Jump to content

కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ప్రథమభాగము-రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

క్రీడాసాఖ్యములను ప్రసాదించెను. వాయు మహిమచేతఁ గలిగిన వికారమును వాంతులును నాకసాఖ్యమును కలిగించినట్లు మీరెంచు కొందురేమోకాని నిజము విచారింపక నాకవి మంచి వైద్యులవలె లోని కల్మషమును పోగొట్టి యారోగ్యమునే కలిగించి నన్ను మహబలుని వంటి సత్వసంపన్నునిగా జేసినని. నేనోడలోనున్న మూడుదినములును ఉపవాసవ్రతము పూనియుండిన సంగతి బుద్ధిమంతులైన మీరివరకే యూహించి యుందురు.నాభాగ్యము నేమనిచెప్పను? అందులో కపటిదినము ఏకాదశికూడ నయ్యెను.అకడపటినాటి నిరాహారపుణ్యమున కెందైన సాటికలదా? తక్కిన రెండుదినముల యుపవాసఫలమును పొగయెడనెక్కిన పాపమునకు సరిపోయినను హరివాసరమునాటి శుష్కోపవాస పుణ్యఫలము నాకు మిగిలియుండక మానదు. శ్రీహరి కరుణాకటాక్షము గలవారి కెక్కడకు పోయినను పుణ్యమునకులోపముండదు. అటుతరువాతి చరిత్రము వినుడు.


రెండవ ప్రకరణము

నాలవనాఁడు ద్వాదశిపారణమున కనుకూలముగా ప్రాత:కాలముననే పొగయోడ చెన్నపురి రేవు చేరెను. ఓడ లంగరు వేసిన తరువాత చిన్నపడవ లనేకము లక్కడకు రాగా నేనొక పడవలో నొక్కి యొడ్డునకు పోతిని. ఒడ్డు నుండి నూరు గజముల దూరము నడచునప్పటికి గుఱ్ఱపు బండి యొకటి కనబడెను.

"వూళ్లోకి బండి అద్దెకు తీసుకువస్తావా?" అని నే నాబండివాని నడిగితిని. వాఁడేమో అఱవములో మాటాడఁగా నేను తెలిసి కోలేక "నీకు తెలుగు తెలుసునా?" అని వాని నడిగితిని. అప్పుడు మా యిద్దఱికిని యీ క్రింది సంభాషణము జరిగినది.

సత్యరాజాపూర్వదేశ యాత్రలు
                    250

         బండివాడు____యెక్కడికి పోతావు?
         నేను___వంటపూటియింటికి.
         బండి___యెక్కడికీ ?
         నేను___వంటపూటియింటికి.
         బండి___తెలుగులో చెప్ప.
         నేను___వంటపూటియింటికి.
         బండి___పూటకూటీ ? నీకు తెలుగూరాదా ?
         నేను___పూటకూటీయిల్లంటే డబ్బులుపుచ్చుకొని అన్నం పెట్టేయిల్లు. అక్కడికి తీసుకొని పోవలెను.
         బండి___దుడ్డుతీసి అన్నంవేసే యింటికి నిన్ను యెత్తుకుపోయి విడవవలెనా ?
        నేను___పొగబండి యెక్కేచోటికి చేరువగావుండే యింటికితీసుకుపో తెలిసిందా ?
       బండి___తెలిసింది. ముక్కాలురూపాయి వుక్కారుంగో.
       నేను___ముక్కాలురూపాయీకాక యింకా వుక్కారుంగో యేమిటి? తరువాత చిక్కులు పెట్టక బేరం యిప్పడే తిన్నగా చెప్ప.
      బండి___అన్నసత్రానికి యెత్తుకుపోయి విడిచి పూడుస్తాను. కూర్చో,ముక్కాలురూపాయి యియ్యి.
      అని బండివాడు నాకర్ధముకాక పోయినను ,ఇయ్యవలసిన సొమ్ము స్పష్టముగా తెలిసినందున బండిలో నెక్కి కూరుచుంటిని.వాడు బండిని వీధిలో నుండి తోలుకోని పోవుచుండగా వీధి కిరుప్రక్కలను మంచి మేడలను దివ్వభవనములును కన్నుల పండువుగా నుండెను. నడుమనడుమ పలకమీద పెద్ద అక్షరములతో ___వారి అన్నస్త్రము అని వ్రాయబడియుండెను.వాని సంఖ్యనుచూచి ఒక్క వీధిలోనిన్ని యన్నసత్రము లుంచుటకు

ఆడుమళయాళము 245 చెన్నపురివా రెంతటి ధర్మాత్ములోయని యాశ్చర్యపడ జొచ్చితిని. ఇట్లాశ్చర్యపడుచుండగానే బండివాడు "సుబ్బరామ అయ్యర్ గారి అన్నసత్రం" అని వ్రాసియున్నచోట బండినిలిపి దిగుమని తలుపు తీసెను. అన్నసత్రమునకు కాదు వంటపూట యింటికని చెప్పను నేను దిగక కూరుచుండగా బండివాడువచ్చిభాషతో నాలుగుకేకలువేసి నన్ను చేయిపట్టుకొని లాగి నామూటతీసి క్రింద పడవైచెను. పరదేశములో వాడు నన్ను కొట్టి పోవునేమెాయన్న భయముచేత వెంటనే బండిదిగి మూడుపావలాలు చేతిలో బెట్టి వానిని పంపివేసి, పూటకూటి యిల్కెడనో కనుగొనవలెనన్న యుద్దేశముతో లోపలికిపోయి "ఇది అన్నసత్రమా" అని వంటచేయుచున్న బ్రాహ్మణు నడిగితిని. "అవిను, పూటకు భోజనమునకు కాలుకూపాయి. నాలుగణాలూ" అని యతడు నాలుగువేళ్ళు చూపెను. ఆమాటలతో నాకన్నసత్రముయొక్క అర్ధము బోధపడినందున మూటక్రిందదింపి, "నాకు ద్వాదశిపారణకు శుచిగా వంటచేసి పెడతావా?" అని యడిగితిని. "కావలసినంత శుచిగా చేసిపెడతా" నని యతడుబదులు చెప్పెను. అందుమీద "నేను బ్రాహ్మడికి పెట్టుకోవడాని కెవరైనా ద్వైతబ్రాహ్మలు దొరుకుతారా?" అని నేనాతనిని నడుగుచుండగా వాకిట కూరుచుండియున్న బ్రాహ్మణు డొకడువచ్చి తాను ద్వాదశి బ్రాహ్మణుడుగా వచ్చెదనని చెప్పెను. నేనెందుకు సంతోషించి స్నానము చేసి వచ్చుటకై లేచి యాతడు చూపిన 'కొల్లాయి'లో శిరస్నానము చేసి, తడిబట్ట యారవేసి కట్టుకొని శుచినయి, పొగయెడ నెక్కిన పాపము పోవుటకై సహస్ర గాయత్రీ జపముచేసి, ప్రాతజన్నిదములు తీసి క్రొత్తవి వేసికొని, పంచముద్రలును ద్వాదశపుండ్రములును ధరించి గోవిందనామ స్మరణ చేఅసికొనుచు విస్తరిముందు కూరుచుంటని.అన్నసత్రాధికారి రెండు విస్తళ్లలో ముందుగా అన్నము వడ్డించెను. అటు

252 సత్యరాజా పూర్వదేశయాత్రలు

తరువాత పులుసుతెచ్చి నేనుప్రక్కను వడ్డించమని చెప్పచుండగా నామాటవినక అన్నము మీదనే దానిని వడ్డించిపోయెను. అంతట ద్వాదశి పారణమునకు వచ్చెదనన్న బ్రాహ్మణుడు విభూతి పెట్టుకొని తానావరకు కట్టుకొనియున్న బట్టలతోనే వచ్చి రెండవ విస్తరిముందు కూరుచుండెను.మడికట్టుకొని రామాయ్యాఅని చెప్పినను నామాట లక్ష్యముచేయక కొంచెముసేపు కూరుచుండి,లేచి వీధిలోని కల్పశంకకు పోయివచ్చి తనవి మడిబట్టలేయని చెప్పచు మునుపటి బట్టలతోనే మరలవచ్చి కూరుచుండెను. అప్పడు నేనతని మొగము పారజూచి విభూతిరేఖలనుబట్టి స్మార్తబ్రాహ్మణుడని తెలిసికొని,వ్రతభంగమునకు శంకించి లేచిపొమ్మని చెప్పవలెనన్న మాట నాలుక చివరకు రాగా ఆపుకొని, విస్తరిముందు కూరుచున్న బ్రాహ్మణుని లేచిపొమ్మన్నచో దోషము వచ్చునని యెంచి విషణ్ణుడనయి యూరకుంటిని. పాపము!ఆబ్రాహ్మణుడు 'ద్వైతి 'యని నేనన్నమాట 'అద్వైతి 'యని గ్రహించి యిట్లు చేసియుండును.

ఇతరులకు వడ్డించవలెను వేగిరము పరిషేచనముచేయూ' మని మాఅన్నప్రదాత తొందరపెట్టుటచేత విధిలేక యాబ్రాహ్మణునకే యాపోశనము వడ్డించితిని. మసత్రాధికారి మిక్కిలి దొడ్డవాడు. నాకు ద్వాదశివ్రతము దక్కునట్లుగా నాటిదిన మవిసాకు కూరవండెను. మరియేదోకూర వండెనుగాని దానిపేరు నాకు తెలిసినదికాది. ఆవండిన కూరలయినను కలుపుకొనుటకు చాలకుండ మనదేశములో నూరుగాయలను వడ్డించినట్లు కొంచెముకొంచెముగా వడ్డించి మరలనడిగినను మారుతెచ్చినవాడుకాడు. పప్పకావలెనని యడుగగా అన్నము వండనేలేదన్నాడు. నెయ్యి కావలెనని యడుగగా అన్నము వడ్డించి చేతితోనే చిన్న గిన్నెతో తెచ్చి యభిఘరించిపోయినాడు. అప్పడు నాకు దేనితో భోజనముచేయుటకును తోచక యావర కన్నుముమీద వడ్డించిపోయి

ఆడుమళయాళము 253

నందున పులుసుతోనే యన్నముకలిపి మిరియాలుకంపుచేత రుచిగా లేకపోయినను కన్నులుమూసికొని నాలుగుముద్దలు మింగితిని.ఇంతలో వంటబ్రాహ్మణుడు పులుసుకుండయు,అన్నపుబిందెయు, వాకిటిలోనికి తీసికొనిపోయి యెవ్వరికో శూద్రూలకువడ్డించి మాకు వడ్డించుటకయి మరల తెచ్చెను. శూద్రులు చూచినయన్నము తినుటకునాకు మనసొప్పకపోయినను మా ద్వాదశిబ్రాహ్మణుడుమాత్రము మరల వడ్డించుకొని యాపులుసుతోనే తవ్వెడుబియ్యపన్నముతినెను.బిందెలో అన్నము మిక్కిలి తక్కువగానుండుటచూచి,అంతయన్నమును శూద్రులే తినిరాయని యడిగిరి.లేదు.మీరు స్నానమునకుపోయినప్పడు బ్రాహ్మణులకెపెట్టి వకచిన్నపంక్తిలేవదీస్తీ నని సత్రాధికారి చెప్పెను.ఆమాటలతో నామనసువిరిగి యేకాదశి నిరాహారఫలమంతయు వ్యర్ధమయ్యెనని నాకెంతో విచారము కలిగెను. ఆసంగతినే నేనాలోచించు కొనుచుండగా సత్రాధికారి రసము తెచ్చి మిరియాలువేసిన కాగీకాగని చింతపండునీళ్లు విస్తరిలో పోసెను.ఆభోజనసాఖ్యము చెప్పటకు శక్యముకాదు. నేనొకవేళ చెప్పినను దూరదేశములోనున్న మీరు పుర్ణముగా గ్రహింపలేకపోవచ్చును. కాబట్టి యెాచదువరులారా;నా సత్యసంధతను పరీక్షంచుటకయినను మీరోక్కసారి చెన్నపట్టణమునకువచ్చి, గృహసంఖ్యగల సుబ్బరామయ్యగారి అన్నసత్రములో ఒక్కపూట భోజనముచేసి, అనుభవైకవేద్యమయిన యాసాఖ్యము నొక్కసారి తప్పక యనుభవించుపొండు .నేనిప్పడు ముందుగా చెప్పచున్నాను. అన్నహితముపోయినదనిమాత్రము నన్ను తరువాత దూషింపబోకుడు. సత్యమును పరీక్షించువా రీలోకములో నెన్ని కష్టములనయినను పడవలెను.
                    భోజనముకాగానే నాకును మా బ్రాహ్మణునకును భోజనమున కియ్యవలసిన యెనిమిదణాలను నేనే యిచ్చివేసితిని.అదిగాక మాబ్రా

254

హ్మణునకు రెండణాలు దక్షిణయిచ్చి ,అక్కడసంగతుల నడుమ నారంభించితిని.కొంతసేపు సంభాషణము జరిగినతరువాత మీరెక్కడకు పోవుచున్నారు? అని నన్నతడడిగెను.ఉడిపి సుబ్ర్హ్మణ్యము మొదలయిన యాత్రలు సేవిపబోవుచున్నాను అని నేను చెప్పితిని.అప్పడాబ్రాహ్మణు డెన్నో నీతివాక్యములు చదివి ,తన దేశములోని వారినందరను మెాసగాండ్రనియు తోడులేక యొంటిగా ప్రయాణముచేయుట యపాయకరమనియు మళయాళదేశములో చిత్రవిచిత్రము లెన్నియెా యున్నవనియు తనతో గూడ వచ్చినపక్షమున వానినన్నిటిని నాకుజూపి నన్ను సురక్షతముగా మరల తీసికొనివచ్చెదననియు చెప్పి యొప్పించి ,నన్ను పొగబండిమీద ప్రయాణముచేసెనుపొగయెాడఖర్చులు మొదలయినవానిక్రింద నాకీవరకయిన పదునెనిమిది రూపాయలుపోగా నావద్ద ఇప్పడెనుబదిరెండు రూపాయలున్నవి.వానిలో నాలుగురూపాయల పదణాలు నాకునుమరినాలుగురూపాయల పదణాలు బదులుక్రింద తనకును మొత్తము తొమ్మిది రూపాయల రెండణాలు నావద్దవుచ్చుకొని మా బ్రాహ్మణుడు తుత్తి కూడికి మూడవతరగతి టిక్కెట్లు రెండు తెచ్చెను.మరునాటి యుదయమున ఏడుగంటలపావునకు మేమిద్దరమును జాబులుకొనిపోవు పొగబండిలో నెక్కి యెళంబూరునుండి యినుపదారిమీద బయలుదేరినాము.బయలుదేరునప్పడు బండిలోకూరుచుండి మాబ్రాహ్మణుడు రాహుకాలమెప్పడని నన్నడిగెను.రాహుకాలమేమెా నాకుతెలియదని నేను చెప్పితిని.రాహుకాలములో ప్రయాణము బయలుదేరరాదని యతడనెను.మాదేశములో రాహుకాలమని పట్టింపులేదు వర్జ్యసమయమునమాత్రము బయలుదేరరని నేనంటిని.మీయుత్తరదేశపువాళ్లేమియు తెలియని మూఢులని యతడనుచుండెను.ఇంతలో మేమెక్కిన పొగబండి కదలి నడువ నారంభించెను. మా బ్రాహ్మణుడు

దేశమెఱిఁగిన యనుభవజ్ఞడగుట చేతను దేశభాష తెలిసినవాఁడగుట చేతను బహుప్రయాణములు చేసినవాఁడగుటచేతను భద్రముగా నుండునని నా మూట కూడ నాతని సంచిలోనే యుంచితిని. నాటి మధ్యాహ్నము మూఁడు గంటల వేళ బండి కూడలూరు వద్ద పది నిముషముల సేపు నిలువుగా మేమక్కడ లఘుశంకకు పోవ దిగితిమి. ఈలోపుగా మేమెక్కిన బండిలో మా సరనను మఱియెవ్వరో క్రొత్త వారు వచ్చి కూరుచుండిరి. మేము మరల వచ్చి కూరుచున్న రెండు నిమిషములకు బండి కదిలినది. అప్పడు మా బ్రాహ్మణుడు వారితో అరవములో ప్రసంగింప నారంభించెను. వారెవ్వరని నేను తెలుగులో నడుగఁగా వారు మాలవాండ్రనియు, పొగబండ్లలో ప్రయాణములు చేయువా రాచారవ్యవహారములను పాటింప రాదనియు, మా బ్రాహ్మణుడు నాకు హితభోధ చేసెను .ఈ ప్రయణము మూలమున మాలకూడు వచ్చినదని నాలో నేను విసుఁగుకొని, రాత్రి ఆఱు గంటలకు మాయవరము వద్ద బండి యేడు నిమిషములు నిలువగా దిగి, నేను మరియొక బండిలోనికి పోయి కూరుచుంటిని. ఏడు గంటల పావుకు బండి మరల కుంభకోణము వద్ద ఇరువదియైదు నిమిషములు నిలిచినప్పడు మా బ్రాహ్మణుడు బండి దిగి నా వద్ద కేదో ఫలాహారమును తెచ్చెనుగాని నేనా మాలగుడ్డలతో నేమియు తిననందున నా వంతు వచ్చినది కూడ నతఁడేతిని బండిలోనికి పోయెను. ఆ రాత్రి మేమిద్దరమును మరలకలిసికోలేదు. స్ధల మిఱుకుగా నున్నందున పడుకొన చోటు చాలక నాకు తిన్నగా నిద్రపట్టినది కాదు. నాఁటి తెల్లవారుజామున అయిదు గంటల పావుకు మేమిద్దరమును బాహ్యమునకు పోవుటకయి మధురవద్ద దిగినాము. అతఁడేవేళకును మరల రాలేదు. పావుగంట సేపటికి మరల బండికదులుటకు సిద్ధముకాగా, అతఁడేబండిలోనో యెక్కియుండునని తొందరలో నేనొకబండిలో నెక్కితిని. ఆదినము పదునొక్క గంటవేళ

256

బండి తుత్తుకూడి చేరినది. బండివద్ద నిలుచుండ య్వ్ంతవెదకినను బ్రాహ్మణునిజాడ కానరాలేదు. బ్రాహ్మణు డెక్కడ తప్పిపోయినాడో, నన్ను గానక యెంత పరితపించుతున్నడో అని రెండుదినముల వరకును బండివచ్చినప్పడెల్ల మార్గస్ధులను పరీక్షించుచు పొగబండి దిగుచోటికివచ్చి చూచు చుంటిని. బ్రాహ్మణుడురాలేదు.ఆ బ్రాహ్మణుని మధురలో దొగలుకొట్టిరో అలస్యమగుటచేత బండితప్పిపోయెనో,మరియే ఆపదవచ్చెనో కాని బ్రాహ్మణుడు రాకుండెడు వాడుకాదు.అతనికి ద్రోహచింతయే యున్న పక్షమున రాత్రియెక్కడనో చీకటిలో దిగి పారిపోక, తెల్లవారి మధురదాక ఎందుకు వచ్చును? ఆధనము నాకు ధర్మార్ధముగా వచ్చినదే యయినందున పోయినసొమ్ము మరల రాదని నిరాశ కలిగినతరువాత దొంగలచేత పడక బ్రాహ్మణునిచేతిలో పడి సత్పాత్రదానఫలము నాకు లభించెనని సంతోషించితిని.
               ఈ బ్రాహ్మణుని నిమిత్తము నేనువెదకుచుండగా దైవికముగా నాకొకతెలుగు బ్రాహ్మణుడు కనబడి నాసంగతినివిని విచారపడి తన యింటికి తీసికొనిపోయి నాకాదినమున భోజనముపెట్టి, మరునాడు నన్ను తనబండిలో నెక్కించుకొని తీసికొనిపోయి కొన్నిదినములలో దక్షిణ మళయాళమునకు రాజధానియైన తిరువనంతపురమునకు చేర్చెను. ఆపట్టణములో నేను నెలదినము లుంటిని.ఆ పట్టణమును చేరినమరునాడే

ఆడు మళయాళము

యేద"ని నేనాయనను రహస్యముగా నడిగితిని. ఆయన మొట్ట మొదట మర్మము విడిచి చెప్పక "యిదే ఆడమళయాళ" మని సెలవిచ్చెను. బుద్ధిమంతుఁడను గనుక నే నామాటలంతటితో నమ్మక "యిదే ఆడమళయాళమయితే యిక్కడ మగవాళ్లెందుకుకున్నారు? ఆడ మళయాళమ్లో మగవాళ్ళక్కర లేకుండా గాలికి బిడ్డలు పుడుతారని మాదేశంలో తెలిసిన పెద్దలునాతో నమ్మకంగా చెప్పినారు. ఆది యిక్కడ యెక్కడా కనపడడం లేదు. బ్రాహ్మలలో ఆడవాళ్లు పైటవేసుకోకుండ వుండడమూ స్త్రీలలో చాలా మంది పెళ్లిళ్లులేకుండా తమ మనసు వచ్చినవాళ్లను వుంచుకొని మనసువచ్చినప్పుడు వదిలిపెడుతూయుండడమూ పుౠషులకు భాగమ్లేకుండా కుటుంబపుసొత్తంతా స్త్రీలే అనుభవిస్తూవుండడమూ కన్న కొడుకులు రాకుండా రాజ్యానికి తోడఁబుట్టిన దాని కొడుకులు వస్తూవుండడమూతప్ప మాదేశానికీ యీ దేశానికీ యేమీ భేదం కనబడడంలేదు. ఇది ఆడమళయాళం కాదు ఆడమళయాళం యెక్కడవున్నదో చెప్పక తప్పదు" అని ఆయన కాళ్లమీఁదపడి లేచినానుకాను. ఈప్రకారముగా నేనాయనకు పరమభక్తితో మాసముదినములు శుశ్రూష చేయునప్పటికి నాయందాయన కపరిమితానుగ్రాహమువచ్చి, ఒకనాఁడు ప్రాతఃకాలమునందు సన్నాయన స్త్రీమళయాళమునకు దారిచూపెదను రమ్మని పట్టణమునకు వాయవ్య దిక్కున రెండుక్రోసుల దూరము కోనిపోయి, ఒకయడవిలో ప్రవేశించి కొంచెము దూరము నడచి యొకచిన్న కొండయెక్కించి దానిలో నున్న గూహయొక్కటిచూపి ఆడుమళయాళమున కిదేదారి భయపడక పోమ్మని చెప్పెను. ప్రాణాధికులయిన నాదేశస్థులలో నావలెనే స్త్రీమళయాళమునకు పోవనుద్దేశించుకొన్నవా రున్నపక్షమున వారితరులనెవ్వరిని అడిగి తెలిసికోవలసిన పని లేకుండ వారికి వివరముగా తెలుపుట

సత్యరాజా పూర్వ దేశ యాత్రలు

కయి నడుచునప్పుడు నేనాదారిని సర్వమును కొలిచి గుఱుతులు పెట్టుకొని తరువాత పుస్తకములో వ్రాసికొన్నాఁడను. ఒక్క యక్షరమయినను హెచ్చుతగ్గులేకుండ నేనప్పుడు వ్రాసికొన్నట్లు మీకది యిప్పుడు చెప్పెదను శ్రద్ధవహించి వినుఁడు. పట్టణము వెలుపలనున్న పెద్దరావిచెట్టు మొదలుకొని యిసుకలో ముక్కుకు సూటిగా వాయవ్యమూలను మూఁడుమూరలు తక్కువగా ముప్పావుక్రోసుదూరము నడచిన తరువాత వెలగచెట్టువద్ద మోచేతివంపుగా తిరగవలెను. అక్కడ నుండి యెడమచేతిమీఁదుకా పావుక్రోసుమీఁదనడచి చిన్న మోదుగురుప్ప కనబడ్డ తరువాత కుడివైపునకు తిరిగి క్రోసుమీఁద మూఁడు మూరలదూరము పోవునప్పటికి చిట్టడవి కనఁబడును. ఆ యడవిలో దూరి జువ్విచెట్టున కెదురుగానున్న నడదారిని ఎడమవైపునకును కుడి వైపుకును ముందుకును వెనుకకును వంకరటింకరగా దారిపోయి నట్లెల్లను అరక్రోసుమీఁద తొమ్మిదిబారల మూఁడుమూరల రెండడుగుల నాలుగంగుళములు నడవఁగానే యొకకొండ కానఁబడును. ఆకొండ మీఁదికి తిన్నగా పదినిలువులు బారెడుదూరమెక్కి మూలగా మూఁడు నిలువుల మూరెడుదూరము దిగఁగానే చిట్టీతపొచాటున గుహయొకటి కనఁబడును. మీరీకొలతలు మఱచిపోయిన పక్షమున దారితప్పి చిక్కులు పడవలసివచ్చుకనుక దీనిని మీరు సంధ్యావందనము వల్లించినట్లు నిత్యమును త్రికాలములయందును వల్లింపుఁడు. నేనాగురూప దేశమును భగవద్యాక్యముగా నమ్ముకొని, అంధకారబంధురముగానున్న యీగుహలో ప్రవేశించి కొంచెముదూరము నడుచునప్పటికి కాలుజారి క్రిదపడ నారంభించితిని. ఆప్రకారముగా యోజనదూరము పడువఱకును వేఁడి యంతకంతకెక్కువయి దుస్సహముగా కనఁబడెనుగాని తరువాత వేఁడియంతకంతకు చల్లారి యెంతో మనోహరముగానుండెను. క్రిందికి పోయినకొలఁదిని భూమిలోవేఁడి యంతకంతకు

ఆడుమళయాళము

హెచ్చుచుండుననియు, కొంతదూరము పోయిన తరువాత అగ్నిమయమయి భూమధ్యమున సమస్తము కరిగి ద్రవరూపముగా నుండుననియు, చిన్నప్పుడు పాఠశాలలో మాయుసాధ్యాయుడు చెప్పెనుగాని, ప్రకృతి శాస్త్రవేత్తల మనుకొను హూణపండితులు చెప్పిన యీ సంగతి యసత్యమనియు మన పురాణములే నిజములనియు నేనిప్పుడనుభవము చేత కనిపెట్టితిని. ఈ విషయముునందు సందేహముగలవారు నన్ను వచ్చి యడిగిన పక్షమున నేను సర్వమును సరహస్యకముగా చెప్పి సంశయ నివృత్తి చేసి పంపెదను. ఇట్లు కొంత దూరము పడిన తరువాత నా కాలికప్పుడేదో దూదివలె మెత్తగా తగిలినది. ఆయాసపడి యుండుట చేత నేనప్పపుడు దాని మీద కాలూని కూరుచుండి వీపు మీద వెనుక కొరిగినాను. ఇంతవఱకును నేను ప్రత్యక్షముగా చూచినది. ప్రత్యక్ష ప్రరమాణము సర్వోత్కృష్టమయినదని యెల్ల మతములవారు నంగీకరించినదేకదా? అంతట నాకు నిద్రపట్టినది. ఆ నిద్ర యెన్నిదినములున్నదో యేయేదారిని జరిగినానో నాకప్పుడు తెలియలేదుగాని నిద్ర తెలిసి నేను కన్నులు విచ్చి చూచునప్పటికి నేనొక గుహసమీపమున రాతి మీద పరుండి యుంటిని. సూర్యుడప్పుడే పశ్చిమమున నుదయించుచుండెను. ఇక ముందు చెప్పబోవు రీతిగా ఆ దేశాచారములు మన దేశాచారములకు విరుద్ధములయినట్లే యక్కడి సూర్యుడును పడమట నుదయించి తూర్పున నస్తమించుచుండును. అంత వరకును నాకాకలి కాకుండుటయు, దేహమున గాయములు తగులకుండుటయు, నిద్రపట్టుటయు, అంతయు మా గురుప్రభావము చేత నయినదేసుండీ! నిద్రలో నున్నంతవఱకును క్షుత్తులేక లేవగానే కలుగుటకు గురుకటాక్షము కాక మఱియేమి కారణముండును.