? యీయన కుమారుండు ప్రకాశశాస్రుల్లుగారు తండ్రిని మించినవారు. యిటీవలకూడా వీరివంశం తామరతంపరగా విద్యా యశోధనాలతో భగవదనుగ్రహంవల్ల తులతూంగుతూనే వుందిగాని, ప్రస్తుత కాలానికి బొత్తిగా పనికిమాలినవనే హేతువు చేతకాCబోలును అనూచానంగా వస్తూవున్న వేదశాస్త్ర శ్రాతాలను వంశీకులు వదలుకొన్నటూహించుకోవాలి. ప్రసక్తానుప్రసక్తంగా పాపయ్య శాస్రుల్లుగారి ప్రసంగం వచ్చింది. ఈయన వేదశాస్త్రశైతాల్లో అన్నగారికిఁగాని తండ్రిగారికిం గాని లేశమున్నూ తీసిపోయేవారుకారు. కాని శ్రాతంలో అన్నగారిలాగు అనేక యజ్ఞాలకు పాత్రచేతCబట్టి ఆధ్వర్యవాన్ని చేయక యేవో కొన్నిటికిమాత్రమేచేసి విరమించినట్లు వింటాను. ఏమయినా, శ్రాతప్రయోగ విషయంలో ప్రాక్టీసు వేంకప్ప సోమయాజులుగారి కెక్కువ. పాపయ్య శాస్రులుగారో హైకోర్టులాయరీ ప్యాసై కోర్టు కెప్పడో కొలందిసార్లు మాత్రమే వెళ్లి విరమించిన శ్రీ రెంటాల వేంకట సుబ్బారావు పంతులుగారి వంటివారు. వేదార్థం చెప్పేశక్తి వేంకప్ప సోమయాజులుగారికి కూడా వున్నట్లే వింటానుగాని పాపయ్యశాస్రుల్లువారి వంటి ప్రజ్ఞవారికే కాదు యెవరికీ లేదని వింటాను. విద్యారణ్యం పాపయ్యశాస్రుల్లుగారికి కంఠపాఠమేనంట! ధర్మశాస్త్రాలన్నీ వాచోవిధేయంగా వుండేవంట! యెంతని వ్రాయను వారి ప్రజ్ఞగూర్చి యింక లౌకికత్థానంలో యేప్లీడరూ పనికి రారంట వారిముందు. వారు వేదార్థం చెపుతూవుంటే, అవతల యెంతో అందగత్తె, పాటకత్తె, అయిన వేశ్య అభినయిసూ వున్నప్పటికీ ఆసభలోకి వెళ్లక పండిత పామరులందఱూ వచ్చి వీరి సభలోనే కిక్కిరిసి వుండేవారంట! యివన్నీ పెద్దలు చెప్పకుంటూవుంటే విన్నమాటలు.

వారి కాలంలో యే బాల్యవయస్సులోనో నేనుకూడా యేకావ్యాలో చదువుకుంటూ వున్నప్పటికీ నా విద్యార్ధిత్వమంతా వక్కకడెద్దగ్రామంతప్ప తక్కింది గౌతమికి యీవలివడ్డున జరిగిందే అవడంచేత ఆ మహానుభావుణ్ణి దర్శించడానిక్కాని ఆయన వాక్కును వినడానిక్కాని నోంచుకున్నది కాకపోయింది. మా తిరుపతిశాస్త్రి అంతో ఇంతో కోనసీమ విద్యార్ధిత్వము చేసినవాG డవడంచేత పాపయ్యశాస్రుల్లవారి దర్శనభాగ్యమేనా అతనిక్కలిగింది. యేమైనా వారికాలంలో నేనుకూడా వున్నానని గర్వించడానికి మాత్రం నాకుకూడా అధికారంవుంది. యీ విన్నమాటలమీందనే వకరాజసభలో పిచ్చాయి అభినయాన్ని గూర్చి మాట్లాడవలసివచ్చి యీ క్రింది పద్యం నేను చెప్పఁగలిగాను.

తే.గీ. వేదమున కర్ధమును జెప్పఁ బృథివియందు
బులుసుపాపయ్యశాస్త్రి కే పోలుఁగాక
అభినయమొనర్చి పండితసభలనెల్ల
“హాయి" యనిపింప నొక్క పిచ్చాయి తగును.

యిలా పోల్చినందుకు ఆ సభలో పండితులు సమ్మతించక మామీందకి లేచారు סכGסכO ఆ సభలో మాగురువు బ్రహ్మయ్యశాస్రుల్లుగారు కూడా వున్నారు. మామీదికి లేచిన పండితులకు సమాధానం చెప్పి మా మాట మేము నిల్పుకున్నాము. యీ విషయం యెఱిఁగినవా రీదేశంలో యిప్పటి కింకా పలువురుంటారు. యింతకన్న యీ విషయాన్ని విస్తరిస్తే “రామాయణంలో పిడుకల వేట్గాట"గా వుంటుందని వదలుతూవున్నాను. ప్రధానం పాపయ్యశాస్రులవారి వాజ్మాధుర్యం సంగీతం వంటిది, అభినయం వంటిది - అంతేకాని “ఆస్సే చూస్సివ షే, వషే! చెవుడపే! అష్టాగపే యేమిషే? విస్సావర్ణులవారి - బుట్టినప యా విస్సాయి కిస్సారుషే!” వంటిదికాదు అన్నది యిక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం. వాఙ్మాధుర్యం యిట్టిదని శాస్త్రమేమేనా రాదా? వ్యాకరణం, పూర్వమీమాంస యింకా యితర శాస్తాలు వచ్చునాయె, యిఁక ఆయనకుసాటి - యీ లోకంలోనే కాడు స్వర్గలోకంలోనే అనుకుందాం - యొక్కడ దొరుకుతుందో ఆలోచించుకోండి చదువరులు. యిన్నిటికన్నా సభారంజనకు వాఙ్మాధుర్యం ಮಿಭ್ಯಂ. "ವಿನ್ గోరసం కోరసః పండితానాం” అని వూరకే అనలేదు అభియుక్తులు. గోరసం అంటే వాజ్మాధుర్యం. ఇంత వాఙ్మాధుర్యం కలవారు కనుకనే పాపయ్యశాస్రులవారు మహాకవిన్నీ సంగీత సాహిత్యపారంగతులున్నూ మహాపౌరాణికులున్నూ అయిన శ్రీశిషు కృష్ణమూర్తిగారితోకూడ వాదోపవాదాలు వచ్చినప్పడు లోకులకు స్తోత్రపాత్రులు కాగలిగారు. పాపయ్య శాస్తుల్లుగారికిన్నీ శ్రీకృష్ణమూర్తిగారికిన్నీ జరిగిన వాదోపవాదాలు ప్రత్యక్షంగా విన్నవారు నిన్న మొన్నటిదాకా శ్రీ పిఠాపురపు సంస్థానములో నున్నూ యితరత్రానున్నూ పలువురు పండితులుండేవారు. అందులో కొందఱిని నేను ప్రత్యక్షంగా యెఱుగుదును. పాపయ్య శాస్రులవారు కుమారుండు సూర్యప్రకాశశాస్రుల్లుగారివలె తేజశ్శాలి కారంట! పొడుగుగా చామనచాయగా సన్నముగా వుండేవారంట. వారు నీర్కావిబట్టలే ధరించేవారంట. వారి చేతులోవుండే రాగిచెంబు పైభాగం నల్లగానే వుండేదంటకాని లోపలభాగం బహుపరిశుద్ధి కలిగివుండేదంట. పండితులకు ముఖ్యంగా కావలసిందేమిటి? అంతశ్శుద్దేకదా! యీఅంశాన్ని లోక్రానికి తెల్పడానికే వారల్లటి పాత్రను ధరించేవారేమోనని నే ననుకుంటాను.

వీరి చిత్ర చరిత్రలు చాలావున్నాయి. వకటి రెండుదాహరిస్తాను. ఏకగ్రామవాస్తవ్య లవడంచేతన్లో యేమో, మొదటినుండిన్నీ శ్రీ శిష్టు కృష్ణమూర్తిగారికిన్నీ మన పాపయ్యశాస్రులు గారికిన్నీ విద్యావిషయంలో భిన్నాభిప్రాయా లుంటూవచ్చేవCట. పాపయ్యశాస్రులుగారికి వచ్చిన వేదం కృష్ణమూర్తిగారికిన్నీ వచ్చునుగాని యేమైనా వీరు కవితాభాగంలో ప్రధానంగా పనిచేయడంవల్ల 《원9 విషయంలో పాపయ్యశాస్రులగారికి లొక్కుతారనడం సత్యదూరంకాదు. పాపయ్యశాస్రులుగారు కవితా విషయంలోంగాని, సంగీతవిషయంలోఁగాని అసలు ప్రమేయమే లేనివారు. కాcబట్టి యీ సందర్భంలో వీరికీ వారికీ తారతమ్య నిర్ణయం చేయనక్కరలేదు. కృష్ణమూర్తిగారు పిఠాపురపు సంస్థానంలో వకప్పడు విజయదశమీ నిర్ణయములో సంస్థానపురోహితులద్వారా పాపయ్యశాస్రులగారి నధః కరిద్దామనే కుతూహలంతో పాపయ్యశాస్తులుగారి నిర్ణయానికి వ్యతిరేకంగా పురోహితుడిచేత వాదింపచేయడానికి పూనుకొని తాను కవి కనుక ధర్మశాస్త్రశ్లోకాలు తదనుగుణంగా పాతతాటాకు సంపుటాల్లో యొక్కించి రాజసభలో కనపరచేటప్పటికి శ్రీ రాజావారు పాపయ్యశాస్రుల్లుగారికేసి చూచి “దీనికేమంటారు” అని ప్రశ్నించేటప్పటికి శాస్రుల్లుగారు “మహా ప్రభూ : శ్రీకృష్ణ సాహాయ్యమండి" అని శ్లేషగా జవాబు చెప్పేరంట. దానిమీంద కృష్ణమూర్తిగారు పాపయ్యశాస్రులుగారి పేరును శ్లేషిస్తూ “మహాప్రభూ! పాపుcడికి కృష్ణసాహాయ్యముండదని Ꮛ8ö❍°ᏋᏇᏇ చెప్పేరట. అంతతోకూడా వూరుకోక కుమారసంభవంలో శ్లోకాన్నొకధాన్ని యెత్తికొని ప్రస్తుతాని కనుకూలించేటట్టు అర్థం చెప్పి కాళిదాసుకూడా యిదే అభిప్రాయం కలవాండని చమత్కరించినట్లు చెప్పంగా విన్నాను. యీగాథలన్నీ నాకు తు చ తప్పకుండా వచ్చివున్నప్పటికి గ్రంథవిస్తరభీతిచేత స్పృశించి మాత్రం వదులు తున్నాను. యీ పిఠాపురంలో వీరిద్దటికీ వైషమ్యానిక్కారణం శ్రీ రాజావారు పాపయ్యశాస్రుల్లు r্য০63 పద్దెన్మిదిపుట్ల భూమి యివ్వడమున్నూయి. సంగతి విని అంతకుముందు సుమారు పద్దెన్మిదేండ్లనాడు శ్రీ కాకర్లపూడి సంస్థానం విచ్ఛిన్నమయ్యే రోజుల్లో A. శ్లో "త్రిస్థలీధ్వంసనార్ధాయ ప్రవిష్టం నాయనత్రయం తతైకస్తుకృతార్టో భూ దన్యౌద్వౌతు భవిష్యతః" అని భావికాలాన్ని సూచనచేసి కాళహస్తి సంస్థానానికి సకుటుంబంగా వెళ్లివున్న కృష్ణమూర్తిగారు భూసంపాదనేచ్ఛతో శ్రీ పిఠాపురం రాజావారి దర్శనానికి రాంగా రాజావారు రు. 500-0-0లున్నూ విలువగల సేల్లోడుమాత్రమే యిచ్చి సత్కరించడంవల్ల, నేనేం తక్కువవాండనా? పాపయ్యశాస్రుల్లు కిచ్చినట్లు నాక్కూడా భూమి యేల యివ్వకూడదు? అనే యీర్యతో రాజుగారికి తన గొప్పదనాన్ని చూపడానికి కృష్ణమూర్తిగారు రాజపురోహితునిచే పాపయ్యశాస్తుల్లుగారి నిర్ణయానికి అన్యథాగా చెప్పించారనిన్నీ దానిమీంద పైన వుదాహరించిన శ్లేషప్రసంగం జరిగిందనిన్నీ స్పష్టమేకదా! ООЈОSS OЈо సందర్భంలో కృష్ణమూర్తిగారు శ్లేషగా చెప్పిన - "శ్లోరావురామనృపతౌ" అనే శ్లోకాన్ని వుదాహరించి చర్చించవలసియున్ననూ మనకు ప్రధానం పాపయ్యశాస్రుల్లుగారిది కూడా కాక వేంకప్పసోమయాజులుగారి విషయ మవడంచేత వుపేక్షిస్తున్నాను. ప్రసక్తాను ప్రసక్తమైనప్పటికీ పాపయ్యశాస్రుల్లుగారి చరిత్రకూడా కొంత మనకు ప్రధానమే అన్న అంశం ముందు వ్రాసే సంగతినిబట్టి చదువరులకు గోచరిస్తుంది. యింతకున్నూ -

పాపయ్యశాస్రులవారి వాజ్మాధుర్యం మహాకవియు, మహావైణికుండును అగు శిష్టు కృష్ణమూర్తి గారితో కూడా పోటాపోటీ చేయందగ్గదిగాని సామాన్యమైనది కాదన్నది ముఖ్యాంశం. 2. QOSo పాపయ్యశాస్రుల్లుగారి వాజ్మాధుర్యానికి సాధకమైన గాథలెన్నో నేనెఱిఁగిన వున్నాయి. కాని విస్తరభీతిచే వుపేక్షిస్తున్నాను. వేంకప్ప సోమయాజులుగారు కడుంగడు గొప్పవారే అయినను, వాజ్మాధ్యర్యాన్ని బట్టియేమి, తఱుచు సభలలో అదేపనిగా వేదార్థం చెప్పక- వుండడంవల్లనేమి, దేశంలో పెద్ద పేరు పాపయ్యశాస్రుల్లవారికి వచ్చింది. యింతేనా కారణం యింకా యేమేనా వుంటుందా అంటే మనకు గోచరించేది యింతమట్టుకే. తక్కినది– “పబ్యైర్యశోలభ్యతే" అనేది. యేమైతేనేమి లోకంలో పాపయ్యశాస్రులవారి కున్నంతపేరు వేంకప్ప సోమయాజులు PেOS లేకపోయిందన్నది సర్వసమ్మతమైనమాట. పాపయ్యశాస్రులుగారు అన్నగారియందు ఎంత భక్తి ప్రపత్తులతో వినయవిధేయతలతో సంచరిస్తూవున్నప్పటికీ, తమ్మునిమీద నిష్కారణంగానే పై సంగతినిబట్టి వేంకప్ప సోమయాజులుగారికి అసూయపుట్టడం తప్పింది కాదు. అసూయ పుట్టినట్లు మనకు యేలాగ తెలియడమంటే, అది పుట్టకుండానే వుండాలిగాని పుట్టిన తర్వాత పైకి రాకుండా మానుతుందా? విన్నమాటలు సుమండీ! దీనిలో యెంత సత్యముందో, యెంత అసత్యముందో! లోకులు కాస్తవుంటే గంపంత కల్పనచేస్తారన్నది సత్యదూరంకాదు. వకప్పుడెవరో వేంకప్పసోమయాజులుగారిని గూర్చి ఎవరికో తెల్పుడుచేసే విషయంలో, వీరే వేంకప్ప సోమయాజులుగారు’ అనిచెప్పి వూరుకోక పాపయ్యశాస్రుల్లుగారి అన్నగారు' అనికూడా ఆమాటకు తోంకగా తగిలించారంట! దానిమీంద వేంకప్ప సోమయాజులు గారుతోఁకతొక్కిన తాచులాగులేచి "యేమీ?... పాపిగాండి అన్నగారనకపోతే అచ్చయ్యగారి కొడుకనిపించుకోడానికి తగనా?” అని పెద్దగా మండిపడ్డారంట. యిది యితరుల కల్పనే అయితే పరిశీలించ నక్కఱలేదుకాని నిజమే అయిన పక్షానికి కొంత చర్చించవలసి వుంటుంది. అంతగొప్ప పండితుండుగదా, ఆయన తన తమ్ముండి యందు అంత అసూయగా వుండడం తటస్థిస్తుందా అన్నది యిక్కడ విచారణీయం. అయితే యిది యశోవిషయం కాCబట్టి, తండ్రిని కొడుకు సహింపఁడు, కొడుకును తండ్రి సహింపడు అన్నదిన్నీ లోకప్రసిద్ధమే. “సర్వత్రజయ మన్విచ్బేత్" అన్నదానిలో "పత్రాదిచ్చే త్పరాజయం" అనివుండడంచేత వక పుత్రుణ్ణిమాత్రమే మినహాయించవలసి వుంటుందికాని తదితరులను మినహాయించవలసి వుండదు. తమ్ముఁడు కూడా కుమారుcడివంటి వాండే అనుకోవడానికి “పితృసమోజ్యేష్ఠః" అనేది సాయపడుతుంది. కాని అంతమాత్రంచేత లాభంలేదు. దానివల్ల తమ్మండియందు వచ్చే పుత్రత్వం ఆరోపిత పుత్రత్వం అవుతుందిగాని సాక్షాత్పత్రత్వంకాదు. “పుత్రాదిచ్ఛేత్తు" లోవుండేపుత్రత్వం సాక్షాత్పుత్రత్వమేకాని మలొకమూదిరిది కాదని అనుకోవడానికి అనేకాధారాలున్నాయి. కాని గ్రంథవిస్తర భీతిచే వుదాహరించ లేదు. సాక్షాత్పుత్రుల విషయంలో కలిగేపరాభవాన్ని ప్రతితండ్రి సంతోషపూర్వకంగా స్వీకరిస్తాండనే అంశం సర్వకవిసమ్మతమే. అందుచేతే శ్రీరామునకేమి, అర్జునునకేమి, అట్టి పరాభవాన్ని సంఘటించారు మన పూర్వకవీశ్వర్లు. ప్రస్తుతంమనకు కావలసింది, వేంకప్ప సోమయాజులుగారు యెంతో ప్రాజ్ఞలైనప్పటికి, తమ్ముండు పాపయ్యశాస్తుల్లుగారి శ్రేయస్సును కోరేవారైనప్పటికీ, ఆయన పేరు ద్వారా తమపేరు పయికి రావడానికి సుతరామున్నూ వప్పుకోలేదన్నది. దీన్ని గుఱించి విచారిద్దాంకొంత వకవేళయి పాపయ్యశాస్రుల్లుగారు తమ్ములు మాత్రమేకాక శిష్యులుకూడా అవుతారనుకుందాం. అప్పడేనా అంగీకరిస్తారేమో! లోకంలో యిప్పుడు మణికొందటి ధోరణ్ణింబట్టిచూస్తే శిష్యుండిద్వారా తమ పేరుకు వచ్చే ప్రసిద్ధినికూడా అంగీకరించరనే చెప్పవలసివుంది. అయితే మురారి మహాకవి - “సాంసా స్వశిష్యనివహైర్వినియుజ్యమానా )ே ـه విద్యాగురుం హి గుణవత్తర మాతనోతి అన్నాడుకదా:- దాని గతేమిటి?- అంటారేమో! దానిగతికేమి? అసలు వారొప్పుకోక పోయినా లోకంచెప్పుకోవడం మానుతుందా యేమి? ఫలానావారి మూలాన్ని యీయనకు గౌరవం వచ్చిందని? దాన్నెవరాంపగలరు? లోకాన్ని మూయడానికి మూకుడెక్కడ తేగలం? లోకజ్ఞానంబాగా వున్నవారు విద్వాంసులలోనే తక్కువగా వున్నారుకాని ప్రాకృతజనంలో చాలామంది వున్నారు. వక చతురుణ్ణి కోర్టులోఏదో సందర్భంలో నీపేరు చెప్పవలసిందంటే, నేను ఫలానా పుల్లమ్మ మొగుణ్ణని జవాబు చెప్పినట్టు వింటాము. అతడాలా చెప్పడానిక్కారణం యింటిపెత్తనమంతా చక్కంగా నిర్వహిస్తూ ధర్మకార్యాలుచేస్తూ పరువు మర్యాదలకు లోటులేకుండావర్తిస్తూవుండడంవల్ల తనపెండ్లాముకు యొక్కువ పేరుందని యెటింగి ఆశ్రేయస్సు తనదిగానే భావించుకోవడం తప్ప వేటొకటి కనపడదు! యేదో భట్రాజులు పద్యం చదువుతూ వుంటారు. కోటసింగరాజు మాటవాసేకాని గంగమాంబచేత ఘనతకెక్కె -- గంగమాంబ పెద్ద గయ్యాళిదైతేను, సింగరాజు యేమి సేయఁగలండు? అని. దీన్నిబట్టి ఆ సీంగరాజు కోపగించుకొన్నట్టు మాత్రం వినడంలేదు. తనకు పేరుప్రతిష్టలు తేఁదగ్గ మహాపతివ్రత భార్య దొరకడం కూడా పెద్ద అదృష్టాలలోదేకదా! అలాగేదొక్కా సీతమ్మగారి పేరేచెప్పకుంటారుగాని, భర్త జోగన్నగారిపేరు ముందుగా చెప్పకోరు. జోగన్నగారు వ్యవసాయమో వేదాయమో చేసి యింతపదార్థం తెచ్చి సమృద్ధిగా యింట్లోపడేస్తేనే కదా సీతమ్మగారు వచ్చే అతిథి అభ్యాగతులను ఆదరించి వడ్డించి కీర్తిసంపాదించింది! అయితే అంతదాకా లోకాని కవసరంలేదు, శీఘ్రంగా ఉపస్థితమయే విషయాన్నిబట్టి చెప్పకుంటారు. కాబట్టి పాపయ్య శాస్రుల్లుగారి పేరు వేంకప్ప సోమయాజులుగారి పేరుకంటే శీఘ్రంగా ప్రతివాడికిన్నీ మనస్సులో స్ఫురిస్తూవుండడంచేత లోకులు సోమయాజులుగారిని పాపయ్య శాస్రుల్లుగారి అన్నగారనుకోవడం తటస్థించింది కాని లేకపోతే శాస్రుల్లుగారినే సోమయాజులుగారి తమ్ములని చెప్పకొనేవారు. మహానదీ ప్రవాహాన్నేనా ఆపడానికి పూనుకోవచ్చునుగాని లోకప్రవాహాన్ని ఆపడానికి పూనుకోవడం వెట్టిపని. హైదరాబాదు సికిందరాబాదులకు మధ్యవున్న పెద్దతటాకంపేరు హుసేనుసాగరం, యీహుసేను నైజాంరాజ్యాన్ని పాలించిన నవాబులలో వాండుకాండు సరిగదా మంత్రులలో వాడుకూడా కాడు. సామాన్యమైన నౌకరీ చేసినవాడైతే కావచ్చు. యేనవాబు రోజులలోవాడో కూడా మనకు బాగా తెలియదు. ధన ద్రవ్యాలిచ్చి తవ్వించిన ప్రభువుపేరు రాక యీ హుసేనుకు పేరువచ్చింది యేమనుకోవాలి? ఆపేరుతీసివేయడానికి ప్రయత్నిస్తే యేమేనా లాభం వుందా? పుణ్యెర్యశో లభ్యతే" అని యిదివరకే వ్రాశానుకదా! యింకొకటి అందఱూయెఱిఁగిందే వుదాహరిస్తాను. హరికథాచతురాననుం డనదగిన నారాయణదాసుగారిని యెఱగనివారు లేరుగదా. ఆయనతోకూడా తాటితో దబ్బనంగా వెనుక పాడుతూవుండే ఆయన అన్న గారినికూడా లోకం యెఱిగేవుంది. యీ అన్నగారే సర్వవిధాలా ఆదాసు గారిని యుక్తమార్గంలో పెట్టి కథాకాలాక్షేపం చేయించే హంగుదారుcడని దాసుగారే వప్పకుంటారు. సంగీతంలో దాసుగా రెంతవిజ్ఞలో అంతవిజ్ఞలు అన్నగారున్నూ అయివుంటారు. కాని లోకం యీమాటకు యెంతవఱకు అంగీకరిస్తూందో చెప్పజాలను. అన్నగారిగాత్రం సన్నవిడిగా మధురంగానే వుంటుంది. దాసుగారి గాత్రం ముదురుగా జంబోరాగా కొంత మోటుగా వుంటుంది. యిద్దఱున్నూ యేకగర్భజనితులే కనుక ఆసృష్టికర్తసృష్టి చేసేతరుణంలో గాత్రస్వరాన్ని నిర్మించేటప్పుడు సరిగా యేర్పాటు చేయాలనుకొని యీయన గాత్రంలో వేయవలసిన సామగ్రినికూడా పొరబాటున ఆయన గాత్రంలో పడవేసేదేమో అని నాకు తోస్తుంది. లేకపోతే తమ్మడి గాత్రం, శంభో అనేటప్పటకి మూCడుకోసులుదాకా ఉఱుముటిమినట్లు ప్రతిధ్వనివ్వడ మేమిటి? అన్నగాత్రం అంతంతలోనే అంతరించడమేమిటి? యిట్టి సందర్భంలో వక సభలో వక కొంటెకుబ్జవాండన్నాండటకదా : యేమండోయి దాసుగారూ! యేదో కొంత డబ్బు పెట్టి టికట్టు కొనుక్కొని రానేవచ్చాం. ఆయనచేత పాడించడం మానిపిస్తే యింకా కొంత డబ్బిచ్చుకుంటాం మీ కన్నాండని చెప్పంగా విన్నాను. "లోకులో కాకులో వాళ్లని యెవళ్లాపంగలరు? యింతమాత్రంచేత అన్నగారు దాసుగారిమీంద అసూయ పెట్టుకున్నట్టు మాత్రం వినలేదు. ఆయన ప్రాజ్ఞత్వం యేలాటిదో చదువరులు విచారించుకోండి. అయితే మన కథానాయకులు సోమయాజులుగారు దాసుగారి అన్నగారీమాత్రం ప్రాజ్ఞలున్నూ కారా? మహావిద్వాంసులు కదా, అంటే యేంమనవిచేసుకోను. వకరితత్త్వం వకమోస్తరుగావుంటుంది. విద్యా విషయం అల్లావుంచండి. వక మహాపండితుండో, లేక కవీశ్వరుండో వున్నాడనుకోండి. అతఁడు అత్తవారింటికి వెళ్లేడు. అతణ్ణి ఆ వూల్లో వుండే అమ్మలక్కలు యేలా వ్యవహరిస్తారు? మన పుల్లమ్మ మొగుడే అంటారు. అంతమాత్రంచేత తనపేరు ప్రతిష్టలకు భంగం వచ్చినట్లాలోచించుకొంటే యేలాగ? యుక్తులకేమి, యెన్నేనా చెప్పవచ్చు. ఐనది కాదనటానికిన్నీ వీలుంటుంది. కానిది అవుననడానికిన్నీ వీలుంటుంది. యేమైనా, యొక్కడేనా బావాఅంటే వప్పుకుంటాను గాని వంగతోCటదగ్గిఱ మాత్రం అంటే వప్పుకొనేది లేదన్నాండన్నలోకోక్తి యెఱంగని వారెవరు? సోమయాజులుగారు తమ్ముని శ్రేయస్సును సర్వవిధాలా కోరేవారే అయినప్పటికీ, ఆయన పేరుద్వారా తమపేరు పైకివచ్చినట్లు మాట్లాడితే అందుకు అంగీకరించారుకారు. ఇందుకు వాల్మీకి రామాయణంలో వున్న— “అగస్త్య భ్రాతరం" అన్న వాక్యం పూర్తిగా తోడ్పడుతూవుంది. అగస్త్యులవారివలెనే ఆయన అన్నగారుకూడా మహా తపశ్శాలియేకదా! అయితే అగస్త్యులవారుచేసిన ఘనకార్యాలు వింధ్యపర్వత స్తంభనం, సముద్రోదకపానం వాతాపిజీర్ణం కథవగయిరాలవల్ల యొక్కువ లోకానికి చిరపరిచితులై వుండడంచేత పెద్ద పేరుకలిగివున్నారు. అన్నగారో! అట్టివారుగా లేరు. దానికి యెవరేంచేస్తారు? దాన్నింబట్టి వాల్మీకిమహాకవి ఆ ప్రకారము ప్రయోగించాcడు. అప్పడు మొదలు యిప్పటివరకున్నూ అది అప్రయోజకుcడికి పర్యాయపదమైపోయింది. దాన్నింబట్టి సోమయాజులుగారికి కోపం వచ్చింది. దీన్నిబట్టి యిదిన్నీ సమర్థనీయంగానేవుంది. కానివ్వండి ΟΟΟΟ వికల్పాలకేమి? బులుసువారి వంశంలో అంతా మహావిద్వాంసులే అన్నది మనకు కావలసింది. అందులో వేంకప్ప సోమయాజులు గారు, అధీతిబోధాచారణ ప్రచారణములుగల మహావిద్వాంసులు. ఆ పుణ్యపురుషుణ్ణి గూర్చి అంతో యింతో ముచ్చటించుకోవడంవల్ల మనం కూడా ధన్యులం. యింకా వీరితండ్రిగారిని గూర్చిన్నీ తమ్ములు పాపయ్యశాస్రులవారిని గూర్చిన్నీ వారి కొమాళ్లు ప్రకాశశాస్రుల్లుగారిని గూర్చిన్నీ యెంతో వ్రాయవలసివుంది. ఆ వ్రాయడం ప్రత్యేకించి ప్రత్యేకించి శీర్షికలు పెట్టి వ్రాయవలసిందేకాని “సర్రాజు పెళ్లిలో గుర్రాజుకొకపోcచ” అంటే తేలేదికాదు. కాబట్టి మణివకప్పుడు వ్రాద్దామని యిప్పడింతటితో ముగిస్తూ వున్నాను. ★ ★ ★