కచ్ఛపీశ్రుతులు/సంపాదకీయము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

Prof. S. V. JOGA RAO M.A. ph.D.

Head. Tel. Dept.. A.U.P.G. Centre, Presidnet, Guntur Dt. Wrters' corp. Society, [Formerly Professor, Leningrad University]

            సంపాదకీయము

ప్రరోచన:

  ఒక పుంభావ సరస్వతి ఒక బహుముఖ సారస్వత ప్రపంచ విరించనుడు విని పించిన కవితాకళా కల విపంచీ ముఖ వికస్వర స్వరమ్లను విని పరవిశించిన యొక మహాభాగ్యశాలి మధురహృదయ స్పందనము లీ పలుకులు.
  సంగీత సాహిత్యము లా మహామహుని యుచ్చ్వాస నిశ్వసములు, భక్తి దేహము, భావము దేవుడు, రిజజ్ఞత రూపము, బ్రదుకంతా యొక సుదీర్గ హరికధ. కృత ప్రతి హరికధాకాలక్షేపము సకల కలా విక్షేపము, సరసవతి పేరోలగము. అవడాయన్?ఇంకెవడు! రసవజ్జీవిత మహేతిహాసుడు శ్రీ ఆదిభట్ట నారాయణదాసుడు..అన్నివిద్యల కాచార్యపీఠమైన ఆయనకు గురువు లేడందురు. లేకేమి! జగద్గురువైన భగవంతుని అంతేవాసియైన ఆయన కలవడడని కళ లేదు. సాధ్యముకాని విధ్యలేదు.

దానభారతి:

  జీవితము నొక కాలక్షెపముగా గాక ఓక్ కఠోర వ్యాసంగముగా ఒక కళాకేళిగా ఒక మహతపస్సుగా ఒక మధురానుభవముగా గడచిన మహాబగు డతడు. అతని పండిన గుండెనుండి హాహిరిల్లిన దొక బహుఖీన సాహిత్యము అందు శ్రవ్య డృశ్య కావ్యములు గలవు. హరకధలు గలవు. హరికధలుగలవు. శతకములు గలవు. వ్యాసములుగలవు. విమర్శలు గలవు. పదపద్య గద్యములు వేసిన వాలకము లనేకముగలవు. బహు వైదుష్య ఫలములు గలవు. కాని చిత్రము. అంతటి సారస్వత మహాస్రష్టకు అంతటి కవితాంతర్ద్రష్ఠకు హరికధా పితామహుడుగా మాత్రమే పేరు మిగిలినది. అది శంకరు డంత మహాకవియా, వివేకానందు డంత విశ్వకవియా కాని చివరికి ప్రఫక్తలుగా మాత్రమే వారు లబ్ద ప్రతిష్ఠులైరి. ఒక అన్నమయ్య, ఒక క్షేత్రయ్య, ఒక త్యాగయ్య-కవితా సరస్వతీ కళాస్థానము లంటిన వరసాగ్రేసర చక్రవర్తులయ్యు వీరు మిగిలిన వాగ్గేయకారులుగా మాత్రమే వాసికెక్కిరి. కవి చరిత్ర గ్రంధము లందు వారి పేరులు కానరావు. ఏం? వారి వారి ప్రధాన కర్మ క్షేత్రములు వేరువేరు. అట్లే యైనది ఆదిభట్ల వారి సంగతి. కవిత కారు వారి ప్రధాన కర్మ క్షేత్రము. హరికధ వారి జీవిత సర్వస్వము.

గ్రంధపరికల్పనసముద్దేశము:

   వారి 46 కృతులలో 14 హరికధలు (14 సంపుటములు- 21 కధలు) హరి దాసులు వల్లె వేసి కొనుటయే గాని వానికి సాహిత్య జగత్తున పఠన పాఠనములు లేవు. 13 అచ్చ తెలుగు కృతులు. ప్రాచీనములైన అచ్చ తెలుగు కృతులే తెలుగు వారి కచ్చివచ్చినవి కావు. ఒక యెనిమిది కృతులు కేవల సంస్కృత భాషా ఘటి తములు. అన్యుల గీర్వాణమమునకును హర్షించు ఆంధ్రులు తమ సంస్కృతము నెందులకోగాని అంత వరకు సేయరు. మిగిలిన వానిలో సుమారేడు అనువాదములు. సంసృతము నుండి చేసిన తెనిగింపులను దాసుగారు అచ్చ తెలుగుననే వెలయింతురది వారి శపధము. కాకున్న ఆదినుండి అనువాద సాహిత్యమున కలవాటు పడిన మనవారు కనీస మీకృతుల నైన కాతరు చేయ కుందురా ? ఆయా కారణములచే దాసుగారి సాహిత్యమునకు రావలసినంత పేరు ప్రతిష్ఠలు రాలేదు. కాని ఆ హరికధలలో అపురూపమైన కమ్రకవితా గానముకదు. ఆ అచ్చ తెలుగు కృతులలో వెనుకతి కృతుల కంటెను నెక్కవమైన నియమ మున్నను అతిమాత్రమైన హృద్యమైన వైశద్య మున్నది. సర్వ పూర్వాంధ్ర ఫ్రౌఢ ప్రాబందికుల గాఢపాక మగు సంస్కృతమునకు లేని దని యున్నది. ఆ సంసృతము కృతులలో కింకుర్వాణ గీర్వాములైన ప్రయోగ విశేషములు గలవు. కాళిదాస కళాకౌశలము గలదు కాదంబరీ స్వాదుత్వం గలదు. పండిత శుండాలముల శ్లాఘా శిర: కంప సమర్హ సామగ్రి గలదు. ఆ యనువారములు మూలము మాలిమిని డక్కగొన్న వయ్య స్వతంత్ర కృతి ప్రతి పత్తిని గల్గి నట్లు కౌశల పేళలములై యున్నవి. ఆ యీ యోగృతం కన్నిటికిని తగిన తార్కాణగా ఇదిగో గ్రంధ మిక్కడనే యున్నది.

గ్రంధ స్వరూపము:

  ఈ గ్రంధ మొక సంకలనము. దాసుగారి కవితా సుమారామ మధుకోశము. ఉపలబ్దములగు వారి కృతులను సప్తదా విబాగించితిని--హరికధా సారణి, కావ్య సారణి, శతక సారణి, రూపక సారణి, అచ్చిక సారణి, సంసృత సారణి, అనువాద సారణి యని, ఒక్కొక సారణియందు ఆ యా తరగతుల కృతులనుండి సందర్భ నిరపేక్షముగా సరసార్ధ వ్యక్తిగల చక్కని కవితాంశగల పద్యముల కతివయముల నొక శతపుట పరిమిత సంపుటమునకు మాత్రము సరిపడు నట్లెన్నిక చేసి ప్రతిపాదిక విషయస్వభావమును బట్టి న్యపదేశ మొనర్చితిని. దాసుగారి కృతులనిండ భక్తిమబంధురోక్తులు, సూక్తులు కోకొల్లలు, వానిని త్వరలో "భక్తి సుధ", "సూక్తి సుధ" అను పేరున ప్రత్యేక కృతులుగ దాసభారతి ప్రచురణముగ నెలయించు సంకల్పముతో వాని నెక్కువగ నిందు గ్రహింపలేదు. అయితే గ్రంధాంతర్మున దాసుగరి దౌహిత్రులు కీ.శే. ఉపద్యాయుల సూర్యనారాయణగారు సేకరించిన సూక్తులందు కొన్నిటి నొక అనుబంధముగ చేర్చితిని. మరియొక అనుబంధ్మున జిజ్ఞాసువుల కోసము దాసుగారి జీవితమందలి ముఖ్య సన్నివేశములను వారి జీవిత చరిత్రలను, స్వీయ చరిత్రను, నాటి వార్తాపత్రికలను ఆధారము చేసికొని కాలక్రమనునృతమైన యొక పట్టికగా రూపొందించితిమి. మూడవ యనుబంధమున నారాయణదాస గ్రంధావళి గురించి అవసరమైన నింగడింపుల క్రింద ఆ యా గ్రంధముల స్వరూప స్వభావముల గురించిన స్థూల నిర్డేశము, ముద్రణ ప్రచురణాధికము గురించిన్ వివరములును గలవు. ముందు విషయసూచికలో గ్రంధస్థ సర్వ విషయములు యధోదాహృత క్రమముగ చూపబడి నప్పటికి చివర నాల్గవ యనుబంధమున పాఠకుల్ సద్యశీలన సౌకర్యార్ధము అకారాది విషయానుక్రమణిక చేర్చబడినది. ఆయా విషయముల గురించిన అకరములు గ్రంధ శరీరమునందే తత్రతత్రోచితముగా ఉదాహరింప బడినవి. గ్రంధ శరీరగతములు కావలసిన మరికొన్ని యంశములు ప్రరస్తాత్పరికల్పితములు అనుబంధములకు ముందే "పరిశిష్ట" శీర్షిక క్రింద సమీకృతములు, ఇదీ గ్రంధము యొక్క స్వరూపము.
కవిత్వ పరమార్థము:
   ఇక కవితానుశీలన మించుక, శ్రావ్యమైన శబ్దముద్వారా రమ్యమైన అర్ధమును హృద్వీమైన అనుభూతిగా పరిణమింప జేయునది కవిత్వమని నేనెరిగిన సర్వనిర్వచనముల సారాంశము శ్రావ్యమైన శబ్దము లనగా అనురూప శబ్దజాల పున:పునరావృత్తి యనికాదు. లేక కొందరనుకొనునట్లు ఉచ్చారణ సులభములై తదర్ధశక్తి సందీపకములై ఝటితి స్పుతణకరణ వటువులై వీనులున్న మది కించునట్టివి. రమ్యమైన అర్ధమనగా రాకేందు రేఖకాదు. రాజీవ రాజికాదు, రజనీ ప్రియల్నఖము రమణీ మణి ముఖము కాదు - కవి కనీవికాపునీత మైన యొక నిష్ఠుర కుష్ఠరోగి కృమికుల సంకు లకులాయము కాయము, ఒకంష్టివాని ముదనష్ఠపు మొగము కూద రసజ్ఞజనమనోజ్ఞ ములే యగును. అలౌకిక లక్షణమైన రసానుభవ రహస్య మదే. హృద్యమైన యనుభూతి యనగాఉషస్సుషమానుభగమైన యొక శుభ సమయమున ఉపరితల మరుజాడులు కుండలిత శిలామండలమై, శిఖరాంచలము పద్యోభ్యుదిత బాలభాన్ రోచిర్వీచీ సంజ్జ్వలమై, హమనిర్ఘ రోప క్రమ రమణీయమై కంపట్టు కాంచనగంగాశైల శృంగమును చూచినంత కలుగు సురుచిరాంభూతి కాదు. ఆ మహిమలయమైన హిమాలయ దృశ్యమున కళాంక శేఖరుని జటా విటంకము స్ఫురించవలె. ప్రియ వల్లభయొక్క సల్లలిత సంగీతము విన్నప్పుడు కేదు తదుపరి తదాయల్లక భరమున మన్నప్పుడు మన:కర్ణ కుహరమౌన ఆ మధురస్మృతి మారెలుగిచ్చునప్పు డదీ యనుభూతి. వరుసపెట్టి జిలేబీల నొక యద్ధసేరు ఆరగించినప్పుడు కాదు అపూప విఫణిలో అద్దముల ముందు అందమైన పళ్లరమునందు తీరుగా పేర్చబడిన పలుపేటల కెంపుల డవురుగళ్లీల వలె నున్న వానిని నోరూర కన్నార గాంచినప్పుడదీ గుండియ గుత్తగొన్న యనుభూతి. ఆయా వస్త్వంద్రియ సన్నికర్షము వలన అప్పటి కప్పు 

డేదో యొక లౌకికవాసనా వావితమైన అనుభూతి ప్రతి పశువు క్రిమి కీటకము గూద పొందును. అనుభోక్త మానవుడే కానక్కర ;ఏది/ సర్వ జ్ఞానేంద్రియము లకును సాక్షిభూత మైనది మనస్సు. ఆ మనశ్శక్తి పండిన అదృష్టవంతుడు మానవుడు. అస్మత: ప్రాప్త సంషారముతో, స్వయం కృషి ప్రలబ్ద పరిణతితో, ఆలోచనాశీలమైన మనస్సుతో, నైక బావ వ్యక్తీకరణ శక్తివంతమైన వాక్కుతో పశుప్రపంచము నుండి తన వార్ధక్యమును సార్ధకముగ నిరూపించ్కొని ఏ విషయము నైన ఆత్మసాక్షికముగ అనుభవించ గలవాడు ఆవిష్కతించ గలవాడు మానవుడు. అందుచే అతడు పొందు అనుభూతి మందలో నొకడు పొందినట్లుండ వల. కేవల రుచిజీవి పశువు. అభిరుచి జీవి మానవుడు. దాసుగారి కవితాశములు:

  పూర్వోక్త నిర్వచన పరమార్ధమ్నకు లక్ష్య భూతమైన కవితాపదార్దము కావలసినంత గులదు దాసుగారి కృతులలో, ముందు కవి యన్నను కవిత్వమన్నను ఆయనకున్న ఆశయము లెట్టివోపరిశీలింతము:

        "కవి స్పాక్షాత్త్రయా మూర్తి: కావ్య మేతచ్చరాచరం
        న కశృ ద్వస్తుతో భేద: కార్యకారణయో స్తయో:"
 

ఆని వారి వక్కఱ (చూ.కచ్చపి-పుట 49). కావ్యము లోక మంతటిని లోగొనగలదనియు, కవి వేదమూర్తియైన భగవంతుని వంటి వాడనియు అనగా అతడొక మహారష్టయనియు, కవికిని కావ్యమునకును గల యనుబంధ మనినా భావమనియు అనగా కావ్య మతని అంతరంగ సంతాన మనియు బావము. అంతటి ఆకాశములో లోకబాంధవు డనిపించుకొన్న వాడెట్లు ఏకైక వ్యక్తిగా రాణించుచున్నాడో అట్లే లోకములో ప్రతిభావంతుడైన కవి యొక్కడే పరమ విశిష్డుడుగా పరిగణింపబడుననియు, చతుర్విద పురుషార్ధములకును కావ్యమే ఏకైక సాధన మనియు, సంగీతము పుష్పమైతే సాహిత్యము తత్వరాగ మనియు, ఆస్థికతయే ఫలమనియు కైవల్యమే తద్రవ్ మనియు దాసుగారి యభిప్రాయము (చూ.పుట 49). మరియొకచో ఆయన సత్కవి యొక్క ఆంతర్యము నిట్లు సంభావించిరి. అతడు సర్వరసాత్ముడు, సర్వభూతమయుడు, పరవశ సుఖయోగుడు. చిత్ర సంకల్పభోగుడు, దైవాధీన మన: ప్రవృత్తి గలవాడు గాక స్వతంత్ర రచనానిపుణుడు, దయార్ధ్ర చిత్తుడు, సత్య నిష్ఠ్రుడు, కళాచణుడు అని (చూ.. పుట 79). కవి యన్నను, కావ్య మన్నను ఇంతటి సముదాత్త భావన చేసిన అంతర్యాలు లరుదు. సత్కవి లక్షణము లన్నియు ఆయన తనలోనికి తాను తొంగి చూచుమొని చేసిన నిర్ధేశములే యూని ఆయన నెరిగిన వారందరు గ్రహింపగలరు. సత్కవి తన కావ్య దర్శమున సర్వపదార్ధములను విశకలితముగా ప్రతిఫలింప జెయగలడు. అతని వలె లోక కల్యాణ కరణ్ మన్యుల కసాధ్యము, ఎంత ప్రతిభను ప్రదర్శిచి శైలీలాలిత్యము జాలువార ఎంత రసవంతముగా చెప్పి నను "తారాశశాంకము" వంటి కావ్య మనతావ్యమే యగుననియు వారి ఆశయము (చూ.పుట. 50). ఆశయముకాదు ఆచరణము. తమ పలుకృతులలో వర్ణనల రూపముగను ఉపమద్యలంకాముల రూపముగను, విషయగతముగా తగిన సందర్భములు వచ్చినప్పుడు సరేసరి, ఎన్ని లౌకిక విషయములను వాని ప్రాణస్నాయువులను బట్టి పరిశీలించిరో చెప్పలెము. తమ హరికధాదిక కృతులలో భక్తిసుధలను సూక్తిసుధలను నిక్షేపించుట కాదు దేశమంతయు తిరిగి తిరిగి ఊరూర వాదవాడల హరికధా కాలక్షేపములు సేయుచు నడుమ నడుమ సందర్భములు కల్పించుకొని భగవద్భక్తిని, దేశభక్తిని, సమాజ విమర్శను, భారతీయ భవ్యధర్మనును తన జన్మ కర్తవ్యముగ బావించి ప్రచారం చేసినారు రామదాసుగారు, 8-8-1933 న విశాఖపట్టణమున జరిగిన యొక మహాసభలో "శృంగార సర్వజ్ఞ" బిరుదు ప్రదానమున కర్హులైన దాసుగారు తమ కృత్లందు సలలిత శృంగారమును సముచితముగ పోషించుటయేగాని తారాశశాంకకారుని వలె నెక్కడను ఇంచుకంత మేర మీరిన వారు గారు.

సహజకవితాంజలి:

 "సహజ కవిత్వశాలి" గురించి చెప్పుచు వారు - ఏ వేదబలములు లేక కావ్య దోషముల నుజ్జగించి ఆనందోపదేశములు జనానీకమునకు కలునట్లు జగద్దితముగ కవిత చెప్పుననిరి. "వింతవలె బ్రాత సంగతి న్వెల్లడించు" ననిరి (పుట 60). దానుగా రెక్కువగా చెప్పినవి ప్తాతకధలే. కాని ఆచెప్పుటలో ప్రతి వ్రత్న కధ యందు నొక నూత్న పరిష్కారమును జూపిరి. అసలు కవితలో నున్న రహస్యమే అది:

          "దృష్ట పూర్వా పిహ్యార్ధా: కావ్యే రస పరిగ్రహాత్
           నర్వే ననా ఇవా భాంతి : మధుమాస ఇవ ద్రుమా:"

అవి అలంకారిక వచనము. సహజకవిత్వశాలి యనుటలో వారి యుద్దేశము Poet by temperament - అనగా "Iam a poet in sprite of myself" అని వక్కాణించిన బైరను మహాకవి వంటి వాడని. అసలాయనే ఆ సహజ కవిత్వశాలి. ఏ విద్యా విషయమునను గురువు లేనట్లే ఆయనకు కవితా గురువులును లేరు. ఆయనకు కళలకు భగవంతుడే గురువు. విజ్ఞతకు లోకమే గురువు. కవితకు హృదయమె గురువు. సహజ కవిత్వ మనగా నెట్లుండ వలెనో దాసుగా రెంత చక్కగా చెప్పిరో చూడుడు;

                       గీ|| సాగి కమ్మెచ్చునన్ వచ్చు తీగ కరణి
                           సాలె పురుగు కడుపులోని నూలు వలెను
                           దబ్బునన్ దొర్లిపడు కొందదార మాడ్కి
                          సహజ కవిత బయల్వడ్ నన్నుతి గను.( పుట.49)

ఆయనను లనుపమములు, సత్య వ్రత్యయ స్థాపనాచార్యకములు. ఎట పట్టి చూచినను ఆయన కవిత్వ మలవోక చెప్పినట్లుండును. సహజత్వ ముట్టి పదుచుందును. వ్యానపీఠముసజ్జ బాసికపట్టు వేసికొని గంటముతో కవితాకలకంఠికి గండకత్తెర వేయునట్లుండదు. స్నానశాలలో జలయంత్రపు తుంతుర్వని మేన త్రుళ్ళిన లాడినంత బయల్వెడలు కూపరాగము వలెనుందును. బహుజ న్మాంతరసాంద్ర సంస్కారబలమున ఆయన ఆలవోకగా చేసిన అదరస్పందనము లందును మధురిమలు తొణీకిస లాడుచుండును. ఆపద్యము లా పదము లా కూర్పు లా యూహలు ప్లాస్కునుండి కప్పులోపోసిన కాఫీ ద్రవనవోష్ణతవలె నద్య: స్వాద్యముగా నుండును. సహజకవి. "బ్రతుకున సుంకం బెఱుగక - స్వతంత్ర రాజ్యంలు సేయ ప్రభువు వలె"....పతివ్రత వలె, సత్యవ్రతి వలె నిత్యసంతోషియని యొకచో వాక్రుచ్చిరి (పుట.59) అంత సహజకవిత్వశాలి కనుకనే ఆయన అంత సర్వతంత్ర స్వతంత్రుడాయెను.

          "ఎందుకో పెద్దలు వడిక ట్లేర్పఱిచిరి
            యాట పాటల గొల్వున కనునగువటు
            తెల్లముగ నున్న నలిగిన తెన్ను మాని
            త్రొక్కు బెడత్రోవ నా వంటి నిక్కు బొతు" (పుట48)

అది పెద్దలు నడిచిన క్షుఱ్ఱ మార్గమైనను తన కంత పడదని గడుసుగా సూచించిరి. "మురారే న్తృతీయ: పంధా:" అన్నట్టిదిది. అయితే మురారి గురుకుల క్లిష్ఠుడు కవితా జీవాతువులైన కావ్య హెతువులలో ప్రతిన గరీయసి. అది కవితకు ప్రాణసారము. ప్రతిభా సహకృతమైన సృష్టి నిత్య ప్రత్యగ్రము. ఎప్పటికప్పుడేదో యొక నవ్యసినృక్ష తత్స్వభావ జీవలక్షణము. అందుచే దాసుగారివెలె ప్రతిభా సమగ్రుడైన కవి పూర్వకవి ప్రౌఢ మార్గములుఇ తన కెంత నచ్చియున్నను తన పుంత తా నేర్పరుచు కొనును. జీవితమున మహాజన మార్గానుసరణ మవశ్య ముసాదేయమే గాని సహిత్యమున ప్రతికవియు ఎవరి వారి వారు చూచుకొనుటమె మంచిది. ప్రతిభావంతులైన ప్రాచీన్ మహాకవు లందదు చేసినపని యదియే. లెకున్న కవిజగత్తున వారికొక వ్యక్తిత్వమే లేదు. విశిస్ట ప్రసత్కి యుండరు. దాసుగాగి యూహ యదే.

 ప్రాచీనకవి ప్రతిపత్తి:
 అయితే తృణీకృత బ్రహ్మపురందరుడైన ఆయన దుర్విదగ్దులగు ప్రతిస్పర్ధులకొక పెడవరపు కొర్రువలె గన్పింతురు గాని హద్దుమీరిన యహంకారము గదు వారిది. ప్రాచీనుల మీదను పెద్దల మీదను గౌరవములెని గర్విష్ఠులుకారు. తన "జగజ్యోతి" కి తాను వ్రాసికొన్న పద్య పీఠికలో--

          "కావ్య రచనకు వాల్మీకి కావలయును
            తగును వ్యాసు డొకండె శాస్త్రంబు దెలుప

       శక్తి లేమి నెఱిగియు లజ్జ న్దొఱంగి
        వేత్తవలె పటియించెద విదిశమున."
అనియు, ఈ 'కచ్చపి ' 58 వ పుటలో--
       "కాళిదాసుని రఘువంశ కావ్యము గను
        గొనియు, భవభూతి నాటకమును జదివియు
        బాణు గద్య మరపియు గవనము జెప్ప
        వెఱవ డద్దిర నా వంటి వెఱ్ఱివాడు"

అనియు తన వినీతిని మనస్సాను వివిస్రృత మధురాభిరుచి ప్రవంతిగ కొనిరి. ఇంకను పలుకృతుల పలుతావుల వారి కవితాభిరుచులు కొన్ని ప్రకటితములైనవి, ప్రహ్లాద చరిత్ర పీఠికలొ--

      పూర్వ కవు లందరున్ గ్డు పూజ్య లందు
      భాగవతు లయి గోస్తనీ పాకముగను
      గృతు లొనర్చు నధికుల సంస్కృత్మున జయ
      దేవు దెనుగున బొతనం దెలిసి యెంతు"

నని చెప్పుకొనిరి. మరికొన్ని తావులగూడ వీరిరువురను ప్రశంసించిరి. దాసుగారికి వీరిపై నేదో ప్రత్యేకమైన మక్కువ యున్నదన్నమాట. దాని కింకేమి కారణమై యుండును! ఆయిరువురు నీయన వలెనే జీవనమును కవనమునను పరమ భాగవతులు, ద్రాక్షాపాక రిరంసువులు, అంతేగాక కడు పిన్నటనుండియు పోతన పఠన ప్రావీణ్యమునకు బహుమతి నందిరి. ఉపరి పోతనయ్హు నీయనయు సహజ పాండిత్యధురీణులు, అంత్యప్రాస స్రవణులు, ప్రవీణులు, జయదేవుడు నీయనను మధుర సంగీత మధితాంతరంగులు, వెరసి మువ్వురును పరమతవుక పట్టభద్రులు, ఈయన కించునట్టి మరియొక జగదేక మహాకవి గలడు. "షెక్సిపియరుని వంటికవి నభూతోనభవిష్యతి" అనియు "తన కావ్య దర్పణంబున జగము నెల్ల జూసిన మహానుభావుడు భరతీయులలో వ్యాసుడు, ఆంగ్లేయులలో షేక్సిపియరని నాయభిప్రాయము" అనియు తన 'నవరస తరంగిణి పీఠికలో ఢంకా బజాయించి చెప్పిరి. కాళిదాసు కంటెను షెక్సిపియరు నధికునిగా సంబావించిరి. దానికి కరణము షెక్సిపియరు కవిగదచ్చక్షు నగుటయేకాదు--'షేక్సిపియరుడు సహజ పండితుడు. స్వతంత్ర కల్పనా చతురుడు. పరుల కట్టుబాట్లకు లొంగక యదేచ్చగా గావ్యంబు లొనర్చెను. మఱియు బెక్కు శబ్దములను విజేచ్చాను పాఠార్దంబుల వినియోగించెను. కాళిదాసు ప్రాచీన నిబందనముములకు లోబడి కృతులొనర్చె." (చూ.శ్రీనారాయణ దాస వ్యాసపీఠము - పుట 163) ఈయన కచ్చివచ్చిన గుణములే షెక్సిపియరులో నున్నవి. అందులకే ఈయన కలత వచ్చినా డాయన.

సదసత్కావ్యవివేచనము:
 ఆషేక్సిపియర్కాళిదాసుల రసపోషణ విషయమై తాము రచించిన బృహద్గ్రందము 'నవరస తరంగిణి ' పీఠికలొ సదసత్కావ్యముల్ గురించి తెల్పుచు దాసుగారు. "మనసున కింపగు శబ్దార్ద సమూహము కావ్య మనదగినది. అనుటకే శబ్ధార్ధసమూహంవలన్ మనసున కుల్లసం గలిగి సత్కర్మాచణమున కుత్సాహము కల్గునో యట్టిది సత్కావ్యము. జనులకు భయ శోక జుగుప్సా క్రోధ ముల బుట్టించి దుర్మార్గమునకు బురికొల్పునది యనత్కావ్యము." అనియు, అందులోనే కవిత్వ ముఖ్యలక్షణమును, ప్రయోజనమును విశదీకరించుచు, "రసము చెడనీయక యమపుష్టిగ చెపుట, సందర్భశుద్ధి గల పదప్రయోగము, స్వతంత్రముగ కధను గల్పించి యపూర్వ మగు నూహంఅ దెల్పుట, అతుకుంచక పద్దెములల్లుట, పండిత పామర రంజకముగ మృదుంధురోచిత శబ్దంబుల న్బొందు పరచుటయు కవిత్వమున ముఖ్యాంశములు, సర్వసాధారణానుభవమును యధీచితంబుగ దెల్పి జనుల హృదయంబుల కెల్ల రస ముప్పతిల్లం జేసి నీతి న్బోదించుటయే కవితకుందగు ప్రయోజనము" అని యుద్ఘాటించిరి. వేరొకచో "ఖ్యాతిమీర మంచి కావ్యమున్ విరచించి కవి తాను తరించి లోకమున్ దరింపించు" ననిరి. తమ ప్రహ్లాదచరిత్ర పీఠికలో - అంధప్రాయమైన పూర్వ ప్రబందను కరణమును గర్హించిరి. ప్రౌడకల్పనల అనువృత మగు క్రిష్టబావనా మార్గమును విరచించిరి. వైశద్య మనుపేర పేలవత్వము ప్రదర్శించుటను తెడడిరి. (చూ. కచ్చపి. పుట 18) లోకవు మానిసులలో తలచినట్లు చెప్పువారును, చెప్పినట్లు చేయువారును మిక్కిలి యరుదు. యరుదైన వారిలో మిగుల నరుదైనవరు భావితాంత:కరణ శిరోమణి దాసుగారు. ఆయన ప్రకటించిన కవితాశయము లెల్లె ఆయన కవిత కవశ్యము చెల్లును.
ఒక మధురాశయము:
తమ దైన మరియొక మధురాశయమునె భంగ్యంతరముగ సారంగధర నాటకమున నిట్లు సూచించిరి:

    సీ॥ చిఱుణాలపై జలజలబాఱు సెలయేటి
             నీటిపై లకుముకి దాటు జూచి
         నానాట నలవాటు బూని మెల్లన జేర
             వచ్చు జింకల కూర్మిపాలు జూచి
        మడుగుల జెఱలాడి బెడిదపు బొడ్డుల
              బోలియించు నేనుగుపోటు జూచి
       దువ్వి ముద్దుకొనుచు దొడ్డపులుల తోడ
             నాటాడు చెంచెత నీటు జూచి.
      వర్ణణము చేయుచున్ భూరి వనములందు
      బలురకంణుల పిట్టల పలుకులకును
      స్వరము గట్టుచు జెట్టుల పట్టలందు
      పద్యములు వ్రాయ బాగ్యంబు పట్టు నెపుడు!"
      

అసలు దాసుగారి వింత నివర్గ మధుర ప్రకృతిని, బహుళ కళ సురభిళాత్ముని జేసినది వారి యభిజన మజ్జాడ నావరించిన సువర్ణ ముఖీ సజీవ స్రోతస్వినీ పరమరమణీయ పరివర ప్రకృతి ప్రకృతినవిత్రిని రసప్రసువుగా బావించిన ఆ మహానుభావు డా తరంగిణి సముత్తంగ తరంగముల గముల గలగలలలో తీరస్థ నానీర వికుంజ కికీదివి నంకుల కింకరాత సమరకళా హళాహలి కలిత లలిత కల కూజీతములలో వినిపించిన సంగీత సరస్వతీ కచ్చపీశ్రుతులను కనిపించిన కవితా సరస్వతీ దరహాసములను తన కళాభిరుచి వికాసమునకు పంచకరువుగా గ్రహించెను.

దాస కవితా దర్శనము

కవిత్వ మహత్వము:

  దాసుగారి నిర్యాణనంతరము 29-1-1945 తేదీ ఆంధ్ర పత్రికలో శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు "గానమునందు వలెనే కవిత్వమునందుగూడ శ్రీదాసుగరికి విశిష్టస్థాన మీయక తప్పదు" అని వక్కాణీంచి యుండిరి. ఆ విశిష్ట్య మెట్టిదియో యధావకాశముగ పరిశీలింతం, ఏ కవికైనను అతని సాహితీవర్గమునకు ప్రధానములైన యుపాదులు నాలుగు; ఊహాశలిత (Imagination), అనుశీలనము (Observation), విషయజ్ఞత (Information), అనుభవము (Experience), కవి సామాన్యుడైతే అత డే విషయము నే యుపాది నాశ్రయించి ఆవిష్కరించు చున్నాడో తేలిపోవును. అదే మహాకవియైతే అతడు సర్వమును అనుభూతి సాక్షికముగనే ఆవిష్కరించినట్లుడును. అయితే మహాకవియును సామాన్యకవి వలె సంఘోపజీవియే. ఇరువురికి అనుభవ పరిమాణమునకు నొక అవధి యుండును. అతడెంత మహాకవియైనను తత్కావ్యగత సర్వవిషయములు నతని అనుభూతి పరిదిలోనివే యైయుండుట కవకాశములేదు. కాని యతడు ప్రతి విషయమును తన ప్రతిభాప్రకర్షమున మనశ్చక్షువు ముందు సాక్షాత్కరింపజెసి కొని అంతస్సన్నిధి చేసికొని తా ననుభవించినట్లుగనే ఆవిష్కరించును. అందులకే సామాన్యకవుల వాక్కులు చెవెకెక్కవు. మదికించవు. అందు పేలవత్వమే గాని మార్ధవ ముండరు. కాఠిన్యమే గాని మనృణత్వముండదు. మహాకవుల వాక్కులు పద్యోహృద్యములు సహృదయ నైవేద్యములు. శక్తి మంతులు, అర్ధగంభీరములు, చిరస్మరణీయములు. లోకమున శృంగారమును పొషించిన కవు లెందరు లేరు? అందులో నెందరు కాళిదాస భట్ట బాణ జయ దేవామరుకుల చాయలకు రాగలరు? అట్టి మహాకవులును కాక వట్టి సామాన్యలునుగాక మధ్యస్థముగా మరియొక కోవ కవులుగలరు - విగగ్దమాత్రులు, తరచు మన మెప్పులకు పాత్రులైన కవులలో ముక్కాలు ముంవీనము వీరే. సామాన్యకవుల చేతిలో ఇత్తడిగూడ పుత్తడియగును. ఇదే భేదము, ఆకోవకు జెందిన మహాకవులలో కోటికి పడగెత్తిన వాడు నారాయణ దాసు, ఏమందురా: --

తరువోజ|| తొల్లింటి వారు చదువుకొని టెల్ల
                    తోడివారలకు బెంద్రోవ జూపుటకు,
              మళ్లి పుట్టేడు తెవుల్ మాన్పించు మంచి
                  మందిచ్చి నిచ్చలుం బ్రతికించ్ కొఱకు.(కచ్ఫపి-పుట 49)

భారతీయుడైన మహాకవియే అనగండీ మాట.

      "ధరణిం జీకటివేళ దవ్వు వెలుగున్ దర్శించు కందోయికి
      న్మఱి యే వస్తువులైన దోచనలు విన్ ద్యావించు నవ్వాని క
      ద్దిర యీ లోకవికారముల్ మరి రవంతేనిం గనన్రావుగా
      అరయంగా దన జీవితంబున మహత్మా! సూర్యనారాయణా!
                                                 (లత్చపి- పుట58)

    అమరన్ బంగరునుండి దాని దగు చాయన్ వేఱుసేయంగ శ
    క్యము కానట్టుల నిజ్జగల బెడవరా దయ్యారె విన్నుండి: ద
    క్రమునం గొణము రీతి వారయగ నీత్రైలోక్య మేసరి నా
    శము నీ యందున జెందుచుండు పరమెశా! సూర్యనారాయణా!
                                                 (కచ్చపి. పుట 58)

ఆ ఊహలలో నున్నది మహత్వము. వాని నుచితోసమముగ విన్యసింఛుటలొ నున్నది కవిత్వము.

 ఊహవైభవము:
  దాసుగారి సముదాత్తమైన ఊహవైభవ మాయన సర్వకృతు లందును దర్శన మిచ్చుచునే యుండును. ఆ వైభవ సాంద్రత నొక్కచొ సందర్శింప వలెనన్న నిందలి సంస్కృత సారణ్ యందలి 'తత్త్వదర్శనము ', 'భక్త హృదయము ', 'ఈశ్వర తత్త్వము '. ఆదర్శ పురజనులు ' అను శేర్షికలు చూడదగును. అయితే తదవగాహనకు తాదృశచక్షువు కావలసి వచ్చును. ఆ ముప్పదికి పైబడిన శ్లోకము లందు ఉదారోహలేకాక ప్ర్తి శ్లోకమునందును కవితా కల్యాణి కటాక్షము లైన ఒక అలంకారమో, చమత్కారమో లెని శ్లోకమే లేదనవచ్చునుజ్. భావసంపద యందు ఆయన యెంత సంప్రదాయ విధేయుడో అంత సర్వతంత్ర స్వతంత్రుడు అభ్యుదయభావుడు: ఎంత ప్రాచీనుడో అంత నవీనుడు. ఎంత పారమార్ధిక చింతకుడో అంత ఐహిక లోకజ్ఞడు. తన భక్తి దృక్పధమును స్థాపించు కొర్కు శాస్త్రములను, కర్మకాండను అవతవములను, ద్వైతాద్వైతములను, జ్ఞాన మార్గమును గూడ కాదనుటకు వెనుకాడలేదు. (చూ.కచ్చపి. పుట 58), క్రతు విరాసమును కంఠోక్తిగాచేసిన సందర్భముంకు కచ్చపి - పుటలు 30,31 చూడుడు. పూర్వోక్త పుటలందే దాసుగారి కెంత సత్యదయా ప్రత్యయబుద్దిగలదో తెలియగలదు. "ఆదర్శ పురజనులు ' ఖండికలో పరమ నవనాగరిక భావనను జూడగలము. ఆ సందర్భము లన్నిట ఆయన వ్యక్తిత్వము చక్కగా ప్రతిఫలించినది. కవియొక్క సముదాత్త వ్యక్తిత్వము కళాత్మకముగ వ్యక్త మైనప్పుడే అక్కడ కవిశ్వముండును, మహత్వముండును. ఆయన శతకము లన్నియు సార్ధవముగ ఆయన వ్యక్తిత్వవైశిష్ట్యము నభివ్యక్తమొనర్చినవి.
  ఈ కచ్చనీ శ్రుతులను బట్టి వారి విశిష్టోహలను, పటిష్టాభిప్రాయములను క్రమానుసార నుదాహరింతును. (పక్కనున్న యెంకెలు ఈ గ్రంధమునందలి పుట లను సూచిందును). వారి యిష్ట మొక మతమునకు పరిమిత మైనది కాదు. సర్వమత సామరస్యమును, సర్వ మానవ ప్రపంచ సౌభ్రాత్ర, సహజీవనములను కంఠోక్తిగా కోరుకొనిది (1) పరిణామవాదమును విశ్వసించిరి. అయితేవ్ వానిని దశావతారము లలో ముడిపెట్టిన వీరి ప్రజ్ఞ ప్రశంసనీయము (4-5), పరిణామ వాదమున కట్టి సమన్వయము చేసిన వారిలో వీరేవ్ మొదటివారు. ఇది గజేంద్రమోక్షణ హరికధలో. తద్రచన 1886 లో నగుణోపాసనను సమర్ధించిరి. ఆ సమర్ధనమును సార్ధకము చేయుటకై వీరు ప్రతిపాదించిన ఔసమ్య మపురూపమైనది (5), ప్రభోధవేళ దాసుగా రొక ఉత్తమాచార్యులు. ధర్మదేవతాంశ వారి నావహించును. (9-11, 16-21). లోకము యొక్క నాస్తిత్వము గురించి చెప్పునపుడువారి కైవారమును గనుడు:-

      కం॥ కలిమి గల వాని - లేమిన్
            గలవాడెటు లాశ్రయించి కలిమి దెలుపునో
            తెలియుడు లేని జగం బిది
            యెలయన్ సర్వేకు నొద్ద నున్నటు తోచున్ (15).
      గీ॥ కలదనిన లేదు, లేకున్న గలదు జగము
            నభమునందున గన్పడు నల్సుమాడ్కి. (24)
          

ఏ రూపమునన్ కడకు యెజ్ఞరూపమునను పశుహింస పనికిరాదని వారి దృడవిశ్వాసము (30,31,36,38), విద్య గురించి యొక విశిష్టదృక్పధమును ప్రదర్శించిరి (42, 37) తన కాలేజీ అద్యాపకుల యెడ ఆయన ప్రకటించిన గురుభక్తిఅత్యపూర్వము (62-63), వీరి దేశభక్తి అనుపమానము (37, 44, 52) వీరి స్వరాజ్య కాంక్షకు, ఆదర్శస్వరాజ్య భావనకు ఆ శర్లావిగా నడచిన తారక కావ్య మంతయు తార్కాణయే. కళాకౌశలము గూర్చి వీరి యూహ లపురూపములు.

       "ఆటపాటలు మప్పుట కలవికాదు
         ముక్కు సెవులట్లు మెనితో బుట్ట వలయు"

నందును, పెద్ద లేర్పరచిన పడికట్లు మీరుటకు తాను తెగించితినని తెల్పిరి. భగవత్ర్పవక్తి లేవి కళాస్థితిని విరపించిరి. పరోపకారమే రాని పరమ ప్రయోజన మని యుద్గాటించిరి (46-49). వారి మహాభక్త హృదయమును పలుతావుల తిలకించి పులకించ వచ్చును కాని యొక ప్రత్యేకతకై 57-59, 60, 61, 72-73 పుటలు పరికించి పులకించవచ్చును కాని యొక ప్రత్యేకతకై 57-=59, 60, 61, 72-73 పుటలు పరిశీలింప దగును. అయీ సందర్భములందెల్ల భావమున నుదాత్తత యున్నది, భాష యందు వైశద్య మున్నది, ఏదో యొక రూపమున కవిత్వపు కలాయి ప్రత్యక్ష మగుచునే యున్నది.

   దాసుగారి సర్వసారస్వతమును పరిశీలింప నక్కర లేకయే వారి 'మేలుబంతి ' యను చాటు ప్రబంధమును, ఈ కచ్చపీశ్రుతులను జూచిన చాలు వరి యూహ పరిధిలోనికి రాజాలని వస్తుగని, వారి వాక్కుచే చైతన్యచకచ్చకితముగాని భావముగాని యుండబో దనిపించును. అంతర్ద్రష్టయైన కవి యూహ కగమ్యమైన దేముండును:  "ఈకవి: క్రాంతదర్శీ" అని కదా ఆర్యోక్తి.
 వర్ణనా వైదగ్ధ్యము:

    "నానృషి: కవి రిత్యుక్త మృషిశ్చ కిల్ దర్శనాత్
      విచిత్ర భావ ధర్మాంశ తత్త్వప్రఖ్యార దర్శనమ్॥
      వతత్త్వ్ దర్శనాదేవ శాస్త్రేను పఠిత: కవి;
      దర్శనా ద్వర్దినా చ్చాధ రూడా లోకేకవిశ్రుతి:॥"

అని కావ్యకౌతుక కర్త తౌతలిట్టు సేలవిచ్చినాడు. అనగా ఋషి కానివాడు కవి కాలేడు. దర్శనమువలన ఋషిత్వ మబ్బును. చిత్రవిచిత్రభావములను , ధర్మ సూక్ష్మములను గ్రహింపగల ప్రజ్ఞయే దర్శనము. తత్త్వదర్శనము కవి లక్షణములలో ముఖ్యమైనదని శాస్త్ర్రములు చెప్పుచున్నను అది వర్ణనా సహకృత మైనప్పుడే కవి శ్రుతి లోకవిరూడిని పొందుచున్నది. అందులకే--

   "తధాహి దర్శనే వ్యచ్చే విత్యే ప్యాదికవే ర్మునే:
     నొదితా కవితా లోకే యావజ్జాతా సవర్ణనా॥"

ఆదికవి వాల్మీకి యెంత అంతర్ద్రష్ఠయైనను ఆయన వర్ణనా నిపుణుడగు నంతకు కవితలోకమున ఆవిర్భవింపలెదు. మన ఆదిభట్టు ఎంతటిద్రష్టయో ఉపరి నిరూపించిరిని. ఆ ఋషికల్పుడు "వర్ణనా నిపుణ: కవి:" అను ఆబాణకమున కెంతపట్టు లక్ష్యబూతుడో పరిశీలింతము, వర్ణన యనగా రసభావ ప్రాంగణ రంగవల్లిక, దాసుగారు హరికధ చెప్పుచున్నప్పుడు సరేసరి అదియొక సద్యోహృద్య రసామభవ సమారాధన. ఆ సంతర్పణములం దెన్ని వర్ణనా వ్యంజసముల నెంత యెడుపుగా వడ్డింతురో చెప్పనలవికాదు. కనీస మమన్యూత కధాసూత్రముగల ఆయన కృతులను పఠించినను పఠిత యొకపాటి బావుకుడైనజాలు ఆ వర్ణనలవల్ల నగు కిట్టుబడి పదివేలు. ప్రకృత మీ 'కచ్చపీ 'యందలి వర్ణనలు కధాతంతువునుండి చూపిన విడిపూసలు. విడిపూనలేగని విలువకు మణిపూసలు.

ఉదా॥ 1. చూ. పుట్ 2.కృత్తివర్ణన. పోతనగారి సంక్తి యొరవడిగ నుర
           డించిన యా వర్ణన భయానకరసభావ నముద్దీకరముగ
           నున్నది.
       2. చూ.పుట 6-చంద్రోదయము:
              "ప్రొద్దుజ్ పండుటాకు పోలిక రాలె గెం
              ణాయ చివురు లెత్తె గోయిల లన
              జెలగి కవిసె చీకటులు, పూచె జుక్కలు
              సెవి చందమామ పండు తోచె."

ఫలతరూపమ మగు నిట్టి యపురూపమైన చంద్రోదయ వర్ణన అంత పండువెన్నెల కాసిన్ మన ప్రబంధసీమలం దేందును నాకు కానరాలేదు. పరిశష్ఠము పుట 3లోగల చంద్రోదయ వర్ణన ప్రబంధ సాధారణధోరణి నున్నది. 64 వ పుట-చంద్రాస్తమయ వర్ణన యందు భంగ్యంతర వస్తువ్యంగ్య మున్నది.

   3.చూ.పుట 6-సరోవరవర్ణన, తిక్కనవలె సమాంప్రచుర రచన విషయమున పిసినారి యీయన, కాని పోతనను వలచి పెద్దనను తలచి యీ పద్యము పద్యమంతటి నేకసమానధాటిగా నడిపించెను.   5.గ్రీష్మత్తు వర్ణ్నమునే కాదు కడమ ఋతువులను గూడ అలంకార్ చారువులుగా నుంచిరి దాసుగారు. వసంతవర్ణన స్వభావో క్తి సురభికముగ నున్నది. (పుట.34), తొలకరి వర్ణనలో (పుట 41) చక్కని యువనులు సందించినవి. "దూది పింజెల లాగు దొడ్డంబ్బుల నేకి కరువలి పఱువులుగా నొనర్చె" నట! మెఱుపుతో పుట్టిన యురుము వెండిచలుకును బోరగింబడ వేసినట్లున్నదట! పెనుగాలి సవ్వడి వానకాళ్లు అను తీగెలను బిగించి యాఱవ పడిలో వీణ వాయించు నెఱజాణయొక్క పాటవలె నున్నదట. ఈ ఔషమ్యము దాసుగారి అనుభవపు టనుగు బిడ్డ. అర్దోవర్ణన (పుట. 52-54) యందున్న పద్య్హములన్నిట ఉపమకును స్వభావోక్తిని పోటి పెట్టి యొక గొప్ప వినోదప్రదర్శన గావించిరి. ఆంధ్ర వాజ్మయమున ఋతువర్ణన బాహాటముగా నలుగురు నడిచిన బాట. ఆ బాటలో క్రొత్తగ చిరుపచ్చికయు మొలకెత్తుట కష్టము. కని ఆ బాట యందును దాసుగారి ఊహల యల్లికలు నవమల్లిక వల్లికలు, "న కావ్యార్ధ విరామోz స్తి యది స్వాత్ర్పతిభాగుణ:"
  6.పుట 7. "జలధులు రోమకూపములు, శల్యము లద్రులు..." ఇత్యాది విరాడ్రూనవర్ణనమున ఆ మహా మహోమూర్తి స్వరూపచిత్రణము "అలతి యలతి తునియల గహశ సంధించిన విధమున" నున్నది. సువర్ణ దుర్గామహాదేవి యొక్క విశ్వరూప తునియల గహళ సంధించిన్ విధమున" నున్నది. సువర్ణ దుర్గామహాదేవి యొక్క విశ్వరూపణము నందు (పుట 32) అలంకారవిస్పురణము మరీ అందగించినది.
 7. పురవర్ణనలో రకరకముల చమత్కారములకు దాసుగారి చాటుప్రబంధము.. "మేలుబంతి"ని చూడదగును అందు 21 పుటలలో 34 నగరముల ప్రశంస గలదు. అందుండి యిందొక త్రిపురముల వర్ణన గ్రహింపబడినది (44-46). చతుర్భాషాసీనమున సాగిన పీఠికా పురవర్ణన లోగడ కడు ప్రసిద్ధమైనది. ప్రలోభపడి పలు పత్రిక లా పద్య్హమును ప్రకటించుకొన్నవి. నీలగిరి వర్ణనలో నింకొక చమత్కార మున్నది:

   "వేసని యెండైన బ్రియమగురుండు ని
    ల్లాలి చూపుల పోలయల్క మాడ్కి
   హితమయ్యెడు నకాల హిమ పాతమయ్య వి
            మందలి యువాసమటు"

ఇట్టి అలంకార చమత్కారము లందలి సార మెరుంగుటకు కొంతైన నొంటబట్టిన యనుభవముండవలె. మైసూరు పురవర్ణన మొక సంస్కృత దండకమున కందగల సమాసములతో కడు చక్కగా సాగినది.

  8.సౌందర్యము, అనురాగము, వాని ఆత్మబంధువు శృంగారరసము - ఈ మూటికిని దగ్గరి చుట్టము దాసుగారి హృదయము, అనుభవసిద్ధులైన రసుకులు వారు, "శృంగార సర్వజ్ఞ" సార్ధక బిరుద ప్రతిగ్రహీతలు, ఆ విషయములందు వారి చూపు డేగచూపు పలుకు పావురా పలుకు. జగన్మోహినీ సౌందర్య ప్రస్తనమును (పుట 19) తానుగా జేసినప్పుడాయన ప్రకటించిన అభిరుచి యెట్టిదో పరికింపుడు. "చిరుగుంట కల్గినచెక్కిలి", 'ముక్కు ప్రక్క మొదలు మోని మూలవఱకు పోల్చాడు వంక ', 'హోయలుగ బల్పాలు నొకవంక గనుపర్చు విన్న నవ్వు ', 'పడుమ జక్కని నొక్కు తొడరిన గడ్డము పొలుపు ' - అనీ ఆయన కించునట్టి సోయగౌ వాయనముల, ఆయభిరుచి జీవితమున బహువారములు బహుర్ంగుల సుందర ముఖారవిందములను బహిరంగముగా చూచుట మత్రగాదు అంతరంగపు మెత్తని పొత్తిళ్లలో భావన చేసిన రసిక రాధికా ప్రియునిది గాని సామాన్యునిది గాదు. జగన్మోహినితొ శివుని పలుకులుగా నున్న సీసపధ్యమున (వరిశిష్టము -) వారిరువురికి చెలువమున గల పోలిక చమత్కార చారువుగా నిరూపింప బడినది. అంతేకాదు. జగన్మోహినీ సంబుద్ధులు నాల్గుపాదాంతము లందును - సారంగ గమన, సారంగ నయన, సారంగచికుర, సారంగ పాణి అని యున్నవి. ఆయన యెట్లును సారంగధరుడు గదా, అంత సారంగోపమ యైన యామెతో- 'నీవు నాకు దక్కుటయే యుచిత" మని శివును భావన వ్యజ్యమాన మగుచున్నది. సావిత్రీచరిత్రమున సత్యవంతుని సౌందర్యము "పుంసాం మోహన రూప:" అను తీరున మనోహరముగ వర్ణిటము (కచ్చపి పుట 33,34), సావిత్రీ సత్యవంతులకు తొలిచూపులొ వలపు తొలకరించిన విధము మనోజ్ఞ వర్ణనావసరము:

            "సలలిత పాదాంబుజాతంబు లందున
                 గొదమ తుమ్మెద కనగూడునట్లు
             బాసుర నిమ్ననాభీ సరోవరమున
                 గండు బేడిన జోడు కలియు భంగి...."

ఇత్యాదిగ సాగిన వర్ణనమున వారి ఆపాదమస్తక పరస్పరాకర్షణ చిత్రణము కవి సమయ కలితముగ క్రమనవిద్ధముగ అలంకార చతురస్రముగ నున్నది. సీతా సౌందర్య దర్శనమున- 'కుండ్రని చెక్కిలిపై జెలునొక్కు సొగసును వారు మరచిపోలేదుగాని యింకొక సొగసైన లక్షణమును దర్శించిరి.

               "కొప్పు నిలువబడి విప్పినన్ నీలి గా
                     జాల మతారము పోల్కి తెలగు నేల"
                            -----------------

కరుణికి తలిదండ్రులు పెట్టని సొమ్ము, దమ్మిల్లము, రసిక పురుషుని చపున నాకర్షించు రమణీమణి యాస్తిలో నదియొక ముఖ్యాంశము. అందులకే "కేశసంపద" యని దానికొక పెద్దపేరు. మదనాయుధ పూరామందిర మది. కమినీ కాముకుల రతి కౌతుకము పరాకాష్ట నందినప్పుడు పరస్పర కేశస్పర్శ సౌఖ్యానుభవ మొక సంభోగ రహస్యము. అందుచే కబరీ ప్రశంస లేక కాంతవర్ణన మనర్యాప్త మగును. ఈ రసజగద్రహాస్యము లెవ్వియు దాసుగారికి తెలియనివి కావు. అందును విప్పిన కొప్పునకు వారి నీలిగాజుల మలారము పోలిక అశ్రుతపూర్ఫము. రాముని చూడ్కుల చెలిమి దోడ్కొని యేగు చేటనలగు ' ఆమె చూపు లురుల నీనుచున్నవట! అనగా నీలమేఘశ్యామ డగు నతని నా చూపులు సర్వాంగీణ పరిష్వంగము చేసి మందాక్ష మధురొహోదోహలము లైన వని వ్యంగ్యము. (చూ.పుట్లు. 11,12), ఆ సీతారాముల పరముగా వర్ణితములైన నవవధూవర చేష్జలతొ గబ్బిసిబ్బితి యెల్లగ ఉల్లమునుండి పెల్లుబుకుచున్న వల్లమాలిన మక్కువ చిత్రింపబడిన వైనము మనోజ్ఞము (పుట. 26) దాసుగారు తమ మిత్రులు సోమంచి భీమశంకరంగారి శృంగార సంగీతము నతి చమత్కారముగా నాలపించిరి. (51-52)ఆ పద్యము లేడును నొక మధుర హృదయ విపంచికపై పలికిన మహిరాను రాగ శుభశ్రుతులు. శంకరంగారి వలపుకత్తె వక్షోజములట తమ భారమును భరించు నడుముపై అనుకంపమాని దాని ప్రకంపమునకు కారణభూతములైనవట, శంకరంగారూర కొందురా? తగిన శాస్తి చేసిరి. వానికి నలక్షత దంతక్షత మర్ధనాదిక వివిధ శిక్షలు వేసిరి. ఇట్టి వర్ణనలు చేసిన దాసుగారు మాత్రము తమ ప్రాయపు ప్రాహ్ణమున అట్టి పారువత్తెము లమలు జరిపి యుండరా!

 అలంకారసంపద:
   మామూలు మాటయొక్క కవితాంగత్ర్సవేశమునకు కవాటము నొనరించునది అలంకారము. అయితే ఆ అలంకారము రసోసస్కారకం, ప్రకృతార్ధమబోదకము, ప్రకృతార్ధసుబోధకము. చమత్కారజనకము అయితేనేగాని కవితాసరస్వతి దానిని పూర్తిగా కటాక్షించదు. ఇంచుమించుగ దాసుగారి ప్రతిపద్యము చదువరి పెండ్లికొడునకు సాలంకార కన్యాదానమే. ఆం దలంకరముల పై పద్యము గలదుగాని దాసుగా రుపమకు తాళిగట్టిరి. అది యొక శైలూషి యని ఆప్పయదీక్షుతులవారు సెలవిచ్చిరి. దాసుగరు దానిచేత గీయించిన వాలకమ్లు ఆడించిన ఆటలు చూచినచో చట్టున కాళిదాసు జ్ఞప్తికి తగిలి తను అతడు తెలుగువాడు కాడులే అని యటుంచి- "ఉపమా ఆదిల్భట్టవ్య" అన్నదే మాట యనుకోందుము. ప్రతి యూరకవియు మనములు వాడు వాడేకదా మరి మాతనిదేమి ప్రత్య్హేక్త ! అనిపించును. పదిమందిదిష్టి తగిలిన పడుచుపిల్ల యొక్క నితో కన్ను గిలిపిన దన్నచో అది వాని యక్కటి యోగ్యతకాదా మరి. అన లీయువను అలంకార ప్రపంచమున పరమ ప్రాచీనమైంది. ఋగ్వేదమునందును దానికిరూడమూలమైన స్థితియున్నది. ఆదికవి కడ షాష్టాంగపడిన దామె.భరతాచార్యుని పరిగణనమునందునుజ్ దానిదే అగ్రతాంబూలము. అంతేగాక అప్పయదీక్షితుల వారి వక్కణ ప్రకార మది సర్వాలంకార బీజభూతమైనది. అందుచేతనే అలంకారములలోదానికంత ప్రాముఖ్యము తద్విన్యాసమున నిరుపమానమైన విపులత ప్రదర్శించు శక్తి సిద్దించుటకు కాళీదాసత్వమే నిమిత్త్ము కానక్కరలేదు నారాయణదాసత్వము వలనను అది సిద్దింపగలదు. నిపుణతతో బాటు దాసవజ్మయమున ఉపమకధిక ప్రాచుర్యమును గలదు.

ఉదా॥ 1. భగవంతుని కొలత్(పుట 27):
          సి.వలయరేఖకు బోలె నశమె తెల్పగ నీ
                  కాది మద్యాంతము లప్రమేయ:
            ఎల్ల జగంబుల కీవె యాధారము
                  లెక్కలు కన్నింటి కొక్కటి వలె
            పెరుగవు తరుగవు విభజింపబడవు శూ
                 న్యాంకము వలె సకలంకచరిత ।

ఏవంవిధ గణితోపమాన మపూర్వము. ఆయువములకు దగినట్లా సంబుద్ధులు సాభిప్రాయములు.

      2. కుంభకర్ణుడు (పుట. 28)
           సి. నంజకెంజాయచే నంజనాచల మటు
                   కాని దుస్తుల నీలకాయ మమర

సౌందర్య దర్శనమున- "కుండ్రని చెక్కిలిపై జీఱునొక్కు సొగసు"ను వారు మరచిపోలేదుగాని యింకొక సొగసైన లక్షణమును దర్శించిరి.

       "కొప్పు నిలువబడి విప్పినన్ నీలి గా
             జుల మలారము పోల్కి తెలగు నేల"
                           -------

తరుణికి తలిదండ్రులు పెట్టని సొమ్ము, ధమిల్లము, రసిక పురుషుని చప్పున నాకర్షించు రమణీమణి యాస్తితో నదియొక ముఖ్యాంశము. అందులకే "కేశసంపద" యని దానికొక పెద్దపేరు. మదనాయుధ పూజామందిర్ మది. కామినీ కాముకుల రతి కొతుకము పరాకాష్ట నందినప్పుడు పరస్పర కేశస్పర్శ సౌఖ్యానుభవ మొక సంభోగరహస్యము. అందుచే కలరీ ప్రశంస లేక కాంతావర్ణన మనర్యాప్త మగును. ఈ రసజగద్రహన్యము లెవ్వియు దాసుగారికి తెలియనివి కావు. అందును విప్పిన కొప్పునకు వారి నెలిగాజుల మలారము పోలిక అశ్రుపూర్వము. రాముని చూడ్కుల చెలిమి దోడ్కొని యేగు రేటవాలగు ఆమె రూపు లిరుల వీచుచున్నవట! అనగా నీలమేఘశ్యాము డగు నతని నా చూపులు సర్వాంగీలు పరిష్వంగము చేసి మందాక్ష్మదురోహాదోహలము లైన వని వ్యంగ్యము. (చూ.పుటలు 11,12) ఆ సీతారాముల పరముగా వర్ణితములైన నవవధూవర చేష్టలలో గలినింబృతి యెల్లగ ఉల్లమునుండి పెల్లుబుకుతున్న వల్ల మాలిన మక్కువ చిత్రింపబడిన వైనము మనోజ్ఞము (పుట.26). దాసుగారు తమ మిత్రులు సోమంచి భీమశంకరంగారి శృంగార సంగీతము నతి చమత్కారముగా నాలపించిరి. ()51-52) ఆ పద్యములేడును నొక మధుర హృదయ విపంచికపై పలికిన మహితాను రాగ శుభశ్రుతులు. శంకరంగారి వలపుకత్తె వక్షోజములకు తమ భారమును భరించు నడుముపై నుకంపమాని దాని ప్రకంపనమునకు కారణభూతములైనవట. శంకరంగా రూర కొందురా? తగినశాస్తిచేసిరి. వానికి సలక్షత దంతక్షత మర్దనాధిక వివిధ్ శిక్షలు వేసిరి. ఇట్టి వర్ణనలు చేసిన దాసుగారు మాత్రము తమ ప్రాయపు స్రాహ్ణమున అట్టి పారువత్తెము లమలు జరిపి యుండరా!

అలంకారసంపద:
  మామూలు మాటయొక్క కవితాజగత్ప్రవేశమునకు కవాటము నొనరించుల్నది అలంకారం. అయితే ఆ అలంకారము రసోనస్కారకము, ప్రకృతార్ధసుబోధికము. చమత్కారజనకము అయితేనేగాని కవితాసరస్వతి దానిని పూర్తిగా కటాక్షించదు. ఇంచుమించుగ దాసుగరి ప్రతిపద్యము చదువరి పెండ్లికొడుకునకు సాలంకార కన్యాదానమే. అందలంకారముల వైవిధ్యము గలదుగాని దాసుగా రుపమకు తాళిగట్టిరి. అది యొక శైలూషి యని అప్పయదీక్షితులవారు సెలవిచ్చిరి. దాసుగారు దానిచేత వేయించిన వాలకములు ఆడించిన ఆటలు చూచినచో చట్టున కాళిదాసు జ్ఞప్తికి తగిలినను అతడు తెలుగువాడు కాడులేఅని యటుంచి-

"ఉపమా ఆదిభట్టవ్వ" అన్నదేమాట అని యనుకొందుము. ప్రతి యూరకవియు నుపమలు వాడు వాడేకదా మరి యీతనిదేమి ప్రత్యేకత ! అనిపించును. పదిమంది దిస్టి తగిలిన పడుచుపిల్ల యొక్కనితో కన్ను గిలిపిన దన్నచో అది వాని యొక్కటి యోగ్యతకాదా మరి. అసలీ యుపమ అలంకార ప్రపంచమున పరమ ప్రాచీనమైనది. ఋగ్వేదమునందును దానికిరూఢమూలమైన స్థితియున్నది. ఆదికవి కడ సాష్ఠాంగపడిన దామె. భరతాచార్యుని పరిగణనము నందును దానిదే అగ్రతాంబూలము. అంతేగాక అప్పయదీక్షితుల వారి వక్కణ ప్రకార మది సర్వాలంకార బీఱభూతమైనది. అందుచేతనే అలంకారములలో దానికంత ప్రాముఖ్యము. తద్విన్యాసమున నిరుపమానమైన నిపుణతాప్రద ర్శించు శక్తి సిద్దించుటకు కాళీదాసత్వమే నిమిత్తము కానక్కరలేదు నారాయణదాసత్వము వలనను అది సిద్దింపగలదు. నిపుణతతో బాటు దాసవాజ్మయమున ఉపమధిక ప్రాచుర్యమును గలదు.

ఉదా|| 1. భగవంతునికొలత (పుట21):
               సీ. వలయరేఖకు బోలెవశమె తెల్పంగనీ
                        కారి మధ్యాంతము లప్రమేయ !
                   ఎల్ల జగంబులకీవె యాచారము
                        లెక్కల కన్నింటి కొక్కటి వలె
                   పెరుగవు తరుగవు విభజింపబడవు శూ
                       న్యాంకము వలె నకలంకచరిత!

ఏవంవిధ గణితోపమాన మపూర్వము. ఆ యువనులకు దగినట్లా సంబుద్ధులు సాభిప్రాయములు.

       2.కుంభకర్ణుడు(పుట 28)
               సీ.సంజకెంజాయచే నంజనాచల మలు
                   కావి దు స్తుల నీలకాయ మమర

   ఇరుగడ మేరుశిఖర మినచంద్రుల
        వలె దల కుండలంబులు వెలుంగ
   క్రొమ్మెఱుంగులతోడి క్రొక్కారు మబ్బట్లు
        తారహారముల నెద విలిసిల్ల
                    ................

'ఘంటా మాము 'ని కైవాడమును దలపించుచున్న నీ యవనులు.

      3.రెప్లెక్టరుంబోలె రెట్టి జేయును నైజ
           మగు తెల్వి దీపంబువంటి విద్య (42)
'దీప శిఖా కాళిదాసు ' రూపునకు దీటుగా నున్నదీ సంక్తి.
      4. వల్లంబువంఖ: బ్రవర్తించె నీ ర్విశే
             ష్యం జాడ జను విశేషణము భంగి...

ఇత్యాదిగా సాగిన ప్రానృద్వర్ధనమున వ్యాకరణశాస్త్ర మర్యాదా సంవాదియైన యనమ దాసుగారి శాస్త్రరాసిక్యమునకు గుర్తు (పుట.53)

       5.పానగోష్టి నెమ్మివలె గొన్ని కాల్వలు
          వాన కురియ నంతవఱకు దోచి
          వంకశేషము లయి యింకెడున్; మఱికొన్ని
          మన్నునపుడు సుజనమైత్రి బోలు.

దాసుగారి దెంత లోకజ్ఞత! వట్టి లోకజ్ఞతయేనా! ఏమైన అనుభవముగూడ నున్నదా? యన్నచో పెన్నెల అప్పుడప్పుడు భంగును, బ్రాందీని సేవించినట్లు వారే స్వీయచరిత్రలో వ్రాసుకొనిరి. వానికి చిన్నగురువులే, మరి వేర విద్యాగురువులు లేరు. ఆ ఉపమేయోపమముల అనుబంధ మర్ధనరీశ్వరము.

  6. పుట 55-58లో అలకనారాయణ గజపతి ప్రభువు టెన్నిసుక్రీడను, పప్పు వెంకన్నగారి పాటను వర్ణించు పట్టునను, 30వ పుటలో శోకహత లోకము గురించి యున్న పద్యములందును అనుపదమున కవి పొదిగిన యవనులను పరికించితిమేని అపర్జ్యవిషయముల అంతరస్నాయవుల యెడను వారు సారించు సునిశిత పరిశీలన క్షమమైన చూపును గుర్తింపగలము.   7.శ్రీహరి కధామృతములో నొకవో మాయావృతుడైన మూఢ మానవుని అద్దములోని తన నీడతో తాను పోరు నిచ్చుకతో మనమించుక చతురముగా నున్నది.(కచ్చపి. పుట 77)"-

   స్వచ్చాయాం దర్పణే పశ్యన్: యుద్యతే చటకో యధా
   మాయాయాం స్వం వీక్షమాణ: । తధా మూఢో విముహ్యతి॥

చత్రభరపోని మరపించుచున్న దీ పోలిక దాసుగారి యవనులు కొన్ని ఉపరి వర్ణనా వైదగ్ద్య ప్రకరణ్ంఅమునను ప్రసక్తములైనవి. ఎప్పట్టున జూచినను వారి యనమ లెక్కడనుండియో తెచ్చిపెట్టుకొన్న ఎరవుసొమ్ములవలెగాగ స్వీయస్థిరాస్తి యైన లోకజ్ఞత నుండి తీసి వాడుకొనుచున్నట్లుండును.

 ఉపమ దాసుగారి కుంపుడుఇఅత్తెయైతే స్వభావోక్తి సహధర్మచారిణి . ఉన్నట్లు చెప్పిన స్వభావోక్తి యగునేమోకాని అది అలంకారముగాదు. అందులకే "స్వభావోక్తి రసౌచార్రు యధాపర్వస్త వర్ణనమ్" అన్నారు విద్యానధులైన పెద్దలు. స్వభావోక్తిని విన్యసించుటకు మిక్కిలి లోకాలోచన జ్ఞానము, అందు చారుత్వము నిక్షేపించుటకు సౌందర్యతృష్ణ కావలె. ఇందులకు లక్ష్ల్యములుగ దాసుగారి యీ పద్యములను గమనింపదగును:

    "ఆకైన నల్లాడనీక దిగ్భంధన
        ముగ గాలి చెమ్మటం బొదవె నుక్క....
    "ఉడుకెత్తి పాదులన్ మడిగిన నీడలు
         చల్లగ దూర్చున సగుచుండే...(పుట. 11)

ఇంకను నవవధూవరచేష్టలు (పుటలు 25-26), అమని (34), శ్మశానము (36), శివుని ముసలి వాలకము (పరిశిష్టము-3), తాటకాగమనము (23) మున్నగు సందర్భములు చూడనగును.

  మూర్తపదార్ధమునేగాక అమూర్తమైన వట్టి భావమునుగూడ గ్రహించు శక్తి ఛాయాగ్రహక యంత్రమున కున్నచో దాసుగారి కృతుల వనేక చాయాచిత్రములతో అచ్చువేయవచ్చును. చిత్రకారుడైతే మాత్రము దాసుగారి భావముల నాశ్రయించి కృతకృత్యుడు కాగలదు.
  దాస కవితాలంకారములలో తృతీయ స్థానము రూపకముది. వైదేహి దాశరధుల వనవాస రాజభోగము (26), సువర్ణ విశ్వరూపము (32), విజయ లక్ష్మి వివాహము (36) వారి రూపక వైఖరులకు తగిన తార్కణలు. ఉపమ వేసిన వేరొక వాలకమే గదా రూపకము. ఉపమా నిరూపణమున నిపుణుడైన కవి రూపక విపుణు డగుటలో నాశ్వర్య మేముండును? ఉపమెయమునకు తగిన తూకములో నుండవలె నుపమ. ప్రబంధకవుల నరు కెక్కువగా ప్రాచీన కవి సమయముల పాతరనుంది తీసినది. దాసుగారి మన మనుగడ పరిధిలోనిది. మన కనునిత్య పరిమిత మైనది.
  కడమ యలంకారములకు దాన వాజ్మయమున విరశ ప్రచారము, హరికధలలో వచనములందు కాదంబరీ గద్యలోవలె శ్లేష, విరోధాభావము మున్నగు వాని కెక్కువ వినియోగము గలదు. ప్రకృతము 'కచ్చపి ' నింది మరి కొన్నిటి నుదాహరింతును:-

     సీ॥ కందున్న పున్నమ చందురు గాదంటే
                మో వీని మోమున కుపమ యేది?
          అబ్జము ల్వాడు నటన్న నిక్కంబోయి
                కగు నెచ్చట విదర్శనాతిశయము?
         ఏన్గు తొండమ్ము లిస్సీవంక ల్న వీని
                హస్తమ్ములకును దృష్టాంత మున్నె?
        మరి యనంగుల డగు మరుని కితని తోడ
               సకియతో నుంతైన సమ మదెట్లు?

ఇందు ప్రతి పాదాంతకమునను సందర్భ సహజముగా పేర్కొనబడ్డ యవమరు లలంకారవాచకములు. తత్తదలంకారములకు వర్ణ్యముపట్ల నిరవకాశ మనుచున్నాడు కవి. అందుచే అనవ్య స్ఫూర్తి గలదు కాని యది వాచ్యముగా లేదు. ధ్వనికమైనది. ఇదో సొగసు. ఇంచుమించిట్టివే జగన్మోహినీ మూర్తి చిత్రణ్ పద్యము (19). అర్ధాంతర వ్యాస విన్యాసము తత్ర సందర్భోచితముగా నున్నది.

ఉదా॥ 1. విఘ్నేశ్వర ప్రార్ధన (2):-
            కోరికల కడ్దు దగిలెను వారిలోన
            గొప్పవాడవు గాన నిన్ గొల్వవలనె
            అడ్డు దగిలెదువా డెక్కువైన యప్డు
            వేడుకొన కేమి చేయుదు విఘ్ననాధ!

ఇందలి హృదయంగము చమత్కారము గమనార్హము.

     2.దేశభక్తి ప్రబోధము(52):-
        మనడూ శక్తియైకమత్యము బొందక
        యలతి సగతునైన నడచు టేట్లు?
        లెన్పునందు బడక రెండు జాముల యెండ
        కడగి దూదినైన గాల్చ గలదె !

అది యొక విధముగా ప్రతి వస్తూవను ప్రతిన త్తివిగూడ గల్గియున్నది. 51 వ పుట యందలి..."అమిత విజృంభణంబు లలరా తగునా సుజనాళి కెప్పుడున్" అను పద్యమున అర్ధాంతర న్యాసము హేతూత్ప్రేక్షతో చెలిమి చేసినది. హేతూత్ప్రేక్ష కింకొక చక్కని లక్ష్యము;

      విశ్వేశ్వాభిషేకాయ । సతి బాగీరధీ ఇలే
      కాశ్యాం కో మాం వాంచతీతి । నారికేలో నజాయతే (77)

సాగర తీరమున కైదామడలు పైబడిన ప్రదేశములందు కొబ్బరి మొలకెత్తదు. దక్షిణ దేశమునందేగాని యుత్తరేదేశమున అది యుండదు. అందుకే దానికి 'తెంగాయ ' అనిపేరు. కాశీనగరమున కొబ్బరికాయ లేక పొవుటకు కారణ మట విశ్వేశ్వరాభిషేకర్ధము గంగాజల ముండుట చేతనే నట!

    ఉల్లేఖము గూడ దాసుగారి వాక్కున సంకుత్పుల్ల మైనది:
    ఉదా॥ 1. మహీజాదరొష్ఠ ప్రవాల్/ఎzగ్ని చ్చటాభా
                పురద్విడ్డను: కాననేzగ్నిచ్చటాభా
                సకృత్కొళికాంఘ్రి స్ధితాzంబోజ తుల్యా
                చకాస్తే న్మ తే దృక్ ప్రభో రామచంద్ర: (74)
ఇట నుల్లేఖము ఆర్ధికోసమా బీజభూతమైనది.
        2.సౌర స్యాగ్రేzరుంధతీన: మధ్యే సౌదామనీ యధా
           ఆధస్తాతి పాంచాలికేవ । కాశ్యాం బాతి కులాంగనా॥(77)

కాశిలో కులాంగన మేడచివర నున్నప్పుడు కనీ కనిపించనట్లుండును, నడుమ మెరునట్లు తోచును, దిగువ నున్నప్పు డొక బొమ్మవలె నుండునట. ఆ సామ్యములు దామె పాతివ్రత్యమహిమ, నపుర్ఫర్చస్విత, సాలంకార వివిభాంగ సౌష్టవము ధ్వనితములు. ఆ కులాంగనా తేజ॥ స్ఫూర్తికి భిన్నస్థల కాలావస్థ అభ్యంతరములు కా ననియు కవి హృదయము, శ్లేష దాసుగారి కంత రుచించదు గాని వారి శ్లేష మనకించక పోదు.

   ఉదా॥ చక్రభ్రమణ కరత్యా త్కుదృష్టిభి ర్ధూరం వర్జమానతాత్
          శ్రుత్యస్త ఖేవ్లవర్వాత్ మశక! త్వమేన మాధవం మన్వే(52)

మశకమునకు మాధవోపమ ! కవి కన్ను గురించి, లేఖిని గురించి షెక్సిపియరు చెప్పిన మాటలు గుర్తు వచ్చును. (చూ. Midsummer Night's Dream - Act V., Sc.i)

            "నీ జడన్ జూచినన్ జెలువఱేడు స్పురించె"
ఇత్యాది పద్యములో (పరిశిష్థము-పుట 1) స్మరణాలంకారము గలదు
        బలం దోరనం బాలకానా" మితి త్వం
        విధన్ మాం సమాశ్వాస యాతీవ మూఢం...,
        తులాయాం నమం దర్ధురాం స్తోలయేచ్చేత్...
ఇత్యాది శ్లోకములలోను (74, 75),
       "పాముం జావదు కఱ్ఱయున్ విరుగ దన్ వార్తాను సారంబుగా"

ఇత్యాది భావ సంపన్నులైన దాసుగారికి శబ్దాలంకారము నేడ మమకారము గానరాదు. అయితే యెందులోగాని "యమక పుష్టిగ చెప్పుట" నొక కవితా ముఖ్యాంశముగ పేర్కొనిరి. ఆ పద్దతి వారి హరికధలందలి మంజరులందును కీర్తనలందును గలదు. అందలి వచన రచనలందు కడమ శబ్దాలంకారము లెడనెడ గలవు. హరికషలు సభ కుద్దిష్టములు. శబ్దాలంకారములు పద్య సంబారంజన సమర్ధ ములు. వారి పద్యమురచనయం దవి సకృత్పతిరములు. ఆం దెక్కవగా దోసునది పోతనగారి యెరవడిని బడిన అంత్యానుప్రాస. మొదటి నాల్గు సారణులందు గల 188 పద్యములలో సుమారు ముప్పదింట నీలక్షణము గలదు. ఎక్కడను కక్కుర్తి కనిపించదు. ఉపరి అర్ధస్పూర్తి కతిమాత్ర దోహదము చేసినది. ఉదా॥ పుట 51:-

  ధనమా రాదు, దురాశ పోదు, పరతత్త్వజ్ఞానమా లేదు. కృ
  ష్ల్ణునియందా మది నిల్వబోదు, సుమబాలు న్నోర్వగారాదు, ని
  న్నెనయన్ లోకములోన వారు, విరహం బిల్లుండగానీదు, పా
  ప్లవ వంశంబు స్వతంత్ర మీదుచెలియా!వాంచల్ తుదల్ముట్టునే?

కోరిక తీరదాయె, నిను గొల్సున జూడగ దూరమాయె, నీ
వారికి భారమాయె, సుమబాణుని వైరము ఘోరమాయె, నీ
నేరువు నేరమాయె, మఱి నిందలు నాఱులు మాఱులాయె, నా
పేరున లోపమాయెగద భీత మృగాక్షి : యికేమి వ్రాయుదున్.

ఇందు తిరుపతి వేంకటకవుల బాణీ స్పురించినది.* స్తుత్యమృత్యుంజయము"ఖండికలో (21-23) ఎనిమిది పద్యము లందును అంత్యానుప్రాసస్ పకడ్భందుగా పడి వాని స్తోత్రధర్మమున కుత్కర్ష కల్గించినది.

 శై లీలాలిత్యము
  శైలి యనగా శాబ్ఢిక చంద తాండవము కాదు, సమాన వ్యాయామ వైయూత్యముకాదు. రసభావసందర్భములకు తగిన్ రచనా విన్యాసము. అటుగానిచో అది శైలికాదు. ధోరణి, సహృదయ పాఠకులకు చవిగొల్పి వానిని సద్య: స్వాద్యము చేయుట శైలియొక్క పరమ ప్రయోజనము. కావ్యజగత్తున నైకవిధ శైలీ మార్గమనుకౌనుట పొరపాటు. వారివారి వ్యక్తిత్వము లందులకు ప్రధాన నిమిత్తములు, ఒకని శైలియందలి జీవలక్షణము జటిలత యగును. ఒకనియందు ప్రౌఢి యగును. వేరొకనిది లాలిత్యము, ఇంకొకనిది పేలవత, దాసుగారి శైలియొక్క స్వభావజేఎవముగల వారి కది తగియున్నది. లాలిత్య మనగా సర్వత; ప్రసన్నత. ప్రసాదగుణము మహాకవిత్వ లక్షణములలో నొకటి. అదికావ్యమైన రామాయణము రచనా రామణీ;యములోని రహస్వమదే. కాళిదాసాదుల కవితాకళాకీలక మదే. మురారిభట్ట ప్రభృతులు వచ్చి స్వకీయ గీర్వాణముతో సార్వజనీన గీర్వాణ కావ్యశైలిని మరి
 • "ధనమా పోవును, మానమా చెడును...." (శ్రచ్వణానందము) రచన 1837.

"వేసవి డగ్గరాయె, మిమువీడుతకున్ మన సొగ్గదాయె...." (ఆత్మకూరు సంస్థానమునకు మొదటిసారి ఆ 1897 లోనే వెళ్లినప్పుడు చెప్పినది.) చూ. జాతకచర్య - పుటలు 100-101. దాసుగారి పద్యములు రెండును ఆయన ఏలూరు వెళ్లి నప్పుడు సోమంచి భీమశంకరం గారి వేశ్య నుద్దేశించి చెప్పినవి. దాసుగారిది తన 24 వ వంశమని స్వీయ చరిత్రలో స్పష్టముగ చెప్పిరి. వారి జననము 1884. అందుచే ఆ సన్నివేశకాలము 1888. యొక మార్గమును పట్టించిరిగాని అత:పూర్వము లలితమార్గమే దానికి స్వతస్సిద్ద మైనది. వాల్మీకిలోగాని కాళిదాసులోగాని సుదీర్ఘ సమాసము లెన్ని చూపగలము? శబ్ధాలంకారముల నెన్ని యేరగలము? స్వభావత: దాసుగరి దా మహాకవుల మార్గమే. అయితే దౌర్భాగ్యవశమున గీర్వాణ గిరాంధురంధరులు, శబ్దజాల జాంగలి కులునైన మన ప్రౌఢ ప్రాబంధిక గంధ గజేంధఘటల పాండిత్యవీర విహారముల ఫలితముగా జటిలపద పటాతోపము, సుదీర్గ సమాసముల సాముగరెడీలు గల బంధమున కలవాటు పడిపోయి మన సాహిత్యద్రస్థలు చాలమంది తాదృశబంధము తతంగ మున్నదానినే ప్రౌఢకావ్య మనుకొనుటయు, లేని దానిని కాదనుకొనుటయు జరుగుచున్నది. తస్మై నమ: పాభవరాజ్ముఖాయ.

  పొతన మీది ప్రీతిచే అనుప్రాసములు, సమాసములు మున్నగు వాని విషయమునే ఆ పోకడలు కొన్ని పోకపోలేదు దాసుగారు.

ఉదా॥ కృత్తి యొక్క ఆవిర్భూతి. (2):-
         అభ్రంలిహాదత్ర విబ్రమభ్ర భ్రమ
             కృనీల దీర్ఘశరీర మమర
        ప్రళయ కాలావల ప్రభను జక్రీకృతే
             క్షణముల రౌద్ర మక్షయము గాగ
        త్రైలోక్య కబలనొత్సాహ సూచక ఘన
             వక్త్ర త్రయోగ్రత వాసికెక్క
        బళ్పుబర్భర కేశ సాకారుణ ప్రభా
             కాల సంధ్యారాగ కాంతి దనర

ఇందు ప్రధమ పాదము యధాతధముగ పోతనగారిది. మిగిలినవి దాసుగారివి. పోతన గారి పోలిక కొంత వచ్చినద్.

2.నరసింహావతారము (15):-
      గంభీర భీకర గర్జారవంబున
          బ్రహ్మాడఖాండ కర్పరము నగుట
      చటుల పటాచ్చటా చలన సంజాత ప్ర
          చండ వారాహతిన్ గొండ లెగయ

    కాలావలాభీల కీలాభ జిహ్వా ప్ర
         భావళిన్ జగమెల్ల జేవురింప
    తరుణేవ్ందు భాసుర దంష్ట్ర వలచ్చాయ
         లలమి దిక్కులకు వెన్నెలలు గాయ

3. వక్రవిక్రమము (వరిశిష్టము.పుట 2):-
        సీ॥ భూరి భూత్కార సంభూత గంభీర గుం
                 భద్వానమున శైలపంక్తి నడక

ఇందును పోననత పొటమరింపక పోలేదు.
    4.సరోవర వర్ణన (6)"-
 చ॥చనిచని కాంచె మల్లవిత చారుపయేరుహ సన్మరంద భా
     దన మద మత్త బంభర వితాన రస ప్రతిమాన గాన మా
     ననియమితోరు భంగ పలువాద మృదంగ రవానుకూప్ల చ
     క్రవివహరావతాళ రసరమ్య విశాల నర: ప్రధానమున్.

5.వీరాలాపము (38):-
ప్రగ్దర॥కఠిన జ్యాఘోష మాశాఘన కరటి ఘటాకర్ణముల్ ప్రక్కలింపన్
పికర ప్రోద్బూట దావాగ్ని వివిద పరరాణ్ణీరసాగాళి గాల్పన్
జతరీ భూతారి సూత్నోష్ణ రుధిర మదినోన్మత్త భూతలంబు లార్వన్
వితరుల్ స్తోత్రింప్[అ నన్మద్విజయ యశము దిగ్భిత్తులను వెల్ల విఅతున్
 6.స్తుత్యమృత్యుంజయము (21):-
శా॥ గౌరీ చిత్త సరోజ భృంగ! త్రైజగత్కల్యాణదాసాంగ! నం
      సారద్వాంత పతంగ ! మూర్ధ విచలత్స్వర్గాపగా భంగ! కే
      యూరప్రాప్త భుజంగ! సుర్ధిత బలోగ్రోద్దండ మాతంగ : తా
      రారాట్ప్రజ్వలితోత్తమాంగ : లలితార్ధ స్వాంగ : మృగ్యుంజయా:
    

ఈ మూడు పద్యము లందును దాసుగారి శబ్ద ప్రభుత్వ, సమానగ్రధన కౌశలములతో పాటు పెద్దవారి ప్రబంధకవు లనేకుల పోకడ కన్పట్టును, అసలు దాసుగారి కీ పద్దతి ససేమిరా సహజమైనదికాదు. అయితే ఎంత వద్దనుకొన్నను కడు పిన్నటనుండి బాగవత ప్రాణి కావునను, తానెనేక భాగవత కధలను హరికధలుగా రూపొందించిన వాడు కావునను దాసుగ్రి కా ధోరణి యొక్కొకపుడు నెట్టుకొని వచ్చుచుండున్. అది కాదాచిత్కము. అసలు ధోరణి యిది:

  మ॥ ష్మిత పూర్వాన్య సరోజ, మున్నత భురాశ్లిష్టంబు, నాజామలం
        బిత బాహుద్వయ, మబ్జ నిర్మల శిరోవేష్టంబు, సత్యామృతాం
        చిత వాక్పూర, మఖండవక్ష, మరులుస్పీతంబు శిస్యాళి బ్రో
    వుత మంచున్ గురు చంద్రశేఖర మహామూర్తిన్ సించెదన్(43)

నిక్కచ్చిగా చెప్పవలయు నన్నచో విరియకాదు దాసుగారి ధోర్ణి, సంగీతమున్ ఆయన బాణీ కెట్లొక ప్రత్యేకత యున్నదో అట్లే సాహిత్యమునను నున్నది. ఆ బాణీ ఆయనవలె తెలుగును వలచిన తిక్కన ఫక్కికి కొంత యిరుగు పొరుగుగా నుండును. తిక్కనగారివలెనె యాయనయు సాధారణముగ స్మనము నాశ్రయింపక ఉడుమువలె నొక యెడుపును బట్టుకొని చెప్పదలన బావమెల్ల చేవదేరునట్లు రచింతురు.

ఉదా॥ హనుమద్వి క్రమము (28):-
   సీ॥ ఉబికితి వేవి వస్తోర్ద్వ లోకంబులు
           గిరగిర సుడివడి తిరుగుకున్నె
      త్రొక్కితి వేవి యధోభువ్నము లెల్ల
            దట్టముగా నట్టగట్టాకున్నె
      ఊదితినెవి మహోదరు లన్నియుం
           జిఱుతుంపురై మింట జెదర్కున్నె
      గ్రుద్దితివేవి మేరుధ్రాధరంబైన
            మఱి తుమురై మచ్చ్ మాయ కున్నె
      సత్యవ్ంకల్పుడవు మనోజవుడ నీవు
      కామ రూపి వప్రతిహత గతిని నీవు
      నీ మహత్వ మొకింతయు న్నీ వెఱుగవు
      గాని హనుమంత ! నీవు సాక్షచ్చివుడవు.

ఇందొక చక్కని సమతతో గూడిన యెడుపు గలదు. ఆయెడూ చిక్కని యర్ధస్పూర్తికి గట్టినది. ఒక్క హనుమ ద్విక్రమ పరాజయ్య వస్తువాచక శబ్ద ములే సంస్కృతములు గాని కడమ వన్నియు తేట తెలుగు మాటలే. ఉదాహృత పూర్వములైన - "ధనమా రాదు, దురాశపోదు--", కోరిక తీరదాయె, వినుగొల్పున జూడగ దూరమాయె....."ఇత్యాదిపద్యములు నిట్టివే భీష్మ ప్రతిజ్ఞ, భీష్మవంగ్రామము (పరిశిష్టము - 8, 7 పుటలు) సీసపద్యములు నిట్టివే. ఇదే అసలు దాసుగారి బాణి. లోకములో అందరి కవితలలోను శైలి యుండదు. లోకము చేసుకొన్నపుణ్యమును బట్టి కొందరి కుండును. అదరికిని వ్యక్తిత్వ ముండునా? పదిమందిలో తొమ్మండ్రు నిర్గుణ ప్రబ్రహ్మలుందురు. దాసుగారు సగుణ పరబ్రహ్మెయే. వట్టికన్నుతొ చదువుకొనువారి కొక్కొకపుడు వారిశైలి తేలి పోయునట్లనిపించును. అదిపద్యముగానీ గద్యముగానీ సంగీతానువగు దాసుగారు తదుచ్చారణ కూపిరి పోయుదురు. ఆయన హరికధలందు గద్య చదువు నొడుపు విన్నవారు మరచిపోలేరు. ఒకపాటి సంగీత శ్వాసగల మనసుతో చదినినచో వారి పద్యములందు హృద్యమైన శైలి సర్వత్ర గోచరించును. గద్య శైలి య్ందును వారి వ్యక్తిత్వ ముద్రను గాంచగలము. (చూ.వ్యాస పీఠము). అందు కాదంబరీ మర్యాదలు మరికొన్ని గలవు. గీర్వాణమునందును దానవాణి వాల్మీకి వ్యాస కాళిదాస బర్తృహరి ప్రభృతుల అవగాభావపటువు లైన సరళహృదయుల అపేలవ వాగాలింత మైన లాలిత్యము డక్కగొన్నది.

    ఉదాహృత శ్లోకములు పరిశీలింపుడు.

భాషానుషమ:

   ఒక సధవ యైన సంస్కృతాంధ్ర కళాశాలాద్యక్షురాలికి క్రొత్తల్లుడు ఆమె కాంగ్లము రాదనియేకాక తెలుగున జాబు వ్రాసిన తెగ మురిసిపొవునని యెంచి అసలుత్తరపు టెత్తుగడయే పగడగా నుండవలెనని "గంగా భాగీరధీ సమానురాలైన అత్తకామణికి" అని ప్రారంభించెనట. అది చూచుకొన్న యామె మిక్కిలి వెక్కసంపడి కుక్కకాటుకు చెప్పుదెబ్బ కొట్టవలె నని తలపోసి అల్లువానికి తగిన తాదృశములైన పురుషసంబుద్ధులు తన యుభయభాషా పాండిత్య పరిణాహమున నెచ్చటం గానక విసుగెత్తి చివరకు--"నేను గంగాభాగీరధీ సమానురాలను కాను కాని మీ భాషాయోష ట్లున్నది" అని రెండుముక్కలు గీకి పారవైచెను. అంతట "నేను కెవలము పవిత్రతాగౌరవము నుద్దేశింక్ష్చి యట్లు వ్రాసితిని. కాని మీ సమాధానము నాకు సంతోషాశ్చ ర్యములను కలిగించినది" అని తిరుగు టపాలో ఆమెకు సమాధానము వచ్చినది. అట్లున్నది మన తెనుగుయొక్క స్థితి. సంస్కృత సాహచర్యము లేనిచో అది వట్టి ముండమోపి తెలుగు. ఆకల్తీ యున్నచొ నదే మనకు పరమ పావన మైన తెనుగు, ఇదీ వరుస, అల్లావాని యర్ధమును తన కావ్యభాష యందు సార్ధకము చేయ సంకల్పించిరి దాసుగారు. వెనుకటి 'సంస్కృత ప్రాకృత సమేతరం బయిన భాష అచ్చ యనంబడు ' నెమోగాని 'అచ్చా ' యనిపించుకో లేదాయె: దానికితోడీయన తదృవములను గూడ పరిహరించి కేవల దేశ్యాంధ్రమునందే దానికి 'నాటు తెలుగు ', 'సీమపలుకు ' అను పేర్లు పెట్టి అందు పలు కృతులను, ఒక అపూర్వ నిఘంటువును వెలయించిరి. (వివరముల కిందలి 3వ అనుబంధమును చూడనగును).

          "మొలక లేతదనము, దలిరుల నవకంబు,
           మొగ్గ సోగదము, పువ్వు కాని
          తేనె తీయదనము, తెనుగుననే గాక
          పరుష సంస్కృతాఖ్య భాషకేది?" (62)

అవి తెనుగు యొక్క సౌబదు చెప్పుట గాక సంస్కృతమునకే యొక పెటకము పెట్టిరి. చరమపాదమున "మోట లాతి నాటు మాటకేది?" అవియు మరియొకచో పాఠాంతరమును వెలయించిరి. తెలుగన్న యంత మమకారము తిక్కన్నకును లేదేమో ! అసలు చాలమంది అచ్చతెలుగు కవులును అందు కావ్యము వ్రాసి సలుగురినీ మెప్పించుట యొక గొప్పగా బావించిన వారే కాని వారే యందును ఇంత వల్లమాలిన మక్కువ గలవారుండరేమో! పాల్కురికి సొమనాధుడొకడు "తెలుగు మాట లనంగవలదు వేదముల కొలదియగా జూడు" డన్నాడు గాని--

     "త్రిలింగ భూరేవ భూమి: । త్రిలింగవర ఏవ నా
     త్రిలింగ భాషైన భాషా । నాత్ర కార్యా విచారణా॥

అని యన్న దాసుగారి యంత ఆంద్రాభిమానము జూపిన వాడు గాడు. అన లట్టివారుండరేమో ! అయితే చిత్రము, అంత కఠోర నియమ నిగళమును కోరి తగుల్చు కొన్నారా దాసుగరు, అయినా అందు రచన అతిహేలగా అవలీలగా చేయుదురు.

ఉదా॥ కోరిక (70):-
     "తెల్లముగా నచ్చ తెలుగులో జెప్పు
     మేల బల్మిన్ జేయ నెగ్గెఱింగియును
     మానిసి ! నా యరమర తీర్పు మప్ప!"

అవ్చి అర్జునుడు కృష్ణుని తనకు సందేహనివృత్తి అచ్చతెలుగులో సేయమని అడిగనట ! ఆహా దాసుగారి మమకారము !

    "అన బిన్న నవ్వున ననె నల్లవేల్పు--
    కడముట్టె వెఱ్ఱి రోకలి దల జుట్టు
    మనునట్టు లడిగెరో యబ్బాయి: నీకు
    జెవి పట్టలేదు నా చెప్పిన మాట
    మఱువకు సరిగ నీమది నుల్పుకొనుము
    కోరికె తప్ప నీకు బగవా డేవండు ?
    నీరూపు కోరిక, నీకు నీ వెదిరి
    అర్ధముగను పిచ్చుకలు తమకమున
    నీ నీడతొడనే నీవు పొరెదవు."
 

ఇందులో అచ్చతెలుగు నానికేగారు చచ్చు తెలుగువానికి అర్ధముగాని మాట యే యున్నది ? మరియొక చిత్రము అవసరము పడి యొక్కకోవకు చెందిన పలుకు లెత్తుకొనిరా పట్టిక లేకరువు పెట్టగల దిట్ట ఆయన.

ఉదా॥ సీ. కుడియడ్గు, సర్వడి, కుమ్మరింపు, వనము,
                  చాంగణ, రాశియు, చలికి, చేట...
ఇట్లు పద్యమంతటా నలుబది మల్లబంధ విశేషములను పేర్కొనిరి.
          సీ. ఈ వెఱ్ఱిపాఱు, డీ యెంబన్న, ముసలి, యం
                    బేధ, పిసాళి, యవిటి, చెవంటి...

ఇట్లు నాల్గు పాదముల నిటువంతి యోగ్యతా వాచకములను ముప్పదింటిని పేర్కొనిరి. ఎంత బరువైన భావమునైన అనాయాసముగ వ్యక్తముచేయ శక్తి తమకును తమ తెనుగునకును ఉన్నవారిలో ఎన్నికైనవారు తిక్కనయు నీయనయు. తెలుగు జాతీయములు లోకోక్తులు గప్పించుట యందును ఇద్దరును సిద్ధహస్తులు. అంతేకక వీరిరువురు సంస్కృత ప్రచురముగా సమానగుంభన గంభీరముగా రచన చేయజాలియు "చెల్లియుండియు పైరణ చేయ నతడు" అన్నట్లుగా తెలుగు దనమును వలచినవారు. వీరి మిశ్రభాషా పద్యము లందును తెలుగు పాలే అధికము*. దాసుగారు 'నవరసతరంగిణి ' యందు షేక్సిపియరును మిశ్రభాషయం దనువదించిరి. కాళి దాసును అచ్చతెనుగు జేసిరి. అది వారి నియమము. భాషాంతరెకరణమున మాతృకాభాషా శ్సబ్దములు దొరలిన అది యనువాద మెట్లగునని వారి వృచ్చ. వారు చాటువులం దెడనెడ లెస్సు, రెప్లెక్టరు మున్నగు ఆంగ్ల శబ్దములను వాడుటకును వెనుదీయలేదు. మిగిలిన అన్యదేశ్యములు సరేసరి, వానికి కొంత వినియోగ మెక్కువ, పీఠికాపురవర్ణన మొక చతుర్భాషాసీసమున వ్రాసిరి (పుట 44-45, సంస్కృతము, పారశీకము, ఆంగ్లము, తెలుగు) వారు అరబ్బీ పర్షియను భాషలందును మహా పండితులు. ఉమరుఖైయాము రుబాయతును పారశీక మూలమునుంది అనువదించిరి. ఆంధ్రీకరణము, సంస్కృతీ కరణము ప్రత్యేకముగా జేసిరి. సంస్కృతమున తారకమను నొక కావ్యమును, శ్రీహరికధామృత మను పేర మూడు హరికధలను, రామచంద్ర, కాశీ శతకములను రచించియుండిరి, అచ్చటచ్చట సంస్క్ఫ్ఘతమునకు కొంత తెలుగు వాలకము వైచినను వైయాకరణైక వేద్యములైన ప్రౌఢ ప్రయోగములు చేసి ప్రాచ్య పాశ్చాత్య పండిత ప్రకాండుల ప్రశంసల నందుకొనిరి. ఇందలి "సంస్కృత సారణి" యందు కొన్ని మచ్చు తుమకములను జూడదగును. ఆంగ్లమున మహావిద్వాంసుడీయన. తన 24 వ యేటినుండియే షేక్సిపియరు అనువారమునకు పూనుకొనినట్లు స్వీయారిత్రలో చెప్పిరి. అనేక హరికధలలో ఆలవోకగా ఆశువుగా సభ్యుల అభ్యర్ధన మీదను, స్వయముగను షేక్సిపియరు ప్రభృతుల పద్యముల ననువదించుట వీరికొక పరిపాటిగ నుండినట్లు నేటి వార్తా పత్రికల వలన తెలిసికొంటిని. ఆంగ్లమున చిన్నచిన్న గ్రంధపీఠికలు, సంస్కృత శ్లోకానువాదములు తప్ప వేరే రచన లెవ్వియు నున్నట్లు తెలియవచ్చుటలేదు. ఏ భాషయందు రచన చేసినను మృదు మధురముగ హపణించుట వీరి తీరు. "కృతిని నిఘంటువు వెతికి ముదురు తాటి: ముంజెవలెన్ జేయు" మూర్ఖులను "ప్రౌడకల్ప లని పన్ని తనకుదానె యుద్ధం బెఱుగలేని వ్యర్ధులను "తేట తెల్లంబని తెన్గు భాసకు బట్ట ; తెరరి చూపించెడి" దేబెలను ఎలుగెత్తి గర్హించిరి.

చందస్సౌందర్యము:
  ప్రపంచమున సర్వేసర్వత్ర కవిత్వము చందోమయ భారతి నాశ్రయించియే ఆవిష్కృతమైనంది. చందమే కవితకదుగాని, అది దీని బహిరాకృతియేగాని దానికిని దీనికిని గల అనుబంధ మతి సనాతనము, సహజము, సమీచీనము, సమంజసము నైనది. చందస్సు కవితయొక్క బహిరాకృతి మాత్రమే కాదు. ఒక్కొక్కపుడు దాని
 • తెలుగు భాషగురించి దాసుగారి కున్న అవగాహన మద్భుతమైనది. తత్పరిశీల నార్ధము వారి "సీమపల్కునహి" పీఠికను, వ్యాసపీఠికను జూడతగును. అంతరంగ సంగీరము నాలాపించు ఉత్తమ పరికరముకూడ కాగలదు. సంగీత సాహిత్యల్ములు రెంటను అచ్చమైన సరస్వతీ స్తనంధయుడైన దాసుగారు చందస్సును వలచుట సహజము. వారి కృతులు ముక్కాలు మున్వీనము చందోఘటితములే. వారికి స్వస్థాన వేషభాషాభిమాన మతివేలముగ నున్నట్లే దేశాద్చ్చందస్సులందే మక్కు వ యెక్కువ. ఈ 'కచ్చపి ' యందుగల 362 పద్యములందును సంస్కృత శ్లోకములు-69, వృత్తములు-58, దండకము-1, లయగ్రాహి-1, మిగిలినవన్నియు దేశత్ఛందస్సులే. సీసములు-91, గీతపద్యములు (తేటగీతులు + ఆటవెలదులు)-73, కందములు-32, ద్విపదలు-8, మజరులు-8, తరువోజలు-2, మధ్యాక్కర-1, రగడ-1.
  పలు విధముల చందస్సులకు లక్ష్యము లుదాహృత పూర్వములు, మిగిలిన వాన కొన్నిటి నుదాహరింతును:-
            లయగ్రాహి

            చారుగతి నొడ్డునకు జేరుకొని వృక్షముల
                 ఘోరముగ లాగి జలపూరమున గంతున్
           దోరమగు తొండమున నీరమును బీల్చుచు గ
                  భీర వినదంబు పయిమీఱ నెగ జిమ్మున్
           సారవ రజంబున శరీర మొగి బూయబడ
                  బూరి కనకావలము తీరున వెలుంగున్
           బోరున మునింగి పయి మీఱు తనచేత నొక
                  నీరజము బట్టి పోలు పారగ నటించున్.

ఇది గజేంద్ర మోక్షము హరికధలొనిది. మదద్విరధ స్వైరవిహారమును వర్నించు నట్టిది. వీటిని చూచిన యేనునునకు నీలుగెక్కువ. అప్పటి దాని విలాసచేష్టా విశేషములలో అన లది యేపని చేసినను అందొక ద్వని వివిగులభన ముండును. సప్తస్వరములలో విషాదస్వరమునకు నిదానము గజ ఘీంకృతియే కదా. ఆ చేష్టలన్నియు దాని కతి సహజములు. ఏ అబ్జమువంటి అపురూపవు వస్తునో లభించిన అది యటునటు నవిలాసముగా నూగులాడుటయు దాసుగా రెట జూచిరోగాని అదియు అదియు చాల సహజమైన సన్నివేశము అందొక లయబద్దత యుండును. ప్రకృతి ప్రత్యణువున చిటుకు నున్న చీమలో చందోపిల్లశ్వాసలో సంగీతమును దర్శించు లయబ్రహ్మ దాసుగా రీ సన్నివేశమునకు దగినట్లు లయగ్రాహిని స్వీకరించుటయు ఆ సన్నివేశమున గల లయహోయలును తన పలుకుబడిలో పట్టుకొనుటయు ప్ర్రశంసవహము.

           ర గ డ

బుడుత నూతను బడిన నుడివిని పొలుపు చెడి పరుగిడు జనకువలె
గడిగి తత్తరపాటుతో గనుకడల వెడవెడపాటుతో ధన
యెడలి చెమటల వీటుతో నెద మబ్బు గబ్బల పోటుతో గడు
నడరు పెదవిని గాటుతో జెరాడు పై వలేవాటుతో మయి
గడను గుంకును తేటుతో వెనుకడను గీల్జడ వేటుతో ముడి
వడెడు బూషణకోటితో గొవనంగు చిటికెన గోటితో మొల
సడలు కనకపు శాటికో వెన్దనెడు చక్కని బోటితో వెలు
వడియె గేలి గృహంబు వెన్నుడు భక్తరక్షణ లోలుడై.

ఇదియు గజేంద్ర మోక్షణము లోనిదే, అసలు ఘట్టము లోనిది. 'సిరికిం జెప్పడు, శంఖ చక్రయుగముం జేదోయి సంధింపడు..." అను పద్యము. ఆ సన్నివేశమునే వెన్నుని వేసమును మరించుక మార్చి అతని గజప్రాణావనోత్సాహ గమన వంరంబమునకు దగిన గతి విశేషము గల రగడను స్వీకరించి, ఏ చందస్సును గ్రహించినను ఛేతగాకున్న నడక చెడగొట్టుటకు కవులకు గల మహావకాశమును జారివిడిచి, ఆ నడక కనురూపములైన వగడైన పలులులతో, బంధుర నిక్షిప్తమైన భావసౌందర్యమును నందుక్షిత మొనర్చు అంత్యాను ప్రాసలతో సహృదయ హృదయావర్జకముగా నడిపించిరి. దాసుగారు. ఆ యీ ఉదాహరణములను గాని అసలు గ్రంధములోని యే పద్యమును గాని యెంత పరికించి చూచినా తిక్కనగారి కవితలో వలె నెక్కడను కనీసము యతి ప్రాసలందును అదుకులు కనిపించవు. అదుకుందకూడ దన్నది దాసుగారి శాసనము. తిక్కనకు వలె నీయనకును పదమధ్యయతి ఆశ్రమ సాధ్యము. సంపన్నులు స్వవ్యమూర్ధము కర్చుసేయనట్లు భావముపై నిఘా వేసి కరబదరము లగు శబ్దముల నిచ్చచొప్పున ఆలవోకగా ప్రయోగించుచు అనాయాసముగా వ్రాసుకొని పొవుటయే వారి వంతు. సందర్బమున కనువైన చందస్సు నెన్నుకొనుటలోని వీరిద్దరు సిద్ధహస్తులు. బీమసేనుని భీషణరోషమును చిత్రించు పట్టున శార్దూలమునో వ్రగ్దరనో యెన్నుకొనును తిక్కన. అట్టిచో సమానమును పరిఢవించుటయు ఆయన తీరు. సత్యవంతుని నీరాలాపమును (36) దాసుగా రొక స్రగ్ధరలో సమాసాట్టహాసము తోనే గాక క్లిష్ట ప్రాసతోను నడిపించిల్రి. భీముని క్రోధాతిరేకము నోకచో తిక్కనగారు - "నేలయు నింగియు దేఅశముల్ గా జేసి, యేపునరేగి వాయించియాత" అని సీవనమును సమాస రహితముగను చిత్రించి యందు జీవకళ పొదిగిరి. దాసుగారును తాదృశానేక సందర్భములందు సీసమునకు వన్నె దెచ్చిరి.

చూ. 1.నరసింహావిర్భావము (15):-
          సీ॥ గంభీర భీకర గర్జారవంబున
                   బ్రహ్మాండ భాండ కర్పరము పగుల

      2.నక్రవిక్రమము (పరిశిష్టము-పుట 2):-
           సీ॥ భూరి భూత్కార సంధూత గంభీర గుం
                      భద్వానమున శైలపంక్తి నడక...

అయితే యిందు సమాసములును, శబ్ధాలంకారములును గలవు. అట్లు లేకుండగను ఆ సందర్భములకు సీసము నియోగించ వచ్చునని నిరూపించిరి.

చూ.1.భీష్మ ప్రతిజ్ఞ (పరిశిష్టము-పుట 8)"-
         సీ॥రాలనీ చుక్కలు, కూలనీ కులగిరు,
                 లిల గ్రుంకనీ, వార్ధు లింకిపోని
             ఆకస్మికముగ సూర్యారంద్రముల్ గతుల్
                 దప్పనీ, జగమెల్ల తల్లడిలని...

   2.భీష్మ సంగ్రామము (పరిశిష్తము-పుట 7):-
          సీ॥ విరిగెడు నరదము లొరిగెడు గుఱ్ఱముల్,
                     తెగిపడు సిడములు, త్రెళ్లు కరులు...

ఇట చందమునకును శైలికిని గల మధుర భాంధవమును దర్శించగలము. ఫలాని సందర్భమునకు ఫలాని చంద మను నియమము సామాన్యకవులకు, విదగ్ధ లే సందర్భమున ఏ చందం నెత్తుకొన్నను తమ శైలీ ప్రాగల్బ్యముతొ దానికి మొలాము వేయుదురు.

     "ముందటి దినములలోపల । కందమునకు సోమయాజి ఘను డందురు". శ్రీనాధుని సీస మందురు. నన్నయ మత్తేభ మందురు. వేమన ఆటవలది యందురు. ఆదిభట్ల వారి వేమనవలెనో నాకు బోధపడలేదు.   నాకుజూడ భక్తియందును వ్యక్తిత్వమునందును దాసుగారియందు పోతనత్వ మెక్కువగా ప్రతీయమానమైనను భాషయందును శైలియందును చందస్సునందును తిక్కనతనమె యెక్కువ యనిపించును. ఆ మూటి లక్షణముల నా భీష్మ సంగ్రామ పద్య మచ్చముగా తిక్కనగారి దనిపించును.
అనువాదప్రజ్ఞ :

   ఈ పరిసోక్తి మొక డిమ్ముల సంస్కృతభాష నచ్చుగా,
   జేసిన నట్ల వీడు మఱి చేయుట యేటిదిల్ యంచు జెప్పగా
   జేసి యనాదరం బురక చేయకుడీ. విలుకాడు తూటుగా
   నేసిన పంచె పాఱ మఱి యేసిన నావిద మాటి గావునన్.

అని కొఱవి గోపరాజకవి అనువాదయితృ కౌశల ప్రశస్తి నెపుడో ఛేసియుండెను. అర్ధవంతమైన మాట యది. గురి నేర్పరిచినవాడు మొదటి విలుకాడే కాని గురిచూచి యేచిన రెండవ వానిదే సూటి. అనువాదకరణమున స్వతంత్ర రచనలో నుండు వెసులుబా టుండదు. అందుచే అనువాదమున నెగ్గినవాడు పెద్ద నేర్పరి క్రిందనె లెక్క:-

 దాసుల్గారు భాషాదేవి భక్తులలో అగ్రగణ్యుడు పుట్టగోచులు పెట్టిన పూటనుండి వరుసగా సంస్కృతాంధ్రములు, ఆంగ్లము, అరబ్బీ, పర్షియను భాషలలో వ్యాసంగము సేచుయు అందు విశేషప్రజ్ఞ నర్జించిరి. సంస్కృతాంగ్ల పారశీకముల నుండి కొన్ని యనువాదములు చేసిరి. అందు ముఖ్యమైనవి:

1. సంస్కృతము నుండి తెలుగునకు, ఋకృంగ్రహము, కాళిదాస వాజ్మయము.

2.ప్రాకృతము నుండి తెలుగునకు. కాళిదాస కవిత.

3. ఆంగ్లమునుండి తెలుగునకు- షేక్సిపియరు వాజ్మయము, ఫిట్జ్ గెరాల్డు పద్యాలు, (ఉమరుకైయాము రుబాయతు అనువాదము)

4. ఆంగ్లమునుండి సంస్కృతమునకు-డిటో

5.పారశీకమునుండే తెలుగునకు- ఉమరుకైయాము రుబాయతు.

6. పారశీకమునుండి సంస్కృతమునకు.డిటో

7. సంస్కృతమునుండి ఆంగ్లమునకు- కాళిదాస శ్లోకములు

కొద్దికొన్ని 'మేలుబంతి ' లో ఉదాహృతములు
ఆయా గ్రంధముల గురించి వివరములకు అనుబంధము-3 చూడనగును.

ఇక వారి అనువాద విధానము గురించి కించిత్సమాలోచనము:- 1. సంస్కృతము ననువదించు పట్టును అచ్చతెలుగునే ఉపయోగింతు రని వారి శపధము. భషాంతరీకరణమున మూలభాషాశబ్ధములను ముట్టగూడ దన్నది వారి నియమము. ఋక్కుల ననువదింపునపుడు వానిని స్వరపరిచి వీణపై వాయించి చూచుకొని వాని గీతి ధర్మంఊణాఖూ దగినట్లు మంజరుల నెక్కువగా వాడిరి. ఆ వైదిక సంస్కృతము లౌకిక సంస్కృత విద్వాంసులకే కొంత వింతగా నుండునేమో గాని దాసుగారి నాటుతెలుగు మాత్రం ప్రౌడాంద్ర ప్రబంద భాషావల్లభులకును, సామాన్యులకు సరేసరి, సులభ గ్రాహ్యముగా నున్నది. (చూ.పుట. 100) లౌకిక సంస్కృతానువాదమున మరీ లాఘవమును జూపిరి దాసుగారు. "యదాలోకే సూక్ష్మం ప్రజతి..." అను అంత పెద్ద శాకుంతల శ్లోకము (93):-

         కం. చిన్నది పెద్దదిగా, విడి
              యున్నది కలిపినటు, వంక నురునది సరిగా
              జెన్నారు దవుల జెంగట
              గన్నుల బడ దెద్ది తేరు కడువడి బోవన్.

అను చిన్న పద్యముగా అవతరించిన దనువాదమున అయిననూ మూలభావ మూచముట్టుగా వచ్చినది. అటనున్న పదములన్నియు చిన్నచిన్నవి. సమాసముల అట్టహాసము లేదు. పద్యపు నడక నల్లేరుపై బండి, అర్ధావగతి కరతలామలకము, 'వేదాంతేను ' అను శబ్దసంపుటికి 'ప్రా జదువుల కొనల ' అని అర్ధము నాశ్రయించి యనువాదము. 'భక్తియొగ ' మనుటకు "బత్తిజోగ" మని తేద్బవ రూపకల్పన. "కుసుమ ప్రసూతీ అను దానికి "పువ్వు సమర్త" అని మనోజ్ఞమైన మార్పు. కాళిదాసుని యౌవన నిర్వచనమ్లు. "రాగబంధ ప్రవాలము", "విలసిత పదమాద్యం" అనువానికి 'తగులు తలిరు ', 'హొయలు తొలిటెంకి ' అను పేదబంధము లనువాదము సంజ్ఞ నస్వర్ధ మొనర్చినవి. అనువాదము నందలి యీ క్రింది పదములు తెనుగు నుడికారము విగారమును స్ఫురింపజేయుచున్నవి: వామనమఱుగుజ్జు, పరాజ్ముఖ-పెడమొగము, అతర్కితోపసన్నం-కోరనట్టి కోర్కె, లక్మీం తనోతి- మెఱుగునిడు, శరీరం-బొంది, అర్క:-జగము కన్ను, ప్రతిబోధనక్య:-నెఱజాణల, పరితాపం-పలవంత, ఆయా పద్య సందర్బములు పరిశీలించినచో వీని సార్ధకత మరింత మెచ్చుకొల్పును. ఈ మూలాను వాదములను నిదానముగా చిత్తరింపుడు:

మూ|| అనాఘ్రాతం పుష్పం4, కిసలయ మలూనం కరరుహై3,
         రనావిద్ధం రత్న2, మ్మధు నవ మనాసాదిత రసమ్1,
         అఖండం పుణ్యానాం ఫల మివచ కద్రూప మనఘం
         నజానే భోక్తారం కమిహ నమునస్థాస్యతి విధి:||
అను|| క్రోలవి క్రొత్త తేనె1, మొనగ్రుచ్చనిమానికె2, గొరునాటులన్
         దాలచనట్టి లే జెవురు3, తావి గొనంబడ పట్టి పూవునుం4,
         బోలిన దాని సోయగము ముందిటి నోముల మేటి పంటగా -
        బోలును దాని నేలుటకు బుట్టిన యాతని దెంత పున్నెమో!

అనువాదమున ఆ చక్కని పదబంధముల పొందిక, అతుకులు లేని యతి ప్రాసలు, అనువాదమయుయ్యు సహజత్వ ముట్టిపడుచున శైలీలాలిత్యము, అతని దెంత పున్నెమో అను జాతీయౌచిత్యము మున్నగు సంశయముల మాట యటుండ దాసుగా రా మూల శ్లోకమున నొక ధ్వని విశేషమును కనిపెట్టి దానికి సహజమగునట్లు అనువాదమున క్రమము మార్చిరి. అనువాదమున గల క్రమమునుబట్టి ఆ నాల్గు మాటలకు అర్ధాంతరముల నే నిట్లూహించిరిని. 1. చుబనము(అధరామృతపానము), 2.దంతక్షతము, 3.సలక్షతము,4.అసలనుభవము (సంభోగము). పరిణామక్రమ రమణీయమైన పద్దతి యదే మరి ఆ దాసును మించిపోయినా డీ దారు.

 2. ప్రాకృత శ్లోకానువాదమును నాటు తెలుగుననే సంస్కృతానువాదము సాగినట్లెసాగినది. మచ్చునకుమాత్ర మొక్క సందర్భమును చేర్చితిని(పుట 90)
 3. ఆంగ్లమునుంది చేసిన యనువాదమున 'నవరసరంగిణి ' యందు షేక్స్పియరు రచనకు మిశ్రభాషయు, 'ఉమరుకైయాము రుబాయతున హిట్జ్ గెరాల్డు రచనకు నాటు తెలుగును వివియుక్తములు. రుబాయతునకు ప్రత్యేకముగా సంస్కృతానువాదముగూడ వెలయించియుండుటవలన దాసుగా రట్లు చేసియుందురు. వారు గైర్వాణి నెంత్ కటాక్షించిరో ఆంగ్లి నంత మచ్చిక చేసుకొనిరి. ఏ పద్య్హమని యుదాహరింతము ! అటనట కొన్నిపంక్తు లేరి చూపుదును.

షేక్ష్పియరు నుండి:-

         a. That ever death should let life bear his name
             Where life hath no more interest but to breathe?

ఊపిరి తీయుటే యొక పనియైబ
బాపురే చావేల బ్రతు కనరాదు ?
b, That man that hath a tongue, i say, is no man,
    If with his tongue he cannot win a Woman.
    మాటాడునా డెల్ల మగవాడు కాడుస్
    మాటలచేత జామల గెల్వకున్న.
c. Lovers, to bed; It is almost fairy time.
   వలపు నూల్కొను మీరల్ పడుకొండు పెజ్జలం
   దిప్పుడు గంధర్వవేళ పొనరుచునుండెన్.
d, Love is a smoke made with the fume of sighs
    వల పెనగ వెచ్చమార్పుల గలిగిన పొగ.
e. So Just, though to a radiant angel linked,
    will sate itself in a celestial bed
    And prey on garbage.
    దివ్వమూర్తిని గలిసియున్ దృప్తి పడక
    గుహ్య చాపల్య మెంగిలి కూళ్లు గుడుచు

ఇది మిశ్రభాషానువాదమైనను తెలుగువైపే ములు సూపినది. fairy time అనుటకు, 'గంధర్వవేళ ', prey on garbage అనుటకు. 'ఎంగిలికూళ్లు గుడుచు ' అనునని గడసరి పలుకుబడులు.

పిట్జ్ గెరాల్డు నుండి:-
a. The Bird of Time has but a little way
    To flutter an the Bird is on the Wing.
    ఊపిరి పులు గెరిగిన నీ కది దొరకదు.
b, Oh Thou who didst with pitfall and with gin
    Beset the Road 1 was to wander in
    నీవే కలుగుల్య ద్రవ్వితి
    నీవే వల పన్నినాడ వే అను త్రోవన్.

ఆ ఊపిరి పులుగు, కలుగులు ద్రవ్వుట, వలపన్నుట-ఇ బ్లొకటా రెండా ఎక్కడ వట్టిచూచినను దాసుగారి రచనలో తేనెవంటి తెనుగుదనము జాలువారుచుందును. దాసుగారిలో తెనుగుదన మున్నదనుట ఉదధిలో ఉప్పున్న దనుట.

4. ఆంగ్లమునుండి సంస్కృతమునకు (80-81):-
a. షేక్-- To guild refin'd gold.....
అను. స్వర్ణే హేమ విలీపనం, సమధికే రక్తోత్పలే రంజనం
        చాంపేయ ప్రసవే సుగంధకలనం, హైమోపలే స్నేహనం,
        దేవేంద్రవ్య శరాసనే సముదితే వర్ణాంతర ప్రానణం
        దీపే నార్కరుచి ప్రదీపన మతివ్యర్ధ మ్ర్పహాసాస్పదం ||
    

ఇది భర్తృహరి భబూతి ప్రబృతుల భవ్యకవితావేశుల రచనా విన్యాసమును దలపించుచున్నది.

b. షేక్-- It sems she hangs upon the cheek of right
           Like a rich jewel in an Ethiop's ear.
అను. రౌత్రొ కాశీశ్రవణ విచల ద్రత్న భూపేవ భాతి.
c. షేక్-- So, Shows a snowy dove trooping with crows
           as yonder lady O'er her fellows shown.
అను. వాయపోఘే చరతి వ్చరటావ త్పభీ మండలే.

ఈ రెండుదాహరణములందును అనువాదమున సంక్షిపత కన్పించును. Ethiop's ear అనుటకు- కాళీశ్రవణము, Snowy dove అనుటకు వరల మన వాతావరణమునకు సన్నిహితముగ నున్నవి. ఫిట్జ్ గెరాల్డ్ పద్యానువారము నందును ఈ లాఘవము నందును ఈ లాఘవము కన్పట్టును (చూ.96-98). పారశీకమునుంది జరిగిన సంస్కృతాంద్రముల అనువాదము గురించి నె నేమియు చెప్పజాలను. సంస్కృతము నుండి ఆంగ్లీకరణమునకు లక్ష్యము లీ గ్రంధమున లేవు. 'మేలుబంతి ' ఓ గలవు.

 అనువాద మెప్పుడును "అహో ములచ్చేదీ తన పాండిత్య" మ్మనునట్లు నెలవిడొఇచిన సాము కారాదు. అట్లని మూలమునకు చిత్తము బత్తె మనుచు అయిన దానికి కానిదానికిని మక్కికి మక్కీగా నుండకూడదు. అనువాదభాష యొక్క స్వభావ జీఫలక్షణమునకు తగినట్లు తజ్జాతీయతావాతావరణమునకు త్గినట్లు సహజత్వమును గలిగి యుండవలె. స్వతంత్రత పేరిట మూలాతిరేక సాహసము తగదు. అనుసరణ పేరిట మూలవిధేయ సాద్వనము వలదు. ఈ అనువాద ధర్మముల కనుగలముగనే యున్నది దాసుగారి కృషి. స్వతంతకృతి ప్రణేత యైననాడు అనువాయిత యైనచో అత డెదిరి కౌశలమును గుర్తింపగలడు, తన కౌశలం దాచుకొనలెడు, ఆ యనువాదము రాణించును అని నిరూపించినా రాయన.
 ఆ మహాకవికి రసికాబరవికి నా జోహారు.
  సుమారు రెండేండ్ల క్రిందటా ఈ గ్రంధమున్ సంకల్పించి రూపొందించితిని. ఇద్దరు పెద్దల ధర్మమా యని యిప్పటికి వారి అర్ధభాగ్యము లభించి నాకామ్య మీడేరి దీనికి మోక్షము వచ్చినది. 'తడవర్తి ' యింటి పేరుగాని అదిగినదే తడవుగా తడవు సేయక ముందుకు వచ్చిన రసజ్ఞశేఖరులు శ్రీ బసవయ్యగారు "దానభారతీభార ధూర్వహులలో నే నొకడను" అని సగర్వముగా చెప్పుకో గలిగిన ఈశ్వరరావు గాదు అన్న మాట యందు మాత్రము యింటి పేరు నిలబెట్టుకొని వన్న పూసవంటి మనసుతో నావెన్ను తట్టి బసవయ్యగారితో జట్టుకట్టి యీ ప్రచురణ బారము నిర్వహించిరి. ఆప్తమిత్రులు, సహృదయ చక్రవర్తులు ఆ యిరువురకును నాకృతజ్ఞతా కుసుమాంజలి.
   ముద్రణ ఎవరి యేమరుపాటు వల్ల నైతేనేమి కొలది దోషములు లేక పోలేదు. అయితే ఏమంత దారుణము లైనవి కావు. త్వరలో దీనికి ద్వితీయ ముద్రణ భాగ్యము లభించునన్ ఆశగలదు. అప్పుడవి సవరించును.
   ఈ గ్రంధ ముద్రణము నుచితముగా ప్రారంభించిన శ్రీ ఉషశ్రీ ప్రింటర్సు వారికిని, మధ్యలో ఆదుకొని, అచిరకాలమున దీని నింత సర్వాంగస్ందరముగా తీర్ఫి దిద్దిన సహృదయులు నెల్ కం ప్రెస్ మేనేజింగు డైరెక్ట్రరు శ్రీ యస్. పాండురంగారావు గారికిని నసౌహార్ధ సాధువాదములు.

           'నాయని నాల్గు మోము లవునా యెటు ముద్దిడె?' దంచు నల్వ యా
          ప్యాయముగా హసింపగ, 'అనంతములను నను నేట్లు ముద్దిడం
          బోయదొ !' యంచు జెల్వ నగ. "ముద్దిడెదను గను ' మంద నల్వ నా
          రాయణదాసు గాగ ద్రవనందు సరస్వతికిన్ నమస్కృతుల్.
                                                            యస్వీ జోగారావు